యాపిల్ ఐఫోన్14 (Apple iPhone 14)పై ఈ-కామర్స్ సంస్థలు వరుసకట్టి ఆఫర్లు ప్రకటించాయి. పోటీ పడి డిస్కౌంట్లు అందిస్తున్నాయి. యాపిల్ అధికారిక వెబ్‌సైట్‌లో ఐఫోన్14 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర ప్రస్తుతం రూ.79,900 ఉంది. అయితే ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌తో పాటు విజయ్ సేల్స్ అనే మరో ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఈ ఫోన్‌పై భారీ తగ్గింపులు, ఆఫర్లు అందిస్తున్నాయి. తక్కువ ధరకే ఐఫోన్ 14 కొనుక్కోవాలనుకుంటున్నవారికి ఇప్పుడే సరైన సమయం.
ఇదీ చదవండి: Amazon Great Summer Sale: ఆఫర్ల జాతరకు సిద్ధమైన అమెజాన్.. ఫోన్లు, ఇతర ఉత్పత్తులపై భారీ డిస్కౌంట్లు!
ఫ్లిప్‌కార్ట్‌లో అత్యధిక డిస్కౌంట్
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ 128జీబీ వేరియంట్ ఐఫోన్14పై అత్యధికంగా 12 శాతం తగ్గింపును అందిస్తోంది. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ కార్డ్‌పై ఐదు శాతం క్యాష్‌బ్యాక్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డ్‌లపై రూ.4,000 తగ్గింపు పొందవచ్చు. అదనంగా ఫ్లిప్‌కార్ట్ ఎక్స్ఛేంజ్ ఆఫర్ ద్వారా రూ.40,749 కంటే తక్కువ ధరకే ఐఫోన్14 మీ సొంతం అవుతుంది. ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్ కింద మీ పాత స్మార్ట్‌ఫోన్‌కు కండీషన్‌ను బట్టీ గరిష్టంగా రూ.29,250 వరకు లభిస్తుంది.
అమెజాన్ ఆఫర్లు
ఐఫోన్14ని అమెజాన్ 10 శాతం తగ్గింపుతో రూ.71,999లకు విక్రయిస్తోంది. అలాగే వివిధ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై రూ. 4,000 వరకు ఆఫర్‌లను కూడా అందిస్తోంది. అదనంగా
ట్రేడ్-ఇన్ ఆఫర్‌ను ఉపయోగించుకుంటే చాలా తక్కువ ధరకే ఐఫోన్14 లభిస్తుంది. ఈ ఆఫర్ కింద రూ.19,700 వరకు తగ్గింపు ఉంటుంది. తద్వారా రూ. 52,299 కంటే తక్కువకే ఐఫోన్14ను కొనుక్కోవచ్చు.
విజయ్ సేల్స్‌లో యాపిల్ డేస్
అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌తోపాటు విజయ్ సేల్స్ కూడా ఐఫోన్14పై భారీ డిస్కౌంట్ ఇస్తోంది. ఇందులో కొనసాగుతున్న యాపిల్ డేస్‌లో భాగంగా కేవలం రూ.70,999లకే ఈ ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్14పై ఈ సంస్థ 11 శాతం తగ్గింపుతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ కార్డ్‌లపై రూ.4,000 క్యాష్‌బ్యాక్, యస్ బ్యాంక్ కార్డ్‌లపై రూ.2,000 వరకు తక్షణ తగ్గింపు వంటి ఆకర్షణీయమైన బ్యాంక్ ఆఫర్‌లను అందిస్తోంది.
ఇదీ చదవండి: FASTag Record: ఒక్క రోజులో రూ.1.16 కోట్లు.. ఫాస్ట్‌ట్యాగ్ వసూళ్ల రికార్డు
Comments
Please login to add a commentAdd a comment