దసరా, దీపావళి వచ్చేస్తున్నాయి. ఈ పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు గొప్ప ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగానే అమెజాన్ 27 నుంచి (సెప్టెంబర్ 27) గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభించనుంది. ఇందులో కొన్ని ఉత్పత్తుల మీద ఏకంగా 86 శాతం డిస్కౌంట్స్ అందించనున్నట్లు సమాచారం.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ వచ్చే వారంలో ప్రారంభం కానుంది. కంపెనీ ఈ సేల్‌లో ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్‌లు, కెమెరాలు, హెడ్‌ఫోన్‌లు, సౌండ్‌బార్లు మొదలైన వాటిపైన అద్భుతమైన డిస్కౌంట్స్ అందించనుంది. అయితే ఈ డిస్కౌంట్స్ ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు.
అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో దాదాపు అన్ని ఎలక్ట్రానిక్స్ తక్కువ ధరలకే లభించే అవకాశం ఉంది. టాబ్లెట్‌ల మీద 55 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది. శాంసంగ్, లెనోవా, యాపిల్ వంటి టాప్ బ్రాండ్‌ల మీద కూడా 55 శాతం డిస్కౌంట్స్ ఉన్నట్లు సమాచారం.
ఇదీ చదవండి: లక్షల కోట్ల కంపెనీ.. మీటింగ్‌లో ఓ ఖాళీ కుర్చీ: ఎందుకంటే..
అమెజాన్ హెడ్‌ఫోన్‌లు, ఇయర్‌బడ్‌ల మీద 86 శాతం డిస్కౌంట్స్ ఉండనున్నట్లు సమాచారం. సోనీ, గోప్రో వంటి కెమెరాల మీద 53 శాతం డిస్కౌంట్స్.. స్పీకర్‌ల కొనుగోలుపైన 73 శాతం, యాపిల్, శాంసంగ్, నాయిస్, బోట్ వంటి స్మార్ట్‌వాచ్‌లపై అమెజాన్ 83 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. కీబోర్డ్ మరియు మౌస్ కాంబోలపై కూడా 82 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.
అమెజాన్ మాత్రమే కాదు
అమెజాన్ మాత్రమే కాకుండా ఫ్లిప్‌కార్ట్, మింత్రా వంటి కంపెనీలు కూడా ఈ పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని తప్పకుండా డిస్కౌంట్స్ లేదా ఆఫర్స్ అందిస్తాయి. దీనికి సంబంధించిన మరిన్న వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్‌సైట్ సందర్శించవచ్చు.
Comments
Please login to add a commentAdd a comment