కేకే.నగర్: ప్రైవేటు మొబైల్ విక్రయ దుకాణంలో నకిలీ పాన్‌కార్డు, డ్రైవింగ్ లెసైన్స్‌లను ఇచ్చి ఐ ఫోన్ తీసుకెళ్లిన కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై అన్నాసాలై రహేజా టవర్‌లో బజాజ్ ఫైనాన్స్ సంస్థ ప్రధాన కార్యాలయం పనిచేస్తోంది. చెన్నైలో పలు ప్రైవేటు దుకాణాల్లో సెల్‌ఫోన్ కొనడానికి వచ్చే వినియోగదారులకు జీరో శాతం వడ్డీపై సరైన ఆధార పత్రాలను తీసుకుని రుణం ఏర్పాటు చేస్తున్నారు. సోమవారం ఎక్స్‌ప్రెస్ అవెన్యూలోగల పూర్వికా సెల్‌ఫోన్ దుకాణానికి వచ్చిన రంజిత్ (23), శివగణేశన్ (25) రూ.56 వేల విలువైన ఆపిల్ సెల్‌ఫోన్‌ను కొనడానికి అక్కడ పనిచేసే బజాజ్ ఫైనాన్స్ సంస్థకు తమ శ్యాలరీ సర్టిఫికెట్, పాన్‌కా ర్డు, డ్రైవింగ్ లెసైన్స్, ప్రైవేటు బ్యాంకు పోస్టుడేటెడ్‌చెక్కులను సమర్పించి జీరో శాతం వడ్డీతో సులభ వాయిదా పద్ధతిలో ఆపిల్ ఐ ఫోన్ కొనుగోలు చేశారు.
తరువాత వారు సమర్పించిన పాన్‌కార్డు, డ్రైవింగ్ లెసైన్స్‌లను పరిశీలించినప్పుడు అవి నకిలీవని తెలిసింది. దీనిపై బజాజ్ ఫైనాన్స్ సంస్థ అసిస్టెంట్ మేనేజర్ తంగరాజ్, ముత్తులు అన్నాసాలై పోలీసుస్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును నమోదు చేసుకుని నేరస్థులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందం పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసు విచారణలో మోసానికి పాల్పడిన భారతీదాసన్ (27), రంజిత్ (23), విజయ్‌దురై (37), వెంకటేశన్ (32), జగదీష్‌బాబు (35)లను అరెస్టు చేశారు. వారి నుంచి ల్యాప్‌ట్యాప్, ఆపిల్ ఐఫోన్, ఐదు నకిలీ పాన్‌కార్డులు, డ్రైవింగ్ లెసైన్స్‌లు ల్యామినేషన్ మిషన్‌లను స్వా దీనం చేసుకున్నారు. పోలీసు విచారణ లో రంజిత్, విజయ్‌దురై అశోక్ పిల్లర్, టీనగర్‌లలో గల పూర్వికా మొబైల్ విక్రయకేంద్రం, తారాపూర్ టవర్లో గల క్రో మో, టీనగర్‌లోని రిలయన్స్ మొబైల్ విక్రయ కేంద్రాలలో నకిలీ పాన్‌కార్డు, డ్రైవింగ్ లెసైన్స్‌లను సమర్పించి ఏడు ఐ ఫోన్‌లను కొన్నట్లు తెలిసింది.
అలా గే వివేక్స్ దుకాణంలో సుమారు లక్షా 30వేల విలువ గల సోనీ టీవీని మోసం చేసినట్లు తెలిసింది. పట్టుబడిన ఈ ఐ దుగురు రాయపేటలోని ప్రైవేటు ప్రిం టింగ్ కంపెనీలో పని చేస్తున్నట్లు తెలిి సంది. జగదీశన్, వెంకటేశన్ నకిలీ పాన్‌కార్డులను, డ్రైవింగ్ లెసైన్స్‌లను ము ద్రించి రంజిత్‌కు ఇచ్చేవారని తెలిసింది. రంజిత్ బీఈ వరకు, విజయ్‌దురై ఎంసీఏ వరకు చదివారని, పరారీలో ఉన్న దేవన్‌శేన్ కోసం పోలీసులు వెతుకుతున్నారని తెలిసింది. అరెస్టు అయిన ఐదుగురిని న్యాయస్థానంలో హాజరు పరచి పుళల్ జైలుకు పంపారు. చోరులను పట్టుకోవడానికి అతి చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు బృందాన్ని చెన్నై కమిషనర్ అభినందించారు.
ఐ ఫోన్ కేసులో ఐదుగురి అరెస్ట్
Published Fri, Mar 18 2016 3:36 AM | Last Updated on Sun, Sep 3 2017 7:59 PM
Advertisement
Advertisement