mehareen
-
రాజస్థాన్‌లో మెహరీన్ చిల్.. గోవాలో పూనమ్ బజ్వా వెకేషన్
రాజస్థాన్‌లో చిల్ అవుతోన్న మెహరీన్..గోవాలో ఎంజాయ్ చేస్తోన్న పూనమ్ బజ్వా..ఒర్రీలో జాన్వీ కపూర్ సిస్టర్ పోజులు..వారణాసిలో ఛాయ్ తాగుతూ రేణు దేశాయ్..అందాలు ఒలకబోస్తోన్న అరియానా గ్లోరీ..అలాంటి డ్రెస్‌లో సోనాలి బింద్రే హోయలు.. View this post on Instagram A post shared by Sonali Bendre (@iamsonalibendre) View this post on Instagram A post shared by ᴋʜᴜsʜɪ ᴋᴀᴘᴏᴏʀ (@khushikapoor) View this post on Instagram A post shared by Ariyana Glory ❤️ (@ariyanaglory) View this post on Instagram A post shared by renu desai (@renuudesai) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) -
వీడియో: మెహ్రీన్‌కు భవ్య బిష్ణోయ్ షాక్.. ఐఏఎస్ ఆఫీసర్‌తో పెళ్లి!
-
‘ఎఫ్ 3’ సెకండ్ సింగిల్ సాంగ్ ప్రోమో.. గ్లామర్‌తో ఆకట్టుకుంటున్న హీరోయిన్స్
వెంకటేశ్, వరుణ్ తేజ్ కాంబినేషన్లో రూపొందుతున్న తాజా చిత్రం ఎఫ్ 3. అనిల్ రావిపూడి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాను, మే 27వ తేదీన విడుదల చేయనున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదలైన ఫస్ట్‌లుక్ పోస్టర్, తొలి సాంగ్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఈ క్రమంలో మూవీలోని సెకండ్ సింగిల్‌ను ఏప్రిల్ 22న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా బుధవారం ఈ సాంగ్ ప్రోమోను విడుదల చేశారు మేకర్స్. ‘ఊ .. ఆ .. అహ అహ’అంటూ ఈ పాట సాగుతోంది. వెంకటేశ్ - తమన్నా, వరుణ్ తేజ్ - మెహ్రీన్ జంటలపై ఈ పాటను చిత్రీకరించారు. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాట బాగా ఆకట్టుకుంటోంది. ఈ ప్రొమో సాంగ్ తమన్నా-మెహరీన్‌లు చీరకట్టులో గ్లామర్‌గా కనిపించారు. రాజేంద్ర ప్రసాద్, సునీల్ కీలక పాత్రలు చేస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ పూజా హెగ్డే ఓ ప్రత్యేక పాటలో కనిపించనుంది. -
నేను, భవ్య ఓపెన్‌గా మాట్లాడుకున్నాం: మెహరీన్
‘హనీ ఈజ్ ది బెస్ట్’... ‘ఎఫ్ 2’లో మెహరీన్ తన గురించి ఇలా చెప్పుకుంటారు ఇప్పుడు... ‘భవ్య ఈజ్ బెస్ట్’ అంటున్నారు ఎవరీ భవ్య అంటే మెహరీన్ కాబోయే భర్త మార్చి 12న భవ్య – మెహరీన్‌ల నిశ్చితార్థం జరిగింది. పెళ్లెప్పుడు? అంటే... డేట్ ఫిక్స్ కాలేదు. కూల్ కూల్‌గా ‘వింటర్ వెడ్డింగ్’ చేసుకోవాలనుకుంటున్నారు. కాబోయే భర్త గురించి, పెళ్లి విశేషాలను ‘సాక్షి’కి ఇచ్చిన స్పెషల్ ఇంటర్వ్యూలో మెహరీన్ చెప్పారు. ► జీవితంలో కొత్త దశలోకి అడుగుపెడుతున్నారు.. అవును. ఈ ఫేజ్ చాలా అందంగా, అద్భుతంగా ఉంది. ఇంకా చెప్పాలంటే చాలా ప్రశాంతంగా ఉంది. ఆ దేవుడి ఆశీర్వాదాలు నాకు పూర్తిగా ఉన్నాయనిపిస్తోంది. ► హీరోయిన్గా ఆఫర్లు ఉన్నప్పుడు పెళ్లి వాయిదా వేసుకుంటారు చాలామంది. కానీ మీరు అలా అనుకోలేదా? హీరోయిన్గా వచ్చేటప్పుడే మా అమ్మానాన్నతో కెరీర్‌ని, పర్సనల్ లైఫ్‌ని పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటానని చెప్పాను. 25 లేకపోతే 26 ఏళ్లకే పెళ్లి చేసుకుని సెటిల్ అవుతానన్నాను. దీన్నే మనసులో పెట్టుకుంటూ, సినిమాలు ఒప్పుకున్నాను. కెరీర్లో ఎంత పెద్ద స్థాయిలో ఉన్నా ఫర్వాలేదు.. అనుకున్న ఏజ్‌కి పెళ్లి చేసుకోవాలనుకున్నాను. ఎందుకంటే ప్రతి విషయానికీ రైట్ టైమ్ అనేది ఉంటుందని నా ఫీలింగ్. అప్పుడే జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించగలుగుతాం.∙ ► మీది అరేంజ్డ్ లవ్ మ్యారేజ్ అనుకోవచ్చా? కాదు. ఇది పూర్తిగా అరేంజ్డ్ మ్యారేజే. మా రెండు కుటుంబాలకు చెందిన ఫ్యామిలీ ఫ్రెండ్స్ ద్వారా భవ్యా బిష్ణోయ్ కుటుంబంతో మాకు పరిచయం ఏర్పడింది. మా అమ్మగారికి భవ్య నచ్చారు. నాకు తన ప్రొఫైల్‌ని, తనకు నా ప్రొఫైల్‌ని పెద్దవాళ్లు చూపించారు. ఆ తర్వాత మా ఫోన్ నంబర్లు ఇచ్చిపుచ్చుకోమన్నారు. అప్పుడు లాక్డౌన్ కావడంతో వ్యక్తిగతంగా కలుసుకొని మాట్లాడుకోవడానికి వీల్లేకుండా పోయింది. ఫోన్లో మాట్లాడుకున్నాం. మెసేజ్‌లు పంపించుకున్నాం. ఫేస్‌టైమ్‌లో మాట్లాడుకునేవాళ్లం. ► ఎవరైనా ముందు కలిసి మాట్లాడుకుని, తర్వాత ‘ఐ లవ్ యు’ చెప్పుకుంటారు. మీరేమో ముందు మాట్లాడుకుని తర్వాత కలిశారన్నమాట... (నవ్వుతూ...) కలిసి మాట్లాడుకుంటేనే కాదు... ఒక్కోసారి ఇలా మాట్లాడుకున్నా ఒకర్నొకరు తెలుసుకోవచ్చు. యాక్చువల్లీ మా మధ్య అండర్స్టాండింగ్ కుదరడానికి లాక్డౌన్ చాలా హెల్ప్ అయ్యిందనుకుంటున్నాను. మేం మాట్లాడుకోవడం మొదలుపెట్టిన ఆరు రోజులకే నన్ను పెళ్లి చేసుకోవాలనే నిర్ణయానికి వచ్చేశారు భవ్య. ఎందుకంటే నేను, భవ్య ఓపెన్‌గా మాట్లాడుకున్నాం. ► నిశ్చితార్థం వేడుకలో ఇద్దరూ మేడ్ ఫర్ ఈచ్ అదర్‌లా కనిపించారు. మీ ఇద్దరి అభిప్రాయాలు కూడా మ్యాచ్ అయ్యాయా? థ్యాంక్యూ సో మచ్. ఆహారపు అలవాట్ల నుంచి చాలా విషయాల్లో మా ఇష్టాలు, అనిష్టాలు కలిశాయి. మా ఇద్దరి కామన్ ఇంట్రస్ట్స్ కూడా దాదాపు ఒకటే. ► ‘ఎఫ్ 2’లో ‘హనీ ఈజ్ ది బెస్ట్’ అని మీ గురించి మీరు చెబుతుంటారు. భవ్యలో బెస్ట్ క్వాలిటీస్? చాలా తెలివిగలవాడు. డౌన్ టు ఎర్త్. మర్యాదస్థుడు కూడా! స్కూల్లో టాపర్. చదువులోనే కాదు క్రీడల్లోనూ బెస్ట్. ఢిల్లీలో శ్రీరామ్ స్కూల్లో చదువుకున్నారు. ఆ తర్వాత ‘ఎల్ఎస్ఇ’ (లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్)కి వెళ్లారు. మాస్టర్స్ చేయడానికి లండన్ ఆక్స్‌ఫర్డ్‌కి వెళ్లారు. అకడెమిక్ రికార్డ్ మీద జీ–మ్యాట్ (గ్రాడ్యుయేట్ మేనేజ్మెంట్ అడ్మిషన్ టెస్ట్) రాయకుండానే హార్వర్డ్ కూడా వెళ్లారు. చాలా ట్యాలెంటెడ్. ► ఓకే... కట్నం విషయానికి వద్దాం. మీ రెండు కుటుంబాల మధ్య ఆ టాపిక్ ఏమైనా వచ్చిందా? కట్నం అనేది మన సమాజ ప్రతిçష్ఠకు మచ్చ అని నేను అనుకుంటాను. నా కుటుంబ సభ్యులు కూడా కట్నం ఇవ్వాలనుకోరు. మా అత్తగారింట్లో కూడా అంతే! వాళ్ళు కట్నం తీసుకోవాలనుకునే మనుషులు కాదు. చాలా హుందా అయిన కుటుంబం. మంచి మనసున్నవాళ్లు. ► అత్తగారింట్లో ఎలా ఒదిగిపోవాలో మీ అమ్మగారి దగ్గర సలహాలేమైనా తీసుకున్నారా? మా పుట్టింటివాళ్లు, అత్తింటివాళ్లు చాలా కూల్. అలాగని సంప్రదాయాల విషయంలో లైట్‌గా ఉండరు. అన్నీ పాటించాల్సిందే! మా ఇంట్లో చిన్నప్పటి నుంచీ పెద్దవాళ్లను ఎలా గౌరవించాలో నేర్పారు. కుటుంబ విలువల గురించి చెబుతూ పెంచారు. కుటుంబ మూలాలకు భంగం రాకుండా ఎలా నడుచుకోవాలో నేర్పించారు. అందుకని ఇప్పుడు ఇంకో కుటుంబంలోకి వెళుతున్నప్పటికీ అక్కడెలా ఉండాలో ప్రత్యేకంగా అడిగి తెలుసుకోలేదు. ► సో.. అత్తింట్లో ఎలా ఒదిగిపోవాలనే టెన్షన్ లేనట్లే... నా జీవితం చాలా బ్లెస్డ్. ఆ దేవుడు నాకు మంచి తల్లితండ్రులను ఇచ్చాడు. ఇప్పుడు ఇంకో కుటుంబంలోనూ మంచి తల్లితండ్రులనే ఇచ్చాడు. అందుకే నాకు పెద్దగా టెన్షన్ లేదు. ► ఇంతకీ మీ పెళ్లి తేదీ చెప్పనేలేదు? (నవ్వేస్తూ...) తేదీ ఇంకా అనుకోలేదు. ‘వింటర్ వెడ్డింగ్’ అనుకున్నాం. డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నాం. ► మరి, సంగీత్, మెహందీ గురించి? వీలైనంతగా ఎంజాయ్ చేయాలనుకుంటున్నాం. వేడుకలన్నీ మా అందరికీ ఎప్పటికీ గుర్తుండిపోయేలా కొత్తగా ప్లాన్ చేస్తున్నాం. ► పెళ్ళయ్యాక... సినిమాల్లో కొనసాగుతారా? ఫ్యామిలీ లైఫ్‌నూ, ప్రొఫెషనల్ లైఫ్‌నూ బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నాను. ► పెళ్లయ్యాక ఎక్కడ ఉంటారు? ముంబయ్‌లో నాకు ఇల్లు ఉంది. భవ్య ఢిల్లీలో ఉంటారు. సో... ఢిల్లీలోనే ఉంటాను. ► భవ్య తన లవ్‌ని ఎలా ప్రపోజ్ చేశారు? గత నెల భవ్య (ఫిబ్రవరి 16) బర్త్‌డేకి అండమాన్ వెళ్లాం. స్క్యూబా డైవింగ్ చేస్తున్నప్పుడు ‘విల్ యు మ్యారీ మీ’ (నన్ను పెళ్లి చేసుకుంటావా) అని అడిగారు. ఇలా ప్రపోజ్ చేస్తారని ఊహించలేదు. నీళ్లల్లో మోకాళ్ల మీద కూర్చుని అలా అడుగుతుంటే ముచ్చటేసింది. స్పెషల్‌గా, మ్యాజికల్‌గా అనిపించింది. భవ్య లవింగ్ అండ్ కేరింగ్. మంచి ఫ్యామిలీ మ్యాన్. అందగాడు, తెలివితేటలున్నవాడు. కాబోయే భర్తలో ఒక అమ్మాయి ఆశించే లక్షణాలున్న వ్యక్తి. ఆ పరంగా నేను చాలా లక్కీ. భవ్యను వద్దనుకోవడానికి నాకు కారణాలేమీ కనిపించలేదు. మెహరీన్‌కి భవ్య ప్రపోజ్ చేసిన వేళ ► పెళ్లి వేడుకల్లో కట్టుకునే చీరలు, పెట్టుకునే నగల గురించి? మా అమ్మమ్మ, మా అమ్మగారి ట్రెడిషనల్ జ్యుయెలరీ పెట్టుకోబోతున్నాను. ఇంకా ఇప్పటి ట్రెండ్‌కి తగ్గ నగలు కూడా కొనుక్కుంటాను. మా అమ్మ పెళ్లిలో కట్టుకున్న బట్టలను, పెట్టుకున్న నగలను నా పెళ్లికి వాడాలనుకుంటున్నాను. ► మీ సంప్రదాయం ప్రకారం పెళ్లికి ఎన్ని గంటలు పడుతుంది? నేను సిక్కుల కుటుంబానికి చెందిన అమ్మాయిని. అందుకని గురుద్వారాలో పంజాబీ సంప్రదాయం ప్రకారం మా పెళ్లి జరుగుతుంది. ఆ తర్వాతి రోజు సాయంత్రం హిందూ వెడ్డింగ్ ఉంటుంది. ఏదో ఒక్క ట్రెడిషన్నే ఫాలో అయి, పెళ్లి చేసుకోవాలని మేం అనుకోలేదు. రెంటికీ విలువ ఇవ్వాలి. – డి.జి. భవాని -
మజా మాల్దీవ్స్
‘కోలంబస్ కోలంబస్ ఇచ్చారు సెలవు.. ఆనందంగా గడపడానికి కావాలొక దీవి’ అని పాడుకుంటారు ‘జీన్స్’ సినిమాలో హీరో. ఇప్పుడు సెలవు దొరికినప్పుడు కొందరు సెలబ్రిటీలు ఈ పాటనే గుర్తు చేసుకుంటున్నారు. బెస్ట్ దీవి ఏదంటే.. ‘మాల్దీవులు’ అంటున్నారు. ప్రస్తుతం వెకేషన్‌కు హాట్‌స్పాట్‌గా మారింది మాల్దీవులు. లాక్డౌన్ ఎక్కడివాళ్లను అక్కడే లాక్ చేసేసింది. అన్ని టెన్షన్లు మరచిపోయి కాస్త సేదతీరడం కోసం మాల్దీవులకు వెళ్లారు కొందరు స్టార్స్. ఈ రెండు వారాల్లోనే చాలామంది సెలబ్రిటీలు మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తూ కనిపించారు. ఆ విశేషాలు. వర్క్–వెకేషన్ వర్క్‌ను, వెకేషన్‌ను ఒకేసారి పూర్తి చేస్తున్నారు కత్రినా కైఫ్. షూటింగ్ నిమిత్తం ఇటీవల మాల్దీవ్స్ వెళ్లారామె. అయితే సినిమా షూటింగా? యాడ్ కోసమా? అనేది సీక్రెట్‌గా ఉంచారు. ఒకవైపు షూటింగ్లో పాల్గొంటూ మరోవైపు ఎంజాయ్ చేస్తున్నారు. ఆ మూమెంట్స్‌ని మాత్రం సీక్రెట్‌గా ఉంచకుండా ఫోటోలను షేర్ చేశారామె. బెస్ట్ బర్త్‌డే ఈ ఏడాది తన బర్త్‌డేను స్పెషల్‌గా చేసుకోవాలనుకున్నారు మెహరీన్. వెంటనే మాల్దీవులకు ప్రయాణం అయ్యారు. తన కుటుంబంతో కలసి మాల్దీవుల్లో పుట్టినరోజు వేడుకలు చేసుకున్నారీ బ్యూటీ. ‘ఈ బర్త్‌డే చాలా స్పెషల్’ అంటూ ఫోటోలు షేర్ చేసి, తన ఆనందాన్ని వ్యక్తపరిచారు. చిన్న బ్రేక్ గత వారం తాప్సీ కూడా మాల్దీవుల్లో సందడి చేసిన విషయం గుర్తుండే ఉంటుంది. హిందీ చిత్రం ‘హసీనా దిల్రుబా’ చిత్రీకరణ పూర్తి చేసి చిన్న బ్రేక్ తీసుకున్నారు తాప్సీ. కొత్త సినిమా చిత్రీకరణ ప్రారంభం అయ్యేలోగా తన స్నేహితులతో కలసి మాల్దీవుల్లో హాలిడేయింగ్ చేశారు. హనీమూన్ కొత్త కపుల్ కాజల్ అగర్వాల్– గౌతమ్ కిచ్లు ప్రస్తుతం హనీమూన్ ఎంజాయ్ చేస్తున్న సంగతి తెలిసిందే. హనీమూన్ కోసం ఈ జంట ఎంచుకున్న చోటు మాల్దీవులు. అక్కడ ఫోటోలను సోషల్ మీడియాలో పంచుకున్నారు కాజల్. పుట్టినరోజు వేడుకలు చిరంజీవి చిన్న కుమార్తె శ్రీజ తన పుట్టినరోజును జరుపుకోవడానికి భర్త కల్యాణ్ దేవ్‌తో కలసి మాల్దీవులు వెళ్లారు. కొన్ని రోజుల పాటు ఈ బర్త్‌డే వీక్‌ను ఎంజాయ్ చేశారు ఈ కపుల్. ఇటీవలే మాల్దీవుల నుంచి తిరిగొచ్చారు కూడా. -
మన యుద్ధం మనమే చేయాలి..
