భారత 72వ స్వాతంత్ర్యదినం (ఆగస్టు 15, 2018) సందర్భంగా రాష్ర్టపతి రామ్‌నాథ్‌కోవింద్ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మంగళవారం సాయంత్రం జాతినుద్దేశించి ఆయన ప్రసంగించారు. దేశంలో ఇటీవల హింసాత్మక ఘటనలు పెరిగిపోతున్న నేపథ్యంలో జాతిపిత మహాత్మాగాంధీ వ్యాఖ్యల్ని ఆయన ఉటంకించారు. హింస కన్నా అహింసే ఎంతో శక్తిమంతమైందని అన్నారు. సమాజంలో హింసకు ఏమాత్రం తావులేదని స్పష్టం చేశారు.