specifications leaked
-
వన్‌ప్లస్ ఫోన్ స్పెసిఫికేషన్లు సూపర్! విడుదలకు ముందే వివరాలు లీక్!
స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ వన్‌ప్లస్(OnePlus) భారత్‌లో వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3 లైట్ (OnePlus Nord CE 3 Lite)ని వన్‌ప్లస్ నార్డ్ బడ్స్2 (OnePlus Nord Buds 2)తో పాటు ఏప్రిల్ 4న విడుదల చేయనుంది. అయితే లాంచ్‌కు ముందే ఈ స్మార్ట్ ఫోన్ స్పెసిఫికేషన్లు ఆన్లైన్లో దర్శనమిస్తున్నాయి. ఇదీ చదవండి: మస్క్ ఏం చేసినా మామూలుగా ఉండదు.. ఆఫీస్‌కి రానక్కరలేదని అర్ధరాత్రి మెయిల్స్! ‘వన్‌ప్లస్ నార్డ్ సీఈ 3’ స్పెసిఫికేషన్లు (అంచనా): 6.7అంగుళాల ఫుల్ హెచ్డీ ప్లస్ స్క్రీన్ క్వాల్‌కాం స్నాప్‌డ్రాగన్( Qualcomm Snapdragon) 695 5G ప్రాసెసర్ 8GB ర్యామ్ 128GB వరకు పెంచుకునే స్టోరేజీ సామర్థ్యం. 108MP ప్రైమరీ కెమెరాతోపాటు 2MP డ్యూయల్ కెమెరా. 5,000 mAh బ్యాటరీ, 67వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ప్రారంభ ధర ₹ 19,999. కొత్త గ్రీన్ కలర్ వేరియంట్ (పాస్టెల్ లైమ్). ఇదీ చదవండి: Job search: ఇది మామూలు దండయాత్ర కాదు! 150కిపైగా కంపెనీలకు అప్లై చేశాడు.. మొత్తానికి... -
ఈ ఫోన్ దూకుడు మామూలుగా లేదుగా, అదిరిపోయే ఫీచర్లతో
దసరా,దివాళీ సేల్స్‌తో స్మార్ట్ ఫోన్ మార్కెట్లో సందడి చేసిన చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో...తాజాగా మరో సిరీస్ ఫోన్లు విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే వరుస సిరీస్ విడుదలతో దూకుడు మీదున్న వివో సంస్థ ఇప్పటుడు'వీ23ఈ' పేరుతో మరో సిరీస్‌ను విడుదల చేయనుంది. త్వరలో స్మార్ట్ ఫోన్ మార్కెట్లో అందుబాటులోకి రానున్న సిరీస్ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు వెలుగులోకి వచ్చాయి. వివో వీ23ఈ ఫీచర్లు వివో వీ23ఈ సిరీస్ ఫోన్ ఫీచర్లపై టిప్‌స్టర్ సుధాన్షు ఆంబోర్ ట్వీట్ చేశారు. ఈ ఫోన్లో మీడియా టెక్ హీలియా జీ96 చిప్ సెట్, 4,050ఎంఏహెచ్ బ్యాటరీ, రెక్టాంగిల్ కెమెరా మాడ్యుల్, ట్రిపుల్ కెమెరా సెటప్, ఫోన్ వెనుక భాగంలో 64 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, వాటర్‌డ్రాప్ స్టైల్ నాచ్ డిస్ప్లే, డ్యూయల్-సిమ్ (నానో), ఆండ్రాయిడ్ 11 వెర్షన్ బేస్డ్ ఫన్ టచ్ 12తో రన్ అవుతుంది. 6.44-అంగుళాల, 2,400x1,080 పిక్సెట్స్, ఆమోలెడ్ డిస్ప్లే, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌ను అందిస్తుంది. ఫోటోలు, వీడియోల కోసం వివో 64 మెగాపిక్సె మెయిన్ సెన్సార్లతో ట్రిపుల్ రేర్ కెమెరా, కెమెరా సెటప్‌లో 8-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, 2-మెగాపిక్సెల్ 3వ స్నాపర్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. టిప్‌స్టర్ ప్రకారం..వివో వీ23ఈ 44డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,050mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. హ్యాండ్సెట్ ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఆన్‌బోర్డ్ సెన్సార్లు గ్రావిటీ సెన్సార్, లైట్ సెన్సార్, గైరోస్కోప్, టెలస్కోప్ ఫీచర్లతో పాటు కనెక్టివిటీ కోసం డ్యూయల్-బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్, యూఎస్బీ టైప్-సీ పోర్ట్ సదుపాయంతో అందుబాటులో రానున్నట్లు లీకైన రిపోర్ట్లలో తెలుస్తోంది. చదవండి: దేశంలో దూసుకెళ్తున్న 5జీ స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు -
రెడ్ మీ నోట్11 సిరీస్ ఫోన్ ఫీచర్లు లీక్, లుక్ అదిరిపోయింది..!
Redmi Note 11 series: చైనా స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షావోమీ రెడ్ మీ నోట్11 సిరీస్ ఫోన్లను విడుదల చేయనుంది.న్యూ ఇయర్ సందర్భంగా రెడ్ మీ నోట్ 11 సిరీస్ ఫోన్లను తొలిసారి చైనాలో రిలీజ్ చేసి ఆ తర్వాత ఇండియాలో మార్చి నాటికి (అంచనా) విడుదల చేసేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నేపథ్యంలో రెడ్ మీ నోట్ 11 సిరీస్ ఫోన్ ఫీచర్లు లీకయ్యాయి. ఆ లీకైన ఫోన్ ఫీచర్లు, వాటి ధరలు ఇలా ఉన్నాయి. రెడ్ మీ నోట్ 11ప్రో 5జీ ఫోన్ స్పెసిఫికేషన్స్ చైనాకు చెందిన ప్రముఖ టెక్ బ్లాగ్ సినా వీబో (sina weibo) వివరాల ప్రకారం..5జీ రెడ్ మీ నోట్ 11ప్రోలో హైస్పీడ్, మెరుగైన ఫీచర్లు, సూపర్ పవర్ ఎఫిషెన్సీ (సామర్ధ్యం) కోసం మీడియా టెక్ డైమెన్సిటీ 920 ఎస్ఓఎస్, 67డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ 5000ఎంఏహెచ్ బ్యాటరీ, 8జీబీ ర్యామ్ 256జీబీ ఇంట్రర్నల్ స్టోరేజ్, 120 హెచ్డి ఆమ్లోడ్ డిస్ప్లేను అందిస్తుంది. ఈ ప్రోరియెంట్ లో 108 ఎంపీ ప్రైమరీ సెన్సార్ కెమెరా, క్వాడ్ కెమెరా సెటప్, 16ఎంపీ ఫ్రంట్ కెమెరా సెన్సార్ ఫీచర్లు ఉన్నట్లు టెక్ బ్లాగ్ సినావిబో పేర్కొంది. రెడ్ మీ నోట్ 11ప్రో 5జీ ఫోన్ ధరలు రెడ్ మీ నోట్ 11ప్రో 5జీ ఫోన్ 6జీబీ ర్యామ్ 128జీబీ ఇంట్రర్నల్ స్టోరేజ్‌తో అందుబాటులోకి రానున్న ఈ ఫోన్ ధర చైనాలో ఇండియన్ కరెన్సీ ప్రకారం.రూ.18,600గా ఉంది. అదే 8జీబీ ర్యామ్ ఆప్షన్ తో 128జీబీ అండ్ 256జీబీ స్టోరేజ్ ఫోన్ ధరలు రూ.21,000, నుంచి రూ.23,300 మధ్యలో లభించనుంది. రెడ్ మీ నోట్ 11 5జీ స్పెసిఫికేషన్స్ రెడ్ మీ నోట్ 11 5జీ ఫోన్ 33 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించనుంది. ఇక 120 హెచ్‌జెడ్ డిస్ప్లే,ఆమ్లోడ్ డిస్ప్లే, 50 ఎంపీ ప్రైమరీ సెన్సార్ కెమెరా,13 ఎంపీ ఫ్రంట్ కెమెరా, మీడియా టెక్ డైమన్సిటీ 810 ఎస్ఓసీ ఫీచర్లు ఉన్నట్లు తెలుస్తోంది. రెడ్ మీ నోట్ 11 5జీ ఫోన్ ధరలు ప్రస్తుతం లీకైన ఫీచర్స్ ప్రకారం 6జీబీ ప్లస్ 128జీబీ ఆప్షన్ ఉన్న ఫోన్ ధర రూ.14,000ఉండగా 8జీబీ ప్లస్ 128జీబీ ఆప్షన్ ఉన్న ఫోన్ ధర రూ.18,600గా ఉందని చైనా టెక్ బ్లాగ్ సినా వీబో తన కథనంలో పేర్కొంది. చదవండి: Xiaomi: షావోమీ 11 లైట్ ఎన్ఈ 5జీ స్మార్ట్‌ఫోన్ లాంచ్..ధర ఏంతంటే...! -
ఐఫోన్-14 ఫీచర్స్ లీక్..మాములుగా లేవుగా!
గత వారం యాపిల్ దిగ్గజం విడుదల చేసిన ఐఫోన్ 13 సిరీస్ మోడల్ ఫోన్ అమ్మకాలు సెప్టెంబర్ 24 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఐఫోన్ 14 సిరీస్ ఫోన్ ఫీచర్లు లీక్ అయ్యాయి.దీంతో ఐఫోన్ 14సిరీస్ గురించి చర్చ మొదలైంది.ఐఫోన్ 14మోడల్ ఫోన్లు ఎప్పుడు విడుదలవుతాయి.వాటి ధరలు ఎలా ఉంటాయి. ఏఏ ఫీచర్లు ఉండనున్నాయి. అనే అంశం ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. ఐఫోన్ 14 సిరీస్ ఫోన్ ఫీచర్స్ చైనాలో యాపిల్ ఐఫోన్ అమ్మకాలు జరిపే సంస్థల నుంచి సేకరించిన వివరాల ఆధారంగా ఆ దేశానికి చెందిన టెక్నాలజీ బ్లాగ్ 'గిజ్చైనా' కథనాన్ని ప్రచురించింది. ఆ కథనం ప్రకారం..2022లో ఐఫోన్ 14 సిరీస్ మోడల్ ఫోన్లు కనీసం మూడు మోడల్ ఫోన్లను యాపిల్ విడుదల చేస్తున్నట్లు తెలుస్తోంది. వచ్చే ఏడాది విడుదల కావాల్సిన యాపిల్ 14సిరీస్‌లోని ఓ మోడల్ ఫోన్ 120హెచ్‌జెడ్ డిస్ప్లే, మరో ఫోన్ 60హెచ్‌జెడ్ ఎల్‌టిపిఎస్ ఓఎల్ఇడి డిస్ప్లేతో రానుంది. ఇదే నిజమైతే ఐఫోన్ 14 సిరీస్ బేసిక్ ఫోన్ ఐఫోన్ 14 మినీ 60హెచ్ స్క్రీన్‌తో విడుదల కానుందని భావిస్తున్నారు. ప్రస్తుతం ఐఫోన్ 13 ధరల కంటే ఐఫోన్ 14సిరీస్ ఫోన్ తక్కువ ధరకే లభ్యం కానుంది. ఐఫోన్ 14 సిరీస్ ఫోన్ విడుదల ఎప్పుడంటే ? యాపిల్ సంస్థ ఐఫోన్ 14మోడల్ ఫోన్లను 2022లో విడుదల చేస్తుందని చైనా టెక్ బ్లాగ్ తన కథనంలో పేర్కొంది. అయితే 2022లో ఐఫోన్ 14 సిరీస్‌తో వచ్చే ఫీచర్లు గురించి ఇప్పుడే కాదు. గతంలో సైతం విడుదలైన నివేదికల్లో ఐఫోన్ 14 మాక్స్ విడుదల చేసినా ఐఫోన్ 14 మినీని విడుదల చేయకపోవచ్చనే నివేదికలు సూచించాయి. అది అయిపోతే, ఐఫోన్ 14 ,ఐఫోన్ 14 ప్రో, ఐఫోన్ 14 మాక్స్,ఐఫోన్ 14 ప్రో మాక్స్ మోడళ్లతో విడుదల కానుంది. ఐఫోన్ 14 మోడల్స్ ఆపిల్ ఏ16 చిప్సెట్,ప్రొటెక్ట్ కోసం ఫేస్ఐడీ, టచ్ ఐడి ఫీచర్లతో ఐఫోన్ 14 విడుదల కానుందనే ప్రచారం సోషల్ మీడియాలో జోరుగా సాగుతుండగా..ఐఫోన్ 14ఫోన్ మోడళ్ల ఎల్టీపీఓ (A low-temperature polycrystalline oxide (LTPO) display ) డిస్ ప్లే తయారీ కోసం ఎల్జీ యాపిల్‌తో చేతులు కలపనుంది. చదవండి: ఐఫోన్ 13 వచ్చేసింది.. అదిరిపోయే ఫీచర్లుతో.. -
రెడ్ మీ నుండి ఫస్ట్ ల్యాపీ.. ఎలా ఉందో తెలుసా?
Xiaomi First Laptop: చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమీ నేడు తొలిసారి రెడ్మీ ల్యాప్‌ట్యాప్ లను మార్కెట్లో విడుదల చేయనుంది. స్మార్ట్ఫోన్లు, ల్యాప్ ట్యాప్‌ల వినియోగం పెరిగి పోతుండడంతో ఆయా టెక్ సంస్థలు వినియోగదారులకు అనుగుణంగా గాడ్జెట్స్‌ను అందుబాటులోకి తెస్తున్నాయి. యూజర్లను అట్రాక్ట్ చేస్తున్నాయి. తాజాగా, షియోమీ సంస్థ 'రెడ్ మీ బుక్' పేరుతో రెండు మోడళ్లను ల్యాప్ ట్యాప్‌లను విడుదల చేస్తున్నట్లు అధికారంగా ప్రకటించింది. గతేడాది రెడ్ మీ బ్రాండ్ పేరుతో భారీ ఎత్తున పవర్ బ్యాంక్స్, ఇయర్ బడ్స్, స్మార్ట్ బ్రాండ్‌ను విడుదల చేసింది. ఈ ఏడాది స్మార్ట్ టీవీలను లాంఛ్ చేసింది. ఇప్పుడు అదే బ్రాండ్ పేరుతో ల్యాప్ ట్యాప్‌లను విడుదల చేయడం టెక్ మార్కెట్లో ప్రాధాన్యతను సంతరించుకుంది. రెడ్ మీ బుక్ ల్యాప్ ట్యాప్ ఫీచర్స్ ప్రస్తుతం ఉన్న విండోస్ - 10 తో పాటు త్వరలో అప్ డేట్ కానున్న విండోస్ -11ను అప్ గ్రేడ్ చేసుకునే విధంగా రెడ్ మీ బుక్ ల్యాప్‌ట్యాప్ ను డిజైన్ చేశారు. దీంతో పాటు 15 అంగుళాల స్క్రీన్ సైజ్, 1920*1080 పిక్సెల్స్ రెజెల్యూషన్‌తో ఫుల్ హెచ్డీ డిస్ప్లే, వెబ్ క్యామ్ కోసం లైట్ బెజెల్స్‌ను ఏర్పాటు చేయడం మరింత ఆసక్తికరంగా