India President
-
లగ్జరీ కార్ల పండుగ
న్యూఢిల్లీ: దేశీయంగా లగ్జరీ కార్లకు డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో ఈ ఏడాది పండుగ సీజన్లో హైఎండ్ కార్ల అమ్మకాలు రికార్డు స్థాయిలో ఉంటాయని వాహన దిగ్గజాలు అంచనా వేస్తున్నాయి. దేశ ఆరి్థక మూలాలు పటిష్టంగా ఉన్న నేపథ్యంలో లగ్జరీ సెగ్మెంట్‌పై వినియోగదారుల ఆసక్తి పెరుగుతోందని బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియా ప్రెసిడెంట్ విక్రమ్ పావా చెప్పారు. ’బీఎండబ్ల్యూ గ్రూప్ ఇండియాకు ఆర్డర్లు భారీగా ఉన్నాయి. కస్టమర్లకు వాటిని వేగంగా అందించేందుకు ప్రయత్నం చేస్తున్నాం. దసరా, దీపావళి సందర్భంగా అదనపు బుకింగ్స్ కూడా వస్తాయి కాబట్టి ఈ ఏడాది గణనీయ వృద్ధినే నమోదు చేస్తాం’ అని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ఓనంతో ప్రారంభించి దీపావళితో ముగిసే పండుగ సీజన్ సందర్భంగా ఇప్పటికే పలు మోడల్స్‌లో ప్రత్యేక ఎడిషన్స్‌ను ప్రవేశపెట్టినట్లు విక్రమ్ వివరించారు. దేశీయంగా మొత్తం ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో లగ్జరీ కార్ల వాటా 2 శాతం లోపు ఉంటుంది. రెండంకెల స్థాయిలో వృద్ధి.. సాధారణంగా ఈ సీజన్లో గరిష్ట రెండంకెల స్థాయిలో విక్రయాల వృద్ధి నమోదవుతుందని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ తెలిపారు. మొత్తం ప్యాసింజర్ వాహనాల మార్కెట్లో లగ్జరీ విభాగం చాలా చిన్నదే అయినప్పటికీ ప్రస్తుత ఆరి్థక సంవత్సరంలో అమ్మకాల పరిమాణం రికార్డు స్థాయిలో పెరిగే అవకాశం ఉందన్నారు. అయితే, అన్ని కంపెనీలూ అదే స్థాయిలో వృద్ధి చెందడం లేదని చెప్పారు. కొన్ని సంస్థల అమ్మకాలు ఒక మోస్తరుగా ఉండగా, కొన్నింటి విక్రయాలు క్షీణించాయని, ప్రతికూల పరిస్థితులును ఎదుర్కొంటున్నాయని ఆయన వివరించారు. అయినప్పటికీ ఈ ఏడాది లగ్జరీ కార్ల విక్రయాలు 50,000–51,000 స్థాయిలో ఉండొచ్చని ఈ విభాగంలో కీలకమైన కంపెనీగా అంచనా వేస్తున్నట్లు అయ్యర్ వివరించారు. మరోవైపు, పండుగ సీజన్లో సానుకూల కొనుగోలు ధోరణులు కొనసాగుతాయని భావిస్తున్నట్లు ఆడి ఇండియా హెడ్ బల్బీర్ సింగ్ ధిల్లాన్ తెలిపారు. ఏ4, ఏ6, క్యూ3, క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ మొదలైన వాటికి డిమాండ్ గణనీయంగా ఉంటోందని వివరించారు. అలాగే ఈ–ట్రాన్ శ్రేణికి కూడా ఆదరణ కనిపిస్తోందన్నారు. ఈవీ చార్జింగ్ స్టేషన్లకు ఉమ్మడి ప్లాట్‌ఫాం.. ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించి వివిధ సర్వీస్ ప్రొవైడర్లు నిర్వహించే చార్జింగ్ స్టేషన్ల సమగ్ర వివరాలు ఉండేలా ఒక ఉమ్మడి ప్లాట్‌ఫాం ఉండాలని మెర్సిడెస్ బెంజ్ ఇండియా ఎండీ సంతోష్ అయ్యర్ అభిప్రాయపడ్డారు. వాహనదారులకు సౌకర్యంగా ఉండటంతో పాటు ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని మరింతగా ప్రోత్సహించేందుకు కూడా ఇలాంటి యాప్ ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. ప్రస్తుతం చార్జింగ్కు సంబంధించి ఒకదానితో మరొకదానికి సంబంధం లేని 3–4 యాప్‌లను వాహనదారులు ఉపయోగించాల్సి వస్తోందని అయ్యర్ చెప్పారు. అలా కాకుండా యూపీఐ ఆధారిత సిస్టమ్ తరహాలో ప్రభుత్వం దీనికి కూడా ఒక ప్లాట్‌ఫామ్‌ను ఏర్పాటు చేస్తే ప్రయోజనకరంగా ఉంటుందని పేర్కొన్నారు. -
సగ భాగం 5జీ ఫోన్లే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశవ్యాప్తంగా ఈ ఏడాది అమ్ముడయ్యే స్మార్ట్ఫోన్లలో సగ భాగం 5జీ మోడళ్లు ఉంటాయని షావొమీ ఇండియా ప్రెసిడెంట్ మురళీకృష్ణన్ తెలిపారు. వివిధ నివేదికలూ ఈ విషయాన్నే వెల్లడిస్తున్నాయని ఆయన అన్నారు. హైదరాబాద్ వచ్చిన సందర్భంగా ఆయన సాక్షి బిజినెస్ బ్యూరోతో మాట్లాడారు. ‘భారత్‌లో రూ.20 వేలకుపైగా ఖరీదు చేసే స్మార్ట్ఫోన్లు అన్నీ 5జీ మోడళ్లే. రూ.15–20 వేల ధరల విభాగంలో 5జీ వాటా 80 శాతం కాగా, రూ.10–15 వేల సెగ్మెంట్లో 40–50 శాతం కైవసం చేసుకుంది. రూ.10 వేల లోపు ధరల శ్రేణిలో ఈ ఏడాది 5జీ వచ్చే అవకాశం లేదు. 4జీతో పోలిస్తే 5జీ చిప్సెట్ కనీసం రూ.3,000 ఖరీదు ఎక్కువగా ఉంటుంది’ అని వివరించారు. మూడు పునాదులు.. ఉత్తమ ఫీచర్లు, అత్యంత నాణ్యత, ధర విషయంలో నిజాయితీ.. ఈ మూడు అంశాలు పునాదులుగా వ్యాపారం సాగిస్తున్నామని మురళీకృష్ణన్ తెలి పారు. ‘2014 నుంచి ఇప్పటి వరకు దేశంలో 20 కోట్ల ఫోన్లు విక్రయించాం. కంపెనీ అమ్మకాల్లో ఆన్లైన్, ఆఫ్‌లైన్ వాటా సమంగా ఉంది. పరిశ్రమలో ఆఫ్‌లైన్ వాటా 60 శాతం కైవసం చేసుకుంది. ఒక్కో ఉత్పాదన అభివృద్ధికి 9–12 నెలల సమయం తీసుకుంటున్నాం. కనీసం 4జీబీ ర్యామ్, 128 జీబీ ఇంటర్నల్ మెమరీ కావాల్సిందేనని కస్టమర్లు కోరుతు న్నారు. ఫాస్ట్ చార్జింగ్, అమోలెడ్ డిస్ప్లే, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ డిమాండ్ చేస్తున్నారు’ అని వివరించారు. -
రాష్ట్రపతి హైదరాబాద్ పర్యటన.. రెండో రోజు షెడ్యూల్ ఇదే
సాక్షి, హైదరాబాద్: దేశాధినేత పదవిని చేపట్టాక తొలిసారిగా తెలంగాణకు వచ్చిన రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ముకు రాష్ట్ర ప్రభుత్వం ఘన స్వాగతం పలికింది. శీతాకాల విడిదిలో భాగంగా రాష్ట్రపతి సోమవారం సాయంత్రం 5.10 గంటలకు హైదరాబాద్‌లోని హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చేరుకున్నారు. అప్పటికే గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు వేచి ఉన్నారు. రాష్ట్రపతి రాకను చూసి స్వాగతం పలకడానికి వెళ్దామంటూ గవర్నర్‌ను సీఎం కేసీఆర్ కోరడంతో.. ఇద్దరూ కలిసి వేదిక దిగి వెళ్లారు. మంత్రులు, ఇతర ముఖ్యులు వారి వెంట వచ్చారు. రాష్ట్రపతిని ఆహ్వానిస్తూ సీఎం కేసీఆర్ పుష్పగుచ్ఛం ఇచ్చి, శాలువా కప్పి సత్కరించారు. తర్వాత రాష్ట్రపతి త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం రాష్ట్రపతికి రాష్ట్ర మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలను సీఎం కేసీఆర్ పరిచయం చేశారు. పెద్ద సంఖ్యలో ప్రజాప్రతినిధులు హాజరవడంతో ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో సందడి కనిపించింది. సీఎం పరిచయం చేసినవారిలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు కేటీఆర్, హరీశ్‌రావు, మహమూద్ అలీ, తలసాని, వేముల ప్రశాంత్‌రెడ్డి, సబితా ఇంద్రారెడ్డి, జగదీశ్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఇంద్రకరణ్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, కొప్పుల ఈశ్వర్, మల్లారెడ్డి, ఎర్రబెల్లి దయాకర్‌రావు, సత్యవతి రాథోడ్, గంగుల కమలాకర్, పువ్వాడ అజయ్, ఎంపీలు కె.కేశవరావు, నామా నాగేశ్వర్రావు, బండి సంజయ్, సోయంబాపురావు, రంజిత్‌రెడ్డి, పసునూరి దయాకర్, ప్రభాకర్‌రెడ్డి, బీబీ పాటిల్, కోమటిరెడ్డి వెంకటరెడ్డి, జోగినపల్లి సంతోష్‌కుమార్, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, జెడ్పీ చైర్మన్లు, పలు శాఖల ఉన్నతాధికారులు ఉన్నారు. యుద్ధ వీరులకు నివాళి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్ నుంచి బొల్లారంలోని యుద్ధస్తూపం వద్దకు చేరుకున్నారు. దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమర సైనికులకు నివాళి అర్పించారు. తర్వాత సాయంత్రం 6.15 గంటల సమయంలో రాష్ట్రపతి నిలయానికి చేరుకున్నారు. రాజ్‌భవన్‌లో విందు.. సీఎం దూరం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గౌరవార్థం గవర్నర్ తమిళిసై సోమవారం రాత్రి ఏడున్నర గంటల సమయంలో రాజ్‌భవన్‌లో విందు ఇచ్చారు. దీనికి మంత్రులు, వివిధ రాజకీయ పార్టీల నేతలు, ఉన్నతాధికారులు హాజరైనా.. సీఎం కేసీఆర్ మాత్రం రాలేదు. హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో రాష్ట్రపతికి స్వాగతం పలికిన తర్వాత సీఎం కేసీఆర్ నేరుగా ఎర్రవల్లి ఫామ్‌హౌజ్‌కు వెళ్లిపోయారు. గవర్నర్‌తో కొనసాగుతున్న విభేదాల నేపథ్యంలోనే సీఎం విందుకు రాలేదనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాజ్‌భవన్ విందులో కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి, స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, రాష్ట్ర మంత్రులు హరీశ్‌రావు, నిరంజన్‌రెడ్డి, జగదీశ్‌రెడ్డి, మల్లారెడ్డి, సత్యవతిరాథోడ్, పువ్వాడ అజయ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్, టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి, బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, టీటీడీపీ అధ్యక్షుడు జ్ఞానేశ్వర్, ప్రభుత్వ సలహాదారు రాజీవ్‌శర్మ, సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, మరికొందరు ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో పలకరించుకున్నా.. విభేదాల నేపథ్యంలో చాలాకాలం నుంచి గవర్నర్ తమిళిసై, సీఎం కేసీఆర్ ఒకరికొకరు ఎదురుపడలేదు. రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఉజ్జల్ భుయాన్ ప్రమాణస్వీకార సమయంలో మాత్రం సీఎం రాజ్‌భవన్‌కు వెళ్లారు. ఆ తర్వాత మళ్లీ గవర్నర్‌ను కలవలేదు. సోమవారం హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో కూడా గవర్నర్, సీఎం ముభావంగానే కనిపించారు. రాష్ట్రపతికి స్వాగతం పలకడానికి హెలికాప్టర్ వద్దకు వెళ్తున్నప్పుడు మాత్రం పలకరించుకుని మాట్లాడారు. ఇది చూసి ఇద్దరి మధ్య తిరిగి సఖ్యత కుదురుతుందన్న భావన వ్యక్తమైంది. కానీ గవర్నర్ ఇచ్చిన విందుకు సీఎం దూరంగా ఉండటంతో విభేదాలు కొనసాగుతున్నట్టు రాజకీయవర్గాలు చెప్తున్నాయి. ఇక కొంతకాలంగా మంత్రులు కూడా రాజ్‌భవన్‌కు వెళ్లలేదు. కానీ సోమవారం నాటి విందుకు మాత్రం హాజరయ్యారు. హైదరాబాద్‌కు వచ్చి.. శ్రీశైలం వెళ్లొచ్చి.. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తొలుత కేంద్రమంత్రి కిషన్‌రెడ్డితో కలిసి ప్రత్యేక విమానంలో ఢిల్లీ నుంచి శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. అక్కడ గవర్నర్ తమిళిసై, మంత్రి సత్యవతిరాథోడ్ ఆమెకు స్వాగతం పలికారు. తర్వాత రాష్ట్రపతి, గవర్నర్, కేంద్ర మంత్రి కలసి ఆర్మీ హెలికాప్టర్లో ఏపీలోని శ్రీశైలం పుణ్యక్షేత్రానికి వెళ్లారు. దర్శనం, ప్రత్యేక పూజల అనంతరం సాయంత్రం 4 గంటల సమయంలో శ్రీశైలం నుంచి ఆర్మీ హెలికాప్టర్లో బయలుదేరి.. 5.10 గంటల సమయంలో హకీంపేట ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌కు చేరుకున్నారు. నేడు మిధానిలో మిల్‌ను ప్రారంభించనున్న రాష్ట్రపతి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం హైదరాబాద్‌లోనే పలు కార్యక్రమాల్లో పాల్గొననున్నారు. ఉదయం నారాయణగూడలో కేశవ్ మెమోరియల్ విద్యా సంస్థల్లో జరిగే కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తారు. తర్వాత నేషనల్ పోలీస్ అకాడమీలో 74వ బ్యాచ్ ఐపీఎస్ ఆఫీసర్ ట్రైనీలతో సమావేశమవుతారు. రక్షణ శాఖకు చెందిన మిధాని సంస్థలో వైడ్ ప్లేట్ మిల్‌ను ప్రారంభిస్తారు. జాతీయ వ్యూహాత్మక కార్యక్రమాల్లో వినియోగం కోసం ఐరన్, టైటానియం, ఇతర లోహ మిశ్రమాలతో బలమైన రోలింగ్ ప్లేట్లను ఈ మిల్లో తయారు చేయనున్నట్టు అధికారులు తెలిపారు. -
మా గవర్నర్ అనర్హుడు.. తప్పించండి: డీఎంకే
న్యూఢిల్లీ: తమిళనాడు గవర్నర్ ఆర్ఎన్ రవి తీరుపై.. అక్కడి ప్రభుత్వంలో పేరుకుపోయిన వ్యతిరేకత తారా స్థాయికి చేరుకుంది. శాంతి భద్రతలకు ఆయన్నొక ముప్పుగా పరిణమించారంటూ ఆరోపించిన అధికార డీఎంకే.. ఈ మేరకు ఆయన్ని తప్పించాలంటూ ఏకంగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఒక మెమోరాండమ్ సమర్పించింది. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన ప్రభుత్వాన్ని ప్రజలకు సేవ చేయకుండా అడ్డుకోవడం మాత్రమే కాదు.. ఆయన మత విద్వేషాల్ని రెచ్చగొడుతున్నాడు అంటూ మెమోరాండమ్‌లో డీఎంకే, దాని మిత్రపక్షాలు ఆరోపించాయి. రాజ్యాంగాన్ని రక్షిస్తానని, చట్టాన్ని పరిరక్షిస్తానని చేసిన ప్రమాణాన్ని గవర్నర్ ఆర్ఎన్ రవి ఉల్లంఘించారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులను కావాలనే జాప్యం చేస్తున్నారు. ప్రభుత్వం పట్ల ప్రజల్లో అసంతృప్తిని పెంచేలా ఆయన చేస్తున్న ప్రకటలను.. ఒకరంగా దేశద్రోహంగా కూడా పరిగణించవచ్చు. రాజ్యాంగ బద్ధమైన పదవికి ఆయన అనర్హుడు. కాబట్టి, తొలగింపునకు ఆయన అన్ని విధాల ఆర్హుడు అంటూ డీఎంకే, రాష్ట్రపతి ముర్ముకి నివేదించింది. ఇదీ చదవండి: గవర్నర్ వైఖరిపై ఎల్డీఎఫ్ విస్తృతస్థాయి నిరసన -
ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం.. ‘భారత్‌కు ఉద్వేగభరిత క్షణం’..
