హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఈ ఏడాది అమ్ముడయ్యే స్మార్ట్‌ఫోన్లలో సగ భాగం 5జీ మోడళ్లు ఉంటాయని షావొమీ ఇండియా ప్రెసిడెంట్ మురళీకృష్ణన్ తెలిపారు. వివిధ నివేదికలూ ఈ విషయాన్నే వెల్లడిస్తున్నాయని ఆయన అన్నారు. హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. ‘భారత్‌లో రూ.20 వేలకుపైగా ఖరీదు చేసే స్మార్ట్‌ఫోన్లు అన్నీ 5జీ మోడళ్లే. రూ.15–20 వేల ధరల విభాగంలో 5జీ వాటా 80 శాతం కాగా, రూ.10–15 వేల సెగ్మెంట్లో 40–50 శాతం కైవసం చేసుకుంది. రూ.10 వేల లోపు ధరల శ్రేణిలో ఈ ఏడాది 5జీ వచ్చే అవకాశం లేదు. 4జీతో పోలిస్తే 5జీ చిప్‌సెట్ కనీసం రూ.3,000 ఖరీదు ఎక్కువగా ఉంటుంది’ అని వివరించారు.
మూడు పునాదులు..
ఉత్తమ ఫీచర్లు, అత్యంత నాణ్యత, ధర విషయంలో నిజాయితీ.. ఈ మూడు అంశాలు పునాదులుగా వ్యాపారం సాగిస్తున్నామని మురళీకృష్ణన్ తెలి పారు. ‘2014 నుంచి ఇప్పటి వరకు దేశంలో 20 కోట్ల ఫోన్లు విక్రయించాం. కంపెనీ అమ్మకాల్లో ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ వాటా సమంగా ఉంది. పరిశ్రమలో ఆఫ్‌లైన్ వాటా 60 శాతం కైవసం చేసుకుంది. ఒక్కో ఉత్పాదన అభివృద్ధికి 9–12 నెలల సమయం తీసుకుంటున్నాం. కనీసం 4జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమరీ కావాల్సిందేనని కస్టమర్లు కోరుతు న్నారు. ఫాస్ట్ చార్జింగ్, అమోలెడ్ డిస్‌ప్లే, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ డిమాండ్ చేస్తున్నారు’ అని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment