
యాపిల్ ఐఫోన్ 14 ప్లస్ (Apple iPhone 14 Plus)పై ఫ్లిప్‌కార్ట్‌లో భారీ తగ్గింపుతో అద్భుతమైన ఆఫర్ నడుస్తోంది. ఐఫోన్ 14 ప్లస్ భారతదేశంలో రూ. 89,999 ధరతో లాంచ్ అయింది. ఇప్పుడు ఫ్లిప్‌కార్ట్ దీనిపై రూ.12,000 ఫ్లాట్ తగ్గింపు అందిస్తోంది. దీంతో పాటు బ్యాంక్ ఆఫర్‌లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌లు అదనం.
యాపిల్ ఐఫోన్ 14 ప్లస్ 128GB వేరియంట్ ప్రారంభ ధర రూ 89,999 ఉండగా ఫ్లిప్‌కార్ట్‌లో ఇది ఇప్పుడు భారీ తగ్గింపుతో రూ.77,999లకే అందుబాటులో ఉంది. దీంతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌లపై రూ.4,000 తగ్గింపు లభిస్తుంది. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్‌ల విషయానికొస్తే, పాత మోడల్ ఫోన్‌లను ఎక్స్‌ఛేంజ్ చేయడం ద్వారా కస్టమర్‌లు గరిష్టంగా రూ. 29,500 వరకు పొందవచ్చు.
ఇదీ చదవండి: ఐఫోన్ యూజర్లకు కొత్త యాప్.. విండోస్ కంప్యూటర్‌కు కనెక్ట్ చేసుకోవచ్చు!
ఇక రూ. 99,900 ఉన్న 256GB వేరియంట్ ఫోన్ రూ. 87,999లకే కొనుక్కోవచ్చు. రూ. 1,19,900 ధర ఉన్న 512GB వేరియంట్ రూ. 1,07,900లకే అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 14 ప్లస్ పర్పుల్, స్టార్‌లైట్, మిడ్‌నైట్, బ్లూ, ప్రొడక్ట్ (రెడ్), ఎల్లో కలర్ వేరియంట్‌లలో అందుబాటులో ఉంది.
ఐఫోన్14పైనా తగ్గింపు
రూ. 79,999 ధరతో ప్రారంభమైన యాపిల్ ఐఫోన్ 14 ప్రస్తుతం ఫ్లిప్‌కార్ట్‌లో రూ. 71,999లకే అందుబాటులో ఉంది. అంటే రూ. 8,000 డిస్కౌంట్. దీంతో పాటు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డ్‌లపై రూ.4,000 తగ్గింపు కూడా లభిస్తుంది. అలాగే ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది.
ఐఫోన్ 14 ప్లస్ స్పెసిఫికేషన్స్, ఫీచర్లు
పరిమాణం మినహా యాపిల్ ఐఫోన్ 14 ప్లస్, ఐఫోన్ 14 దాదాపు ఒకే విధమైన స్పెసిఫికేషన్‌లను కలిగి ఉన్నాయి. రెండూ A15 బయోనిక్ చిప్‌సెట్‌తో 512GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఉన్నాయి. కెమెరా పరంగా ఐఫోన్14, ఐఫోన్14 ప్లస్ 12MP ప్రైమరీ సెన్సార్, 12MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్‌ను కలిగి ఉన్న డ్యూయల్ రియర్ కెమెరా సెటప్ ఉంది.
ఇదీ చదవండి: ఊరిస్తున్న కార్లు వచ్చేస్తున్నాయి.. మే నెలలో లాంచ్ అయ్యే కార్లు ఇవే..