Festival Sales
-
సగానికి పడిపోయిన పండుగ డిమాండ్
ముంబై: ప్రస్తుత ఏడాది పండుగల సందర్భంగా డిమాండ్ సగానికి క్షీణించి 15 శాతంగా ఉన్నట్టు జపాన్ బ్రోకరేజీ సంస్థ నోమురా అంచనా వేసింది. 2023లో పండుగల సీజన్లో డిమాండ్ 32 శాతం పెరగ్గా, 2022లో 88 శాతం వృద్ధి చెందినట్టు గుర్తు చేసింది. ఆన్లైన్, ఆఫ్‌లైన్ రిటైల్ అమ్మకాలు పండుగల సీజన్లో పెరిగినప్పటికీ, మొత్తం మీద వృద్ధి నిదానంగానే ఉన్నట్టు పేర్కొంది.గ్రామీణ ప్రాంతాలు, టైర్–2, 3 పట్టణాల్లో డిమాండ్ స్థిరంగానే ఉండగా.. మెట్రోల్లో, పారిశ్రామిక డిమాండ్ బలహీనంగా ఉన్నట్టు వివరించింది. పట్టణ డిమాండ్ బలహీనంగా ఉన్నట్టు గత నెలలో కేంద్ర ఆర్థిక శాఖ సైతం ప్రకటించడం గమనార్హం. డిసెంబర్ నెలలో వివాహాలు అధిక సంఖ్యలో ఉండడం డిమాండ్‌కు ఊతం ఇవ్వొచ్చని నోమురా అంచనా వేస్తోంది. రిటైల్ అమ్మకాల వృద్ధి 2023లో ఉన్న 36.4 శాతం నుంచి.. 2024లో 13.3 శాతానికి పరిమితం కావొచ్చన్న అఖిల భారత వర్తకుల సమాఖ్య (సీఏఐటీ) అంచనాలను తన నివేదికలో నోమురా ప్రస్తావించింది.మరోవైపు రిటైల్ ఆటో విక్రయాలు 14 శాతం పెరగ్గా.. హోల్సైల్ వైపు ప్యాసింజర్ అమ్మకాలు, మధ్యశ్రేణి వాణిజ్య వాహనాల అమ్మకాలు బలహీనంగా ఉన్నట్టు తెలిపింది. ఆర్థిక వ్యవస్థలో తాత్కాలిక మందగమనం కొనసాగుతోందంటూ.. 2024–25 ఆర్థిక సంవత్సరానికి జీడీపీ వృద్ధి 7.2 శాతం ఉండొచ్చన ఆర్బీఐ అంచనాలు మరీ ఆశావాహంగా ఉన్నట్టు నోమురా అభివర్ణించింది. -
వీటి కొనుగోలుపై 86 శాతం డిస్కౌంట్!.. పండగ చేసుకోండి..
దసరా, దీపావళి వచ్చేస్తున్నాయి. ఈ పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు గొప్ప ఆఫర్స్ ప్రకటిస్తున్నాయి. ఇందులో భాగంగానే అమెజాన్ 27 నుంచి (సెప్టెంబర్ 27) గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ప్రారంభించనుంది. ఇందులో కొన్ని ఉత్పత్తుల మీద ఏకంగా 86 శాతం డిస్కౌంట్స్ అందించనున్నట్లు సమాచారం.అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ వచ్చే వారంలో ప్రారంభం కానుంది. కంపెనీ ఈ సేల్‌లో ల్యాప్‌టాప్‌లు, టాబ్లెట్లు, కెమెరాలు, హెడ్ఫోన్లు, సౌండ్బార్లు మొదలైన వాటిపైన అద్భుతమైన డిస్కౌంట్స్ అందించనుంది. అయితే ఈ డిస్కౌంట్స్ ఎక్కువ రోజులు ఉండకపోవచ్చు.అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో దాదాపు అన్ని ఎలక్ట్రానిక్స్ తక్కువ ధరలకే లభించే అవకాశం ఉంది. టాబ్లెట్ల మీద 55 శాతం వరకు డిస్కౌంట్ లభించనుంది. శాంసంగ్, లెనోవా, యాపిల్ వంటి టాప్ బ్రాండ్ల మీద కూడా 55 శాతం డిస్కౌంట్స్ ఉన్నట్లు సమాచారం.ఇదీ చదవండి: లక్షల కోట్ల కంపెనీ.. మీటింగ్‌లో ఓ ఖాళీ కుర్చీ: ఎందుకంటే..అమెజాన్ హెడ్ఫోన్లు, ఇయర్‌బడ్‌ల మీద 86 శాతం డిస్కౌంట్స్ ఉండనున్నట్లు సమాచారం. సోనీ, గోప్రో వంటి కెమెరాల మీద 53 శాతం డిస్కౌంట్స్.. స్పీకర్ల కొనుగోలుపైన 73 శాతం, యాపిల్, శాంసంగ్, నాయిస్, బోట్ వంటి స్మార్ట్‌వాచ్‌లపై అమెజాన్ 83 శాతం వరకు డిస్కౌంట్ అందిస్తోంది. కీబోర్డ్ మరియు మౌస్ కాంబోలపై కూడా 82 శాతం డిస్కౌంట్ లభిస్తుంది.అమెజాన్ మాత్రమే కాదుఅమెజాన్ మాత్రమే కాకుండా ఫ్లిప్‌కార్ట్, మింత్రా వంటి కంపెనీలు కూడా ఈ పండుగ సీజన్‌ను దృష్టిలో ఉంచుకుని తప్పకుండా డిస్కౌంట్స్ లేదా ఆఫర్స్ అందిస్తాయి. దీనికి సంబంధించిన మరిన్న వివరాలు తెలుసుకోవడానికి అధికారిక వెబ్సైట్ సందర్శించవచ్చు. -
ఈ కామర్స్‌లో కొలువుల పండుగ
హైదరాబాద్: నిరుద్యోగులకు కొలువుల పండుగ రానుంది. పండుగల విక్రయాలకు ముందు ఈ కామర్స్ రంగంలో పెద్ద ఎత్తున నియామకాలు చోటు చేసుకోనున్నాయి. ఏటా దసరా, దీపావళి సమయాల్లో ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు భారీ తగ్గింపులు, ఆఫర్లతో ప్రత్యేక విక్రయ కార్యక్రమాలు నిర్వహిస్తుంటాయి. దీంతో ఏడాది పండుగల సీజన్ సమయంలో డిమాండ్‌కు అనుగుణంగా ఉత్పత్తులు అందించేందుకు ఈ కామర్స్ సంస్థలు నెట్వర్క్ బలోపేతంపై దృష్టి సారించనున్నాయి. ముఖ్యంగా దక్షిణాదిలో ఈ కామర్స్ రంగంలో తాత్కాలిక ఉద్యోగాలు పెద్ద ఎత్తున రానున్నాయని నియామక సేవలు అందించే టీమ్‌లీజ్ సరీ్వసెస్ సంస్థ తెలిపింది. పరిశ్రమలో నెలకొన్న ధోరణుల ఆధారంగా ఈ అంచనాకు వచి్చంది. కేవలం దక్షిణాదిలోనే 4 లక్షల తాత్కాలిక ఉద్యోగాలు వస్తాయని పేర్కొంది. దేశవ్యాప్తంగా 7,00,000 తాత్కాలిక ఉద్యోగాలు ఏర్పడతాయని తెలిపింది. హైదరాబాద్‌లో 30 శాతం, బెంగళూరులో 40 శాతం, చెన్నైలో 30 శాతం చొప్పున కొలువులు ఏర్పడతాయని తెలిపింది. పండుగల సందర్భంగా హైదరాబాద్, బెంగళూరు, చెన్నై తదితర టైర్–1 పట్టణాల్లో నియామకాలు పెద్ద ఎత్తున ఉంటాయని, కోయంబత్తూర్, కోచి, మైసూర్ తదితర ద్వితీయ శ్రేణి పట్టణాలకు సైతం నియామకాలు విస్తరించొచ్చని అంచనా వేసింది. వేర్‌హౌస్ కార్యకలాపాల్లో (గోదాములు) 30 శాతం, డెలివరీ విభాగంలో 60 శాతం, కాల్‌సెంటర్ కార్యకలాపాల కోసం 10 శాతం నియామకాలు ఉంటాయని పేర్కొంది. ‘‘గడిచిన త్రైమాసికం నుంచి ప్రముఖ ఈకామర్స్ సంస్థలు పండుగల సీజన్‌కు సంబంధించి ఆశావహ ప్రణాళికలను ప్రకటించాయి. వినియోగదారులు భారీగా ఉండడం, భారత్‌లో తయారీని కేంద్ర సర్కారు ప్రోత్సహిస్తుండడం, ఎఫ్‌డీఐ, డిజిటైజేషన్ తదితర చర్యలు దేశంలో తాత్కాలిక కారి్మకుల పని వ్యవస్థను అధికంగా ప్రభావితం చేస్తున్నాయి’’అని టీమ్‌లీజ్ సరీ్వసెస్ బిజినెస్ హెడ్ బాలసుబ్రమణియన్ తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది తాత్కాలిక కారి్మకులు దేశవ్యాప్తంగా 25 శాతం మేర పెరుగుతారని అంచనా వేస్తున్నట్టు చెప్పారు. దక్షిణాదిలో అయితే ఇది 30 శాతంగా ఉంటుందన్నారు. ఫ్లిప్‌కార్ట్‌లో లక్ష సీజనల్ ఉద్యోగాలు రానున్న పండుగల సీజన్ నేపథ్యంలో, వినియోగదారుల నుంచి వచ్చే డిమాండ్‌ను అనుగుణంగా తాము సరఫరా వ్యవస్థలో లక్ష తాత్కాలిక (సీజనల్) ఉద్యోగ నియామకాలు చేపడుతున్నట్టు ఫ్లిప్‌కార్ట్ ప్రకటించింది. ఫుల్ఫిల్మెంట్ కేంద్రాలు, సార్టేషన్ కేంద్రాలు, డెలివరీ హబ్‌లలో ఈ నియామకాలు చేపట్టనుంది. స్థానిక కిరాణా డెలివరీ భాగస్వాములు, మహిళలు, వికలాంగులను సైతం నియమించుకోనున్నట్టు తెలిపింది. తద్వారా వైవిధ్యమైన సరఫరా చైన్‌ను ఏర్పాటు చేయనున్నట్టు పేర్కొంది. ‘‘బిగ్ బిలియన్ డేస్ (డిస్కౌంట్ సేల్) నిజంగా భారీ స్థాయిలో జరుగుతుంది. ఈ కామర్స్‌లో ఉండే మంచి గురించి లక్షలాది మంది కస్టమర్లు తెలుసుకునే అవకాశం ఏర్పడుతుంది. ఎక్కువ మంది మొదటిసారి కస్టమర్లే ఉంటున్నారు’’అని ఫ్లిప్‌కార్ట్ గ్రూప్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ హేమంత్ బద్రి తెలిపారు. బిగ్ బిలియన్ డేస్‌లో భాగంగా ఫ్లిప్‌కార్ట్ భారీ తగ్గింపులు, ఆకర్షణీయమైన ఆఫర్లతో విక్రయాలు చేపడుతుంటుంది. బిగ్ బిలియన్ డేస్ సందర్భంగా ఉండే సంక్లిష్టతలు, స్థాయికి అనుగుణంగా తాము సామర్థ్యాన్ని, నిల్వ స్థాయి, సారి్టంగ్, ప్యాకేజింగ్, మానవవనరులను, డెలివరీ భాగస్వాములను పెంచుకోవాల్సి ఉంటుందని బద్రి పేర్కొన్నారు. ఈ ఏడాది 40 శాతానికి పైగా షిప్మెంట్లను స్థానిక కిరాణా భాగస్వాములతో డెలివరీ చేసే ప్రణాళికతో ఉన్నట్టు చెప్పారు. -
అమెజాన్ అదిరిపోయే ఆఫర్, ఐఫోన్ 11పై భారీ డిస్కౌంట్
Amazon Great Indian Festival Sale: మరికొద్ది రోజుల్లో ముగియనున్న దీవాళి ఫెస్టివల్ సేల్ సందర్భంగా ఈ కామర్స్ సంస్థలు ఆఫర్ల జోరును పెంచుతున్నాయి. తాజాగా ఈ ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ ఐఫోన్ 11పై భారీ తగ్గింపు ఆఫర్‌ను ప్రకటించింది. ఐఫోన్ ధర, ఆఫర్లు ఐఫోన్ 11ఫోన్ ధర రూ.43,999 ఉండగా..అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో పాత స్మార్ట్ ఫోన్‌పై రూ.17,000 ఎక్ఛేంజ్ పొందవచ్చు. దీంతో పాటు ఎస్బీఐ కార్డ్ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ. 2,000 డిస్కౌంట్, నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని పొందవచ్చు. అంటే వినియోగదారులు ఈ ఐఫోన్ 11ను రూ.24,999కే సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 11 స్పెసిఫికేషన్లు ఐఫోన్ 11 6.1 అంగుళాల లిక్విడ్ రెటినా హెచ్ డీ ఎల్సీడీ డిస్ప్లే,ఏ13 బయోనిక్ చిప్, లిలోన్ 3110 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్, ఐఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు రెడ్, బ్లూ, బ్లాక్, పర్పుల్, గ్రీన్,వైట్ వేరియంట్లలో లభిస్తుంది. ఐఫోన్ 11లో డ్యూయల్ రేర్ కెమెరా సెటప్,12 ఎంపీ ప్రైమరీ లెన్స్, 12ఎంపీ వైడ్ యాంగిల్ లెన్స్, సెల్ఫీల కోసం 12ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇక 4కే, పోట్రేట్, స్లో మోషన్ వీడియోలు తీసేందుకు మరింత ఈజీగా ఉంటుంది. బ్లూటూత్, వైఫై, జీపీఎస్, యూఎస్బీ పోర్ట్‌తో వస్తుంది. చదవండి: షావోమి అదిరిపోయే ఆఫర్..సగానికి సగం ధరకే ఫోన్లు -
అమెజాన్ సేల్, బ్రాండెడ్ ల్యాప్ ట్యాప్స్‌పై అదిరిపోయే డిస్కౌంట్స్
ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ 2021' కొనసాగుతుంది. ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ప్రారంభించిన ఈ సేల్‌లో అమెజాన్ పలు రకలా గాడ్జెట్స్, స్మార్ట్ ఫోన్, ల్యాప్‌ట్యాప్‌లపై భారీ ఆఫర్లు, అదిరిపోయే డిస్కౌంట్లను అందిస్తుంది. తాజాగా బ్రాండెడ్ ల్యాప్‌ట్యాప్స్‌పై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నట్లు ప్రకటించింది. ఆసుస్ వివో బుక్ 14 ఆసుస్ వివో బుక్ 14పై అమెజాన్ డిస్కౌంట్స్ అందించింది. 16: 9 యాస్పెట్ రేషియోతో 14అంగుళాలు 1920*1*1,080 స్క్రీన్, పీక్ బ్రైట్ నెస్ కోసం 220 నిట్స్, ఇంటెల్ కోర్ ఐ5 10జనరేషన్ ప్రాసెసర్, 8జీబీ డీడీఆర్4 ర్యామ్‌తో పాటు 12జీబీ వరకు అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. 512జీబీ ఎం.2 ఎన్వీఎంఈ పీసీఐఈ 3.0 ఎస్ఎస్డీ ఫీచర్లు ఉండగా 1.6కేజీల బరువు ఉండే ఈ ఆసుస్ వివో బుక్ 14ను బ్యాటరీ లైఫ్ 6గంటల వరకు వినియోగించుకోవచ్చు. విండోస్10 సపోర్ట్ చేస్తున్న వివోబుక్ 14ను ఫ్రీగా విండోస్ 11కి అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. ఇక దీని ధర రూ.56,776 ఉండగా రూ.41,990కే సొంతం చేసుకోవచ్చు. హెచ్‌పీ 15 15.6 అంగుళా ఫుల్ హెచ్డీ (1920*1,080)డిస్ప్లే, పీక్ బ్రైట్ నెస్ కోసం 220నిట్స్, ఏఎండీ రైజాన్3 3250యూ ప్రాసెసర్, 8జీబీ డీడీఆర్4 ర్యామ్(16జీబీ వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు) 256జీబీ పీసీఐఈ ఎన్వీఎంఈ ఎం.2 ఎస్ఎస్డీ, ఏఎండీ ర్యాడ్ఆన్ గ్రాఫిక్స్, యూఎస్బీ సీపోర్ట్ తోపాటు సూపర్ స్పీడ్ యూఎస్బీ టైప్ ఏ-పోర్ట్‌ను అందిస్తుంది. ఇక హెచ్‌పీ 15 మార్కెట్ ధర రూ.46,055 ఉండగా అమెజాన్‌లో రూ.38,990కే సొంతం చేసుకోవచ్చు. లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ 3 లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ 3 15.6 అంగుళాల (1366*768పిక్సెల్స్) డిస్ప్లే ,ఏఎండీ రైజాన్3 3250యూ ప్రాసెసర్, 8జీబీ డీడీఆర్4 ర్యామ్ (12జీబీ వరకు అప్ గ్రేడ్)256జీబీ ఎస్ఎస్డీ, 1.85ల వెయిట్‌తో ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 10గంటల పాటు వినియోగించుకోవచ్చు. అంతేకాదు ర్యాపిడ్ ఛార్జింగ్ టెక్నాలజీ సౌకర్యం ఉంది. గంటలో 80శాతం ఛార్జింగ్ కూడా పెట్టుకోవచ్చు. దీని ధర రూ.55,890 ఉండగా రూ.36,490కే అమెజాన్ సేల్‌లో కొనుగోలు చేయవచ్చు. డెల్ ఇన్స్ప్రాన్ 3501 డెల్ ఇన్ స్ప్రాన్ 3501 స్పోర్ట్స్ 15.6అంగుళాల (1920*1080 పిక్సెల్స్) యాంటీ గ్లేర్ ఎల్ఈడీ డిస్ప్లే, ఇంటెల్ కోర్ ఐ3 10జెనరేషన్ ప్రాసెసర్, 4జీబీ ర్యామ్ 256జీబీ ఎం.2 పీసీఐఆ ఎన్బీఎంఈ ఎస్ఎస్డీ, యూహెచ్ డీ గ్రాఫిక్స్ విండోస్ 10సపోర్ట్ చేస్తుంది. ఈ ల్యాప్ ధర రూ.44,634 ఉండగా అమెజాన్‌లో రూ.38,390కే సొంతం చేసుకోవచ్చు. హెచ్‌పీ క్రోమ్ బుక్ ఎక్స్360 హెచ్‌పీ క్రోమ్ బుక్ ఎక్స్360 14అంగుళాల టచ్ స్క్రీన్ డిస్ప్లే, ఇంటెల్ కోర్ ఐ3 జెనరేషన్ ప్రాసెసర్, 4జీబీ డీడీఆర్4 ర్యామ్ అండ్ 64జీబీ ఎస్ఎస్డీ, ఇక ఈ క్రోమ్‌బుక్ సింగిల్ ఛార్జింగ్‌ను 13గంటల పాటు వినియోగించుకోవచ్చు. ఫింగర్ ప్రింట్ రీడర్, బ్యాంగ్ అండ్ ఒలుఫ్సెన్ ట్యూన్ చేసిన ఫింగర్ ప్రింట్ రీడర్,స్పీకర్లు ఉండగా క్రోమ్ ఓఎస్ సపోర్ట్ చేస్తుంది. దీని బరువు 1.65కేజీలు ఉండగా దీని ధర రూ.57,610 ఉండగా అమెజాన్ సేల్ లో రూ.38,990కే సొంతం చేసుకోవచ్చు. -
ఈ-కామర్స్ అమ్మకాలలో కుమ్మేస్తున్న టైర్ 3 నగరాలు
దసరా పండుగ సీజన్ పురస్కరించుకొని అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ వంటి ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు భారీగా ఆఫర్ల కురిపించిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది స్పెషల్ డిస్కౌంట్ సమయాల్లో ఈ-కామర్స్ అమ్మకాల్లో పాల్గొంటున్నారు. అయితే, ఈ సారి ఎక్కువగా డిమాండ్ టైర్ 3 నగరాల నుంచి రావడం విశేషం. ధన్ బాద్, కరీంనగర్, వరంగల్, గోరఖ్ పూర్, చిత్తూరు, కర్నూలు, గుంటూరు, వైజాగ్ వంటి నగరాల నుంచి భారీగా ఆర్డర్లు వచ్చినట్లు ఈ-కామర్స్ సంస్థలు పేర్కొన్నాయి. దేశీయ ఆర్ధిక వ్యవస్థ తిరిగి పుంజుకున్నట్లు మార్కెట్ నిపుణులు తెలుపుతున్నారు. షాపింగ్ పోర్టల్స్ అమ్మకాల సమయంలో దాదాపు సగం ఆర్డర్లు టైర్-3 నగరాలు వచ్చాయి. టెలివిజన్, ల్యాప్ టాప్ వంటి ఎలక్ట్రానిక్స్ కేటగిరీలో ఎక్కువగా అమ్ముడయ్యాయి. షాపింగ్ చేసిన ప్రతి ఐదుగురు కస్టమర్లలో ఒకరు స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశారు. ఫెస్టివల్ సేల్ ప్రారంభమైన మొదటి కొన్ని రోజులు పాట్నా, లక్నో, వైజాగ్ వంటి నగరాలు ఇతర మెట్రో నగరాలతో పోటీ పడ్డాయి. రాను రాను అన్ని ఆర్డర్లలో దాదాపు సగానికి మించి టైర్-3 నగరాలు నుంచి వచ్చాయి. "మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, జీవనశైలి, సాధారణ మర్కండైజింగ్, ఇంటి వంటి కేటగిరీలు అత్యధిక డిమాండ్ కలిగి ఉన్నాయి" అని ఫ్లిప్ కార్ట్ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. (చదవండి: తెలుగు రాష్ట్రాల్లో అత్యంత మహిళా ధనవంతురాలు ఈమే..!) -
అమెజాన్‌లో మొబైల్స్‌పై అదిరిపోయే ఆఫర్స్
ప్రముఖ ఈ-కామర్స్ సంస్థలు దసరా పండుగ పురస్కరించుకుని మొబైల్స్ పై ఆఫర్ల వర్షం కురిపిస్తున్నాయి. అక్టోబర్ 3 నుంచి ప్రారంభం కానున్న అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో భాగంగా శామ్సంగ్, ఆపిల్, వన్‌ప్లస్, ఎంఐ, రెడ్ మీ మొబైల్స్ చాలా తక్కువ ధరకు లభిస్తున్నాయి. తాజాగా మొబైల్ ఆఫర్లకు సంబంధించి అమెజాన్ టీజ్ చేసింది. 2019లో లాంచ్ అయిన ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్ రూ.40 వేలలోపు ధరకే అందుబాటులోకి రానుంది. ఈ విషయాన్ని అమెజాన్ తన అధికారిక మైక్రోసైట్లో పేర్కొంది. ఇక శామ్సంగ్ గెలాక్సీ ఎస్20ఎఫ్ఈ 5జీ స్మార్ట్ ఫోన్ ధరను ఏకంగా రూ.70,499 నుంచి రూ.36,999కు తగ్గించారు. అలాగే, దీంతోపాటు వన్‌ప్లస్ 9 నార్డ్ 2 5జీ ఫోన్ ధర రూ.28,499 నుంచి ప్రారంభం కానుంది. వన్‌ప్లస్ 9 ఆర్ 5జీ స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపును అందించారు. రూ.36,999కే దీన్ని కొనుగోలు చేయవచ్చు. ఐకూ జెడ్3 రూ.15,490 నుంచి ప్రారంభం కానుంది. రెడ్మీ 9 స్మార్ట్ ఫోన్ ధర రూ.7,920కు తగ్గనుంది. రెడ్మీ నోట్ 10 ప్రొ స్మార్ట్ ఫోన్ ధర రూ.16,990కు తగ్గనుంది. ఇంకా వన్‌ప్లస్ 9 ప్రో సుమారు 50 వేల కంటే తక్కువ ధరలో, వన్‌ప్లస్ 9 స్మార్ట్‌ఫోన్ 40 వేల కంటే తక్కువ ధరలో కొనుగోలుదారులకు గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో లభించే అవకాశం ఉంది. ఈ ఫెస్టివల్ సేల్‌లో దాదాపు అమెజాన్‌లో ఉన్న అన్ని స్మార్ట్ ఫోన్లపై అయితే తగ్గింపు లేదా బ్యాంకు ఆఫర్లు వర్తించనున్నాయి. దీంతోపాటు ప్రైమ్ మెంబర్ షిప్ ఉంటే మరిన్ని ఆఫర్లు అందించనున్నాయి. (చదవండి: భాగ్యనగరంలో అత్యంత ఆస్తిపరులు వీళ్లే!) -
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ల అమ్మకాల యుద్ధం
