ఆగస్టు 15 భారతదేశం తెల్లవాళ్ల పాలన నుంచి విముక్తి పొంది స్వేచ్ఛ వాయువులు పీల్చుకున్న చారిత్రక ఘట్టాన్ని స్మరించుకునే రోజు ఇది. 1947లో బ్రిటీష్ వలస పాలన నుంచి భారతదేశం విముక్తి పొందిన తర్వాత నుంచే ఈ దినోత్సవాన్ని ప్రతి ఏటా ఘనంగా జరుపుకుంటున్నాం. ఈ దినోత్సవం సందర్భంగా స్వాతంత్య్ర సంపాదించిపెట్టిన ఎందరో త్యాగధనులు, సమర యోధుల అలుపెరగని పోరాటాలను స్ఫురణకు తెచ్చకుని వారికి నివాళులర్పిస్తూ పండుగలా చేసుకుంటాం. అయితే అందరిలోనూ ఎదురయ్యే సందేహం ఇప్పుడూ మనం ఎన్నో స్వాతంత్య్ర దినోత్సవం జరుపుకుంటున్నాం? అని. ఇది 76వ? లేక 77వ దినోత్సవమా! అని మదిలో ఒకటే డౌట్. అందరూ చెప్పేది మాత్రం మనం 77వ స్వాతంత్య్ర దినోత్సవం అని కరాఖండీగా చెబుతున్నారు. అసలు ఈ సందేహం ఎందుకు వస్తోంది అంటే..
నిజానికి మనం బ్రిటీష్ పాలన నుంచి మన దేశం స్వాతంత్య్రం పొందిన తర్వాత తొలిసారిగా 1948 ఆగస్టు 15న ఈ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకుంది. ఆ లెక్కన గణిస్తే ఇది 76వ స్వాతంత్య్ర దినోత్సవంగా పరిగణించాల్సి ఉంటుంది. ఇక 77వ స్వాతంత్య్ర దినోత్సవం అని చాలా మంది కాన్ఫిడెంట్‌గా అనడానికి గల కారణం ఏంటంటే..భారతదేశం ఆగస్టు 15, 1947న స్వాతంత్య్రం లభించిందినే ఆధారంగా లెక్కిస్తే 2023 అనేది 77వ స్వాతంత్య్ర దినోత్సవం అవుతుంది. అయితే ఎక్కువగా 77వ స్వాతంత్య్ర దినోత్సవాన్నే పరిగణనలోకి తీసుకుంటున్నారు. అంతేకాదు దాదాపు 200 సంవత్సారాల బ్రిటిష్ పాలన తర్వాత భారతదేశం స్వాతంత్య్రం పొందింది.
ఈ దినోత్సవం థీమ్:
"నేషన్ ఫస్ట్, ఆల్వేస్ ఫస్ట్" ఈ థీమ్ ముఖ్యోద్దేశం "కష్ట సమయాల్లో కూడా దేశ ప్రయోజనాలకే తొలి స్థానం" ఇవ్వాలనే ప్రాముఖ్యతను గుర్తు చేస్తుందని ప్రభుత్వం పేర్కొంది.
ఇక దినోత్సవాన్ని ఊరు, వాడతో సంబంధం లేకుండా అంతా ఒక్కటిగా ఆనందంగా జరుపుకునే గొప్ప సంబరం. త్రివర్ణ పతాకం ఎగరువేయడంతో ప్రారంభమైన ఈ దినోత్సవం..దేశం సాధించిన విజయాలను పరంపర నుంచి సాధించాల్సిన నిరంతర ప్రగతి ఆవశక్యతను గూర్చి తెలియజేసే సుదినం. ఇది గతానికి సంబంధించిన వేడుక మాత్రమే కాదు..ఉజ్వల భవిష్యత్తు కోసం ఎదురుచూసే అవకాశం.
ఇది భారతదేశానికి ఆధారమైన భిన్నత్వంలోని ఏకత్వం ప్రాముఖ్యత తోపాటు ప్రజాస్వామ్య విలువలను గుర్తు చేస్తుంది. ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఎర్రకోట వద్ద ప్రధాని జెండా ఎగరువేసి.. జాతిని ఉద్దేశించి ప్రసంగిస్తారు. ఆ రోజంతా భారతదేశ గొప్ప సాంస్కృతికి వారసత్వం, వైవిధ్యాన్ని ప్రదర్శించేలా దేశవ్యాప్తంగా వివిధ కార్యక్రమాలు కవాతులు జరుగుతాయి. అంతేగాదు రాబోయే తరాలకు బలమైన, సమగ్రమైన, సంపన్నమైన దేశాన్ని నిర్మించాలనే నిబద్ధతను పునరుద్దరించేందుకు ఈ దినోత్సవం ఓ మంచిరోజు.
(చదవండి: స్త్రీ పోరాటాన్ని ఆవిష్కరించిన ఉద్యమం! బ్రిటిషర్లకే చుక్కలు చూపించారు!)
Comments
Please login to add a commentAdd a comment