independance day celebrations
-
పంద్రాగస్టు వేడుకల్లో ప్రధాని మోదీ లుక్ వేరేలెవెల్!
ఈ రోజు దేశం నలుమూలల స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంబరాన్నంటేల సంబరాలు జరుగుతాయి. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ చారిత్రాత్మక ఎర్రకోటపై నుంచి వరుసగా 11వ సారి త్రివర్ణ పతాకాన్ని ఎగురవేసి, జాతిని ఉద్దేశించి ప్రసంగించడం విశేషం. ఈ నేపథ్యంలో మోదీ లుక్ సరికొత్త స్టైల్‌కి నిర్వచనంలో డిఫెరెంట్‌గా దర్శనమిచ్చారు. మన జాతీయత రంగుల మేళవింపుతో డిఫరెంట్ లుక్‌లో కనిపించారు. అందరూ మన జాతీయ జెండా రంగుల కలియిక డ్రెస్‌లతో దర్శనమిస్తే ఆయన ఆ రంగుల మేళవింపుతోనే స్టైలిష్ లుక్‌లో కనిపించారు. మన జాతీయతకు చిహ్నంగా ఉండే రంగులతో ఫ్యాషన్‌గా ఉండొచ్చు అనేలా తలపాగ, కుర్తా-పైజామా ధరించారు. వాటి రంగులు కూడా మన దేశ జెండాని తలపించేలా ఫ్యాషన్‌కి నిర్వచనం ఇచ్చారు. ఇక్కడ మోదీ రాజస్థానీ లెహరియా తలపాగాను ధరించారు. ఇది ఆకుపచ్చ, నారింజ రంగు మేళవింపుతో దేశ జెండాను గుర్తు తెచ్చేలా హైలెట్‌గా కనిపించింది. అలాగే తెల్లటి కుర్తా, పైజామా, నీలిరంగు జాకెట్ జెండాలోని తెల్లటి రంగు, నీలం రంగులో ఉండే ఆశోక చక్ర రంగుని గుర్తు చేశాయి. మన దేశం ముక్కోణపు రంగుల మేళవింపుతో కూడిన వేషధారణతో స్టైలిష్‌గా కనిపించడం విశేషం. మన దేశ ప్రధాని ధరించిన శక్తిమంతమై రంగుల కలియిక ఎందరో త్యాగధనుల ఫలితమైన స్వాతత్య్ర వేడకకు అర్థం చెప్పేలా ఉంది. ఇక్కడ ఆయన ధరించి ఐస్ బ్లూ జాకెట్ 200 సంవత్సరాల వలస పాలన తర్వాత మనకు లభించిన స్వాతంత్య్రాన్ని తెలియజేస్తుంది. ఇక ఆయన ధరించిన తలపాగలోని ఆగుపచ్చ అభివృద్ధి, శ్రేయస్సుని తెలియజేయగా, నారింజ రంగు అమరవీరుల త్యాగాన్ని సూచిస్తోంది. ఇక తెలుపు రంగు కుర్తా పైజామా శాంతి, స్వచ్ఛతను తెలుపుతోంది. వాటన్నింటి తన వేషధారణతో తెలయజేయడం విశేషం. ఇంతవరకు అందరూ త్రివర్ణ పతాక షేడ్స్‌లో దుస్తులు ధరిస్తే ఆయన ట్రైండ్కి తగ్గట్టు సరికొత్త లుక్‌లో కనిపించడం విశేషం. కాగా, గత దశాబ్దం నుంచి మోదీ సాంప్రదాయ రాజస్థానీకి చెందిన బంధేజ్, బంధాని ప్రింట్ టర్బన్లు, మల్టీకలర్ టర్బన్లు వంటి తలపాగలెన్నో ధరించారు. #IndependenceDay2024 | PM Modi to address the nation from the ramparts of Red Fort, shortly (Photo source: PM Modi/YouTube) pic.twitter.com/KggCaY2VRI— ANI (@ANI) August 15, 2024 (చదవండి: అదో గిగా బర్గర్... ప్రపంచ రికార్డు కొట్టేసింది!) -
ఢిల్లీ పంద్రాగస్టు పంచాయతీ.. జెండా ఎగరేసేది ఆయనే
ఢిల్లీ: స్వాతంత్ర దినోత్సవం (ఆగస్టు 15) రోజున ఢిల్లీ ప్రభుత్వ అధికారిక కార్యక్రమంలో జాతీయ జెండాను ఎవరు ఎగరవేస్తారనే అనిశ్చితికి తెరపడింది. తాజాగా జెండా ఆవిష్కరణకు ఢిల్లీ హోంమంత్రి కైలాశ్ గహ్లోత్ పేరును గవర్నర్ వీకే సక్సేనా నామినేట్ చేసినట్లు రాజ్‌భవన్ వర్గాలు వెల్లడించాయి. ఢిల్లీలోని ఛత్రసాల్ స్టేడియంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాను ఆవిష్కరించేందుకు లెఫ్టినెంట్ గవర్నర్.. హోమ్ మంత్రి కైలాశ్ గహ్లోత్‌ను నామినేట్ చేయడం సంతోషంగా ఉంది. దానికోసం అవసరమైన ఏర్పాట్లు చేయండి’’ అని ఎల్జీ కార్యదర్శి ఆశిష్ కుంద్రా రాష్ట్ర చీఫ్ సెక్రటరీ నరేష్ కుమార్‌కు లేఖలో పేర్కొన్నారు. అంతకు ముందు.. జాతీయ జెండాను ఎగరవేసే అవకాశం మంత్రి అతిశీకి ఇవ్వాలనే సీఎం కేజ్రీవాల్ విజ్ఞప్తిపై పరిపాలన శాఖ విభాగం అభ్యంతరం వ్యక్తం చేసింది. ‘‘ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో జాతీయజెండా ఎగరవేసే అధికారాన్ని ఢిల్లీ మంత్రి అతిశీకి ఇవ్వలేం. ఈ వేడుక నిర్వహించేందుకు నిర్దేశిత విధానం ఉంటుంది. ఆ నిబంధనలు పాటించకుండా అతిశీకి జెండా ఎగరవేసే బాధ్యత అప్పగిస్తే కార్యక్రమం పవిత్రత దెబ్బతింటుంది. అందుకే ఈ నిర్ణయం తీసుకున్నాం’’ అని పేర్కొంది.కాగా.. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో సీఎం అరవింద్ కేజ్రీవాల్‌ను సీబీఐ అరెస్టు చేసిన విషయం తెలిసిందే. దీంతో ఆయన ప్రస్తుతం తిహార్ జైల్లో ఉన్నారు. అయితే ఆయనకు స్వాతంత్రవ దినోత్సవం రోజు జాతీయ జెండాను మంత్రి అతిశీ ఎగురవేస్తారని ఎల్జీకి లేఖ రాశారు. ఈ విషయం ప్రస్తుతం ఎల్జీ వర్సెస్ ఆప్‌గా మారింది. తాజాగా రాజ్‌భవన్ విడుదల చేసిన ప్రకటనపై మంత్రి అతిశీ స్పందించలేదు. -
పేద లు గెలిచే వరకు యుద్ధం ఆగదు
-
కాసేపట్లో రాజ్ భవన్ లో ఎట్‌హోం కార్యక్రమం
-
రాష్ట్రాభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ శకటాల ప్రదర్శన
-
సాయుధ బలగాల గౌరవ వందనం,కళాకారుల ఆటపాటలు
-
తెలుగు రాష్ట్రలో ఘనంగా 77వ స్వాతంత్య్ర దినోత్సవం వేడుకలు
-
శాన్ ఫ్రాన్సిస్కోలో " స్వదేశ్" పేరుతో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
అసోసియేషన్ ఆఫ్ ఇండో అమెరికన్స్ ఏఐఏ ఆధ్వర్యంలో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు వైభవంగా జరిగాయి. శాన్ ఫ్రాన్సిస్కో, బే ఏరియాలో స్వదేశ్ పేరుతో వేడుకలను నిర్వహించారు. పలువురు ప్రముఖులు హాజరై.. జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. స్వదేశ్ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం భారత సంస్కృతి, సంప్రదాయాలను ప్రచారం చేయడమేనని పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన చిన్నారులు సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొని సందడి చేశారు. భారీ భారతీయ జెండా.. పరేడ్‌లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ప్రవాసులు మువ్వన్నెల జెండాను చేతబూని వందేమాతరం, భారతమాతకి జై అంటూ నినాదాలు చేశారు. (చదవండి: న్యూజెర్సీలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు! పాల్గొన్న మిల్కీ బ్యూటీ తమన్నా!) -
AP: స్వాతంత్ర్య వేడుకలకు ఏర్పాట్లు సిద్దం..
సాక్షి, అమరావతి: ఏపీలో స్వాతంత్య్ర వేడుకలకు సర్వం సన్నద్ధమైంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి విజయవాడలో రేపు(మంగళవారం) జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. ఈ క్రమంలో విజయవాడలోని ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో రాష్ట్రప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ► జాతీయ జెండాను ఎగరువేసిన అనంతరం సీఎం జగన్ సాయుధ దళాల నుండి గౌరవ వందనం స్వీకరిస్తారు. ఆ తర్వాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ముఖ్యమంత్రి జగన్ ప్రసంగిస్తారు. ప్రదర్శన కోసం వివిధ శాఖలకు చెందిన శకటాలను కూడా స్టేడియంలో సిద్దం చేశారు. ► ఉదయం 9 గంటలకు వేడుకలు ప్రారంభం కానున్న దృష్ట్యా ఆహ్వనితులు, పాస్‌లు ఉన్నవారు ఉదయం 8 గంటల వరకు సభా ప్రాంగణంలో కేటాయించిన సీట్లలో కూర్చోవాలని అధికారులు కోరారు. ► ఈ కార్యక్రమం అనంతరం సాయంత్రం ఐదున్నర గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ అబ్దుల్ నజీర్ ఇచ్చే తేనీటి విందు కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ హాజరుకానున్నారు. ► ఇందిరాగాంధీ స్టేడియంలో ఇప్పటికే రిహార్సల్స్ పూర్తి. వీవీఐపీలకు, ప్రజాప్రతినిధులకు, ప్రజలకు గ్యాలరీలు ఏర్పాటు. ► కవాతు చేయనున్న ఎన్సీసీ, ఏపీఎస్పీ, బెటాలియన్లు, ట్రైబల్ వెల్ఫేర్ కంటెంజెంట్స్. ► ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమాన్ని వివరిస్తూ రూపొందించిన శకటాలు. ఇది కూడా చదవండి: ఫ్లాగ్ కోడ్ తెలుసా..? -
Independence day celebrations 2023: స్వేచ్ఛాగీతం
స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు అంతర్జాలంలో ఆరంభం అయ్యాయి. ఆనాటి దేశభక్తి గీతాల నుంచి బ్లాక్ అండ్ వైట్ ఫోటోల వరకు రకరకాల పోస్ట్‌లు పెడుతున్నారు... వడుకుమురా! వడుకుమురా! వడుకుమురా! వడుకుమురా! వడి వడి స్వేచ్ఛా వాయువు పీల్చి – రాట్నగీతము (గురజాడ రాఘవశర్మ) వీరభారతి సందేశం పరదేశీయులు తొలగండి ఈ భారతదేశం మా దేశం వినండి! వినండి! విశ్వప్రజలు వీరభారతి సందేశం – వానమామలై వరదాచార్యులు చిత్రం: 1857 సిపాయి తిరుగుబాటు ఉప్పోయమ్మ ఉప్పు ముప్పది కోట్ల ప్రజల ముప్పు దీర్చే ఉప్పు ఉప్పుగాదిది రత్నపు తిప్ప మన పాలిటికి – ఉప్పుపాట (గరికపాటి మల్లావధాని) ఫోటో: దండి సత్యాగ్రహం: ఏప్రిల్6, 1930 చెప్పరా...లేకున్న ముప్పురా! చెప్పరా! నీ కన్నులిటపై/ విప్పరా! ఆ ప్రభుత నింతట త్రిప్పరా! లేకున్న–నీకగు ముప్పురా! మాయప్ప ఇప్పుడు – పాంచాలము (గరిమెళ్ల) ఫొటో: సహాయనిరాకరణ ఉద్యమ కాలంలో బాంబేలో బ్రిటిష్ వారి వస్తువులతో ఉన్న ఎడ్లబండి ముందుకు పోకుండా రోడ్డుకు అడ్డంగా పడుకున్న ఉద్యమకారుడు -
ఎలుగెత్తి చెబుదాం గొంతెత్తి పాడుదాం
పిల్లలు నోరు తెరిచి దేశం గురించి మాట్లాడే రోజు ఆగస్టు 15. గొంతెత్తి దేశభక్తిని గానం చేసేరోజు మన స్వాతంత్య్ర దినోత్సవం. సంవత్సరంలో 364 రోజులు వారు ఫోనులోనో గేమ్స్లోనో మునిగి ఉన్నా ఈ ఒక్కరోజైనా వారి చేత దేశం గురించి మాట్లాడించాలి. దేశ ఘనతను పాడించాలి. తల్లిదండ్రులు తమ పిల్లల చేత కనీసం ఒక పాట పాడించాలి. ఐదు నిమిషాలు మాట్లాడించాలి. ఏ పాటలు? ఏ మాటలు? ఇవిగోండి సలహాలు... ‘దేశమును ప్రేమించుమన్నా మంచి అన్నది పెంచుమన్నా వొట్టి మాటలు కట్టిపెట్టొయ్ గట్టిమేల్ తలపెట్టవోయ్’... అన్నారు గురజాడ. ‘దేశమును ప్రేమించాలి’ అని పిల్లలకు తెలుసు. కాని దేశంలో మంచి పెరిగితేనే అది ప్రేమించ దగ్గ దేశమవుతుందని, దేశంలోని ప్రతి ఒక్కరికీ మేలు జరిగినప్పుడే అది గొప్ప దేశమవుతుందని గురజాడ చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఇలాంటి ఒక పాటైనా పిల్లల చేత పాడించకపోతే తల్లిదండ్రుల పెంపకంలో నిర్లక్ష్యం ఉన్నట్టే అర్థం. ‘చెట్టపట్టాల్ పట్టుకొని దేశస్తులంతా నడవ వలెనోయ్... అన్నదమ్ముల వలెను జాతులు మతములన్నీ మెలగవలెనోయ్’ అని కూడా గురజాడ అన్నారు. ఇవాళ్టి సందర్భంలో పిల్లలకు ఈ పాట నేర్పి, దాని అర్థం మనసుకు ఎక్కించకపోతే భవిష్యత్తులో వారు ‘దేశమంటే మట్టే’ అనుకుంటారు. ‘మనుషులు’ అనుకోరు. త్యాగఫలం తెలియచేయాలి ఇవాళ మనం పీలుస్తున్న ప్రతి శ్వాస మన పూర్వికుల రక్తం, చెమట, త్యాగం ఫలితం. మహానుభావులు వారి జీవితాలను త్యాగం చేసి భావితరాల చేతుల్లో పెట్టారు దేశాన్ని. ఎంతో విలువైన ఈ దేశ సంపద, దేశ సంస్కృతి పట్ల పిల్లలకు గౌరవం, బాధ్యత తెలియాలంటే వారిలో జాతీయ భావాలు, సుహృద్భావం కలగాలంటే ఆగస్టు 15ను ఒక సందర్భంగా చేసుకుని తెలియచేయాలి. ఇవాళ దురదృష్టవశాత్తు కొన్ని ఇళ్లల్లో పిల్లలకు తెలుగు నేర్పించడం లేదు. కొన్ని స్కూళ్లలో పిల్లలు జెండా వందనం రోజు జైహింద్ చెప్తే సరిపోతుందనుకుంటున్నారు. కనీసం ఒక బృందగానంలో కూడా పాల్గొనడం లేదు... వక్తృత్వంలో నాలుగు ముక్కలు దేశం గురించి మాట్లాడటం లేదు. అందుకే తల్లిదండ్రులు పూనుకుని తమ ప్రతి పిల్లల చేత అయితే తమ అపార్ట్మెంట్లో, లేదా తమ వీధిలో, ఇంట్లో ఏదో విధాన ఒక పాట పాడించడం, దేశం గురించి తప్పకుండా నాలుగు ముక్కలు మాట్లాడించడం అవసరం. పిల్లలు సరిగ్గా చెప్తే వింటారు. నేర్చుకుంటారు. వారికి ఆ వేళ విశేషమైన దుస్తులు, దేశభక్తులు వేషాలు వేస్తే ఎంతో సంబరపడతారు. ఆ స్ఫూర్తిని నింపుకుంటారు. ఆగస్టు 15 అంటే సెలవు దినం, ఆ రోజు ఎటైనా వెళ్లొద్దాం అని ప్లాన్ చేసుకునే తల్లిదండ్రులు పిల్లలను దేశం వైపు నడిపించడంలో నిర్బాధ్యతగా ఉన్నట్టే లెక్క. ఎన్నో పాటలు పిల్లలు నేర్చుకుని పాడటానికి తెలుగు, హిందీ భాషల్లో ఎన్నో పాటలు ఉన్నాయి. ప్రయివేటు గీతాలతో పాటు సినీ గీతాలు కూడా ఉన్నాయి. వీటిలో ఏదో ఒకటి నేర్పించవచ్చు. ‘దేశమును ప్రేమించుమన్నా’ (గురజాడ), ‘మా తెలుగు తల్లికి మల్లెపూదండ’ (శంకరంబాడి), ‘జయజయ ప్రియభారత జనయిత్రి’ (దేవులపల్లి), ‘తేనెల తేటల మాటలతో’ (ఇంద్రగంటి శ్రీకాంత శర్మ), ‘మాకొద్దీ తెల్లదొరతనము’ (గరిమెళ్ల), ‘చెయ్యెత్తి జైకొట్టు తెలుగోడ’ (వేములపల్లి శ్రీకృష్ణ)... ఇవన్నీ ఉన్నాయి. ఇక సినిమా పాటల్లో ‘పాడవోయి భారతీయుడా’ (శ్రీశ్రీ) పిల్లలు పాడటానికి సులువుగా ఉంటుంది. మన పిల్లలకు ‘వందేమాతరం’, ‘జనగణమన’, ‘సారే జహాసే అచ్ఛా’ కనీసం వచ్చునా రావా అన్నది కూడా గమనించుకుంటే మంచిది. దేశం గురించి మాట్లాడాలి పిల్లలు దేశం గురించి, దేశ ఔన్నత్యం గురించి మాట్లాడాలి. మాట్లాడటంలో వారికి తర్ఫీదు ఇవ్వాలి. ఏం మాట్లాడాలన్న విషయంలో కొంచెం సాయం చేసినా పర్వాలేదు. ‘భిన్నత్వంలో ఏకత్వం’, ‘మన జాతిపిత’, ‘దేశాభ్యున్నతికై పర్యావరణ పరిరక్షణ’, ‘డిజిటల్ ఇండియా’, ‘స్త్రీ శక్తి’, ‘సామాజిక బాధ్యత’... ఇలా ఏదో ఒక అంశం ఇచ్చి ఐదు నిమిషాలు మాట్లాడేలా చేయాలి. ఇది ఒక సంప్రదాయం. ఒక తరం నుంచి మరో తరానికి అందాలి. అమృతోత్సవం సందర్భంగా ‘హర్ ఘర్ తిరంగా’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటిపై జెండా ఎగరేయడంలో పిల్లలను భాగస్వాములను చేయాలి. దేశ పతాకం పిల్లల చేతుల్లో రెపరెపలాడాలి. దేశభవిష్యత్తుకు వారే విధాతలు కావాలి. -
ఇది ఎన్నో స్వాతంత్య్ర దినోత్సవమో తెలుసా!ఏంటీ డౌంట్? అంటే..
ఆగస్టు 15 భారతదేశం తెల్లవాళ్ల పాలన నుంచి విముక్తి పొంది స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్న చారిత్రక ఘట్టాన్ని స్మరించుకునే రోజు ఇది. 1947లో బ్రిటీష్ వలస పాలన నుంచి భారతదేశం విముక్తి పొందిన తర్వాత నుంచే ఈ దినోత్సవాన్ని ప్రతి ఏటా ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ దినోత్సవం సందర్భంగా స్వాతంత్య్ర సంపాదించిపెట్టిన ఎందరో త్యాగధనులు, సమర యోధుల అలుపెరగని పోరాటాలను స్ఫురణకు తెచ్చకుని వారికి నివాళులర్పిస్తూ పండుగలా చేసుకుంటాం. అయితే అందరిలోనూ ఎదురయ్యే సందేహం ఇప్పుడూ మనం ఎన్నో స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నాం? అని. ఇది 76వ? లేక 77వ దినోత్సవమా! అని మదిలో ఒకటే డౌట్. అందరూ చెప్పేది మాత్రం మనం 77వ స్వాతంత్య్ర దినోత్సవం అని కరాఖండీగా చెబుతున్నారు. అసలు ఈ సందేహం ఎందుకు వస్తోంది అంటే.. నిజానికి మనం బ్రిటీష్ పాలన నుంచి మన దేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత తొలిసారిగా 1948 ఆగస్టు 15న ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఆ లెక్కన గణిస్తే ఇది 76వ స్వాతంత్య్ర దినోత్సవంగా పరిగణించాల్సి ఉంటుంది. ఇక 77వ స్వాతంత్య్ర దినోత్సవం అని చాలా మంది కాన్ఫిడెంట్‌గా అనడానికి గల కారణం ఏంటంటే..భారతదేశం ఆగస్టు 15, 1947న స్వాతంత్య్రం లభించిందినే ఆధారంగా లెక్కిస్తే 2023 అనేది 77వ స్వాతంత్య్ర దినోత్సవం అవుతుంది. అయితే ఎక్కువగా 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్నే పరిగణనలోకి తీసుకుంటున్నారు. అంతేకాదు దాదాపు 200 సంవత్సారాల బ్రిటిష్ పాలన తర్వాత భారతదేశం స్వాతంత్య్రం పొందింది. ఈ దినోత్సవం థీమ్: "నేషన్ ఫస్ట్, ఆల్వేస్ ఫస్ట్" ఈ థీమ్ ముఖ్యోద్దేశం "కష్ట సమయాల్లో కూడా దేశ ప్రయోజనాలకే తొలి స్థానం" ఇవ్వాలనే ప్రాముఖ్యతను గుర్తు చేస్తుందని ప్రభుత్వం పేర్కొంది. ఇక దినోత్సవాన్ని ఊరు, వాడతో సంబంధం లేకుండా అంతా ఒక్కటిగా ఆనందంగా జరుపుకునే గొప్ప సంబరం. త్రివర్ణ పతాకం ఎగరువేయడంతో ప్రారంభమైన ఈ దినోత్సవం..దేశం సాధించిన విజయాలను పరంపర నుంచి సాధించాల్సిన నిరంతర ప్రగతి ఆవశక్యతను గూర్చి తెలియజేసే సుదినం. ఇది గతానికి సంబంధించిన వేడుక మాత్రమే కాదు..ఉజ్వల భవిష్యత్తు కోసం ఎదురుచూసే అవకాశం. ఇది భారతదేశానికి ఆధారమైన భిన్నత్వంలోని ఏకత్వం ప్రాముఖ్యత తోపాటు ప్రజాస్వామ్య విలువలను గుర్తు చేస్తుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట వద్ద ప్రధాని జెండా ఎగరువేసి.. జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ రోజంతా భారతదేశ గొప్ప సాంస్కృతికి వారసత్వం, వైవిధ్యాన్ని ప్రదర్శించేలా దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు కవాతులు జరుగుతాయి. అంతేగాదు రాబోయే తరాలకు బలమైన, సమగ్రమైన, సంపన్నమైన దేశాన్ని నిర్మించాలనే నిబద్ధతను పునరుద్దరించేందుకు ఈ దినోత్సవం ఓ మంచిరోజు. (చదవండి: స్త్రీ పోరాటాన్ని ఆవిష్కరించిన ఉద్యమం! బ్రిటిషర్లకే చుక్కలు చూపించారు!) -
స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న YSR
-
ఒకప్పుడు అమెరికా సైతం బ్రిటీష్ పాలనలోనే.. ఈ విషయాలు తెలుసా!
జూలై 4 అమెరికాకు చాల ప్రత్యేకమైన రోజు. ఆ రోజు అగ్రరాజ్యం బానిస పాలన నుంచి విముక్తి పొంది స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్న రోజు. ప్రపంచ రాజకీయాల్లో అన్ని దేశాలను శాసించే అగ్రరాజ్యం సైతం రవి అస్తమించని సామ్రాజ్యంగా పేరొందిన బ్రిటీష్ రాజ్యం చేతిలో విలవిలలాడింది. నిజానికి అమెరికా జూలై 04, 1776న స్వాతంత్య్రం పొందినప్పటికీ.. ఈ ప్రక్రియ జరగడానికి రెండు రోజుల క్రితం అనగా జులై 02, 1776 న కాంటినెంటల్ కాంగ్రెస్ స్వాతంత్య్రాన్ని ప్రకటించేందుకు ఓటింగ్ నిర్వహించింది. ఆ రోజున దాదాపు12 అమెరికా కాలనీలు అధికారికంగా బ్రిటీష్ పాలన నుంచి విడిపోవాలని దృఢంగా నిర్ణయించుకున్నాయి. అమెరికన్ కాలనీలను స్వేచ్ఛ రాష్ట్రాలుగా ప్రకటించిన వారిలో థామస్ జెఫెర్సన్ ఒకరు. అదే సమయంలో ప్రఖ్యాత రాజనీతిజ్ఞుడు, దౌత్యవేత్త, అమెరికా మూడవ అధ్యక్షుడు, రాజకీయ తత్వవేత్త అయిన బెంజమిన్ ఫ్రాంక్లిన్ కూడా ఉన్నారు. దీంతో జూలై 04, 1777న అమెరికా కాలనీలు పూర్తి స్థాయిలో అధికారికంగా స్వాతంత్య్రాన్ని పొందాయి. ఇక ఆ రోజు సుమారు 13 గన్షాట్ల గౌరవ వందనం నిర్వహించి బాణసంచా కాల్చారు. ఆ తర్వాత ఈ వేడుకలు జూలై 04, 1801లో తొలిసారిగా వైట్‌హౌస్‌లో ఘనంగా జరిగాయి. ఇక అప్పటి నుంచే అమెరికాలో బాణసంచా కాల్చడం ఒక ఆనవాయితీగా మారింది. ఆ రాష్ట్రపతి తప్ప అందరూ జరుపుకుంటారు! అలాగే జూలై 3, 1776న, స్వాతంత్య్ర ప్రకటనపై సంతకం చేయడానికి ఒక రోజు ముందు, వ్యవస్థాపక పితామహులలో ఒకరైన జాన్ ఆడమ్స్ తన భార్య అబిగైల్ ఆడమ్స్కు ఈ విషయం చెప్పి.. ఆ రోజును తప్పనిసరిగా "పాంప్ అండ్ పెరేడ్, షెవ్స్తో జరుపుకోవాలని లేఖ రాశాడు. ఈ రోజున ఆటలు, క్రీడలు, తుపాకుల వందనాలు, ఫైరింగ్ వంటి తదితరాలతో.. అమెరికాలో నలుమూలల ఉన్న ప్రజలు వేడుకలు ఘనంగా జరుపుకోవాలని కోరాడు. ఈ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకను అమెరికన్లు అందరూ ఘనంగా ఆనందంగా నిర్వహించుకోగా ..రాష్ట్రపతి జాన్ ఆడమ్స్ మాత్రం వీటన్నిటకీ దూరంగా ఉన్నారు. జాన్ ఆడమ్స్ ఈ సెలవురోజుని జరుపుకునేందుకు నిరాకరించారు. అందుకు కారణం అతడు జులై 02 నిజమైన స్వాతంత్య్ర దినోత్సవంగా భావించడమేనని కొందరూ చెబుతుంటారు. ప్రస్తుతం అమెరికా 247వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని జరుపుకుంటోంది. ఈ రోజు కవాతుల ప్రదర్శన, బాణసంచా కాల్పులు, కార్నివాల్‌లు తదితరాలతో అమెరికన్లు పండగ చేసుకుంటారు. రాజకీయ ప్రసంగాలు ఈ వేడుకలో హైలెట్‌గా నిలుస్తాయి. ఈ రోజు అమెరికన్లు తమ జాతీయ పతాకం రంగుకి అనుగుణంగా నీలం, ఎరుపు, తెలుపు వంటి కలర్‌ఫుల్ రంగుల దుస్తులను ధరిస్తారు. (చదవండి: ఒక్క రూపాయి తీసుకోకుండా.. వందల కొద్ది బ్రిడ్జ్‌లను నిర్మించాడు!) -
కెనడాలో భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. వేలాది మంది హాజరు