న్యూఢిల్లీ: దేశ అత్యున్నత పీఠంపై ద్రౌపదీ ముర్ము ఆసీనులయ్యారు. భారత 15వ రాష్ట్రపతిగా ముర్ము సోమవారం ప్రమాణ స్వీకారం చేశారు. పార్లమెంట్ సెంట్రల్ హాల్లో ప్రమాణ స్వీకారోత్సవం జరిగింది. ఈ సందర్భంగా దేశం నలుమూలల నుంచి ఆమెకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. నూతన రాష్ట్రపతికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ అభినందనలు తెలిపారు. దేశానికి ఇదొక ఉద్వేగభరిత క్షణమని హర్షం వ్యక్తం చేశారు. ‘రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారోత్సవాన్ని దేశం మొత్తం గర్వంగా వీక్షించింది. ఆమె రాష్ట్రపతి పదవిని చేపట్టడం దేశానికి ముఖ్యంగా పేదలు, అట్టడుగు అణగారిన వర్గాలకు ఉద్విగ్నభరిత క్షణాలు. ఆమె తన పదవి బాధ్యతలను విజయవంతంగా పూర్తి చేయాలని కోరుకుంటున్నాను’ అని ట్వీట్ చేశారు. The entire nation watched with pride as Smt. Droupadi Murmu Ji took oath as the President of India. Her assuming the Presidency is a watershed moment for India especially for the poor, marginalised and downtrodden. I wish her the very best for a fruitful Presidential tenure. pic.twitter.com/xcqBqRt2nc — Narendra Modi (@narendramodi) July 25, 2022 కొత్తగా ఎన్నికైన రాష్ట్రపతికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా కూడా శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ట్విటర్లో ‘ భారత 15వ రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేసిన ద్రౌపది ముర్ముకు అభినందనలు. మీ పదవీకాలంలో దేశ గౌరవాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తారని నాకు ఖచ్చితంగా నమ్మకం ఉంది.. నేడు చరిత్రలో నిలిచిపోయే రోజు. ప్రజాస్వామ్య విలువలను అనుసరించే ప్రతి విభాగం సాధికారతకు ఇదొక అద్భుతమైన ఉదాహరణ.’ అని పేర్కొన్నారు. చదవండి: రాష్ట్రపతి భవన్‌కు చేరుకున్న ద్రౌపది ముర్ము भारत के 15वें राष्ट्रपति के रूप में शपथ लेने पर श्रीमती द्रौपदी मुर्मू जी को बहुत बहुत बधाई। मुझे विश्वास है कि आपका कार्यकाल देश के गौरव को नई ऊंचाइयों पर ले जायेगा। आज का यह ऐतिहासिक दिन लोकतांत्रिक मूल्यों पर चल हर वर्ग के सशक्तिकरण और अंत्योदय का एक अप्रतिम उदाहरण है। pic.twitter.com/UafbYSSUod — Amit Shah (@AmitShah) July 25, 2022 ప్రమాణ స్వీకారం అనంతరం జాతినుద్దేశించి రాష్ట్రపతి ముర్ము తొలిసారి ప్రసంగించారు. అత్యున్నత పదవికి ఎన్నిక చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల వేళ రాష్ట్రపతిగా బాధ్యతలు చేపట్టడం సంతోషంగా ఉందన్నారు. దేశ ప్రజల విశ్వాసం నిలబెట్టుకునేలా పనిచేస్తానన్నారు. కాగా రాష్ట్రపతి ఎన్నికలో అధికార ఎన్డీయే అభ్యర్థిగా బరిలోకి దిగిన ద్రౌపదీ ముర్ము ప్రతిపక్షాల ఉమ్మడి అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు. భారతదేశ తొలి గిరిజన మహిళా రాష్ట్రపతిగా రికార్డు సృష్టించారు. అంతేకాకుండా దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తర్వాత జన్మించిన తొలి రాష్ట్రపతిగా చరిత్రకెక్కారు. ప్రతిభా పాటిల్ తర్వాత రాష్ట్రపతి పదవిని అధిరోహించిన రెండో మహిళగా ముర్ము మరో రికార్డు సృష్టించారు. -
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము జీతం ఎంతో తెలుసా?
న్యూఢిల్లీ: భారత తొలి గిరిజన రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రికార్డు సృష్టించిన విషయం తెలిసిందే. సంతాల్ ఆదివాసీ తెగకు చెందిన ఆమె భారత 15వ రాష్ట్రపతిగా తిరుగులేని మెజారిటీతో కొత్త చరిత్ర లిఖించారు. స్వాతంత్య్రానంతరం జన్మించిన తొలి రాష్ట్రపతిగానే గాక ఇప్పటిదాకా ఆ పదవి చేపట్టిన వారిలో అత్యంత పిన్న వయస్కురాలిగా కూడా నిలిచారు. ప్రతిభా పాటిల్ తర్వాత ఈ పదవి అధిష్టించనున్న రెండో మహిళ ముర్ము. అధికార ఎన్డీఏ తరఫున బరిలో దిగిన ముర్ము గురువారం జరిగిన ఓట్ల లెక్కింపులో దాదాపు మూడింట రెండొంతల మెజారిటీతో విజయ దుందుభి మోగించారు. విపక్షాల అభ్యర్థి యశ్వంత్ సిన్హాపై ఘన విజయం సాధించారు. ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ వారసురాలిగా 25వ తేదీ సోమవారం ఆమె పదవీ బాధ్యతలు చేపట్టనున్నారు. ఈ క్రమంలో రాష్ట్రపతికి జీతం ఎంత ఉంటుంది, ఆమెకు లభించే ఇతర అలవెన్స్‌లు, విరమణ తర్వత పెన్షన్ వంటి విషయాలు ప్రస్తుతం ఆసక్తికరంగా మారాయి. మరి వాటిపై ఓ లుక్కేద్దాం. చదవండి: కొత్త రాష్ట్రపతిగా గిరిజన బిడ్డ.. ద్రౌపది ముర్ము ప్రస్థానమిదే 25న ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముర్ము రాష్ట్రపతి భవన్‌లోకి మారనున్నారు. ప్రస్తుతం రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ పదవి కాలం 24తో ముగియడంతో ఆయన ఢిల్లీలోని 12 జనపథ్ రోడ్డులో గల బంగ్లాలోకి వెళ్లనున్నారు. ► భారత రాష్ట్రపతి నెల జీతం రూ. 5 లక్షలు. దీనిని 2018లో రూ. 1.50 లక్షల నుంచి 5 లక్షలకు పెంచారు. ►దేశంలో అత్యధిక జీతం రాష్ట్రపతికే ఉంటుంది. జీతంతోపాటు ఇతర అలవెన్సులు కూడా ఉంటాయి. ►రాష్ట్రపతికి గృహ, వైద్యం, ప్రయాణ ఖర్చులు ఉచితం. అలాగే కార్యాలయ ఖర్చుల నిమిత్తం సంవత్సరానికి రూ.1 లక్ష లభిస్తుంది. ►భారత రాష్ట్రపతితోపాటు వారి జీవిత భాగస్వామి ప్రపంచంలో ఎక్కడైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. చదవండి: Draupadi Murmu: గిరిజన ఘన మన... అధినాయకి ►ప్రెసిడెంట్ అధికారిక నివాసాన్ని రాష్ట్రపతి భవన్‌గా పిలుస్తారు. ఇందులో 340 గదులు ఉంటాయి. ఇది 2 లక్చషల దరపు అడుగుల విస్తీర్ణం కలిగి ఉంది. ►రాష్ట్రపతికి మరో రెండు విడిది నివాసాలు ఉన్నాయి. అక్కడికి సెలవుల నిమిత్తం వెళ్లవచ్చు. ఒకటి సిమ్లాలోని మషోబ్రాలో(వేసవి విడిది) ఉంది, మరొకటి హైదరాబాద్‌లోని బొల్లారంలో(శీతాకాల విడిది) ఉంది. ►రాష్ట్రపతి ప్రీమియమ్ కార్లలోనే ప్రయాణిస్తారు. కస్టమ్-బిల్ట్ బ్లాక్ మెర్సిడెస్ బెంజ్ ఎస్600 (డబ్ల్యూ221)లో ప్రయాణిస్తారు. కార్లలో అత్యాధునిక సెక్యూరిటీ సిస్టమ్ కలిగి ఉంటుంది. బుల్లెట్, బాంబులు, గ్యాస్ దాడులు, ఇతర పేలుడు పదార్థాలను తట్టుకోగలవు. ►భారత ఆర్మీ విభాగంలోని అత్యున్నత విభాగం ప్రెసిడెంట్ బాడీగార్డ్ రాష్ట్రపతికి రక్షణ కల్పిస్తారు. ఈ విభాగంలో త్రివిధ (ఆర్మీ, వాయు, నావీ) దళాలకు చెందిన అగ్రశ్రేణి సైనికులు ఉంటారు. ►భద్రతా కారణాల దృష్ట్యా భారత రాష్ట్రపతి కార్ల వివరాలు ఎప్పుడూ వెల్లడించరు. ఈ కార్లకు లైసెన్స్ ప్లేట్ ఉండదు. దీనికి బదులు జాతీయ చిహ్నం ఉంటుంది ►రాష్ట్రపతి పదవీ విరమణ చేసిన తర్వాత నెలల రూ. 1.5 లక్షల పెన్షన్ వస్తుంది. అంతేగాక వారి జీవిత భాగస్వామికి నెలకు రూ. 30,000 సెక్రటేరియల్ సహాయం అందుతుంది. ►పెన్షన్ కాకుండా ఎలాంటి అద్దె చెల్లించకుండానే పెద్ద బంగ్లాలో నివసించేందుకు అవకాశముంటుంది. అయిదుగురు వ్యక్తిగత సిబ్బందిని నియమించుకునే వెసులుబాటు ఉంటుంది. వారి ఖర్చుల కోసం సంవత్సరానికి రూ. 60,000 లభిస్తుంది. జీవిత భాగస్వామితో సహా ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణించవచ్చు. -
కొత్త రాష్ట్రపతిగా గిరిజన బిడ్డ.. ద్రౌపది ముర్ము ప్రస్థానమిదే
న్యూఢిల్లీ: భారత కొత్త రాష్ట్రపతిగా ఎన్డీఏ అభర్థి ద్రౌపది ముర్ము విజయ కేతనం ఎగురవేశారు. ప్రత్యర్థి యశ్వంత్ సిన్హాపై భారీ మెజార్టీతో గెలుపొందారు. భారత తొలి ఆదివాసీ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము చరిత్ర లిఖించారు. ద్రౌపది ముర్ముకు 2,161 ఓట్లు (68శాతం) రాగా, యశ్వంత్‌కు 1,058 ఓట్లు (31.1శాతం) పోలయ్యాయి. రాష్ట్రపతిగా గెలిచిన ఏన్డీఏ అభ్యర్థికి ప్రధాని మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాహుల్ గాంధీ, యశ్వంత్ సిన్హా శుభాకాంక్షలు తెలిపారు. ఈనెల 25న భారత 15వ రాష్ట్రపతిగా ఆమె ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ద్రౌపది ముర్ము ప్రస్థానం నిరాడంబరమైన నేపథ్యం నుంచి వచ్చిన ద్రౌపది ముర్ము రాష్ట్రపతి పదవి వరకు సాధించిన ఔన్నత్యం.. భారతదేశం నాగరికత, రాజ్యాంగ విలువలు, ప్రజాస్వామ్యం పట్ల ఉన్న స్థిరమైన విశ్వాసానికి నిదర్శనంగా మారాయి. ద్రౌపది ముర్ము 1958, జూన్ 20న ఒడిశాలోని మయూర్భంజ్ జిల్లా బైడపోసిలో జన్మించారు. భువనేశ్వర్‌లోని రమాదేవి ఉమెన్స్ కాలేజీ నుంచి బీఏ పూర్తి చేశారు. స్కూల్ టీచర్‌గా కెరీర్ ప్రారంభించారు. ఆ తర్వాత రాష్ట్ర నీటిపారుదల, విద్యుత్ శాఖలో జూనియర్ అసిస్టెంట్‌గా పనిచేశారు. ద్రౌపది ముర్ము భర్త పేరు శ్యామ్ చరణ్ ముర్ము. ఆమెకు ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. రాజకీయాల్లోకి రాకముందు టీచర్ గా పనిచేశారు. సంబంధిత వార్త: కొత్త చరిత్ర.. భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము రాజకీయ జీవితం 1997లో రాయ్‌రంగాపూర్ నగర పంచాయతీ కౌన్సిలర్‌గా ఎన్నికవడంతో ముర్ము రాజకీయ జీవింతం మొదలైంది. 2000లో రాయ్‌రంగాపూర్ అసెంబ్లీ స్థానం నుంచి బీజేపీ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీజేడీ-బీజేపీ సంకీర్ణ ప్రభుత్వంలో మంత్రి అయ్యారు. రవాణా, వాణిజ్య, మత్స్య, పశుసంవర్ధక శాఖలు నిర్వహించారు. అంతకుముదు ఒడిశా బీజేపీ గిరిజన మోర్చాకు ఉపాధ్యక్షురాలిగా, అధ్యక్షురాలిగా చేశారు. 2010, 2013ల్లో మయూర్‌భంజ్‌జిల్లా బీజేపీ విభాగం ప్రెసిడెంట్‌గా నియమితులయ్యారు. బీజేపీ ఎస్టీ మోర్చా జాతీయ ఎగ్జిక్యూటివ్ సభ్యురాలిగా చేశారు. విషాదాలను దిగమింగుకొని నేడు దేశ అత్యున్నత స్థానంలో కూర్చోబోతున్న ద్రౌపది ముర్ము.. తన వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఒడిదుడుకులను, విషాదాలను ఎదుర్కొన్నారు. 2009లో పెద్ద కొడుకు అనుమానస్పద స్థితిలో మృతి చెందగా.. 2012లో జరిగిన రోడ్డు ప్రమాదంలో రెండో కొడుకు మరణించాడు. ఈ విషాదాల నుంచి తెరుకునేలోపే 2014లో భర్త శ్యామ్ చరణ్ గుండెపోటుతో ప్రాణాలు విడిచారు.. కుటుంబంలోని ముగ్గురి మరణం ద్రౌపది ముర్ము జీవితంలో పెను విషాదాన్ని నిపింది. ఇద్దరు కమారులు, భర్తను పోగొట్టుకుని ఒంటరిగా మిగిలిపోయిన ఆమె.. కూతురు, తమ్ముడి అండతో మళ్లీ ప్రజాసేవలో నిమగ్నమయ్యారు. 2015లో జార్ఖండ్ గవర్నర్ అయ్యారు. రాష్ట్రానికి తొలి మహిళా గవర్నర్ ద్రౌపది ముర్మునే. ఇప్పుడు దేశ అత్యుతన్నత రాజ్యాంగ పదవికి ఎన్నికై.. ఆ గౌరవం పొందిన తొలి ఒడిశావాసిగా, మొట్టమొదటి ఆదివాసీ మహిళగా చరిత్ర సృష్టించారు. -
రాష్ట్రపతిగా గిరిపుత్రిక ద్రౌపది ముర్ము
-
కొత్త చరిత్ర.. భారత 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము
న్యూఢిల్లీ: భారత రాష్ట్రపతి ఎన్నికల్లో ద్రౌపది ముర్ము ఘన విజయం సాధించారు. 15వ రాష్ట్రపతిగా ఎన్నికయ్యారు. భారత రాష్ట్రపతి పదవిని చేపట్టిన తొలి గిరిజన మహిళగా ఆమె చరిత్ర సృష్టించారు. దేశ అత్యున్నత పీఠాన్ని అధిరోహించిన రెండో మహిళగా ద్రౌపది ముర్ము నిలిచారు. ఎన్డీఏ అభ్యర్థిగా రాష్ట్రపతి ఎన్నికల్లో బరిలో దిగిన ముర్ము విజయ దుందుభి మోగించారు. సగానికి పైగా ఓట్లు సాధించి ప్రత్యర్థి యశ్వంత్ సిన్హాపై భారీ మెజార్టీతో గెలుపొందారు. ద్రౌపది ముర్ముకు బీజేపీ, ఎన్డీఏ భాగస్వామ్యపక్షాలతోపాటు బీజేడీ, వైఎస్సార్ కాంగ్రెస్ సహా 44 పార్టీలు మద్దతిచ్చాయి. దీంతో ఆమె ఎలక్టోరల్ కాలేజ్‌లో అవసరమైన మెజార్టీకి మించి ఓట్లు సాధించారు. 63 శాతం ఓట్లతో విజయ కేతనం ఎగరవేశారు. ఈ నెల 25న దేశ 15వ రాష్ట్రపతిగా ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేస్తారు. చదవండి👇 రెండు సార్లు రాష్ట్రపతిగా పనిచేసింది ఎవరు?) ఏంటిది? మోదీ ప్రారంభించిన ఎక్స్‌ప్రెస్‌వేపై ఐదు రోజులకే గుంతలు.. -
వివాదాలు, అనవసర చర్చలొద్దు
న్యూఢిల్లీ: ఏ లక్ష్యాలను సాధించేందుకు ఎంతో కాలంగా మనం ఎదురుచూస్తున్నామో ఆ లక్ష్యాలు నెరవేరే కీలక దశలో ప్రస్తుతం దేశం ఉందనీ, ఇలాంటి సందర్భంలో వివాదాస్పద అంశాలు, అనవసర చర్చలకు ప్రజలు తావీయకూడదని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ విజ్ఞప్తి చేశారు. దేశంలో మూకహత్యలు జరుగుతున్న తరుణంలో ఆయన ఇలా వ్యాఖ్యానించడం గమనార్హం. బుధవారం 72వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కోవింద్ మంగళవారం జాతినుద్దేశించి ప్రసంగించారు. త్వరలో మహాత్మా గాంధీ 150వ జయంతి సందర్భంగా ‘హింస కన్నా అహింస ఎంతో గొప్పది’ అంటూ మహాత్ముడు ఉద్బోధించిన మాటలను ఆయన గుర్తు చేశారు. ‘విద్య అంటే కేవలం ఓ డిగ్రీనో, ఓ డిప్లొమానో కాదు. ఇతరుల జీవితాన్ని మెరుగుపరిచేందుకు సాయం చేసే నిబద్ధతే విద్య. అలాగే భారత్ అంటే కేవలం ప్రభుత్వం కాదు. భారత్ భారత ప్రజలందరిదీ. అదే భారత స్ఫూర్తి’ అని అన్నారు. మహిళలకు స్వేచ్ఛ, బహిరంగ మలవిసర్జన నిర్మూలన తదితర అంశాలను కోవింద్ తన ప్రసంగంలో ప్రస్తావించారు. చరిత్ర చూడని కీలక దశ ఇది ‘ఎన్నడూ చూడని కీలక దశలో దేశం ఇప్పుడు ఉంది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న లక్ష్యాలు నెరవేరబోతున్నాయి. తీవ్ర దారిద్య్రాన్ని నిర్మూలించబోతున్నాం. బహిరంగ మలవిసర్జన రహితంగా దేశం మారుతోంది. ప్రజలందరికీ ఇళ్లు, విద్యుత్తు తదితర కలలన్నీ సాకారం కాబోతున్నాయి. దేశంలో మార్పు, అభివృద్ధి వేగంగా జరుగుతున్నాయి’ అని అన్నారు. క్యూ లైన్లలో ఒకరిని దాటుకుని మరొకరు ముందుకు పోకుండా, తమకు ముందున్న వారి పౌర హక్కులను గౌరవించాలని ఆయన ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ‘ఇది చాలా చిన్న సూచన. దీనికి అందరం కట్టుబడి ఉందాం’ అని కోరారు. మహిళలకు స్వేచ్ఛ ఉంది ‘మన తల్లులు, సోదరిలు, కూతుర్లకు వారికి ఇష్టమైన జీవితాన్ని గడిపేందుకు, ఆశలను నెరవేర్చుకునేందుకు స్వేచ్ఛ ఉంది. వారి సామర్థ్యాలను నిరూపించుకునేందుకు, భారత కార్మిక శక్తిలో భాగమయ్యేందుకు, కంపెనీల్లో ఉన్నత స్థానాలను అధిరోహించేందుకు వారికి సంపూర్ణ హక్కులు ఉన్నాయి. ఆ హక్కులను వినియోగించుకునే వీలును సమాజం కల్పించాలి. అలాగే వారికి భద్రత కల్పించాల్సిన బాధ్యత కూడా సమాజంపై ఉంది’ అని అన్నారు. దేశంలో గోప్యత, మహిళలకు భద్రత ప్రశ్నార్థకమవుతున్న తరుణంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
సమాజంలో హింసకు తావులేదు : రాష్ట్రపతి
-
'మీ తిట్లు మర్చిపోలేదు.. సారీ చెప్పండి'
