ఐఫోన్ కొనటానికి ఇది మంచి సమయం - ఎందుకంటే? | Apple iPhone 15 Gets Price Cut, Now Available For This Price, Check Bank Offers And Its Features - Sakshi
Sakshi News home page

Apple iPhone 15 Price Cut: న్యూ ఇయర్‌‌‌‌కు ముందే మంచి ఆఫర్.. ఐఫోన్ కొనటానికి సరైన సమయం

Published Fri, Dec 29 2023 10:14 AM | Last Updated on Fri, Dec 29 2023 12:45 PM

Apple iPhone 15 Gets Price Cut - Sakshi

2023 ముగుస్తోంది.. కొత్త సంవత్సరం వచ్చేస్తోంది. ఈ సమయంలో చాలామంది కొత్త బైకులు, కార్లు లేదా మొబైల్ ఫోన్స్ వంటివి కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతారు. దీనిని దృష్టిలో ఉంచుకుని కంపెనీలు కూడా కొన్ని ఆకర్షణీయమైన ఆఫర్స్ అందిస్తున్నాయి. ఈ కథనంలో ఐఫోన్ 15 (iPhone 15)పై అందుబాటులో ఉన్న ఆఫర్స్ గురించి వివరంగా తెలుసుకుందాం.

వండర్‌లస్ట్ ఈవెంట్‌లో లాంచ్ అయిన ఐఫోన్ 15 ధర రూ. 79990. ఈ లేటెస్ట్ ఫోన్‌ను అమెజాన్‌లో కొనుగోలు చేసినట్లయితే రూ. 74990కే సొంతం చేసుకోవచ్చు. అంటే ఐఫోన్ 15 కొనుగోలుదారులు రూ.5000 డిస్కౌంట్ పొందవచ్చు.

రూ.5000 డిస్కౌంట్ మాత్రమే కాకుండా అమెజాన్ పే ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు వినియోగదారులు 5 శాతం (రూ. 3745) క్యాష్ బ్యాక్ కూడా పొందవచ్చు. దీంతో రూ.79990 మొబైల్.. అన్ని డిస్కౌంట్స్ తరువాత రూ.71245కే కొనుగోలు చేయవచ్చు. మొత్తం మీద ఐఫోన్ 15 కొనుగోలుపై ఇప్పుడు 8745 రూపాయల తగ్గింపును పొందవచ్చు.

ఇదీ చదవండి: సచిన్‌కు రూ.27 కోట్ల లాభం.. ఎలా అంటే?

ఐఫోన్ 15 ఫీచర్స్
ఐఫోన్ 15 అనేది దాని మునుపటి మోడల్స్ కంటే కూడా చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఇది కొత్త డైనమిక్ ఐలాండ్ టెక్నాలజీతో వస్తుంది. 6.1 ఇంచెస్ స్క్రీన్ కలిగిన ఈ మొబైల్ అద్భుతమైన కెమెరా సెటప్ పొందుతుంది. దీంతో వినియోగదారులు 0.5x, 1x, 2x జూమ్ స్థాయిలలో కూడా ఫోటోలను తీసుకోవచ్చు.

మల్టిపుల్ కలర్ ఆప్షన్లలో లభించే ఈ మొబైల్ 128, 256, 512 జీబీ మెమొరీ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. ఇది ఇప్పుడు USB-C ఛార్జర్‌కు సపోర్ట్ చేస్తుంది. మొత్తం మీద ఐఫోన్ 15 అన్ని విధాలా అద్భుతంగా ఉంటుంది. మంచి డిస్కౌంట్‌తో ఐఫోన్ కొనాలనే వారికి ఇది గొప్ప అవకాశం అని తెలుస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement