
Amazon Great Indian Festival Sale: మరికొద్ది రోజుల్లో ముగియనున్న దీవాళి ఫెస్టివల్ సేల్ సందర్భంగా ఈ కామర్స్ సంస్థలు ఆఫర్ల జోరును పెంచుతున్నాయి. తాజాగా ఈ ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ ఐఫోన్ 11పై భారీ తగ్గింపు ఆఫర్‌ను ప్రకటించింది.
ఐఫోన్ ధర, ఆఫర్‌లు
ఐఫోన్ 11ఫోన్ ధర రూ.43,999 ఉండగా..అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో పాత స్మార్ట్ ఫోన్‌పై రూ.17,000 ఎక్ఛేంజ్ పొందవచ్చు. దీంతో పాటు ఎస్‌బీఐ కార్డ్ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ. 2,000 డిస్కౌంట్, నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని పొందవచ్చు. అంటే వినియోగదారులు ఈ ఐఫోన్ 11ను రూ.24,999కే సొంతం చేసుకోవచ్చు.
ఐఫోన్ 11 స్పెసిఫికేషన్‌లు
ఐఫోన్ 11 6.1 అంగుళాల లిక్విడ్ రెటినా హెచ్ డీ ఎల్‌సీడీ డిస్‌ప్లే,ఏ13 బయోనిక్ చిప్, లిలోన్ 3110 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ వైర్‌లెస్ ఛార్జింగ్, ఐఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు రెడ్, బ్లూ, బ్లాక్, పర్పుల్, గ్రీన్,వైట్ వేరియంట్‌లలో లభిస్తుంది. ఐఫోన్ 11లో డ్యూయల్ రేర్ కెమెరా సెటప్,12 ఎంపీ ప్రైమరీ లెన్స్, 12ఎంపీ వైడ్ యాంగిల్ లెన్స్, సెల్ఫీల కోసం 12ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇక 4కే, పోట్రేట్, స్లో మోషన్ వీడియోలు తీసేందుకు మరింత ఈజీగా ఉంటుంది. బ్లూటూత్, వైఫై, జీపీఎస్, యూఎస్‌బీ పోర్ట్‌తో వస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment