ప్రముఖ స్మార్ట్ ఫోన్ దిగ్గజం షావోమీ గత వారం విడుదల చేసిన ఓ స్మార్ట్ ఫోన్ దెబ్బకు 5 నిమిషాల్లో వేలకోట్ల విలువైన స్మార్ట్ ఫోన్ అమ్మకాలు జరిగినట్లు టెక్ బ్లాగ్‌లు పలు రిపోర్ట్‌లను వెలుగులోకి తెచ్చాయి.
టెక్ బ్లాగ్ గిజ్మో చైనా కథనం ప్రకారం.. న్యు ఇయర్ సెంటిమెంట్‌ను క్యాష్ చేసుకునేందుకు చైనాకు చెందిన స్మార్ట్ ఫోన్ కంపెనీ షావోమీ డిసెంబర్ 28న షావోమీ12 సిరీస్ స్మార్ట్ ఫోన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసింది.ఆఫ్‌లైన్, ఆన్‌లైన్ వేదికగా విడుదల చేసిన 5 నిమిషాల్లోనే సుమారు 1.8 బిలియన్ యువాన్. అంటే ఇండియన్ కరెన్సీ ప్రకారం.. రూ.2108 కోట్ల విలువైన స్మార్ట్ ఫోన్‌లను అమ్మినట్లు గిజ్మో చైనా తన కథనంలో పేర్కొంది.
స్ట్రాటజీ వర్కౌట్ అయ్యింది
న్యు ఇయర్ సందర్భంగా షావోమీ సంస్థ చైనాలో తొలిసారి కాంపాక్ట్ ఫ్లాగ్‌షిప్ ఫోన్ షావోమీ 12 సిరీస్ స్మార్ట్ ఫోన్ ను విడుదల చేసింది. షావోమీ 12 సిరీస్‌లోని బడ్జెట్ ఫ్రెండ్లీ ఫోన్‌లు షావోమీ 12, షావోమీ 12ప్రో ఫోన్‌లను విడుదల చేసింది. బడ్జెట్ తక్కువగా ఉండడం, అడ్వాన్స్ ఫీచర్లు ఉండడంతో పాటు న్యుఇయర్ సెంటిమెంట్ షావోమీకి కలిసొచ్చింది. దీంతో నిమిషాల వ్యవధిలో భారీ సేల్స్ జరిగినట్లు టెక్ బ్లాగ్ గిజ్మో చైనా తన కథనంలో హైలెట్ చేసింది.
షావోమీ 12 స్పెసిఫికేషన్‌లు
షావోమీ 12 స్మార్ట్ ఫోన్ 6.28 అంగుళాలు, 2కే అమోలెడ్ డిస్‌ప్లే, 4,500ఏఎంహెచ్ బ్యాటరీ,120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, క్వాల్కమ్ స్నాప్ డ్రాగన్ 8 జనరేషన్ 1 సీపీయూతో 12జీబీ ర్యామ్ 256 ఇంటర్నల్ స్టోరేజ్ సౌకర్యం ఉంది. ఇక ఈ ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రేర్ కెమెరా, 50 ఎంపీ సోనీ ఐఎక్స్ 766 సెన్సార్‌లు, 13ఎంపీ ఆల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, 5ఎంపీ టెలిఫోటో లెన్స్, 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. 67వాల్ట్‌ల ఫాస్ట్ ఛార్జింగ్, 50వాల్ట్‌ల వైర్‌లెస్ట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఇస్తుంది.
షావోమీ 12 ప్రో స్పెసిఫికేషన్‌లు
షావోమీ 12 ప్రో 6.73 అంగుళాల 2కే అమోలెడ్ డిస్‌ప్లే, 120హెచ్‌జెడ్ రిఫ్రెష్ రేట్, ఫంచ్ హోల్ కట్ అవుట్, ఆండ్రాయిడ్ 12ఓఎస్, 5,000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120వాల్ట్‌ల ఛార్జింగ్ సపోర్ట్, ఫోన్ వెనుక భాగంలో ట్రిపుల్ రేర్ కెమెరా, 50ఎంపీ మెయిన్ కెమెరా, 50ఎంపీ ఆల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50ఎంపీ టెలిఫోటో లెన్స్, 32ఎంపీ ఫ్రంట్ ఫేసింగ్ కెమరాలు ఉన్నాయి.
చదవండి: షావోమీ 'నెక్ట్స్ జనరేషన్ రేసర్' మామూలుగా ఉండదు, ఫీచర్లు అదిరిపోతాయ్..!
Comments
Please login to add a commentAdd a comment