Independence day celebrations 2023: స్వేచ్ఛాగీతం | Independence day celebrations 2023: Patriotic Celebration Pictures, and songs Photos viral in Internet | Sakshi
Sakshi News home page

Independence day celebrations 2023: స్వేచ్ఛాగీతం

Published Sun, Aug 13 2023 12:53 AM | Last Updated on Sun, Aug 13 2023 5:26 AM

Independence day celebrations 2023: Patriotic Celebration Pictures, and songs Photos viral in Internet - Sakshi

స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు అంతర్జాలంలో ఆరంభం అయ్యాయి. ఆనాటి దేశభక్తి గీతాల నుంచి బ్లాక్‌ అండ్‌ వైట్‌ ఫోటోల వరకు రకరకాల పోస్ట్‌లు పెడుతున్నారు...

వడుకుమురా! వడుకుమురా!
వడుకుమురా! వడుకుమురా!
వడి వడి స్వేచ్ఛా వాయువు పీల్చి

– రాట్నగీతము (గురజాడ రాఘవశర్మ)

వీరభారతి సందేశం
పరదేశీయులు తొలగండి
ఈ భారతదేశం మా దేశం
వినండి! వినండి! విశ్వప్రజలు వీరభారతి సందేశం
– వానమామలై వరదాచార్యులు    
చిత్రం: 1857 సిపాయి తిరుగుబాటు

ఉప్పోయమ్మ ఉప్పు
ముప్పది కోట్ల ప్రజల ముప్పు దీర్చే ఉప్పు
ఉప్పుగాదిది రత్నపు తిప్ప మన పాలిటికి
– ఉప్పుపాట (గరికపాటి మల్లావధాని)  
ఫోటో: దండి సత్యాగ్రహం: ఏప్రిల్‌6, 1930

చెప్పరా...లేకున్న ముప్పురా!
చెప్పరా! నీ కన్నులిటపై/ విప్పరా! ఆ ప్రభుత నింతట
త్రిప్పరా! లేకున్న–నీకగు ముప్పురా! మాయప్ప ఇప్పుడు
– పాంచాలము (గరిమెళ్ల)
ఫొటో: సహాయనిరాకరణ ఉద్యమ కాలంలో బాంబేలో బ్రిటిష్‌ వారి వస్తువులతో ఉన్న ఎడ్లబండి ముందుకు పోకుండా రోడ్డుకు అడ్డంగా పడుకున్న ఉద్యమకారుడు

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement