నకిలీ పాన్ కార్డుల గుర్తింపు సులువు
ఐటీశాఖ చేతిలో కొత్త టెక్నాలజీ టూల్
న్యూఢిల్లీ: నకిలీ పాన్ కార్డ్‌లను గుర్తించే కొత్త టెక్నాలజీ టూల్‌ను ఆదాయపు పన్ను శాఖ రూపొందించింది. ఎన్నో ఏళ్ల శ్రమ అనంతరం సాధించిన ఈ టెక్నాలజీ టూల్‌తో నకిలీ పాన్ కార్డ్‌లకు చెక్ పెట్టవచ్చు. అంతేకాకుండా వాటిని తొలగించవచ్చు. ఇన్‌కమ్ ట్యాక్స్ బిజినెస్ అప్లికేషన్-పర్మనెంట్ అకౌంట్ నంబర్ (ఐటీబీఏ-పాన్) పేరుతో రూపొందించిన ఎలక్ట్రానిక్ స్మార్ట్ ప్లాట్‌ఫార్మ్‌తో నకిలీ పాన్ కార్డ్‌లకు అడ్డుకట్ట వేయవచ్చు. గతంలో నకిలీ పాన్‌కార్డ్‌లను గుర్తించడానికి ఆదాయపు పన్ను ఉద్యోగులే స్వయంగా ప్రయత్నించేవాళ్లు. కానీ ఇది సరైన ఫలితాలనిచ్చేది కాదు. అయితే ఈ కొత్త ఎలక్ట్రానిక్ విధానం ఖచ్చితమైన ఫలితాలనిస్తోందని ఐటీ ఉన్నతాధికారొకరు చెప్పారు. ఈ కొత్త విధానం వల్ల నకిలీ పాన్ కార్డ్‌ల గుర్తింపు సులభమని, దీన్ని తొలగించడంతో.. మళ్లీ ఉపయోగించకుండా అడ్డుకట్ట వేయవచ్చని చెప్పారు. దేశంలో 24.37 కోట్ల పాన్‌కార్డ్‌లు ఉన్నట్లు అంచనా. వీటిలో నకిలీవి ఎన్నో లెక్కలేదు.