bhavya
-
Nail Rings Photos: ఇది నెయిల్ ఆర్ట్ కాదు.. నెయిల్ రింగ్స్ (ఫోటోలు)
-
క్లియోపాత్రా నుంచి ప్రేరణ పొందిన నెయిల్ రింగ్స్ ఇవి..
నెయిల్ ఆర్ట్ గురించి మనకు తెలిసిందే. ఎన్నో డిజైన్లు మన చూపు తిప్పుకోనివ్వవు. ఆర్టిఫిషియల్ నెయిల్స్ని అతికించి మరీ చూడచక్కని డిజైన్లతో చేసే ఆ అలంకారం వేలి కొసలలో మెరుపులుగా కనువిందు చేస్తుంది. ఇప్పుడు వాటి స్థానాన్ని నెయిల్ జువెలరీ ఆక్రమిస్తోంది. ఫింగర్ క్లారింగ్స్గా ఈ నెయిల్ జ్యువెలరీ ఆధునికమైన టచ్‌తో అందంగా రూపుకడుతుంది. ప్రాచీనకాలంలో రక్షణలో భాగంగా చేరిన ఈ ఆభరణం ఇప్పుడు సొగసైన అలంకార జాబితాలో చేరి ప్రత్యేకతను చాటుతోంది. బంగారు, వెండి, ఇతర లోహాలలోనూ ఈ నెయిల్ జ్యువెలరీ అందుబాటులో ఉంది. సంప్రదాయం, ఆధునికం ఏ వేడుకైనా కొత్తగా వెలిగిపోవాలని కోరుకునే వారికి ఈ నెయిల్ రింగ్స్ సరైన ఎంపిక అవుతాయి. లోహపు డిజైన్లలో ముత్యాలు, రత్నాలు, ఎనామిల్.. వంటివి జతచేసిన డిజైన్ల ఎంపిక మనదైన ప్రత్యేకతను చాటుతుంటుంది. లోహాన్ని బట్టి, డిజైన్‌ను బట్టి ధరలు వందల రూపాయల నుంచి అందుబాటులో ఉన్నాయి. చరిత్రలో నెయిల్ జువెలరీ.. ప్రాచీన చైనా, ఈజిప్ట్ రాజులు, రాణుల ఈ నెయిల్ క్లా జ్యువెలరీ విరివిగా ధరించేవారు. పొడవాటి గోర్లు సంపదకు చిహ్నంగా భావించేవారు. వాటి వల్ల శారీర శ్రమæ చేయవలసి అవసరం లేదు. అలా శ్రమ చేయాల్సిన అవసరం లేని వారు, స్థితిమంతులుగా జాబితాలో ఉండేవారు. అంతేకాదు, నెయిల్ గార్డ్‌గా పిలిచే ఈ ఆభరణాన్ని ధరించడం ప్రాచీన చైనీస్ మహిళలు శక్తికి, అందానికి చిహ్నంగా భావించేవారు. నెయిల్ క్లా లేదా గార్డుల తయారీలో సాధారణంగా లోహాలు లేదా సముద్ర తీరాల్లో లభించే ఆల్చిప్పల పెంకులను కూడా ఉపయోగించేవారు. అయితే, ఎక్కువగా బంగారం, వెండి, కాంస్య లేదా పోత పోసిన లోహంతో తయారు చేస్తారు. ముత్యాలు, విలువైన రాళ్లను వాటిలో పొదుగుతారు. వేలిగోళ్ల గార్డు ధరించిన వారి సామాజిక స్థితిని తెలియజేసేది. 3సెం.మీ నుండి దాదాపు 15 సెంటీ మీటర్ల వరకు ఉండేలా డిజైన్ చేయించేవారు. కొన్నిసార్లు చిటికెన వేలు, ఉంగరపు వేలికి సరిపోయేలా డిజైన్ చేయించుకునేవారు. కుడిచేతి, ఎడమ చేతి డిజైన్లు భిన్నంగా ఉండేవి. తమ దేశ సంప్రదాయ ఆభరణాలలో భాగంగా ఉన్నా, రక్షణ కోసం ఉపయోగించేవిగా పేరొందాయి. వారి వారి దేశాల్లోని నాణేలు, జంతువులు, పక్షులు, మొక్కల బొమ్మలను నెయిల్ గార్డ్స్‌పైన డిజైన్ చేయించేవారు. మహారాణి కళ.. జువెలరీ డిజైన్ సృష్టి, ఎంపిక అనేవి మన భావ వ్యక్తీకరణ పట్ల నుండి పుట్టుకు వచ్చిన ఆలోచన. నా డిజైన్స్ ఎక్కువగా బంజారా సంస్కృతికి అద్దం పడతాయి. ఎన్నో ఏళ్లుగా చూసిన వివిధ జాతుల సంస్కృతి, కళలు నా డిజైన్స్‌లో కనిపిస్తాయి. క్లియోపాత్రా నుంచి ప్రేరణ పొందిన నెయిల్ రింగ్స్ అలంకరణ మహారాణి కళను తీసుకువస్తుంది. – భవ్య రమేష్, జ్యువెలరీ డిజైనర్ -
ఇద్దరు టెన్త్ విద్యార్థినుల ఆత్మహత్య
సాక్షి, యాదాద్రి, భువనగిరి క్రైం: భువనగిరి పట్టణంలోని ఎస్సీ బాలికల వసతి గృహంలో ఇద్దరు విద్యార్థినులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. హైదరాబాద్‌లోని హబ్సిగూడకు చెందిన భవ్య (15), వైష్ణవి (15) భువనగిరిలోని ఎస్సీ బాలికల హాస్టల్లో ఉంటూ భువనగిరి పట్టణంలోని బీచ్ మహల్లా ప్రభుత్వ ఉన్నత బాలికల పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నారు. స్నేహితులైన వీరిద్దరూ తమను వేధింపులకు గురి చేశారంటూ అదే హాస్టల్లో ఉంటున్న 7వ తరగతి విద్యార్థినులు నలుగురు.. పాఠశాల పీఈటీకి ఫిర్యాదు చేశారు. ఆమె హాస్టల్ వార్డెన్ శైలజకు సమాచారం ఇచ్చారు. ఆమె భవ్య, వైష్ణవిలను మందలించడంతో పాటు హాస్టల్లో జూనియర్, సీనియర్ విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అంతేగాకుండా భవ్య, వైష్ణవిల తల్లిదండ్రులకు ఫోన్ ద్వారా సమాచారం చేరవేశారు. విషయం బయటకి తెలియడంతో భయాందోళనలకు గురయ్యారు. శనివారం సాయంత్రం వీరి గదిలో ఉండే ఇతర విద్యార్థినులు ట్యూషన్‌కి వెళ్లగా .. భవ్య, వైష్ణవి మాత్రం తర్వాత వస్తామని చెప్పి గదిలోనే ఉండిపోయారు. అయితే వారిని తీసుకురావాలని ట్యూషన్ టీచర్ తోటి విద్యార్థినులను గదికి పంపించారు. యూనిఫాం చున్నీలతో ఉరేసుకుని.. గదికి వెళ్లిన విద్యార్థినులు తలుపు తెరుచుకోకపోవడంతో కిటికీ నుంచి చూడగా భవ్య, వైష్ణవి ఫ్యాన్‌కు పాఠశాల యూనిఫాం చున్నీలతో ఉరి వేసుకుని కన్పించారు. వారు వెంటనే ట్యూషన్ టీచర్ విషయం చెప్పారు. వార్డెన్, ఇతర సిబ్బంది తలుపు బలవంతంగా తీసి ఇద్దర్నీ జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే వారు మరణించారని వైద్యులు నిర్ధారించారు. దీంతో మృతదేహాలను పోస్ట్‌మార్టం కోసం మార్చురీకి తరలించి, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు భువనగిరి పట్టణ సీఐ సురేష్ కుమార్ తెలిపారు. మమ్మల్ని ఒకే దగ్గర సమాధి చేయాలి టెన్త్ విద్యార్థినుల గదిలో దొరికిన సూసైడ్ నోట్‌ను తోటి విద్యార్థినులు పోలీసులకు అప్పగించారు. ‘మేము వెళ్లిపోతున్నందుకు అందరూ మమ్మల్ని క్షమించండి. మేము చేయని తప్పుకు అందరూ మమ్మల్ని అంటుంటే ఆ మాటలు పడలేక పోతున్నాం. మా శైలజ మేడం తప్ప ఎవ్వరూ మమ్మల్ని నమ్మలేదు. మా బాధ ఎవరికీ చెప్పుకోలేక వెళ్లిపోతున్నాం. మా ఇద్దరినీ ఒకేచోట సమాధి చేయండి. మా ఆఖరి కోరిక ఇది..’ అంటూ భవ్య, వైష్ణవి నోట్ రాశారు. భవ్య 3 వతరగతి నుంచి ఇదే వసతి గృహంలో ఉంటున్నట్లు తెలిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా నర్సంపేటకు చెందిన వీరి తల్లిదండ్రులు హైదరాబాద్‌లో నివసిస్తున్నారు. ఏడవ తరగతి విద్యార్థినులు ఇచ్చిన ఫిర్యాదు నేపథ్యంలో భవ్య, వైష్ణవికి కౌన్సెలింగ్ ఇచ్చినట్లు వార్డెన్ శైలజ తెలిపారు. కాగా ఈ ఘటనపై వసతి గృహంలోని విద్యార్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా సీనియర్, జూనియర్ విద్యార్థుల మధ్య గొడవలు జరిగాయని తెలుస్తోంది. -
పెళ్లయిన ఏడాదిన్నరకే వివాహిత ఆత్మహత్య
కర్ణాటక: అత్తింటి వేధింపులు తాళలేక వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన నెలమంగల తాలూకా తిరుమలెగౌడనపాళ్య గ్రామంలో చోటుచేసుకుంది. భవ్య (27) మృతురాలు. తిరుమలెగౌడనపాళ్య గ్రామానికి చెందిన కిరణ్‌తో ఏడాదిన్నర క్రితం రూ.30 లక్షల కట్నం ఇచ్చి ఎంతో వైభవంగా వివాహం జరిపించారు భవ్య తల్లితండ్రులు. సంతానం కలగలేదని, అదనపు కట్నం తీసుకురావాలని అత్తింట్లో వేధింపులు మొదలయ్యాయి. భవ్య పోలీసులకు ఫిర్యాదు చేయగా ఇరువర్గాలనూ పిలిచి రాజీ చేశారు. అయినా వేధింపులు ఆగకపోవడంతో భవ్య లక్కప్పనహళ్లి గ్రామంలోని పుట్టింటికి వచ్చేసింది. జీవితం ఇలా అయిపోయిందని విరక్తి చెంది శనివారం సాయంత్రం వాదకుంట గ్రామం వద్ద రైలుకింద తలపెట్టి ఆత్మహత్య చేసుకుంది. భవ్య తల్లితండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నెలమంగల రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు. ఆత్మహత్య మీ సమస్యలకు పరిష్కారం కాదు.. ఒక్క క్షణం ఆలోచించండి, రోషిణి కౌన్సెలింగ్ సెంటర్‌ను ఆశ్రయించి సాయం పొందండి. ఫోన్ నెంబర్లు: 040-66202000/040-66202001 మెయిల్: roshnihelp@gmail.com -
వీడియో: మెహ్రీన్‌కు భవ్య బిష్ణోయ్ షాక్.. ఐఏఎస్ ఆఫీసర్‌తో పెళ్లి!
-
మెహ్రీన్‌తో బ్రేకప్.. ఐఏఎస్ ఆఫీసర్‌తో భవ్య భిష్ణోయ్ ఎంగేజ్మెంట్
హీరోయిన్ మెహ్రీన్‌కు ఈమధ్య పెద్దగా కలిసిరావడం లేదనే చెప్పాలి. ఎఫ్-3 సక్సెస్ సాధించినా ఆ తర్వాత ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. రీసెంట్గా బరువు తగ్గి బాగా నాజుగ్గా తయారైంది ఈ భామ. గ్లామరస్ ఫోటోషూట్లతో నెట్టింట రచ్చ చేస్తున్నా చేతిలో సరైన అవకాశాలు లేవు. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ హర్యానా మాజీ సీఎం భజన్ లాల్ మనవడు భవ్య భిష్ణోయ్‌తో పెళ్లి రద్దు చేసుకున్న సంగతి తెలిసిందే. 2021 మార్చిలో మెహరీన్-భవ్య భిష్ణోయ్ నిశ్చితార్థం జైపూర్‌లో ఘనంగా జరిగింది. ఎంగేజ్మెంట్ అయిన కొద్దిరోజులేక ఇద్దరి మధ్య అభిప్రాయబేధాలు తలెత్తడంతో పెళ్లిని క్యాన్సిల్ చేసుకుంటున్నట్లు ప్రకటించారు. ఆ తర్వాత ఇద్దరూ తమ తమ వ్యక్తిగత జీవితాల్లో బిజీగా మారారు. మెహ్రీన్ హీరోయిన్గా కంటిన్యూ చేస్తుంటే, 2022లో జరిగిన బైపోల్ ఎలక్షన్స్‌లో బీజేపీ తరపున పోటీ చేసిన భవ్య భిష్ణోయ్ ప్రస్తుతం హర్యానా ఎమ్మెల్యేగా ఉన్నారు. అయితే ఈయన త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు. ఐఏఎస్ ఆఫీసర్ పరి భిష్ణోయ్‌తో కలిసి త్వరలోనే ఏడడుగులు వేయనున్నారు. ఈ క్రమంలో రీసెంట్గా హర్యానాలో ఘనంగా వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. Couldn’t think of a more special place to ask you possibly the most important question of my life… where it all began… and where it begins for us… pic.twitter.com/qWSssP6ljt — Bhavya Bishnoi (@bbhavyabishnoi) May 5, 2023 -
అప్పులే దారుణానికి ఒడిగట్టేలా చేశాయి.. వీడిన టెక్కీ రాహుల్ అదృశ్యం మిస్టరీ
సాక్షి, కోలారు: బెంగళూరు రూరల్‌లోని బాగలూరులో నివాసం ఉండే టెక్కీ రాహుల్(27) తన మూడేళ్ల వయసున్న కుమార్తెతో కలిసి ఈనె 16న కోలారులోని కెందెట్టి చెరువులో దూకాడన్న మిస్టరీ వీడింది. కుమార్తెను నీటిలోకి తోసి హత్య చేసి అనంతరం ఆచూకీ లేకుండా పోయిన టెక్కీ ఎట్టకేలకు పోలీసులకు చిక్కాడు. గుజరాత్‌కు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ రాహుల్.. భవ్య అనే యువతిని ప్రేమించి వివాహం చేసుకున్నాడు. వీరికి జియా అనే కూతురు ఉంది. ఏడాదిన్నర క్రితం ఉద్యోగం కోల్పోయిన రాహుల్ బిట్ కాయిన్లో డబ్బు పెట్టుబడి పెట్టి నష్టపోయాడు. ఖర్చుల కోసం విపరీతంగా అప్పులు చేయడంతో అప్పులబాధ ఎక్కువైంది. గతంలో ఇంట్లో బంగారం చోరీ అయిందని తప్పుడు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో పోలీసులు విచారణకు హాజరు కావాలని తెలపడంతో రాహుల్ భయపడ్డాడు. ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయం కూతురిని స్కూల్‌కు వదలి రావడానికి కారులో బయలుదేరిన సమయంలోనే అప్పుల వారు ఇంటి వద్దకు వచ్చి వేధించడంతో ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తాను చనిపోతే భార్య కూతురును సరిగా చూడదని భావించి కూతురుతో సహా ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నాడు. నవంబర్ 15వ తేదీన కూతురిని స్కూల్‌కు వదిలి వస్తానని కారులో బయలుదేరి నేరుగా కోలారు జాతీయ రహదారి పక్కనే ఉన్న కెందట్టి చెరువు వద్దకు వచ్చాడు. చదవండి: (మహా నగరంలో మాయగాడు.. సివిల్ సప్లయీస్ డెప్యూటీ కలెక్టర్‌నంటూ..) కూతురిని కారులోనే ఊపిరాడకుండా చేసి చంపి మృతదేహాన్ని చెరువులో పారవేశాడు. అనంతరం తాను కూడా చెరువులోకి దూకాడు. అయితే లోతు తక్కువగా ఉండడం వల్ల బతికి పోయాడు. ఎలాగైనా చనిపోవాలని భావించిన రాహుల్ రైలు కిందపడేందుకు బంగారుపేట రైల్వే స్టేషన్‌కు చేరుకున్నాడు. రైలు కింద దూకడానికి భయపడి పలు ప్రాంతాల్లో రైలులోనే తిరిగి చివరికి చెన్నై చేరుకున్నాడు. చెన్నైలో తన సంబందీకులకు ఫోన్ చేసి తనను ఎవరో కిడ్నాప్ చేశారని నాటకం ఆడాడు. మొబైల్ నెట్వర్క్ ఆధారంగా రాహుల్ ఆంధ్రప్రదేశ్ నుంచి బెంగళూరుకు రైలులో వస్తున్నాడని తెలుసుకుని గురువారం రాత్రి పోలీసులు అతనిని అరెస్టు చేశారు. పోలీసు విచారణలో రాహుల్ అన్ని విషయాలు బయటపెట్టాడు. -
యువ దంపతుల ఆత్మహత్య .. అదే కారణమా..?
మైసూరు (కర్ణాటక): మైసూరులోని సాతగళ్లి లేఔట్లో నివాసం ఉంటున్న సంతోష్(26), భవ్య(22) అనే యువ దంపతులు ఆత్మహత్యకు పాల్పడ్డారు. వీరు ఇంటి నుంచి బయటకు రాకపోవడంతో బుధవారం స్థానికులు వెళ్లి చూడగా విగతజీవులుగా కనిపించారు. పోలీసులు వచ్చి పరిశీలించగా అన్నంలో పురుగుల మందు కలిపి తిన్నట్లు తేలింది. అప్పుల బాధతో ఈ అఘాయిత్యానికి పాల్పడి ఉంటారని పోలీసులు చెబుతున్నారు. చదవండి: (లాడ్జికి రావాలని ఒకర్ని.. ఇంట్లో ఎవరూ లేకుంటే వచ్చేస్తా అని మరొకర్ని..) -
నేను, భవ్య ఓపెన్‌గా మాట్లాడుకున్నాం: మెహరీన్
‘హనీ ఈజ్ ది బెస్ట్’... ‘ఎఫ్ 2’లో మెహరీన్ తన గురించి ఇలా చెప్పుకుంటారు ఇప్పుడు... ‘భవ్య ఈజ్ బెస్ట్’ అంటున్నారు ఎవరీ భవ్య అంటే మెహరీన్ కాబోయే భర్త మార్చి 12న భవ్య – మెహరీన్‌ల నిశ్చితార్థం జరిగింది. పెళ్లెప్పుడు? అంటే... డేట్ ఫిక్స్ కాలేదు. కూల్ కూల్‌గా ‘వింటర్ వెడ్డింగ్’ చేసుకోవాలనుకుంటున్నారు. కాబోయే భర్త గురించి, పెళ్లి విశేషాలను ‘సాక్షి’కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో మెహరీన్ చెప్పారు. ► జీవితంలో కొత్త దశలోకి అడుగుపెడుతున్నారు.. అవును. ఈ ఫేజ్ చాలా అందంగా, అద్భుతంగా ఉంది. ఇంకా చెప్పాలంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఆ దేవుడి ఆశీర్వాదాలు నాకు పూర్తిగా ఉన్నాయనిపిస్తోంది. ► హీరోయిన్గా ఆఫర్లు ఉన్నప్పుడు పెళ్లి వాయిదా వేసుకుంటారు చాలామంది. కానీ మీరు అలా అనుకోలేదా? హీరోయిన్గా వచ్చేటప్పుడే మా అమ్మానాన్నతో కెరీర్‌ని, పర్సనల్ లైఫ్‌ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటానని చెప్పాను. 25 లేకపోతే 26 ఏళ్లకే పెళ్లి చేసుకుని సెటిల్ అవుతానన్నాను. దీన్నే మనసులో పెట్టుకుంటూ, సినిమాలు ఒప్పుకున్నాను. కెరీర్లో ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా ఫర్వాలేదు.. అనుకున్న ఏజ్‌కి పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఎందుకంటే ప్రతి విషయానికీ రైట్ టైమ్ అనేది ఉంటుందని నా ఫీలింగ్. అప్పుడే జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించగలుగుతాం.∙ ► మీది అరేంజ్డ్ లవ్ మ్యారేజ్ అనుకోవచ్చా? కాదు. ఇది పూర్తిగా అరేంజ్డ్ మ్యారేజే. మా రెండు కుటుంబాలకు చెందిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారా భవ్యా బిష్ణోయ్ కుటుంబంతో మాకు పరిచయం ఏర్పడింది. మా అమ్మగారికి భవ్య నచ్చారు. నాకు తన ప్రొఫైల్‌ని, తనకు నా ప్రొఫైల్‌ని పెద్దవాళ్లు చూపించారు. ఆ తర్వాత మా ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకోమన్నారు. అప్పుడు లాక్డౌన్ కావడంతో వ్యక్తిగతంగా కలుసుకొని మాట్లాడుకోవడానికి వీల్లేకుండా పోయింది. ఫోన్లో మాట్లాడుకున్నాం. మెసేజ్‌లు పంపించుకున్నాం. ఫేస్‌టైమ్‌లో మాట్లాడుకునేవాళ్లం. ► ఎవరైనా ముందు కలిసి మాట్లాడుకుని, తర్వాత ‘ఐ లవ్ యు’ చెప్పుకుంటారు. మీరేమో ముందు మాట్లాడుకుని తర్వాత కలిశారన్నమాట... (నవ్వుతూ...) కలిసి మాట్లాడుకుంటేనే కాదు... ఒక్కోసారి ఇలా మాట్లాడుకున్నా ఒకర్నొకరు తెలుసుకోవచ్చు. యాక్చువల్లీ మా మధ్య అండర్స్టాండింగ్ కుదరడానికి లాక్డౌన్ చాలా హెల్ప్ అయ్యిందనుకుంటున్నాను. మేం మాట్లాడుకోవడం మొదలుపెట్టిన ఆరు రోజులకే నన్ను పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చేశారు భవ్య. ఎందుకంటే నేను, భవ్య ఓపెన్‌గా మాట్లాడుకున్నాం. ► నిశ్చితార్థం వేడుకలో ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా కనిపించారు. మీ ఇద్దరి అభిప్రాయాలు కూడా మ్యాచ్ అయ్యాయా? థ్యాంక్యూ సో మచ్. ఆహారపు అలవాట్ల నుంచి చాలా విషయాల్లో మా ఇష్టాలు, అనిష్టాలు కలిశాయి. మా ఇద్దరి కామన్ ఇంట్రస్ట్స్ కూడా దాదాపు ఒకటే. ► ‘ఎఫ్ 2’లో ‘హనీ ఈజ్ ది బెస్ట్’ అని మీ గురించి మీరు చెబుతుంటారు. భవ్యలో బెస్ట్ క్వాలిటీస్? చాలా తెలివిగలవాడు. డౌన్ టు ఎర్త్. మర్యాదస్థుడు కూడా! స్కూల్లో టాపర్. చదువులోనే కాదు క్రీడల్లోనూ బెస్ట్. ఢిల్లీలో శ్రీరామ్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత ‘ఎల్ఎస్ఇ’ (లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్)కి వెళ్లారు. మాస్టర్స్ చేయడానికి లండన్ ఆక్స్‌ఫర్డ్‌కి వెళ్లారు. అకడెమిక్ రికార్డ్ మీద జీ–మ్యాట్ (గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్) రాయకుండానే హార్వర్డ్ కూడా వెళ్లారు. చాలా ట్యాలెంటెడ్. ► ఓకే... కట్నం విషయానికి వద్దాం. మీ రెండు కుటుంబాల మధ్య ఆ టాపిక్ ఏమైనా వచ్చిందా? కట్నం అనేది మన సమాజ ప్రతిçష్ఠకు మచ్చ అని నేను అనుకుంటాను. నా కుటుంబ సభ్యులు కూడా కట్నం ఇవ్వాలనుకోరు. మా అత్తగారింట్లో కూడా అంతే! వాళ్ళు కట్నం తీసుకోవాలనుకునే మనుషులు కాదు. చాలా హుందా అయిన కుటుంబం. మంచి మనసున్నవాళ్లు. ► అత్తగారింట్లో ఎలా ఒదిగిపోవాలో మీ అమ్మగారి దగ్గర సలహాలేమైనా తీసుకున్నారా? మా పుట్టింటివాళ్లు, అత్తింటివాళ్లు చాలా కూల్. అలాగని సంప్రదాయాల విషయంలో లైట్‌గా ఉండరు. అన్నీ పాటించాల్సిందే! మా ఇంట్లో చిన్నప్పటి నుంచీ పెద్దవాళ్లను ఎలా గౌరవించాలో నేర్పారు. కుటుంబ విలువల గురించి చెబుతూ పెంచారు. కుటుంబ మూలాలకు భంగం రాకుండా ఎలా నడుచుకోవాలో నేర్పించారు. అందుకని ఇప్పుడు ఇంకో కుటుంబంలోకి వెళుతున్నప్పటికీ అక్కడెలా ఉండాలో ప్రత్యేకంగా అడిగి తెలుసుకోలేదు. ► సో.. అత్తింట్లో ఎలా ఒదిగిపోవాలనే టెన్షన్ లేనట్లే... నా జీవితం చాలా బ్లెస్డ్. ఆ దేవుడు నాకు మంచి తల్లితండ్రులను ఇచ్చాడు. ఇప్పుడు ఇంకో కుటుంబంలోనూ మంచి తల్లితండ్రులనే ఇచ్చాడు. అందుకే నాకు పెద్దగా టెన్షన్ లేదు. ► ఇంతకీ మీ పెళ్లి తేదీ చెప్పనేలేదు? (నవ్వేస్తూ...) తేదీ ఇంకా అనుకోలేదు. ‘వింటర్ వెడ్డింగ్’ అనుకున్నాం. డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నాం. ► మరి, సంగీత్, మెహందీ గురించి? వీలైనంతగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. వేడుకలన్నీ మా అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయేలా కొత్తగా ప్లాన్ చేస్తున్నాం. ► పెళ్ళయ్యాక... సినిమాల్లో కొనసాగుతారా? ఫ్యామిలీ లైఫ్‌నూ, ప్రొఫెషనల్ లైఫ్‌నూ బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నాను. ► పెళ్లయ్యాక ఎక్కడ ఉంటారు? ముంబయ్‌లో నాకు ఇల్లు ఉంది. భవ్య ఢిల్లీలో ఉంటారు. సో... ఢిల్లీలోనే ఉంటాను. ► భవ్య తన లవ్‌ని ఎలా ప్రపోజ్ చేశారు? గత నెల భవ్య (ఫిబ్రవరి 16) బర్త్‌డేకి అండమాన్ వెళ్లాం. స్క్యూబా డైవింగ్ చేస్తున్నప్పుడు ‘విల్ యు మ్యారీ మీ’ (నన్ను పెళ్లి చేసుకుంటావా) అని అడిగారు. ఇలా ప్రపోజ్ చేస్తారని ఊహించలేదు. నీళ్లల్లో మోకాళ్ల మీద కూర్చుని అలా అడుగుతుంటే ముచ్చటేసింది. స్పెషల్‌గా, మ్యాజికల్‌గా అనిపించింది. భవ్య లవింగ్ అండ్ కేరింగ్. మంచి ఫ్యామిలీ మ్యాన్. అందగాడు, తెలివితేటలున్నవాడు. కాబోయే భర్తలో ఒక అమ్మాయి ఆశించే లక్షణాలున్న వ్యక్తి. ఆ పరంగా నేను చాలా లక్కీ. భవ్యను వద్దనుకోవడానికి నాకు కారణాలేమీ కనిపించలేదు. మెహరీన్‌కి భవ్య ప్రపోజ్ చేసిన వేళ ► పెళ్లి వేడుకల్లో కట్టుకునే చీరలు, పెట్టుకునే నగల గురించి? మా అమ్మమ్మ, మా అమ్మగారి ట్రెడిషనల్ జ్యుయెలరీ పెట్టుకోబోతున్నాను. ఇంకా ఇప్పటి ట్రెండ్‌కి తగ్గ నగలు కూడా కొనుక్కుంటాను. మా అమ్మ పెళ్లిలో కట్టుకున్న బట్టలను, పెట్టుకున్న నగలను నా పెళ్లికి వాడాలనుకుంటున్నాను. ► మీ సంప్రదాయం ప్రకారం పెళ్లికి ఎన్ని గంటలు పడుతుంది? నేను సిక్కుల కుటుంబానికి చెందిన అమ్మాయిని. అందుకని గురుద్వారాలో పంజాబీ సంప్రదాయం ప్రకారం మా పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాతి రోజు సాయంత్రం హిందూ వెడ్డింగ్ ఉంటుంది. ఏదో ఒక్క ట్రెడిషన్నే ఫాలో అయి, పెళ్లి చేసుకోవాలని మేం అనుకోలేదు. రెంటికీ విలువ ఇవ్వాలి. – డి.జి. భవాని -
కోవిడ్ సైనికులు
పరిశ్రమ స్థాపించాలి... అది సమాజానికి పనికొచ్చేదై ఉండాలి. పలువురికి ఉపాధినివ్వాలి... పదిమందిలో ఆదర్శవంతంగా జీవించాలి. ప్లాస్టిక్లేని సమాజాన్ని నిర్మించాలి. మన పనికి భూమాత హర్షించాలి. ఇదీ వాళ్ల ఆలోచన... వాళ్ల ఆలోచనను కరోనా కొత్త మలుపు తిప్పింది. ఆరోగ్యకారకమైన త్రీ ప్లై మాస్కుల తయారీతో కోవిడ్ సైనికులయ్యారు. ఉద్యోగం చేయాలా, పదిమందికి ఉద్యోగం ఇవ్వాలా... ఈ తరం యువతకు ఎదురవుతున్న ప్రశ్న ఇది. ‘సాఫ్ట్వేర్ రంగంలో క్యాంపస్‌కే ఉద్యోగాలు వస్తాయి. రెండేళ్లలో ఇల్లు, కారు కొనుక్కోవచ్చు’ అని పిల్లలకు నూరిపోస్తున్న పేరెంట్స్ ప్రభావంతో ‘పరిశ్రమ నెలకొల్పడం... పదిమందికి ఉద్యోగం ఇవ్వడం’ అనే ఆలోచన పిల్లల్లో మొగ్గ దశలోనే రాలిపోతోంది. ఇలాగ అందరూ ఇతరదేశాల సేవకే జీవితాన్ని అంకితం చేస్తుంటే... డాలర్ మారకంలో రూపాయి గలగలల కలలు సాకారం అవుతాయి. జీవనస్థాయులు మెరుగుపడతాయి కూడా. మరి... మనదేశం అభివృద్ధి చెందేదెప్పుడు? మనదేశంలో అట్టడుగున ఉన్న శ్రామికశక్తిని, సమాజంలో సగభాగమైన మహిళాశక్తిని దేశనిర్మాణంలో భాగస్వామ్యం చేసినప్పుడే దేశం అభివృద్ధి బాట పడుతుంది. ఈ సూత్రాన్ని నమ్మిన నవతరం అమ్మాయిలు శ్రుతకీర్తి, భవ్యల ప్రయత్నమే హైదరాబాద్, కుషాయిగూడలోని ఎస్బీ ఎకో మ్యాటిక్స్. తడవని మాస్క్ ‘‘మన కెరీర్... మనకు ఆదాయాన్ని మాత్రమే ఇస్తే సరిపోదు. సమాజానికి కూడా ఉపయోగపడాలి. అదే సమయంలో పర్యావరణ హితంగా కూడా ఉండాలి. ఈ మూడుకోణాల్లో ఆలోచించిన తర్వాత మేము నాన్ వోవన్ బ్యాగ్‌ల తయారీని ఎంచుకున్నాం. మనం కొన్న సరుకులను మాల్స్ వాళ్లు పాలిథిన్ కవర్ లేదా క్లాత్ బ్యాగ్‌లో వేసిస్తున్నారు. వీటికి ప్రత్యామ్నాయం కోసం చూశాం. ప్లాస్టిక్ రహిత సమాజం కోసం పని చేయాలి. మన బ్యాగ్ క్లాత్ బ్యాగ్కంటే చౌకగా ఉండాలి. అందుకే నాన్‌వోవన్ బ్యాగ్‌లను పరిచయం చేయాలనుకున్నాం. నాన్ వోవన్ అనే పదం మనకు కొత్త కానీ, మనం నిత్యం చూస్తూనే ఉంటాం. బేకరీల్లో క్యాప్‌లు, భవన నిర్మాణ రంగంలో కాళ్లకు కవర్లు, చేతులకు గ్లవుజ్లుగా వాడుతుంటారు. హాస్పిటల్లో వాడే పీపీఈ కిట్లు కూడా ఈ మెటీరియల్‌తోనే తయారవుతాయి. ఇప్పుడు ఈ మెటిరీయల్తో పీపీఈ కిట్లతోబాటు వైద్యప్రమాణాలకు అనుగుణంగా మాస్క్‌లు కూడా తయారు చేస్తున్నాం’’ అని చెప్పారు సంస్థ సీఎండీ శ్రుతకీర్తి. మాస్కు కోసం మెషీన్‌ని మార్చుకున్నాం ‘‘మా పరిశ్రమ కోసం తొమ్మిది నెలలుగా వర్కవుట్ చేస్తున్నాం. పరిశ్రమకు అవసరమైన యంత్రాలను విదేశాల నుంచి దిగుమతి చేసుకున్నాం. పని మొదలు పెట్టాల్సిన సమయానికి కోవిడ్ వ్యాధి ప్రబలింది. మార్కెట్లో మాస్కుల కొరత ఏర్పడింది. సామాన్యులు మాస్కుల అవసరాన్ని తెలుసుకునే సరికే వ్యాపారులు ఒక్కో మాస్కును నలభై రూపాయలకు అమ్మడం కూడా మొదలైపోయింది. నలభై రూపాయలు పెట్టి మాస్కు కొనలేని వాళ్ల కోసమే మా పని మొదలు పెడితే బావుంటుందనిపించింది. దాంతో యంత్రాల సెట్టింగులను మాస్కుల తయారీకి అనుగుణంగా మార్చాం. లాభార్జన లేకుండా మెటీరియల్ ఖర్చు మాత్రమే చార్జ్ చేసి ఒక్కోమాస్కును ఐదు రూపాయల యాభైపైసలకిస్తున్నాం. పేదవాళ్లకు మాస్కులు పంచడానికి ముందుకువచ్చే ఎన్జీవోలకు, దాతలకు నో ప్రాఫిట్ నో లాస్ ప్రాతిపదికన మాస్కులు చేసిస్తున్నాం. పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులకు మేమే ఉచితంగా పంపిణీ చేస్తున్నాం. సామాజిక బాధ్యతతో పారిశ్రామిక వేత్తలుగా ఎదగాలనుకున్నాం. మా తొలి ప్రయత్నమే ఇలా సమాజసేవతో మొదలు కావడం సంతోషంగా ఉంది’’ అన్నారు ఎండీ భవ్య. – వాకా మంజులారెడ్డి వైద్య ప్రమాణాలతో మాస్క్ మేము తయారు చేస్తున్న త్రీ ప్లై మాస్క్‌లో మూడు పొరలుంటాయి. రెండువైపులా నీలం రంగు పొరల మధ్య తెల్లటి పొర ఉంటుంది. నాన్ వోవన్ మాస్కులు అలర్జీ కలిగించవు. గాలి హాయిగా ప్రసరిస్తుంది. ఈ మాస్క్ నీటిలో నానదు. నీటిని పోసినా కూడా నీరు కారకూడదు. ఫైర్ టెస్ట్ కూడా ఉంటుంది. కాల్చినప్పుడు మంట మాత్రమే రావాలి, పొగ రాకూడదు. మండేటప్పుడు గట్టిగా ఊదినా సరే ఆ గాలికి మంట ఆరిపోకూడదు. మాస్క్ మెటీరియల్ పూర్తిగా కాలిపోవాలి. ఈ వైద్యప్రమాణాలను పూర్తిగా పాటించి తయారు చేస్తున్నాం. పరిశ్రమలో మాస్కుల తయారీని పర్యవేక్షిస్తున్న భవ్య, శ్రుతకీర్తి కరోనాను తిప్పికొట్టాలి... ఎస్బీ ఎకో మ్యాటిక్స్ సీఎండీ శ్రుతకీర్తి శాస్త్రీయ నాట్యకారిణి కూడా. ‘కరోనాను తిప్పికొట్టాలి... లోకానికి దివిటీ పట్టాలి’ అని సృజనాత్మకంగా తెలియచేశారు. ‘‘ప్రముఖ గాయని శోభారాజ్ గారు కరోనాను పారదోలుదామంటూ సొంతంగా పాట రాసి పాడారు. ఆ పాటకు నృత్యరూపాన్నిచ్చాను. ఒక మంచి విషయాన్ని సామాన్యులకు సులువుగా చేర్చే మాధ్యమం కళ మాత్రమే. సామాజిక సంక్లిష్టతలు ఎదురైనప్పుడు కళ ద్వారా సమాజాన్ని చైతన్యవంతం చేయాల్సిన బాధ్యత మా కళాకారుల మీద ఉంటుంది’’ అన్నారు శ్రుతకీర్తి. కరోనా పాట పాడుతున్న శోభారాజ్ పాటకు నాట్యం చేస్తున్న శ్రుతకీర్తి -
బహుమతి కోసం వచ్చి విద్యార్థిని మృతి
ఖిల్లా ఘనపురం (వనపర్తి): స్వాతంత్య్ర దిన వేడుకల్లో విషాదం చోటుచేసుకుంది. కొద్ది సేపట్లో బహుమతి తీసుకోవాల్సిన ఓ బాలిక అకస్మాత్తుగా చనిపోయింది. బుధవారం వనపర్తి జిల్లా ఖిల్లాఘనపురం మండలం సోళీపురంలో ఈ ఘటన చోటు చేసుకుంది. సోళీపురం గ్రామానికి చెందిన మచ్చని వెంకటయ్య–చెన్నమ్మ రెండో కుమార్తె భవ్య(13) గ్రామంలోని ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతోంది. ఇటీవల నిర్వహించిన క్రీడాపోటీల్లో ఆమె షాట్‌పుట్‌లో ప్రథమ స్థానంలో నిలవగా స్వాతంత్య్ర వేడుకల్లో బహుమతి అందుకోవాల్సి ఉంది. బహుమతికోసం ఆమె పేరు పిలవగానే స్టేజీ దగ్గరకు వెళ్లిన భవ్య ఒక్కసారిగా కుప్పకూలింది. పరీక్షించిన వైద్యులు భవ్య అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. -
వరకట్న వేధింపులపై వివాహిత ఫిర్యాదు
తెనాలి: స్థానిక త్రీటౌన్ పోలీస్‌స్టేషనులో వరకట్న వేధింపుల కేసు నమోదైంది. పట్టణంలోని బాలాజీరావుపేట మసీదు బజారుకు చెందిన భవ్యకు, పశ్చిమగోదావరి జిల్లా ఏలూరు నివాసి నల్లగొండ వెంకట నాగబాలకృష్ణతో 2015 డిసెంబరు 7న వివాహమైంది. వివాహ సందర్భంగా రూ.2 లక్షల నగదు, 12 సవర్ల బంగారం, 6 సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చారు. ప్రస్తుతం నాగబాలకృష్ణ కానూరులోని ఓ బ్యాంకు బ్రాంచిలో అసిస్టెంట్ మేనేజరుగా చేస్తున్నాడు. వివాహమై కొంతకాలం కాపురం సజావుగానే సాగింది. మగబిడ్డ కలిగాడు. తర్వాతనుంచి భర్త వైఖరి మారిపోయింది. తాగుడు వంటి వ్యసనాలకు అలవాటుపడి వేధింపులకు గురిచేస్తున్నట్టు భవ్య పోలీసులకిచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. అందంగా లేనని తూలనాడటం, ఆడపడుచు చెప్పుడు మాటలతో భౌతిక హింసకు పాల్పడుతూ తనను మానసికంగా, శారీరకంగా వేధిస్తున్నట్టు ఆరోపించారు. అత్తమామలకు ఈ విషయం తెలిసినా కొడుకుకు వత్తాసు పలుకుతున్నారని, విడాకులిస్తే తమ బిడ్డకు రెండో వివాహం చేసుకుంటామని చెబుతున్నారని భవ్య వాపోయింది. దీంతో విసిగిపోయి, తెనాలి వచ్చేసినట్టు తెలిపారు. తలిదండ్రులు తన అత్తమామలతో మాట్లాడటంతో బాగా చూసుకుంటామని హామీనివ్వడంతో మళ్లీ కాపురానికెళ్లినట్టు వివరించారు. అయినప్పటికీ పద్ధతి మారకపోగా, ఈనెల 18వ తేదీ రాత్రి తనను హింసించి, ఇంట్లోంచి బయటకు గెంటేసినట్టు భవ్య ఆరోపించారు. ఆ రాత్రి అక్కడే ఉండి, 19 ఉదయం విజయవాడ వచ్చానని, చేతిలో చార్జీలక్కూడా డబ్బుల్లేవని ఫోనులో తెలియజేయడంతో తలిదండ్రు లొచ్చి తీసుకెళ్లారు. భవ్య తెనాలి త్రీటౌన్‌లో ఫిర్యాదు చేయగా ఈనెల 20న కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
