
భారతదేశంలో ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ (మార్చి 7 నుంచి 13 వరకు) ప్రారంభమైంది. ఇందులో భాగంగా లేటెస్ట్ ఐఫోన్ 16, ఐఫోన్ 15 మోడళ్లపై డిస్కౌంట్స్ కూడా ప్రకటించింది. ఈ తగ్గింపులకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ కథనంలో వివరంగా తెలుసుకుందాం.
ఐఫోన్ 16 సిరీస్ ఆఫర్లు
ఐఫోన్ 16 బేస్ వేరియంట్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 79,900 నుంచి 68,999 రూపాయలకు చేరింది. హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఆఫర్ కింద రూ. 4000, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ కింద రూ. 5000 తగ్గింపును పొందవచ్చు. అంటే ఇప్పుడు ఐఫోన్ 16ను రూ. 59,999లకు సొంతం చేసుకోవచ్చు. నో కాస్ట్ ఈఎమ్ఐ కూడా రూ. 10,000 నుంచి ప్రారంభమవుతుంది.
కొత్తగా విడుదలైన ఐఫోన్ 16e ధర రూ. 59,900. అయితే ఇది ఇప్పుడు 55,900 రూపాయలకు అందుబాటులో ఉంది. ఐఫోన్ 16 ప్లస్ ధర రూ. 89,900 నుంచి రూ. 78,999కు చేరింది. ఐఫోన్ 16 ప్రో రూ. 1,19,900 నుంచి రూ. 1,08,900కు & ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ అసలు ధర రూ. 1,44,900 కాగా, సేల్‌లో భాగంగా రూ. 1,31,900కు లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్స్, ఇతర ప్రయోజనాలను ఉపయోగించుకుంటే.. వీటి ధరలు మరింత తగ్గుతాయి.
ఐఫోన్ 15 సిరీస్ ఆఫర్లు
ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్ సమయంలో ఐఫోన్ 15, ఐఫోన్ 15 ప్లస్, ఐఫోన్ 14 వరుసగా రూ. 60,999, రూ. 64,999 & రూ. 50,999 ప్రారంభ ధరలకు అందుబాటులో ఉన్నాయి. సాధారణ డిస్కౌంట్లతో పాటు, కొనుగోలుదారులు నో కాస్ట్ ఈఎమ్ఐ ఎంపికలు, స్టాండర్డ్ ఈఎమ్ఐ ఎంపికలు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌లు, కూపన్ ఆధారిత డిస్కౌంట్‌లను సేల్‌లో పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment