సాక్షి, హైదరాబాద్: స్మార్ట్‌ఫోన్ల దిగ్గజ కంపెనీ షావొమీ (Xiaomi) సరికొత్త 5జీ ఫోన్‌ను విడుదల చేయనుంది. రెడ్‌మీ -14సీ 5జీ (Redmi 14C 5G) పేరుతో జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న ఈ స్మార్ట్‌ఫోన్ భారతీయ వినియోగదారుల ప్రత్యేక అవసరాలను దృష్టిలో ఉంచుకుని మరీ తయారు చేశామని కంపెనీ ప్రతినిధి సందీప్ శర్మ తెలిపారు
హైదరాబాద్‌లో జరిగిన ఒక కార్యక్రమంలో ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఫీచర్లను వివరించారు. భారత్‌లో 5జీ స్మార్ట్‌ఫోన్ల వినియోగం వేగంగా పెరుగుతున్నప్పటికీ ఇప్పటివరకూ కేవలం 16 శాతం మంది వినియోగదారులు మాత్రమే 5జీ ఫోన్లు కలిగి ఉన్నారని.. మరింత మంది అత్యధిక వేగంతో పని చేసే 5జీ ఫోన్లను అందుబాటులోకి తెచ్చే క్రమంలో భాగా షావొమీ రెడ్‌మీ-14సీని అందుబాటులోకి తెచ్చిందని ఆయన వివరించారు. స్టార్‌లైట్ బ్లూ, స్టార్‌డస్ట్ పర్పుల్, స్టార్‌గేజ్ బ్లాక్ పేరుతో ప్రత్యేకంగా డిజైన్‌తో కూడిన మూడు రంగుల్లో ఈ స్మార్ట్‌ఫోన్ లభిస్తుందని తెలిపారు.
నాలుగు నానోమీటర్ల ప్రాసెసర్ డిజైన్..
రెడ్‌మీ - 14సీ 5జీలో స్మార్ట్‌ఫోన్‌లో అత్యాధునిక స్నాప్‌డ్రాగన్ 4జెన్-2 ప్రాసెసర్‌ను ఉపయోగించారు. నాలుగు నానోమీటర్ల ప్రాసెసర్ (Processor) అర్కిటెక్చర్ కారణంగా సెకనుకు 2.5 జీబీబీఎస్‌ల వేగాన్ని అందుకోగలగడం దీని ప్రత్యేకత. 5జీ వేగాలను అందుకునేందుకు వీలుగా ఎక్స్-61 మోడెమ్‌ను ఏర్పాటు చేశారు. స్క్రీన్ సైజ్ 6.88 అంగుళాల హెచ్‌డీ (HD) డిస్‌ప్లే కాగా.. రెఫ్రెష్ రేటు 120 హెర్ట్ట్జ్. అలాగే డాట్ డ్రాప్ డిస్‌ప్లే కలిగి ఉండి.. గరిష్టంగా 600 నిట్స్ ప్రకాశాన్ని ఇస్తుంది.
ఇక స్టోరేజీ విషయానికి వస్తే 12 జీబీల ర్యామ్ (RAM) (6జీబీ + అవసరమైతే మరో 6 జీబీ) కలిగి ఉంటుంది. 128 జీబీల రామ్ సొంతం. మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా ఒక టెరాబైట్ వరకూ స్టోరేజీని పెంచుకోవచ్చు. 50 ఎంపీల ఏఐ-డ్యుయల్ కెమెరా వ్యవస్థతోపాటు 8 ఎంపీల సెల్ఫీ కెమెరాతో కూడిన ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 14 ఆధారిత షావొమీ హైపర్ ఓఎస్‌పై పని చేస్తుంది.
ధర.. అందుబాటులోకి ఎప్పుడు?
రెడ్‌మీ 14సీ 5జీ ఈ నెల 10వ తేదీ నుంచి షావోమీ స్టోర్లతోపాటు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లలోనూ అందుబాటులోకి రానుంది. 4 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజీ కలిగగిన ప్రాథమిక మోడల్ ధర రూ.9999లు కాగా.. స్టోరేజీ 128 జీబీ, మెమరీ నాలుగు జీబీలుండే ఫోన్ ధర రూ.10,999లు.. 6 జీబీ మెమరీ, 128 జీబీ స్టోరేజీ ఉన్న ఫోన్ ధర రూ.11,999లు అని సందీప్ శర్మ తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment