Redmi Note 11 5G: Price And Specifications Leaked Online - Sakshi
Sakshi News home page

Redmi Note 11 series: రెడ్‌ మీ నోట్‌11 సిరీస్‌ ఫోన్‌ ఫీచర్లు లీక్‌, లుక్ అదిరిపోయింది..!

Published Sat, Oct 16 2021 12:48 PM | Last Updated on Sat, Oct 16 2021 2:03 PM

Redmi Note 11 Series Price And Specifications Leaked Online - Sakshi

Redmi Note 11 series: చైనా స్మార్ట్‌ ఫోన్‌ తయారీ సంస్థ షావోమీ రెడ్‌ మీ నోట్‌11 సిరీస్‌ ఫోన్‌లను విడుదల చేయనుంది.న్యూ ఇయర్‌ సందర్భంగా రెడ్‌ మీ నోట్‌ 11 సిరీస్‌ ఫోన్లను తొలిసారి చైనాలో రిలీజ్‌ చేసి ఆ తర్వాత ఇండియాలో మార్చి నాటికి (అంచనా) విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో రెడ్‌ మీ నోట్‌ 11 సిరీస్‌ ఫోన్‌ ఫీచర్లు లీకయ్యాయి. ఆ లీకైన ఫోన్‌ ఫీచర్లు, వాటి ధరలు ఇలా ఉన్నాయి. 

రెడ్‌ మీ నోట్‌ 11ప్రో  5జీ  ఫోన్‌ స్పెసిఫికేషన్స్‌ 
చైనాకు చెందిన ప్రముఖ టెక్‌ బ్లాగ్‌ సినా వీబో (sina weibo) వివరాల ప్రకారం..5జీ  రెడ్ మీ నోట్ 11ప్రోలో హైస్పీడ్‌, మెరుగైన ఫీచర్లు, సూపర్‌ పవర్ ఎఫిషెన్సీ (సామర్ధ్యం) కోసం మీడియా టెక్‌ డైమెన్‌సిటీ 920 ఎస్‌ఓఎస్‌, 67డబ్ల్యూ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌ 5000ఎంఏహెచ్‌ బ్యాటరీ, 8జీబీ ర్యామ్‌ 256జీబీ ఇంట్రర్నల్‌ స్టోరేజ్‌, 120 హెచ్‌డి ఆమ్లోడ్‌ డిస్‌ప్లేను అందిస్తుంది. ఈ ప్రోరియెంట్ లో 108 ఎంపీ ప్రైమరీ సెన్సార్‌ కెమెరా, క్వాడ్‌ కెమెరా సెటప్‌, 16ఎంపీ ఫ్రంట్‌ కెమెరా సెన్సార్‌ ఫీచర్లు ఉన్నట్లు టెక్‌ బ్లాగ్‌ సినావిబో పేర్కొంది. 

రెడ్‌ మీ నోట్‌ 11ప్రో  5జీ  ఫోన్‌  ధరలు 
రెడ్‌ మీ నోట్‌ 11ప్రో  5జీ  ఫోన్‌ 6జీబీ  ర్యామ్‌ 128జీబీ ఇంట్రర్నల్‌ స్టోరేజ్‌తో అందుబాటులోకి రానున్న ఈ ఫోన్‌  ధర చైనాలో ఇండియన్‌ కరెన్సీ ప్రకారం.రూ.18,600గా ఉంది. అదే 8జీబీ ర్యామ్‌ ఆప్షన్‌ తో 128జీబీ అండ్‌ 256జీబీ స్టోరేజ్‌ ఫోన్‌ ధరలు రూ.21,000,  నుంచి రూ.23,300 మధ్యలో లభించనుంది. 

రెడ్‌ మీ నోట్‌ 11 5జీ స్పెసిఫికేషన్స్‌ 
రెడ్‌ మీ నోట్‌ 11 5జీ ఫోన్‌ 33 డబ్ల్యూ ఫాస్ట్‌ ఛార్జింగ్‌ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్‌ బ్యాటరీని అందించనుంది. ఇక 120 హెచ్‌జెడ్‌ డిస్‌ప్లే,ఆమ్లోడ్‌ డిస్‌ప‍్లే, 50 ఎంపీ ప్రైమరీ సెన్సార్‌ కెమెరా,13 ఎంపీ ఫ్రంట్‌ కెమెరా, మీడియా టెక్​ డైమన్​సిటీ 810 ఎస్‌ఓసీ ఫీచర్లు ఉన్నట్లు తెలుస్తోంది. 

రెడ్‌ మీ నోట్‌ 11 5జీ ఫోన్‌ ధరలు
ప్రస్తుతం లీకైన ఫీచర్స్‌ ప్రకారం 6జీబీ ప్లస్‌ 128జీబీ ఆప‍్షన్‌ ఉన్న ఫోన్‌ ధర రూ.14,000ఉండగా 8జీబీ ప్లస్‌ 128జీబీ ఆప్షన్‌ ఉన్న ఫోన్‌ ధర రూ.18,600గా ఉందని చైనా టెక్‌ బ్లాగ్‌ సినా వీబో తన కథనంలో పేర్కొంది.

చదవండి: Xiaomi: షావోమీ 11 లైట్‌ ఎన్‌ఈ 5జీ స్మార్ట్‌ఫోన్‌ లాంచ్‌..ధర ఏంతంటే...!

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement