special interview about actress mehrene kaur pirzada - Sakshi
Sakshi News home page

భవ్య ఈజ్‌ ది బెస్ట్: హీరోయిన్ మెహరీన్‌‌

Published Sun, Mar 28 2021 1:03 AM | Last Updated on Sun, Mar 28 2021 10:28 AM

Sakshi Special Interview About Actress Mehrene Kaur Pirzada

భవ్యా బిష్ణోయ్‌ , మెహరీన్

‘హనీ ఈజ్‌ ది బెస్ట్‌’... ‘ఎఫ్‌ 2’లో మెహరీన్‌ తన గురించి ఇలా చెప్పుకుంటారు ఇప్పుడు... ‘భవ్య ఈజ్‌ బెస్ట్‌’ అంటున్నారు ఎవరీ భవ్య అంటే మెహరీన్‌ కాబోయే భర్త మార్చి 12న భవ్య – మెహరీన్‌ల నిశ్చితార్థం జరిగింది. పెళ్లెప్పుడు? అంటే... డేట్‌ ఫిక్స్‌ కాలేదు. కూల్‌ కూల్‌గా ‘వింటర్‌ వెడ్డింగ్‌’ చేసుకోవాలనుకుంటున్నారు. కాబోయే భర్త గురించి, పెళ్లి విశేషాలను ‘సాక్షి’కి ఇచ్చిన స్పెషల్‌ ఇంటర్వ్యూలో మెహరీన్‌ చెప్పారు.

► జీవితంలో కొత్త దశలోకి అడుగుపెడుతున్నారు..
అవును. ఈ ఫేజ్‌ చాలా అందంగా, అద్భుతంగా ఉంది. ఇంకా చెప్పాలంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఆ దేవుడి ఆశీర్వాదాలు నాకు పూర్తిగా ఉన్నాయనిపిస్తోంది.

► హీరోయిన్‌గా ఆఫర్లు ఉన్నప్పుడు పెళ్లి వాయిదా వేసుకుంటారు చాలామంది. కానీ మీరు అలా అనుకోలేదా?

హీరోయిన్‌గా వచ్చేటప్పుడే మా అమ్మానాన్నతో కెరీర్‌ని, పర్సనల్‌ లైఫ్‌ని పర్ఫెక్ట్‌గా ప్లాన్‌ చేసుకుంటానని చెప్పాను. 25 లేకపోతే 26 ఏళ్లకే పెళ్లి చేసుకుని సెటిల్‌ అవుతానన్నాను. దీన్నే మనసులో పెట్టుకుంటూ, సినిమాలు ఒప్పుకున్నాను. కెరీర్‌లో ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా ఫర్వాలేదు.. అనుకున్న ఏజ్‌కి పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఎందుకంటే ప్రతి విషయానికీ రైట్‌ టైమ్‌ అనేది ఉంటుందని నా ఫీలింగ్‌. అప్పుడే జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించగలుగుతాం.∙

► మీది అరేంజ్డ్‌ లవ్‌ మ్యారేజ్‌ అనుకోవచ్చా?
కాదు. ఇది పూర్తిగా అరేంజ్డ్‌ మ్యారేజే. మా రెండు కుటుంబాలకు చెందిన ఫ్యామిలీ ఫ్రెండ్స్‌ ద్వారా భవ్యా బిష్ణోయ్‌ కుటుంబంతో మాకు పరిచయం ఏర్పడింది. మా అమ్మగారికి భవ్య నచ్చారు. నాకు తన ప్రొఫైల్‌ని, తనకు నా ప్రొఫైల్‌ని పెద్దవాళ్లు చూపించారు. ఆ తర్వాత మా ఫోన్‌ నంబర్లు ఇచ్చిపుచ్చుకోమన్నారు. అప్పుడు లాక్‌డౌన్‌ కావడంతో వ్యక్తిగతంగా కలుసుకొని మాట్లాడుకోవడానికి వీల్లేకుండా పోయింది. ఫోన్లో మాట్లాడుకున్నాం. మెసేజ్‌లు పంపించుకున్నాం. ఫేస్‌టైమ్‌లో మాట్లాడుకునేవాళ్లం.

► ఎవరైనా ముందు కలిసి మాట్లాడుకుని, తర్వాత ‘ఐ లవ్‌ యు’ చెప్పుకుంటారు. మీరేమో ముందు మాట్లాడుకుని తర్వాత కలిశారన్నమాట...
(నవ్వుతూ...) కలిసి మాట్లాడుకుంటేనే కాదు... ఒక్కోసారి ఇలా మాట్లాడుకున్నా ఒకర్నొకరు తెలుసుకోవచ్చు. యాక్చువల్లీ మా మధ్య అండర్‌స్టాండింగ్‌ కుదరడానికి లాక్‌డౌన్‌ చాలా హెల్ప్‌ అయ్యిందనుకుంటున్నాను. మేం మాట్లాడుకోవడం మొదలుపెట్టిన ఆరు రోజులకే నన్ను పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చేశారు భవ్య. ఎందుకంటే నేను, భవ్య ఓపెన్‌గా మాట్లాడుకున్నాం.

► నిశ్చితార్థం వేడుకలో ఇద్దరూ మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌లా కనిపించారు. మీ ఇద్దరి అభిప్రాయాలు కూడా మ్యాచ్‌ అయ్యాయా?
థ్యాంక్యూ సో మచ్‌. ఆహారపు అలవాట్ల నుంచి చాలా విషయాల్లో మా ఇష్టాలు, అనిష్టాలు కలిశాయి. మా ఇద్దరి కామన్‌ ఇంట్రస్ట్స్‌ కూడా దాదాపు ఒకటే.

► ‘ఎఫ్‌ 2’లో ‘హనీ ఈజ్‌ ది బెస్ట్‌’ అని మీ గురించి మీరు చెబుతుంటారు. భవ్యలో బెస్ట్‌ క్వాలిటీస్‌?
చాలా తెలివిగలవాడు. డౌన్‌ టు ఎర్త్‌. మర్యాదస్థుడు కూడా! స్కూల్లో టాపర్‌. చదువులోనే కాదు క్రీడల్లోనూ బెస్ట్‌. ఢిల్లీలో శ్రీరామ్‌ స్కూల్‌లో చదువుకున్నారు. ఆ తర్వాత ‘ఎల్‌ఎస్‌ఇ’ (లండన్‌ స్కూల్‌ ఆఫ్‌ ఎకనామిక్స్‌)కి వెళ్లారు. మాస్టర్స్‌ చేయడానికి లండన్‌ ఆక్స్‌ఫర్డ్‌కి వెళ్లారు. అకడెమిక్‌ రికార్డ్‌ మీద జీ–మ్యాట్‌ (గ్రాడ్యుయేట్‌ మేనేజ్‌మెంట్‌ అడ్మిషన్‌ టెస్ట్‌) రాయకుండానే హార్వర్డ్‌ కూడా వెళ్లారు. చాలా ట్యాలెంటెడ్‌.

► ఓకే... కట్నం విషయానికి వద్దాం. మీ రెండు కుటుంబాల మధ్య ఆ టాపిక్‌ ఏమైనా వచ్చిందా?
కట్నం అనేది మన సమాజ ప్రతిçష్ఠకు మచ్చ అని నేను అనుకుంటాను. నా కుటుంబ సభ్యులు కూడా కట్నం ఇవ్వాలనుకోరు. మా అత్తగారింట్లో కూడా అంతే! వాళ్ళు కట్నం తీసుకోవాలనుకునే మనుషులు కాదు. చాలా హుందా అయిన  కుటుంబం. మంచి మనసున్నవాళ్లు.

► అత్తగారింట్లో ఎలా ఒదిగిపోవాలో మీ అమ్మగారి దగ్గర సలహాలేమైనా తీసుకున్నారా?

మా పుట్టింటివాళ్లు, అత్తింటివాళ్లు చాలా కూల్‌. అలాగని సంప్రదాయాల విషయంలో లైట్‌గా ఉండరు. అన్నీ పాటించాల్సిందే! మా ఇంట్లో చిన్నప్పటి నుంచీ పెద్దవాళ్లను ఎలా గౌరవించాలో నేర్పారు. కుటుంబ విలువల గురించి చెబుతూ పెంచారు. కుటుంబ మూలాలకు భంగం రాకుండా ఎలా నడుచుకోవాలో నేర్పించారు. అందుకని ఇప్పుడు ఇంకో కుటుంబంలోకి వెళుతున్నప్పటికీ అక్కడెలా ఉండాలో ప్రత్యేకంగా అడిగి తెలుసుకోలేదు.

► సో.. అత్తింట్లో ఎలా ఒదిగిపోవాలనే టెన్షన్‌ లేనట్లే...
నా జీవితం చాలా బ్లెస్డ్‌. ఆ దేవుడు నాకు మంచి తల్లితండ్రులను ఇచ్చాడు. ఇప్పుడు ఇంకో కుటుంబంలోనూ మంచి తల్లితండ్రులనే ఇచ్చాడు. అందుకే నాకు పెద్దగా టెన్షన్‌ లేదు.

► ఇంతకీ మీ పెళ్లి తేదీ చెప్పనేలేదు?
(నవ్వేస్తూ...) తేదీ ఇంకా అనుకోలేదు. ‘వింటర్‌ వెడ్డింగ్‌’ అనుకున్నాం. డెస్టినేషన్‌ వెడ్డింగ్‌ ప్లాన్‌ చేస్తున్నాం.

► మరి, సంగీత్, మెహందీ గురించి?
వీలైనంతగా ఎంజాయ్‌ చేయాలనుకుంటున్నాం. వేడుకలన్నీ మా అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయేలా కొత్తగా ప్లాన్‌ చేస్తున్నాం.
 

► పెళ్ళయ్యాక... సినిమాల్లో కొనసాగుతారా?
ఫ్యామిలీ లైఫ్‌నూ, ప్రొఫెషనల్‌ లైఫ్‌నూ బ్యాలెన్స్‌ చేయాలనుకుంటున్నాను.

► పెళ్లయ్యాక ఎక్కడ ఉంటారు?
ముంబయ్‌లో నాకు ఇల్లు ఉంది. భవ్య ఢిల్లీలో ఉంటారు. సో... ఢిల్లీలోనే ఉంటాను.

► భవ్య తన లవ్‌ని ఎలా ప్రపోజ్‌ చేశారు?
గత నెల భవ్య (ఫిబ్రవరి 16) బర్త్‌డేకి అండమాన్‌ వెళ్లాం. స్క్యూబా డైవింగ్‌ చేస్తున్నప్పుడు ‘విల్‌ యు మ్యారీ మీ’ (నన్ను పెళ్లి చేసుకుంటావా) అని అడిగారు. ఇలా ప్రపోజ్‌ చేస్తారని ఊహించలేదు. నీళ్లల్లో మోకాళ్ల మీద కూర్చుని అలా అడుగుతుంటే ముచ్చటేసింది. స్పెషల్‌గా, మ్యాజికల్‌గా అనిపించింది. భవ్య లవింగ్‌ అండ్‌ కేరింగ్‌. మంచి ఫ్యామిలీ మ్యాన్‌. అందగాడు, తెలివితేటలున్నవాడు. కాబోయే భర్తలో ఒక అమ్మాయి ఆశించే లక్షణాలున్న వ్యక్తి. ఆ పరంగా నేను చాలా లక్కీ. భవ్యను వద్దనుకోవడానికి నాకు కారణాలేమీ కనిపించలేదు.

మెహరీన్‌కి భవ్య ప్రపోజ్‌ చేసిన  వేళ

► పెళ్లి వేడుకల్లో కట్టుకునే చీరలు, పెట్టుకునే నగల గురించి?
మా అమ్మమ్మ, మా అమ్మగారి ట్రెడిషనల్‌ జ్యుయెలరీ పెట్టుకోబోతున్నాను. ఇంకా ఇప్పటి ట్రెండ్‌కి తగ్గ నగలు కూడా కొనుక్కుంటాను. మా అమ్మ పెళ్లిలో కట్టుకున్న బట్టలను, పెట్టుకున్న నగలను నా పెళ్లికి వాడాలనుకుంటున్నాను.

► మీ సంప్రదాయం ప్రకారం పెళ్లికి ఎన్ని గంటలు పడుతుంది?
నేను సిక్కుల కుటుంబానికి చెందిన అమ్మాయిని. అందుకని గురుద్వారాలో పంజాబీ సంప్రదాయం ప్రకారం మా పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాతి రోజు సాయంత్రం హిందూ వెడ్డింగ్‌ ఉంటుంది. ఏదో ఒక్క ట్రెడిషన్‌నే ఫాలో అయి, పెళ్లి చేసుకోవాలని మేం అనుకోలేదు. రెంటికీ విలువ ఇవ్వాలి.

– డి.జి. భవాని

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement