అల్లరి చేస్తోందని వాతలు పెట్టింది
Published Thu, Dec 1 2016 10:24 AM | Last Updated on Fri, Jun 1 2018 8:36 PM
అనంతపురం: జిల్లాలోని పెనుగొండ మండలంలోని మారుతీనగర్‌లో దారుణం చోటుచేసుకుంది. స్థానిక అంగన్‌వాడీ స్కూల్లో పని చేస్తున్న శకుంతల అనే ఆయా అల్లరి చేస్తోందనే కారణంతో భవ్య అనే చిన్నారికి వాతలు పెట్టింది. ఈ విషయం తెలిసిన చిన్నారి తల్లిదండ్రులు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు.
వెంటనే స్పందించిన సీడీపీఓ ప్రభావతమ్మ తక్షణమే శకుంతలను విధుల నుంచి తొలగించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
Advertisement