సాక్షి, న్యూఢిల్లీ : భారత్‌లో పండగల సీజన్ ప్రారంభమైంది. దీంతో ప్రముఖ ఆన్లైన్ అమ్మకాల సంస్థలయిన అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌ల మధ్య యుద్ధం ప్రారంభమైంది. డిస్కౌంట్ల విషయంలో ఇరు సంస్థలు పోటీ పడుతున్నాయి. అన్ని సరకులపై 15 నుంచి 20 శాతం వరకు డిస్కౌంట్లు ఇస్తున్నాయి. ‘బిగ్ బిలియన్ డేస్’ పేరిట ఫ్లిప్‌కార్ట్ సంస్థ తమ డిస్కౌంట్ అమ్మకాలను సెప్టెంబర్ పదవ తేదీన ప్రారంభించగా, అదే రోజు నుంచి తమ డిస్కౌంట్ సేల్స్ ప్రారంభం అవుతాయని ముందుగా ప్రకటించిన అమెజాన్ సంస్థ, అంతకన్నా 12 గంటల ముందే అంటే, 9వ తేదీ మధ్యాహ్నం నుంచే ‘గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్’ పేరిట అమ్మకాలకు శ్రీకారం చుట్టింది. అక్టోబర్ 15వ తేదీ వరకు సాగే ఈ ఫెస్టివల్లో మూడు వందల కోట్ల డాలర్ల (22,206 కోట్ల రూపాయలు) వ్యాపారం సాగుతుందని ‘రెడ్‌సీర్’ సంస్థ అంచనా వేసింది. గతేడాది ఈ రెండు ఆన్లైన్ సంస్థల ద్వారానే భారత్‌లో 150 కోట్ల వ్యాపారం సాగింది. అంటే ఈసారి అంతకన్నా రెట్టింపు వ్యాపారం జరుగుతుందని అంచనాలు తెలియజేస్తున్నాయి. భారత్‌లో సెల్ఫోన్లు, ఎలక్రానిక్స్, ఆటోమొబైల్స్, బట్టలతోపాటు గృహోపకరణాల అమ్మకాల్లో 40 శాతం అమ్మకాలు ఈ ఒక్క దసరా, దీపావళి సందర్భంగానే జరుగుతుంటాయి. ఈ సారి ఆన్లైన్ అమ్మకాల్లో సెల్ఫోన్లే ఎక్కువగా అమ్ముడు పోతాయని, దాదాపు వందకోట్ల డాలర్ల సెల్‌ఫోన్ అమ్మకాల వ్యాపారం జరగవచ్చని ‘ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్ ఇండియా’ సీనియర్ అనలిస్ట్ జైపాల్ సింగ్ అంచనా వేశారు. అమెరికాలో ‘బ్లాక్ ఫ్రైడే’, చైనాలో ‘సింగిల్స్ డే’ పేరిట కొనసాగే డిస్కౌంట్ అమ్మకాలకన్నా భారత్‌లో పండగల సీజన్ సందర్భంగా జరిగే అమ్మకాలే ఎక్కువగా ఉంటాయి. ఈసారి ఫ్లిప్‌కార్ట్ ప్రత్యేకమైన స్మార్ట్ఫోన్ల ద్వారా వినియోగదారులను ఆకర్షిస్తుండగా, కాస్త ఖరీదైన సెల్ఫోన్ల ద్వారా అమెజాన్ వినియోగదారులను ఎక్కువగా ఆకర్షిస్తోంది. ఏది ఏమైనా పది నుంచి పదిహేను వేల రూపాయల మధ్యనుండే ఫోన్లే ఈ సారి ఎక్కువగా అమ్ముడుపోయే అవకాశం ఉందని వివిధ సంస్థలకు చెందిన సీనియర్ అనలిస్టులు అంచనా వేస్తున్నారు. దేశీయంగా అతిపెద్ద ఆన్లైన్ సంస్థగా ఎదిగిన ‘ఫ్లిప్‌కార్ట్’ ఈ ఆరు రోజుల్లో వందకోట్ల డాలర్లకు పైగా వ్యాపారం చేయనున్నట్లు అంచనాలు తెలియజేస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్ సంస్థ దేశవ్యాప్తంగా 66 సెంట్రల్ హబ్స్‌తో కోటి చదరపు అడుగుల గిడ్డంగి సౌకర్యాలను కలిగి ఉంది. దేశవ్యాప్తంగా 900 డెలివరి కేంద్రాలను ఏర్పాటు చేసుకుంది. ఈ ఒక్క పండగ సీజన్ కోసమే 30వేల మంది ఉద్యోగులను అదనంగా తీసుకుంది. వారికి తగిన శిక్షణ కూడా ఇచ్చింది. మారుమూల ప్రాంతాల్లోని కిరాణ కొట్ల వరకు నెట్‌వర్క్‌ను విస్తరించింది. అమెరికాకు చెందిన అమెజాన్ సంస్థ ఇందులో దేనికీ తీసిపోదు. దేశవ్యాప్తంగా 13 రాష్ట్రాల్లో 50 సెంట్రల్ హబ్‌లున్నాయి. వాటì కి రెండు కోట్ల క్యూబిక్ అడుగుల గిడ్డంగులు ఉన్నాయి. 17 రాష్ట్రాల్లో 30 సార్టింగ్ సెంట్రల్ ఉన్నాయి. రెండు వేల ఔట్లెట్లు ఉన్నాయి. ప్రతి రోజు దేశంలోని 500 నగరాలను సందర్శించే 1500 ట్రక్కులు ఉన్నాయి. వినియోగదారులకు సకాలంలో కోరుకున్న సరకును అందించడం కోసం ఈ రెండు సంస్థలు సాంకేతిక రంగంలో కూడా పరస్పరం పోటీ పడుతున్నాయి. ఫ్లిప్‌కార్ట్ గతేడాదే ‘ఎఫ్క్విక్’ యాప్‌ను కొత్తగా తీసుకొచ్చింది. ఈసారి పది శాతం అమ్మకాలు ఈ యాప్ ద్వారానే కొనసాగుతాయని అంచనా వేస్తోంది. అమెజాన్ ఇండియా ‘ఐ హావ్ స్పేస్’ పేరిట 2015 నుంచే ఇలాంటి కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. భారత్‌లోని భిన్న నైసర్గిక స్వరూపాలు, సంస్కృతులు, భాషలు, భిన్న ఆదాయ వర్గాలు, వారి మనస్తత్వాలను దృష్టిలో పెట్టుకొని అన్ని వర్గాల ప్రజల కోసం తాము వ్యాపారాన్ని నిర్వహించాల్సి వస్తోందని ఫ్లిప్‌కార్ట్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ కృష్ణ రాఘవన్ తెలిపారు. అమెరికా సంస్థ వాల్‌మార్ట్ మద్దతు కలిగిన ఫ్లిప్‌కార్ట్ ఈ ఏడాది ఆన్లైన్ మార్కెట్లో 3,463 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టగా, అమెజాన్ ఇండియా సంస్థ గత ఆగస్టు నెలలో 2,700 కోట్ల రూపాయల పెట్టుబడులను పెట్టింది. భారత్‌లో ఐదేళ్ల కాలంలో ఐదువందల కోట్ల డాలర్లను పెట్టుబడిగా పెట్టాలనే అమెరికా కంపెనీ కార్యాలయం స్కీమ్‌కు అదనం ఈ పెట్టుబడులు. -
స్నాప్‌డీల్ మరోవిడత ఫెస్టివల్ సేల్స్
• రేపటి నుంచి మూడు రోజులు • ఎస్బీఐ కార్డులపై 10 శాతం తగ్గింపు న్యూఢిల్లీ: ప్రముఖ ఈ కామర్స్ సంస్థ స్నాప్‌డీల్ ఈ నెల 12 నుంచి 14 వరకు మరోసారి పండుగ విక్రయాలను నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. ప్రత్యర్థి సంస్థలు ఫ్లిప్‌కార్ట్, అమేజాన్‌లకు దీటుగా స్నాప్‌డీల్ ‘అన్‌బాక్స్ దివాళీ’ పేరుతో ఈ నెల 2-6 తేదీల మధ్య పండుగ తగ్గింపు విక్రయాలను చేపట్టింది. ఈ సందర్భంగా 11 మిలియన్ల ఉత్పత్తులను విక్రయించినట్టు ప్రకటించింది. భారీ స్పందనకుతోడు పండుగ వాతావరణంలో నేపథ్యంలో మరోసారి పెద్ద ఎత్తున విక్రయాలకు ముందుకు వచ్చింది. ఈ నెల 12-14 తేదీల మధ్య కొనుగోళ్లకు ఎస్బీఐ కార్డుల ద్వారా చెల్లింపులు చేయడం ద్వారా 10 శాతం ఇన్స్టంట్ తగ్గింపు పొందవచ్చని సంస్థ తెలిపింది. అలాగే, ఐఫోన్7, ఐఫోప్7 ప్లస్ మోడళ్లను అమెరికన్ ఎక్స్‌ప్రెస్ కార్డుల ద్వారా కొనుగోలు చేసే వారికి రూ.10వేలు తగ్గింపును ఆఫర్ చేస్తోంది. కాగా, ఫ్లిప్‌కార్ట్, అమేజాన్ సంస్థలు సైతం దిపావళి పండుగ లోపు మరోసారి తగ్గింపు విక్రయాలు చేపట్టే అవకాశాలున్నాయని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.