ప్రత్యేకంగా యాపిల్ ప్రీమియమ్ ఉత్పత్తులను విక్రయించే దేశంలోని ప్రముఖ రీసెల్లర్ కంపెనీ మాపుల్ (Maple) అక్షయ తృతీయ సందర్భంగా ఐఫోన్ 14 (iPhone 14)పై ప్రత్యేక ఆఫర్‌ను ప్రకటించింది. మాపుల్ స్టోర్ లేదా ఆన్‌లైన్‌లో ఐఫోన్ 14 కొంటే రూ.21,000 తగ్గింపు పొందవచ్చు. లేదా నెలకు రూ.2,996 చొప్పున 24 నెలల నో కాస్ట్ ఈఎంఐపై జీరో డౌన్ పేమెంట్‌తో ఐఫోన్ 14ను సొంతం చేసుకోవచ్చు.
ఇదీ చదవండి: అక్షయ తృతీయ ప్రత్యేక బంగారు నాణేలు.. ఆఫర్లు!
ప్రస్తుతం ఐఫోన్ 14 512 GB ధర రూ. 1,09,900 ఉంది. కానీ మాపుల్‌లో రూ.11,000 తగ్గింపుతో పాటు హెడ్‌ఎఫ్‌సీ క్యాష్‌బ్యాక్ రూ. 4,000, ఎక్స్ఛేంజ్ బోనస్ రూ. 6,000 మొత్తంగా రూ. 21,000 తగ్గింపు లభిస్తోంది. ఐఫోన్ 14 128జీబీ, 256 జీబీ వేరియంట్‌లపైనా కూడా 10 శాతం మాపుల్ డిస్కౌంట్, హెచ్‌డీఎఫ్‌సీ క్యాష్‌బ్యాక్, ఎక్స్ఛేంజ్ బోనస్‌లను పొందవచ్చు.
ఇదీ చదవండి: నెట్‌ఫ్లిక్స్ యూజర్లకు గుడ్ న్యూస్! భారీగా తగ్గిన సబ్‌స్క్రిప్షన్ చార్జీలు
ఇక ఈఎంఐపై ఫోన్ కొనాలనుకుంటున్నవారి కోసం కూడా ప్రత్యేక ఆఫర్‌ను మాపుల్ కల్పిస్తోంది. బజాజ్ ఫిన్‌సర్వ్, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్‌తో కలిసి నెలకు రూ.2,996 చొప్పున 24 నెలల నో-కాస్ట్ ఈఎంఐపై జీరో డౌన్ పేమెంట్‌తో ఐఫోన్ 14ను అందిస్తోంది.
ముంబై, మంగళూరులో స్టోర్‌లను కలిగి ఉన్న మాపుల్ దేశమంతటా ఈ-కామర్స్ సేవలు అందిస్తోంది. 5 లక్షల మందికిపైగా కస్టమర్‌లను కలిగి ఉంది. లేటెస్ట్ ఐఫోన్లు, మాక్‌బుక్‌లు, ఐపాడ్‌లు, యాపిల్ వాచ్‌లపై ఆఫర్‌ల గురించి మరింత తెలుసుకోవడానికి సమీపంలోని మాపుల్ స్టోర్ లేదా ఆన్‌లైన్‌లో maplestore.in ని సందర్శించవచ్చు.
ఇదీ చదవండి: Apple Retail Store In Delhi: రెండో యాపిల్ స్టోర్‌ను ప్రారంభించిన టిమ్‌కుక్
Comments
Please login to add a commentAdd a comment