సాక్షి,ముంబై: యాపిల్ ఐఫోన్లపై డిస్కౌంట్ అంటే ఐఫోన్ లవర్స్‌కు పండగే. అందులోనూ లేటెస్ట్ స్మార్ట్‌ఫోన్ ఐఫోన్ 14పై అంటే చెప్పనక్కరలేదు. ఫ్లిప్‌కార్ట్‌పై భారీ డిస్కౌంట్‌పై అందుబాటులో ఉంది.దీపావళి సేల్స్ సమయంలో కూడా ఇవ్వని తగ్గింపును ఇపుడు ఇవ్వడం గమనార‍్హం.
స్మార్ట్‌ఫోన్ లాంచ్ అయిన కొద్ది నెలలకే తగ్గింపు ధరకు లభిస్తోంది. తాజాగా ఐఫోన్ 14ను రూ. 51,900 కంటే తక్కువ ధరకు పొందవచ్చు. అసలు ధర రూ. 79,900 కంటే రూ. 28,000 తక్కువన్నమాట.ఐఫోన్ 14 128జీబీ మోడల్ ఎంఆర్‌పీ రూ.79,900 కాగా ఫ్లిప్‌కార్ట్‌లో రూ .77,400కు లభిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ కార్డు ద్వారా జరిపే కొనుగోళ్లపై రూ . 5000 తగ్గింపు అదనం. (PepsiCo Layoffs 2022: కార్పొరేట్ ఉద్యోగులకు షాకింగ్ న్యూస్!)
అలాగే పాతఐఫోన్, ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ ఎక్స్ఛేంజ్‌పై యూజర్లు రూ.20,500 వరకూ తగ్గింపు పొందుతారు. ఎక్స్ఛేంజ్ డీల్‌తో లేటెస్ట్ యాపిల్ స్మార్ట్‌ఫోన్ ధర రూ. 51,900కు అందుబాటులో ఉంటుంది. రూ. 20,500 ఎక్స్ఛేంజ్ విలువ ప్రీమియం స్మార్ట్‌ఫోన్‌లకు మాత్రమే వర్తిస్తుంది. ఐఫోన్ 12 Pro ద్వారా రూ. 20వేలు, ఐఫోన్ 11 ధరపై రూ. 15వేలు తగ్గింపు పొందవచ్చు. శాంసంగ్ గెలాక్సీ S20 Ultra మార్పిడి విలువ రూ. 12,450.వన్‌ప్లస్ 7టీ ద్వారా 10,100 రూపాయల ఎక్స్ఛేంజ్ లభిస్తుంది. దీంతోపాటు ఐఫోన్ 13ను కూడా తక్కువ ధరకే ఫ్లిప్‌కార్ట్‌పై సొంతం చేసుకోవచ్చు.
(ఇదీ చదవండి: మారుతి బాటలో, టాటా మెటార్స్: కస్టమర్లకు కష్టకాలం!)
Comments
Please login to add a commentAdd a comment