మారింది. డ్యూయల్ బ్యాండ్ వైఫై, వీ 5.0 బ్లూటూత్, సీ టైప్ 3.1యూఎస్బీ, యూఎస్బీ టైప్ -ఏ,యూఎస్ బీ 2.0, ఆడియో జాక్, రెండు స్టెరో స్పీకర్స్ ఉన్నాయి. ఈ ల్యాప్ ట్యాప్‌లో మరో ఇంట్రస్టింగ్ ఫీచర్ ఏంటంటే ఇంటెల్ లెవెన్త్ జనరేషన్ లో ఐ3,ఐ5 ప్రాసెసర్ తో పనిచేయనుంది. 8జీబీ ర్యామ్, 512జీబీ సాలిడ్ స్టేట్ డ్రైవ్ (ఎస్ఎస్డీ), 65 వాట్ల ఛార్జర్, ఒక్కసారి ఛార్జింగ్ పెడితే 10 గంటల పాటు వినియోగించుకోవచ్చేని రెడ్ మీ పేర్కొంది. కాస్ట్ ఎంత ఉండొచ్చు ప్రస్తుతం ల్యాప్ ట్యాప్ స్పెసిఫికేషన్లు అందుబాటులోకి వచ్చినా ధరపై షియోమీ సంస్థ స్పష్టత ఇవ్వాల్సి ఉంది. టెక్ నిపుణులు మాత్రం రెడ్ మీ బుక్ ల్యాప్ ట్యాప్‌లు రూ.50వేల లోపు ఉంటాయని అంచనా వేస్తున్నారు. -
ఫీచర్స్ లీకయ్యాయి, ఆపిల్ తరహాలో
టెక్ యుగంలో గాడ్జెట్స్ వినియోగం బాగా పెరిగిపోయింది. దైనందిన జీవితంలో భాగమైన గాడ్జెట్స్‌ను విడుదల చేసేందుకు ఆయా స్మార్ట్ దిగ్గజ సంస్థలు పోటీ పడుతున్నాయి. తాజాగా చైనా సంస్థ రియల్ మీ టాబ్లెట్, రియల్ మీ ప్యాడ్లను విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఈ ఏడాదిలోపే విడుదల కానున్న ఈ గాడ్జెట్స్ ధర ఎంతో కన్ఫామ్ కాకపోయినప్పటికి వాటి ఫీచర్స్ లీకయ్యాయి. ఫీచర్స్ ఇలా ఉన్నాయి టిప్‌స్టెర్ కథన ప్రకారం రియల్మీ ప్యాడ్ 7000ఎంఏహెచ్ బ్యాటరీ, 65 డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్‌తో వస్తుంది. ప్రస్తుతం 65 వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్ కావాలంటే 45000ఏంఎంహెచ్ బ్యాటరీ తప్పనిసరిగా ఉండాలి.లుక్ వైజ్‌గా చూసుకుంటే రియల్మీ ప్యాడ్.. ఆపిల్ ఐప్యాడ్‌ను పోలి ఉంటుందని తేలింది. ఎందుకంటే అన్నీ వైపులా మెటాలిక్ ఫినిషింగ్ కలిగి ఉంది. ప్యాడ్ వెనుక భాగంలో కేవలం ఒక కెమెరాను కలిగి ఉండడం మరో విశేషం. రెండర్లు బెజెల్స్ సన్నగా ఉండి బటన్ డిజైన్ తక్కువగా ఉంది. యూరోపియన్ మార్కెట్ కోసం తహతహలాడుతున్న రియల్ మీ ఈ ఏడాది జిటి 5జి లాంచ్ ఈవెంట్లో రియల్మీ ప్యాడ్‌ను విడుదల చేయనున్నట్లు తెలిపింది. టాబ్లెట్ మాత్రమే కాదు రియల్మీ బుక్ అని పిలిచే ల్యాప్ ట్యాప్‌ను కూడా విడుదల చేసేందుకు సిద్ధమైంది. ప్రస్తుతానికి ఫీచర్స్ ఇలా ఉన్నా త్వరలో దాని ధరెంతో తెలిసే అవకాశం ఉందని టెక్ నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
విడుదలకు ముందే వన్‌ప్లస్ 7టీ ఫీచర్లు వెల్లడి
న్యూఢిల్లీ : వన్‌ప్లస్ 7టీ స్పెసిఫికేషన్స్‌పై గతంలో అక్కడక్కడా లీకులు వచ్చినా తాజాగా 7టీ, 7టీ ప్రొ ఫీచర్లన్నీ పూర్తిగా వెల్లడయ్యాయి. అధికారికంగా సెప్టెంబర్ 26న యూరప్‌లో విడుదల కానున్న ఈ రెండు ఒన్‌ప్లస్ హ్యాండ్సెట్స్ పూర్తి స్పెసిఫికేషన్స్ ఇవేనంటూ వన్‌ప్లస్ సీఈవో పెటె లావ్ వెల్లడించేశారు. ఈ హ్యాండ్సెట్లు క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 855ప్లస్ ప్రాసెసర్‌పై రన్ అవుతాయని గతంలో వచ్చిన వార్తలు వాస్తవమేనని తేలింది. ఇక వన్‌ప్లస్ 7టీ 6.55 ఇంచ్‌లతో 90హెచ్జడ్ ఏఎంఓఎల్‌ఈడీ డిస్ప్లేను కలిగిఉంటుంది. 7టీ ప్రొ అత్యున్నత రిజల్యూషన్‌తో అందుబాటులోకి రానుంది. ఈ రెండు డివైజ్‌ల్లో 48 మెగాపిక్సెల్‌తో కూడిన మూడు కెమెరాలుంటాయి. 8 మెగా పిక్సెల్ టెలిఫోటో, 16 మెగాపిక్సెల్ అల్ట్రా వీడియో కెమెరాలతో పాటు ముందు భాగంలో 16 మెగాపిక్సెల్ కెమెరా అమర్చారు. ఇక సైజ్‌కు తగినట్టే ఒన్‌ప్లస్ ప్రొ భారీ బ్యాటరీతో అందుబాటులోకి రానుంది. ఒన్‌ప్లస్ 7టీ జీబీ రామ్‌తో పాటు 3800 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కలిగి ఉండగా ప్రొ 8జీబీ ర్యామ్, 4085 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యంతో అందుబాటులోకి రానుంది. ఇక ఈ రెండు ఫోన్లు ఆండ్రాయిడ్ 10పై ఆక్సిజెన్ఓస్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా పనిచేస్తాయి. ఈ ఫోన్ ధర రూ.65 వేల వరకు ఉండే అవకాశముంది. -
వన్‌ప్లస్ 5టీ ఫుల్ స్పెషిఫికేషన్లివే!
లాంచింగ్‌కు ముందే వన్‌ప్లస్ 5టీ స్మార్ట్‌ఫోన్ ఫుల్ స్పెషిఫికేషన్లు ఆన్లైన్లో లీకయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్ నవంబర్ 16న లాంచింగ్‌కు సిద్దమై ఉంది. కానీ దీని ముందస్తుగానే ఆన్లైన్లో దీని వివరాలు బయటికి వచ్చాయి. లీకైన వివరాల ప్రకారం వన్‌ప్లస్ 5టీ స్మార్ట్‌ఫోన్ 6.01 అంగుళాలతో అతిపెద్దగా18:9 డిస్ప్లేను కలిగి ఉంటుందని తెలిసింది. కార్నింగ్ గొర్రిల్లా గ్లాస్ 5, అమోలెడ్ డిస్ప్లేతో ఇది రూపొందిందట. ఒరిజనల్‌గా వన్‌ప్లస్ 5 స్మార్ట్‌ఫోన్ 5.5 అంగుళాల ఫుల్ హెచ్డీ రెజుల్యూషన్ డిస్ప్లేను కలిగి ఉంది. వన్‌ప్లస్ 5 మాదిరిగానే వన్‌ప్లస్ 5టీ కూడా ఆక్టా-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 835 ప్రాసెసర్‌తోనే రన్ అవుతుంది. స్టోరేజ్ పరంగా ఇది రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఒకటి 6జీబీ ర్యామ్, 64జీబీ ఇంటర్నల్ స్టోరేజ్. మరొకటి 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్. వన్‌ప్లస్ 5టీలో అతిపెద్ద మార్పు హోమ్ బటన్ లేకపోవడం. ఫింగర్ ప్రింట్ స్కానర్ వెనుకవైపు ఉంటుంది. ఆండ్రాయిడ్ 7.1.1 నోగట్ ఆధారితంగా ఆక్సీజన్ ఓఎస్‌తో ఇది రన్ అవుతుంది. కెమెరా పరంగా తీసుకుంటే వన్‌ప్లస్ 5టీ స్మార్ట్‌ఫోన్‌కు డ్యూయల్ 16ఎంపీ సోనీ ఐఎంఎక్స్ 398, 20ఎంపీ ఐఎంఎక్స్ 376కే డ్యూయల్ కెమెరాలుంటాయి. ఇక చివరిగా ఈ స్మార్ట్‌ఫోన్ 3,300 ఎంఏహెచ్ నాన్-రిమూవబుల్ బ్యాటరీతో మార్కెట్లోకి వస్తుందని తెలుస్తోంది. -
శాంసంగ్ కొత్త ఫోన్ ఎలా ఉంటుందో తెలుసా..?
శాంసంగ్ గెలాక్సీ ఎస్7 ఫోన్, మరో కొత్త రూపంలో అవతరించనుందట. ఎలా అనుకుంటున్నారా..? క్లామ్‌షెల్ రూపంలో అచ్చం ఫ్లిప్ ఫోన్ మాదిరి ఓ కొత్త స్మార్ట్‌ఫోన్‌ను రూపొందించడంలోనే ప్రస్తుతం శాంసంగ్ నిమగ్నమై ఉందట. ఆ కొత్త స్మార్ట్‌ఫోన్‌కు గెలాక్సీ ఎస్7కు వాడిన డిజైన్‌నే శాంసంగ్ వాడనుందని తాజా రిపోర్టులు వెల్లడిస్తున్నాయి. ఈ ఫోన్ కోడ్ నేమ్ "వెయ్రోన్"గా రిపోర్టులు పేర్కొంటున్నాయి. దీంతో గెలాక్సీ ఎస్7 క్లామ్‌షెల్ రూపంలో అవతరించనుందని తెలుస్తోంది. గ్లాస్, మెటల్ బాడీతో గెలాక్సీ ఎస్7 మార్కెట్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. కానీ ఈ ఫోన్ రిలీజ్ తేదీ మాత్రం ఇంకా వెల్లడికాలేదు. చైనాలోనే మొదట లాంచ్ చేయొచ్చని టాక్. గతంలో వచ్చిన రూమర్ ప్రకారం ఈ ఫోన్ 12 మెగాపిక్సెల్ రియర్ కెమెరా, 5 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలిగిఉంటుందని తెలుస్తోంది. మొబైల్ టెస్టింగ్ వెబ్సైట్ గీక్‌బెంచ్‌లో లిస్టు అయిన ఈ ఫోన్‌కు సంబంధించిన కొన్ని ప్రత్యేకతలు ఇలా ఉన్నాయ్.. 4.2 అంగుళాల డిస్ప్లే క్వాడ్-కోర్ క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 820 ప్రాసెసర్ 4 జీబీ ర్యామ్ మోడల్ నెంబర్ ఎస్ఎమ్-డబ్ల్యూ2017 ఆండ్రాయిడ్ 6.0.1 మార్ష్‌మాలో