Diwali sales
-
వాహన అమ్మకాలు అంతంతే..!
ముంబై: పేరుకుపోయిన వాహన నిల్వలను కరిగించే చర్యల్లో భాగంగా డీలర్లకు పంపిణీ తగ్గించడంతో మారుతీ సుజుకీ, హ్యుందాయ్ మోటార్స్ అక్టోబర్ అమ్మకాలు అంతంత మాత్రంగానే నమోదయ్యాయి. మారుతీ సుజుకీ ప్యాసింజర్ వాహనాల దేశీయ అమ్మకాలు క్రితం ఏడాదితో పోలిస్తే 1,68,047 యూనిట్ల నుంచి 1,59,591 యూనిట్లకు తగ్గాయి. అమ్మకాలు 5% క్షీణించాయి. చిన్న కార్ల విభాగంలో ఆల్టో, ఎస్–ప్రెసో విక్రయాలు 14,568 నుంచి 10,687కు తగ్గాయి. కాంపాక్ట్ కార్ల విభాగంలో బాలెనో, సెలెరియో, డిజైర్, ఇగ్నిస్, స్విఫ్ట్, టూర్ ఎస్, వేగనార్, అమ్మకాలు 80,662 నుంచి 65,948 యూనిట్లతో సరిపెట్టుకుంది. అయితే యుటిలిటీ వాహన విభాగంలోని బ్రెజా, గ్రాండ్ విటారా, ఎర్టిగా, ఎక్స్ఎల్6 విక్రయాలు 59,147 నుంచి 70,644కు పెరిగాయి. హ్యుందాయ్ మోటార్ ఇండియా వాహనాల దేశీ పంపిణీ(హోల్‌సేల్) స్వల్పంగా 1 శాతం పుంజుకుని 55,568 వాహనాలకు చేరింది. 2023 అక్టోబర్ నెలలో 55,128 యూనిట్ల విక్రయాలు నమోదయ్యాయి. పండుగ సీజన్లో తమ ఎస్యూవీ కార్లకు మంచి గిరాకీ ఏర్పడిందని కంపెనీ సీవోవో తరుణ్ గార్గ్ తెలిపారు. హ్యుందాయ్ క్రెటా కార్లు 17,497 యూనిట్లతో పాటు ఎస్యూవీ కార్లు 37,902 యూనిట్లు విక్రయించామని, ఒక నెలలో ఇదే గరిష్టం అని అన్నారు. హ్యుందాయ్ కార్లలో 68 శాతం ఎస్‌యూవీలే ఉండటం విశేషమన్నారు. మహీంద్రాఅండ్‌మహీంద్రా ఎస్యూవీ దేశీయ విక్రయాలు 25% పెరిగి 54,504కు చేరాయి. ఈ పండుగ సీజన్లో తొలి 60 నిమిషాల్లో 5–డోర్ ఆఫ్ రోడ్ ఎస్యూవీ థార్ రాక్స్ 1.7 లక్షల బుకింగ్స్ అయ్యాయి. టాటా మోటార్స్ ప్యాసింజర్ వెహికల్స్ దేశీ విక్రయాలు 48,337 నుంచి 48,131కు తగ్గాయి. టయోటా కిర్లోస్కర్ అమ్మకాలు 20,542 నుంచి 37% పెరిగి 28,138కు చేరా యి. జేఎస్‌డబ్ల్యూ ఎంజీ మోటార్స్ అమ్మకాలు 31% పెరిగి 7,045 యూనిట్లకు చేరాయి. ఆల్‌టైం గరిష్టానికి మారుతీ సేల్స్... మారుతీ సుజుకీ మొత్తం విక్రయాలు(ఎగుమతులతో కలిపి) అక్టోబర్‌లో రికార్డు గరిష్టానికి చేరాయి. టోకు విక్రయాలు గత నెలలో 2,06,434 యూనిట్లుగా నమోదయ్యాయి. కంపెనీ నెలవారీ విక్రయాల్లో ఇవే ఇప్పటివరకు అత్యధికం. క్రితం ఏడాది ఇదే అక్టోబర్‌లో 1,99,217 యూనిట్లను డీలర్లకు సరఫరా చేసింది. -
ఖరీదైన గూగుల్ పిక్సెల్ ఫోన్ సగం ధరకే!
ఖరీదైన స్మార్ట్‌ఫోన్‌ను భారీ తగ్గింపుతో కొనాలనుకుంటే ఇదే సరైన సమయం. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్ ప్రస్తుతం బిగ్ దీవాళి సేల్ పేరుతో ఆఫర్లు అందిస్తోంది. ఇందులో భాగంగా గూగుల్ కంపెనీకి చెందిన పిక్సెల్ 8 (Google Pixel 8) ఫోన్‌పై భారీ తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది.గూగుల్ పిక్సెల్ 8 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 82,999 కాగా ఫ్లిప్‌కార్ట్ సేల్‌లో ఈ ఫోన్‌ను రూ. 42,999కే సొంతం చేసుకోవచ్చు. అంతేకాకుండా ఎస్బీఐ కార్డుతో కొనుగోలు చేస్తే అదనంగా 10 శాతం డిస్కౌంట్ లభిస్తుంది. అలా గూగుల్ పిక్సెల్ 8 ఫోన్‌ను రూ. 36,499కే సొంతం చేసుకోవచ్చు. మరోవైపు ఈ ఫోన్‌పై ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా అందిస్తున్నారు. మీ పాత ఫోన్ ఇస్తే దాని కండిషన్ ఆధారంగా రూ. 42,500 వరకు తగ్గింపు పొందొచ్చు.గూగుల్ పిక్సెల్ 8 ఫీచర్లు ఈ ఫోన్లో 6.2 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే అందించారు. 90హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో ఫుల్హెచ్డీ ప్లస్ రిజల్యూషన్ ఈ స్క్రీన్ సొంతం. Titan M2 సెక్యూరిటీ చిప్‌తో వచ్చిన ఈ ఫోన్లో ప్రాసెసర్ కోసం T3 చిప్సెట్ ఇచ్చారు. ఇక కెమెరా విషయానికొస్తే 50 మెగాపిక్సెల్స్, 12 మెగాపిక్సెల్స్ డ్యూయల్ రియిర్ కెమెరా సెటప్ ఉంది. అలాగే సెల్పీలు, వీడియో కాల్స్ కోసం 10.5 మెగాపిక్సెల్స్ ఫ్రంట్ కెమెరా ఇచ్చారు. బ్యాటరీ సంగతికొస్తే ఈ ఫోన్లో 27 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4575 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు. -
బిగ్ డీల్స్: రూ.15 వేల కంటే తక్కువకే బెస్ట్ 5జీ ఫోన్లు!
దేశవ్యాప్తంగా 5జీ నెట్వర్క్ విస్తృతం అవుతున్న నేపథ్యంలో చాలా మంది 5జీ ఫోన్లు కావాలని కోరుకుంటున్నారు. అయితే ఎక్కువ ధర కారణంగా కొనలేకపోతున్నారు. అలాంటి వారికి ఇదే మంచి సమయం. ప్రముఖ ఈ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దీపావళి సేల్ (Flipkart Big Diwali Sale) ప్రారంభమైంది. ఈ ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో 5జీ ఫోన్లపై అద్భుతమైన డీల్స్ అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ బ్రాండ్ల 5జీ ఫోన్లు చాలా తక్కువ ధరకే లభిస్తున్నాయి. శాంసంగ్, ఐకూ, పోకో వంటి ప్రముఖ బ్రాండ్లకు చెందిన రూ. 15,000లోపు లభించే టాప్ మూడు 5జీ ఫోన్ డీల్స్ గురించి ఇక్కడ తెలియజేస్తున్నాం. శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ (Samsung Galaxy M14 5G), శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 (Samsung Galaxy F14) రెండూ ఒకే విధమైన స్పెసిఫికేషన్లను అందిస్తాయి. M సిరీస్ వెర్షన్లో అదనంగా 2-మెగాపిక్సెల్ రియర్ కెమెరా ఉంటుంది. రెండెంటిలోనూ ఒకే విధమైన పర్ఫార్మెన్స్ ఉంటుంది. రెండు ఫోన్లూ 6000 mAh బ్యాటరీతో వస్తాయి. అయితే వీటికి ఛార్జర్ రాదు. ప్రత్యేకంగా కొనుక్కోవాల్సి ఉంటుంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో శాంసంగ్ గెలాక్సీ ఎం14 5జీ ఫోన్ రూ. 11,967కి అందుబాటులో ఉండగా, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్14 ధర రూ.11,490 ఉంది. ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌లతో కొటే అదనంగా 10 శాతం తగ్గింపు ఉంటుంది. ఐకూ జెడ్6 లైట్ 5జీ ఐకూ జెడ్6 లైట్ 5జీ (iQOO Z6 Lite 5G) అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ 5జీ ఫోన్. దీని ధర రూ. 13,989. స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 1 చిప్సెట్తో వచ్చే ఈ ఫోన్ రోజువారీ ఉపయోగం, సాధారణ గేమింగ్ కోసం మంచి పనితీరును అందిస్తుంది. 120Hz స్క్రీన్ ఉన్న ఈ ఫోన్ మెరుగైన గేమింగ్, మీడియా వినియోగ అనుభవాన్ని అందిస్తుంది. పోకో ఎం6 ప్రో 5జీ రూ. 10 వేల లోపు సెగ్మెంట్లో వచ్చే పోకో ఎం6 ప్రో 5జీ (Poco M6 Pro 5G) రోజువారీ వినియోగం, సాధారణ గేమింగ్ కోసం స్నాప్‌డ్రాగన్ 4 జెన్ 2 చిప్‌సెట్‌ను అందిస్తుంది. 5,000mAh బ్యాటరీ, 18W ఛార్జింగ్ సపోర్ట్‌తో సుదీర్ఘ బ్యాటరీ లైఫ్‌ను ఆశించవచ్చు. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్‌లో ఇది ధర రూ. 9,999లకే లభిస్తోంది. -
ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాలీ సేల్: కస్టమర్లకు మరో గుడ్ న్యూస్
సాక్షి, ముంబై: ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్కు సంబంధించి కొత్త డేట్స్‌ను ప్రకటించింది. తొలి దశ ఆఫర్లు అక్టోబర్ 16తో ముగియడంతో వినియోగ దారుల కోసం తాజా తేదీలను వెల్లడించింది. తద్వారా తన కస్టమర్లలో దివాలీ జోష్ నింపింది. ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దీపావళి సేల్ అక్టోబర్ 19న తిరిగి ప్రారంభమై అక్టోబర్ 23 వరకు కొనసాగుతుంది. తాజా సెకండ్ సేల్‌లో కూడా వివిధ స్మార్ట్ఫోన్లు, ఉపకరణాలు, ఎలక్ట్రానిక్స్, ఉపకరణాల తదితరాలపై భారీ డీల్స్ అందిస్తోంది. అలాగే ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యుల కోసం ఈ సేల్ అక్టోబర్ 18 అర్ధరాత్రి సేల్ అందుబాటులో ఉంటుంది. అలాగే స్మార్ట్ఫోన్లపై ఎస్బీఐ క్రెడిట్ కార్డ్ ఆఫర్లతోపాటు, ఫ్లిప్‌కార్ట్ 10 శాతం తక్షణ తగ్గింపును అందిస్తోంది. ఇంకా పేటీఎం వాలెట్, యూపీఐ లావాదేవీలపై ఫ్లిప్‌కార్ట్ 10 శాతం తక్షణ క్యాష్‌బ్యాక్ అందిస్తోంది. ముఖ్యంగా యాపిల్ ఐఫోన్, శాంసంగ్, రియల్మీ, పోకో, ఒప్పో, వివో, షావోమీ, మోటరోలా, గూగుల్, ఇన్ఫినిక్స్, మైక్రోమ్యాక్స్, లావా వంటిపై తగ్గింపు లభ్యం. ఇంకా గేమింగ్ ల్యాప్‌టాప్‌లు , పెన్ డ్రైవ్‌లు మరియు హార్డ్ డ్రైవ్‌లు వంటి డేటా స్టోరేజ్ పరికరాలపై కూడా తగ్గింపును పొందవచ్చు. దీంతోపాటు ఫ్లిప్‌కార్ట్ ఎలక్ట్రానిక్స్, స్మార్ట్‌ఫోన్ బ్యాక్ కవర్లు, కేసులు, స్క్రీన్ గార్డ్లు వంటి ఉపకరణాలపై 80 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. 4K అల్ట్రా HD స్మార్ట్‌టీవీలు, వాషింగ్ మెషీన్లు, ఏసీలు సహా,టీవీలు, ఉపకరణాలపై 75 శాతం వరకు తగ్గింపును అందిస్తోంది. -
అమెజాన్ దివాలీ సేల్: శాంసంగ్ 5జీ ఫోన్‌పై 40 వేల తగ్గింపు
సాక్షి, ముంబై: అన్లైన్ దిగ్గజం అమెజాన్ దీపావళి సేల్ ఈవెంట్లో స్మార్ట్ఫోన్లపై భారీ తగ్గింపును అందిస్తోంది. ముఖ్యంగా దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ మేకర్ శాంసంగ్‌కు చెందిన గెలాక్సీ సిరీస్‌లోని గెలాక్సీ ఎస్22 అల్ట్రా 5జీ స్మార్ట్‌ఫోన్ కొనుగోలుపై అమెజాన్ భారీ డిస్కౌంట్ అందిస్తోంది. దీంతో పాటు ఇతర శాంసంగ్ గెలాక్సీ ఇతరఫోన్లపై ఆఫర్లను అందిస్తోంది. గెలాక్సీ ఎస్22 5జీ 12జీబీ ర్యామ్, 256 జీబీ స్టోరేజీ వేరియంట్‌ను అమెజాన్ సేల్‌లో రూ. 32 వేల తగ్గింపుతో రూ.99,999కే అందిస్తోంది. దీని ఎంఆర్పీ ధర రూ. 1,31,999. దీనికి తోడు రూ. 13300 ఎక్స్ఛేంజ్ ఆఫర్ కూడా ఉంది. అంతేకాదు అమెజాన్ అన్ని బ్యాంక్ కార్డ్‌ల కొనుగోళ్లపై రూ. 50వేల కంటే ఎక్కువ కొనుగోలు చేసిన వినియోగదారులకు రూ. 8,000 ఫ్లాట్ ఇన్స్టంట్ డిస్కౌంట్‌ను కూడా అందిస్తోంది. ఈ రెండు ఆఫర్లతో 40 వేల రూపాయల తగ్గింపుతో ఈ ఫోన్‌ను సొంతం చేసుకోవచ్చు. శాంసంగ్ గెలాక్సీ ఎస్22 అల్ట్రా ఫీచర్లు 6.8 అంగుళాల AMOLED స్క్రీన్ క్వాల్కం స్నాప్‌డ్రాగన్ 8 జెన్1 ప్రాసెసర్ 40 ఎంపీ సెల్ఫీ కెమెరా 108+12+12 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా 5000 mAh బ్యాటరీ -
పండుగ విక్రయాలపై భారీ ఆశలు
న్యూఢిల్లీ: గృహోపకరణాలు, కన్జ్యూమర్ డ్యూరబుల్స్ కంపెనీలు ఈ విడత పండుగల విక్రయాలపై మంచి సానుకూల అంచనాలతో ఉన్నాయి. దీపావళి వరకు కొనసాగే పండుగల కాలంలో విక్రయాలు క్రితం ఏడాది ఇదే కాలంతో పోల్చినప్పుడు 35 శాతం మేర పెరుగుతాయని లెక్కలు వేసుకుంటున్నాయి. ప్రీమియం ఉత్పత్తులకు డిమాండ్ పెరగడాన్ని సానుకూలంగా చూస్తున్నాయి. అయితే, కొన్ని కంపెనీలు మాత్రం అప్రమత్త ధోరణితో ఉన్నాయి. ప్యానాసోనిక్, ఎల్జీ సోనీ, శామ్సంగ్, హయ్యర్, గోద్రేజ్ అప్లయన్సెస్, వోల్టాస్, థామ్సన్, బీఎస్‌హెచ్ హోమ్ అప్లయన్సెస్ క్రితం ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది విక్రయాలపై మంచి ఆశలే పెట్టుకున్నాయి. క్రితం ఏడాది విక్రయాలపై కరెనా రెండో విడత తదనంతర పరిణామాలు ప్రభావం చూపించడం గమనార్హం. కంపెనీల ఏడాది పాటు విక్రయాల్లో 35 శాతం వరకు ఓనమ్ నుంచి దీపావళి మధ్యే నమోదవుతుంటాయి. ఈ విడత పండుగల సీజన్లో రూ.75,000 కోట్ల విక్రయాలు నమోదు కావచ్చని పరిశ్రమ అంచనా వేస్తోంది. పథకాలు, ఆఫర్లు.. పండుగల సమయాల్లో విక్రయాలు పెంచుకునేందుకు అప్లయన్సెస్ కంపెనీలు మంచి ఆఫర్లతో ముందుకు వస్తున్నాయి. సాధారణ రోజులతో పోలిస్తే ఎక్కువ కాలం పాటు వారంటీ, సులభంగా చెల్లించే ఈఎంఐ పథకాలను ఆఫర్ చేస్తున్నాయి. చిన్న పట్టణాల నుంచి ఆరంభ స్థాయి మాస్ ఉత్పత్తుల విక్రయాల విషయంలో కంపెనీలు కొంత ఆందోళనతోఉన్నాయి. ఎందుకంటే ఇంకా చిన్న పట్టణాల్లో విచక్షణారహిత వినియోగం పుంజుకోలేదు. అలాగే, దేశవ్యాప్తంగా కొన్ని ప్రాంతాల్లో వర్షపాత లోటు నెలకొనడం, ఉత్పత్తుల ధరలను 7–8 శాతం మేర పెంచడం విక్రయాలపై ప్రభావం చూపుతుందా? అని కంపెనీలు సందేహంతో ఉన్నాయి. బెడిసి కొట్టదుగా..? ‘‘వర్షపాతం దేశవ్యాప్తంగా ఎలా నమోదైందన్నది వినియోగదారుల సెంటిమెంట్‌పై ప్రభావం చూపిస్తుంది. ప్రీమియం ఉత్పత్తుల విభాగం ఎప్పటి మాదిరే మంచి వృద్ధిని చూస్తోంది. కానీ, మాస్ (తక్కువ, మధ్య స్థాయి) ఉత్పత్తుల అమ్మకాలపైనే మాలో ఆందోళన ఉంది’’అని గోద్రేజ్ అప్లయన్సెస్ బిజినెస్ హెడ్ కమల్ నంది తెలిపారు. ఈ పండుగల సీజన్లో స్మార్ట్ ఏసీలు, పెద్ద సైజు తెరల టీవీలు, గృహోపరణాలు డబుల్ డిజిట్ విక్రయాలను నమోదు చేస్తాయని అంచనా వేస్తున్నట్టు ప్యానాసోనిక్ లైఫ్ సొల్యూషన్స్ ఇండియా చైర్మన్ మనీష్ శర్మ పేర్కొన్నారు. వినియోగదారులు నేడు తమ ఎంపికల విషయంలో స్పృహతో వ్యవహరిస్తున్నట్టు చెప్పారు. వినియోగ డిమాండ్ పుంజుకుంటుందని, పండుగల విక్రయాలు పెరుగుతాయని భావిస్తున్నట్టు కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్ అండ్ అప్లయన్సెస్ తయారీదారుల సంఘం ప్రెసిడెంట్ ఎరిక్ బ్రగంజ తెలిపారు. పండుగల విక్రయాలు ఇప్పటికే జోరుగా సాగుతున్నట్టు సోనీ ఇండియా ఎండీ సునీల్ నాయర్ వెల్లడించారు. ఎల్జీ ఇండియా పండుగల డిమాండ్‌కు అనుకూలంగా మలుచుకుని, విక్రయాలు పెంచుకునేందుకు కొన్ని కొత్త ఉత్పత్తులను విడుదల చేసింది. కరోనా ముందుకంటే అధిక విక్రయాలను నమోదు చేస్తామన్న నమ్మకాన్ని ఎల్జీ ఇండియా వైస్ ప్రెసిడెంట్ దీపక్ బన్సాల్ వ్యక్తం చేశారు. పండుగల విక్రయాలు ఓనమ్, వినాయక చవితి సందర్భంగా సానుకూలంగా ఉన్నట్టు శామ్సంగ్ ఇండియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ మోహన్‌దీప్ సింగ్ తెలిపారు. 55 అంగుళాలు అంతకుమించి సైజు టీవీలు, 300కు పైగా లీటర్ల సామర్థ్యం ఉన్న రిఫ్రిజిరేటర్లు, 8కేజీలు, అంతకంటే పెద్ద వాషింగ్ మెషిన్లకు డిమాండ్ ఉన్నట్టు చెప్పారు. -
వన్‌ప్లస్ దివాలీ సేల్.. కళ్లు చెదిరే డీల్స్
సాక్షి,ముంబై: ఫెస్టివ్ సీజన్లో కస్టమర్లను ఆఫర్ల వర్షం రారమ్మని పిలుస్తోంది. ఇప్పటికే ఈ-కామర్స్ దిగ్గజాలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ సెప్టెంబర్ 23 నుంచి డిస్కౌంట్‌సేల్‌కు తెరలేవనుంది. మరోవైపు చైనీస్ స్మార్ట్‌ఫోన్ మొబైల్ దిగ్గజం వన్‌ప్లస్ అధికారిక వెబ్సైట్లో సెప్టెంబర్ 22 నుంచి దివాలీ సేల్‌ను ప్రారంభిస్తోంది. స్మార్ట్ఫోన్లు, టీవీఎస్ ఇయర్‌బడ్‌లు, టీవీలు, మరిన్నింటిపై డిస్కౌంట్లులభ్యం. అదనంగా, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ డెబిట్ కార్డ్ హోల్డర్లు 6వేల వరకు తక్షణ తగ్గింపును పొందగలరు. 12 నెలల వరకు నో-కాస్ట్ EMI ఆప్షన్‌కూడా అందిస్తోంది. అంతేకాకుండా, దీపావళి హెడ్ స్టార్ట్ సేల్ 2022 వన్‌ప్లస్ ఉత్పత్తుల కోసం రెడ్ కేబుల్ క్లబ్ సభ్యులకు ప్రత్యేక కూపన్లను కూడా అందిస్తుంది. అలాగే వన్‌ప్లస్ ఇండియా వెబ్సైట్లో ప్రస్తుతం ఫ్లిప్ అండ్ విన్ ఛాలెంజ్ కూడా ఉంది. ఈ సేల్‌లో ముఖ్యంగా వన్‌ప్లస్ 10 ప్రొను రూ 55,999 కి విక్రయిస్తోంది. దీని లాంచింగ్ ధర రూ 66,999. అంటే రూ 11,000 డిస్కౌంట్ ధరతో అందిస్తోంది. బ్యాంక్ ఆఫర్‌తో పాటు డిస్కౌంట్లతో కలిపి ఈ మొత్తం తగ్గింపును కంపెనీ ఆఫర్ చేస్తోంది. అలాగే వన్‌ప్లస్ 10ఆర్ 5జీ 29,999లకే అందించనుంది. ఎంఆర్పీ ధర 34,999. అలాగే వన్‌ప్లస్ నార్డ్ 2టీ 5జీ ఫోన్నరెండవేల తగ్గింపుతో రూ. 26,999కే విక్రయించ నుంది. దీంతోపాటు ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో స్మార్ట్ఫోన్లు, అలాగే టీవీలు ఇతర ఉత్పత్తులను మరింత తక్కువ ధరకు సొంతం చేసుకోవచ్చు. సెప్టెంబర్ 22 నుంచి ఈ ఆఫర్లు అందుబాటులో ఉంటాయి. -
CAIT Diwali sales: దేశీ తడాఖా.. చైనాకు రూ.50 వేల కోట్ల నష్టం!
సరిహద్దు వివాదాలు చైనాకు చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. ఆశించినంత వేగంగా కాకపోయినా క్రమంగా చైనా ఉత్పత్తుల పట్ల వ్యతిరేకత మొదలవుతోంది. దీపావళి సందర్భంగా జరిగిన అమ్మకాలే అందుకు సాక్ష్యంగా నిలుస్తున్నాయి. పదేళ్ల రికార్డు బ్రేక్ దీపావళి పండగ వెలుగులు పంచింది. వ్యాపారుల గల్లా పెట్టెని గలగలమనిపించింది. పదేళ్లలో ఎన్నడూ లేని స్థాయిలో ఈ సారి వ్యాపారం పుంజుకుంది. ది కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (కైట్) జారీ చేసిన గణాంకాల ప్రకారం దీపావళి పండగ సందర్భంగా దేశవ్యాప్తంగా 1.25 లక్షల కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. గడిచిన పదేళ్లలో ఈ స్థాయిలో బిజినెస్ ఎన్నడూ జరగలేదు. రిఫ్రెష్ అయ్యారు ఏడాదిన్నర కాలంగా కరోనా భయం వెంటాడుతుండటంతో ప్రజలంతా ఎక్కువగా ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రస్తుతం కరోనా భయాలు తొలగిపోతుండటం, త్వరలోనే పెళ్లిల సీజన్ మొదలవుతుండటంతో జనం షాపింగ్‌కు మొగ్గు చూపారు ఫలితంగా రికార్డు స్థాయిలో అమ్మకాలు జరిగాయి. కరోనా ఒత్తిడి నుంచి జనాలు రిఫ్రెష్మెంట్ కోరుకున్నారని, దాని ఫలితమే ఈ స్థాయి అమ్మకాలు అని కైట్ అంటోంది. Wow - a very happy #Diwali indeed! #Retail Diwali sales notched a record Rs1.25L crore - a 10 yr high per #CAIT. Shoppers gorged on sweets, dry fruits besides buying diyas, candles, watches, toys, clothing, home decor & of course Gold jewelry. Even #online sales were up ~24% YoY. pic.twitter.com/uRzeKnamJj — Sachchidanand Shukla (@shuklasach) November 6, 2021 ఢిల్లీలోనే రూ. 25 వేల కోట్లు దీపావళికి జరిగిన అమ్మకాల్లో ఆన్లైన్ ద్వారా సుమారు 32 వేల కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. ఇక బంగారం, వెండి ఆభరణాలకు సంబంధించి రూ. 9,000 కోట్ల రూపాయల బిజినెస్ కంప్లీట్ అయ్యింది. దీపావళి బిజినెస్‌కి సంబంధించి ఒక్క ఢిల్లీలోనే ఏకంగా రూ 25,000 కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. దీపావళి అమ్మకాలకు సంబంధించి డ్రై ఫ్రూట్స్, స్వీట్స్, హోం డెకార్, ఫుట్‌వేర్, టాయ్స్, వాచెస్‌ల విభాగంలో భారీగా అమ్మకాలు జరిగాయని కైట్ అంటోంది. చైనాకు షాక్ ది కాన్ఫడరేషన్ ఆఫ్ ఆలిండియా ట్రేడర్స్ (కైట్) దేశంలో 7 కోట్ల మంది వర్తకులకు ప్రాతినిధ్యం వహిస్తోంది. కైట్ జాతీయ అధ్యక్షుడిగా భార్తీయా, జనరల్ సెక్రటరీ ప్రవీణ్ ఖండేల్ వాల్లు కొనసాగుతున్నారను. వీరిద్దరు చెప్పిన వివరాల ప్రకారం.. ఈసారి దీపావళి సందర్భంగా మట్టి ప్రమిదలను, పేపర్ వస్తువులను కొనేందుకు జనం ఎక్కువ ఆసక్తి చూపించారు. చైనా వస్తువులు కొనడం కంటే దేశీయంగా స్థానికులు తయారు చేసిన వస్తువులు కొనేందుకే మొగ్గు చూపారు. ఫలితంగా చైనా మేడ్ దీపాలు, ఎలక్ట్రిక్ లైట్లకు గిరాకీ పడిపోయింది. ఇక బాణాసంచా విషయంలోనూ ఈ తేడా కనిపించింది. మొత్తంగా దీపావళి వ్యాపారానికి సంబంధించి రూ. 50 వేల కోట్ల వరకు చైనా ఉత్పత్తులకు నష్టం వాటిల్లింది. చైనా వస్తువులు దేశంలోని దిగుమతి చేసుకున్న వ్యాపారులకు ఈసారి నష్టాలు తప్పేలా లేవు. -
స్మార్ట్ ఫోన్‌పై అమెజాన్ బంపర్ ఆఫర్, ఈఎంఐ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే..!
దీపావళి ఫెస్టివల్ సందర్భంగా ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. చైనా స్మార్ట్ సంస్థకు చెందిన బడ్జెట్ ఫోన్ రెడ్మీ 9 పవర్ పై భారీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. రెడ్మీ 9 పవర్ ఫీచర్లు రెడ్మీ 9 పవర్ ఫీచర్ల విషయానికొస్తే 6.53 అంగుళాల హెచ్డీ ప్లస్ మల్టీ టచ్ కెపాసిటేటివ్ టచ్‌స్క్రీన్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్, 4జీబీ ర్యామ్, 128 GB ఇంటర్నల్ మెమరీ 512 GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక రెడ్ మీ 9లో ఉన్న కెమెరా ఫీచర్లు చూసుకుంటే 48ఎంపీ క్వాడ్ రేర్ కెమెరా, అల్ట్రా వైడ్, మ్యాక్రోమోడ్ , పోట్రేట్ ,ఏఐ సీన్ రికగ్నైజేషన్, నైట్ మోడ్, హెచ్డీఆర్,ప్రో మోడ్, 8ఎంపీ ఫ్రంట్ కెమెరా,2340 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 19.5:9 యాస్పెక్ట్ రేషియో, డ్యూయల్ సిమ్ ప్లస్ డెడికేటెడ్ ఎస్ డీ కార్డ్ స్లాట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 662 ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో ఆండ్రాయిడ్ వీ10 ఆపరేటింగ్ సిస్టమ్ కి సపోర్ట్ చేస్తుంది. వీటితో పాటు హ్యాండ్స్ ఫ్రీ సంగీతం ఎంజాయ్ చేయడమే కాకుండా అలెక్సా నుంచే నేరుగా డయల్ చేయొచ్చు. రెడ్మీ 9 పవర్ ధర రెడ్మీ 9 పవర్ వాస్తవ ధర రూ.13,999. రూ.2500 డిస్కౌంట్‌తో రూ.11,499కే సొంతం చేసుకోవచ్చు. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ.10,900కే పొందవచ్చు.రూ.541తో ఈఎంఐ ప్రారంభం కాగా..నోకాస్ట్ ఈఎంఐ సౌలభ్యం ఉంది. ఈ ఫోన్ కొనుగోలుపై యూపీఐ ఆఫర్లతో పాటు డిస్కౌంట్లు లభించనున్నాయి. చదవండి: షావోమీ మరో స్మార్ట్ ఫోన్ సిరీస్, ఫీచర్లు లీక్.. అదిరిపోయేలా -
అమెజాన్ అదిరిపోయే ఆఫర్, ఐఫోన్ 11పై భారీ డిస్కౌంట్
Amazon Great Indian Festival Sale: మరికొద్ది రోజుల్లో ముగియనున్న దీవాళి ఫెస్టివల్ సేల్ సందర్భంగా ఈ కామర్స్ సంస్థలు ఆఫర్ల జోరును పెంచుతున్నాయి. తాజాగా ఈ ఫెస్టివల్ సీజన్ సందర్భంగా ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ ఐఫోన్ 11పై భారీ తగ్గింపు ఆఫర్‌ను ప్రకటించింది. ఐఫోన్ ధర, ఆఫర్లు ఐఫోన్ 11ఫోన్ ధర రూ.43,999 ఉండగా..అమెజాన్ గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్‌లో పాత స్మార్ట్ ఫోన్‌పై రూ.17,000 ఎక్ఛేంజ్ పొందవచ్చు. దీంతో పాటు ఎస్బీఐ కార్డ్ స్మార్ట్ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ. 2,000 డిస్కౌంట్, నో కాస్ట్ ఈఎంఐ సదుపాయాన్ని పొందవచ్చు. అంటే వినియోగదారులు ఈ ఐఫోన్ 11ను రూ.24,999కే సొంతం చేసుకోవచ్చు. ఐఫోన్ 11 స్పెసిఫికేషన్లు ఐఫోన్ 11 6.1 అంగుళాల లిక్విడ్ రెటినా హెచ్ డీ ఎల్సీడీ డిస్ప్లే,ఏ13 బయోనిక్ చిప్, లిలోన్ 3110 ఎంఏహెచ్ బ్యాటరీ, ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్, ఐఓఎస్ 15 ఆపరేటింగ్ సిస్టమ్ తో పాటు రెడ్, బ్లూ, బ్లాక్, పర్పుల్, గ్రీన్,వైట్ వేరియంట్లలో లభిస్తుంది. ఐఫోన్ 11లో డ్యూయల్ రేర్ కెమెరా సెటప్,12 ఎంపీ ప్రైమరీ లెన్స్, 12ఎంపీ వైడ్ యాంగిల్ లెన్స్, సెల్ఫీల కోసం 12ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇక 4కే, పోట్రేట్, స్లో మోషన్ వీడియోలు తీసేందుకు మరింత ఈజీగా ఉంటుంది. బ్లూటూత్, వైఫై, జీపీఎస్, యూఎస్బీ పోర్ట్‌తో వస్తుంది. చదవండి: షావోమి అదిరిపోయే ఆఫర్..సగానికి సగం ధరకే ఫోన్లు -
మరికొన్ని గంటలే: షావోమి అదిరిపోయే ఆఫర్..సగానికి సగం ధరకే ఫోన్లు
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ బంపర్ ఆఫర్లు ప్రకటించింది. పలు బ్రాండెడ్ ఫోన్లను ఎక్ఛేంజ్ ఆఫర్‌తో సగానికి పైగా తక్కువ ధరకే లభించేలా ఆఫర్లు అమలు చేస్తోంది. సుమారు రూ.40వేల ఖరీదైన ఎంఐ 11ఎక్స్ ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ 8జీబీ ర్యామ్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్‌పై అన్ని రకాల రాయితీలు వర్తిస్తే కేవలం రూ. 12, 849కే సొంతం చేసుకోవచ్చు. ఎంఐ 11ఎక్స్ ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు 6.67 అంగుళాల ఫుల్ హెచ్ హెచ్డీ అమోలెడ్ డిస్ప్లే 4,520ఎంఏహెచ్ బ్యాటరీ,క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్, ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంకి సపోర్ట్ చేస్తుంది. ఈ ఫోన్లో ట్రిపుల్ రేర్ కెమెరా సెటప్, 108 మెగాపిక్సెల్ శాంసంగ్ హెచ్ఎం2 సెన్సార్, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ సెన్సార్లు ఉండగా ..కెమెరా వెనుక భాగంలో ఉన్న 3కెమెరాలకు 5 మెగాపిక్సెల్ మ్యాక్రో షూటర్లు ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఎంఐ 11ఎక్స్ ప్రో స్మార్ట్‌ఫోన్‌ను సెలెస్టియల్ సిల్వర్, కాస్మిక్ బ్లాక్, లూనార్ వైట్ కలర్స్‌తో అమెజాన్‌లో అందుబాటులో ఉన్న ఫోన్‌పై ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ఆఫర్లు ఇలా ఉన్నాయి దేశంలో ఫెస్టివల్ సీజన్లో ఈకామర్స్ కంపెనీ అమెజాన్ 'గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్' పేరుతో భారీ ఆఫర్లను అందిస్తుంది. ఇందులో భాగంగా షావోమీ ఇండియా 8జీబీ ర్యామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజ్ వేరియంట్, 8 జీబీ ర్యామ్ ప్లస్ 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్లపై డిస్కౌంట్లను ప్రకటించింది. ఈ ఫోన్ ధరల విషయానికొస్తే 8జీబీ ర్యామ్ ప్లస్ 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999 ఉంది, ఈ మోడల్‌పై ఎక్సేంజీ ఆఫర్లో గరిష్టంగా రూ.25,250లను షావోమీ ఆఫర్ చేస్తోంది. మీ పాత మొబైల్ ఫోన్‌కి ఎక్సేంజీలో మ్యాగ్జిమమ్ అమౌంట్ వస్తే ఫోన్ ధర రూ.14,249కి వస్తుంది. అయితే ఇక్కడో మరో ఆఫర్‌ని కూడా పొందే వీలుంది. ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్/డెబిట్ కార్డు చెల్లింపుల ద్వారా గరిష్టంగా మరోసారి రూ. 1,400ల వరకు డిస్కౌంట్ని పొందవచ్చు. దీంతో మొబైల్ చివరకు రూ.12,849లకే సొంతం చేసుకోవచ్చు. ఇదే మోడల్లో మరో వేరియంట్ 8జీబీ ర్యామ్ ప్లస్ 256జీబీ స్టోరేజ్‌తో రూ.41,999గా ధరతో ఉంది. ఈ మొబైల్ ఫోన్‌పై గరిష్ట ఎక్సేంజీ రూ.16,250గా ఉంది. దీంతో పాటు ఎంపిక చేసిన బ్యాంకుల క్రెడిట్/డెబిట్ కార్డు చెల్లింపుల ద్వారా గరిష్టంగా మరోసారి రూ.1,400ల వరకు డిస్కౌంట్ని పొందవచ్చు. అయితే 256 జీబీ వేరియంట్‌తో పోల్చితే 128 వేరియంట్‌ని ఎంపిక చేసుకోవడం ద్వారా తక్కువ మొత్తానికే ఫోన్‌ను కొనుగోలు చేయవచ్చు. చదవండి: Xiaomi Smart Glasses: మాట్లాడేందుకు కళ్ల జోళ్లొస్తున్నాయ్ -
వచ్చేస్తోంది..ఫ్లిప్‌కార్ట్ మరో దివాళీ సేల్..! 80 శాతం మేర భారీ తగ్గింపు..!
ప్రముఖ దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ మరో సేల్‌తో ముందుకు రానుంది. ఈ సేల్‌లో స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్స్‌పై 80శాతం భారీ డిస్కౌంట్లను అందిస్తున్నట్లు ఫ్లిప్ కార్ట్ ప్రకటించింది. దేశంలో ఫెస్టివల్ సీజన్ కొనసాగుతుంది. ఈ నేపథ్యంలో ఫ్లిప్ కార్ట్ ఫెస్టివల్ సేల్ పేరుతో వరుస ఆఫర్లను అందిస్తుంది. ఇప్పటికే బిగ్ బిలియన్ డేస్ సేల్ అక్టోబర్ 3 నుండి 10 వరకు, రెండో సేల్ బిగ్ దీపావళి సేల్ పార్ట్ 1 అక్టోబర్ 17 నుండి 23 వరకు నిర్వహించింది. తాజాగా అక్టోబర్ 28 నుంచి నవంబర్ 3వరకు మరో బిగ్ దివాళీ సేల్‌ను ప్రారంభించనుంది. ఈ సేల్‌లో కొనుగోలు దారులకు నో కాస్ట్ ఈఎంఐ, ఫ్రీ డెలివరీ, ఎక్స్ఛేంజ్ ఆఫర్, డీల్స్‌తో పాటు ఎలక్ట్రానిక్, ఇతర వస్తువులపై తగ్గింపు, ఎస్బీఐ కార్డ్‌లపై 10 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు ఫ్లిప్ కార్ట్ తెలిపింది. 80శాతం డిస్కౌంట్ ఫ్లిప్ కార్ట్ దివాళీ సేల్‌లో స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్స్ పై 80శాతం ఆఫర్లో సొంతం చేసుకోవచ్చు. స్మార్ట్ ఫోన్లలో రెడ్మీ 9ప్రైమ్, ఎంఐ 11 లైట్, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్12, శాంసంగ్ గెలాక్సీ ఎఫ్22 వంటి స్మార్ట్ఫోన్లపై 80శాతం ఆఫర్‌ను అందిస్తుండగా..ఐఫోన్ 12 సిరీస్, ఐఫోన్ ఎస్ఈ 2020 ఫోన్ ధరలు తగ్గుతాయని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. టైమ్ బాంబ్ డీల్స్ సాధారణ డిస్కౌంట్లు కాకుండా.. బిగ్ దీపావళి సేల్ సమయంలో కస్టమర్లు 12ఏఎం, 8ఏఎం,4 పీఎం సమయాల్లో 'క్రేజీ డీల్స్'ను సొంతం చేసుకోవచ్చని ఫ్లిప్‌కార్ట్ తెలిపింది. 'టైమ్ బాంబ్ డీల్స్' లో డెస్క్‌టాప్, ల్యాప్‌టాప్‌లు గరిష్టంగా 30 శాతం తగ్గింపుతో లభించనున్నాయి. పవర్ బ్యాంక్‌లు, హెడ్ఫోన్లు,స్పీకర్ల వంటి యాక్సెసరీలను కూడా 75 శాతం వరకు తగ్గింపుతో సొంతం చేసుకోవచ్చు. ఫ్లిప్ కార్ట్‌లో దేశీయ విమానాల టికెట్లను బుక్ చేసుకుంటే రూ. 2,500 వరకు, అంతర్జాతీయ విమానాలపై రూ. 25,000 వరకు తగ్గిస్తున్నట్లు ఫ్లిప్‌కార్ట్ వెల్లడించింది. చదవండి: బ్యాంకుల్లో బంపర్ ఆఫర్లు..లోన్ల కోసం అప్లయ్ చేస్తున్నారా? అయితే ఇది మీకోసమే! -
ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్: స్మార్ట్‌ఫోన్, ల్యాప్‌ట్యాప్స్‌పై డిస్కౌంట్లు
దేశీయ ఈ కామర్స్ దిగ్గజం ప్లిప్‌కార్ట్ బిగ్ బిలియన్ డే సేల్స్ తర్వాత బిగ్ దివాళీ సేల్స్‌ను ప్రకటించింది. ఈ సేల్స్ నేటి నుంచి ప్రారంభమయ్యాయి.ఈ సందర్భంగా పరిమితంగా పలు స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌ట్యాప్‌లపై భారీ డిస్కౌంట్లు అందించింది. రియల్ మీ జీటీ మాస్టర్ ఎడిషన్ పై దివాళీ సేల్‌లో ఫ్లిప్ కార్ట్ డిస్కౌంట్ ప్రకటించింది. మార్కెట్ లో ఫోన్ ధర రూ.25,999 ఉండగా ఈ సేల్ లో రూ.21,999కే అందిస్తుంది. ఫ్లిప్ కార్ట్ దివాళీ సేల్‌లో ఐఫోన్ 12 పై రూ.11,000 వరకు డిస్కౌంట్ అందిస్తుంది. ఈ ఫోన్ ధర రూ.65,900ఉండగా ఆఫర్లో రూ.54,999కే సొంతం చేసుకోవచ్చు. ఆపిల్ ఐఫోన్ 12 మినీని రూ.37,999కే కొనుగోలు చేయొచ్చు. మార్కెట్లో ఈ ఫోన్ ధర రూ .59,900గా ఉంది. ఫ్లిప్‌కార్ట్ బిగ్ దీపావళి సేల్ ఆఫర్లలో భాగంగా శామ్సంగ్ గెలాక్సీ ఎఫ్ 62 రూ .17,999 కి అందుబాటులో ఉంది. ఏసర్ ఆస్పైర్ 7 ల్యాప్ ట్యాప్ ధర రూ.54 వేలకు పైగా ఉండగా దివాళీ సేల్ లో రూ. 49,990కే లభిస్తుంది. -
'బిగ్ దివాళీ సేల్',మీ కోసం బోలెడు ఆఫర్లు ఉన్నాయ్!
'బిగ్ దివాళీ సేల్' పేరుతో అక్టోబర్ 17(ఆదివారం) నుంచి ఫ్లిప్‌కార్ట్ భారీ డిస్కౌంట్స్‌ను ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ దివాళీ సేల్‌లో పలు ప్రొడక్ట్‌లపై 80శాతం, 70శాతం డిస్కౌంట్లో అందిస్తుంది. వీటితో పాటు పలు బ్యాంకుల డెబిట్ కార్డ్, క్రెడిట్ ట్రాన్సాక్షన్లపై డిస్కౌంట్లను అందిస్తున్నట్లు ఫ్లిప్ కార్ట్ అధికారికంగా తెలిపింది. ఫ్లిప్ కార్ట్ దివాళీ సేల్ -2021 ♦ ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాళీ సేల్ 2021 అక్టోబర్ 17తో ప్రారంభమై అక్టోబర్ 23తో ముగియనుంది ♦ ఫ్లిప్‌కార్ట్ ప్లస్ మెంబర్స్ ప్రత్యేకంగా ఒకరోజు ముందే అంటే అక్టోబర్ 16, 12am నుంచి ప్రారంభం కానుంది. ♦ మిగిలిన కొనుగోలు దారులు అక్టోబర్ 17, 12 am నుంచి ప్రారంభం కానుంది. ♦ ఈ బిగ్ దివాళీ సేల్ అక్టోబర్ 23 మధ్యాహ్నం 11.59గంటలకు ముగియనుంది. ఫ్లిప్ కార్ట్ బిగ్ దివాళీ సేల్‌లో పలు బ్యాంక్ ఆఫర్లు ఇలా ఉన్నాయి ♦ ఎస్బీఐ క్రెడిట్ నుంచి ప్రొడక్ట్ కొనుగోలు చేసినా ఈఏఎంఐ సౌకర్యంతో పాటు 10శాతం డిస్కౌంట్ పొందవచ్చు. ♦ యాక్సెస్ బ్యాక్ , ఐసీఐసీఐ బ్యాంక్ డెబిట్, క్రెడిట్ కార్డ్‌ల వినియోగంతో 10శాతం ఇన్ స్టంట్ డిస్కౌంట్ ♦ పేటీఎం యూపీఐ ట్రాన్సాక్షన్లపై ప్రత్యేక క్యాష్ బ్యాక్ ఆఫర్లను పొందవచ్చు. ♦ గతేడాది ఎస్బీఐ క్రెడిట్ కార్డ్‌పై రూ.7,500వరకు డిస్కౌంట్ అందించింది. ఆ ఆఫర్ ఈ ఏడాది కూడా కంటిన్యూ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ♦ ఫోన్ పే యూజర్లు సైతం ఎక్స్ట్రా క్యాష్ బ్యాక్ ఆఫర్లలలో సొంతం చేసుకోవచ్చు ♦ పలు ప్రముఖ బ్యాంకుల క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్‌లపై నోకాస్ట్ ఈఎంఐ సౌకర్యం అందుబాటులో ఉంది. ♦ డెబిట్ కార్డ్‌లపై ఈఎంఐ సౌకర్యం ♦ బజాజ్ ఫిన్ సర్వ్ కార్డ్ పై నోకాస్ట్ ఈఎంఐ సదుపాయం ఉంది. ♦ ల్యాప్ ట్యాప్ అండ్ గేమింగ్ కంప్యూటర్ పై ఆఫర్లు ♦ గేమింగ్ ల్యాప్‌టాప్ ఏసర్ ప్రిడేటర్(Acer Predator), ఎంఎస్ఐ గేమింగ్ మానిటర్ పై రూ.50వేల వరకు డిస్కౌంట్‌ను పొందవచ్చు. ♦ హై ఫర్మామెన్స్ ల్యాప్ ట్యాప్‌లపై 40శాతం ఆఫర్ ♦ వర్క్ అండ్ ఎంటర్ టైన్మెంట్ ల్యాప్ ట్యాప్స్‌పై 50శాతం ఆఫర్ ♦ ఆపిల్ మాక్‌బుక్ ఎయిర్ ల్యాప్‌ట్యాప్స్‌పై రూ.20వేల వరకు ఆఫర్ లో పొందవచ్చు. 70, 80శాతం డిస్కౌంట్లు బిగ్ దివాళీ సేల్ సందర్భంగా పలు స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్స్‌పై 80శాతం డిస్కౌంట్స్ సొంతం చేసుకోవచ్చు. వీటితో పాటు ఎలక్ట్రానిక్స్, యాక్ససరీస్‌పై 80శాతం డిస్కౌంట్స్, టీవీ, గృహోపకరణాలపై 75శాతం డిస్కౌంట్‌ను పొందవచ్చు. చదవండి: వచ్చేస్తోంది..ఫ్లిప్‌కార్ట్ దివాళీ సేల్..! 80 శాతం మేర భారీ తగ్గింపు..! -
వచ్చేస్తోంది..ఫ్లిప్‌కార్ట్ దివాళీ సేల్..! 80 శాతం మేర భారీ తగ్గింపు..!
ప్రముఖ ఈ కామర్స్ దిగ్గజం ఫ్లిప్ కార్ట్ కొనుగోలు దారులకు బంపర్ ఆఫర్లను ప్రకటించింది. దీపావళి సందర్భంగా పలు రకాల ప్రొడక్ట్‌లపై 80 శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు తెలిపింది. ఇప్పటికే బిగ్ బిలియన్ డేస్ సేల్స్ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ కళ్లు చెదిరే డిస్కౌంట్లు అందించగా.. తాజాగా మరో సారి డిస్కౌంట్లు ఇస్తుండడంతో వినియోగదారులు వారికి నచ్చిన బ్రాండ్లను కొనుగోలు చేసుందుకు ఉవ్విళ్లూరుతున్నారు. బిగ్ బిలియన్ డేస్ సేల్స్ దసరా ఫెస్టివల్ సందర్భంగా ఫ్లిప్ కార్ట్ అక్టోబర్ 3 నుంచి అక్టోబర్ 10 వరకు బిగ్ బిలియన్ డేస్ సేల్‌ను నిర్వహించింది. తాజాగా దివాళీ సందర్భంగా అక్టోబర్ 17 నుంచి అక్టోబర్ 23 వరకు 'బిగ్ దివాళీ సేల్' ను నిర్వహించనుంది. ఈ సేల్‌లో ప్రీమియం (ప్లస్) మెంబర్స్‌కు అక్టోబర్ 16న మధ్యహ్నం 12 గంటల నుంచి ప్రారంభం కానుంది. సేల్‌లో ఐసీఐసీఐ బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌పై ప్రొడక్ట్‌లను కొనుగోలు చేస్తే 10శాతం డిస్కౌంట్ లభించనుంది. ఈ ప్రొడక్ట్‌లపై 80 డిస్కౌంట్ అక్టోబర్ 17 నుంచి ప్రారంభం కానున్న బిగ్ దివాళీ సేల్‌లో స్మార్ట్ ఫోన్, ట్యాబ్స్‌పై ఫ్లిప్ కార్ట్ 80శాతం డిస్కౌంట్‌ను అందిస్తున్నట్లు తెలిపింది.అదనంగా ఎలక్ట్రానిక్స్, యాక్స్సరీస్, టీవీ, అప్లయన్సెస్‌పై 75శాతం డిస్కౌంట్లో సొంతం చేసుకోవచ్చు. చదవండి: మార్కెట్లో మరో బడ్జెట్ ఫోన్, ఫీచర్లు మాత్రం అదుర్స్ -
అమెజాన్ దివాలీ సేల్ : టాప్ బ్రాండ్స్, టాప్ డీల్స్
సాక్షి, బెంగళూరు: అమెజాన్ ఇండియా గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ - దీపావళి స్పెషల్ సేల్‌ను శనివారం ప్రకటించింది. అక్టోబర్ 21 అర్థరాత్రి నుంచి 25వ తేదీవరకు ఈ స్పెషల్ సేల్ నిర్వహిచనుంది. ఈ ప్రత్యేక విక్రయాల్లో స్మార్ట్ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కెమెరాలు, ఎలక్ట్రానిక్స్, ఇతర గృహోపరణాలపై భారీ ఆఫర్లను అందిస్తోంది. అలాగే ప్రైమ్ సభ్యుల కోసం అక్టోబర్ 20 ఉదయం 12 గంటల నుంచే ప్రత్యేకమైన సేల్, స్పెషల్ అఫర్లను కూడా అమెజాన్ ప్రకటించింది. ఆపిల్, షావోమి, వన్‌ప్లస్, శాంసంగ్, వివో, హానర్ వంటి స్మార్ట్‌ఫోన్ల్‌పై భారీ తగ్గింపును ఆఫర్ చేస్తోంది. ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై 60శాతం దాకా డిస్కౌంట్ లభ్యం. వన్‌ప్లస్ 7టీ, శాంసంగ్ ఎం 30ఎస్, వివో యు10 తో సహా అమెజాన్ స్పెషల్స్ స్మార్ట్ఫోన్లను తగ్గింపు ధరల్లో అందుబాటులో ఉంచినట్టు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. దీంతోపాటు నోకాస్ట్ ఈఎంఐ, ఎక్స్ఛేంజ్ ఆఫర్లున్నాయి. డెబిట్ , క్రెడిట్ కార్డులు, బజాజ్ ఫిన్సర్వ్ కార్డులు, అమెజాన్ పే, ఐసిఐసిఐ క్రెడిట్ కార్డులపై అపరిమిత రివార్డ్ పాయింట్లుతోపాటు ఇతర ప్రయోజనాలు కూడా పొందవచ్చు. అంతేకాదు ఎల్జీ (43) 4 కె స్మార్ట్ టీవీ వర్ల్‌పూల్ కన్వర్టిబుల్ డబుల్ డోర్ రిఫ్రిజిరేటర్, శాంసంగ్ ఫుల్లీ ఆటోమేటిక్ టాప్ లోడ్ వాషింగ్ మెషీన్లతోపాటు, కొత్తగా ప్రారంభించిన సాన్యో కైజెన్ ఆండ్రాయిడ్ స్మార్ట్ టీవీ లాంటి లేటెస్ట్ ఉత్పత్తులపై కూడా ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని అమెజాన్ వెల్లడించింది. -
ఫ్లిప్‌కార్ట్ దివాలీ సేల్ షురూ : అదిరిపోయే ఆఫర్లు
సాక్షి, ముంబై: ఆన్లైన్ రీటైలర్ ఫ్లిప్‌కార్ట్‌లో బిగ్ దివాలీ సేల్ నేటి (అక్టోబర్ 12,శనివారం) నుంచి మొదలైంది. ఈసందర్భంగా వివిధ బ్రాండ్లకు చెందిన స్మార్ట్ఫోన్లు, వివిధ గృహోపకరణాలు, టీవీలు, దుస్తులు ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులపై తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తోంది. అక్టోబర్ 16 వరకు ఈ నిర్వహించనున్న ఈ విక్రయాల్లో లెనోవో, రెడ్మి, రియల్‌మి, ఒప్పో, గూగుల్, ఐఫోన్ తదితర స్మార్ట్ఫోన్లపై ఆకర్షణీయమైన తగ్గింపు ధరలను ప్రకటించింది. ముఖ్యంగా గూగుల్ పిక్సెల్ 3ఏ స్మార్ట్‌ఫోన్ పై ఏకంగా రూ. 10వేల తగ్గింపు అందిస్తోంది. అలాగే ఎస్బీ కార్డు కొనుగోళ్లపై అదనంగా 10 శాతం తక్షణ డిస్కౌంట్‌ను అందిస్తోంది. స్మార్ట్ఫోన్లపై ఆఫర్లు శాంసంగ్ ఎస్ 9 (4జీబీ, 64 జీబీ): అసలు ధర రూ. 62,500 రూ. ఆఫర్ ప్రైస్ రూ. 29,999 రెడ్మి 8 : రూ .7999 కే అందిస్తోంది. రెడ్మి 8 ఏ అసలు ధర రూ.7990 ఆఫర్ ప్రైస్ రూ. 6499 ఐఫోన్ 7 : అసలు ధర రూ.29,990 , ఆఫర్ ప్రైస్ రూ. 26,999 లెనోవా కె10నోట్ : అసలు ధర రూ. రూ.16999, ఆఫర్ ప్రైస్ 10999 చదవండి : ఫ్లిప్‌కార్ట్ సేల్ : బడ్జెట్ ధరలో జియోనీ ఫోన్ -
ఫ్లిప్‌కార్ట్ సేల్ : బడ్జెట్ ధరలో జియోనీ ఫోన్
సాక్షి, ముంబై: జియోనీ లేటెస్ట్ మొబైల్ తగ్గింపు ధరలో అందుబాటులోకి వచ్చింది. ఫ్లిప్‌కార్ట్ బిగ్దివాలీ సేల్‌లో జియోని ఎఫ్9 ప్లస్ స్మార్ట్‌ఫోన్‌పై దాదాపు 3వేల రపాయల దాకా డిస్కౌంట్‌ను అందిస్తోంది. జియోనీ ఎఫ్9 ప్లస్ ఫీచర్లు 6.26 ఇంచ్ డిస్ప్లే 1.65 గిగాహెడ్జ్ ఆక్టాకోర్ ప్రాసెసర్ ఆండ్రాయిడ్ 9.0 పై 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ 13 +2 ఎంపీ డ్యుయల్ రియర్ కెమెరాలు 32 ఎంపీ మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా 4050 ఎంఏహెచ్ బ్యాటరీ 3జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ : అసలు ధర రూ. 9490 ఆఫర్ ధర రూ.6,999 -
ఫ్లిప్‌కార్ట్ దివాలీ సేల్: స్మార్ట్ఫోన్లపై డిస్కౌంట్లు
సాక్షి, ముంబై: రానున్న దీపావళి సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ బిగ్ దివాలీసేల్‌ను ప్రారంభించింది. నేటి (గురువారం,నవంబరు 1) నుంచి అయిదురోజుల పాటు నవంబరు 5 దాకా వివిధ ఉత్సత్తులపై భారీ డిస్కౌంట్‌ను ప్రకటించింది. ముఖ్యంగా ప్రముఖ స్మార్ట్ఫోన్లపై తగ్గింపు ధరలను ప్రకటించింది. అలాగే ఎస్బీఐ క్రెడిట్ కార్డు ద్వారా జరిపే కొనుగోళ్లపై అదనంగా 10శాతం తగ్గింపు. రెడ్మి నోట్ 5 ప్రొ, పోకో ఎఫ్ 1, పిక్సెల్ 2 ఎక్స్ఎల్ స్మార్ట్ఫోన్లను తగ్గింపు ధరల్లో వినియోగదారులకు అందుబాటులోకి తెచ్చింది. రెడ్మి నోట్ 5 ప్రొ : 2 వేల రూపాయల తగ్గింపుతో రూ. 12,999 లకే లభ్యం. పోకో ఎఫ్1: షావోమి సబ్‌బ్రాండ్ తీసుకొచ్చిన పోకో ఎఫ్1 (6జీబీ/128 జీబీ స్టోరేజ్) పై 3వేల రూపాయల డిస్కౌంట్. రూ.21.999లకు అందుబాటులో ఉంది. పోకో ఎఫ్ 1 (8జీబీ/1256 జీబీ స్టోరేజ్) 4వేల రూపాయల తగ్గింపు అనంతరం రూ.26,999 లభిస్తోంది. గూగుల్ పిక్సెల్ 2 ఎక్స్ ఎల్: రూ. 5499 డిస్కౌంట్‌తో 40,999లకే అందిస్తోంది. దీనికి అదనంగా ఎస్‌బీఐకార్డుపై 10శాతం డిస్కౌంట్ కలుపుకుని ఈ సేల్ లో ఫ్లిప్‌కార్ట్ రూ. 36,999లకే అందిస్తోంది. హానర్ 9 ఎన్: 4వేల రూపాయల తగ్గింపుతో 9999 రూపాయలకు లభ్యం. వీటితోపాటు హానర్10, ఆసుస్‌జెన్ ఫోన్లపై కూడా డిస్కౌంట్‌ను ప్రకటించింది. ఇంకా టీవీలు, ఎలక్రానిక్స్ ఉత్పత్తులు, ఫర్నిచర్‌పై 80శాతంగా దాకా తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తోంది -
జెట్ ఎయిర్వేస్ దివాలీ సేల్
సాక్షి, న్యూఢిల్లీ: ఫెస్టివ్ సీజన్లో విమానయాన సంస్థలు డిస్కౌంట్ రేట్లలో విమాన టికెట్లను ఆఫర్ చేస్తున్నాయి. తాజాగా జెట్ ఎయిర్వేస్ దివాలీ సేల్‌ను ప్రకటించింది. 30శాతం డిస్కౌంట్‌తో దేశీయ, అంతర్జాతీయ మార్గాల్లో విమాన టికెట్లను (వన్‌వే, రిటన్) ఆఫర్ చేస్తోంది. ఈ ఆఫర్లో ఏడురోజులు (అక్టోబర్ 30-నవంబరు 5) వరకు టికెట్లను బుక్ చేసుకునే అవకాశం కల్పించింది జెట్ ఎయిర్వేస్. హ్యాపీ దివాలీ సేల్ పేరుతో ప్రారంభించిన ఈ విక్రయాల్లో ఎకానమీ, ప్రీమియర్ , ఇంటర్నేషనల్ ఇలా అన్నింటిలోనూ 30శాతం డిస్కౌంట్ వర్తిస్తుందని కంపెనీ తెలిపింది. అలాగే జెట్ ఎయిర్వేస్ అధికారిక వెబ్సైట్ ద్వారా బుక్ చేసుకున్నవారికి అదనపు సౌకర్యాలను కూడా అందిస్తోంది. 24గంటల లోపు క్యాన్సిల్ చేసుకుంటే జీరో పెనాల్టీ. నామినల్ ఫీతో ఎయర్‌పోర్ట్ లాంజ్‌ను వాడుకునే అవకాశం. ఇంకా ప్రతి బుకింగ్‌పై 250 జేపీ మైల్స్ బోనస్‌ను కూడా ఆఫర్ చేస్తోంది. -
రూ.888 కే విమాన టికెట్
సాక్షి,ముంబై: ఒక వైపు భారీగా పెరిగిన ఇంధన ధరలు విమానయాన సంస్థలను ఇబ్బందిపెడుతున్నప్పటికీ పండుగ సీజన్‌ను క్యాష్ చేసేందుకు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే ఇండిగో దివాలీ సేల్ ప్రకటించగా తాజాగా మరో లోకాస్ట్ ఎయిర్‌లైన్ స్పైస్ జెట్ కూడా డిస్కౌంట్ ధరల్లో విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. ప్రత్యేక దివాలీ సేల్‌ను ప్రారంభించింది. అన్నీ చార్జీలు కలిపి ఒకవైపు ప్రయాణానికి రూ.888 ప్రారంభ ధరగా టికెట్లను అందిస్తోంది. ఆ ఆఫర్లో టికెట్లను బుక్ చేసుకునే గడువు అక్టోబర్ 28తో ముగియనుంది. ఇలా బుక్ చేసుకున్న టికెట్లు నవంబర్ 8 నుంచి మార్చి 31, 2019వరకు చెల్లబాటు అవుతాయని స్పైస్ జెట్ ప్రకటించింది. కాగా దేశీయ అంతర్జాతీయమార్గాల్లో ఇండిగోదివాల్ సేల్‌ను బుధవారం లాంచ్ చేసింది. దేశీయంగా రూ.899 ప్రారంభ ధరలో టికెట్లను ఆఫర్ చేసింది. ఇది అక్టోబర్ 24తో ముగిసింది. Your festive season just got a lot spicier! SpiceJet presents the ‘Festive Season Sale’. Domestic air-fares starting at Rs 888/-* all inclusive. Let the celebrations begin! Booking Period: till 28th October, 2018 Travel Period: 8th November, 2018 to 31st March, 2019 T&Cs Apply pic.twitter.com/qVb4u0NKLK — SpiceJet (@flyspicejet) October 25, 2018 -
ఇండిగో దివాలీ సేల్ : 10లక్షల టికెట్లపై డిస్కౌంట్
సాక్షి, ముంబై: బడ్జెట్ ధరల విమానయాన సంస్థ ఇండిగో దీపావళి ఆఫర్ ప్రకటించింది. పండుగ వేడుకల్లో భాగంగా మూడు రోజుల దీపావళి ప్రత్యేక అమ్మకాలను ప్రారంభించింది. అక్టోబర్ 24-26వరకు తగ్గింపు ధరల్లో విమాన టికెట్లను ఆఫర్ చేస్తోంది. 40శాతం డిస్కౌంట్‌తో 10లక్షల సీట్లను కస్టమర్లకు అందించేందుకు నిర్ణయించింది. అన్ని చార్జీలు కలిపి రూ. 899 ప్రారంభ ధరలో టికెట్లను అందిస్తోంది. ఇండిగో నెట్‌వర్క్‌లో మొత్తం 64 ప్రాంతాలకు ఈ తగ్గింపు ధరలు అమల్లో ఉంటాయి. ఇలా బుక్ చేసుకున్నటికెట్లు నవంబరు 8,2018 -ఏప్రిల్ 15,2019 మధ్య ప్రయాణానికి చెల్లుబాటు అవుతాయి. తమ కస్టమర్ల సౌలభ్యం, సంతోషం కోసం మూడు రోజుల దివాలీ స్పెషల్ సేల్‌ను ప్రారంభించామని ఇండిగో కంపెనీ చీఫ్ కమర్షియల్ ఆఫీసర్ విలియం బౌల్టర్ చెప్పారు. దేశీయంగా రూ.899, అంతర్జాతీయ మార్గాల్లో రూ. 3399 ప్రారంభ ధరల్లో టికెట్లను అందిస్తున్నట్టు తెలిపారు. కుటుంబాలు, స్నేహితులను కలుసుకునే సందర్భం దీపావళికి తక్కువ ధరల్లో టికెట్లను అందించడం ద్వారా తమ కస్టమర్లకు మంచి అనుభవాన్ని మిగులుస్తుందన్నారు. చాలా తొందరగా వినియోగదారులు ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుంటారనే ఆశాభావాన్ని వ్యక్తంచేశారు. -
ఫ్లిప్‌కార్ట్ దీపావళి ధమాకా
సాక్షి, ముంబై: వరుస పండుగలతో ఈకామర్స్ సంస్థలు ఆఫర్లతో కస్టమర్లకు ఆకర్షించేందుకు సిద్ధమైపోయాయి. దసరా సీజన్‌ను బాగా క్యాష్ చేసుకున్న ఫ్లిప్‌కార్ట్ ఇపుడికి దీపావళి అమ్మకాలపై కన్నేసింది. ఈ నేపథ్యంలో 'ఫెస్టివ్ ధమాకా డేస్' పేరుతో దీపావళి సేల్‌ను ప్రకటించింది. అక్టోబర్ 24-27 వరకు నాలుగు రోజుల పాటు నిర్వహించనుంది. అన్ని ప్రముఖ ఉత్పత్తులపై ఆఫర్లు ఉంటాయని సంస్థ వెల్లడించింది. ముఖ్యంగా స్మార్ట్ఫోన్లతోపాటు టీవీలు, ఇతర గృహోపకరణాలపై 70శాతం వరకు డిస్కౌంట్లు అందుబాటులో ఉంటాయని తెలిపింది. దీపావళి అమెజాన్ వచ్చే వారం మరోసారి గ్రేట్ ఇండియన్ ఫెస్టివల్ సేల్ ఇప్పటికే ప్రకటించిన సంగతి గమనార్హం. బిగ్ బిలియన్ డేస్ సేల్ మాదిరిగా కాకుండా ఈ ఫ్లిప్‌కార్ట్ ఫెస్టివ్ ధమాకా డేస్‌లో తొలి రోజు నుంచే అన్ని ఉత్పత్తులపై సేల్ ప్రారంభం కానుంది. ఇక ఫ్లిప్‌కార్ట్ ప్లస్ కస్టమర్లకు ఈ ఆఫర్లు అక్టోబర్ 23 రాత్రి 9 గంటల నుంచే అందుబాటులోకి వస్తాయి. ఫ్లిప్‌కార్ట్ ప్లస్ సభ్యులకు డెలివరీ, కస్టమర్ కేర్ లలో ప్రాధాన్యతతో పాటు అదనంగా రివార్డ్ పాయింట్స్, ఇతర సౌకర్యాలు కల్పించనున్నారు. యాక్సిస్ బ్యాంక్ కార్డులు, డెబిట్ కార్డుపై ఈఎంఐ, నో కార్ట్ ఈఎంఐ, ఫోన్‌పేపై క్యాష్‌బ్యాక్ ఆఫర్లున్నాయి. ఏయే ప్రొడక్ట్స్‌పై ఎంతెంత డిస్కౌంట్లు ఇస్తామనేది ఫ్లిప్‌కార్ట్ ఇంకా ప్రకటించలేదు. -
భారీ డిస్కౌంట్లకు ఇదే చివరి అవకాశం
న్యూఢిల్లీ : ఈ పండగ కాకపోతే.. వచ్చే పండగ. లేదా ఆ తర్వాత ఫెస్టివల్‌కు చూసుకోవచ్చులే. ఏదైనా కొత్త వస్తువు కావాలంటే అప్పుడు కొనుక్కోవచ్చులే, డిస్కౌంట్లు ఎలాగో ప్రతి పండగకు ఉంటాయిలే అని చాలా మంది ఆలోచిస్తూ ఉంటారు. కానీ రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మిషన్లు, కన్జ్యూమర్ ఎలక్ట్రానిక్స్, అప్లియెన్స్, స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు పొందడానికి ఇదే చివరి అవకాశమట. వచ్చే దివాళి సేల్ అనంతరం, ఈ వస్తువులపై భారీ మొత్తంలో డిస్కౌంట్లు పొందాలంటే కాస్త కష్టతరమేనట. ఎందుకంటే.. కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ఈ వస్తువులపై కస్టమ్ సుంకాన్ని పెంచింది. ఈ సుంక పెంపు నేపథ్యంలో వచ్చే పండగ సీజన్ తర్వాత వీటిపై ధరలు పెంచాలని కంపెనీలు ఆలోచిస్తున్నాయి. షావోమి, హానర్, వన్‌ప్లస్, శాంసంగ్, ఆసుస్ వంటి స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ఈ పండగ సీజన్ వరకు ఎలాంటి ధరలు పెంచకూడదని నిర్ణయించి, ఆ తర్వాత నుంచి ధరల పెంపు చేపట్టాలని భావిస్తున్నట్టు తెలిసింది. అలాగే వైట్ గూడ్స్ తయారీదారులు పానాసోనిక్, బోస్, బీఎస్‌హెచ్ ఎలక్ట్రానిక్స్ కూడా పండగ సీజన్ వరకు ధరలు పెంచకూడదని నిర్ణయించాయి. రూపాయి క్షీణిస్తున్న నేపథ్యంలో, కరెంట్ అకౌంట్ లోటును భర్తీ చేసేందుకు ప్రభుత్వం కస్టమ్ డ్యూటీని పెంచింది. సరిగ్గా పండగ సీజన్‌కు ముందు ఈ ప్రకటన చేయడంతో, ఈ సారి డిస్కౌంట్లు ఉంటాయో ఉండవోనని వినియోగదారులు తెగ ఆందోళన చెందారు. కానీ ఈ పండగ సీజన్ వరకు ధరలు పెంచకుండా ఉండేందుకు కంపెనీల వద్ద ఇన్వెంటరీ ఉందని, ఈ పండగ సీజన్ అయిపోయిన వెంటనే కంపెనీలు ధరలు పెంచేందుకు సిద్ధమయ్యాయని పలు రిపోర్టులు పేర్కొన్నాయి. ‘రూపాయి క్షీణత నిజంగా పెద్ద తలనొప్పి. సాధారణంగా స్మార్ట్‌ఫోన్ ధరలు 10 శాతం వరకు పెరగాల్సి ఉంది. కానీ ప్రస్తుతం ధరలు పెంచకూడదని నిర్ణయించాం. అంతేకాక సేల్స్ వాల్యుమ్ పెంచేందుకు ఆఫర్లు, డిస్కౌంట్లు ఇస్తున్నాం’ అని హువావే, హానర్ కన్జ్యూమర్ ప్రొడక్ట్ సేల్స్ వైస్ ప్రెసిడెంట్ పీ సంజీవ్ తెలిపారు. వెంటనే ధరల పెంపు చేపట్టి, వినియోగదారులపై భారం వేయకుండా.. ఈ ఏడాది ముగింపు నాటికి ధరలను పునఃసమీక్షిస్తామని వన్‌ప్లస్, షావోమి తెలిపాయి. ఈ పండగ సీజన్ వరకు అయితే డిస్కౌంట్లను, ఆఫర్లను కొనసాగిస్తామని పేర్కొన్నాయి. -
జెట్ ఎయిర్వేస్ దివాలీ ఆఫర్
సాక్షి, న్యూఢిల్లీ: దీపావళి సందర్భంగా విమానయాన సంస్థ జెట్ ఎయిర్ వేస్ డిస్కౌంట్ ధరలను ప్రకటించింది. స్పెషల్ లిమిటెడ్ పీరియడ్ పథకం కింద తొమ్మిది రోజులు అమ్మకాలను ప్రారంభించినట్టు మంగళవారం ప్రకటించింది. ఈ ఆఫర్ లో దేశీయ, అంతర్జాతీయ విమాన టికెట్లపై 20శాతం దాకా తగ్గింపు ధరలను ఆఫర్ చేస్తోంది. దివాలీ 2017 పథకం కింద అక్టోబర్ 17నుంచి 25 వరకు ఈ స్పెషల్ సేల్ నిర్వహిస్తోంది. నవంబర్ 1, 2017 నుంచి ప్రయాణానికి వినియోగించుకోవచ్చు. దీపావళి 2017 పథకం కింద ప్రీమియర్ టిక్కెట్లలో 20 శాతం వరకు డిస్కౌంట్లను ఆఫర్ చేస్తున్నట్టు ఎయిర్ లైన్స్ ఒక ప్రకటనలో తెలిపింది. జెట్ ఎయిర్వేస్ అందిస్తున్న దేశీయ , విదేశీయంగా ఆకర్షణీయమైన ప్రయాణ ఆఫర్లను ఆస్వాదించాలని జెట్ ఎయిర్వేస్ చీఫ్ వాణిజ్య అధికారి జయరాజ్ షణ్ముగం అన్నారు. వన్-వే , తిరిగి ప్రయాణాల కోసం ఈ ఆఫర్ వర్తిస్తుందని జెట్ ఎ యిర్‌వేస్ తెలిపింది. దేశీయ టికెట్ల ద్వారా నవంబర్ నుంచి ప్రయాణింవచ్చని అలాగే గెస్ట్బుకింగ్ ఇంటర్నేషనల్ టికెట్ల ద్వారా వెంటనే ప్రయాణించవచ్చని పేర్కొంది.