Azadi Ka Amrit Mahotsav in Canada: గత రెండేళ్లుగా కరోనా మహమ్మారి కారణంగా భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకులు కెనడాలో వర్చువల్‌గా జరిగాయి. కానీ ఈసారి స్వాతంత్య్ర వేడుకలు కెనడాలోని టోరంటోలోని నాథన్ ఫిలిప్స్‌లో చాలా అంగ రంగ వైభవంగా జరిగాయి. ఈ మేరకు టోరంటోన్ నాథన్ ఫిలిప్స్‌లో జరిగిన భారత స్వాతంత్య్ర వేడుకలకి దాదాపు 25 భారతీయ రాష్ట్రాల నుంచి సుమారు 15కు పైగా కవాతు బృందాలు తరలి వచ్చాయి. ఈ వేడుకలకు సుమారు పదివేలమందికి పైగా ఇండో కెనడియన్లు హాజరయ్యారు. అంతేకాదు ఈ వేడుకలకు హాజరయ్యేవారి కోసం ఏర్పాటు చేసిన భారతీయ వంటకాలు, సాంస్కృతిక ప్రదర్శనలు ప్రధాన ఆకర్షణగా నిలిచాయి. ఈ కార్యక్రమంలో లాభప్రేక్షలేని సంస్థ పనోరమా ఇండియా చైర్మన్ వైదేహి భగత్ భారత్‌లోని మొత్తం కవాతును ఒక చోటకు చేర్చి పాల్గొనేలా చేశారు. సుమారు 553 మీటర్ల ఎత్తైన సీఎన్ టవర్ పై త్రివర్ణ పతాక వెలుగులుతో దేదీప్యమానంగా విరజిమ్మిలా చేశారు. ఈ కార్యక్రమానికి అద్భుతమైన స్పందన లభించిందంటూ భగత్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమానిక ముఖ్య అతిథిగా కెనడా జాతీయ రక్షణ మంత్రి అనితా ఆనంద్ హజరయ్యారు. ఈ మహత్తర సందర్భాన్ని గుర్తించేందకు కలిసి వచ్చిన ఇండో కెనడియన్లందరికీ ధన్యావాదాలు అని ట్వీట్ చేశారు. అలాగే ఈ కార్యక్రమానికి ఎలాంటి అంతరాయ కలగకుండా ఉండేలా టోరంటో పోలీసు సిబ్బంది గట్టి భద్రత ఏర్పాటు చేశారు. ఇండియా డే పరేడ్, సాంప్రదాయకంగా ఆగస్టు 15 తర్వాత ఆదివారం నిర్వహిస్తారు. అక్కడ ఉండే భారతీయలు ఈ నెల మొత్తం దేశవ్యాప్తంగా ఈ వేడుకులను ఘనంగా నిర్వహించుకుంటారు. అంతేకాదు ఆగస్టు 15 స్వాతంత్య్ర వేడుకలు ఆల్బెర్టా ప్రావిన్స్‌లోని కాల్గరీలో నిర్వహించారు. ఈ వేడుకను 22 కమ్యూనిటి సంస్థలు నిర్వహించాయి. సుమారు ఐదు వేల మంది హాజరయ్యారు. అలాగే గురుకుల ఇంటర్ కల్చరల్ సొసైటీ గత ఆదివారం బ్రిటిష్ కొలంబియాలో దాదాపు 300 వాహనాలతో తిరంగ యాత్ర కార్ ర్యాలీని నిర్వహించింది. (చదవండి: కిలిమంజారో పర్వతంపై వైఫై.. ఎవరెస్ట్‌పై ఏనాడో!) -
'నేను జైలు పాలైన జర్నలిస్ట్ కూతురుని'...అంటూ చిన్నారి ప్రసంగం! వైరల్
న్యూఢిల్లీ: తొమ్మిదేళ్ల చిన్నారి తన పాఠశాలలో ఇచ్చిన ప్రసంగం నెట్టింట వైరల్‌గా మారింది. ఆమె స్వాత్రత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా.. పాఠశాల్లో ప్రసంగించింది. ఆమె తన ప్రసంగాన్ని ‘నేను పౌర హక్కులు హరించడం కారణంగా కటకటాల పాలైన జర్నలిస్ట్ కుమార్తెని’ అని ప్రారంభించి అందర్నీ విస్మయపర్చింది. సుమారు రెండు నిమిషాల నిడివి గల ఆ వీడియోలో పౌరులు హక్కులు, మతం, హింసకు తావిచ్చే రాజకీయాలు గురించి ప్రసంగించి ఆశ్చర్యపరిచింది. ఆ చిన్నారి తన ప్రసంగంలో... ‘ప్రతి భారతీయుడికి ఏం మాట్లాడాలి, ఏం తినాలి, ఏ మతాన్ని అనుసరించాలి వంటివి నిర్ణయించుకునే హక్కు ఉంటుంది. ఇవన్ని మహాత్మ గాంధీ, నెహ్రు, భగత్ సింగ్ వంటి స్వాతంత్య్ర సమరయోధుల పోరాటాలు, త్యాగాల వల్లే సాధ్యమైంది. నాటి సమరయోధులను స్మరిస్తూ.. పౌరుల సాధారణ స్వేచ్ఛ హక్కులను హరించొద్దు ఇదే నా అభ్యర్థన. నా మాతృభూమిని చూసి గర్విస్తున్నాను, దీన్ని లొంగదీసుకోవాలని చూడకూడదు. మనం 76వ స్వాతంత్య్ర దినోత్సవంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా తిరుగులేని ఆనందం, అధికారం కలిగిన ఒక భారతీయురాలిగా "భారత మాతకి జై" అని చెప్పాలనుకుంటున్నాను’ అంటూ ప్రసంగం ముగించింది. ఆ చిన్నారి తండ్రి మలయాళ వార్త ఛానెల్ అజీముఖం రిపోర్టర్ సిద్దిక్ కప్పన్. అక్టోబర్ 2020లో అత్యాచారానికి గురైన 19 ఏళ్ల దళిత మహిళ గురించి రిపోర్టింగ్‌ని నివేదించడానికి వెళ్తుండగా అతడి తోపాటు మరో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. భద్రతలకు విఘాతం కలిగించాడనే ఆరోపణలతో ఆయనను అరెస్టు చేశామని పోలీసులు చెబుతున్నారు. తనను అకారణంగా జైలు పాలుచేశారని, తాను నిర్దొషినని సిద్ధిక్ పేర్కొన్నాడు. అతడి బెయిల్ దరఖాస్తును సైతం అలహాబాద్ లక్నో హైకోర్టు బెంచ్ తిరస్కరించింది. (చదవండి: జాతీయ వ్యతిరేకులకు కాంగ్రెస్ మద్దుతిస్తోంది: కేఎస్ ఈశ్వరప్ప) -
స్వాతంత్య్ర వేడుకుల నడుమ ఉద్రిక్తతలు
శివమొగ్గ: స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా శివమొగ్గ నగరంలో ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. సమరయోధుడు సావర్కర్ ఫ్లెక్సీ విషయంలో ఇద్దరు యువకులు కత్తిపోట్లకు గురయ్యారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. 144 సెక్షన్ అమలు చేశారు. సోమవారం ఇక్కడి హమీద్ అహ్మద్ సర్కిల్ వద్ద వీర సావర్కర్ ఫ్లెక్సీతో సావర్కర్ మద్దతుదారులు ర్యాలీ నిర్వహించగా కొందరు వ్యతిరేకంగా ర్యాలీ చేశారు. ఇదే సమయంలో ఓ వర్గానికి చెందిన వ్యక్తులు అక్కడికి చేరుకుని సావర్కర్ ఫ్లెక్సీని తొలగించాలని యత్నించారు. దాని స్థానంలో టిప్పు సుల్తాన్ ఫ్లెక్సీ ఏర్పాటు చేయడానికి యత్నిస్తుండగా పరిస్థితి అదుపు తప్పుతుందని భావించిన పోలీసులు లాఠీచార్జ్ చేసి ఆందోళనకారులను చెదరగొట్టారు. ఇదే సమయంలో హిందూ పోరాట సంఘాలు అక్కడి చేరుకోవడంతో గొడవ మరింత పెరిగింది. సర్కిల్‌కు సమీపంలో ప్రేమ్‌సింగ్, ప్రవీణ్ అనే ఇద్దరు యువకులపై గుర్తు తెలియని వ్యక్తులు చాకుతో దాడి చేశారు. వారిని హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. ఇందులో ఒకరి పరిస్థితి విషమించింది. దీంతో నగర వ్యాప్తంగా పోలీసులు భారీగా మోహరించారు. (చదవండి: జెండా పండుగలో విషాదం) -
వీరుల త్యాగఫలమే మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ ఘనంగా జరుగుతున్నాయి. వజ్రోత్సవ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్.. గోల్కోండ కోటలో జాతీయ జెండాను ఎగురవేశారు. ఈ సందర్భంగా పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. స్వాతంత్ర్య వజ్రోత్సవాల సందర్భంగా రాష్ట్ర, దేశ ప్రజలకు శుభాకాంక్షలు. తెలంగాణలో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వజ్రోత్సవాలను జరుపుకుంటున్నాము. తెలంగాణ ప్రభుత్వం ఆగస్టు 8వ తేదీ నుంచి వజ్రోత్సవ వేడుకలను జరపాలని నిర్ణయించింది. అందులో భాగంగానే తెలంగాణలో ప్రతీ ఇంటా జాతీయ జెండాలను ఎగురవేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో, తెలంగాణ త్రివర్ణ శోభితమైంది. ఎందరో వీరుల త్యాగఫలం మనం అనుభవిస్తున్న స్వాతంత్ర్యం. తెలంగాణ నుంచి స్వాతంత్ర్య ఉద్యమంలో తుర్రేబాజ్‌ఖాన్, రాంజీగోండు, పీవీ సహా అనేక మంది పాల్గొన్నారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత దేశంలోనే అన్ని రంగాల్లో ముందుంది. హైదరాబాద్‌ను గంగాజమునా తెహజిబ్‌గా మహాత్మాగాంధీ అభివర్ణించారని తెలిపారు. Watch live: Hon’ble CM Sri KCR taking part in Independence Day celebrations at Golconda Fort in Hyderabad. #IndiaIndependenceDay #IndiaAt75 #స్వాతంత్ర్యదినోత్సవం https://t.co/tHPxUgwVEc — Telangana CMO (@TelanganaCMO) August 15, 2022 -
ప్రధాని హోదాలో తొమ్మిదో సారి మోదీ పతాకావిష్కరణ
-
అమృతోత్సాహం.. 76వ స్వాతంత్య్ర దినోత్సవాలకు దేశం సిద్ధం
సాక్షి, హైదరాబాద్: ఎటు చూసినా మువ్వన్నెల రెపరెపలే. ఎవరిని కదిలించినా అమృతోత్సవ సంగతులే. ఊరూ వాడా, పల్లె పట్నం మూడు రంగుల వెలుగుల్లో మెరిసిపోతున్నాయి. స్వాతంత్య్ర సంబరాల ముచ్చట్లతో మురిసిపోతున్నాయి. స్వాతంత్య్ర భానూదయానికి 75 ఏళ్లు పూర్తవుతుండటం ఈసారి పంద్రాగస్టు ప్రత్యేకతను మరింత పెంచింది. ఈ నేపథ్యంలో దేశమంతా త్రివర్ణ శోభితమైంది. నెలల తరబడి సాగుతున్న స్వాతంత్య్ర అమృతోత్సవాలకు అద్భుతమైన ముగింపు ఇచ్చేందుకు అన్నివిధాలా ముస్తాబైంది. గోల్కొండ కోటపై జాతీయజెండా ఎగరేయనున్న సీఎం కేసీఆర్ దేశ 76వ స్వాతంత్య్ర దినోత్సవాల సందర్భంగా సీఎం కేసీఆర్ సోమవారం ఉదయం 10.30 గంటలకు హైదరాబాద్‌లోని చరిత్రాత్మక గోల్కొండ కోటపై జాతీయ జెండాను ఎగరవేయనున్నారు. అనంతరం రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. స్వాతంత్య్రం సాధించి 75 ఏళ్లు పూర్తైనా.. దేశం అన్ని రంగాల్లో వెనుకబడి ఉండటాన్ని, కేంద్ర ప్రభుత్వాల వైఫల్యాలను సీఎం తన ప్రసంగంలో ఎండగట్టే అవకాశం ఉంది. దేశంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితులు, ముందున్న సవాళ్లు, కర్తవ్యాలు వివరించడంతో పాటు.. తెలంగాణ ఏర్పాటైన తర్వాత సాధించిన పురోగతిని, భవిష్యత్ కార్యక్రమాలను ప్రస్తావించే అవకాశం ఉన్నట్టు తెలిసింది. త్రివర్ణ శోభితమైన గోల్కొండ కోట కాగా రాష్ట్రంలో ఆగస్టు 15 నుంచి కొత్తగా 10 లక్షల పెన్షన్లు జారీ చేయాలని ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నేపథ్యంలో కొందరు లబ్ధిదారులకు సీఎం కేసీఆర్ స్వయంగా పెన్షన్ కార్డులు అందజేసే అవకాశం ఉంది. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా 75 మంది ఖైదీలను విడుదల చేయాలని కేబినెట్ తీసుకున్న నిర్ణయం మేరకు సోమవారం ఖైదీలు విడుదల కానున్నారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్ ఆదివారం గోల్కొండ కోటను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. రాజ్‌భవన్‌లో రాష్ట్ర గవర్నర్ తమిళిసై జాతీయ జెండాను ఎగురవేయనున్నారు. మిగతా జిల్లాల్లో స్థానిక మంత్రులు, ప్రభుత్వ విప్‌లు, ఇతర ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ సలహాదారులు జాతీయ జెండా ఎగురవేయనున్నారు. త్రివర్ణ శోభితమైన చార్మినార్ చదవండి: స్వతంత్ర భారత సందేశం -
Azadi Ka Amrit Mahotsav 2022: వెండితెరపై వందేమాతరం
సినీ ప్రేక్షకులకు ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ వేడుకలు మరో ఏడాది పాటు కొనసాగనున్నాయి. ఎలాగంటే రానున్న రోజుల్లో పలు దేశభక్తి చిత్రాలు వెండితెరపై సందడి చేయనున్నాయి. ఓవైపు సినిమాలు.. మరోవైపు ఓటీటీ ప్లాట్‌ఫామ్స్ వేదికగా దేశభక్తి ఉప్పొంగనుంది. పలువురు స్వాతంత్య్రోద్యమ వీరుల చరిత్రలు, కాల్పనిక కథలతో దేశభక్తి చిత్రాలు రూపొందుతున్నాయి. వెండితెరపై వందేమాతరం అంటూ రానున్న ఆ ప్రాజెక్ట్స్ విశేషాలు తెలుసుకుందాం. బయోపిక్‌ల వెల్లువ స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న పలువురు స్వాతంత్య్ర సమర యోధుల జీవితాల ఆధారంగా పలు చిత్రాలు నిర్మాణంలో ఉన్నాయి. భారత స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొన్న అతి పిన్న వయస్కుడైన ఖుదీరామ్ బోస్ జీవితం వెండితెరపైకి రానుంది. ‘ఖుదీరామ్ బోస్’ టైటిల్‌తో జాగర్లమూడి పార్వతి సమర్పణలో విజయ్ జాగర్లమూడి నిర్మించారు. ఖుదీరామ్ పాత్రను రాకేష్ జాగర్లమూడి పోషించారు. ఇతర పాత్రల్లో వివేక్ ఒబెరాయ్, అతుల్ కులకర్ణి, నాజర్, రవిబాబు, కాశీ విశ్వనాథ్ కనిపిస్తారు. విద్యాసాగర్ రాజు దర్శకత్వంలో తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ, బెంగాలీ, హిందీ భాషల్లో పాన్ ఇండియా సినిమాగా రూపొందిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. ఆదివారం ఈ చిత్రం మోషన్ పోస్టర్‌ను, ఫస్ట్ లుక్‌ను ప్రముఖ దర్శకుడు మణిరత్నం విడుదల చేశారు. అటు హిందీలో స్వాతంత్య్ర సమర యోధుడు వినాయక దామోదర వీర్ సావర్కర్ జీవితం ఆధారంగా ‘స్వతంత్య్ర్ వీర్ సావర్కర్’ టైటిల్‌తో సినిమా రూపొందుతోంది. వీర్ సావర్కర్ పాత్రను రణ్‌దీప్ హుడా చేస్తున్నారు. నటుడు మహేశ్ మంజ్రేకర్ దర్శకత్వం వహిస్తున్నారు. అలాగే 1971లో భారత్–పాక్ యుద్ధంలో పోరాడిన ఆర్మీ చీఫ్ సామ్ మానెక్ షా జీవితం ఆధారంగా సినిమా రానుంది. ‘సామ్ బహదూర్’ టైటిల్‌తో విక్కీ కౌశల్ టైటిల్ రోల్లో మేఘనా గుల్జార్ దర్శకత్వం వహిస్తున్నారు. 1971 భారత్ – పాక్ యుద్ధంలో పోరాడిన మరో వీర జవాను బ్రిగేడియర్ బల్‌రామ్‌సింగ్ మెహతా జీవిత కథతో రూపొందుతున్న చిత్రం ‘పిప్పా’. బల్రామ్ సింగ్ మెహతా పాత్రను ఇషాన్ కట్టర్ చేస్తున్నారు. బల్రామ్ సింగ్ మెహతా స్వయంగా రాసిన ‘ది బర్నింగ్ చఫీస్’ పుస్తకం ఆధారంగా రాజా కృష్ణమీనన్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. డిసెంబర్ 9న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలను కుంటున్నారు. 1971 యుద్ధంలోనే వీర మరణం పొందిన యువ సైనికుడు అరుణ్ ఖేతర్పాల్ జీవితంతో రూపొందుతున్న చిత్రం ‘ఇక్కీస్’. ఖేతర్పాల్ పాత్రను వరుణ్ ధావన్ పోషిస్తుండగా శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వం వహిస్తున్నారు. వచ్చే ఏడాది ఈ చిత్రం రిలీజ్ కానుంది. జీవిత కథలు కాదు కానీ.. ఒకవైపు జీవితకథలతో సినిమాలు రూపొందుతుంటే మరోవైపు కాల్పనిక దేశభక్తి చిత్రాలు కూడా రానున్నాయి. వీటిలో ‘భారతీయుడు 2’ ఒకటి. దేశం కోసం ప్రాణాలర్పించడానికి సైతం వెనకాడని స్వాతంత్య్ర సమరయోధుడు సేనాధిపతి దేశానికి పట్టిన చీడపురుగులాంటి కన్న కొడుకుని మట్టుబెట్టే కథతో రూపొందిన చిత్రం ‘ఇండియన్’ (భారతీయుడు). కమల్‌హాసన్ హీరోగా శంకర్ దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రా నికి సీక్వెల్‌గా ‘భారతీయుడు 2’ రానుంది. కమల్‌హాసన్–శంకర్ కాంబినేషన్లోనే సీక్వెల్ రూపొందు తోంది. అటు హిందీలో కార్తీక్ ఆర్యన్ నటిస్తున్న ‘కెప్టెన్ ఇండియా’ యుద్ధం నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం. అయితే ఇది జీవిత కథ కాదు. దేశ చరిత్రలో ఓ కీలక రెస్క్యూ ఆపరేషన్ ఆధారంగా దర్శకుడు హన్సల్ మెహతా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. ఇందులో కార్తీక్ పైలెట్ పాత్ర చేస్తున్నారు. ఫీమేల్ ఓరియంటెడ్ చిత్రాల్లో దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న చిత్రం ‘తేజస్’. కంగనా రనౌత్ లీడ్ రోల్లో సర్వేశ్ మేవారి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. ఇందులో కంగన ఎయిర్ ఫోర్స్ ఫైటర్ పైలెట్‌గా నటిస్తున్నారు. ‘ఆకాశాన్ని ఏలాలనుకున్న ఓ మహిళ స్ఫూర్తిదాయకమైన కథ ఇది’ అన్నారు కంగనా రనౌత్. అక్టోబర్ 5న ఈ చిత్రం విడుదల కానుంది. ఓటీటీకి గాంధీ బయోపిక్ జాతి పిత మహాత్మా గాంధీ జీవితంతో వెండితెరపై పలు చిత్రాలు వచ్చాయి. ఇప్పుడు వెబ్ సిరీస్‌గా గాంధీ జీవితం రానుంది. గాంధీ దక్షణాఫ్రికాలో గడిపిన రోజులను, భారత స్వాతంత్య్రం కోసం చేసిన పోరాటాన్ని, గాంధీ జీవితంలో తెలియని కోణాలతో పలు సీజన్లుగా ఈ వెబ్ సిరీస్‌ని రూపొందించనున్నారు. ఈ సిరీస్‌లో గాంధీ పాత్రను ప్రతీక్ గాంధీ పోషించనున్నారు. ప్రముఖ చరిత్రకారుడు, రచయిత రామచంద్ర గుహ రచించిన ‘గాంధీ బిఫోర్ ఇండియా’, ‘గాంధీ: ద ఇయర్స్ దట్ ఛేంజ్డ్ ద వరల్డ్’ పుస్తకాల ఆధారంగా దర్శకుడు హన్సల్ మెహతా ఈ సిరీస్‌ను తెరకెక్కించనున్నారు. ఇంకా పలు దేశభక్తి చిత్రాలు, వెబ్ సిరీస్‌లు రానున్నాయి. -
పంద్రాగస్టుకు పైసల్లేవ్!.. చాక్‌పీస్, డస్టర్‌కు ఇబ్బందులే
సాక్షి, కరీంనగర్: పాఠశాలల నిర్వహణకు విడుదల చేసిన నిధులన్నీ ప్రభుత్వం తిరిగి వెనక్కి తీసుకోవడంతో స్కూల్ గ్రాంటు ఖాతాలు ఖాళీగా మిగిలాయి. ‘మన ఊరు–మన బడి’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలన్నింటికి మౌలిక వసతుల కల్పనకు పెద్దఎత్తున నిధులు వెచ్చించి అభివృద్ధి చేస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ మాట దేవుడెరుగు కానీ గత విద్యా సంవత్సరానికి సంబంధించి పాఠశాల నిర్వహణకు విడుదలైన నిధులను తిరిగి ఏప్రిల్‌లో ప్రభుత్వ ఖాతాలోకి మళ్లించడంతో పాఠశాలల బ్యాంక్ అకౌంట్ ఖాతాలన్ని ఖాళీ అయ్యాయి. జిల్లాలో కొందరు పాఠశాల గ్రాంటును వినియోగించుకోగా, మిగిలిన నిధులు ప్రస్తుత విద్యా సంవత్సరంలో ఉపయోగించుకుందామని అనుకున్నారు. వెనక్కి తీసుకోవడంతో చాక్‌పీస్‌లు, డస్టర్ కొనుగోళ్లకు ఇబ్బందులు పడుతున్నారు. సొంత డబ్బులు ఖర్చు చేస్తూ అవసరాలను తీర్చుకుంటున్నారు. స్కూల్ గ్రాంటు ఖర్చు ఇలా జిల్లాలో వివిధ విభాగాల్లో గల 652 పాఠశాలల్లో 42,218 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. పాఠశాల గ్రాంటుతో ప్రధానోపాధ్యాయులు చాక్‌పీసులు, డస్టర్లు, విద్యార్థుల హాజరు పుస్తకాలు, ఇతరత్రా సామగ్రి కొనుగోలు చేస్తారు. గణతంత్ర దినం, రాష్ట్ర అవతరణ దినం, స్వాతంత్య్ర దినోత్సవం తదితర జాతీయ దినోత్సవాల్లో పాఠశాలల్లో కార్యక్రమాల నిర్వహణ, సున్నం వేయడం చిన్న మరమ్మతులను ఈ నిధులతో చేసుకోవచ్చు. ఒక్కో పాఠశాలలకు ఆయా పాఠశాలలోని విద్యార్థుల సంఖ్యను బట్టి రూ.10 వేల నుంచి రూ.లక్ష వరకు గ్రాంటు విడుదల చేస్తారు. ఈ నిధులను అవసరాల మేరకు ఖర్చు చేస్తారు. ప్రభుత్వం అకస్మాత్తుగా పాఠశాలల ఖాతాల్లోని నిధులను వాపసు తీసుకోవడంతో చిన్న అవసరాలకూ తమ జేబు నుంచి ఖర్చు పెట్టాల్సి వస్తోందని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. విద్యార్థుల సంఖ్య ఆధారంగా ప్రభుత్వ, జెడ్పీ, గిరిజన సంక్షేమ ప్రాథమిక, క్రీడా పాఠశాలలు, అంధ, మూగ, చెవిటి పాఠశాలలకు ఆయా పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్యను ఆధారంగా గ్రాంటు విడుదల చేస్తుంది.1–15 మంది విద్యార్థులు ఉంటే రూ.12,500, 16–100 మంది విద్యార్థులకు రూ.25,500, 101 నుంచి 250 మంది విద్యార్థులకు రూ.50 వేలు, 251–1000 మంది విద్యార్థులు ఉంటే రూ.75 వేలు, 1000కిపైగా విద్యార్థులు ఉంటే రూ.లక్ష చొప్పున నిధులను ప్రభుత్వం విడుదల చేస్తుంది. చదవండి: క్రికెట్ ఆడుతూ గుండెపోటుతో సాఫ్ట్వేర్ ఇంజనీర్ మృతి విచారకరం పాఠశాలల నిర్వహణకు వచ్చిన నిధులను ప్రభుత్వం తిరిగి తీసుకోవడం విచారకరం. తక్షణమే స్కూల్ గ్రాంట్ నిధులను విడుదల చేయాలి. చిన్నపాటి అవసరాలకు పాఠశాలల్లో నిధులు లేకపోవడంతో ప్రధానోపాధ్యాయులు, టీచర్లు సతమతమవుతున్నారు. 75 సంవత్సరాల వజ్రోత్సవ వేడుకలను పాఠశాలల్లో నిర్వహించుకునేందుకు నిధులు లేకపోవడంతో ఇబ్బందిగా ఉంది. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే నిధులు మంజూరు చేయాలి. – పోరెడ్డి దామోదర్‌రెడ్డి, టీపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ప్రధానోపాధ్యాయులదే బాధ్యత... ఆర్థిక సంవత్సరం పూర్తి కావడంతో పాఠశాలకు సంబంధించిన నిధులు ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. త్వరలోనే ప్రభుత్వం సంబంధిత పాఠశాలల ఖాతాలకు విద్యార్థుల సంఖ్య ఆధారంగా నిధులు జమ చేస్తుంది. అప్పటివరకు ప్రధానోపాధ్యాయులే పాఠశాల నిర్వహణకు సంబంధించి నిధులు ఖర్చు చేయాలి. నిధులు రాగానే ప్రధానోపాధ్యాయులకు చెల్లించడం జరుగుతుంది. – సీహెచ్ జనార్దన్‌రావు, జిల్లా విద్యాశాఖాధికారి, కరీంనగర్ -
ఉత్సవాలు సరే, స్ఫూర్తి ఏది?
స్వార్థపరుల గొంతెమ్మ కోర్కెల వల్లే సంపద అందరికీ సమంగా అందుబాటులోకి రావడం లేదన్నారు గాంధీ. ధనిక, పేద వర్గాలుగా విడిపోయిన సామాజిక పరిస్థితుల నిర్మూలనే దేశంలో రావాల్సిన సాంఘిక విప్లవానికి ప్రధాన లక్ష్యంగా ఉండాలన్నారు లోహియా. కేంద్రంలో అధికారం చలాయించిన ఏలికలూ, రకరకాల రంగుల ఐక్య సంఘటన ప్రభుత్వాలూ కూడా ఇలాంటి మహనీయుల మాటలను పెడచెవిన పెట్టాయి. కాలక్రమంలో జీవితంలోని విలువలన్నీ తారుమారైపోయాయి. మార్పును ప్రతిఘటించేవే గొప్ప శక్తులుగా చలామణీ అవుతున్నాయి. స్వాతంత్య్ర అమృతోత్సవాలు నిర్వహించుకుంటున్న ఈ శుభముహూర్తాన అయినా మహనీయుల మాటల్ని మననం చేసుకుందాం. మనల్ని మనం మార్చుకుందాం. ‘‘ఈ దేశ ప్రజలందరినీ సుఖశాంతులతో ఉంచగల సర్వ సంపదలూ ఈ మన దేశంలోనే ఉన్నాయి. కానీ అవి అందరికీ సమస్థాయిలో అందు బాటులోకి రాకపోవడానికి అసలు కారణం– ఈ సంపదంతా తమ హక్కు భుక్తం కావాలన్న కొద్దిమంది స్వార్థపరుల అవధులు లేని గొంతెమ్మ కోర్కెలే.’’ – మహాత్మా గాంధీ భారత స్వాతంత్య్రానికి 75 సంవత్సరాలు నిండి, ఈ ఏడాది అమృతోత్సవాలు నిర్వహించుకుంటున్న శుభముహూర్తాన, భావి తరాల జాగ్రత్త కోసం గాంధీజీ గుర్తు చేసిన ఈ హెచ్చరికలోని ఔన్నత్యాన్ని ప్రతిఒక్కరూ గుర్తించాలి. దేశ పగ్గాలు చేబట్టిన కాంగ్రెస్, బీజేపీ పార్టీల ఆధ్వర్యంలోని ఏలికలూ, రకరకాల రంగుల ఐక్య సంఘటన ప్రభుత్వాలూ కూడా కాలం గడిచిన కొద్దీ గాంధీజీ హెచ్చరికలను ఆచరణలో పెడచెవిన పెట్టినవే. ప్రజాబాహుళ్యాన్ని మోసగించినవే. ఈ పరిణామాల్ని నిశిత దృష్టితో ఎప్పటికప్పుడు పరిశీలిçస్తూ వచ్చిన నిస్వార్థపరుడైన సోషలిస్టు నాయకుడు రామ మనోహర్ లోహియా తన నిశితమైన అంచనాను ఏనాడో అందించారు: ‘‘జీవితంలోని విలువలన్నీ తారుమారైపోయాయి. ఎలా? ఉన్నత కులాల వారు సంస్కారం ఉన్న కుతంత్రపరులుగానూ, బడుగు కులాల వారేమో మార్పు ఎరుగని జీవచ్ఛవాలుగానూ తయార య్యారు. దేశంలోని మేధావుల్ని గుర్తించడం కోసం కొలబద్దగా వారి విజ్ఞాన సంపదను గణించడానికి బదులుగా వారి మాటల్లోని సొంపులు, సొగసులు మాత్రమే తీసుకోవడం జరుగుతోంది. నిర్మొహమాటం, నిర్భయత్వం అనే సుగుణాల కన్నా చాకచక్యం, కుహనా విధేయత, చాటుమాటు వ్యవహారాలు అనేవి ఔన్నత్యానికి చిహ్నాలుగా మారాయి. రాజకీయ జీవితంలో బొంకులకు గొప్ప గౌరవ స్థానం లభించింది. సంకుచిత తత్వం, స్వార్థపరత, బొంకు– ఈ దారుణాలు గొప్పవిగానూ... కుల వ్యవస్థ మార్పును ప్రతిఘటించే గొప్ప శక్తులుగానూ తయారయ్యాయి. ఒక్కమాటలో చెప్పాలంటే, భారత పౌరుల్ని స్వదేశంలోనే పరాయివారుగా చూస్తున్నారు.’’ అంతేగాదు, ఈ దేశంలో నిజమైన సాంఘిక విప్లవానికి, ధనిక పేద వర్గాలుగా విడిపోయిన సామాజిక పరిస్థితుల నిర్మూలనే ప్రధాన లక్ష్యంగా ఉండాలన్నారు లోహియా. అందుకోసం భారత సమాజంలో ఆదాయాల రూపంలో గానీ, సామాజిక గౌరవ ప్రపత్తుల రూపంలో గానీ పీడిస్తున్న అసమానతలు 10 లక్షల రకాలుగా ఆయన అంచనా వేశారు. ఇంతటి వ్యత్యాసాల మధ్య, ఇంతటి అసమానతల మధ్య జీవిస్తున్న సామాన్య భారతీయులైన అట్టడుగు నిరుపేదల మానసిక స్థితి ఎలా ఉంటుందో కూడా లోహియా అంచనా ఇచ్చారు. ఎవరికి వారు తనకన్నా హీన స్థితిలో ఉన్న వాడినిచూసి, తాను మెరుగ్గా ఉన్నానన్న ఆత్మ సంతృప్తితో నేడు పేదవాళ్లు బతుకులీడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ దేశంలోని పేదవాళ్లు ఏ విప్లవాలనూ అర్థం చేసుకునే స్థితిలో లేరని వ్యాఖ్యానించారు. అంతేకాదు, రాజకీయవేత్తలంటే ‘చొల్లు కబుర్లుగాళ్ల’న్న అభిప్రాయం కూడా వారిలో ఏర్పడిందని లోహియా భావించారు. భారత రాజ్యాంగ నిర్మాతలలో అగ్రేసరుడైన దళిత నాయకుడు డాక్టర్ అంబేడ్కర్... ‘గొప్ప వ్యక్తీ, గాంధీ తర్వాత ఏ గొప్ప అగ్రవర్ణ హిందువుతోనైనా తూగగల్గిన గొప్ప నాయకుడూ’ అని లోహియాను కీర్తించారు. సర్వమత సమ్మేళనానికి ఉద్దేశించిన చికాగో (అమెరికా) ప్రపంచ మహాసభ ద్వారా ప్రపంచాన్ని మత్తిల్ల చేసిన వివేకానందుడు– మరోసారి బుద్ధుడు ఈ దేశంలోకి అడుగుపెడితే తప్ప భారత ప్రజా బాహుళ్యానికి ముక్తి ఉండబోదన్నారు! తీరా ఇప్పుడు దేశంలో జరుగుతున్న పరిణామాలు కలవర పరుస్తున్నాయి. అధికారంలో ఉన్న బీజేపీ– ఆర్ఎస్ఎస్ పాలకవర్గం ఇతర ప్రతిపక్షాల నాయకుల బెడదను వదిలించుకోవడం కోసం వారిని క్రిమినల్ కేసుల ద్వారా వేధించుతోంది. సరిగ్గా ఈ సమయంలోనే, దేశంలో రాజ్యాంగ ఫెడరల్ స్వభావాల్ని తారుమారు చేసే యత్నంలో ఉన్న బీజేపీ– ఆర్ఎస్ఎస్ పాలకులు, ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నందుకు ప్రతిపక్ష ప్రభుత్వాలు విమర్శించడం దేశ ప్రయోజనాల దృష్ట్యా సబబే. బీజేపీ పాలకులు చేస్తున్నదాన్ని ఎవరో కాదు, స్వయాన బీజేపీ పార్లమెంట్ సభ్యుడైన వరుణ్ గాంధీయే విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రజా బాహుళ్యం నడ్డివిరుస్తూ తలపెడుతున్న జీఎస్టీ బాదుడు వల్ల ఒక్క గ్యాస్ సిలిండర్ రీఫిల్ సౌకర్యాన్ని గత ఐదేళ్లలో 4.13 కోట్ల మంది ప్రజలు కోల్పోయారని వెల్లడించారు. కాగా 7.67 కోట్లమందికి కేవలం ఒకే ఒక్క ఎల్పీజీ రీఫిల్ అవకాశం దక్కింది. భారతదేశ అవినీతిమయ బడాబాబులకు సంబంధించిన స్విస్ బ్యాంకుల్లోని దొంగ ఖాతాలను వెలికితీసి, అందులో మూలుగుతున్న సంపదను తెస్తామనీ, దేశంలోని ఒక్కో పేద కుటుంబానికి 15 లక్షల రూపాయల చొప్పున జమ చేస్తామనీ చెప్పిన ప్రధాని నరేంద్ర మోదీ హామీ కాస్తా ఆచరణలో ‘‘నీటిమూట’’గా మారింది. ఈ దారుణ పరిణామాలు, అబద్ధాల చిట్టా గీత ఈ పదేళ్ళలో భారత ప్రజలకు పూర్తిగా అర్థమయ్యాయి. దేశ స్వాతంత్య్ర సాధన కోసం అనేక త్యాగాలు చేసి ‘‘మాకు మేముగా ఈ రాజ్యాంగాన్ని రచించుకుని, మా భావి భాగ్యోదయం కోసం మాకు అంకితం ఇచ్చుకుంటున్నాం’’ అని స్వయంగా ప్రకటించుకున్న ప్రజాబాహుళ్యానికి పాలకులు తలపెట్టిన క్షమించరాని అన్యాయం ఇది. భారత స్వాతంత్య్రానికి 75 సంవత్సరాలు నిండి అమృతోత్సవాలు జరుపుకొంటున్న ఈ తరుణంలో మహాత్మాగాంధీ లాంటివారి త్యాగాలు స్మరణకు రావడం సహజం. కానీ అదే గాంధీజీని పొట్టన పెట్టుకున్న గాడ్సేను దయ్యంగా కాకుండా దేవుడిగా కొలవమని పోస్టర్ల ద్వారా ప్రచారం చేయడాన్ని అనుమతించిన పాలకులను ప్రజలు క్షమించగలరా? కనుకనే సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఏ రాజకీయ పార్టీ అయినా ‘కాలుగాలిన పిల్లి’లా మౌనంగా ఉంటోందే గానీ, ‘గజ్జె కట్టడానికి’ ముందుకు రావడం లేదని విమర్శించాల్సి వచ్చింది. ‘హిందుత్వ’వాదులు ఇతర మత మైనార్టీలపై స్వేచ్ఛగా జరుపుతున్న దాడులను పాలకులు అదుపు చేయడంలేదు సరికదా... 2002 నాటి గుజరాత్ మైనారిటీలపై నాటి ప్రభుత్వం జరిపిన ఊచకోతలను ఖండిస్తూ పాలక బాధ్యులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలన్న సుప్రీంకోర్టు ఆదేశాలను కొట్టివేయించుకున్న ఘటన కూడా తాజా చరిత్రకు ఎక్కడం మరో విశేషం. ఈ అమృతోత్సవాల సందర్భంగానైనా మరెవరి మాటలనో కాదు, కనీసం కేంద్ర న్యాయశాఖామంత్రి కిరణ్ రిజిజూ అన్న మాటలనైనా పాలకులు పట్టించుకోవాలి. ‘‘దేశంలో కోర్టులున్నది సంపన్న వర్గాల కోసమే కాదు. న్యాయస్థాన ద్వారాలు అందరికీ సమంగా తెరచి ఉండాలి. ఒక్కొక్క సమావేశంలో పాల్గొనడానికి కక్షిదారుల వద్ద లాయర్లు 10–15 లక్షల రూపాయలు వసూలు చేస్తుంటే సామాన్య మానవుడికి న్యాయం దక్కేదెలా?’’ అని ఆయన అన్నారు. 75 సంవత్సరాల స్వాతంత్య్ర అమృతోత్సవాల ఫలితం ఆచరణలో అందరికీ దక్కాలంటే విధానాలు మారవలసిందేనన్న రిజిజూ మాట అయినా ప్రధాని మోదీ గౌరవిస్తారా? ఏబీకే ప్రసాద్ సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
ఏపీలో పంద్రాగస్టు వేడుకలకు సర్వం సిద్ధం
విజయవాడ: ఏపీలోని విజయవాడ మున్సిపల్ స్టేడియంలో పంద్రాగస్టు వేడుకలకు సర్వం సిద్ధం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం ఉదయం జరిగే స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు హాజరై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్నారు. సాయుధ దళాల నుంచి సీఎం జగన్ గౌరవ వందనం స్వీకరించనున్నారు. అనంతరం సీఎం జగన్ రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించనున్నారు. కాగా కరోనా దృష్ట్యా పరిమిత సంఖ్యలోనే అతిథులకు ఆహ్వానం పంపించారు. పాస్‌లు ఉన్నవారికే వేడుకలకు అనుమతించనున్నారు. -
తెలంగాణ ఉద్యమానికి గాంధే స్ఫూర్తి: సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: ‘ఇరవై ఏళ్ల కిందట తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు మహాత్ముడి అహింసాపూరిత స్వాతంత్య్ర ఉద్యమ పంథానే స్ఫూర్తిగా నిలిచింది’ అని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. మహాత్మాగాంధీ అహింసనే ఆయుధంగా చేసుకుని ఉద్యమాన్ని ప్రారంభిం చినప్పుడు ఆయన అనుచరుల్లోని కొందరు ఉద్రేకపరులు నిరాశ చెందారని, అదే తరహాలో తెలంగాణ ఉద్యమం తీరుపై కూడా కొందరు సంశయాలు వ్యక్తం చేశారని పేర్కొన్నారు. చివరకు దేశ స్వాతంత్య్ర ఉద్యమం గొప్ప విజయాన్ని సాధించి ఇప్పుడు మనం స్వేచ్ఛా వాయువులు పీల్చుకునేందుకు కారణమైందని, అదే తరహాలో తెలంగాణ ఉద్యమం కూడా గొప్ప విజయం సాధించిందన్నారు. భారత జాతికి స్వేచ్ఛను ప్రసాదించిన స్వాతత్య్ర ఉద్యమ స్ఫూర్తిని మరవకుండా మరో సారి మననం చేసుకునే గొప్ప అవకాశంగా వచ్చిన ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో ప్రతి ఒక్కరూ పాల్గొనాలని సీఎం కేసీఆర్ పిలుపునిచ్చారు. ఇప్పుడు ప్రారంభమైన ఈ ఉత్సవాలు 75 వారాలపాటు సాగుతున్నందున రాజకీయాలు, పార్టీలకతీతంగా అందరూ పాల్గొని ప్రపంచానికే ఉద్యమ పంథాను నేర్పిన మన స్వాతంత్య్రోద్యమ ఔన్నత్యాన్ని మరో సారి గుర్తుచేసుకుని ముందుకు సాగాలని సూచించారు. దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్న ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’ను సీఎం కేసీఆర్ శుక్రవారం హైదరాబాద్‌లోని పబ్లిక్ గార్డెన్స్‌లో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి ప్రారంభించారు. ఆజాదీ కా అమృతోత్సవ్ వేడుకల నిర్వహణ కమిటీ అధ్యక్షుడు కేవీ రమణాచారి ప్రారంభోపన్యాసం చేశారు. ఒగ్గుడోలు, కొమ్ముబూర కళాకారులు చివరలో సందడి చేశారు. సమావేశంలో సభాపతి పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మంత్రులు, సీఎస్ సోమేశ్ కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి, పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు. గాంధీకి ముందు.. ఆ తరవాత.. ఈ కార్యక్రమంలో సీఎం కేసీఆర్ మాట్లాడుతూ ‘‘మన స్వాతంత్య్ర ఉద్యమాన్ని గాంధీకి ముందు.. గాంధీ తర్వాత అని పేర్కొనచ్చు. మహాత్ముడు ఉద్యమంలో కాలుమోపక ముందే ఎంతో మంది పోరాట పంథాను ఎంచుకున్నారు. కానీ గాంధీ వచ్చి ఉద్యమానికి నేతృత్వం వహించిన తర్వాత రగిలిన స్ఫూర్తే వేరు. ఆయన ఆధ్వర్యంలో అద్భుత ఘట్టాలు ఆవిష్కృతమయ్యాయి. ఆహింసే ఆయు« దంగా సాగిన ఆ ఉద్యమంపై ప్రారంభంలో కొంత మందిలో సందేహాలు వెల్లువెత్తాయి. ఆయన అనుచరుల్లోని ఉద్రేకపరులు కూడా సందేహపడ్డారు. కానీ వారి అనుమానాలను పటాపంచలు చేస్తూ అద్భుత ఫలితాన్ని ఆయన పంథా అందుకుంది. చివరకు ప్రపంచానికే ఆయన ఉద్యమ స్ఫూర్తి ఆదర్శవంతమైంది. అమెరికాలో మానవ హక్కుల కోసం పోరాడిన మార్టిన్ లూదర్ కింగ్‌కు కూడా ఆయన ఆదర్శంగా నిలిచారు’’అని కొనియాడారు. ఉత్సవాలకు రూ. 25 కోట్లు.. ఇప్పుడు మొదలైన ఈ వేడుకలు వచ్చే ఆగస్టు 15 నుంచి తదుపరి పంద్రాగస్టు వరకు కొనసాగుతాయి. అధికారులు, మంత్రులు, ప్రజాప్రతినిధు లు, ఇతర నేతలు, ప్రజలు పార్టీలు రాజకీయాలకతీతంగా వీటిల్లో పాల్గొనాలి. ప్రభుత్వ సలహాదారు రమణాచారి ఆధ్వర్యంలో నిర్వహణ కమిటీని ఏర్పాటు చేశాం. ఉత్సవాలకు రూ. 25 కోట్లు మం జూరు చేశాం. దేశవ్యాప్తంగా ఘనంగా నిర్వహించా లని కేంద్రం నిర్ణయించింది. అదే రీతిలో రాష్ట్రంలో నిర్వహిస్తాం. నేను కూడా పలు చోట్ల కార్యక్రమాల్లో పాల్గొంటా. జాతి స్వేచ్ఛను ప్రసాదించిన ఉద్యమ స్ఫూర్తిని మరువకుండా ఇది పునఃశ్ఛరణగా ఉపయోగపడుతుంది’’ అని సీఎం పేర్కొన్నారు. మీరు చప్పట్లు కొట్టాలి.. దేశంలో బ్రిటిష్ పాలన అంతానికి ఉప్పు సత్యాగ్రహం ఓ సంకేతమని గాంధీజీ పేర్కొనడాన్ని సీఎం కేసీఆర్ వివరించే సందర్భంలో సభికులు మౌనంగా ఉండటంతో.. అది చప్పట్లు కొట్టాల్సిన సందర్భమని సీఎం గుర్తు చేశారు. దీంతో ప్రేక్షకులు ఒక్కసారిగా హర్షధ్వానాలు చేశారు.