
ఆదాయపన్ను శాఖ స్పష్టీకరణ
న్యూఢిల్లీ: కొత్త ఆదాయపన్ను బిల్లు కింద కేవలం సెర్చ్, సర్వే ఆపరేషన్లలోనే పన్ను చెల్లింపుదారుల డిజిటల్ ఖాతాలు, కంప్యూటర్ పరికరాల ప్రవేశాన్ని ఆదాయపన్ను శాఖ బలవంతంగా తీసుకుంటుందని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. అది కూడా పాస్‌వర్డ్‌లను పంచుకునేందుకు తిరస్కరించినప్పుడే ఇలా జరుగుతుందన్నారు. అంతేకానీ, సాధారణ పన్ను చెల్లింపుదారులకు సంబంధించి స్క్రుటినీ కేసుల్లో ఆన్‌లైన్ గోప్యతకు భంగం కలిగించేది ఉండదని స్పష్టం చేశారు.
ఇదీ చదవండి: టెస్లా కారు కొనుగోలు చేసిన ట్రంప్!
ఈ తరహా చర్యలు తీసుకునే అధికారం 1961 ఆదాయపన్ను చట్టం కింద ప్రస్తుతం సైతం ఉన్నట్టు అధికారి చెప్పారు. ఇవే అధికారాలను ఆదాయపన్ను బిల్లు 2025లోనూ పేర్కొన్నట్టు తెలిపారు. ఎల్రక్టానిక్ రికార్డులు, పన్ను చెల్లింపుదారుల ఈ–మెయిల్స్, సోషల్ మీడియా హ్యాండిల్స్, క్లౌడ్ స్టోరేజీ నుంచి సమాచారం పొందే అధికారం కొత్త ఆదాయపన్ను బిల్లులోని సెక్షన్ 247 కింద దఖలు పడనున్నాయంటూ జరుగుతున్న ప్రచారాన్ని తిరస్కరించారు. ఇవి కేవలం భయాన్ని కల్పించేవిగా పేర్కొన్నారు. పన్ను చెల్లింపుదారుల సోషల్ మీడియా ఖాతాలు లేదా ఆన్‌లైన్ కార్యకలాపాలపై పన్ను శాఖ నిఘా పెట్టబోదన్నారు.
Comments
Please login to add a commentAdd a comment