
భవ్య
ఖిల్లా ఘనపురం (వనపర్తి): స్వాతంత్య్ర దిన వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. కొద్ది సేపట్లో బహుమతి తీసుకోవాల్సిన ఓ బాలిక అకస్మాత్తుగా చనిపోయింది. బుధవారం వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం సోళీపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సోళీపురం గ్రామానికి చెందిన మచ్చని వెంకటయ్య–చెన్నమ్మ రెండో కుమార్తె భవ్య(13) గ్రామంలోని ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. ఇటీవల నిర్వహించిన క్రీడాపోటీల్లో ఆమె షాట్‌పుట్‌లో ప్రథమ స్థానంలో నిలవగా స్వాతంత్య్ర వేడుకల్లో బహుమతి అందుకోవాల్సి ఉంది. బహుమతికోసం ఆమె పేరు పిలవగానే స్టేజీ దగ్గరకు వెళ్లిన భవ్య ఒక్కసారిగా కుప్పకూలింది. పరీక్షించిన వైద్యులు భవ్య అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment