భారత్‌లో చైనా ఫోన్‌ల హవా
న్యూఢిల్లీ: భారత్‌లో చైనా ఫోన్‌ల హవా కొనసాగుతోంది. ప్రపంచంలో అతపెద్ద స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌గా పేరుపొందింది. దేశీయ మార్కట్లో సుమారు 49శాతం స్మార్ట్‌ఫోన్లు చైనావే. దేశీయ బ్రాండ్‌ల హవా తగ్గిపోయింది. ఇటీవల ఓ సర్వే సంస్థ నిర్వహించిన సర్వేలో భారత్‌లో చైనా కంపెనీలైన షియోమీ, ఒప్పో కంపెనీల ఫోన్‌లను అధిక మెత్తంలో వాడుతున్నట్లు వెల్లడించింది. నోట్ల రద్దు అనంతరం 2017 మొదటి మూడు నెలల్లో 27 మిలియన్ల ఫోన్లు అమ్ముడైనట్లు తెలిపింది. గతేడాదితో పోలిస్తే చైనా కంపెనీల అమ్మకాలు 180 శాతం పెరిగాయి.
మెత్తం అమ్ముపోయిన పోన్లలో చైనా ఫోన్లు 49శాతం వాటా దక్కించుకున్నాయి. వీటిలో శాంసంగ్ 29.80 శాతంతో మొదటి స్థానంలో ఉండగా తర్వాతి స్థానాల్లో షియోమీ 12.90 శాతంతో రెండోస్థానంలో ఉంది. వివో 12.81 శాతం, ఒప్పో ఫోన్ 11.80 శాతంతో తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. భారతీయులు అత్యంత ఇష్టపడే యాపిల్ ఐఫోన్ చివరి స్థానంలోఉంది. తక్కువ ధరలో ర్యామ్, ఇంటర్నల్ స్టోరేజ్, క్వాలిటీ కెమెరా, బ్యాటరీ బ్యాకప్ వంటి ఎక్కువ ఫీచర్లు అందిస్తుండటంతో భారత్‌లో వీటి మార్కెట్ గణనీయంగా పెరిగింది. ధరలు ఎక్కువగా ఉండటం సరైన మార్కెటింగ్ లేకపోవడంతో యాపిల్ ఐఫోన్ వెనుకబడిపోయింది.