దసరా పండుగ సీజన్ పురస్కరించుకొని అమెజాన్, ఫ్లిప్ కార్ట్, స్నాప్ డీల్ వంటి ప్రముఖ ఈ కామర్స్ సంస్థలు భారీగా ఆఫర్ల కురిపించిన సంగతి తెలిసిందే. దీంతో చాలా మంది స్పెషల్ డిస్కౌంట్ సమయాల్లో ఈ-కామర్స్ అమ్మకాల్లో పాల్గొంటున్నారు. అయితే, ఈ సారి ఎక్కువగా డిమాండ్ టైర్ 3 నగరాల నుంచి రావడం విశేషం. ధన్ బాద్, కరీంనగర్, వరంగల్, గోరఖ్ పూర్, చిత్తూరు, కర్నూలు, గుంటూరు, వైజాగ్ వంటి నగరాల నుంచి భారీగా ఆర్డర్లు వచ్చినట్లు ఈ-కామర్స్ సంస్థలు పేర్కొన్నాయి.
దేశీయ ఆర్ధిక వ్యవస్థ తిరిగి పుంజుకున్నట్లు మార్కెట్ నిపుణులు తెలుపుతున్నారు. షాపింగ్ పోర్టల్స్ అమ్మకాల సమయంలో దాదాపు సగం ఆర్డర్లు టైర్-3 నగరాలు వచ్చాయి. టెలివిజన్, ల్యాప్ టాప్ వంటి ఎలక్ట్రానిక్స్ కేటగిరీలో ఎక్కువగా అమ్ముడయ్యాయి. షాపింగ్ చేసిన ప్రతి ఐదుగురు కస్టమర్లలో ఒకరు స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేశారు. ఫెస్టివల్ సేల్ ప్రారంభమైన మొదటి కొన్ని రోజులు పాట్నా, లక్నో, వైజాగ్ వంటి నగరాలు ఇతర మెట్రో నగరాలతో పోటీ పడ్డాయి. రాను రాను అన్ని ఆర్డర్లలో దాదాపు సగానికి మించి టైర్-3 నగరాలు నుంచి వచ్చాయి. "మొబైల్స్, ఎలక్ట్రానిక్స్, జీవనశైలి, సాధారణ మర్కండైజింగ్, ఇంటి వంటి కేటగిరీలు అత్యధిక డిమాండ్ కలిగి ఉన్నాయి" అని ఫ్లిప్ కార్ట్ ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. (చదవండి: తెలుగు రాష్ట్రాల్లో అత్యంత మహిళా ధనవంతురాలు ఈమే..!)
Comments
Please login to add a commentAdd a comment