దసరా,దివాళీ సేల్స్‌తో స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో సందడి చేసిన చైనా స్మార్ట్ ఫోన్ దిగ్గజం వివో...తాజాగా మరో సిరీస్ ఫోన్‌లు విడుదల చేసేందుకు సిద్ధమైంది. ఇప్పటికే వరుస సిరీస్ విడుదలతో దూకుడు మీదున్న వివో సంస్థ ఇప్పటుడు'వీ23ఈ' పేరుతో మరో సిరీస్‌ను విడుదల చేయనుంది. త్వరలో స్మార్ట్ ఫోన్ మార్కెట్‌లో అందుబాటులోకి రానున్న సిరీస్ స్మార్ట్ ఫోన్ ఫీచర్లు వెలుగులోకి వచ్చాయి.
వివో వీ23ఈ ఫీచర్లు
వివో వీ23ఈ సిరీస్ ఫోన్ ఫీచర్లపై టిప్‌స్టర్ సుధాన్షు ఆంబోర్ ట్వీట్ చేశారు. ఈ ఫోన్‌లో మీడియా టెక్ హీలియా జీ96 చిప్ సెట్, 4,050ఎంఏహెచ్ బ్యాటరీ, రెక్టాంగిల్ కెమెరా మాడ్యుల్, ట్రిపుల్ కెమెరా సెటప్, ఫోన్ వెనుక భాగంలో 64 మెగా పిక్సెల్ మెయిన్ కెమెరా, వాటర్‌డ్రాప్ స్టైల్ నాచ్ డిస్‌ప్లే, డ్యూయల్-సిమ్ (నానో), ఆండ్రాయిడ్ 11 వెర్షన్ బేస్డ్ ఫన్ టచ్ 12తో రన్ అవుతుంది. 6.44-అంగుళాల, 2,400x1,080 పిక్సెట్స్, ఆమోలెడ్ డిస్‌ప్లే, 8జీబీ ర్యామ్, 128జీబీ స్టోరేజ్‌ను అందిస్తుంది. ఫోటోలు, వీడియోల కోసం వివో 64 మెగాపిక్సె మెయిన్ సెన్సార్లతో ట్రిపుల్ రేర్ కెమెరా, కెమెరా సెటప్‌లో 8-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, 2-మెగాపిక్సెల్ 3వ స్నాపర్ ఉన్నాయి. సెల్ఫీల కోసం 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.
టిప్‌స్టర్ ప్రకారం..వివో వీ23ఈ 44డబ్ల్యూ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్‌తో 4,050mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. హ్యాండ్‌సెట్ ఇన్-డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, ఆన్‌బోర్డ్ సెన్సార్‌లు గ్రావిటీ సెన్సార్, లైట్ సెన్సార్, గైరోస్కోప్, టెలస్కోప్ ఫీచర్లతో పాటు కనెక్టివిటీ కోసం డ్యూయల్-బ్యాండ్ వైఫై, బ్లూటూత్ వీ5.2, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ సదుపాయంతో అందుబాటులో రానున్నట్లు లీకైన రిపోర్ట్‌లలో తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment