న్యూఢిల్లీ: స్మార్ట్ ఉపకరణాల తయారీలో ఉన్న షావొమీ రూ.10–15 వేల ధరల శ్రేణిలో 5జీ మోడళ్లను పెద్ద ఎత్తున తీసుకు రానుంది. మార్కెట్ వాటాను తిరిగి చేజిక్కించుకోవాలన్న వ్యూహంలో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్టు కంపెనీ ప్రకటించింది. ‘ప్రస్తుతం 5జీ మోడళ్లు ఎక్కువగా రూ.20 వేలకుపైగా ధర పలుకుతున్నాయి. రూ.15–20 వేల ధరల శ్రేణిలో విస్తృతి పెరిగింది. రూ.10–15 వేల ధరల విభాగంలో మార్కెట్ ఉండబోతోంది.
షావొమీకి ఈ సెగ్మెంట్లో భారీ అవకాశాలు ఉన్నాయి. 4జీ స్మార్ట్‌ఫోన్ల రంగంలో అమలు చేసిన విధానాన్ని పునరావృతం చేయడానికి, 5జీ మ్యాజిక్‌ను మళ్లీ సృష్టించడానికి కంపెనీకి స్పష్టమైన అవకాశం ఉంది’ అని షావొమీ ఇండియా ప్రెసిడెంట్ బి.మురళీకృష్ణన్ తెలిపారు. రిటైల్ స్టోర్ల లో సేల్స్ ప్రమోటర్ల సంఖ్యను ప్రస్తుతం ఉన్న 4,000 నుంచి 2023 డిసెంబర్ నాటికి రెండింతలకు చేస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment