China smartphones
-
రియల్మీ 10 సిరీస్ లాంచ్..ఫీచర్లు ఎలా ఉన్నాయో మీరే చూడండి!
ప్రముఖ స్మార్ట్‌ఫోన్ దిగ్గజం రియల్‌మి తాజాగా రియల్‌మి 10 సిరీస్ ఫోన్‌ను లాంచ్ చేసింది. త్వరలో చైనా ఆ తర్వాత మిగిలిన దేశాల స్మార్ట్ ఫోన్ మార్కెట్లో ఈ ఫోన్‌ను పరిచయం చేయనుంది. రియల్మీ 10 స్పెసిఫికేషన్లు, ఫీచర్లు రియల్మీ నెక్స్ట్ జనరేషన్ మోడల్‌గా చెబుతున్న ఈ ఫోన్లు ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌తో పనిచేస్తుండగా.. వీటిలో 5000ఎంఏహెచ్ బ్యాటరీ, మీడియా టెక్ హీలియా జీ 99 చిప్ సెట్, 90 హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్‌తో అమొలెడ్ డిస్ప్లేను డిజైన్ చేసింది. రియల్ మీ ప్రతినిధులు చెప్పినట్లుగా రియల్మీ 10లో గేమ్స్‌ను 9గంటల పాటు నిర్విరామంగా ఆడుకోవచ్చని తెలిపారు. ప్రత్యేకించి ఈ ఫోన్ 33 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో కేవలం 28 నిమిషాల్లో 0 నుంచి 50 శాతం ఛార్జింగ్ పెట్టుకోవచ్చు. నవంబర్ 17న రియల్ మీ నవంబర్ 17న రియల్ మీ 10 చైనా వెర్షన్‌ను అక్కడ పెద్ద ఎత్తున లాంచ్ చేసేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. ఆ ఈవెంట్లో రియల్మీ 10 ప్రో, రియల్మీ ప్రో ప్లస్‌ను సైతం యూజర్లకు పరిచయం చేస్తుంది. ఇక ఈ లేటెస్ట్ రియల్ మీ సిరీస్ 10 ధరలు ఎంత ఉంటాయనే అంశంపై స్పష్టత లేనప్పటికీ.. గతేడాది రియల్మీ విడుదల చేసిన రియల్మీ 9 సిరీస్ తరహాలో బడ్జెట్లో ధరలు ఉంటాయని మార్కెట్ నిపుణలు అంచనా వేస్తున్నారు. -
సంచలనం..భారత్‌కు బైబై..దేశంలో కార్యకలాపాల్ని నిలిపేసిన స్మార్ట్ ఫోన్ దిగ్గజం
ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ హువావే భారత్‌కు గుడ్ బై చెప్పింది. చైనా స్మార్ట్ ఫోన్ సంస్థలపై కేంద్రం కఠిన వైఖరిని ప్రదర్శిస్తుంది. ఈ తరుణంలో హువావే సబ్ బ్రాండ్ హానర్ స్మార్ట్‌ఫోన్ కార్యకాలాపాల్ని భారత్‌లో నిలిపివేస్తున్నట్లు ప్రకటించింది. సౌత్ చైనా మార్నింగ్ పోస్ట్ ప్రకారం..మా కంపెనీ అన్నీ నిబంధనలకు లోబడే స్థానిక భాగస్వాములతో కలిసి భారత్‌లో కార్యకాలాపాల్ని నిర్వహిస్తుంది. కానీ స్పష్టమైన కారణాల్ని హైలెట్ చేస్తూ భారత్‌లో తన వ్యాపారాన్ని నిలిపివేస్తున్నట్లు హానర్ సీఈఓ ఝావో మింగ్ తెలిపారు. కానీ ఆ స్పష్టమైన కారణలు ఏంటనేది చెప్పే ప్రయత్నం చేయలేదు. ఈడీ దెబ్బ.. హువావే అబ్బా ఇటీవల కాలంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ (ఈడీ)తో పాటు డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) చైనా దిగ్గజ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థలైన వివో, ఒప్పో, షావోమీలపై దాడులు, దర్యాప్తులు నిర్వహిస్తున్నాయి. ఈ తరుణంలో హువావే ఈ కీలక నిర్ణయం తీసుకోవడం సంచలనంగా మారింది. అమెరికాలో సైతం 2018లో హానర్ భారత్‌లో ౩ శాతం మార్కెట్ వాటాను కలిగి ఉంది. అదే సమయంలో హువావేపై అమెరికా ఆంక్షలు విధించింది. ఆ తరువాత అక్కడ సైతం మార్కెట్‌ను కోల్పోయింది. ఈ నేపథ్యంలో చైనా కంపెనీ అమెరికాలో వ్యాపారాన్ని నిర్వహించేందుకు కష్టంగా మారింది. అందుకే హువావే గతేడాది నవంబర్‌లో తన హానర్ స్మార్ట్‌ఫోన్‌కు చెందిన ఆస్తుల్ని చైనాకు చెందిన షెన్జెన్ జిక్సిన్ న్యూ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అమ్మేసింది. -
అదిరిపోయే ఫీచర్లతో,రెడ్మీ నోట్ 11 ప్రో సిరీస్ స్మార్ట్ ఫోన్లు..ధర ఎంతంటే?
ప్రముఖ చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ రెడ్ మీ సిరీస్‌లో రెండు స్మార్ట్ ఫోన్లను విడుదల చేసింది. భారత్ వేదికగా జరిగిన లాంచ్ ఈవెంట్లో టెక్ ప్రియుల్ని అట్రాక్ట్ చేస్తూ రెడ్మీ నోట్ 11 ప్రో సిరీస్‌లో 5జీ రెడ్మీ నోట్ 11 ప్రో+, 4జీ రెడ్ మీ నోట్ ప్రో స్మార్ట్ ఫోన్లను మార్కెట్‌కు పరిచయం చేసింది. 4జీ రెడ్ మీ నోట్ 11 ప్రో , 5జీ నోట్ 11 ప్రో ప్లస్ స్పెసిఫికేషన్లు, ఫీచర్లు రెడ్ మీ నోట్ 11 ప్రో 4జీ, నోటీ 11 ప్రో ప్లస్ 5జీ ఈ రెండు స్మార్ట్ ఫోన్లలో 6.67 అంగుళాల ఓఎల్ఈడీ డిస్ప్లే,120 హెచ్ జెడ్ రిఫ్రెష్ రేట్, 16ఎంపీ సెల్ఫీ కెమెరాకు పంచ్ హోల్ కటౌవుట్, 180 ఎంపీ మెయిన్ కెమెరా, 8ఎంపీ అల్ట్రా వైడ్ స్నాపర్స్, 2ఎంపీ మైక్రో హెల్పర్, 2ఎంపీ డెప్త్ మాడ్యుల్స్ ఉన్నాయి. 5జీ షావోమీ రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ 5జీ రెడ్మీ నోట్ 11 ప్రో+ 5జీ స్మార్ట్‌ఫోన్ లేటెస్ట్ క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 695 5జీ ప్రాసెసర్‌తో రిలీజైతే.. 4జీ రెడ్మీ నోట్ 11 ప్రో మాత్రం ఇటీవల పాపులర్ అయిన మీడియాటెక్ హీలియో జీ96 గేమింగ్ ప్రాసెసర్‌తో రిలీజైంది. 5జీ షావోమీ రెడ్మీ నోట్ 11 ప్రో ప్లస్ స్టీల్త్ బ్లాక్, ఫాంటమ్ వైట్, మిరాజ్ బ్లూ కలర్ వేరియంట్లలో లభ్యమవుతుంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.20,999 నుండి ప్రారంభమవుతుంది. అయితే టాప్ ఎండ్ 8జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ మోడల్ ధర రూ.24,999 వరకు ఉంటుంది. ఇక ఈ ఫోన్ షావోమీ ఆన్లైన్, ఆఫ్‌లైన్ ప్లాట్‌ఫారమ్‌లతో పాటు అమెజాన్ ఇండియా ద్వారా మార్చి 15నుంచి అమ్మకాలు ప్రారంభం కానున్నాయి. 4జీ రెడ్ మీ నోట్ 11 4జీ రెడ్ మీ నోట్ 11 ప్రో స్టీల్త్ బ్లాక్, ఫాంటమ్ వైట్, స్టార్ బ్లూ కలర్ వేరియంట్లలో లభ్యమవుతుంది. 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ఫోన్ ధర రూ. 17,999 నుంచి ప్రారంభం కానుండగా.. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ మోడల్ ధర రూ.19,999గా ఉంది. ఈ ఫోన్ అమ్మకాలు మార్చి 23 నుంచి ప్రారంభం కానున్నాయి. చదవండి: ఫ్లిప్ కార్ట్‌లో దిమ్మతిరిగే ఆఫర్లు, వాటిపై ఏకంగా 80శాతం డిస్కౌంట్లు!! -
సేల్స్ బీభత్సం..! 5 నిమిషాల్లో వేలకోట్ల విలువైన ఫోన్లు అమ్ముడయ్యాయి!
ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ గత వారం విడుదల చేసిన ఓ స్మార్ట్ ఫోన్ దెబ్బకు 5 నిమిషాల్లో వేలకోట్ల విలువైన స్మార్ట్ ఫోన్ అమ్మకాలు జరిగినట్లు టెక్ బ్లాగ్లు పలు రిపోర్ట్‌లను వెలుగులోకి తెచ్చాయి. టెక్ బ్లాగ్ గిజ్మో చైనా కథనం ప్రకారం.. న్యు ఇయర్ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ కంపెనీ షావోమీ డిసెంబర్ 28న షావోమీ12 సిరీస్ స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేసింది.ఆఫ్‌లైన్, ఆన్లైన్ వేదికగా విడుదల చేసిన 5 నిమిషాల్లోనే సుమారు 1.8 బిలియన్ యువాన్. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం.. రూ.2108 కోట్ల విలువైన స్మార్ట్ ఫోన్లను అమ్మినట్లు గిజ్మో చైనా తన కథనంలో పేర్కొంది. స్ట్రాటజీ వర్కౌట్ అయ్యింది న్యు ఇయర్ సందర్భంగా షావోమీ సంస్థ చైనాలో తొలిసారి కాంపాక్ట్ ఫ్లాగ్షిప్ ఫోన్ షావోమీ 12 సిరీస్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. షావోమీ 12 సిరీస్‌లోని బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్లు షావోమీ 12, షావోమీ 12ప్రో ఫోన్లను విడుదల చేసింది. బడ్జెట్ తక్కువగా ఉండడం, అడ్వాన్స్ ఫీచర్లు ఉండడంతో పాటు న్యుఇయర్ సెంటిమెంట్ షావోమీకి కలిసొచ్చింది. దీంతో నిమిషాల వ్యవధిలో భారీ సేల్స్ జరిగినట్లు టెక్ బ్లాగ్ గిజ్మో చైనా తన కథనంలో హైలెట్ చేసింది. షావోమీ 12 స్పెసిఫికేషన్లు షావోమీ 12 స్మార్ట్ ఫోన్ 6.28 అంగుళాలు, 2కే అమోలెడ్ డిస్ప్లే, 4,500ఏఎంహెచ్ బ్యాటరీ,120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 1 సీపీయూతో 12జీబీ ర్యామ్ 256 ఇంటర్నల్ స్టోరేజ్ సౌకర్యం ఉంది. ఇక ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రేర్ కెమెరా, 50 ఎంపీ సోనీ ఐఎక్స్ 766 సెన్సార్లు, 13ఎంపీ ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5ఎంపీ టెలిఫోటో లెన్స్, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. 67వాల్ట్‌ల ఫాస్ట్ ఛార్జింగ్, 50వాల్ట్‌ల వైర్‌లెస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది. షావోమీ 12 ప్రో స్పెసిఫికేషన్లు షావోమీ 12 ప్రో 6.73 అంగుళాల 2కే అమోలెడ్ డిస్ప్లే, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, ఫంచ్ హోల్ కట్ అవుట్, ఆండ్రాయిడ్ 12ఓఎస్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120వాల్ట్‌ల ఛార్జింగ్ సపోర్ట్, ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రేర్ కెమెరా, 50ఎంపీ మెయిన్ కెమెరా, 50ఎంపీ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50ఎంపీ టెలిఫోటో లెన్స్, 32ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమరాలు ఉన్నాయి. చదవండి: షావోమీ 'నెక్ట్స్ జనరేషన్ రేసర్' మామూలుగా ఉండదు, ఫీచర్లు అదిరిపోతాయ్..! -
స్మార్ట్ ఫోన్‌పై అమెజాన్ బంపర్ ఆఫర్, ఈఎంఐ ఎంతో తెలిస్తే వావ్ అనాల్సిందే..!
దీపావళి ఫెస్టివల్ సందర్భంగా ప్రముఖ ఈకామర్స్ దిగ్గజం అమెజాన్ బంపర్ ఆఫర్ ప్రకటించింది. చైనా స్మార్ట్ సంస్థకు చెందిన బడ్జెట్ ఫోన్ రెడ్మీ 9 పవర్ పై భారీ డిస్కౌంట్ ఇస్తున్నట్లు తెలిపింది. రెడ్మీ 9 పవర్ ఫీచర్లు రెడ్మీ 9 పవర్ ఫీచర్ల విషయానికొస్తే 6.53 అంగుళాల హెచ్డీ ప్లస్ మల్టీ టచ్ కెపాసిటేటివ్ టచ్‌స్క్రీన్, 6000 ఎంఏహెచ్ బ్యాటరీ, 18డబ్ల్యూ ఛార్జింగ్ సపోర్ట్, 4జీబీ ర్యామ్, 128 GB ఇంటర్నల్ మెమరీ 512 GB వరకు ఎక్స్పాండ్ చేసుకోవచ్చు. ఇక రెడ్ మీ 9లో ఉన్న కెమెరా ఫీచర్లు చూసుకుంటే 48ఎంపీ క్వాడ్ రేర్ కెమెరా, అల్ట్రా వైడ్, మ్యాక్రోమోడ్ , పోట్రేట్ ,ఏఐ సీన్ రికగ్నైజేషన్, నైట్ మోడ్, హెచ్డీఆర్,ప్రో మోడ్, 8ఎంపీ ఫ్రంట్ కెమెరా,2340 x 1080 పిక్సెల్స్ రిజల్యూషన్, 394 పీపీఐ పిక్సెల్ డెన్సిటీ, 19.5:9 యాస్పెక్ట్ రేషియో, డ్యూయల్ సిమ్ ప్లస్ డెడికేటెడ్ ఎస్ డీ కార్డ్ స్లాట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 662 ఆక్టా కోర్ ప్రాసెసర్‌తో ఆండ్రాయిడ్ వీ10 ఆపరేటింగ్ సిస్టమ్ కి సపోర్ట్ చేస్తుంది. వీటితో పాటు హ్యాండ్స్ ఫ్రీ సంగీతం ఎంజాయ్ చేయడమే కాకుండా అలెక్సా నుంచే నేరుగా డయల్ చేయొచ్చు. రెడ్మీ 9 పవర్ ధర రెడ్మీ 9 పవర్ వాస్తవ ధర రూ.13,999. రూ.2500 డిస్కౌంట్‌తో రూ.11,499కే సొంతం చేసుకోవచ్చు. పాత ఫోన్ ఎక్స్ఛేంజ్ చేసుకుంటే రూ.10,900కే పొందవచ్చు.రూ.541తో ఈఎంఐ ప్రారంభం కాగా..నోకాస్ట్ ఈఎంఐ సౌలభ్యం ఉంది. ఈ ఫోన్ కొనుగోలుపై యూపీఐ ఆఫర్లతో పాటు డిస్కౌంట్లు లభించనున్నాయి. చదవండి: షావోమీ మరో స్మార్ట్ ఫోన్ సిరీస్, ఫీచర్లు లీక్.. అదిరిపోయేలా -
రెడ్ మీ నోట్11 సిరీస్ ఫోన్ ఫీచర్లు లీక్, లుక్ అదిరిపోయింది..!
Redmi Note 11 series: చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ రెడ్ మీ నోట్11 సిరీస్ ఫోన్లను విడుదల చేయనుంది.న్యూ ఇయర్ సందర్భంగా రెడ్ మీ నోట్ 11 సిరీస్ ఫోన్లను తొలిసారి చైనాలో రిలీజ్ చేసి ఆ తర్వాత ఇండియాలో మార్చి నాటికి (అంచనా) విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో రెడ్ మీ నోట్ 11 సిరీస్ ఫోన్ ఫీచర్లు లీకయ్యాయి. ఆ లీకైన ఫోన్ ఫీచర్లు, వాటి ధరలు ఇలా ఉన్నాయి. రెడ్ మీ నోట్ 11ప్రో 5జీ ఫోన్ స్పెసిఫికేషన్స్ చైనాకు చెందిన ప్రముఖ టెక్ బ్లాగ్ సినా వీబో (sina weibo) వివరాల ప్రకారం..5జీ రెడ్ మీ నోట్ 11ప్రోలో హైస్పీడ్, మెరుగైన ఫీచర్లు, సూపర్ పవర్ ఎఫిషెన్సీ (సామర్ధ్యం) కోసం మీడియా టెక్ డైమెన్సిటీ 920 ఎస్ఓఎస్, 67డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 8జీబీ ర్యామ్ 256జీబీ ఇంట్రర్నల్ స్టోరేజ్, 120 హెచ్డి ఆమ్లోడ్ డిస్ప్లేను అందిస్తుంది. ఈ ప్రోరియెంట్ లో 108 ఎంపీ ప్రైమరీ సెన్సార్ కెమెరా, క్వాడ్ కెమెరా సెటప్, 16ఎంపీ ఫ్రంట్ కెమెరా సెన్సార్ ఫీచర్లు ఉన్నట్లు టెక్ బ్లాగ్ సినావిబో పేర్కొంది. రెడ్ మీ నోట్ 11ప్రో 5జీ ఫోన్ ధరలు రెడ్ మీ నోట్ 11ప్రో 5జీ ఫోన్ 6జీబీ ర్యామ్ 128జీబీ ఇంట్రర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ ధర చైనాలో ఇండియన్ కరెన్సీ ప్రకారం.రూ.18,600గా ఉంది. అదే 8జీబీ ర్యామ్ ఆప్షన్ తో 128జీబీ అండ్ 256జీబీ స్టోరేజ్ ఫోన్ ధరలు రూ.21,000, నుంచి రూ.23,300 మధ్యలో లభించనుంది. రెడ్ మీ నోట్ 11 5జీ స్పెసిఫికేషన్స్ రెడ్ మీ నోట్ 11 5జీ ఫోన్ 33 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనుంది. ఇక 120 హెచ్‌జెడ్ డిస్ప్లే,ఆమ్లోడ్ డిస్ప్లే, 50 ఎంపీ ప్రైమరీ సెన్సార్ కెమెరా,13 ఎంపీ ఫ్రంట్ కెమెరా, మీడియా టెక్ డైమన్సిటీ 810 ఎస్ఓసీ ఫీచర్లు ఉన్నట్లు తెలుస్తోంది. రెడ్ మీ నోట్ 11 5జీ ఫోన్ ధరలు ప్రస్తుతం లీకైన ఫీచర్స్ ప్రకారం 6జీబీ ప్లస్ 128జీబీ ఆప్షన్ ఉన్న ఫోన్ ధర రూ.14,000ఉండగా 8జీబీ ప్లస్ 128జీబీ ఆప్షన్ ఉన్న ఫోన్ ధర రూ.18,600గా ఉందని చైనా టెక్ బ్లాగ్ సినా వీబో తన కథనంలో పేర్కొంది. చదవండి: Xiaomi: షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్..ధర ఏంతంటే...! -
చైనా యాప్స్‌కు చెక్
బెంగళూరు: భారత్‌లో దేశీ యాప్స్‌కు ఆదరణ పెరుగుతుండగా.. చైనా యాప్స్ క్రమంగా వెనుకబడుతున్నాయి. మార్కెటింగ్ అనలిటిక్స్ సంస్థ యాప్స్‌ఫ్లయర్ నివేదిక ప్రకారం గతేడాది భారత మార్కెట్లో చైనా యాప్స్ వాటా 29%కి పరిమితం కాగా.. దేశీ యాప్స్ ఇన్స్టాల్స్ పరిమాణం 40%గా ఉంది. అత్యంత వేగంగా వృద్ధి చెందుతున్న భారత మార్కెట్లోకి ఇజ్రాయెల్, అమెరికా, రష్యా, జర్మనీ యాప్స్ కూడా ప్రవేశించి.. చైనా యాప్స్‌కు గట్టి పోటీనిచ్చేందుకు సిద్ధమవుతున్నాయి. నివేదిక ప్రకారం గతేడాది జనవరి 1 నుంచి నవంబర్ 30 మధ్య లో 4,519 యాప్స్‌కు సంబంధించి 730 కోట్ల ఇన్స్టాల్స్ నమోదయ్యాయి. వీటిలో వినోదం, ఫైనాన్స్, షాపింగ్, గేమింగ్, ట్రావెల్, న్యూస్ తదితర విభాగాల యాప్స్ ఉన్నాయి. చౌక హ్యాండ్సెట్స్, డేటా చార్జీల ఊతంతో ద్వితీయ, తృతీయ, నాలుగో శ్రేణి నగరాల్లో గేమింగ్, ఫైనాన్స్, వినోద విభాగాల్లో మొబైల్ వాడకం పెరిగింది. ప్రాంతీయ భాషల్లోనే కంటెంట్ లభ్యత ఈ ధోరణికి కారణమని యాప్స్‌ఫ్లయర్ ఇండియా కంట్రీ మేనేజర్ సంజయ్ త్రిశల్ తెలిపారు. ఫిన్‌టెక్ యాప్స్‌కు కష్టాలు.. చైనా స్మార్ట్‌ఫోన్ కంపెనీలు.. భారత మార్కెట్లో భారీగా అమ్మకాలు సాధిస్తున్నప్పటికీ.. ఫిన్‌టెక్ రంగంలో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించడం లేదు. షావోమి, ఒప్పో, రియల్‌మి వంటి పలు చైనా స్మార్ట్‌ఫోన్ సంస్థలు 2020 తొలినాళ్లలో తమ ఫిన్‌టెక్ యాప్స్‌ను ప్రవేశపెట్టాయి. మి పే, మి క్రెడిట్, ఒప్పో క్యాష్, రియల్‌మి పేసా పేర్లతో అందుబాటులోకి తెచ్చాయి. ఈ కంపెనీల స్మార్ట్ఫోన్లకు యూజర్ల సంఖ్య కోట్లలో ఉన్నప్పటికీ.. ఇప్పటిదాకా గూగుల్ ప్లే స్టోర్‌లో వీటిలో ఒక్కో యాప్ డౌన్లోడ్స్ పది లక్షల కన్నా తక్కువే ఉండటం గమనార్హం. ఇక లావాదేవీలు కూడా అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) ప్రకారం.. గతేడాది మొత్తం మీద చూస్తే నెలవారీ లావాదేవీలు మి పే ద్వారా 4,80,000, రియల్‌మి పేసాద్వారా 10,000 మాత్రమే జరిగాయి. అదే ఫోన్‌పే ద్వారా 90.23 కోట్లు, గూగుల్ పేలో 85.44 కోట్ల మేర నెలవారీ లావాదేవీలు నమోదయ్యాయి. ఇక తక్షణ రుణాలు, బీమా, మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడుల సరీ్వసులు మొదలైన వాటికీ ఆదరణ లభించడం లేదు. చైనాపై వ్యతిరేకతే కారణం.. తమకు ప్రస్తుతం ఉన్న యూజర్ల ఊతంతో ఆర్థిక సర్వీసులు మొదలైన విభాగాల్లోకి కూడా కార్యకలాపాలు విస్తరించవచ్చని చైనా కంపెనీలు భావించాయి. దానికి అనుగుణంగానే ఫిన్‌టెక్ సేవలను ప్రవేశపెట్టాయి. కానీ, భారత్–చైనా సరిహద్దుల్లో ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో చైనా కంపెనీలపై కూడా ఆ ప్రతికూల ప్రభావం కనిపిస్తోందని పరిశీలకులు తెలిపారు. దీంతో భారతీయుల్లో ప్రస్తుతం ఉన్న సెంటిమెంటు దృష్ట్యా చైనా కంపెనీలు పెద్దగా ప్రచార ఆర్భాటాల జోలికి పోవడం లేదని పేర్కొన్నారు. ఏడాది, రెండేళ్ల వ్యవధిలో బ్రాండ్లు మార్చేసే యూజర్లు.. ఆర్థిక సేవల విషయంలో ఎక్కువగా పేటీఎం లేదా గూగుల్ పే వంటి వాటినే ఎంచుకుంటారు తప్ప చైనా ఫిన్‌టెక్ యాప్‌లపై ఆధారపడటం లేదని వివరించారు. తగ్గుతున్న థర్డ్ పార్టీ యాప్స్ రుణాలు.. కరోనా వైరస్ మహమ్మారి దరిమిలా చాలా మంది క్రెడిట్ స్కోర్లు గతేడాది భారీగా పడిపోయాయి. దీంతో థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా రుణాల లావాదేవీలు కూడా గణనీయంగా తగ్గాయి. స్మార్ట్‌ఫోన్ బ్రాండ్లు తమ ఫిన్‌టెక్ కార్యకలాపాలను పెద్దగా విస్తరించలేకపోవడానికి ఇది కూడా ఒక కారణమని రీసెర్చ్ సంస్థ టెక్ఆర్క్ వర్గాలు తెలిపాయి. ఆయా కంపెనీలు తొందరపడకుండా, నెమ్మదిగా ప్రణాళికల అమలుపై పనిచేస్తున్నాయని ఒప్పో కాష్, రియల్‌మి పేసాకి సర్వీసులు అందించే ఫిన్‌షెల్ వర్గాలు వివరించాయి. -
చైనా మొబైల్స్ హవా: కొనుగోళ్లు జూమ్
సాక్షి, ముంబై: చైనా సంస్థలు తయారు చేసిన స్మార్ట్ఫోన్లకు దేశీయంగా ఉన్న క్రేజ్ ఇంతా అంతాకాదు. ఈ స్మార్ట్ఫోన్లకు భారతీయుల ఆదరణ రోజు రోజుకు పెరుగుతోందే తప్ప తరగడంలేదు. తాజాగా భారతీయ వినియోగదారులు వేలకోట్ల రూపాయల కొనుగోళ్లు జరిపారు. ముఖ్యంగా అద్భుత ఫీచర్లు, సరసమైన ధరల్లో చైనా ఉత్పత్తి సంస్థలు వినియోగదారులను కట్టిపడేస్తుండటంతో ఈ ధోరణి మరింత పెరుగుతోంది. ఆకర్షణీయమైన ఫోన్లను అందుబాటులోకి తీసుకొస్తూ ఇబ్బడిముబ్బడిగా లాభాలను సొంతం చేసుకుంటున్నాయి. 2018 ఆర్థిక సంవత్సరంలో 50వేలకోట్లను చైనా స్మార్ట్ఫోన్లపై వెచ్చించారు. గత ఏడాదితో పోలిస్తే ఇది దాదాపు రెట్టింపు. ముఖ్యంగా చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ తయారీ దిగ్గజాలు షావోమి, ఒప్పో, వివో, హానర్ కంపెనీలు ముందు వరుసలో ఉన్నాయి. వీటితో పాటు లెనోవో, మోటరోలా, వన్‌ప్లస్, ఇనిఫినిక్స్ లాంటి కంపెనీలు భారతీయ స్మార్ట్‌ఫోన్ మార్కెట్ విక్రయాల్లో సగానికిపైగా వాటాను కొల్లగొట్టాయి. అలాగే ప్రస్తుత గణాంకాల ప్రకారం చైనా బ్రాండ్లస్మార్ట్‌ఫోన్లకు దేశీయంగా డిమాండ్ విపరీతంగా పెరుగుతున్న ధోరణి కనిపిస్తోందని ఎనలిస్టులు, పరిశ్రమ ప్రతినిధులు విశ్లేషించారు. -
భారత్‌లో చైనా ఫోన్ల హవా
న్యూఢిల్లీ: భారత్‌లో చైనా ఫోన్ల హవా కొనసాగుతోంది. ప్రపంచంలో అతపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా పేరుపొందింది. దేశీయ మార్కట్లో సుమారు 49శాతం స్మార్ట్ఫోన్లు చైనావే. దేశీయ బ్రాండ్ల హవా తగ్గిపోయింది. ఇటీవల ఓ సర్వే సంస్థ నిర్వహించిన సర్వేలో భారత్‌లో చైనా కంపెనీలైన షియోమీ, ఒప్పో కంపెనీల ఫోన్లను అధిక మెత్తంలో వాడుతున్నట్లు వెల్లడించింది. నోట్ల రద్దు అనంతరం 2017 మొదటి మూడు నెలల్లో 27 మిలియన్ల ఫోన్లు అమ్ముడైనట్లు తెలిపింది. గతేడాదితో పోలిస్తే చైనా కంపెనీల అమ్మకాలు 180 శాతం పెరిగాయి. మెత్తం అమ్ముపోయిన పోన్లలో చైనా ఫోన్లు 49శాతం వాటా దక్కించుకున్నాయి. వీటిలో శాంసంగ్ 29.80 శాతంతో మొదటి స్థానంలో ఉండగా తర్వాతి స్థానాల్లో షియోమీ 12.90 శాతంతో రెండోస్థానంలో ఉంది. వివో 12.81 శాతం, ఒప్పో ఫోన్ 11.80 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారతీయులు అత్యంత ఇష్టపడే యాపిల్ ఐఫోన్ చివరి స్థానంలోఉంది. తక్కువ ధరలో ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్, క్వాలిటీ కెమెరా, బ్యాటరీ బ్యాకప్ వంటి ఎక్కువ ఫీచర్లు అందిస్తుండటంతో భారత్‌లో వీటి మార్కెట్ గణనీయంగా పెరిగింది. ధరలు ఎక్కువగా ఉండటం సరైన మార్కెటింగ్ లేకపోవడంతో యాపిల్ ఐఫోన్ వెనుకబడిపోయింది. -
ఇండియాలో చైనా స్మార్ట్ ఫోన్ల హవా
బీజింగ్: భారత మార్కెట్ లో చైనా స్మార్ట్ ఫోన్లు దూసుకుపోతున్నాయి. ప్రపంచంలో రెండో అతిపెద్ద విపణిగా అవతరించిన భారత్ లో గతేడాది చైనా ఫోన్లు 40 శాతం వరకు అమ్ముడుపోయాయి. ఇండియాలో నిరుడు అత్యధికంగా అమ్ముడైన ఫోన్లలో లెనొవో రెండో స్థానంలో నిలిచినట్టు ఇంటర్నేషనల్ డేటా కార్పొరేషన్(ఐడీసీ) సర్వేలో తేలిందని చైనా అధికారిక పత్రిక వెల్లడించింది. శాంసంగ్ టాప్ లో ఉంది. 10. 7 శాతంతో షియామి మూడు స్థానం దక్కించుకుంది. చైనా కంపెనీలు ప్రవేశించడంతో భారత స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు తగ్గుముఖం పట్టాయని 30 ప్రధాన నగరాల్లో నిర్వహించిన సర్వేలో తేలింది. మైక్రోమ్యాక్స్ అమ్మకాలు అక్టోబర్ లో 16.7 శాతం క్షీణించినట్టు వెల్లడైంది. మార్కెట్ అవకాశాల్లో ‘న్యూ చైనా’గా అభివృద్ధి చెందుతున్న భారత్ లో స్మార్ట్ ఫోన్ల అమ్మకాలు మున్ముందు మరింత పెరుగనున్నాయి. తక్కువ ధరల్లో ఎక్కువ ఫీచర్లున్న ఫోన్లను కొనేందుకు భారతీయులు ఆసక్తి చూపిస్తున్నారు. ఈ కారణంగానే లెనొవో అమ్మకాలు గణనీయంగా పెరిగినట్టు సర్వే అంచనా వేసింది. మోటొరాలా హైయండ్ ఫోన్ల అమ్మకాలపై దృష్టి సారించింది.