వన్‌ప్లస్‌ 5టీ ఫుల్‌ స్పెషిఫికేషన్లివే! | OnePlus 5T full specs leaked ahead of November 16 launch | Sakshi
Sakshi News home page

వన్‌ప్లస్‌ 5టీ ఫుల్‌ స్పెషిఫికేషన్లివే!

Published Tue, Nov 14 2017 7:34 PM | Last Updated on Tue, Nov 14 2017 7:34 PM

OnePlus 5T full specs leaked ahead of November 16 launch - Sakshi

లాంచింగ్‌కు ముందే వన్‌ప్లస్‌ 5టీ స్మార్ట్‌ఫోన్‌ ఫుల్‌ స్పెషిఫికేషన్లు ఆన్‌లైన్‌లో లీకయ్యాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ నవంబర్‌ 16న లాంచింగ్‌కు సిద్దమై ఉంది. కానీ దీని ముందస్తుగానే ఆన్‌లైన్‌లో దీని వివరాలు బయటికి వచ్చాయి. లీకైన వివరాల ప్రకారం వన్‌ప్లస్‌ 5టీ స్మార్ట్‌ఫోన్‌ 6.01 అంగుళాలతో అతిపెద్దగా18:9 డిస్‌ప్లేను కలిగి ఉంటుందని తెలిసింది. కార్నింగ్‌ గొర్రిల్లా గ్లాస్‌ 5, అమోలెడ్‌ డిస్‌ప్లేతో ఇది రూపొందిందట. ఒరిజనల్‌గా వన్‌ప్లస్‌ 5 స్మార్ట్‌ఫోన్‌ 5.5 అంగుళాల ఫుల్‌ హెచ్‌డీ రెజుల్యూషన్‌ డిస్‌ప్లేను కలిగి ఉంది.


వన్‌ప్లస్‌ 5 మాదిరిగానే వన్‌ప్లస్‌ 5టీ కూడా ఆక్టా-కోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 835 ప్రాసెసర్‌తోనే రన్‌ అవుతుంది. స్టోరేజ్‌ పరంగా ఇది రెండు వేరియంట్లలో లభ్యమవుతుంది. ఒకటి 6జీబీ ర్యామ్‌, 64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌. మరొకటి 8జీబీ ర్యామ్‌, 128జీబీ స్టోరేజ్‌. 


వన్‌ప్లస్‌ 5టీలో అతిపెద్ద మార్పు హోమ్‌ బటన్‌ లేకపోవడం. ఫింగర్‌ ప్రింట్‌ స్కానర్‌ వెనుకవైపు ఉంటుంది. ఆండ్రాయిడ్‌ 7.1.1 నోగట్‌ ఆధారితంగా ఆక్సీజన్‌ ఓఎస్‌తో ఇది రన్‌ అవుతుంది. కెమెరా పరంగా తీసుకుంటే వన్‌ప్లస్‌ 5టీ స్మార్ట్‌ఫోన్‌కు డ్యూయల్‌ 16ఎంపీ సోనీ ఐఎంఎక్స్‌ 398, 20ఎంపీ ఐఎంఎక్స్‌ 376కే డ్యూయల్‌ కెమెరాలుంటాయి. ఇక చివరిగా ఈ స్మార్ట్‌ఫోన్‌ 3,300 ఎంఏహెచ్‌ నాన్‌-రిమూవబుల్‌ బ్యాటరీతో మార్కెట్‌లోకి వస్తుందని తెలుస్తోంది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement