ప్రముఖ ఈకామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ లు ఐఫోన్ లపై బంపరాఫర్లు ప్రకటించాయి. సగం ధరకే ఐఫోన్‌లను అందిస్తున్నట్లు తెలిపాయి.
దేశీయ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో యూజర్లను విపరీతంగా ఆకట్టుకున్న ఐఫోన్ 11పై అమెజాన్, ఫ్లిప్ కార్ట్ భారీ డిస్కౌంట్లకే అందిస్తున్నాయి. అయితే ఇందుకు కొన్ని షరతులకు లోబడి కొనుగోలు దారులు కొనుగోలు చేయాల్సి ఉంటుంది.
2019లో ఇండియన్ స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో యాపిల్ సంస్థ ఐఫోన్ 11ను విడుదల చేసింది. విడుదల సమయంలో ఫోన్ ప్రారంభ ధర రూ.64,900 ఉంది. అయితే ఇప్పుడు అదే ఫోన్ రూ.49,900కే అందిస్తుంది. క్యాష్ బ్యాక్, డిస్కౌంట్, ఎక్ఛేంజ్ ఆఫర్లతో ఫోన్ ను రూ.34900 నుంచి రూ.30,900ల లోపే సొంతం చేసుకోవచ్చు.
అమెజాన్
అమెజాన్ లో కొనుగోలుదారులు పాత స్మార్ట్‌ఫోన్‌ను ఎక్స్ఛేంజ్ లో రూ.15,000 వరకు క్యాష్‌బ్యాక్ పొందవచ్చు. వారి పాత స్మార్ట్‌ఫోన్ విలువ రూ. 15,000 అయితే, అమెజాన్‌లో ఐఫోన్ 11 ధర రూ. 34,900కి తగ్గుతుంది. ఇంకా ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్, కోటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌లపై రూ.4,000 తగ్గింపు పొంద వచ్చు. దీంతో అమెజాన్‌లో ఐఫోన్ 11ను రూ.30,900 ధరతో కొనుగోలు చేయోచ్చు.
ఫ్లిప్‌కార్ట్
ఫ్లిప్‌కార్ట్‌లో సైతం ఐఫోన్ 11 ధర రూ.49,900 ఉంది. ఇ-కామర్స్ దిగ్గజం పాత స్మార్ట్‌ఫోన్ పై రూ.18,850 ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను అందిస్తోంది. అంటే మీరు ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 31,050 కంటే తక్కువ ధరకు స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ‘ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్’ క్రెడిట్ కార్డ్ వినియోగంతో 5 శాతం క్యాష్‌బ్యాక్‌ను పొందవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment