Fake PAN card
-
పేరు మార్చి.. ఏమార్చి!
సాక్షి హైదరాబాద్: నేరం జరిగిన వెంటనే పోలీసులు చేసే మొదటి పని.. అనుమానితులు ఎవరు? వారికి పాత నేర చరిత్ర ఏమైనా ఉందా? అని ఆరా తీయడమే! దీనిని గమనించిన నేరస్తులు.. పోలీసుల దృష్టి మరల్చేందుకు కొత్త ఎత్తుగడలు వేస్తున్నారు. ఇంటి పేరు, తండ్రి పేరుతో సహా మార్చి పోలీసులకు సవాల్ విసురుతున్నారు. మారు పేర్లతో పాన్, ఆధార్ కార్డ్‌లు సృష్టించి వారి నేర చరిత్రను కప్పిప్పుచ్చే ప్రయత్నాలు చేస్తున్నారు. పాత పేర్లతో ఉన్న స్థిరచరాస్తులను విక్రయిస్తున్నారు. బ్యాంక్ ఖాతాలను మూసేస్తున్నారు. నేరం జరిగిన తర్వాత అనుమానితులు, నేరం జరిగిన తీరును పరిశీలించాక.. పోలీసుల డేటా బేస్‌లో పాత నేరస్తులు, ఇలాంటి తరహా నేరాలేమైనా జరిగాయా అని విచారణాధికారులు పరిశీలిస్తారు. ఒకవేళ ఉంటే.. ఆ కోణం నుంచి దర్యాప్తు మొదలుపెడతారు. పాత నేరస్తుల కదలికలపై పోలీసుల ని ఘా ఉంటుంది కాబట్టి పట్టుకోవటం సులవవుతుంది. అదే కొత్త నేరస్తుడైతే పట్టుకోవటం ఆలస్యమే.. వాంగ్మూలం ఇప్పించడంలోనూ ఆలస్యం జ రుగుతుంది. రాష్ట్ర వ్యాప్తంగా సంచనలం సృష్టించి న ఇబ్రహీంపట్నం రియల్టర్ల జంట హత్య కేసులో ప్రధాన నిందితుడు మేరెడ్టి మట్టారెడ్డి చేసిందిదే. అరెస్ట్ వారెంట్ జారీ అయ్యింది.. కానీ.. మట్టారెడ్డి అసలు పేరు మేరెడ్డి అశోక్ రెడ్డి. ఎవరో జ్యోతిష్యుడు సూచించాడని తన పేరును మట్టారెడ్డిగా, తన తండ్రి పేరు వెంకట నరసింహారెడ్డి కాగా.. ఇంద్రసేనా రెడ్డిగా మార్పించాడు. అశోక్ రెడ్డిపై నారాయణగూడ, మలక్‌పేట, సరూర్‌నగర్ పీఎస్‌లలో మూడు చీటింగ్ కేసులు ఉన్నాయి. ఐడీబీఐ బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. తన నేర చరిత్రను కప్పిపుచ్చేందుకు 2007 లోనే తన పేరును మార్చి, నకిలీ పాన్ కార్డ్ పొందాడు. గతంలోనే అశోక్ రెడ్డి అరెస్ట్‌కు వారంట్ కూడా జారీ అయ్యిందని రాచకొండ సీపీ మహేశ్ భగవత్ తెలిపారు. అయితే పేరు మారడంతో అరెస్ట్ చేయలేకపోయారు. పాత పేరు బయటపడకుండా.. పాత నేరాల తాలుకు ఆనవాళ్లు కనిపించకుండా ఉండేందుకు నేరస్తులు ముందస్తు ప్రణాళికలు రచిస్తున్నారు. మట్టారెడ్డి తన పాత పేరు (అశోక్ రెడ్డి)తో ఉన్న స్థిరచరాస్తులను విక్రయించేశాడని, బ్యాంక్ ఖాతాలను కూడా మూసేశాడని ఇబ్రహీంపట్నం ఏసీపీ బాలకృష్ణా రెడ్డి తెలిపారు. దీంతో తాజా నేరాల్లో పోలీసులకు చిక్కినా.. తొలిసారి నేరస్తుడిగా భావించాలని, శిక్ష కాస్త తగ్గుతుందని నిందితుల ఎత్తుగడగా ఓ పోలీసు ఉన్నతాధికారి వ్యాఖ్యానించారు. పోలీసుల రికార్డ్స్ ఎక్కడ కూడా మట్టారెడ్డి పాత నేరస్తుడిగా లేకపోవటంతో మొద ట్లో పోలీసులు కూడా అమాయకుడే అనుకున్నారు. కానీ, సీన్ రీకన్స్ట్రక్షన్ సమయంలో మట్టారెడ్డి తడబడటంతో పోలీసులకు క్లూ దొరికింది. మట్టారెడ్డి ఫామ్ హౌస్, అందులోని సీసీటీవీ గురించి తెలిసింది. అందులోని ఫుటేజ్‌ను పరిశీలించగా మట్టారెడ్డి అసలు పేరు మేరెడ్డి అశోక్ రెడ్డి అని. ఇక్కడ తీగ కూపీ లాగితే మట్టారెడ్డి అలియాస్ అశోక్ రెడ్డి పాత నేర చరిత్ర అంతా బయటపడింది. -
నకిలీ పాన్ కార్డుల గుర్తింపు సులువు
ఐటీశాఖ చేతిలో కొత్త టెక్నాలజీ టూల్ న్యూఢిల్లీ: నకిలీ పాన్ కార్డ్‌లను గుర్తించే కొత్త టెక్నాలజీ టూల్‌ను ఆదాయపు పన్ను శాఖ రూపొందించింది. ఎన్నో ఏళ్ల శ్రమ అనంతరం సాధించిన ఈ టెక్నాలజీ టూల్‌తో నకిలీ పాన్ కార్డ్‌లకు చెక్ పెట్టవచ్చు. అంతేకాకుండా వాటిని తొలగించవచ్చు. ఇన్కమ్ ట్యాక్స్ బిజినెస్ అప్లికేషన్-పర్మనెంట్ అకౌంట్ నంబర్ (ఐటీబీఏ-పాన్) పేరుతో రూపొందించిన ఎలక్ట్రానిక్ స్మార్ట్ ప్లాట్‌ఫార్మ్‌తో నకిలీ పాన్ కార్డ్‌లకు అడ్డుకట్ట వేయవచ్చు. గతంలో నకిలీ పాన్‌కార్డ్‌లను గుర్తించడానికి ఆదాయపు పన్ను ఉద్యోగులే స్వయంగా ప్రయత్నించేవాళ్లు. కానీ ఇది సరైన ఫలితాలనిచ్చేది కాదు. అయితే ఈ కొత్త ఎలక్ట్రానిక్ విధానం ఖచ్చితమైన ఫలితాలనిస్తోందని ఐటీ ఉన్నతాధికారొకరు చెప్పారు. ఈ కొత్త విధానం వల్ల నకిలీ పాన్ కార్డ్‌ల గుర్తింపు సులభమని, దీన్ని తొలగించడంతో.. మళ్లీ ఉపయోగించకుండా అడ్డుకట్ట వేయవచ్చని చెప్పారు. దేశంలో 24.37 కోట్ల పాన్‌కార్డ్‌లు ఉన్నట్లు అంచనా. వీటిలో నకిలీవి ఎన్నో లెక్కలేదు. -
ఐ ఫోన్ కేసులో ఐదుగురి అరెస్ట్
కేకే.నగర్: ప్రైవేటు మొబైల్ విక్రయ దుకాణంలో నకిలీ పాన్‌కార్డు, డ్రైవింగ్ లెసైన్స్‌లను ఇచ్చి ఐ ఫోన్ తీసుకెళ్లిన కేసులో ఐదుగురిని పోలీసులు అరెస్టు చేశారు. చెన్నై అన్నాసాలై రహేజా టవర్‌లో బజాజ్ ఫైనాన్స్ సంస్థ ప్రధాన కార్యాలయం పనిచేస్తోంది. చెన్నైలో పలు ప్రైవేటు దుకాణాల్లో సెల్‌ఫోన్ కొనడానికి వచ్చే వినియోగదారులకు జీరో శాతం వడ్డీపై సరైన ఆధార పత్రాలను తీసుకుని రుణం ఏర్పాటు చేస్తున్నారు. సోమవారం ఎక్స్‌ప్రెస్ అవెన్యూలోగల పూర్వికా సెల్‌ఫోన్ దుకాణానికి వచ్చిన రంజిత్ (23), శివగణేశన్ (25) రూ.56 వేల విలువైన ఆపిల్ సెల్‌ఫోన్‌ను కొనడానికి అక్కడ పనిచేసే బజాజ్ ఫైనాన్స్ సంస్థకు తమ శ్యాలరీ సర్టిఫికెట్, పాన్‌కా ర్డు, డ్రైవింగ్ లెసైన్స్, ప్రైవేటు బ్యాంకు పోస్టుడేటెడ్చెక్కులను సమర్పించి జీరో శాతం వడ్డీతో సులభ వాయిదా పద్ధతిలో ఆపిల్ ఐ ఫోన్ కొనుగోలు చేశారు. తరువాత వారు సమర్పించిన పాన్‌కార్డు, డ్రైవింగ్ లెసైన్స్‌లను పరిశీలించినప్పుడు అవి నకిలీవని తెలిసింది. దీనిపై బజాజ్ ఫైనాన్స్ సంస్థ అసిస్టెంట్ మేనేజర్ తంగరాజ్, ముత్తులు అన్నాసాలై పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదును నమోదు చేసుకుని నేరస్థులను పట్టుకోవడానికి ప్రత్యేక బృందం పోలీసులు రంగంలోకి దిగారు. పోలీసు విచారణలో మోసానికి పాల్పడిన భారతీదాసన్ (27), రంజిత్ (23), విజయ్‌దురై (37), వెంకటేశన్ (32), జగదీష్‌బాబు (35)లను అరెస్టు చేశారు. వారి నుంచి ల్యాప్‌ట్యాప్, ఆపిల్ ఐఫోన్, ఐదు నకిలీ పాన్‌కార్డులు, డ్రైవింగ్ లెసైన్స్‌లు ల్యామినేషన్ మిషన్లను స్వా దీనం చేసుకున్నారు. పోలీసు విచారణ లో రంజిత్, విజయ్‌దురై అశోక్ పిల్లర్, టీనగర్లలో గల పూర్వికా మొబైల్ విక్రయకేంద్రం, తారాపూర్ టవర్‌లో గల క్రో మో, టీనగర్‌లోని రిలయన్స్ మొబైల్ విక్రయ కేంద్రాలలో నకిలీ పాన్‌కార్డు, డ్రైవింగ్ లెసైన్స్‌లను సమర్పించి ఏడు ఐ ఫోన్లను కొన్నట్లు తెలిసింది. అలా గే వివేక్స్ దుకాణంలో సుమారు లక్షా 30వేల విలువ గల సోనీ టీవీని మోసం చేసినట్లు తెలిసింది. పట్టుబడిన ఈ ఐ దుగురు రాయపేటలోని ప్రైవేటు ప్రిం టింగ్ కంపెనీలో పని చేస్తున్నట్లు తెలిి సంది. జగదీశన్, వెంకటేశన్ నకిలీ పాన్‌కార్డులను, డ్రైవింగ్ లెసైన్స్‌లను ము ద్రించి రంజిత్‌కు ఇచ్చేవారని తెలిసింది. రంజిత్ బీఈ వరకు, విజయ్‌దురై ఎంసీఏ వరకు చదివారని, పరారీలో ఉన్న దేవన్శేన్ కోసం పోలీసులు వెతుకుతున్నారని తెలిసింది. అరెస్టు అయిన ఐదుగురిని న్యాయస్థానంలో హాజరు పరచి పుళల్ జైలుకు పంపారు. చోరులను పట్టుకోవడానికి అతి చాకచక్యంగా వ్యవహరించిన పోలీసు బృందాన్ని చెన్నై కమిషనర్ అభినందించారు.