అల్లరి చేస్తోందని వాతలు పెట్టింది
అనంతపురం: జిల్లాలోని పెనుగొండ మండలంలోని మారుతీనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. స్థానిక అంగన్వాడీ స్కూల్లో పని చేస్తున్న శకుంతల అనే ఆయా అల్లరి చేస్తోందనే కారణంతో భవ్య అనే చిన్నారికి వాతలు పెట్టింది. ఈ విషయం తెలిసిన చిన్నారి తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన సీడీపీఓ ప్రభావతమ్మ తక్షణమే శకుంతలను విధుల నుంచి తొలగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బొట్టు పెట్టుకుందని బాలికను శిక్షించిన హెచ్ఎం
హెచ్ఆర్సీలో విద్యార్థిని తండ్రి ఫిర్యాదు పాఠశాలపై ఆగ్రహం వ్యక్తం చేసిన హెచ్ఆర్సీ దత్తాత్రేయనగర్: పుట్టిన రోజునాడు బొట్టు పెట్టుకొని పాఠశాలకు వెళ్లిన విద్యార్థినిని పాఠశాల ప్రధానోపధ్యాయురాలు రెండు గంట పాటు తన ఛాంబర్ బయట నిలబెట్టి శిక్షించడంతో పాటు మరోసారి ఇలా చేస్తే టీసీ ఇచ్చి పంపేస్తానని బెదిరించింది. దీంతో సదరు హెచ్ఎంపై చర్యలు తీసుకోవాలని విద్యార్థిని తండ్రి హెచ్ఆర్సీలో గురువారం ఫిర్యాదు చేశారు. ఫిర్యాదీ తెలిపిన వివరాల ప్రకారం... సికింద్రాబాద్‌కు చెందిన వీరా చారి కూతుళ్లు సీహెచ్.వైష్ణవి, సీహెచ్. భవ్యమాధురి సికింద్రాబాద్‌లోని తార్నాక వైట్ హౌస్ వద్ద గల సెయింట్ ఆన్స్ హై స్కూల్లో చదువుతున్నారు. ఈనెల 24న భవ్య జన్మదినం కావడంతో ఉదయం గుడికి వెళ్లి బొట్టు పెట్టుకుని పాఠశాలకు వెళ్లింది. ప్రార్థన జరుగుతున్న సమయంలో పాఠశాల ప్రధానోపాధ్యయురాలు సల్లీ జోసేఫ్... భవ్య బొట్టుపెట్టుకొని రావడం గమనించి తన ఛాంబర్ వద్ద నిలబడాలని ఆదేశించింది. తర్వాత భవ్య తల్లి నాగలక్ష్మికి ఫోన్ చేసి పాఠశాలకు రావాలని కోరింది. పుట్టినరోజు కావడంతో తన కూతురు బొట్టు, తలకు పిన్స్ పెట్టుకొని వచ్చిందని మరోసారి ఇలా జరగకుండా చూస్తామని నాగలక్ష్మి చెప్పినా.. ప్రధానోపాధ్యాయురాలు వినిపించుకోలేదు. రెండు గంటలకు పైగా బాలికను బయట నిలబెట్టి టీసీ ఇచ్చేస్తా.. వెళ్లిపో అని బెదిరించింది. దీంతో నాగలక్ష్మి కన్నీళ్లు పెట్టుకుంటూ భర్త చారిని పిలిపించింది. హిందూ ధర్మం ప్రకారం పుట్టిన రోజునాడు ఆలయానికి వెళ్లి పూజలు చేయడం సాంప్రదాయమని హెచ్ఎంకు నచ్చచెప్పే ప్రయత్నం చేసినా హెచ్ఎం వినిపించుకోలేదు. మరోసారి ఇలా చేస్తే టీసీ ఇచ్చి పంపేస్తామని హెచ్.ఎం బెదిరించిందని, అప్పటి నుంచి తన కూతురు పాఠశాల అంటేనే భయపడుతోందని తండ్రి చారి హెచ్ఆర్సీకి ఫిర్యాదు చేశారు. మానవ హక్కులకు భంగం కలిగించడంతో పాటు తన కూతురు, భార్య మనోవేదనకు గురయ్యేలా చేసిన సదరు పాఠశాల ప్రధానోపాధ్యాయురాలిపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదును స్వీకరించిన హెచ్ఆర్సీ సభ్యులు కాకుమాను పెద పేరిరెడ్డి పాఠశాల నిర్వాకంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏప్రిల్ 9 తేదీలోగా నివేదిక అందించాలని హైద్రాబాద్ డీఈఓకు ఆదేశాలు జారీ చేశారు. -
ఘోరం:పసివాళ్లు పెద్దల కిరాతకానికి బలైపోయారు
అభం శుభం తెలియని పసివాళ్లు పెద్దల కిరాతకానికి బలైపోయారు. జీడిమెట్ల పరిధిలో చిన్నారి భవ్య.. ఓ యువకుడి చేతిలో దారుణహత్యకు గురైంది. తెలిసిన వారిదే ఈ ఘాతుకమని భావిస్తున్న పోలీసులు.. నిందితుడి కోసం గాలిస్తున్నారు. మరో ఘటనలో.. పదేళ్ల కార్తీక్‌ను గత నెలలో కిడ్నాప్ చేసిన దగ్గరి బంధువైన యువకుడు.. ఆ బాలుడిని షాద్‌నగర్‌లో పాశవికంగా హతమార్చి కన్నవాళ్లకు కడుపుకోత మిగిల్చాడు. షాపూర్‌నగర్, న్యూస్‌లైన్: ఇంట్లో ఇంటరిగా ఉన్న బాలికను ఓ దుర్మార్గుడు అతి కిరాతకంగా హతమార్చాడు. మొదట వైరు, ఆపై లుంగీతో మెడకు ఉరి బిగించి హత్యచేసి పరారయ్యాడు. జీడిమెట్ల పోలీసులు, స్థానికుల కథనం ప్రకారం.. విజయనగరం జిల్లాకి చెందిన గోవిందరావు, భారతి దంపతులు న్యూ షాపూర్‌నగర్‌లో ఉంటూ జీడిమెట్ల పారిశ్రామికవాడలోని ఓ ప్రైవేట్ పరిశ్రమలో పని చేస్తున్నారు. వీరి కుమార్తె భవ్య (11) స్థానిక ఎస్వీ మోడల్ హైస్కూల్లో 5వ తరగతి చదువుతోంది. మంగళవారం తల్లిదండ్రులు డ్యూటీకి వెళ్లగా భవ్య ఇంట్లో ఒంటరిగా ఉంది. ఉదయం 10.30 సమయంలో ఓ యువకుడు (25) భవ్య ఉండే గది వైపు వెళ్తుండగా ఇంటి కింది పోర్షన్లో ఉండే యజమాని కల్పన ఎక్కడికి వెళ్తున్నావని అతనిని ప్రశ్నించింది. ఈ క్రమంలో భవ్యను కూడా కల్పన అడిగి నిర్ధారించుకున్న తరువాత అతనిని పైకి పంపింది. అనంతరం మధ్యాహ్నం 12 గంటల సమయంలో అనుమానంతో పైకి వెళ్లిన కల్పన.. భవ్య గదికి బయట నుంచి గడియ పెట్టి ఉండడం చూసి ఎక్కడైనా ఆడుకోవడానికి వెళ్లిందేమోనని భావించింది. సాయంత్రం 4 గంటలకు ఇంటికి వచ్చిన గోవిందరావు గడియ తీసుకుని లోనికెళ్లగా గదిలో భవ్య విగత జీవిగా పడి ఉంది. మెడకు లుంగీ బిగించి ఉంది. పక్కనే సెల్ ఛార్జింగ్ వైరు ఉంది. ఆ స్థితితో కుమార్తెను చూసి గోవిందరావు కుప్పకూలిపోయాడు. తెలిసిన వారి పనేనా? తెలిసిన వారే ఈ ఘాతుకానికి పాల్పడి ఉంటారనే కోణంలో జీడిమెట్ల సీఐ సుదర్శన్ దర్యాప్తు చేస్తున్నారు. తల్లిదండ్రులకు ఎవరితోనైనా గొడవలు ఉన్నాయా?, కుటుంబ నేపథ్యం వంటివి ఆరా తీస్తున్నారు. ఆ యువకుడు తనకు తెలుసని బాలిక భవ్య.. ఇంటి యజమాని కల్పనకు చెప్పడాన్ని బట్టి ఇది తెలిసిన వారి పనేననే నిర్ధారణకు వచ్చారు. చాంద్రాయణగుట్ట, న్యూస్‌లైన్: పోలీసుల నిర్లక్ష్యం బాలుడి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. తమ బాలుడిని ఎవరో కిడ్నాప్ చేశారని... రూ. 2 లక్షలు డిమాండ్ చేస్తున్నారని బాలుడి తల్లిదండ్రులు పోలీసులకు నెల రోజులుగా మొర పెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో పదేళ్లకే ఆ బాలుడికి నూరేళ్లు నిండాయి. ఏప్రిల్ 5న కిడ్నాపైన బాలుడు షాద్‌నగర్‌లో బంధువు చేతిలోనే దారుణ హత్యకు గురికావడంతో ఆ కుటుంబం తీరని విషాదంలో మునిగిపోయింది. వివరాలిలా ఉన్నాయి. జంగమ్మెట్ ఎంసీహెచ్ క్వార్టర్స్‌కు చెందిన జీహెచ్ఎంసీలో పనిచేసే రాజు, సుజాత దంపతుల కుమారుడు మాస్టర్ డి.కార్తీక్ (10). అలియాబాద్లోని స్ఫూర్తి కాన్సెప్ట్ స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్నాడు. కాగా గతనెల 5న ఇంటి ముందు ఆడుకుంటుండగా అనుమానాస్పద స్థితిలో అదృశ్యమయ్యాడు. మరుసటి రోజు ఛత్రినాక పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. కాగా బాలుడి తల్లి సుజాత సోదరుడి కుమారుడు శివకుమార్ (22) వీరింటికి అప్పుడప్పుడు వచ్చి వెళ్లేవాడు. మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మాపూర్ మండలం తాళ్లగూడం గ్రామానికి చెందిన శివకుమార్ ఎలాంటి పని చేయకుండా జులాయిగా తిరుగుతుంటాడు. రెండు నెలల క్రితం తనకు రూ. 10,000 కావాలని కార్తీక్ తల్లి సుజాతను అడిగాడు. దీనికామె ససేమిరా అంది. డబ్బులు ఎందుకు అడిగావని శివకుమార్‌ను అతని నానమ్మ కూడా మందలించింది. ఈ విషయాలన్నింటిని మనసులో ఉంచుకున్న శివకుమార్ ఆగ్రహంతో రగిలిపోయాడు. కార్తీక్‌ను కిడ్నాప్ చేసి డబ్బులు వసూలు చేయాలని భావించాడు. ఇందులో భాగంగానే ఇంటి ముందు ఆడుకుంటున్న కార్తీక్‌ను కిడ్నాప్ చేసి షాద్‌నగర్‌కు తీసుకెళ్లాడు. షాద్‌నగర్ రైల్వేస్టేషన్ వెనుక భాగంలోకి తీసుకెళ్లి రాత్రి 9 గంటల సమయంలో బాలుడి తలపై గ్రానైట్‌రాయితో మోది హత్య చేశాడు. అనంతరం బాలుడి ఒంటి పైనుంచి దుస్తులను తొలగించి వాటిని తీసుకొని తిరిగి ఫలక్‌నుమాకు చేరుకున్నాడు. ఆ దుస్తులను ఫలక్‌నుమా రైల్వే బ్రిడ్జి పక్కనే ఉన్న కట్టమైసమ్మ దేవాలయం వద్ద దాచి పెట్టి యథావిధిగా బాలుడి తల్లిదండ్రుల ఇంటికి అదేరోజు రాత్రి 11 గంటల సమయంలో చేరుకున్నాడు. ఏప్రిల్ 6వ తేదీన నగరానికి వెళుతున్నాని ఇంట్లో చెప్పి వెళ్లిన శివకుమార్ కూకట్‌పల్లికి వెళ్లి కాయిన్బాక్స్తో ఉదయం 10 గంటల సమయంలో సుజాతకు ఫోన్ చేసి ‘నీ కుమారుడు నా వద్దే ఉన్నాడని...రూ. 2 లక్షలు ఇస్తే వదిలేస్తానని’ బెదిరించాడు. దీనిపై కుటుంబ సభ్యులు ఛత్రినాక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఫోన్ కాల్ ఆధారంగా కూకట్‌పల్లిలోని కాయిన్బాక్స్ను గుర్తించారు. అక్కడే ఉన్న సీసీ కెమెరా పుటేజ్ సాయంతో ఆ పరిసరాల్లో శివకుమార్ తచ్చాడినట్లు తేలింది. దీంతో పోలీసులు శివకుమార్‌ను విచారించగా.. బాలుడి కిడ్నాప్‌తో తనకు సంబంధం లేదనడంతో పోలీసులు అతన్ని వదిలేశారు. మళ్లీ శివకుమార్‌ను మరోసారి అదుపులోకి తీసుకొని తమదైన శైలిలో విచారించడంతో బాలుడిని తానే చంపినట్లు సోమవారం రాత్రి పోలీసులకు వెల్లడించినట్లు తెలిసింది. వెంటనే పోలీసులు బాలుడి తల్లిదండ్రులకు మృతదేహం ఫోటోలను చూపగా వారు తమ కుమారుడేనని గుర్తించారు. దు:ఖసాగరంలో మునిగిన కుటుంబ సభ్యులు వివాహమైన పదేళ్లకు పుట్టిన ఒక్కగానొక్క కొడుకు కార్తీక్‌ను శివకుమార్ హత్య చేయడంతో ఆ తల్లిదండ్రులు తీవ్రంగా రోదిస్తున్నారు. నిత్యం అందరితో ఆడుతూ పాడుతూ గడిపే కార్తీక్ లేడన్న విషయం తెలుసుకొని స్థానికులు కూడా కంటతడి పెట్టారు.