సాక్షి, లక్నో : భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు వ్యతిరేకంగా నిరసనలు మొదలయ్యాయి. గతంలో ముస్లింలకు, క్రిస్టియన్లకు వ్యతిరేకంగా కామెంట్లు చేసిన భారత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ముందు క్షమాపణలు చెప్పాలని, ఆ తర్వాతే తమ విశ్వవిద్యాలయంలోకి అడుగుపెట్టాలంటూ అలీగఢ్ ముస్లిం యూనివర్సిటీ(ఏఎంయూ) యూనియన్‌కు చెందిన ఉపాధ్యక్షుడు సజ్జాద్ సుభాన్ డిమాండ్ చేశారు. 'గతంలో ఆయన చేసిన వ్యాఖ్యలకు క్షమాపణలు చెప్పడమో లేకుంటే కాన్వకేషన్ కార్యక్రమానికి గైర్హాజరు కావడమో రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింగ్ నిర్ణయించుకోవాలి. గతంలో ఆయన అన్నమాటలు ఇక్కడ ఉన్న ప్రతి విద్యార్థికి ఇంకా గుర్తున్నాయి. మా మాటలు లెక్కచేయకపోతే జరగబోయే పరిణామాలకు బాధ్యత మాది కాదు' అని సజ్జాద్ అన్నారు. 2010లో రామ్‌నాథ్ కోవింద్ బీజేపీ అధికార ప్రతినిధిగా ఉన్నారు. ఆ సమయంలో రంగనాథ్ మిశ్రా కమిషన్ సమాజంలో ఆర్థికంగా వెనుకబడిన మతాల వారికి, భాషలపరంగా మైనార్టీలుగా ఉన్నవారికి 15శాతం రిజర్వేషన్ కల్పించాలని, ఎస్సీల్లో కలపాలని సలహా ఇచ్చారు. అయితే, దీనిపై బీజేపీ తరుపున స్పందించిన రామ్‌నాథ్ కోవింద్ ముస్లింలను, క్రిస్టియన్లను ఎలా ఎస్సీల్లో చేరుస్తారని, వారంతా భారత్‌కు ఏలియన్స్లాంటి వారని అన్నారు. అయితే, ఏఎంయూలో మార్చి7న జరగనున్న కాన్వకేషన్ కార్యక్రమానికి రాష్ట్రపతి హోదాలో రామ్‌నాథ్ కోవింద్ హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో ఆయనను క్షమాపణలు చెప్పాకే రావాలంటూ విద్యార్థి సంఘాల వారు డిమాండ్ చేస్తున్నారు. -
1న రాష్ట్రపతి తిరుమలకు?
సాక్షి, తిరుమల: భారత రాష్ట్రపతిగా ఇటీవల బాధ్యతలు స్వీకరించిన రామ్‌నాథ్ కోవింద్ సెప్టెంబరు 1న కుటుంబ సభ్యులతో కలసి తిరుమల రానున్నట్లు సమాచారం. రాత్రికి ఇక్కడే బస చేసి, 2వ తేదీన వారు శ్రీవారిని దర్శించుకోనున్నారు. అదేవిధంగా తిరుపతి స్విమ్స్ ఆస్పత్రిలో జరిగే కార్యక్రమంలో రాష్ట్రపతి పాల్గొననున్నారు. ఈ మేరకు టీటీడీ అధికారులకు ప్రాథమిక సమాచారం అందింది. అధికారిక ఉత్తర్వులు ఇంకా అందలేదని వారు తెలిపారు. -
రూపే కార్డ్ ఆవిష్కరణ
- ప్రపంచంలో ఏడవ పేమెంట్ గేట్‌వే - రైల్వే టికెట్లకు ప్రి పెయిడ్ వేరియంట్ న్యూఢిల్లీ: భారత దేశం తన సొంత చెల్లింపుల గేట్‌వే, రూపేను గురువారం ఆవిష్కరించింది. వీసా, మాస్టర్ కార్డ్‌ల మాదిరి ఈ రూపే కార్డ్ కూడా ఏటీఎంల్లో, మర్చంట్ అవుట్లెట్లలో పనిచేస్తుంది. రాష్ట్రపతి భవన్లో జరిగిన ఒక కార్యక్రమంలో భారత అధ్యక్షుడు ప్రణబ్ ముఖర్జీ ఈ కార్డ్‌ను ఆవిష్కరించారు. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎన్పీసీఐ) ఈ రూపే ప్లాట్‌ఫామ్‌ను డెవలప్ చేసింది. ఈ రూపే ప్లాట్‌ఫామ్ ఐసీఐసీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, ఇంకా ఇతర బ్యాంకుల్లో క్లియరింగ్, సెటిల్మెంట్ లావాదేవీలకు ఉపయోగపడుతుంది. ఏటీఎంలు, పాయింట్ ఆఫ్ సేల్స్(పీఓఎస్), ఆన్లైన్ విక్రయాల్లో ఈ రూపే కార్డ్‌ను ఉపయోగించుకోవచ్చు. ఇది ప్రపంచంలో ఏడో చెల్లింపు విధానం. త్వరలో ఐఆర్‌సీటీ రూపే కార్డ్‌లో ప్రి పెయిడ్ వేరియంట్‌ను అందించనున్నది. రైల్వే టికెట్ల బుకింగ్‌లో ఈ ప్రి పెయిడ్ వేరియంట్ ఉపయోగపడుతుంది. ఈ రూపే కార్డ్‌ను విదేశాలకు కూడా తీసుకెళ్లేందుకు వీలుగా అమెరికాలోని డిస్కవర్ ఫైనాన్షియల్ సర్వీసెస్, జపాన్‌లోని జేడీసీలతో చర్చలు జరుపుతున్నామని ఎన్పీసీఐ చైర్మన్ బాలచంద్రన్. ఎం. చెప్పారు. వీసా, మాస్టర్ కార్డ్ వంటి అంతర్జాతీయ కార్డ్‌లతో పోల్చితే తక్కువ వ్యయానికే ఈ రూపే కార్డ్ అందుబాటులో ఉంటుందని ఆర్థిక సేవల కార్యదర్శి జి. ఎస్. సంధు చెప్పారు.