
దీపావళి ఫెస్టివల్ సందర్భంగా ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. చైనా స్మార్ట్ సంస్థకు చెందిన బడ్జెట్ ఫోన్ రెడ్‌మీ 9 పవర్ పై భారీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది.
రెడ్‌మీ 9 పవర్ ఫీచర్లు
రెడ్‌మీ 9 పవర్ ఫీచర్ల విషయానికొస్తే 6.53 అంగుళాల హెచ్‌డీ ప్లస్ మల్టీ టచ్ కెపాసిటేటివ్ టచ్‌స్క్రీన్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్, 4జీబీ ర్యామ్, 128 GB ఇంటర్నల్ మెమరీ 512 GB వరకు ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు.
ఇక రెడ్ మీ 9లో ఉన్న కెమెరా ఫీచర్లు చూసుకుంటే 48ఎంపీ క్వాడ్ రేర్ కెమెరా, అల్ట్రా వైడ్, మ్యాక్రోమోడ్ , పోట్రేట్ ,ఏఐ సీన్ రికగ్నైజేషన్, నైట్ మోడ్, హెచ్‌డీఆర్,ప్రో మోడ్, 8ఎంపీ ఫ్రంట్ కెమెరా,2340 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 19.5:9 యాస్పెక్ట్ రేషియో, డ్యూయల్ సిమ్ ప్లస్ డెడికేటెడ్ ఎస్ డీ కార్డ్ స్లాట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 662 ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో ఆండ్రాయిడ్ వీ10 ఆపరేటింగ్ సిస్టమ్ కి సపోర్ట్ చేస్తుంది. వీటితో పాటు హ్యాండ్స్ ఫ్రీ సంగీతం ఎంజాయ్ చేయడమే కాకుండా అలెక్సా నుంచే నేరుగా డయల్ చేయొచ్చు.
రెడ్‌మీ 9 పవర్ ధర
రెడ్‌మీ 9 పవర్ వాస్తవ ధర రూ.13,999. రూ.2500 డిస్కౌంట్‌తో రూ.11,499కే సొంతం చేసుకోవచ్చు. పాత ఫోన్ ఎక్స్‌ఛేంజ్ చేసుకుంటే రూ.10,900కే పొందవచ్చు.రూ.541తో ఈఎంఐ ప్రారంభం కాగా..నోకాస్ట్ ఈఎంఐ సౌలభ్యం ఉంది. ఈ ఫోన్ కొనుగోలుపై యూపీఐ ఆఫర్లతో పాటు డిస్కౌంట్లు లభించనున్నాయి.
చదవండి: షావోమీ మరో స్మార్ట్ ఫోన్ సిరీస్, ఫీచర్లు లీక్.. అదిరిపోయేలా
Comments
Please login to add a commentAdd a comment