‘‘ఆడవాళ్లందర్లోనూ అన్యాయాన్ని ఎదిరించగల దుర్గాదేవి అవతారముంది. అది తెలుసుకుని, ఆ శక్తిని బయటకు తీస్తేనే ప్రస్తుతం ఉన్న పరిస్థితులను ఎదుర్కోగలం’’ అంటున్నారు రాశీ ఖన్నా, లావణ్యా త్రిపాఠి, అదా శర్మా, మెహరీన్, నభా నటేశ్. సమాజంలో స్త్రీ నెగ్గుకురావాలంటే దుర్గాదేవిలా మారాల్సి ఉంటుందా? ఆడవాళ్లకు పలు సమస్యలు ఉంటాయి. అవకాశం వస్తే మీరు పూర్తిగా నిర్మూలించాలనుకునే సమస్య ఏంటి? చెడును ఎదుర్కోవడానికి మీరు దుర్గాదేవిలా మారిన సందర్భాలేమైనా? దసరా పండగ సెలబ్రేషన్ గురించి? వంటి ప్రశ్నలకు రాశీ, అదా, లావణ్య, మెహరీన్, నభా చెప్పిన అభిప్రాయాలు దసరా ప్రత్యేకం. హద్దు దాటితే సహించను – మెహరీన్ ► తన క్యారెక్టర్ని తక్కువ చేసినా, తన ఆత్మస్థైర్యాన్ని తగ్గించేలా ఉన్నా, అనవసరమైన నిందలకు గురైనా తప్పకుండా దుర్గాదేవిలా మారాల్సిందే. ఏం జరిగినా సరే ఒకరి క్యారెక్టర్‌ను తక్కువ చేసి మాట్లాడే హక్కు ఎవ్వరికీ లేదు. ఆడవాళ్లను అగౌరవపర్చకూడదు. ► అసమానతను నిర్మూలించాలనుకుంటున్నాను. ఆడవాళ్లను బలహీనమైనవాళ్లలా చూస్తారెందుకో అర్థం కాదు. శారీరకంగా మగవాళ్ల అంత బలంగా ఆడవాళ్లు ఉండకపోవచ్చు. కానీ మానసికంగా ఆడవాళ్లు ఎంత బలవంతులో అందరికీ తెలుసు. శారీరకంగానూ మాకు వీలైనంతగా చేస్తూనే ఉంటాం. ఎంతో సమర్థవంతంగా ఇంటి పనిని, ప్రొఫెషనల్ పనిని బ్యాలెన్స్ చేయగలం. మల్టీటాస్క్ చేయగలం. స్త్రీ, పురుషులందరూ సమానమే అనే భావన పెంపొందించాలి అందరిలో. ► నేను చాలా సైలెంట్‌గా ఉంటాను. ఓపిక ఎక్కువ. నా పనేదో నేను చూసుకునే మనస్తత్వం. కానీ దేనికైనా ఒక లిమిట్ ఉంటుంది కదా. ఆ లిమిట్ వరకూ నేను కామ్‌గా ఉంటాను. అన్యాయంగా ప్రవర్తించినా, అగౌరవపరిచినా అస్సలు సహించలేను. ఆ పరిస్థితిని చక్కబెట్టేందుకు నిలబడతాను. ► పండగ వస్తుందంటే నాకు భలే సంతోషమేస్తుంది. స్నేహితులు, బంధువులను కలవచ్చు. ప్రస్తుతం అందరం ఎప్పుడూ చూడని పరిస్థితుల్లో ఉన్నాం. ఎక్కువమందితో కలిసి పండగలు జరుపుకునే పరిస్థితిలో లేము. ఇలాంటి సమయాల్లో ఒకరికోసం ఒకరు నిలబడదాం. మన కళ్లు కూడా ఆయుధమే – అదా శర్మ ► ప్రతీ ఒక్కరిలోనూ దుర్గాదేవి ఉంటుంది. కానీ కొందరు తెలుసుకోగలుగుతారు. కొందరికి తెలియదు.. అంతే. మన లోపల శక్తి దాగి ఉంటుంది. సమయం, సందర్భం వచ్చినప్పుడు అదే బయటకు వస్తుంది. రావాలి కూడా. ► ఆడవాళ్లే ఆడవాళ్లకు శత్రువులు కావడం చూస్తుంటాం. ఒకరిని ఒకరు తక్కువ చేయడం తీసేయాలనుకుంటున్నాను. ఒక స్త్రీ మరో స్త్రీ కోసం నిలబడాలి. ఒకరికి ఒకరు సహాయం చేసుకుంటూ కలసి పైకి ఎదగాలి. ► చాలాసార్లు మారాను. కర్రను కూడా ఆయుధంగా చేసుకున్న సందర్భాలున్నాయి. కొన్నిసార్లు కళ్లను కూడా ఆయుధాలుగా మార్చుకోవచ్చు. ► దసరా పండగకి ఇంట్లోనే ఉంటున్నాను. ఇంటి ముందు రంగోలీ వేస్తాను. ఇంటిని పూలతో అలంకరిస్తాను. ఇష్టమైన వంటకాలు చేసుకుని తింటాము. అందుకే తొమ్మిది అవతారాలు – నభా నటేశ్ ► ప్రతి ఒక్కరికి తనలో ఉన్న ప్లస్, మైనస్ కచ్చితంగా తెలియాలి. వాళ్ల బలమేంటో తెలుసుకుని బలహీనతలను తొలగించుకోవటం కోసం ఫైట్ చెయ్యాలి. దుర్గాదేవి ప్రపంచంలోని అందరికీ సమానమే, అందరికీ అమ్మే. దుర్గాదేవి అంటే ప్రపంచానికే శక్తి. ఆమె తెచ్చిన విజయంతోనే ప్రపంచానికి వెలుగొచ్చింది. అందుకే ప్రతి ఒక్కరూ.. ముఖ్యంగా ఆడవాళ్లు ఏం చేయాలనుకుంటున్నారో, ఏం సాధించాలనుకుంటున్నారో తెలుసుకుని దానికోసం జీవితంలో కష్టపడాలి. దుర్గాదేవి చేసింది అదే. నాకు కావాల్సిందేంటో నాకు కచ్చితంగా తెలుసు, దానికోసం నేను అమ్మవారిలా ఫైట్ చేస్తాను. అదే నా బలం ఆనుకుంటాను. ► అమ్మవారు ఈ తొమ్మిది రోజుల్లో తొమ్మిది రూపాల్లో తను సాధించాలనుకున్నది సాధించింది. అందుకే ఈ తొమ్మిది రోజులూ అమ్మవారిని తొమ్మిది రకాలుగా తయారుచేసి ఎంతో భక్తి శ్రద్ధలతో, నమ్మకంతో ఉంచి పూజ చేస్తారు. నేను పుట్టి పెరిగింది శృంగేరిలో. దేశంలోని శారదా శక్తి పీఠాల్లో అది కూడా ఒకటి. నవరాత్రి సమయంలో గుళ్లో అమ్మవారిని రోజుకో రూపంలో ప్రత్యేకంగా అలంకరిస్తారు. నేను ప్రతిరోజూ గుడికి వెళ్లి ఆ అలంకారాలను చూసి భక్తితో మొక్కుతాను. ఆ అమ్మవారి అలంకారాలు ఎంత అందంగా ఉంటాయో మాటల్లో చెప్పలేను. చిన్నప్పుడు అలా గుడికి వెళ్లి ఆడుకుంటూ సెలబ్రేషన్స్‌లో పిల్లలందరం పాల్గొనేవాళ్లం. ఇప్పుడు అవన్నీ గుర్తుకు వస్తే ఎంతో ఆనందంగా ఉంటుంది. ఇప్పటికీ పండగలంటే నాకు చాలా శ్రద్ధ. వీలు కుదిరినంతవరకూ పూజలు చేస్తుంటాను. మన యుద్ధం మనమే చేయాలి – రాశీ ఖన్నా ► మనందరిలోనూ దుర్గాదేవి అవతారం ఉంటుంది. ప్రస్తుతం బయట ఉన్న పరిస్థితుల్ని చూస్తుంటే ఒక్కోసారి ఆ అవతారాన్ని బయటకు తీస్తేనే బతకగలం అనిపిస్తుంది. ఎప్పుడూ అమాయకంగా కూర్చోలేం కదా. కలియుగంలో మన యుద్ధం మనమే చేయాలి. ► మానభంగం, లింగ వివక్ష అనేది సమాజంలో లేకుండా చేయాలన్నది నా కోరిక. మన ఇష్టమొచ్చినప్పుడు, ఇష్టమొచ్చిన బట్టలు వేసుకొని బయటకు వెళ్లడానికి ఎందుకు భయపడాలి? అబ్బాయిలకు చిన్నప్పటి నుంచే అమ్మాయిల్ని ఎలా గౌరవించాలో నేర్పుదాం. రేప్ కేసుల్లో దోషుల మీద ప్రభుత్వం మరింత కఠినంగా వ్యవహరించాలి. ఇప్పటికీ సమానత్వం కోసం పోరాడుతూనే ఉన్నాం. లింగ బేధాలు లేకుండా సమాన అవకాశాలు ఇవ్వగలగాలి? ► నా కోసం నేను నిలబడాల్సిన పరిస్థితులు కొన్ని వచ్చాయి. నిలబడ్డాను. మా ఇంట్లో నాకు చిన్నప్పటినుంచీ ‘నీకు కావాల్సిన దానికోసం నువ్వు ఫైట్ చేయ్’ అని చెబుతూ వచ్చారు. ఏదైనా ఇష్యూ వస్తే నేను ఫేస్ టు ఫేస్ మాట్లాడటానికే ఇష్టపడతాను. ముసుగులో మాట్లాడటానికి ఇష్టపడను. నాకోసం నేను నిలబడాల్సి వస్తే కచ్చితంగా ధైర్యంగా నిలబడతాను. ► చిన్నప్పటి నుంచి ఫ్యామిలీతోనే జరుపుకునేదాన్ని. కానీ సినిమాల్లోకి వచ్చాక పండగలకు ఇంట్లో ఉండటం తక్కువైంది. షూటింగ్స్ హడావిడిలో ఉంటాం. చిన్నప్పుడు అమ్మానాన్నలతో కలసి రామ్‌లీలా చూడటానికి మా ఇంటి (ఢిల్లీ) దగ్గర ఉన్న గ్రౌండ్‌కి వెళ్లేదాన్ని. మాది చాలా పెద్ద కుటుంబం. పండగ వస్తే చాలు అందరం కలిసే వాళ్లం. పని వల్ల హైదరబాద్‌లోనే ఉండిపోతే ఇవన్నీ గుర్తొస్తుంటాయి. అదే నా సూపర్ పవర్ – లావణ్యా త్రిపాఠి ► ఈ భూమ్మీద పుట్టిన ప్రతి స్త్రీలో దుర్గా మాత ఉంటుంది. అందుకే ప్రతి స్త్రీలో శక్తి దాగుందని నేను నమ్ముతాను. మగపిల్లలు సూపర్‌హీరోస్ అయినట్లే అమ్మాయిలు అవసరమొచ్చినప్పుడు ధైర్యంగా ఉండగలరు. అలాగే తమ గొంతును ప్రపంచానికి గట్టిగా వినిపించగలరు. తన అనుకున్నవారి కోసం నిలబడి ఫైట్ చేయగలరు. మనం చేయాల్సిందల్లా ఆడపిల్లలపై నమ్మకాన్ని ఉంచటం అంతే. నేను వ్యక్తిగతంగా దుర్గామాతను నమ్ముతాను, నన్ను నేను దుర్గగా అనుకుంటాను. దుర్గ అంటే కోపం, భయం, ప్రేమ మాత్రమే కాదు ఆలోచనాపరమైన శక్తిని ఇస్తుంది. ప్రతి ఒక్కరి గురించి ఆమె ఆలోచిస్తుందని నాకు అనిపిస్తుంది. ► మనకొచ్చే ప్రతి సమస్యకు కోపం పరిష్కారం కాదు. స్త్రీ అనే కాదు ప్రతి ఒక్కరూ యాంగర్ మేనేజ్మెంట్ చేయాలి. నేను చాలా కామ్‌గా, కూల్‌గా ఉంటాను. ఎంత కష్టమైన పరిస్థితులు వచ్చినా కూడా నెమ్మదిగా ఉంటాను. పరిష్కరించుకుంటాను కూడా. అదే నా సూపర్‌పవర్. నా కోపాన్ని ఎప్పుడూ నేను కంట్రోల్లో పెట్టుకుంటాను. ► మా ఇంట్లో చిన్నపిల్లలకు పండగ విశేషాలు చెప్పడం నా అలవాటు. నేను నా మేనకోడలికి కొంచెం క్రియేటివ్‌గా స్కెచ్‌తో బొమ్మలేసి, రాక్షస సంహారం ఎందుకు జరిగింది? దసరా పండగ ఎందుకు చేసుకుంటాం? అనే విషయాలు చెప్పాను. రాక్షసునిపై సాధించిన విజయానికి గుర్తుగా విజయదశమి చేసుకుంటాం అని చెప్పాను. అలా చెప్తేనే కదా మన సంస్కృతి సంప్రదాయాలు వృద్ధి చెందుతాయి. -
కుర్రాడు లోకల్
తమిళ ప్రాచీన యుద్ధ విద్య అడిమురై నేపథ్యంలో రూపొందిన చిత్రం ‘లోకల్ బాయ్’. ధనుష్ హీరోగా, మెహరీన్, స్నేహ హీరోయిన్లుగా తెలుగు నటుడు నవీన్ చంద్ర విలన్‌గా నటించారు. ఆర్.ఎస్. దురై సెంథిల్ కుమార్ దర్శకత్వంలో ‘పటాస్’ పేరుతో తెరకెక్కిన ఈ చిత్రం ఈ ఏడాది సంక్రాంతికి తమిళంలో విడుదలై ఘన విజయం సాధించింది. ఈ చిత్రాన్ని జగన్మోహిని సమర్పణలో విఘ్నేశ్వర ఎంటర్టై¯Œ మెంట్స్ పతాకంపై సీహెచ్ సతీష్‌కుమార్ ‘లోకల్ బాయ్’ పేరుతో ఈ నెల 28న తెలుగులో విడుదల చేస్తున్నారు. సీహెచ్ సతీష్ కుమార్ మాట్లాడుతూ– ‘‘మార్షల్ ఆర్ట్స్ నేపథ్యంలో రూపొందిన చిత్రమిది. ఈ సినిమా కోసం ధనుష్ మార్షల్ ఆర్ట్స్‌లో ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. ప్రాచీన యుద్ధవిద్య అడిమురై గొప్పదనం వివరించే చిత్రమిది. గతంలో ధనుష్, సెంథిల్ కుమార్ కాంబినేషన్లో వచ్చిన ‘ధర్మ యోగి’ చిత్రాన్ని తెలుగులో మేమే విడుదల చేశాం.. ఆ సినిమా మంచి విజయం సాధించింది. ఈ సినిమా కూడా అంతకంటే పెద్ద విజయం సాధిస్తుంది’’ అన్నారు. -
విరామం విహారం వినోదం
షూటింగ్, ప్రయాణాలు, ప్రమోషన్లతో యాక్టర్స్ డైరీ ఎప్పుడూ బిజీగానే ఉంటుంది. ఆ రొటీన్ నుంచి చిన్న బ్రేక్ కోసం అప్పుడప్పుడు సరదా ట్రిప్స్ ప్లాన్ చేస్తుంటారు. ఆ చిన్న విరామంలో విహారం, వినోదం ఉండేలా చూసుకుంటుంటారు. ప్రస్తుతం అలాంటి చిన్న ట్రిప్‌ను ఎంజాయ్ చేస్తున్నారు మెహరీన్. జనవరిలో మెహరీన్ నటించిన మూడు సినిమాలు (ఎంత మంచి వాడవురా!, పటాస్ (తమిళం) అశ్వథ్థామ) విడుదలయ్యాయి. ప్రస్తుతం శ్రీలంకలో హాలిడేయింగ్ చేస్తున్నారామె. శ్రీలంకలోని వాటర్ పార్కులు, జూ పార్కులు చుట్టేస్తున్నారు మెహరీన్. ఆ ఫొటోలు తన సోషల్‌మీడియాలో పంచుకున్నారు. మరోవైపు ‘కంచె’ హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ ప్రస్తుతం ఇండోనేషియాలోని బాలీలో వెకేషన్ చేస్తున్నారు. అక్కడ జలపాతాల వద్ద దిగిన ఫొటోలను షేర్ చేశారు. -
అమ్మకు థ్యాంక్స్
‘‘సినిమా చూసిన ప్రతి ఒక్కరూ బాగుందన్నారు. ఆ పాజిటివ్ టాక్ వల్లే మా సినిమా ఇంత పెద్ద విజయం సాధించింది. ఇలాంటి సినిమా నాతో తీసినందుకు అమ్మకు థ్యాంక్స్’’ అన్నారు నాగశౌర్య. రమణ తేజ దర్శకత్వంలో నాగశౌర్య, మెహరీన్ జంటగా ఐరా క్రియేషన్స్‌పై ఉషా మూల్పూరి నిర్మించిన చిత్రం ‘అశ్వథ్థామ’. జనవరి 31న విడుదలై మా చిత్రం దిగ్విజయంగా ప్రదర్శించబడుతోంది అన్నారు చిత్రబృందం. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ఈ సినిమా గ్రాండ్ సక్సెస్‌మీట్‌లో నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘రమణ తేజకు ఫుడ్, సినిమా.. ఈ రెండే ప్రాణం. అతడిని నమ్మినందుకు సినిమాని బాగా తీశాడు. మరోసారి ‘నర్తనశాల’ లాంటి సినిమా చెయ్యను’’ అన్నారు. నిర్మాత శరత్ మరార్ మాట్లాడుతూ– ‘‘శౌర్య రాసిన కథ నన్ను ఆశ్చర్యానికి గురి చేసింది. తెలుగు సినీ పరిశ్రమకు నాగశౌర్య రూపంలో మరో యాక్షన్ స్టార్ లభించాడు’’ అన్నారు. ‘‘ఇప్పటివరకూ చేసిన సినిమాలతో రొమాంటిక్ హీరోగా ప్రూవ్ చేసుకున్నానని, ఈ సినిమాతో యాక్షన్ హీరోగా ప్రూవ్ చేసుకోవాలని శౌర్య అన్నప్పుడు ఆశ్చర్యపోయా. తను కథ బాగా రాసుకున్నాడు’’ అన్నారు రచయిత, దర్శకుడు బి.వియస్ రవి. రమణ తేజ మాట్లాడుతూ– ‘‘శౌర్య నటించిన విధానానికి హ్యాట్సాఫ్. మంచి సినిమాలో నన్ను భాగం చేసినందుకు ఆయనకు జీవితాంతం రుణపడి ఉంటాను’’ అన్నారు. ఉషా మూల్పూరి మాట్లాడుతూ– ‘‘శౌర్య కెరీర్లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్స్ వచ్చిన చిత్రంగా ‘అశ్వథ్థామ’ నిలిచినందుకు ఫుల్ హ్యాపీ. ఐరా క్రియేషన్స్‌లో ఇది బిగ్గెస్ట్ హిట్. ఇకముందు కూడా మా బ్యానర్ మంచి సినిమాలు అందిస్తుంది’’ అన్నారు. ‘‘ఐరా క్రియేషన్స్ ఏ సినిమా చేసినా టెక్నీషియన్లు, యాక్టర్లు అందరూ ఫ్యామిలీలా పనిచేస్తారు. అది వాళ్ల బలం’’ అన్నారు దర్శకురాలు నందినీ రెడ్డి. చిత్ర సమర్పకులు శంకర్ ప్రసాద్, లైన్ ప్రొడ్యూసర్ బుజ్జి, సినిమాటోగ్రాఫర్ మనోజ్‌రెడ్డి, ఎడిటర్ గ్యారీ, నటుడు ప్రిన్స్ తదితరులు పాల్గొన్నారు. -
దేనికైనా ఎమోషనే ముఖ్యం
‘‘మన దగ్గర థ్రిల్లర్ జానర్‌కి ఆడియన్స్ తక్కువ. మన ప్రేక్షకులకు ఎలివేషన్ కన్నా ఎమోషన్ ముఖ్యం. ఒక ఎమోషనల్ కథకు థ్రిల్లర్ అంశాలు జోడిస్తే అదే ‘అశ్వథ్థామ’ చిత్రం’’ అన్నారు దర్శకుడు రమణ తేజ. ఆయన దర్శకత్వంలో నాగశౌర్య, మెహరీన్ జంటగా నటించిన చిత్రం ‘అశ్వథ్థామ’. ఉషా మూల్పూరి నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా దర్శకుడు రమణ తేజ మాట్లాడుతూ – ‘‘మాది చిత్తూరులో మదనపల్లి. చిన్నప్పుడు చదువుకుంది మదనపల్లిలోనే. మా ఫ్యామిలీలో అందరం ఎక్కువగా సినిమాలు చూసేవాళ్లం. నాన్నగారికి చిరంజీవిగారంటే విపరీతమైన అభిమానం. నన్ను ఎక్కువగా సినిమాలకు తీసుకెళ్లేవారు. చిన్నప్పుడు చదువుల్లో చాలా చురుకుగా ఉండేవాణ్ణి. తమిళనాడులో ఇంజనీరింగ్ చేశాను. కాలేజ్‌లో ఉన్నప్పుడే సినిమాల్లోకి వెళ్లాలని బలంగా కోరిక కలిగింది. కాలేజీ రోజుల్లో తీసిన ఓ షార్ట్ ఫిల్మ్‌కి స్క్రీన్‌ప్లే వీక్ అనే కామెంట్స్ వచ్చాయి. ఆ తర్వాత అమెరికాలో ఎంబీఏ చేయడానికి వెళ్తున్నాను అని ఇంట్లో చెప్పి వెళ్లి ఫిల్మ్ కోర్స్ చేశాను. అక్కడ స్క్రీన్ రైటింగ్‌లో డిగ్రీ చేశాను. స్క్రీన్ ప్లే మీద అవగాహన సంపాదించాను. ‘టెడ్ 2’ అనే హాలీవుడ్ సినిమాకు అప్రెంటిస్‌గా వర్క్ చేశాను కూడా. తిరిగొచ్చాక ఓ సినీ ప్రమోషన్ కంపెనీలో వర్క్ చేస్తుండగా ‘ఛలో’ ప్రమోషన్స్‌లో నాగశౌర్య అన్న పరిచయమయ్యారు. అలా మా ప్రయాణం మొదలైంది. అప్పుడే శౌర్య అన్న ‘అశ్వథ్థామ’ కథ రాస్తున్నారు. అది పూర్తయ్యాక నువ్వే దర్శకుడిని అన్నారు. దర్శకుడిగా నాకు కావాల్సినంత ఫ్రీడమ్ ఇచ్చారు. శౌర్య అన్నయ్యతో ఈ ప్రయాణాన్ని మర్చిపోలేను’’ అన్నారు. -
సమాజంలో మహిళలకు రక్షణ లేదు
నాగశౌర్య హీరోగా నటించి, కథను అందించిన చిత్రం ‘అశ్వథ్థామ’. మెహరీన్ కథానాయిక. రమణ తేజ దర్శకత్వం వహించగా శంకర్ ప్రసాద్ సమర్పణలో ఉషా మూల్పూరి నిర్మించారు. జనవరి 31న ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా మెహరీన్ చెప్పిన విశేషాలు. ► తప్పు జరుగుతున్నప్పుడు అది తçప్పని చెప్పగలిగి, దాన్ని ఆపేవాడే అశ్వథ్థామ. సినిమాలో హీరో పాత్ర అలానే ఉంటుంది. మనందరిలోనూ ఒక అశ్వథ్థామ ఉంటాడు. ► ముంబైలో జరిగిన వాస్తవ సంఘటనతో నాగశౌర్య ఈ కథ రాశారు. సెట్లో కామ్‌గా ఉంటాడు శౌర్య. కెమెరా ఆన్ చేయగానే వేరే మనిషిలా మారిపోతాడు. ► రమణ తేజ ఈ కథ చెప్పగానే నాకు బాగా నచ్చింది. సమాజంలో జరుగుతున్నది కూడా ఇదే. ప్రస్తుతం సమాజంలో మహిళలకు రక్షణ లేదు. అప్పుడే పుట్టిన పాప నుంచి వందేళ్ల బామ్మగారి వరకూ ఎవ్వరికీ సురక్షితమైన వాతావరణం లేదు. సినిమా శక్తివంతమైన మాద్యమం. ఇలాంటి కథలను ప్రేక్షకులకు చెప్పాలి. ► ఇప్పటి వరకూ నేను ఇలాంటి పాత్ర చేయలేదు. నాగశౌర్య కూడా ఇంత సీరియస్ రోల్ చేయలేదు. మా ఇద్దరికీ ఇది కొత్త జానర్. సినిమా చాలా స్పీడ్‌గా, సీరియస్‌గా సాగుతుంది. కామెడీ, కమెడీయన్స్ ఎవ్వరూ ఉండరు. హీరో ప్రయాణంలో సహాయపడే పాత్ర నాది. ► జనవరిలో నా నుంచి వస్తున్న మూడో చిత్రం ‘అశ్వథ్థామ’. పండక్కి ‘ఎంత మంచివాడవురా!’, పటాస్ (తమిళం) విడుదలయ్యాయి. నెలాఖరుకి విడుదల కాబోతున్న ‘అశ్వథ్థామ’ మంచి విజయం సాధిస్తుంది అనుకుంటున్నాను. -
ఈ కథ రాస్తూ జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాను
‘‘మన ఇంట్లో ఉన్న ఆడవాళ్ల మీద చెయ్యేస్తే మనం ఎలా రియాక్ట్ అవుతామో ‘అశ్వథ్థామ’ సినిమాలో హీరో అదే చేస్తాడు. ఈ సినిమా అందరికీ నచ్చుతుంది అనుకుంటున్నాను. నేను ఈ స్థాయిలో ఉన్నానంటే కారణం నా కుటుంబమే’’ అన్నారు నాగశౌర్య. ఆయన కథ అందించి, హీరోగా నటించిన చిత్రం ‘అశ్వథ్థామ’. మెహరీన్ కథానాయిక. రమణ తేజ దర్శకత్వంలో ఈ సినిమాను ఉషా మూల్పూరి నిర్మించారు. జనవరి 31న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ఖమ్మంలో ప్రీ–రిలీజ్ ఈవెంట్ ఏర్పాటు చేశారు. నాగశౌర్య మాట్లాడుతూ – ‘‘ఇదో నిజాయితీ గల కథ. నా స్నేహితుడి చెల్లికి జరిగిన సంఘటన ఆధారంగా ఈ కథ రాసుకున్నాను. కథ రాస్తున్నాను అన్నప్పుడు అమ్మానాన్న ఎంతో సపోర్ట్ చేశారు. ఈ కథ రాస్తూ జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాను. నేను ఈ కథ రాయడానికి సమాజంలో చాలా సంఘటనలు ప్రేరేపించాయి’’ అన్నారు. ‘‘ఈ కథ అందర్నీ ఆలోచింపజేస్తుంది’’ అన్నారు మెహరీన్. ‘‘సహజంగా నటించే నటుల్లో నాగశౌర్య ఒకరు. ఈ సినిమా తప్పకుండా విజయం సాధించాలి’’ అన్నారు తెలంగాణ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్. ‘‘ఈ సినిమాలో కొత్త నాగశౌర్యని చూస్తారు. నన్ను నమ్మి ఈ అవకాశం ఇచ్చిన నాగశౌర్యకి థ్యాంక్స్’’ అన్నారు దర్శకుడు రమణ తేజ.‘‘ మంచి కథా బలంతో వస్తున్న చిత్రం అశ్వథ్థామ. అందరికీ ఈ సినిమా నచ్చుతుంది’’ అన్నారు లైన్ ప్రొడ్యూసర్ బుజ్జి. ‘‘సినిమాలో నాలుగు పాటలున్నాయి. అన్ని పాటలకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది’’ అన్నారు సంగీత దర్శకుడు శ్రీచరణ్ పాకాల. -
మంచి సినిమా చేశామనే అనుభూతి కలిగింది
కల్యాణ్‌రామ్ హీరోగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎంతమంచివాడవురా’. మెహరీన్ కథానాయికగా నటించారు. శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఉమేష్ గుప్తా, సుభాస్ గుప్తా నిర్మించిన ఈ చిత్రం బుధవారం విడుదలైంది. తమ సినిమాకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోందని చిత్రబృందం చెబుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా థ్యాంక్స్ మీట్లో కల్యాణ్‌రామ్ మాట్లాడుతూ–‘‘ఇతరుల బాధలు తనవి అనుకుని వారితో అనుబంధాన్ని పంచుకునే పాత్రలో నటించాను. ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోన్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక మంచి సినిమా చేశాననే అనుభూతి కలుగుతోంది. ఎప్పటికీ గుర్తుండి పోయే చిత్రంలో నటించాలనే కోరిక ఈ సినిమాతో తీరింది. నేను మర్చిపోలేని చిత్రాన్ని ఇచ్చారు సతీష్. ఈ చిత్రంలో నా నటన, డైలాగ్ డెలివరీ, స్టైల్ బాగున్నాయని మా కుటుంబ సభ్యులు మెచ్చుకున్నారు. ఇప్పటివరకు నా కెరీర్లో ఇదే ఉత్తమ చిత్రమని ప్రశంసించారు’’ అని అన్నారు. ‘‘కల్యాణ్‌రామ్‌గారితో ఓ మంచి సినిమా తీస్తానని నన్ను నమ్మి ప్రోత్సహించిన నిర్మాతలకు థ్యాంక్స్. కుటుంబ ప్రేక్షకుల కోసం తీసిన చిత్రం ఇది. ఈ సినిమా ఫలితం కోసం నిద్రపోకుండా ఎదురు చూశాం.మొదట్లో ఫెయిల్ అన్నారు. ఆ తర్వాత పాస్ అయ్యామని చెప్పారు. ఫస్ట్ షో తర్వాత సెకండ్ క్లాస్‌లో పాసయ్యామని చెప్పడం చాలా సంతోషాన్ని ఇచ్చింది. కల్యాణ్‌రామ్‌గారి కెరీర్లో బిగ్గెస్ట్ గ్రాసర్‌గా నిలిచింది’’ అని అన్నారు సతీష్ వేగేశ్న. ‘‘ప్రేక్షకులను మెప్పించే చిత్రం అవుతుందనే నమ్మకంతో ఈ సినిమా తీశాం. మా నమ్మకం నిజమైంది. మౌత్‌టాక్‌తో వసూళ్లు పెరుగుతున్నాయి. చక్కటి సినిమా తీసినందుకు గర్వపడుతున్నాను’’ అన్నారు శివలెంక కృష్ణప్రసాద్. ఈ కార్యక్రమంలో సీనియర్ నరేష్, తనికెళ్లభరణి తదితరులు పాల్గొన్నారు. -
ఇమేజ్ కోసం ఆలోచించను
‘‘సంక్రాంతి పండగంటే రైతుల పండగే కాదు.. మా సినిమావాళ్లకు కూడా పండగే. పెద్ద బడ్జెట్ సినిమాలతో పాటు మీడియం బడ్జెట్ సినిమాలు కూడా విడుదలవుతాయి. ఫ్యామిలీ అంతా కలిసి సినిమాలు చూస్తారు. అందుకే సంక్రాంతికి వస్తున్నాం’’ అని కల్యాణ్ రామ్ అన్నారు. ‘శతమానం భవతి’ ఫేమ్ వేగేశ్న సతీష్ దర్శకత్వంలో కల్యాణ్ రామ్, మెహరీన్ జంటగా నటించిన చిత్రం ‘ఎంత మంచివాడవురా’. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఆదిత్యా మ్యూజిక్ పతాకంపై ఉమేష్ గుప్త, సుభాష్ గుప్త నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ పంచుకున్న విశేషాలు... ► ‘ఎంత మంచివాడవురా..’ అనే పాట తాతయ్య (ఎన్టీఆర్) ‘నమ్మినబంటు’ చిత్రంలోనిది. డైరెక్టర్‌గారు ఈ సినిమాకి తొలుత ‘ఆల్ ఈజ్ వెల్’ అనే టైటిల్ అనుకున్నారు.. కానీ, ఆయన సినిమాల టైటిల్ తెలుగుదనంతో ఉండటమే కరెక్ట్ అనిపించి, కథను బట్టే ఈ టైటిల్‌ని పెట్టాం. ► వేర్వేరు మనస్తత్వాలు, ఆలోచనలు ఉన్న వ్యక్తుల జీవితాల్లోకి హీరో ఎలా ఎంట్రీ ఇచ్చాడు? వారిని ఎలా మార్చాడు? అనేది కథ. ఇతరులకు ఇవ్వటం అనే పాయింట్‌ను చూపించాం. మనుషులంతా మంచోళ్లే.. వారు చేసే తప్పును తెలియచెప్పాలన్నదే మా సినిమా. ► నేనెప్పుడూ ఇమేజ్ కోసం ఆలోచించలేదు. కథ నచ్చితే సినిమాలు చేస్తూ వచ్చాను. రిపీట్ కథ, క్యారెక్టర్ లేకుండా చూసుకుంటాను. ప్రేక్ష కులకు ఏదైనా కొత్తగా చూపించాలనుకుంటాను. క్యారెక్టర్, కథ కొత్తగా ఉంటే మనం కూడా కొత్తగా ఆలోచిస్తాం. సతీష్‌గారి ‘శతమానం భవతి’ సినిమా చూసిన నా భార్య.. ‘మంచి ఫీల్ గుడ్ మూవీ చూశాను.. మీరెందుకు కమర్షియల్ సినిమాలు చేస్తారు? ఇలాంటి సినిమాలు చేయొచ్చు కదా?’’ అన్నారు.. అలాంటి కథ వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను అన్నాను.. ‘ఎంత మంచివాడవురా’ తో కుదిరింది. ► మేం ఉమ్మడి కుటుంబం నుండి వచ్చాం. ఇంటికి చుట్టాలు వచ్చి వెళ్లిపోతుంటే చిన్నప్పుడు బాధగా అనిపించేది. ఇప్పుడు మా ఇంట్లో తొమ్మిది మంది ఉంటున్నాం. మా ఇంట్లో ఎలా ఉంటానో ఈ పాత్రని కూడా అలా చేశాను. నా రియల్ లైఫ్‌గా దగ్గరగా ఉంటుంది. తారక్‌కి నాకు మధ్య మా సినిమాల గురించి చిన్న చర్చ జరుగుతుంటుంది. ఈ సినిమా చేస్తున్నానని చెప్పగానే తను సంతోషపడ్డాడు. పూరి జగన్నాథ్‌గారు, అనిల్ రావిపూడితో పనిచేసినప్పుడు ఎంత కంఫర్ట్ ఫీలయ్యానో సతీష్‌గారితో పని చేసేటప్పుడు కూడా అలాగే ఫీలయ్యాను. -
ఈ నెల నాకు ట్రిపుల్ ధమాకా
‘‘ఎఫ్ 2’ సినిమాలో నేను చేసిన హనీ పాత్ర, ‘హనీ ఈజ్ ది బెస్ట్’ మేనరిజమ్ చాలా పాపులర్ అయ్యాయి. స్వతహాగా నాకు కామెడీ అంటే చాలా ఇష్టం. ఆ క్యారెక్టర్ నాకు చాలా బాగా కనెక్ట్ అయింది. ‘ఎంత మంచివాడవురా!’ సినిమాలో నా పాత్ర చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. చాలా మెచ్యూర్డ్‌గా ఉంటాను’’ అన్నారు మెహరీన్. కల్యాణ్‌రామ్, మెహరీన్ జంటగా సతీష్ వేగేశ్న తెరకెక్కించిన చిత్రం ‘ఎంత మంచివాడవురా!’. శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఉమేశ్ గుప్త, సుభాష్ గుప్త్త నిర్మించారు. ఈ నెల 15న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా మెహరీన్ చెప్పిన విశేషాలు. ► దర్శకుడు సతీష్ వేగేశ్న ఈ కథ చెప్పగానే అద్భుతం అనిపించింది. అన్ని ఎమోషన్స్‌ను చూపించా ల్సిన పాత్ర. ఇలాంటి రోల్ ఇదివరకెప్పుడూ చేయలేదు. నా పాత్ర పేరు నందు. ఫస్టాఫ్‌లో బబ్లీగా ఉంటుంది. సెకండాఫ్‌లో మెచ్యూర్డ్‌గా ఉంటా. నేను షార్ట్ ఫిలింస్ నిర్మి స్తుంటా. నా షార్ట్ ఫిల్మ్‌లో కల్యాణ్ రామ్‌గారు హీరోగా చేస్తారు. ► కేవలం కుటుంబ భావోద్వేగాలు మాత్రమే కాదు ప్రేమ, యాక్షన్.. ఇలా అన్ని అంశాలు మా సినిమాలో ఉన్నాయి. పండగకి వస్తున్న పండలాంటి సినిమా. కథ విని, ఈ పాత్ర నేను చేయగలనా? అని దర్శకుడిని అడిగాను. ‘చేయగలవనే నమ్మకం మాకు ఉంది’ అన్నారు. వాళ్ల నమ్మకాన్ని నిలబెట్టాననే అనుకుంటున్నాను. ► ఇది గుజరాతీ సినిమా ‘ఆక్సిజన్’ రీమేక్ అయినా తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేశారు దర్శకుడు. మాతృక చూస్తే ఆ పాత్ర తాలూకు ప్రభావం నా మీద పడుతుందని చూడలేదు. ఈ సినిమాలో ఓ సన్నివేశంలో మూడు పేజీల డైలాగ్ చెప్పాల్సి వచ్చింది. కష్టపడి నేర్చుకుని సింగిల్ టేక్‌లో పూర్తి చేశాను. ఈ సినిమా టైటిల్ కల్యాణ్‌రామ్‌గారికి సరిగ్గా సరిపోతుంది. ఆయన చాలా స్వీట్ పర్సన్. నిజాయితీగా ఉంటారు. ► సినిమా హిట్, ఫ్లాప్ మన చేతుల్లో ఉండదు. కథను నమ్మి సినిమా చేయడానికి అంగీకరిస్తాం. మంచి సినిమా అందించాలనుకుంటాం. ప్రేక్షకులకు నచ్చితేనే సినిమా సక్సెస్. ► సౌత్ సినిమాలతో బిజీగా ఉన్నాను. తెలుగు ఇండస్ట్రీ నాకు అమ్మతో సమానం. ప్రస్తుతానికి బాలీవుడ్ వెళ్లాలనే ఆలోచన లేదు. నా తమ్ముడు (గురు ఫతేహ్ ) బాలీవుడ్లో కరణ్ జోహార్ బేనర్ ద్వారా లాంచ్ అవుతున్నాడు. ► ఈ జనవరి నాకు ట్రిపుల్ ధమాకా. ‘ఎంత మంచివాడవురా!’ సంక్రాంతికి రిలీజ్ అవుతుంది. తమిళంలో ధనుష్‌తో చేసిన ‘పటాస్’ 16న విడుదలవుతుంది. జనవరి 31న ‘అశ్వథ్థామ’ విడుదలవుతుంది. ► ఎమోషనల్ సన్నివేశాలు బాగా చేయడం నా బలం. పాత్రకు పూర్తిగా కనెక్ట్ అయి నటించడానికి ప్రయత్నిస్తాను. అందుకే గ్లిజరిన్ కూడా అవసరం లేకుండా ఎమోషనల్ సన్నివేశాలు చేస్తాను. -
‘ఎంత మంచివాడవురా’ ప్రీ రిలీజ్ వేడుక
-
నా కల నిజమవుతోంది
‘కల్యాణ్ అన్న ఎన్నో వైవిధ్యమైన చిత్రాలు చేశారు. కమర్షియల్, థ్రిల్లర్, మాస్ సినిమాలు చేశారు. నాకు ఎప్పటి నుంచో ఓ వెలితి ఉండేది. ఒక మంచి కుటుంబ కథా చిత్రంలో అన్నని చూడాలని ఉండేది.. అది ‘ఎంత మంచివాడవురా’ చిత్రంతో ఈరోజు వేగేశ్న సతీష్‌గారి ద్వారా నిజమవుతున్నందుకు చాలా సంతోషంగా ఉంది’’ అని ఎన్టీఆర్ అన్నారు. కల్యాణ్ రామ్, మెహరీన్ జంటగా ‘శతమానం భవతి’ ఫేమ్ వేగేశ్న సతీష్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎంత మంచివాడవురా’. శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఆదిత్య మ్యూజిక్ పతాకంపై ఉమేష్ గుప్త, సుభాష్ గుప్త నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా బుధవారం హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథి ఎన్టీఆర్ మాట్లాడుతూ – ‘‘శివలెంక కృష్ణప్రసాద్‌గారు మా కుటుంబానికి ఒక నిర్మాత కాదు.. బాబాయ్‌తో (బాలకృష్ణ) ఎన్నో సినిమాలు తీసిన ఆయన మా కుటుంబంలో ఓ సభ్యుడు. అలాంటి కృష్ణప్రసాద్, ఉమేష్ గుప్తగారి నిర్మాణంలో ఓ మంచి సినిమా మీ ముందుకొస్తోంది. గోపీసుందర్‌గారు మంచి సంగీతం అందించారు. ఎంతో మంది నటీనటులు, సాంకేతిక నిపుణులు కలిసి చేసిన ఈ చిత్రం ఈనెల 15న విడుదలవుతోంది. మంచి మనసుతో మంచి చిత్రాన్ని ఆదరించేటటువంటి గొప్ప గుణం మీ అందరిలో ఉంది.. మన తెలుగు ప్రేక్షక దేవుళ్లలో ఉంది. మీరందరూ గొప్ప హృదయంతో, గొప్ప మనసుతో వీరు చేసిన ఈ ప్రయత్నానికి మీ సహాయ, సహకారాలు అందజేస్తారని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటన్నా. మీరందరూ మంచి ఆనందం, కోలాహలంతో ఉన్నారు.. ఇదే ఆనందం మీ ఇంటి వరకూ వెళ్లి పంచుకోండి.. ఇక్కడున్న మీ అందరి ప్రాణం మీ తల్లిదండ్రులకి, మీ అన్నాచెల్లెళ్లకి, ముందుగా మీ కుటుంబ సభ్యులకి, దాని తర్వాత నాకు, కల్యాణ్ అన్నకు, మా కుటుంబానికి ఎంతో అవసరం.. మీరు, మీ కుటుంబ సభ్యులందరూ ఎల్లప్పుడూ సుఖ సంతోషాలతో, ఆరోగ్యాలతో ఉండాలి. ఈ పండుగ వాతావరణంలో విడుదలవుతున్న ‘దర్బార్, సరిలేరు నీకెవ్వరు, అల.. వైకుంఠపురములో..’ తో పాటు మా ‘ఎంత మంచివాడవురా’ సినిమాలు అద్భుతమైన విజయాలు సాధించి, తెలుగు చిత్రసీమ ముందుకు వెళ్లేలా దోహద పడాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటూ.. జై ఎన్టీఆర్.. జోహార్ హరికృష్ణ’’ అన్నారు. కల్యాణ్ రామ్ మాట్లాడుతూ– ‘‘నిర్మాణంలోకి అడుగుపెడుతున్న ఉమేష్ గుప్త, సుభాష్ గుప్తగార్లను ఇండస్ట్రీకి స్వాగతం పలుకుతున్నాను. సంక్రాంతి అంటేనే సినిమాల పండగ. నేడు రజనీకాంత్‌గారి ‘దర్బార్’ విడుదలవుతోంది. 11న మహేశ్‌బాబుగారు, మా అనిల్ రావిపూడి ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా వస్తుంది. అల్లు అర్జున్ ‘అల.. వైకుంఠపురములో..’ ఈ నెల 12న విడుదలవుతుంది. అందరి సినిమాలూ బాగా ఆడాలని, మా సినిమా ఇంకా బాగా ఆడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’’ అన్నారు. ఉమేష్ గుప్త మాట్లాడుతూ– ‘‘ఎంత మంచివాడవురా’ సినిమా నిర్మించినందుకు చాలా గర్వంగా ఉంది. బాగా కష్టపడే టీమ్‌తో మా మొదటి సినిమాని తీసినందుకు సంతోషంగా ఉంది. కల్యాణ్‌రామ్ చాలా బాగా నటించారు. జాతీయ అవార్డు గ్రహీత వేగేశ్న సతీష్‌గారితో మా తొలి చిత్రం చేయడం అదృష్టం. 30ఏళ్లుగా మాకు సహకారం అందిస్తూ, ప్రోత్సహిస్తున్న చిత్ర పరిశ్రమవారికి ధన్యవాదాలు’’ అన్నారు. శివలెంక కృష్ణప్రసాద్ మాట్లాడుతూ – ‘‘నందమూరి కుటుంబం అంటేనే క్రమశిక్షణకు మారుపేరు. సీనియర్ ఎన్టీఆర్‌గారి నుంచి ఈ క్రమశిక్షణ అలాగే వస్తోంది. ఈ పండుగ రోజున ‘ఎంత మంచివాడవురా’ సినిమా వస్తోంది.. మనందరం ఎంజాయ్ చేద్దాం’’ అన్నారు. నిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ఈ సంక్రాంతి పోటీలో నందమూరి సినిమా కూడా నిలబడింది. ఉమేష్ గుప్తగారు నాకు ఇరవై ఏళ్లుగా మిత్రులు. ‘పటాస్, 118’ తర్వాత కల్యాణ్‌రామ్‌గారి ఈ సినిమా మా ఆధ్వర్యంలో విడుదలవుతోన్నందుకు చాలా సంతోషంగా ఉంది. కల్యాణ్‌గారికి ఆల్ ది బెస్ట్. మా ‘శతమానం భవతి’ దర్శకుడు సతీష్ సంక్రాంతికి వస్తున్నాడు.. తనకు ఆల్ ది బెస్ట్. అందరం కలిసి సంక్రాంతికి కుమ్మేద్దాం’’ అన్నారు. వేగేశ్న సతీష్ మాట్లాడుతూ– ‘‘నాకు జన్మనిచ్చిన నా తల్లిదండ్రులకు, రచయితగా జన్మనిచ్చిన ముప్పలనేని శివగారికి, నన్ను దర్శకునిగా చేసిన ఈవీవీ సత్యనారాయణ, ‘అల్లరి’ నరేశ్గార్లకు, ‘శతమానం భవతి’ సినిమా ద్వారా పునర్జన్మనిచ్చిన ‘దిల్’ రాజు, శిరీష్, లక్ష్మణ్గార్లకు థ్యాంక్స్.. వారందరూ లేకుంటే ఈ రోజు నేను ఈ వేదికపైన లేను. మీరందరూ ఇప్పుడు ఈ ఎన్టీఆర్‌గారికి అభిమానులు.. మా నాన్నగారు 1963లోనే సీనియర్ ఎన్టీఆర్‌గారికి అభిమానులు.. ఎన్టీఆర్ అభిమాన సంఘం ఉపాధ్యక్షులు కూడా. ఇద్దరి ఎన్టీఆర్‌లతో నేను ఫొటో దిగాను. నందమూరి హీరోతో నేను సినిమా చేసినందుకు మా నాన్నగారు ఉంటే చాలా సంతోషపడేవారు.. ఆయన లేనందుకు బాధగా ఉంది. ఎన్టీఆర్ మాస్ చేస్తే ‘సింహాద్రి’.. క్లాస్ చేస్తే ‘బృందావనం’.. క్లాసూ, మాసూ మిక్స్ చేస్తే ఒక ‘జనతా గ్యారేజ్, అరవింద సమేత’. కల్యాణ్‌రామ్‌గారు మాస్ చేస్తే ‘అతనొక్కడే’.. క్లాస్ చేస్తే ‘118’.. క్లాసూ, మాసూ మిక్స్ చేస్తే మా ‘ఎంత మంచివాడవురా’. ఇంతమంచి అభిమానులను సంపాదించుకున్న మా నందమూరి వాళ్లు ధన్యులు. ఈ సినిమాని 72రోజుల్లో పూర్తి చేయడానికి కారణం నా సాంకేతిక నిపుణులు. సినిమా చాలా బాగొచ్చింది.. ఈ సంక్రాంతికి హిట్ కొడుతున్నాం.. సినిమా గురించి సక్సెస్‌మీట్‌లో మాట్లాడతా’’ అన్నారు. మెహరీన్ మాట్లాడుతూ– ‘‘నేను నటించిన ‘ఎఫ్ 2’ విడుదలైన తర్వాత మరో మంచి సినిమా చేయాలని ఐదు నెలలు ఎదురుచూశాను. సతీష్‌గారు ఈ కథ చెప్పినప్పుడే ఇలాంటి పాత్ర చేసే అవకాశం నాకు మళ్లీ మళ్లీ రాదనిపించింది. భావోద్వేగాలు, అనురాగాలు, ఆలోచన పరిపక్వత ఉన్న నందులాంటి పాత్ర ఈ సినిమాలో నాకు లభించినందుకు సంతోషంగా ఉంది. ఈ సినిమా చిత్రీకరణలో నేను పాల్గొన్నట్లు లేదు.. మా కుటుంబంతో కలిసి పండగ చేసుకున్నట్లు ఉంది. అప్పుడే షూటింగ్ అయిపోయిందా? అనే భావన కలిగింది’’ అన్నారు. ఈ వేడుకలో నిర్మాతలు సుభాష్ గుప్త, మహేశ్ కోనేరు, నటులు శరత్‌బాబు, ‘శుభలేఖ’ సుధాకర్, రాజీవ్ కనకాల, ప్రవీణ్, ప్రభు, భద్రం, రచ్చ రవి, హీరోయిన్ నటాష దోషి, సంగీత దర్శకుడు గోపీ సుందర్, ‘ఆదిత్య’ మ్యూజిక్ ఆదిత్య, నిరంజన్ తదితరులు పాల్గొన్నారు. -
మంచివాడు
కల్యాణ్ రామ్, మెహరీన్ జంటగా ‘శతమానం భవతి’ ఫేమ్ సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎంత మంచివాడవురా’. ఆడియో రంగంలో అగ్రగామిగా వెలుగొందుతున్న ఆదిత్యా మ్యూజిక్ సంస్థ ఈ సినిమాతో నిర్మాణ రంగంలోకి దిగిన విషయం తెలిసిందే. శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఉమేష్ గుప్తా, సుభాష్ గుప్తా నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 15న విడుదలవుతోంది. సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఎలాంటి కట్స్ లేకుండా క్లీన్ ‘యు’ సర్టిఫికెట్‌ని పొందింది. సతీశ్ వేగేశ్న మాట్లాడుతూ– ‘‘ఈ సంక్రాంతికి క్లీన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా మా సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తుంది. హృదయాన్ని హత్తుకునే భావోద్వేగాలతో సాగే కుటుంబ కథా చిత్రమిది’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: రాజ్ తోట, సంగీతం: గోపీ సుందర్. -
లవర్ బాయ్ ఇమేజ్ అంటే చిరాకు
‘‘ఛలో’ సినిమా టీజర్ ఇక్కడే(రామానాయుడు ప్రివ్యూ థియేటర్) విడుదల చేశాం.. బ్లాక్ బస్టర్ అయింది. ‘నర్తనశాల’ టీజర్ కూడా ఇదే ప్లేస్‌లో రిలీజ్ చేశాం.. ఫ్లాప్ అయింది. ఇప్పుడు ‘అశ్వథ్థామ’ టీజర్‌ని కూడా ఇక్కడే రిలీజ్ చేస్తున్నాం.. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని గర్వంగా చెప్పగలను. నా తల్లిదండ్రులు గర్వంగా తలెత్తుకునేలా ఈ సినిమా చేశాను’’ అని నాగశౌర్య అన్నారు. రమణ తేజని డైరెక్టర్‌గా పరిచయం చేస్తూ నాగశౌర్య, మెహరీన్ జంటగా నటించిన చిత్రం ‘అశ్వథ్థామ’. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మించిన ఈ సినిమా జనవరి 31న విడుదలవుతోంది. ఈ సినిమా టీజర్‌ని హీరోయిన్ సమంత ట్విట్టర్లో విడుదల చేశారు. అలాగే రామానాయుడు స్టూడియోలో జరిగిన టీజర్ విడుదల కార్యక్రమంలో నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘ఢిల్లీ, ముంబైలలో అమ్మాయిలపై జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా ‘అశ్వథ్థామ’ కథను రాశా. ‘ఛలో’ కథ నేనే రాసినా పేరు వేసుకోలేదు. నాకు కథలు రాయడం, చెప్పడం ఇష్టం. నాకు లవర్ బాయ్ ఇమేజ్ అంటే చాలా చిరాకు.. అందుకే ఈ చిత్రంలో దాని నుంచి పూర్తీగా బయటికి వచ్చి రఫ్‌గా ఉండే పాత్ర చేశాను’’ అన్నారు. ‘‘నాగశౌర్య మంచి కథ రాశారు. ఈ చిత్రంలో నాగశౌర్య విశ్వరూపం చూస్తారు’’ అన్నారు రమణ తేజ. ‘‘కథని నమ్మి ఈ సినిమా తీశాం’’ అన్నారు శంకర్ ప్రసాద్ ముల్పూరి. ‘‘ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, సాంగ్స్‌కి మంచి స్పందన వస్తోంది. మా సినిమా మంచి విజయం సాధిస్తుంది’’ అన్నారు ఉషా ముల్పూరి. ఈ కార్యక్రమంలో లైన్ ప్రొడ్యూసర్ బుజ్జి, సంగీత దర్శకుడు శ్రీ చరణ్ పాకాల, ఎడిటర్ గ్యారీ, కెమెరామెన్ మనోజ్ రెడ్డి, డైరెక్టర్ బి.వి.యస్.రవి తదితరులు పాల్గొన్నారు. -
కళ్యాణ్‌రామ్‌కి సరిపోయే టైటిల్ ఇది
‘‘మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలే అని కార్ల్ మార్క్స్ అన్నాడు. కానీ మానవ సంబంధాలు హార్దిక సంబంధాలుగా ఉండాలి’’ అని దర్శకుడు సతీష్ వేగేశ్న అన్నారు. కళ్యాణ్ రామ్, మెహరీన్ జంటగా సతీష్ వేగేశ్న దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఎంత మంచివాడవురా’. శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఆదిత్యా మ్యూజిక్ అధినేత ఉమేష్ గుప్తా నిర్మించారు. జనవరి 15న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో కళ్యాణ్ రామ్ మాట్లాడుతూ – ‘‘ఎంత మంచి వాడవురా’ నా మనసుకి దగ్గరైన సినిమా. జనవరి మొదటివారంలో ప్రీ–రిలీజ్ వేడుకను ఏర్పాటు చేస్తాం’’ అన్నారు. ‘‘సంక్రాంతి రైతుల పండగ. అలాగే సంక్రాంతి సినిమావాళ్ల పండగ కూడా. ప్రస్తుత పరిస్థితుల్లో మనుషుల మధ్య సత్సంబంధాలు తగ్గిపోతున్నాయి. వాటి గురించి ఈ సినిమాలో బాగా చర్చించారు దర్శకుడు. కళ్యాణ్‌రామ్ కెరీర్లో ఇది బెంచ్‌మార్క్ సినిమా అవుతుంది’’ అన్నారు నరేశ్. ‘‘ఈ టైటిల్ పెట్టగానే అందరూ బావుంది అన్నారు. ఇండస్ట్రీలో చాలా మంది ‘కళ్యాణ్‌రామ్‌కి పర్ఫెక్ట్ టైటిల్’ అన్నారు. ఆయన అందరితో చాలా బావుంటారు. నిర్మాతలు ఏది అడిగినా కాదనకుండా ఇచ్చారు. కళ్యాణ్‌రామ్‌గారి గత సినిమాలతో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. ఈ సినిమా పాయింట్‌ను ఓ గుజరాతీ సినిమా నుంచి తీసుకున్నాం’’ అన్నారు సతీష్ వేగేశ్న. ‘‘సతీష్‌గారు కథ చెప్పగానే మాటలురాలేదు. ఈ కథ అందర్నీ కదిలిస్తుంది. ఈ సినిమా టీమ్ అందరూ మంచివాళ్లే’’ అన్నారు మెహరీన్. ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు గోపీసుందర్, శివలెంక కృష్ణప్రసాద్, ఉమేష్ గుప్తా, చిత్రబృందం పాల్గొన్నారు. -
నిన్నే నిన్నే
నాగశౌర్య కథ అందించి, హీరోగా నటించిన చిత్రం ‘అశ్వథ్థామ’. ఈ చిత్రంతో రమణ తేజ దర్శకుడిగా పరిచయమవుతున్నారు. మెహరీన్ హీరోయిన్గా నటించారు. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేష¯ŒŒ్స బ్యానర్‌పై ఉషా ముల్పూరి నిర్మించిన ఈ సినిమా జనవరి 31న విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు చిత్రబృందం. అందులో భాగంగా శ్రీచరణ్ పాకాల సంగీతం అందించిన ‘నిన్నే నిన్నే...’ పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. ‘‘ఇప్పటి వరకు విడుదల చేసిన పోస్టర్స్, మోషన్ పోస్టర్స్‌తో పాటు ‘నిన్నే నిన్నే..’ తొలి లిరికల్ వీడియో సాంగ్ ప్రోమోకు ప్రేక్షకుల నుంచి మంచి స్పందన వచ్చింది. ప్రస్తుతం మా సినిమా పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. నాగశౌర్య మంచి కథను అందించాడు. ఈ సినిమా పేరుని తన ఛాతిపై పచ్చబొట్టుగా పొడిపించుకున్నాడు శౌర్య. మా సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: మనోజ్ రెడ్డి, సంగీతం: శ్రీచరణ్ పాకాల, లైన్ ప్రొడ్యూసర్: బుజ్జి. -
క్లాస్.. మాస్ అశ్వథ్థామ
‘‘సమాజంలో జరుగుతున్న కొన్ని వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన చిత్రం ‘అశ్వథ్థామ’. మా అబ్బాయి నాగశౌర్య మంచి కథ రాశాడు.. దాన్ని డైరెక్టర్ చక్కగా తెరకెక్కించారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతున్నాయి’’ అన్నారు నిర్మాత ఉషా ముల్పూరి. నాగశౌర్య, మెహరీన్ జంటగా నూతన దర్శకుడు రమణ తేజ తెరకెక్కించిన చిత్రం ‘అశ్వథ్థామ’. శంకర్ ప్రసాద్ ముల్పూరి సమర్పణలో ఐరా క్రియేషన్స్ పతాకంపై ఉషా ముల్పూరి నిర్మించిన ఈ సినిమా జనవరి 31న విడుదల కానుంది. శంకర్ ప్రసాద్ ముల్పూరి మాట్లాడుతూ– ‘‘అటు క్లాస్ ఇటు మాస్ ఆడియన్స్‌ని అలరించాలనే ఉద్దేశంతో ఈ సినిమాలో యాక్షన్ సన్నివేశాల్ని కాస్త ఎక్కువగానే తీశాం. ‘కేజీఎఫ్’ సినిమాకి ఫైట్స్ కంపోజ్ చేసిన అన్బు–అరివు మా సినిమాకి పనిచేశారు. ఈ సినిమాలో కొత్త నాగశౌర్యను చూస్తారు’’ అన్నారు. ‘‘నాకు ఈ అవకాశం ఇచ్చిన ఐరా క్రియేషన్స్ వారికి థ్యాంక్స్. నన్ను నమ్మి దర్శకత్వ బాధ్యతలు అప్పగించిన నాగశౌర్యకి కృతజ్ఞతలు. మా సినిమా అందరికీ నచ్చుతుందని భావిస్తున్నా’’ అన్నారు రమణ తేజ. ‘‘అనుకున్న టైమ్‌లో సినిమాను పూర్తి చేశాం. మేం అనుకున్న దానికంటే ఔట్పుట్ బాగా వచ్చింది. ఇందుకు సాంకేతిక నిపుణులకు ధన్యవాదాలు’’ అని సహ నిర్మాత బుజ్జి అన్నారు. -
ఏ మలుపు ఎప్పుడొస్తుందో చెప్పలేం
‘‘చాణక్య’ సినిమా చాలా బాగా వచ్చింది. తొలిసారి గూఢచారి పాత్ర చేశా. ఈ సినిమాలో వినోదం, భావోద్వేగాలు, యాక్షన్.. అన్నీ సమపాళ్లలో ఉంటాయి. తప్పకుండా ప్రేక్షకుల అంచనాలను చేరుకుంటాం’’ అన్నారు గోపీచంద్. తిరు దర్శకత్వంలో గోపీచంద్, మెహరీన్ జంటగా నటించిన చిత్రం ‘చాణక్య’. ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా నేడు విడుదలవుతోంది. ఈ సందర్భంగా గోపీచంద్ చెప్పిన విశేషాలు. ► తిరు చెప్పిన ‘చాణక్య’ స్టోరీ చాలా ఆసక్తిగా అనిపించింది. సినిమా ప్రారంభం నుంచి చివరి వరకూ ప్రేక్షకులకు తర్వాత ఏం జరుగుతుందనే ఎగై్జట్‌మెంట్‌తో పాటు టెన్షన్ ఉంటుంది. ఇందులో ఎంటర్టైనింగ్ లవ్ ట్రాక్ కూడా ఉంటుంది. మాస్, క్లాస్.. ఏ జోనర్ అయినా యాక్షన్ కామనే. ఇందులో మంచి యాక్షన్ ఉంది. మంచి సినిమా తీశామని యూనిట్ అంతా సంతోషంగా ఉన్నాం. ► ఈ సినిమాలో నా లుక్ చాలా కొత్తగా ఉంటుంది. కెమెరామేన్ వెట్రి పళనిస్వామి నన్ను చాలా అందంగా చూపించారు. మంచి విజువల్స్ ఇచ్చారు. ‘గౌతమ్ నంద’లో గెడ్డంతో కనిపించినా, ‘చాణక్య’లో మాత్రం వేరే స్టైల్ గెడ్డంతో ఉంటా. సరదాగా నేను గెడ్డం పెంచాను. ఈ లుక్ చాలా బాగుందని తిరు చెప్పడంతో అదే కంటిన్యూ చేశాను. స్పై ఏజెంట్స్ జీవితం ఎలా ఉంటుంది? అనే నేపథ్యంలో కథ ఉంటుంది. గతంలో వచ్చిన గూఢచారి సినిమాలకు భిన్నంగా ఉంటుంది. ఇందులో నా పాత్ర పేరు అర్జున్. రెండు షేడ్స్ ఉంటాయి. ► మాకు బాగా దగ్గరైన వారికి ‘చాణక్య’ ప్రివ్యూ వేశాం. వారంతా సినిమా చాలా బాగుందన్నారు. సినిమా చూశాక ప్రేక్షకుల నుంచి కూడా ఇదే మాట వస్తుందనే నమ్మకం ఉంది. విదేశాల్లో ఉండటం వల్ల ఈ సినిమాని నా ఫ్రెండ్ ప్రభాస్ చూడలేదు. నా నుంచి అభిమానులు, ప్రేక్షకులు కోరుకునే అంశాలన్నీ ఈ సినిమాలో ఉంటాయి. ► ‘చాణక్య’ సినిమాని మేలో విడుదల చేయాలనుకున్నాం. అయితే చివరి రోజు షూటింగ్లో బైక్ స్కిట్ అవడంతో నాకు బాగా గాయాలయ్యాయి. దాంతో షూటింగ్ ఆగిపోయి, విడుదలకు మూడు నెలలు ఆలస్యం అయింది. ‘సైరా’ ప్యాన్ ఇండియన్ సినిమానే. అయితే దసరా పండగ సమయం కావడంతో రెండు మూడు సినిమాలు ఆడేందుకు అవకాశం ఉంటుంది. అందుకే మా చిత్రం కూడా విడుదల చేస్తున్నాం. ► నాకు కొంచెం సిగ్గెక్కువ. అందుకే సెట్స్‌లో త్వరగా ఎవరితోనూ మాట్లాడను. అది హీరోయిన్ అయినా? ఎవరైనా సరే. మన కెరీర్లో ఏ సినిమా ఏ మలుపు తిప్పుతుందో ఎవరికీ తెలియదు. మా వరకూ కష్టపడి మంచి సినిమా చేస్తాం. విజయాన్ని నిర్ణయించేది ప్రేక్షకులే. అయితే నా కెరీర్‌కి ‘చాణక్య’ సినిమా ప్లస్ అవుతుందని మాత్రం కచ్చితంగా చెప్పగలను. అందులో ఎటువంటి అనుమానం లేదు. ► మా సినిమాకి నేపథ్య సంగీతం వెన్నెముకలాంటిది. చక్కగా కుదిరింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్స్‌లోని డైలాగులకు మంచి స్పందన వస్తోంది. సినిమాలోనూ చాలా మంచి డైలాగులున్నాయి. నా కెరీర్లో చాలా మంది తమిళ డైరెక్టర్స్‌తో సినిమాలు చేశా. నాకు కథ ముఖ్యం.. భాష కాదు. డైరెక్టర్ తిరు మంచి ప్రతిభావంతుడు. తెలుగు నుంచి వెళ్లి తమిళ్లో సెటిల్ అయ్యాడు. తనతో పని చేయడం సౌకర్యంగానే అనిపించింది. అనిల్ సుంకరగారు ప్యాషనేట్ నిర్మాత. ప్రేక్షకులకు ఇంకా బాగా ఏం ఇవ్వగలం? అని ప్రతిరోజూ ఆలోచిస్తుంటారాయన. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి అవసరం. ► మీరు ప్యాన్ ఇండియన్ సినిమా ఎప్పుడు చేస్తున్నారు? అనే ప్రశ్నకు గోపీచంద్ బదులిస్తూ.. ‘తెలుగులో ప్యాన్ ఇండియన్ సినిమాలకు ఈ మధ్యే గేట్లు తెరుచుకున్నాయి. నిజంగా ఇది చాలా సంతోషం. సమయం వచ్చినప్పుడు చేద్దాం (నవ్వుతూ)’ అన్నారు. ప్రస్తుతం బిను సుబ్ర మణ్యం దర్శకత్వంలో బీవీఎస్ఎన్ ప్రసాద్‌గారి బ్యానర్లో ఓ సినిమా చేస్తున్నా. అది పూర్తయ్యాకే సంపత్ నంది సినిమా మొదలవుతుంది. ఈ రెండూ మంచి కథలే. -
ఆ సినిమాతో పోలిక లేదు
‘‘మాది ఆంధ్ర–తమిళనాడు బోర్డర్లోని ఓ గ్రామం. మాకు చిత్తూరు కేవలం 29 కిలోమీటర్లు. దీంతో చిన్నప్పటి నుంచి తెలుగు సినిమాలు చూస్తూ పెరిగాను. ముఖ్యంగా చిరంజీవిగారి సినిమాలు చాలా చూశాను’’ అని దర్శకుడు తిరు అన్నారు. గోపీచంద్, మెహరీన్ జంటగా తిరు దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘చాణక్య’. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా తిరు మాట్లాడుతూ– ‘‘డైరెక్టర్ శివ, నేను ఓ తమిళ చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్స్‌గా చేశాం. శివ దర్శకత్వం వహించిన ‘శౌర్యం’ చిత్రం నుంచి గోపీగారితో నాకు పరిచయం ఉంది. ‘శౌర్యం’ టైమ్‌లోనే గోపీగారితో ఒక మంచి యాక్షన్ మూవీ చేయాలనుకున్నాను. ‘చాణక్య’ కథ ఆయనకు నచ్చడంతో ఈ సినిమా రూపొందింది. ఈ చిత్రం స్క్రీన్‌ప్లే రాసుకోవడానికి ముందు కొన్ని గూఢచారి సంస్థలైన ‘ఐ ఎస్ఐ, సీఐఏ, రా’ వంటి వాటి గురించి బాగా చదివాను. స్పై ఏజెంట్స్ ఎలా ఉంటారు? వారి బాడీ లాంగ్వేజ్ ఏంటి? ఇలాంటి చాలా విషయాలపై పరిశోధన చేసి కథ రాసుకున్నా. ఓ రకంగా ఈ సినిమా చేయడానికి రవీంద్ర అనే ఒక స్పై నాకు స్ఫూర్తి. వాస్తవికతకు దగ్గరగా, వాణిజ్య అంశాలు మిస్ కాకుండా తెరకెక్కించాను. రా ఏజెంట్ చూసినా సంతప్తి పడేలా ఈ చిత్రం ఉంటుంది. మా సినిమాని సల్మాన్ ఖాన్ ‘ఏక్తా టైగర్’ చిత్రంతో పోల్చుతున్నారు. నిజానికి ఇది కొత్త కథ, సినిమా చూస్తే అర్థం అవుతుంది. ఈ సినిమా చివరి రోజు ఫైట్ సన్నివేశంలో గోపీగారికి పెద్ద గాయం అయినా చాలా ధైర్యంగా ఉన్నారు. నిర్మాతలు, నేను ఈ చిత్రం విజయం పట్ల చాలా ఆశాభావంతో ఉన్నాం. తెలుగు, తమిళ భాషల్లో కొన్ని ఆఫర్స్ ఉన్నాయి. కానీ, ‘చాణక్య’ రిలీజ్ తర్వాత వాటి గురించి ఆలోచిస్తా’ అన్నారు. -
డేట్ ఫిక్స్
వెండితెరపై ‘చాణక్య’గా తన సత్తా చూపించడానికి సిద్ధమయ్యారు గోపీచంద్. తిరు దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘చాణక్య’. మెహరీన్, జరీన్ ఖాన్ కథానాయికలు. రామబ్రహ్మం సుంకర ఈ సినిమా నిర్మించారు. అజయ్ సుంకర సహ–నిర్మాత. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయి. దసరా సందర్భంగా ఈ సినిమాను విడుదల చేయాలనుకున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమాను అక్టోబరు 5న విడుదల చేయబోతున్నామని శనివారం చిత్రబృందం ప్రకటించింది. ‘‘ఇటీవల విడుదల చేసిన టీజర్, పాటలకు మంచి స్పందన లభిస్తుండటంతో సినిమాపై అంచనాలు పెరుగుతున్నాయి. ఈ చిత్రం ప్రేక్షకులకు తప్పక నచ్చుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరామన్: వెట్రి పళనీ స్వామి. -
పండగకి వస్తున్నాం
‘‘అనిల్ సుంకర ప్యాషనేట్ నిర్మాత అని విన్నాను. గతంలో మంచి ఎంటర్టైన్మెంట్ సినిమాలు చేశారు. ఖర్చుకు వెనకాడకుండా చాలా రిచ్‌గా ఈ చిత్రాన్ని నిర్మించారు. మళ్లీ ఆయనతో సినిమా చేస్తాను’’ అన్నారు గోపీచంద్. ఏకే ఎంటర్టైన్మెంట్స్పై తిరు దర్శకత్వంలో రామబ్రహ్మం నిర్మించిన చిత్రం ‘చాణక్య’. గోపీచంద్, మెహరీన్, జరీన్ ఖాన్ నటించారు. దసరాకి చిత్రం విడుదల కానున్న సందర్భంగా నిర్వహించిన సమావేశంలో గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘రెండేళ్ల క్రితం దర్శకుడు తిరు చెప్పిన కథ ఇది. నాకు బాగా నచ్చింది. అయితే కొన్ని మార్పులు చెప్పాను. అన్నీ సరిచేసి అద్భుతంగా స్టోరీ రెడీ చేశాడు. డైలాగ్స్, సీన్స్ అన్నీ గ్రిప్పింగ్‌గా ఉంటాయి. హీరోయిన్ మెహరీన్‌తో లవ్ ట్రాక్ సీన్స్ ప్రేక్షకులకు కనెక్ట్ అవుతాయి’’ అన్నారు. అనిల్ సుంకర మాట్లాడుతూ– ‘‘గోపీచంద్ మంచి వ్యక్తి. ఆయన సపోర్ట్ చెయ్యటం వల్లే ఈ సినిమా త్వరగా పూర్తయింది. తిరుకి మంచి భవిష్యత్తు ఉంటుంది’’ అన్నారు. తిరు మాట్లాడుతూ– ‘‘తమిళంలో నాలుగు సినిమాలు చేశాను. తెలుగులో ఇది నా మొదటి సినిమా. ఈ చిత్రంలో రా ఏజెంట్ పాత్రలో గోపీచంద్ కనిపిస్తారు. ఈ షూటింగ్ రాజస్తాన్‌లో జరిపినప్పుడు గోపీచంద్‌కి అనుకోకుండా ప్రమాదం జరిగింది. హాస్పిటల్‌కి తీసుకెళ్లిన తర్వాత ఐ.సి.యులో పెట్టారు. అయితే తక్కువ సమయంలో కోలుకుని షూటింగ్ పూర్తి చేశారు’’ అన్నారు. ‘‘యాక్షన్‌ను కొత్త పద్ధతిలో చేయించారు దర్శకుడు తిరు. గోపీచంద్ ఓ కొత్త జోనర్లో చేసిన చిత్రమిది’’ అన్నారు అబ్బూరి రవి. -
నేనొస్తున్నా
‘‘సార్ మనం (గూఢచారులు) రెండు లైఫ్‌లు లీడ్ చేస్తుంటాం. ఒకటి అబద్ధం. రెండోది నిజం’. ‘నా పేరు అర్జున్, ఐయామ్ యాన్ ఇండియన్’. ‘నీ గుండెల్లో దమ్ముంటే అక్కడే ఆగు బే, నేను వస్తున్నా’’ అంటూ పవర్ఫుల్ స్పైగా ‘చాణక్య’ సినిమాలో డైలాగ్స్ చెబుతున్నారు గోపీచంద్. తిరు దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘చాణక్య’. మెహరీన్, జరీనా ఖాన్ హీరోయిన్లు. రామ బ్రహ్మం సుంకర నిర్మాత. స్పై థ్రిల్లర్‌గా రూపొందిన ఈ చిత్రం టీజర్ సోమవారం విడుదలయింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న ఈ సినిమాను దసరాకు విడుదల చేయాలనుకుంటున్నారు. ఈ సినిమాకు కెమెరా: వెట్రి, సంగీతం: విశాల్ చంద్రశేఖర్. -
ఫారిన్లో స్టెప్పులు
‘రా’ (రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్) ఏజెంట్‌గా తన తెలివితేటలతో ప్రత్యర్థుల ఎత్తులను చిత్తు చేశాడు చాణక్య. ఈ జోష్‌లో ప్రేయసితో కలిసి ఫారిన్లో స్టెప్పులేస్తున్నారు. గోపీచంద్ హీరోగా తిరు దర్శకత్వంలో ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్న చిత్రం ‘చాణక్య’. ఈ చిత్రంలో మెహరీన్, జరీన్ ఖాన్ కథానాయికలుగా నటిస్తున్నారు. అజయ్ సుంకర సహనిర్మాత. ఈ సినిమాలో గోపీచంద్ ‘రా’ ఏజెంట్‌గా నటిస్తున్నారని సమాచారం. ఈ చిత్రం టాకీ పార్ట్ పూర్తయింది. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ ఇటలీ, మిలాన్‌లోని అందమైన పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. పాటలను చిత్రీకరిస్తున్నారు. రాజు సుందరం కొరియోగ్రాఫర్‌గా చేస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: వెట్రి మారన్. -
సంక్రాంతి బరిలో మంచోడు
‘118’ వంటి హిట్ సినిమా తర్వాత కల్యాణ్ రామ్ హీరోగా రూపొందుతోన్న చిత్రం ‘ఎంత మంచివాడవురా’. మెహరీన్ కథానాయిక. ‘శతమానం భవతి’ సినిమాతో జాతీయ అవార్డు గెలుచుకున్న సతీశ్ వేగేశ్న దర్శకత్వం వహిస్తున్నారు. శ్రీదేవి మూవీస్ అధినేత శివలెంక కృష్ణ ప్రసాద్ సమర్పణలో ఆదిత్య మ్యూజిక్ పతాకంపై ఉమేష్ గుప్త, సుభాష్ గుప్త నిర్మిస్తున్న ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయింది. ఉమేష్ గుప్త మాట్లాడుతూ– ‘‘ఎంత మంచివాడవురా’ టైటిల్ ప్రకటించినప్పుడు మంచి స్పందన వచ్చింది. అదే పాజిటివ్ వైబ్స్‌తో అనుకున్న ప్లానింగ్‌లో చిత్రీకరణ జరుగుతోంది. ఈ నెల 26 నుంచి సెప్టెంబర్ 22 వరకు రెండో షెడ్యూల్‌ను తణుకు, రాజమండ్రి పరిసర ప్రాంతాల్లో చిత్రీకరించనున్నాం. అక్టోబర్‌లో హైదరాబాద్‌లో, నవంబర్‌లో చిక్‌మంగళూర్ ప్రాంతాల్లో చిత్రీకరణ చేయనున్నాం. సంక్రాంతికి చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. ‘‘మంచి కథ, మంచిహీరో, మంచి టీమ్, మంచి ఫీల్‌తో ఈ సినిమా చేస్తున్నాం. టైటిల్‌ని బట్టి హీరో పాత్ర ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు’’ అన్నారు సతీష్ వేగేశ్న. -
ఏజెంట్ చాణక్య
‘చాణక్య’ ఎత్తులకు పై ఎత్తులు వేస్తాడు. దేన్నైయినా విశ్లేషించగలుగుతాడు. అతను పరిశోధన మొదలుపడితే ఏ కేస్ అయినా పరిష్కారం కావాల్సిందే. మరి.. చాణక్య ఎలాంటి ప్లాన్లు వేశాడు? అనేది వెండితెరపై చూసి తెలుసుకోవాల్సిందే. గోపీచంద్ హీరోగా తిరు దర్శకత్వంలో ‘చాణక్య’ అనే చిత్రం తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇందులో మెహరీన్, జరీన్‌ఖాన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ‘రా’ (రీసెర్చ్ అండ్ ఎనాలిసిస్ వింగ్) ఏజెంట్ పాత్రలో గోపీచంద్ నటిస్తున్నారని తెలిసింది. తాజాగా ఈ సినిమాలో గోపీచంద్ కొత్త లుక్స్‌ను విడుదల చేశారు. ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తయింది. పాటలను విదేశాల్లో చిత్రీకరించడానికి ప్లాన్ చేస్తున్నారు. డబ్బింగ్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. సెప్టెంబర్‌లో ఈ సినిమాను విడుదల చేయాలను కుంటున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్ సహ–నిర్మాతలు. ఈ చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: కిషోర్ గిరికిపాటి. -
ఎంత మంచివాడో
అక్కినేని నాగేశ్వరరావు, సావిత్రి జంటగా ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వంలో వచ్చిన ‘నమ్మినబంటు’ చిత్రంలోని ‘ఎంత మంచి వాడవురా.. ఎన్ని నోళ్ల పొగడుదురా...’ పాట ఎంత పాపులర్ అయిందో తెలిసిందే. 1960లో విడుదలైన ఆ సినిమా పాట ప్రస్తావన ఇప్పుడెందుకు అనుకుంటున్నారా? కల్యాణ్‌రామ్ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రానికి ‘ఎంత మంచి వాడవురా’ టైటిల్ ఖరారు చేశారు. శుక్రవారం ఆయన పుట్టినరోజు సందర్భంగా ఈ టైటిల్ టీజర్‌ని రిలీజ్ చేశారు. మెహరీన్ కథానాయిక నటిస్తున్నారు. సతీశ్ వేగేశ్న దర్శకత్వంలో ఉమేష్ గుప్తా సమర్పణలో ఆదిత్య మ్యూజిక్, శ్రీదేవి మూవీస్ పతాకాలపై సుభాష్ గుప్త, శివలెంక కృష్ణప్రసాద్ ఈ సినిమా నిర్మిస్తున్నారు. చిత్రవిశేషాలను నిర్మాత చెబుతూ– ‘‘మా హీరో కల్యాణ్‌రామ్ స్వతహాగా మంచి మనిషి. ఈ చిత్రంలో ఆయన పాత్ర కూడా ఆ విషయాన్నే ప్రతిబింబిస్తుంది. అందుకే ‘ఎంత మంచి వాడవురా’ టైటిల్ ఖరారు చేశాం. ఈ నెల 24న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. హైదరాబాద్, రాజమండ్రి పరిసర ప్రాంతాలు, ఊటీలో నిరవధికంగా చిత్రీకరణ జరుపుతాం’’అన్నారు. ‘‘మా కథకు సరిపోయే టైటిల్ ఇది. దీన్నిబట్టే హీరో పాత్ర ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు’’ అన్నారు సతీష్ వేగేశ్న. వి.కె.నరేశ్, సుహాసిని, తనికెళ్ల భరణి, పవిత్రా లోకేశ్, రాజీవ్ కనకాల, ‘వెన్నెల’ కిశోర్, ప్రవీణ్, ప్రభాస్ శ్రీను తదితరులు నటించనున్న ఈ చిత్రానికి కెమెరా: రాజ్ తోట, సంగీతం: గోపీ సుందర్. -
గోపీచంద్ ‘చాణక్య’ అప్డేట్
హీరో గోపీచంద్ నటిస్తోన్న యాక్షన్ స్పై థ్రిల్లర్ ‘చాణక్య’. రీసెంట్గా గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. తాజా గోపీచంద్ గడ్డంతో ఉన్న మ్యాచో లుక్‌ను విడుదల చేశారు. గోపీచంద్ సరసన మెహరీన్ హీరోయిన్గా నటిస్తోన్న ఈ చిత్రాన్ని తిరు దర్శకత్వంలో తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతుంది. ఈ నెలాఖరుకి టాకీ పార్ట్ పూర్తవుతుంది. మూడు పాటల చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంటుంది. విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రానికి వెట్రి సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. ఎ.కె.ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. -
ఎమోషనల్ జర్నీ స్టార్ట్
ఆదిత్య మ్యూజిక్ కంపెనీ నిర్మాణంలోకి అడుగుపెడుతూ తీయనున్న మొదటి చిత్రం ముహూర్తం గురువారం జరిగింది. కల్యాణ్ రామ్, మెహరీన్ జంటగా దర్శకుడు సతీశ్ వేగేశ్న ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నారు. శివలెంక కృష్ణప్రసాద్ సమర్పణలో ఉమేశ్ గుప్తా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ సినిమా ముహూర్తానికి ‘దిల్’రాజు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ముహూర్త సన్నివేశానికి సంగీత దర్శకుడు గోపీ సుందర్ క్లాప్ ఇవ్వగా, జగదీశ్ గుప్తా కెమెరా స్విచ్చాన్ చేశారు. ఉమేశ్ గుప్తా గౌరవ దర్శకత్వం వహించారు. ‘‘జూలై 24న రెగ్యులర్ షూటింగ్ ప్రారంభిస్తాం. హైదరాబాద్, రాజమండ్రి, ఊటీ ప్రాంతాల్లో షూటింగ్ చేస్తాం. సతీశ్ వేగేశ్నగారు అద్భుతమైన ఎమోషన్స్‌తో ఈ కథను సిద్ధం చేశారు’’ అన్నారు నిర్మాతలు. ఈ చిత్రానికి కెమెరా: రాజ్ తోట, సంగీతం: గోపీ సుందర్, ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్: రషీద్ ఖాన్. -
ఫుల్ ఫామ్!
వరుస అవకాశాలను దక్కించుకుంటూ హీరోయిన్ మెహరీన్ ఫుల్ ఫామ్‌లో ఉన్నారు. కొంతకాలం డైరీలో ఖాళీ అన్న పదమే లేకండా కెరీర్‌ను బాగా ప్లాన్ చేసుకుంటున్నారు. ఆల్రెడీ గోపీచంద్ హీరోగా రూపొందుతున్న ‘చాణక్య’ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారీ బ్యూటీ. ఇటీవల సతీష్ వేగేశ్న దర్శకత్వంలో కల్యాణ్‌రామ్ హీరోగా సైన్ చేసిన సినిమాలో హీరోయిన్గా మెహరీన్ ఎంపికయ్యారు. ఇప్పుడు తాజాగా కోలీవుడ్ హీరో ధనుష్ నటించనున్న సినిమాలో హీరోయిన్గా నటించే చాన్స్ కొట్టేశారామె. శనివారం అధికారిక సమాచారం వెల్లడైంది. సత్యజోతి ఫిల్మ్స్ పతాకంపై తెరకెక్కనున్న ఈ సినిమాకు ‘కొడి’ (తెలుగులో ‘ధర్మయోగి’గా డబ్ చేశారు) ఫేమ్ ఆర్.ఎస్. ధురై సెంథిల్ కుమార్ దర్శకత్వం వహించనున్నారు. త్వరలో షూటింగ్ ఆరంభం కానుంది. ‘‘ఈ సినిమా షూటింగ్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను. ధనుష్‌తో నటించనుండటం చాలా సంతోషంగా ఉంది’’ అని పేర్కొన్నారు మెహరీన్. ఇలా వరుస సినిమాలతో మెహరీన్ ఫుల్ బిజీగా ఉన్నారు. -
కల్యాణ్ రామ్‌తో ఆదిత్య తొలి అడుగు
ఆదిత్య మ్యూజిక్.. ఈ పేరు తెలియని సంగీత ప్రియులు ఉండరు. మూడు దశాబ్దాలుగా సంగీత రంగంలో తనదైన ముద్రవేసిన ఆదిత్య మ్యూజిక్ నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టింది. నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా తెలుగులో తొలి సినిమా నిర్మించనుంది. ‘శతమానం భవతి’ ఫేమ్ వేగేశ్న సతీష్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. కల్యాణ్‌రామ్‌కి జోడీగా మెహరీన్ నటించనున్నారు. ‘జెంటిల్మన్, సమ్మోహనం’ వంటి హిట్చిత్రాలు తీసిన శ్రీదేవి మూవీస్ శివలెంక కృష్ణప్రసాద్ ఈ చిత్రానికి సమర్పకులుగా ఉన్నారు. ‘గీత గోవిందం, మజిలీ’ వంటి మ్యూజికల్ బ్లాక్ బస్టర్స్ అందుకున్న గోపీసుందర్ ఈ సినిమాకి స్వరకర్త. ‘‘అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించేలా వేగేశ్న సతీష్ కథను సిద్ధం చేసుకున్నారు’ అని చిత్రనిర్మాత ఉమేష్ గుప్తా తెలిపారు. -
చాణక్య అన్వేషణ
చుట్టూ జనం...వారి మధ్యలో తీక్షణమైన చూపులతో దేన్నో వెతుకుతున్నాడు చాణక్య. ఆ వెతుకులాట ఎందుకు? ఎవరి కోసం అంటే ప్రస్తుతానికి సస్పెన్స్. గోపీచంద్ హీరోగా తిరు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘చాణక్య’. బుధవారం గోపీచంద్ పుట్టినరోజు సందర్భంగా ‘చాణక్య’ సినిమాలోని లుక్‌ను విడుదల చేశారు. ఇక్కడ ఉన్న ఫొటో ఇదే. ఈ చిత్రంలో మెహరీన్, జరీనాఖాన్ కథానాయికలుగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై రామబ్రహ్మం సుంకర నిర్మిస్తున్నారు. అజయ్ సుంకర, అభిషేక్ అగర్వాల్ సహ నిర్మాతలు. యాభై శాతం పూర్తయిన ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోందని తెలిసింది. విశాల్ చంద్ర శేఖర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా కాకుండా బిన్ను సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఓ సినిమా తెరక్కనున్న సంగతి తెలిసిందే. -
యాక్షన్ ప్లాన్ రెడీ
విలన్ల పని పట్టడానికి రెడీ అవుతున్నారు గోపీచంద్. అందుకు ఆయన ఓ ప్లాన్ వేశారట. ఆ ప్లాన్‌ని వెండితెరపై చూడాల్సిందే. గోపీచంద్ హీరోగా తిరు దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మెహరీన్, జరీన్‌ఖాన్ కథానాయికలుగా నటిస్తున్నారు. అనిల్ సుంకర నిర్మిస్తున్నారు. ఈ సినిమా తొలి షెడ్యూల్ చిత్రీకరణ ఆ మధ్య రాజస్తాన్‌లో జరిగిన సంగతి తెలిసిందే. అక్కడ ఓ యాక్షన్ సీన్లో భాగంగా గోపీచంద్ గాయపడటంతో ఈ సినిమాకు బ్రేక్ పడిన విషయం గుర్తుండే ఉంటుంది. తాజాగా ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ వచ్చే నెల 6న హైదరాబాద్‌లో స్టార్ట్ కానున్నట్లు తెలిసింది. ఈ షెడ్యూల్లో యాక్షన్ సన్నివేశాలను ప్లాన్ చేశారని సమాచారం. ఈ సినిమా కాకుండా బిన్ను సుబ్రహ్మణ్యం దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనుంది. ఈ సినిమాను బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మించనున్నారు. -
ఛలోను మించిన హిట్ అవుతుంది
‘ఛలో, నర్తనశాల’ తర్వాత నాగశౌర్య సొంతబ్యానర్లో మూడో సినిమా చేస్తున్నారు. పైగా ఈ సినిమాకి ఆయనే కథ అందించడం విశేషం. నాగశౌర్య, మెహరీన్ జంటగా రమణ తేజను దర్శకునిగా పరిచయం చేస్తూ ఓ సినిమా రూపొందనుంది. శంకర్ ప్రసాద్ సమర్పణలో ఉషా ముల్పూరి నిర్మిస్తున్న ఈ సినిమా శనివారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. డైరెక్టర్ కె.రాఘవేంద్రరావు క్లాప్ ఇచ్చి, స్క్రిప్ట్‌ను దర్శకుడికి అందించగా, దర్శకుడు పరుశురామ్ గౌరవ దర్శకత్వం వహించారు. డైరెక్టర్ నందినీరెడ్డి కెమెరా స్విచ్చాన్ చేశారు. ఈ సందర్భంగా నాగశౌర్య మాట్లాడుతూ– ‘‘మమ్మల్ని ఆశ్వీర్వదించడానికి వచ్చిన రాఘవేంద్రరావుగారికి, పరుశురామ్, నందినీరెడ్డికి థ్యాంక్స్. ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ రేపటి నుంచి స్టార్ట్ అవుతుంది. 70 శాతం షూటింగ్ వైజాగ్‌లో ప్లాన్ చేస్తున్నాం. మంచి కథను దర్శకుడు బాగా తీస్తారని ఆశిస్తున్నాం. ‘ఛలో’ కంటే ఈ సినిమా పెద్ద హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు. ‘‘నన్ను నమ్మి అవకాశం ఇచ్చిన శౌర్య అన్నయ్యకు థ్యాంక్స్. ప్రొడ్యూసర్స్‌కు ధన్యవాదాలు. ఈ సినిమా అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను’’ అన్నారు రమణ తేజ. ‘‘నర్తనశాల’ విషయంలో తప్పు చేశాం. ఈ సారి సొంత కథను రాసుకున్నాం. తప్పకుండా హిట్ వస్తుందని కోరుకుంటున్నాం’’ అన్నారు బుజ్జీ. ‘‘మా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’ అన్నారు మెహరీన్. ఈ సినిమాకు సంగీతం: శ్రీచరణ్ పాకాల, కెమెరా: మనోజ్ రెడ్డి. -
వన్స్ మోర్
యాక్షన్ మోడ్ నుంచి రొమాంటిక్ మోడ్‌లోకి మారిపోయారు గోపీచంద్. ఇండియా పాకిస్థాన్ బోర్డర్లో విలన్స్‌తో ఫైటింగ్ చేసిన ఆయన ప్రస్తుతం హీరోయిన్స్‌తో డ్యూయెట్స్ పాడటానికి సిద్ధమయ్యారు. తిరు దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా ఓ యాక్షన్ థ్రిల్లర్ చిత్రం తెరకెక్కుతోంది. అనిల్ సుంకర నిర్మిస్తున్న ఈ సినిమాలో గూఢచారి (స్పై) పాత్రలో గోపీచంద్ నటిస్తున్నారు. స్పైగా పాకిస్థాన్ బార్డర్లో 45 రోజులు పోరాటాలు చేశారు. ఇప్పుడు ఆ గూఢచారికి జోడీ కుదిరింది. గోపీచంద్ సరసన మెహరీన్ హీరోయిన్గా నటించనున్నారు. ‘ఎఫ్ 2’ తర్వాత మెహరీన్ చేయబోతున్న తెలుగు సినిమా ఇదే. ఆల్రెడీ ‘పంతం’ సినిమాలో గోపీచంద్, మెహరీన్ జంటగా నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాతో ఈ కాంబినేషన్ మరోసారి రిపీట్ కానుంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో బాలీవుడ్ హీరోయిన్ జరీనా ఖాన్ కీలక పాత్ర చేస్తున్నారు. ఈ ఏడాది చివర్లో ఈ చిత్రం విడుదలకానుందట. -
అనిల్ సినిమాలు చూస్తే జిమ్‌కు వెళ్లక్కర్లేదు
‘‘డిస్ట్రిబ్యూటర్స్‌కి ఇలా షీల్డ్స్ ఇవ్వడం చూసి చాలా ఏళ్లయ్యింది. ‘దిల్’ రాజు మంచి నిర్మాత, డిస్ట్రిబ్యూటర్. ఇక అనిల్ రావిపూడి సినిమా చూస్తే చాలు జిమ్‌కు కూడా వెళ్లనక్కర్లేదు’’ అని దర్శకులు కె. రాఘవేంద్రరావు అన్నారు. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి రూపొందించిన చిత్రం ‘ఎఫ్ 2’. తమన్నా, మెహరీన్ హీరోయిన్లు. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్–లక్ష్మణ్ నిర్మించిన ‘ఎఫ్ 2’ చిత్రం 50 రోజులను పూర్తి చేసుకున్న సందర్భంగా, రాఘవేంద్రరావు మాట్లాడుతూ – ‘‘నా సినిమాల్లో ‘పెళ్ళిసందడి, గంగోత్రి’ సినిమాలు ఎక్కువ లాభాలను తెచ్చిపెట్టాయి. వెంకటేష్ గత సినిమాల కంటే వంద రెట్లు ఎక్కువగా నవ్వించాడు, వరుణ్ కూడా మంచి నటనను కనపరిచాడు’’ అన్నారు. ‘‘ఈ సినిమా 50 రోజుల వేడుకను జరుపుకోవడానికి ముఖ్య కారణం అనిల్. మా హీరోలిద్దరూ బిజీగా ఉండటం, అనిల్ తన నెక్ట్స్ మూవీకి, అలాగే మేం నెక్ట్స్ ప్రాజెక్ట్‌తో ఆల్రెడీ బిజీగా ఉన్నా... ఈ వేడుక చేయడానికి నిర్ణయించుకున్నాం’’ అన్నారు ‘దిల్’ రాజు. ‘‘ఎక్కడా గ్యాప్ లేకుండా కామెడీతో అనిల్ ఇరగొట్టేశాడు. టాలెంట్‌ను వెతికి పట్టుకుని, ఎంకరేజ్ చేయడం ‘దిల్’ రాజుగారికి వెన్నతో పెట్టిన విద్య. నవ్విస్తే చాలు.. ప్రేక్షకుడు లాజిక్, మేజిక్ల గురించి ఆలోచించడు’’ అన్నారు యస్వీ కృష్ణారెడ్డి. ‘‘ఈ సినిమాకు సంబంధించి ఈ షీల్డుని చూస్తే .. దీనికి సంబంధించిన జ్ఞాపకం మైండ్‌లో రీల్లా తిరుగుతుంది. అందుకనే ఈ ఫంక్షన్ చేశాం. 107 కేంద్రాల్లో 50 రోజులు పూర్తి చేసుకోవడమే కాదు.. 130 కోట్ల రూపాయల రెవెన్యూ జనరేట్ చేసిన సినిమా ఇది. ‘నువ్వునాకు నచ్చావ్’ లాంటి ఫుల్ ఎంటర్టైనింగ్ సినిమాను వెంకటేష్‌గారు చేస్తే ఎలా ఉంటుందో ఈరోజు మనకు మరోసారి తెలిసింది. వరుణ్‌తేజ్ కామెడీజోనర్లో చేసిన తొలి చిత్రమిది. అలాగే తమన్నా, మెహరీన్, రాజేంద్ర ప్రసాద్‌గారు, ఇలా ప్రతి ఆర్టిస్ట్‌కు, సాంకేతిక నిపుణలకు థాంక్స్.రాజుగారు, శిరీష్‌గారు, లక్ష్మణ్‌గారు నాకు కుటుంబతో సమానం’’ అన్నారు అనిల్ రావిపూడి. ‘‘నా 10వ సినిమా బెస్ట్ మూవీగా నిలవడం, సినిమా ఇంత పెద్ద సక్సెస్ కావడం పట్ల çసంతోషంగా ఉన్నాను’’ అన్నారు మెహరీన్. -
యాభై.. వందరోజుల వేడుకలు పోయాయి
‘‘ఇప్పటికే మా ‘ఎఫ్ 2’ సినిమా 100 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేయడం సంతోషం. ఇంకెంత వసూలు చేస్తుందో మాకు తెలీదు. ఇది చాలా గొప్ప విషయం. ఈరోజు నుంచి మరికొన్ని సీన్స్ యాడ్ చేస్తున్నాం. ప్రేక్షకులు కేరింతలు కొట్టే విధంగా ఈ కొత్త సీన్స్ ఉంటాయి’’ అని నిర్మాత ‘దిల్’ రాజు అన్నారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా, తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన చిత్రం ‘ఎఫ్ 2’. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీష్, లక్ష్మణ్ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలై 100కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. ఈ సందర్భంగా ప్రేక్షకులకు థ్యాంక్స్ చెప్పడానికి ఏర్పాటు చేసిన ప్రెస్మీట్లో ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘గతంలో 50 రోజులు, 100 రోజుల వేడుకలుండేవి. ఇప్పుడు అవన్నీ పోయి 50 కోట్లు, వందకోట్ల గ్రాస్, షేర్స్ వచ్చాయి. డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ అందరికీ మా ‘ఎఫ్2’ చిత్రం వంద కోట్ల గ్రాస్ షీల్డ్స్‌ని పంపిస్తున్నాం. ఇది మా సినిమాతో స్టార్ట్ చేయడం హ్యాపీగా ఉంది’’ అన్నారు. ‘‘వందకోట్ల సినిమా చెయ్యాలన్నది ప్రతి డైరెక్టర్ కల. అది ‘ఎఫ్2’ తో నాకు దక్కినందుకు హ్యాపీ. ప్రేక్షకులు మరింత ఎంజాయ్ చేయడానికి 5 కొత్త సీన్స్‌ని యాడ్ చేస్తున్నాం. ఈ చిత్ర విజయంలో చాలామంది కష్టం ఉంది’’ అన్నారు అనిల్ రావిపూడి. ‘‘దిల్’ రాజుగారు రిలీజ్ చేసిన ‘హ్యాపీడేస్’ సినిమా నాకు టర్నింగ్ పాయింట్. ఇప్పుడు ‘ఎఫ్ 2’ బిగ్గెస్ట్ హిట్ అవడం హ్యాపీగా ఉంది. ఈ సినిమాని బ్లాక్ బస్టర్ చేసిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు తమన్నా. -
అందరూ నవ్వుతుంటే కన్నీళ్లొచ్చాయ్
‘‘ఈ సంక్రాంతికి ‘ఎఫ్ 2’ని హిట్ కాదు.. సూపర్ హిట్ కాదు.. సూపర్ డూపర్ హిట్ చేశారు. నిజంగా అభిమానుల కళ్లలో ఆ ఆనందం చూసి మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెబుతున్నా’’ అని వెంకటేశ్ అన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అన్నది ఉపశీర్షిక. ‘దిల్’ రాజు సమర్పణలో శిరీశ్, లక్ష్మణ్ నిర్మించిన ఈ సినిమా ఈనెల 12న విడుదలైంది. శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన గ్రాండ్ సక్సెస్ మీట్లో వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘పదేళ్ల తర్వాత థియేటర్‌కి వెళ్లి ప్రేక్షకుల రియాక్షన్ చూసినప్పుడు అక్కడ అందరూ నవ్వుతున్నారు.. కానీ, నాకు మాత్రం కన్నీళ్లు వచ్చాయ్. చాలా రోజుల తర్వాత థియేటర్లో అంత రియాక్షన్ చూసినప్పుడు.. మేమంతా కష్టపడి పనిచేసి ఆ సినిమా మీకు చూపెట్టినప్పుడు మీరు అంత బాగా ఆదరించి ప్రేమ చూపెట్టడం నిజంగా వండ్రఫుల్ ఫీలింగ్. ఇందుకు మనస్ఫూర్తిగా ప్రేక్షకులు, ఫ్యాన్స్‌కి థ్యాక్స్ చెబుతున్నా. నావి ఎన్నో సినిమాలు సంక్రాంతికి విడుదలయ్యాయి. ‘గణేశ్, ప్రేమించుకుందాం రా... నా బిగినింగ్ సినిమా ‘బొబ్బిలి రాజా నుంచి మొన్న ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, చంటి, ఇంట్లో ఇల్లాలు వంటిట్లో ప్రియురాలు సినిమాలు కానీ, నవ్వు నాకు నచ్చావ్, మల్లీశ్వరి... ఇలా ఎన్నో సినిమాలను సూపర్ హిట్ చేశారు. అనిల్ ఈ కథ చెప్పి నన్ను ఒప్పించడం.. చాలా రోజుల తర్వాత మళ్లీ ఇలాంటి ఎంటర్టైన్మెంట్ సినిమా చేయడం.. ప్రేక్షకులు ఇంత పెద్ద సక్సెస్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి వండ్రఫుల్ సినిమా ఇచ్చినందుకు ‘దిల్’ రాజు, శిరీష్, లక్ష్మణ్‌లకు థ్యాంక్స్. అనిల్ చాలా మంచి ఎనర్జీ ఇచ్చాడు. వరుణ్ టెరిఫిక్ పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. ఈ సినిమాని కుటుంబంతో కలిసి మళ్లీ మళ్లీ చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘ మా సినిమా టైటిల్‌ని అనిల్ ‘ఎఫ్ 2’ అని అనౌన్స్ చేశాడు. దాని తర్వాత ‘వీ 2’ అని వెంకటేశ్‌గారు, వరుణ్‌గారు జాయిన్ అయ్యారు. సినిమా రిలీజ్ రోజు ‘ఈ 2’ అని(ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్) కొందరు మెసేజ్‌లు పంపించారు. ఫైనల్‌గా ‘బీ 2’ అని (బొమ్మ బ్లాక్‌బస్టర్) బిరుదు ఇచ్చేశారు. మా బ్యానర్లో ఇది 31వ సినిమా. ఈ సంక్రాంతికి అద్భుతమైన సినిమా అయినందుకు టీమ్ అంతా చాలా ఎంజాయ్ చేస్తున్నాం.ఈ సక్సెస్ అనిల్ ఒక్కడిదే కాదు.. టెక్నీషియన్స్ అందరిదీ. మీరందరూ ఉన్నారు కాబట్టే ఇంతపెద్ద సక్సెస్ వచ్చింది. ఈ సినిమా హిట్ అవుతుందనుకున్నా.. కానీ ఇంత పెద్ద హిట్ అవుతుందని నేను కూడా ఊహించలేదు. ఈ క్రెడిట్ మా టీమ్‌తో పాటు ప్రేక్షకులదే. మిమ్మల్ని కొంచెం నవ్విస్తే చాలు ఆ సినిమాకి బ్రహ్మరథం పడతారని అర్థం అయింది. వెంకటేశ్‌గారు ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ తో 50కోట్ల క్లబ్లో ఉన్నారు. వరుణ్ ‘ఫిదా’ సినిమాతో 50కోట్ల క్లబ్లో చేరారు. ఇద్దరూ ‘ఎఫ్ 2’ తో 50కోట్ల క్లబ్ దాటేశారు. మా బ్యానర్‌కి హయ్యస్ట్ ప్రాఫిట్ తెచ్చిన సినిమా ఇదే.. చాలా హ్యాపీ’’ అన్నారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘ఎఫ్ 2’ సినిమాని ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు బిగ్ థ్యాంక్స్. ఓ సినిమా చేయాలంటే 100 నుంచి 200 మంది ఎఫర్ట్ ఉంటుంది. మా ‘ఎఫ్ 2’ సినిమాకి ఇంకా ఎక్కువ మంది పనిచేశారు. ఈ సినిమాకి అందరూ చాలా పాజిటివ్ మైండ్‌సెట్‌తో పనిచేశారు.. అందరికీ థ్యాంక్స్. నేను నిజంగా కామెడీ అంటే ఇద్దర్నే చూశా. ఒక్కరు చిరంజీవిగారు, రెండోది వెంకటేశ్‌గారు. వాళ్లను చూసి ఇలా మనం చేయగలుగుతామా? అనిపించేది. వెంకీగారి పక్కన ఎలా చేస్తాం అనే భయం, సిగ్గు ఉండేది. ఆయన ఓ బ్రదర్‌లా నా పక్కన ఉంటూ సపోర్ట్ చేశారు. వెంకీగారు నిజంగా నా కో బ్రదర్, బెస్ట్‌ఫ్రెండ్. మీతో పనిచేయడం మరచిపోలేను. వెంకీగార్ని, అనిల్గార్ని, ఈ టీమ్‌ని మిస్ అవుతున్నందుకు ఎక్కడో ఫీలింగ్ ఉండేది. కానీ, త్వరలోనే ‘ఎఫ్ 3’ సినిమా చేయబోతున్నాం. మీ అభిమాన హీరో ఎవరైనా కావొచ్చు. కానీ, వాళ్లందరికీ నచ్చే కామన్ వ్యక్తి వెంకటేశ్‌గారు’’ అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘ఈ సంక్రాంతికి ఇంత మంచి సినిమా తీసే అవకాశం ఇచ్చిన మా నిర్మాతలకి థ్యాంక్స్. ప్రతి సినిమా నాకు ఓ ఎత్తు అయితే ఈ సినిమా మరో ఎత్తు. నటీనటులందరూ లైఫ్పెట్టి పనిచేశారు. అందరికీ థ్యాంక్స్. తమన్నా, మెహరీన్ చాలా బాగా నటించారు. దేవిశ్రీగారు మంచి మ్యూజిక్ ఇచ్చారు. వెంకీ సార్‌తో కలిసి వరుణ్ చాలా కష్టపడి చేశాడు. మళ్లీ మళ్లీ వరుణ్‌తో పనిచేయాలనుకుంటున్నా. వెంకటేశ్‌గారి దెబ్బకి బాక్సాఫీస్ అబ్బ. ఈ చిత్రంలో వెంకీగారు లుంగీ కట్టుకుని డ్యాన్స్ చేస్తుంటే ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు’ గుర్తొచ్చింది. ఆయనొక లైబ్రరీ. మనం ఏరుకోవడమే. ఆయన ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డారు. ఈ నవ్వుల్ని మీకు ఇచ్చినందుకు మీరు నవ్వుతూ కలెక్షన్లు ఇచ్చారు. నా లైఫ్‌లో ఇది నవ్వుల సంక్రాంతి.. ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చినందుకు ప్రేక్షకులకు ఎప్పుడూ రుణపడి ఉంటాం. మా టీమ్‌ని ఎంతో ఎంకరేజ్ చేసిన మహేశ్‌బాబుగారికి థ్యాంక్స్. ‘ఎఫ్ 3’ సినిమా కచ్చితంగా ఉంటుంది’’ అన్నారు. నిర్మాతలు శిరీష్, లక్ష్మణ్, కథానాయిక మెహరీన్, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్, నటీమణులు అన్నపూర్ణ, రజిత, ప్రగతి, అనసూయ, పాటల రచయితలు శ్రీమణి, కాసర్ల శ్యాం తదితరులు పాల్గొన్నారు. -
ఫెయిల్యూర్ రాకూడదని పని చేస్తాను
‘‘ఎవరైనా సక్సెస్ కోసం పని చేస్తారు. నేను ఫెయిల్యూర్ రాకూడదని పని చేస్తాను. ఫెయిల్యూర్ భయం నాకు ప్రతి క్షణం ఉంటుంది. డైరెక్టర్‌గా నేను సక్సెస్ అయ్యాను. రైటర్‌గా ఉన్నప్పుడు నేను చాలా ఫెయిల్యూర్స్ చూశా. మనం చేసిన పనికి ప్రశంస రాకపోతే ఉండే బాధను అనుభవించాను. ఇప్పుడు ఆ బాధ లేకుండా సక్సెస్‌ను ఎంజాయ్ చేస్తున్నా’’ అని అనిల్ రావిపూడి అన్నారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందిన మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనేది ఉపశీర్షిక. ‘దిల్’ రాజు నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న విడుదలైంది. ఈ సందర్భంగా అనిల్ రావిపూడి చెప్పిన విశేషాలు... ► ఈ సినిమాకు ముందు మూడు యాక్షన్ సినిమాలు (పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్) చేశాను. యాక్షన్ సన్నివేశాలు లేకుండా ఓ ఫుల్ లెంగ్త్ ఎంటర్టైన్మెంట్ సినిమా చేద్దామనుకున్నాను. ‘క్షేమంగా వెళ్లి లాభంగా రండి, పెళ్లాం ఊరెళితె’ తరహాలో ఉండే సినిమా చేద్దామని ‘ఎఫ్ 2’ చేశాను. ‘రాజా ది గ్రేట్’ సినిమా చిత్రీకరణ చివరి దశలో ‘ఎఫ్ 2’ ఆలోచన వచ్చింది. ► జంధ్యాలగారు గొప్ప రైటర్. గొప్ప దర్శకులు. బోర్ కొడితే ఆయన సినిమాలు చూస్తాను. ఆయన్ను ఫాలో అవుతాను కానీ ఆయన్ని కాపీ కొట్టను. అలాగే ఈవీవీగారు, కృష్ణారెడ్డిగారి సినిమాలు కూడా బాగా ఇష్టం. వీరిని ఇన్‌ప్లూయెన్స్ అవుతున్నానన్న మాట మాత్రం వాస్తవం. కానీ నా స్టైల్ ఆఫ్ నరేషన్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటాను. ► నాది తక్కువ.. నీది ఎక్కువ, ఒకరికి ఎక్కువ డైలాగ్స్ ఉన్నాయి. ఒకరికి తక్కువ ఉన్నాయి అన్న తలనొప్పి నాకు లేదు ఈ సినిమా సెట్లో. అందరూ నమ్మి ఈ సినిమా చేశారు. మంచి ఫలితం వచ్చింది. వెంకటేశ్‌గారు కొన్ని ఐడియాస్ ఇచ్చారు. సినిమాలో వెంకీ ఆసనం, డాగ్ ఎపిసోడ్‌కి ఆడియన్స్ బాగా కనెక్ట్ అయ్యారు. వెంకీగారు గ్రేట్ యాక్టర్. రిజల్ట్ పట్ల ఆయన ఫుల్‌హ్యాపీ. వరుణ్ ఇప్పటివరకు కామెడీ జానర్ చేయలేదు. వెంకీగారితో వరుణ్ కామెడీ టైమింగ్ ఎలా ఉంటుందా? అనుకున్నాం. బాగా చేశారు. తెలంగాణ డైలాగ్స్ బాగా పలికారు. సినిమాలో ప్రకాష్‌రాజ్‌గారికి ‘గుండమ్మ కథ’ అంటే ఎంత పిచ్చో నాకు అంత పిచ్చి. అదే సినిమాలో పెట్టాను. ఈ సినిమాలో ముందుగా ‘అంతేగా.. అంతేగా..’ డైలాగ్స్ అనుకోలేదు. ► నీ సినిమాల్లో గ్లామర్ ఉండదేంటి? అన్నారు కొందరు. అలాంటి ఆడియన్స్ కూడా ఉన్నారని రియలైజ్ అయ్యి ఈ సినిమాలో కొంచెం గ్లామర్ సీన్స్ పెంచాను. కానీ బోర్డర్ దాటి చేయలేదు. నా పెళ్లి తర్వాతే రాసుకున్నాను ఈ సినిమా స్క్రిప్ట్‌ని (నవ్వుతూ). నా వైఫ్ చూసి చాలా స్పోర్టివ్‌గా తీసుకుంది. ► నేను న్యూస్, కరెంట్ అఫైర్స్ బాగా ఫాలో అవుతాను. సినిమానే నాకు లైబ్రరీ. సినిమానే నాకు పుస్తకం. అందుకే నేను చేసే సినిమాల్లో కరెంట్ అఫైర్స్ ట్రెండ్ కనిపిస్తుంది. బాల్యంలో ఎంత బాగా చదివేవాడినో అంతే బాగా సినిమాలు చూసేవాడిని. నా గురించి ఇప్పుడు అరుణ్ ప్రసాద్‌గారు గర్వంగా ఫీల్ అవుతున్నారు. ఆయన తీసిన ‘గౌతమ్ ఎస్ఎస్సి’ సినిమాకు నేను వర్క్ చేశాను. ఆయనంటూ లేకపోతే నేనూ ఇండస్ట్రీలో లేను. కాస్త టైమ్ తీసుకుని తర్వాత సినిమా స్టార్ట్ చేస్తా. బాలకృష్ణ, వెంకటేశ్ గార్లకు ఐడియాలు చెప్పాను. బయోపిక్స్ పట్ల ఆసక్తి ఉంది. ప్రస్తుతం బాలీవుడ్‌కు వెళ్లే ఆలోచన లేదు. ► ‘ఎఫ్ 3’ చేయాలనే కోరిక ఉంది. ‘ఎఫ్ 2’ కి ఆడియన్స్ సక్సెస్ ఇచ్చారు కాబట్టి నా కోరికకు బలం కూడా వచ్చింది. వెంకీగారు, వరుణ్ కూడా ఎగై్జట్‌గా ఉన్నారు. వెంకీగారు, వరుణ్‌కి తోడుగా ఇంకో హీరో వస్తారా? లేక అసలు ఎలా ఉండబోతుందన్న వివరాలు భవిష్యత్‌లో తెలుస్తాయి. -
నేను పెద్ద హీరోని అనుకోను
‘‘సాధారణంగా పండగలకు వచ్చే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్స్‌ను ప్రేక్షకులు ఆదరిస్తారు. ఈ సంక్రాంతికి ‘ఎఫ్ 2’ సినిమా రావడం చాలా ఆనందంగా ఉంది. నేను, వరుణ్ సంక్రాంతి అల్లుళ్లుగా వస్తున్నాం’’ అని వెంకటేశ్ అన్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా ‘దిల్’ రాజు నిర్మించిన చిత్రం ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అన్నది ఉపశీర్షిక. ఈ సినిమా ఈ రోజు విడుదలవుతోంది. హైదరాబాద్‌లో జరిగిన ప్రీ రిలీజ్ ఫంక్షన్లో వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘నేను పెద్ద హీరోని అని ఎప్పుడూ అనుకోను. కథ, దర్శకుడు అనిల్‌ని నమ్మి ఈ సినిమా చేశా. ‘దిల్’ రాజుగారితో మంచి అనుబంధం ఉంది’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘కలియుగ పాండవులు’ చిత్రంతో వెంకటేశ్‌గారి అభిమానిని అయ్యా. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ తర్వాత ఆయనతో రెండోసారి పనిచేసే అవకాశం దక్కింది. పూర్తి స్క్రిప్టు లేకుండా సినిమా తీయడానికి నేను ఒప్పుకోను. అలాంటి నన్ను కేవలం సన్నివేశాలు చెప్పి ఒప్పించేస్తాడు అనిల్’’ అన్నారు. వరుణ్‌తేజ్ మాట్లాడుతూ– ‘‘ఫస్ట్ టైమ్ ఓ మాస్ క్యారెక్టర్ చేశాను. అది కూడా కామెడీ క్యారెక్టర్. ‘ఎఫ్ 2’తో అనిల్‌లాంటి మంచి ఫ్రెండ్ దొరికినందుకు ఆనందంగా ఉంది. ‘దిల్’ రాజు, శిరీష్, లక్ష్మణ్‌గారితో ‘ఫిదా’ తర్వాత మరోసారి పనిచేయడం హ్యాపీ. మా పెదనాన్నగారి (చిరంజీవి) కాన్టెంపరరీ హీరో వెంకటేశ్‌గారితో సినిమా చేయాలంటే ఎక్కడో చిన్న భయం ఉండేది. కానీ ఆయన మాతో ఫ్రెండ్‌లా, మెంటర్‌లా ఉన్నారు. నెక్ట్స్ టైమ్ ఆయనతో స్టోరీ కూడా అడగకుండానే సినిమా చేయడానికి రెడీ’’ అన్నారు. ‘‘ఎఫ్ 2’ సినిమా ప్రేక్షకుల్ని నవ్వుల్లో ముంచెత్తుతుంది. టైమింగ్ ఉన్న గొప్ప నటులు ఈ సినిమాలో పనిచేశారు’’ అన్నారు అనిల్ రావిపూడి. నటులు రాజేంద్రప్రసాద్, కథానాయికలు తమన్నా, మెహరీన్, నిర్మాత శిరీష్ తదితరులు పాల్గొన్నారు. -
సడన్‌గా సంక్రాంతికి రిలీజ్ అంటే ఎలా?
‘‘నిన్న ఒక సినిమా ప్రీ–రిలీజ్ ఈవెంట్లో వాళ్లు తొందరపడి స్టేట్మెంట్ ఇచ్చారేమో నాకు తెలియదు. పండక్కి›వస్తున్న 3 సినిమాలు 6 నెలల క్రితం అనౌన్స్ అయ్యాయి. 3 పెద్ద సినిమాలకు థియేటర్స్ ఎలా సెట్ చేసుకోవాలని స్ట్రగుల్ అవుతున్నాం. అలాంటిది 20 రోజుల ముందు సినిమాను కొనుక్కొచ్చి సంక్రాంతికి రిలీజ్ అంటే ఎలా? 3 తెలుగు సినిమాలున్నప్పుడు పక్క రాష్ట్రం నుంచి వచ్చే సినిమాకు థియేటర్స్ ఎలా అడ్జస్ట్ అవుతాయి?’’ అని ‘దిల్’ రాజు అన్నారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కించిన మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్ 2’. (ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్). తమన్నా, మెహరీన్ కథానాయికలు. ‘దిల్’ రాజు నిర్మాత. ఈ చిత్రం ఈ నెల 12న రిలీజ్ కానున్న సందర్భంగా ట్రైలర్ రిలీజ్ చేసి, ‘దిల్’ రాజు మాట్లాడుతూ – ‘‘రాజా ది గ్రేట్’ తర్వాత అనిల్ ఈ ఐడియా చెప్పాడుæ. బాగా నచ్చింది. జర్నీ అంతా ఫన్‌గా సాగిపోయింది. మొన్న ఇద్దరం మాట్లాడుకుంటూ ‘ఏంటి అనిల్.. 3 సినిమాలు చేసేశాం. చిన్న క్లాష్ కూడా రాలేదు’ అని నవ్వుకున్నాం. తను అనుకున్నట్టు సినిమా చేశాడు. పండక్కి మా సినిమా ఫన్ ఇస్తుందని నమ్ముతున్నాం. అలాగే థియేటర్స్ ఇష్యూలో రెండో పాయింట్.. ఆ నిర్మాతే గత నాలుగు నెలల్లో ‘నవాబ్, సర్కార్’ సినిమాలు రిలీజ్ చేశారు. ‘సర్కార్’కు ఎన్ని థియేటర్స్ కావాలో అన్ని థియేటర్స్‌లో వేసుకున్నారు. ఇప్పుడు దొరకడం లేదంటే? తెలుగు సినిమాలను తగ్గించుకుని రిలీజ్ చేయలేం కదా. ఈ సీజన్లో మన తెలుగు సినిమా కాకుండా వేరే భాష చిత్రాలకు థియేటర్స్ ఇచ్చే పరిస్థితి లేదు. 18న రిలీజ్ చేయొచ్చుగా? అలా చేస్తే రెండు రాష్ట్రాల్లో థియేటర్స్ దొరుకుతాయిగా. ఇలాంటివి ఆలోచించకుండా కాంట్రవర్సీ స్టేట్మెంట్స్ ఇచ్చి, నోరు జారారు. అలా మేమూ మాట్లాడగలం. కానీ ఇక్కడ మనం చేస్తున్నది వ్యాపారం. డబ్బు సంపాదించడానికే. డిస్ట్రిబ్యూషన్లో ఎన్నో డబ్బులు పోయాయి. అయినా సినిమా మీద ఉన్న ప్యాషన్‌తో సినిమాలు చేస్తున్నాం. ఎవరి మీదా స్టేట్మెంట్లు ఇవ్వాలన్నది నా ఉద్దేశం కాదు. 6 నెలల క్రితం అనౌన్స్ అయిన సినిమాలకు థియేటర్స్ ఉండాలా వద్దా? మూడూ క్రేజీ సినిమాలకు థియేటర్స్ అడ్జస్ట్ చేసుకుంటున్నాం. అది తెలియకుండా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు’’ అన్నారు. ‘‘ఈ మధ్యలో ‘ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, మల్లీశ్వరి, నువ్వు నాకు నచ్చావ్’ స్టైల్లో ఫుల్ కామెడీ సినిమా చేయలేదు. అనిల్ కథ చెప్పిన విధానం నాకు బాగా నచ్చింది. మల్టీస్టారర్ అయితే ఇంకా ఫన్ ఉంటుందనుకుని చేశాం. వరుణ్‌తో పని చేయడం మంచి ఎక్స్పీరియన్స్. ఎంటర్టైన్ చేసిన ప్రతిసారీ నన్ను ఆదరించారు. ఈ చిత్రం పెద్ద హిట్ అవుతుందనుకుంటున్నాను’’ అన్నారు వెంకటేశ్. ‘‘నా కెరీర్లో చేయాల్సిన కామెడీ అంతా ఈ సినిమాలో చేయించాడు అనిల్. ఇలాంటి టీమ్‌తో పని చేయడం హ్యాపీగా ఉంది. వెంకీగారితో పని చేయాలంటే టెన్షన్ పడ్డా. ఫ్రేమ్‌లో ఆయనతో పోటీపడటం పెద్ద చాలెంజ్. ఆయన ఇచ్చిన కంఫర్ట్ వల్లే బాగా చేయగలిగాను. సీట్లో కూర్చోకుండా సినిమాను ఎంజాయ్ చేస్తారు’’ ఆన్నారు వరుణ్ తేజ్. ‘‘ఈ బ్యానర్లో ఇది నాకు మూడో సినిమా. నిర్మాతలు ఫ్యామిలీలా మారిపోయారు. వాళ్లతో ఓ ఎమోషనల్ బాండింగ్ ఏర్పడింది. మా కాంబినేషన్ మంచి సక్సెస్ సాధించాలని కోరుకుంటున్నాను. రెండు నిమిషాల ట్రైలర్లో కొన్ని నవ్వులే. రెండు గంటల ఇరవై నిమిషాల సినిమాలో చాలా నవ్వులుంటాయి. వెంకటేశ్, వరుణ్, తమన్నా మెహరీన్‌లు ఈ సినిమాకు 4 పిల్లర్స్’’ అన్నారు అనిల్ రావిపూడి. ‘‘కెరీర్ స్టార్టింగ్‌లో రాజుగారు నాదో సినిమా చూసి డిస్ట్రిబ్యూట్ చేశారు. ఆ రోజు నుంచి నా లైఫ్‌లో ‘హ్యాపీడేస్’ వచ్చేశాయి. అప్పటి నుంచి ఆయనతో ఎప్పుడు సినిమా చేస్తానా అనుకున్నాను. ఈ సినిమా చేయడం ఆనందంగా ఉంది. అనిల్‌గారు ఓన్లీ ఫన్ నో ఫ్రస్ట్రేషన్. వెంకీ సార్ ఎన్ని పాత్రలు చేసినా అంత ఫ్రెష్‌గా, ముద్దుగా ఎలా కనిపిస్తారో అర్థం కాదు. వరుణ్ చేస్తున్న సినిమాలు నాకు ఇష్టం. మెహరీన్ నా హనీ’’ అన్నారు తమన్నా. ‘‘200 శాతం ఈ సినిమాకు ఇచ్చాను. వెంకటేశ్ సార్, వరుణ్, తమన్నాలతో కలసి పని చేయడం మంచి ఎక్స్పీరియన్స్. ఫస్ట్ టైమ్ డబ్బింగ్ చెప్పుకున్నాను’’ అన్నారు మెహరీన్. -
తెలుగు సినిమా మరోసారి సత్తా చాటాలి
‘‘హలో వైజా........గ్.. సౌండ్ అంటే అదమ్మా. మీ సౌండ్‌తో నాకు గొంతు పోయినట్టుంది (నవ్వుతూ). వైజాగ్ ఉత్సవాల్లో మా ‘ఎఫ్ 2’ సినిమా ఆడియో రిలీజ్ చేయడం చాలా ఆనందంగా ఉంది. ‘ఎఫ్ 2’ వండర్ఫుల్ స్క్రిప్ట్. నా గత సినిమాలన్నీ జాగ్రత్తగా చూసిన అనిల్ వాటన్నిటికంటే చాలా బాగా రెచ్చిపోయాలా నన్ను చూపించాడు’’ అన్నారు వెంకటేశ్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా తమన్నా, మెహరీన్ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అన్నది ఉపశీర్షిక. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మించిన ఈ సినిమా జనవరి 12న విడుదలవుతోంది. దేవిశ్రీ ప్రసాద్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను ఆదివారం వైజాగ్‌లో మంత్రి గంటా శ్రీనివాసరావు రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా వెంకటేశ్ మాట్లాడుతూ– ‘‘వైజాగ్ నాకెంతో క్లోజ్. నా తొలి సినిమా ‘కలియుగ పాండవులు’ నుంచి ఎన్నో సినిమాలు నేను ఇక్కడ చేశాను. ‘స్వర్ణకమలం, సుందరకాండ, గురు’... ఇన్‌ఫ్యాక్ట్ ‘మల్లీశ్వరి’ సినిమాలో కత్రినాకైఫ్‌తో ఇదే బీచ్‌లో అలా నడుస్తూ ఉన్నాను కదా (నవ్వుతూ). వైజాగ్ నాకెంతో లక్కీ ప్రదేశం. మా పెళ్లాలు (తమన్నా, మెహరీన్) రాలేదు. దానికే కొంచెం అందరం ఫ్రస్ట్రేట్ అయి ఉన్నాం (నవ్వుతూ). మంచి మ్యూజిక్ ఇచ్చిన దేవిశ్రీకి థ్యాంక్స్. ‘ఎఫ్ 2’ లాంటి మంచి సినిమా ఇస్తున్నందుకు ‘దిల్’రాజుగారు, శిరీష్, లక్ష్మణ్‌లకు థ్యాంక్స్. వారితో చేసిన ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’తో బ్రదర్ మహేశ్‌ని సంపాదించుకున్నా.. ‘ఎఫ్ 2’ సినిమాకి మరో బ్రదర్ వరుణ్ని సంపాదించుకున్నా. మా సినిమాతో పాటు రిలీజ్ అవుతున్న బాలయ్య బాబు (యన్.టి.ఆర్. కథానాయకుడు), చరణ్ (వినయ విధేయ రామ), రజనీకాంత్‌సార్ (పేట) సినిమాలన్నీ బాగా ఆడాలి.. మరోసారి తెలుగు సినిమా సత్తా చాటాలి’’ అన్నారు. ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘కరెక్టుగా 2014 డిసెంబరు 31న నేను, బన్నీ (అల్లు అర్జున్) ఇక్కడే వైజాగ్‌లో న్యూ ఇయర్ సెలబ్రేట్ చేసుకున్నాం. 2017లో సంక్రాంతికి మూడు సినిమాలు రిలీజ్ అయినప్పుడు చాలా పెద్ద పోటీ అని అందరం భావించాం. బాలకృష్ణగారి ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ క్లాసిక్ సినిమా అయింది.. చిరంజీవిగారి ‘ఖైదీ నంబర్ 150’ సినిమా ఇండస్ట్రీ రికార్డ్ అయింది. మా ‘శతమానం భవతి’ మంచి సినిమా అయ్యి జాతీయ అవార్డు వరకూ వెళ్లింది. 2019 సంక్రాంతికి మళ్లీ మూడు సినిమాలు పోటీపడుతున్నాయి. ఈ మూడు సినిమాలు పెద్ద హిట్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. వెంకటేశ్‌గారితో మా బ్యానర్లో ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు, వరుణ్‌తో ‘ఫిదా’ సినిమాలు చేశాం. వారిద్దరితో మల్టీస్టారర్‌గా ఇప్పుడు తీసిన ‘ఎఫ్ 2’ సంక్రాంతికి రాబోతోంది. ఇద్దరూ నిర్మాతకి కంఫర్టబుల్ హీరోలు. థ్యాంక్యూ వెంకీ సార్. మంచి కథ కుదిరితే మీతో మరో సినిమా చేయాలనే కోరిక ఉంది. వరుణ్ ఆల్మోస్ట్ ఓ ఫ్యామిలీ మెంబర్. చిరంజీవిగారిలోని లక్షణాలు తీసుకుని మంచి సినిమాలు చేస్తూ ఎదుగుతున్న వరుణ్ ఈ సినిమాతో ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరవుతాడు. అనిల్ ఈ సినిమా కథ చెబుతున్నప్పుడు నవ్వుతూనే ఉన్నా. మా బ్యానర్‌కి మరో సూపర్ హిట్‌గా నిలుస్తుందని అప్పుడే తెలుసు. అనిల్ గత చిత్రాలు ‘పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్’ కమర్షియల్ ఎంటర్టైనర్స్ అయితే ‘ఎఫ్ 2’ పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. అందుకే ఈ సినిమాకి ‘సంక్రాంతి అల్లుళ్లు’ వస్తున్నారని మరో ట్యాగ్‌లైన్ పెట్టాడు. సినిమాలో ఒకరు ఆంధ్ర అల్లుడు.. మరొకరు తెలంగాణ అల్లుడు. మా బ్యానర్లో అనిల్‌కి వరుసగా మూడో సినిమా. కచ్చితంగా హ్యాట్రిక్ కొట్టబోతున్నాం. దేవిశ్రీతో ‘ఆర్య’ నుంచి మా జర్నీ మొదలైతే ‘ఎఫ్ 2’ పదో సినిమా. ఇప్పటి వరకూ 9 సినిమాలు సూపర్ హిట్స్ అయ్యాయి. మా కాంబినేషన్ ఇలాగే కొనసాగుతుంది’’ అన్నారు. వరుణ్ తేజ్ మాట్లాడుతూ– ‘‘నా యాక్టింగ్ కెరీర్ ఇక్కడి నుంచే మొదలైంది. వైజాగ్ సత్యానంద్‌గారి వద్ద నటనలో శిక్షణ తీసుకున్నా. ‘ఎఫ్ 2’కి దేవి వండర్ఫుల్ మ్యూజిక్ ఇచ్చారు. నా గత సినిమాలు చూసి ఈ పాత్ర ఎవరూ నాకు ఇవ్వరేమో? కానీ అనిల్ చాలా ధైర్యం చేసి ఇచ్చాడు.. బాగానే చేశా. ఓ ఫ్రెండ్‌లా, మెంటర్‌లా వెంకటేశ్ సార్ నన్ను ప్రోత్సహించడంతో ఈ జర్నీ చాలా హ్యాపీగా సాగింది’’ అన్నారు. అనిల్ రావిపూడి మాట్లాడుతూ– ‘‘మా ఫన్, ఫ్రస్ట్రేషన్ వైజాగ్ బీచ్‌కి బాగా తెలుసు. ఎందుకంటే ఈ కథ ఇక్కడే రాశాం. వెంకటేశ్‌గారితో పనిచేసే గొప్ప అవకాశం దొరికింది. ఈ సినిమాతో వెంకీగారు మిమ్మల్ని టైమ్ మెషీన్లో ‘అబ్బాయిగారు, ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు, నువ్వునాకు నచ్చావ్, మల్లీశ్వరి’.. అక్కడికి తీసుకెళ్లిపోతారు. వరుణ్ తొలిసారి ఈ సినిమాలో మంచి కామెడీ చేశారు. వీరిద్దరి మధ్య సన్నివేశాలు మిమ్మల్ని నవ్విస్తాయి. దేవిశ్రీగారు ఆరు పాటలూ మంచివి ఇచ్చారు. జీవితంలో ఎన్ని ఉన్నా నవ్వులు లేకపోతే అదో వెలితి. సంక్రాంతికి మీ కుటుంబంతో వచ్చి మా సినిమా చూడండి.. తప్పకుండా నవ్వుకుని బయటికెళతారు’’ అన్నారు. దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ– ‘‘సినిమా చూస్తే మీలోని ఫ్రస్ట్రేషన్ వదిలేసి ఫన్‌తో ఇంటికెళతారు. వెంకటేశ్‌గారికి విక్టరీ అలవాటైపోయింది. మీరు చాలామందికి స్ఫూర్తి సార్. వరుణ్‌తో తొలిసారి చేస్తున్నా. వైవిధ్యమైన సినిమాలు చేస్తున్నాడు. అనిల్‌తో చాలా సరదాగా ఉంటుంది. ‘దిల్’ రాజుగారితో నా జర్నీ ఇంకా ఇంకా సాగాలని కోరుకుంటున్నా’’ అన్నారు. ఈ వేడుకలో పాటల రచయితలు కాసర్ల శ్యాం, శ్రీమణి, బాలాజీ, నటుడు ‘సత్యం’ రాజేశ్, నటి హరితేజ, లైన్ ప్రొడ్యూసర్ రత్నకుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక అతిథి
‘క్షణం, గాయత్రి, రంగస్థలం’ చిత్రాల్లో కీలకపాత్రలు పోషించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు నటి అనసూయ. ఇప్పుడు ఆమె ‘ఎఫ్ 2’ చిత్రంలో ఓ అతిథి పాత్ర పోషించారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘దిల్’ రాజు నిర్మిస్తున్న చిత్రం ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనేది ఉపశీర్షిక. తమన్నా, మోహరీన్లు కథానాయికలుగా నటిస్తున్నారు. ‘‘ఎఫ్ 2’ చిత్రంలో అనసూయ అతిథి పాత్ర చేశారు. అలాగే ఓ సాంగ్‌లో కూడా కనిపిస్తారు’’ అని పేర్కొన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ‘‘ఈ సినిమాలో నటించే అవకాశం ఇచ్చిన అనిల్ సార్‌కి థ్యాంక్స్’’ అన్నారు అనసూయ. -
‘కవచం’ మూవీ రివ్యూ
టైటిల్ : కవచం జానర్ : యాక్షన్ థ్రిల్లర్ తారాగణం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్, మెహరీన్, నీల్ నితిన్ ముఖేష్ సంగీతం : తమన్ ఎస్ఎస్ దర్శకత్వం : శ్రీనివాస్ మామిళ్ల నిర్మాత : నవీన్ శొంఠినేని కెరీర్ స్టార్టింగ్ నుంచి భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తూ వస్తున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సారి రూట్ మార్చి ఓ మీడియం రేంజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటి వరకు చేసిన సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా కమర్షియల్‌గా హిట్ అనిపించుకోలేకపోవటంతో ఈ సారి ఎలాగైనా ఓ భారీ హిట్ కొట్టాలన్న కసితో కవచం సినిమా చేశాడు. కొత్త దర్శకుడు శ్రీనివాస్ మామిళ్లను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా సాయి శ్రీనివాస్‌కు సక్సెస్ అందించిందా..? కథ ; విజయ్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్) విశాఖపట్నం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్. నిజాయితీగా పని చేసే విజయ్ ఎన్కౌంటర్ స్పెలిస్ట్‌గా పేరు తెచ్చుకోవాలని కలలు కంటుంటాడు. ఓ కాఫీ షాప్‌లో పనిచేసే అమ్మాయి(కాజల్)తో ప్రేమలో పడతాడు. కానీ ఆ విషయం ఆ అమ్మాయికి చెప్పే లోపే ఆ అమ్మాయికి పెళ్లి కుదరటంతో విజయ్‌కి దూరమవుతుంది. తరువాత ఓ ప్రమాదం నుంచి సంయుక్త(మెహరీన్) అనే అమ్మాయిని కాపాడతాడు విజయ్. ఆ తరువాతి రోజు విజయ్ తల్లికి యాక్సిడెంట్ కావటంతో సంయుక్త డబ్బు కోసం కిడ్నాప్ నాటకం ఆడదామని సలహా ఇస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకున్న విజయ్ కిడ్నాప్ చేసినట్టుగా సంయుక్త మామయ్యకు ఫోన్ చేసి యాబై లక్షలు తీసుకుంటాడు. కానీ ఆ మరుసటి రోజు సంయుక్త నిజంగానే కిడ్నాప్ అయ్యిందని, ఎస్ఐ విజయ్ కిడ్నాప్ చేశాడని న్యూస్‌లో వస్తుంది. అదే సమయంలో అసలు సంయుక్త విజయ్‌కి కాఫీ షాప్‌లో పరిచయం అయిన అమ్మాయని తెలుస్తుంది. మరి విజయ్‌కి సంయుక్తగా పరిచయం అయిన మరో అమ్మాయి ఎవరు..? అసలు సంయుక్త ఏమైంది..? ఈ కిడ్నాప్‌ల వెనుక ఉన్న వ్యక్తి ఎవరు..?ఈ ప్రశ్నలకు విజయ్ ఎలా సమాధానం కనుకున్నాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరోసారి మాస్ యాక్షన్ హీరోగా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. నటనపరంగా పెద్దగా కొత్తదనం ఏమీ కనిపించకపోయినా పోలీస్ లుక్‌తో ఆకట్టుకున్నాడు. యాక్షన్, డ్యాన్స్‌లతో మెప్పించాడు. హీరోయిన్స్‌గా కనిపించిన కాజల్, మెహరీన్‌లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. గ్లామర్‌తోనూ ఆకట్టుకున్నారు. ప్రతినాయకుడిగా పరిచయం అయిన బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ స్టైలిష్ లుక్‌లో మెప్పించాడు. రెండు షేడ్స్‌ను చాలా బాగా చూపించాడు. అయితే అతని పాత్ర తెర మీద కనిపించేది కొద్ది సేపే కావటంతో పెద్దగా ప్రూవ్ చేసుకునే చాన్స్ దక్కలేదు. పోలీస్ అధికారిగా హరీష్ ఉత్తమన్ పర్ఫెక్ట్గా సరిపోయాడు. ఇతర పాత్రల్లో ముఖేష్ రుషి, పోసాని కృష్ణమురళి, సత్యం రాజేష్ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ ; యాక్షన్ థ్రిల్లర్ అన్న జానర్‌కు తగ్గట్టుగా మంచి ట్విస్ట్‌లతో కథను తయారు చేసుకున్నాడు దర్శకుడు. అయితే కొన్ని సీన్స్‌లో ప్రేక్షకులను థ్రిల్ చేసినా చాలా చోట్ల స్లోగా కథను నడిపించి నిరాశపరిచాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో కిడ్నాప్ సీన్, ఇంటర్వెల్ బ్యాంగ్ తప్ప మిగతా కథనమంతా నెమ్మదిగా నడుస్తూ సహనాన్ని పరీక్షిస్తుంది. సెకండ్ హాఫ్‌లో కథనం స్పీడందుకుంటుంది. క్లైమాక్స్ యాక్షన్ బాగున్నా ఫైట్ సీన్ కోసమే సాగదీసినట్టుగా అనిపిస్తుంది. సినిమాకు మరో మేజర్ మైనస్ పాయింట్ సంగీతం. తమన్ అందించిన పాటల్లో ఒక్కటి కూడా గుర్తుండిపోయేలా లేదు. నేపథ్యం సంగీతం బాగున్నా కొన్ని సన్నివేశాలను డామినేట్ చేసినట్టుగా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫి బాగుంది. వైజాగ్ అందాలు, ఏరియల్ షాట్స్, యాక్షన్ సీన్స్‌లో కెమెరా పనితనం బాగుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ; కథలో మలుపులు యాక్షన్ సీన్స్ మైనస్ పాయింట్స్ ; సంగీతం ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్స్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
తెలియజేయునది ఏమనగా..!
‘‘ఇందుమూలంగా యావన్మంది ప్రజానీకానికి తెలియజేయునది ఏమనగా.. ఈ నెల 12న మా చిత్రం ‘ఎఫ్ 2’టీజర్‌ను విడుదల చేస్తున్నాం’’ అని వచ్చే ఏడాది వెండితెర సంక్రాంతి అల్లుళ్లు వెంకటేశ్, వరుణ్ తేజ్ గురువారం చాటింపు వేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందుతోన్న మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనేది ఉప శీర్షిక. ఇందులో తమన్నా, మెహరీన్ కథానాయికలుగా నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఒక్క పాట మినహా పూర్తయింది. త్వరలోనే ఈ సాంగ్‌ను కూడా పూర్తి చేసి సినిమాను సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు. ‘‘కుటుంబ కథా చిత్రాలకు ప్రాధాన్యత ఇచ్చే మా బ్యానర్లో వస్తోన్న ఔట్ అండ్ ఔట్ ఫ్యామిలీ ఫన్ రైడర్ ‘ఎఫ్ 2’. ‘పటాస్, సుప్రీమ్, రాజా ది గ్రేట్’ వంటి చిత్రాలతో హ్యాట్రిక్ సక్సెస్‌ను సాధించిన అనిల్ రావిపూడి ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ నెల 12న టీజర్‌ను రిలీజ్ చేస్తున్నాం. త్వరలో పాటలను విడుదల చేసి, సంక్రాంతికి చిత్రాన్ని ప్రేక్షకులు ముందుకు తీసుకొస్తాం’’ అని నిర్మాత ‘దిల్’ రాజు పేర్కొన్నారు. -
ఎవరి టాలెంట్‌నూ ఆపలేం
‘‘నేను టీమ్ వర్క్‌ని నమ్ముతాను. పదిమంది దగ్గర పది ఆలోచనలు ఉంటాయి. మనమే కరెక్ట్ అనుకుంటే తప్పు. నాన్నగారికి (బెల్లంకొండ సురేశ్) చాలా అనుభవం ఉంది. అందుకే నా సినిమాల స్క్రిప్ట్స్ సెలక్షన్లో ఆయన సహకారం ఉంటుంది. ఎడిటింగ్ రూమ్‌లో కూడా అభిప్రాయాలను చెప్పమని అడుగుతాను’’ అన్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన చిత్రం ‘కవచం’. కాజల్, మెహరీన్ కథానాయికలుగా నటించారు. నవీన్ శొంటినేని నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చెప్పిన విశేషాలు. ► చిన్నప్పటి నుంచి యాక్షన్ సినిమాలంటే ఇష్టం. ప్రేమకథా చిత్రాల కన్నా యాక్షన్ సినిమాలకు పెద్ద రీచ్ ఉంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. యాక్షన్ నేపథ్యంలోని కథల్లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. ‘కవచం’ యాక్షన్‌తో కూడిన థ్రిల్లర్ మూవీ. ఇందులో పోలీసాఫీసర్ పాత్ర చేశాను. ఈ పాత్ర కోసం ముఖ్యంగా అమితాబ్బచ్చన్గారి సినిమాలు చూశాను. ఆయన విజయ్ పేరుతో చేసిన సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. అందుకే ఈ సినిమాలో నా పాత్రకు విజయ్ అని పెట్టాం (నవ్వుతూ). విజయ్‌పై వచ్చిన ఆరోపణలు తప్పని ఒక్క రోజులో ఎలా నిరూపించగలిగాడు? అనేదే సినిమా కథ. స్క్రీన్‌ప్లే రేసీగా ఉంటుంది. ఇంట్రవెల్ తర్వాత నుంచి 24 గంటల్లో జరిగే కథతో సినిమా ఉంటుంది. ► సినిమాలో ఉన్న ట్విస్ట్‌లను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. సినిమాలో నాకు, అజయ్, నీల్‌నితిన్ ముఖేష్ క్యారెక్టర్స్ మధ్య మంచి గేమ్ ప్లే ఉంటుంది. ఈ సినిమాతో నవీన్ శొంటినేని కొత్త ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. దర్శకుడు శ్రీనివాస్‌కు చాలా అనుభవం ఉంది. ‘దృశ్యం, గోపాల గోపాల’ సినిమాలకు కో డైరెక్టర్‌గా వర్క్ చేశారు. అసలు కొత్త దర్శకుడు తెరకెక్కించిన చిత్రంలా ఉండదు. మా అందరిలో దాగి ఉన్న ప్రతిభను సినిమాకు తగ్గట్లు వినియోగించుకున్నారు. ► ‘జయజానకి నాయక’ సినిమాకు 27 కోట్ల షేర్ వచ్చింది. 15 కోట్లు శాటిలైట్ రైట్స్ వచ్చాయి. మూడో సినిమాకు ఆడియన్స్ నుంచి ఒక హీరోగా ఇంకా ఏం కోరుకుంటాం. అత్యాశ మంచిది కాదు. ‘కవచం’ సినిమా రిలీజ్‌కు ముందే సేఫ్ జోన్లోకి వెళ్లాం. మంచి శాటిలైట్ రైట్స్ వచ్చాయి. ఈ సినిమా 10 కోట్లు చేసినా ప్రాఫిట్లోకి వెళ్లిపోతాం. సక్సెస్ అవుతుందన్న నమ్మకం ఉంది. ► ‘జయజానకి నాయక’ సినిమా లుక్, మా ప్రిపరేషన్‌కి చాలా టైమ్ పట్టింది. ‘సాక్ష్యం’ చిత్రానికి. దాదాపు 165 రోజులు వర్క్ చేశాం. దాదాపు 220 కాల్షీట్లు. ఒక 5 సినిమాలు తీయొచ్చు ఆ టైమ్‌లో. ‘సాక్ష్యం’ సినిమా రిజల్ట్ నిరుత్సాహపరిచిన మాట వాస్తవమే. నాలుగైదు రోజులు బయటకు రాలేదు. లక్కీగా నా చేతిలో వర్క్ ఉంది కాబట్టి షూటింగ్‌కు వెళ్లిపోయాను. లేకపోతే నెక్ట్స్ సినిమా చేయడానికి 6 నెలల టైమ్ పెట్టేది. ► కష్టపడుతుంటే ఫ్యాన్ బేస్ కూడా వస్తుంది. స్టార్ నిర్మాత కొడుకు లాంచ్ అంటే ఈజీగానే ఉంటుంది. కానీ ప్రేక్షకుల నమ్మకాన్ని, ప్రేమను పొందటం కష్టం. ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. ఎవరి ప్రతిభనూ ఆపలేం. ఓ ప్రతిభావంతుడు ఓ వీడియోను తీసి సోషల్ మీడియాలో పెడితే వైరల్ అవుతోంది. ఒకప్పుడు నెపోటిజమ్ (బంధుప్రీతి) ఉండేదేమో. ఇప్పుడు మంచి ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. అందరి ఫ్యాన్స్ నన్ను ఇష్టపడాలని నేను కోరుకుంటాను. ► తేజగారి దర్శకత్వంలో నేను హీరోగా నటిస్తున్న సినిమా తుది దశకు చేరుకుంది. సమ్మర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఈ సినిమాలాగానే నా క్యారెక్టర్ కూడా ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఫస్ట్‌హాఫ్ రొమాంటిక్‌గా, సెకండాఫ్ యాక్షన్‌గా ఉంటుంది. తేజగారితో నాకు మంచి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. కష్టపడేవారికి, బాగా చేసేవారికి ఆయన అంత మంచి వ్యక్తి అసలు ఉండరు. ఆయనతో మూడు, నాలుగు సినిమాలైనా చేస్తాను. అవుట్‌పుట్ బాగా రావడానికి ఆయన ఎందాకైనా వెళతారు. ► నిన్న మొన్నటి వరకు కాస్త కూల్‌గా సినిమాలు చేశాను. ఇప్పుడు మరింత కష్టపడాలని డిసైడ్ అయ్యాను. అక్షయ్ కుమార్గారిలా ఏడాదికి మూడు, నాలుగు సినిమాలను రెడీ చేయాలని అనుకుంటున్నాను. నా తర్వాతి చిత్రాలను నా బర్త్ డే జనవరి 3న వెల్లడిస్తాను. -
మీ కోసం ఇంకా కష్టపడతా
‘‘కవచం’ ఫంక్షన్‌కి వచ్చిన భీమవరం ప్రజలకు చాలా థ్యాంక్స్. నాతో ఇంత మంచి సినిమా చేసిన శ్రీనివాస్‌గారికి, ఇంత మంచి కథను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లిన చోటాగారికి, మిగతా టెక్నీషియన్స్‌కి ధన్యవాదాలు’’ అని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్నారు. శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘కవచం’. మెహరీన్, బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేష్, హర్షవర్థన్ రానే ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. నవీన్ సొంటినేని (నాని) నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న విడుదలకానుంది. తమన్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను భీమవరంలో విడుదల చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘కవచం’ అవుట్‌పుట్ బాగా రావడానికి కారణమైన నవీన్‌గారికి చాలా థ్యాంక్స్. నన్ను నమ్మి భారీ బడ్జెట్‌తో సినిమా చేసిన మీతో ఎన్ని సినిమాలైనా చేస్తాను. ప్రేక్షకుల ప్రేమ, నమ్మకం కోసం ఇంకా కష్టపడతాను’’ అన్నారు. ‘‘కవచం’ మంచి హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నవీన్ సొంటినేని. ‘‘సాయితో పనిచేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటుంటే ఈ సినిమాకి కుదిరింది. బెల్లంకొండ సురేశ్‌గారితో ఆరు సినిమాలు చేశాను.. అన్నీ హిట్. ఈ సినిమా వాటికన్నా పెద్ద హిట్ కావాలి’’ అని తమన్ అన్నారు. ‘‘ఈ సినిమాకి సాయి శ్రీనివాస్‌గారు ఇచ్చిన సహకారం గొప్పది. కాజల్ బాగా నటించారు’’ అన్నారు శ్రీనివాస్ మామిళ్ళ. ‘‘ప్రేక్షకుల సపోర్ట్ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా’’ అని కాజల్ అగర్వాల్ అన్నారు. ‘‘శ్రీనివాస్ మామిళ్ళగారితో నా కెరీర్ మొదలైంది. ఆయన కో డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి కలిసి పని చేస్తున్నాను. కాజల్ ఈ రేంజ్లో ఉండటానికి కారణం తన పనే. సింగిల్ టేక్ ఆర్టిస్ట్స్లో ఎన్టీఆర్ తర్వాత సాయి శ్రీనివాస్‌ని చూశా’’ అన్నారు కెమెరామెన్ చోటా కె. నాయుడు. -
‘కవచం’ ఆడియో లాంచ్
-
అతనే పోలీస్
భయపెట్టేవాడికి, భయపడేవాడికి మధ్య కవచంలా ఒకడుంటాడురా... వాడే పోలీస్... అని హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చెప్పే పవర్ఫుల్ డైలాగ్‌తో రిలీజైంది ‘కవచం’ టీజర్. ఇటీవలే విడుదలైన ఈ టీజర్ 10 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. నవీన్ సొంటినేని నిర్మించిన చిత్రం ‘కవచం’. శ్రీనివాస్ మామిళ్ల దర్శకుడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్, మెహరీన్ హీరో హీరోయిన్లుగా నటించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్న ఈ చిత్రాన్ని ఈ నెల 7న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఆడియో రిలీజ్ వేడుక ఈ రోజు భీమవరంలో జరగనుంది. ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి యస్.యస్. తమన్ స్వరకర్త. -
రావడం పక్కా
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నూతన దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ల తెరకెక్కించిన చిత్రం ‘కవచం’. కాజల్ అగర్వాల్, మెహరీన్ కథానాయికలు. వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ సొంటినేని(నాని) నిర్మించిన ఈ సినిమాని డిసెంబర్ 7న విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి. అయితే ‘కవచం’ విడుదల తేదీ వాయిదా పడిందంటూ ఆన్లైన్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీనిపై స్పందించిన చిత్ర వర్గాలు రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇచ్చారు.‘కవచం’ విడుదల తేదీ విషయంలో ఎలాంటి మార్పు లేదు. ముందుగా చెప్పినట్టు డిసెంబర్ 7వ తేదీనే విడుదల చేస్తున్నాం అంటూ ప్రకటించడంతో అందరి అనుమానాలకు ఫుల్స్టాప్ పడింది. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో సాయి శ్రీనివాస్ తొలిసారి పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ‘కవచం’ టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పటికే 10 మిలియన్ డిజిటల్ వ్యూస్ వచ్చాయి. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు. హర్షవర్ధన్ రానే, బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్, పోసాని కృష్ణ మురళి, ‘సత్యం’ రాజేష్, అపూర్వ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఎస్ఎస్ తమన్, కెమెరా: ఛోటా కె.నాయుడు, సహ నిర్మాత: చాగంటి సంతయ్య. -
ఓన్లీ ఫన్
ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్... వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ఇది. శుక్రవారం ఈ చిత్రం సెట్స్‌లో నో ఫ్రస్ట్రేషన్. ఓన్లీ ఫన్. ఎందుకంటే అనిల్ రావిపూడి బర్త్‌డే. ఈ సందర్భంగా అనిల్ కేక్ కోశాక.. చిత్ర కథానాయికలు తమన్నా, మెహరీన్‌లు ఇలా కేక్ పూసి, ఫన్ చేశారు. అన్నట్లు సంక్రాంతికి ఈ చిత్రం రిలీజ్ కానుంది. -
థ్రిల్లర్ కవచం
‘సాక్ష్యం’ వంటి హిట్ సినిమా తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘కవచం’. కాజల్ అగర్వాల్, మెహరీన్ కథానాయికలు. శ్రీనివాస్ మామిళ్ళను దర్శకునిగా పరిచయం చేస్తూ వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ సొంటినేని(నాని) నిర్మించిన ఈ సినిమాని డిసెంబర్ 7న విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ‘‘థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘కవచం’. ఇందులో సాయి శ్రీనివాస్ తొలిసారి పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఇటీవలే రిలీజ్ అయిన మా చిత్రం టీజర్‌కి 9 మిలియన్ వ్యూస్‌తో అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించేలా మా సినిమా ఉంటుంది. హర్షవర్ధన్ రాణే, బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. తమన్ సంగీతం, ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ హైలైట్’’ అని దర్శక–నిర్మాతలు తెలిపారు. పోసాని కృష్ణ మురళి, ‘సత్యం’ రాజేష్, అపూర్వ తదితరులు నటించిన ఈ చిత్రానికి సహ నిర్మాత: చాగంటి సంతయ్య. -
ఆ ఇద్దరి మధ్య కవచంలా...
‘అనగనగనగా ఓ రాజ్యం ... ఆ రాజ్యానికి రాజు లేడు రాణి మాత్రమే.. ఆ రాణికి కవచంలా ఓ సైనికుడు’... అని విలన్ వాయిస్‌లో వినిపిస్తుంటే, భయపెట్టేవాడికి భయపడేవాడికి మధ్య కవచంలా ఒకడుంటాడురా... వాడే పోలీస్... అని హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చెప్పే పవర్ఫుల్ డైలాగ్‌తో రిలీజైంది ‘కవచం’ టీజర్. వంశధార క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ మామిళ్లని దర్శకుడిగా పరిచయం చేస్తూ నవీన్ శొంఠినేని (నాని) నిర్మిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ ‘కవచం’. డిసెంబర్లో విడుదలవుతున్న ఈ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘మంచి కంటెంట్ ఉన్న సినిమా కోసం ఎదురు చూస్తూ దాదాపు 50 కథలు విన్నాను. శ్రీనివాస్ చెప్పిన స్టోరీ చాలా నచ్చింది. ఎంటర్టైన్మ్ంట్తో పాటు కథ, కథనం ఇంట్రస్టింగ్‌గా ఉండే రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఇది. శ్రీనివాస్ కొత్త వాడిలా కాకుండా అనుభవం ఉన్న డైరెక్టర్లా తీశాడు. సినిమా రషెస్ చూసి సర్ప్రైజ్ అయ్యాను. చోటాగారితో ఇది నా రెండో సినిమా. ఆయన బెస్ట్ విజువల్స్ ఇచ్చారు. నిర్మాత నాని నాతో సినిమా చేయటం కోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. ఆయనతో ఇంత మంచి సినిమా చేయటం హ్యాపీగా ఉంది. కాజల్ నా ఫేవరెట్ యాక్ట్రెస్. ఆమెతో మరో రెండు సినిమాలు చేస్తున్నాను. ఈ సినిమాలో మెహరీన్ కీ రోల్ చేస్తోంది’’ అన్నారు. ‘‘నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన బెల్లంకొండ సురేశ్‌గారికి, హీరో సాయికి థ్యాంక్స్. రెగ్యులర్ ఫిల్మ్‌లా కాకుండా ఓ కొత్త జానర్లో ఈ సినిమా ఉంటుంది. నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్తున్నాను’’ అన్నారు శ్రీనివాస్ మామిళ్ల. నిర్మాత నాని మాట్లాడుతూ– ‘‘సింగిల్ సిట్టింగ్‌లో కథ ఓకే అయ్యింది. కాజల్ అగర్వాల్, మెహరీన్.. ఇద్దరూ కథ విని ఎగై్జట్ అయ్యి మా సినిమా చేశారు. తమన్ బెస్ట్ సాంగ్స్‌తో పాటు, ఆర్.ఆర్ ఇచ్చారు. మా దర్శకునితో ఎన్ని సినిమాలు చేయటానికైనా నేను రెడీ. సినిమా విడుదలయ్యాక మా సినిమానే మాట్లాడుతుంది’’ అన్నారు. కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ– ‘‘ఇది చాలా డిఫరెంట్ సబ్జెక్ట్. నిజంగా వెరీ ఇంటెలిజెంట్ మూవీ ఇది. పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న పాత్రలో నటించాను. సాయి అమేజింగ్ టాలెంట్ ఉన్న హీరో. లవ్లీ వర్కింగ్ విత్ డైరెక్టర్ శ్రీనివాస్’’ అన్నారు. ‘‘టీజర్ నాకు చాలా నచ్చింది. ఈ సినిమా నాకో మంచి ఎక్స్పీరియన్స్’’ అన్నారు మెహరీన్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
న్యాయాన్ని రక్షించే కవచం
అన్యాయాన్ని ఎదురించడానికి ఖాకీ యూనిఫామ్ వేసుకొని సిద్ధమయ్యారు బెల్లంకొండ శ్రీనివాస్. మరి ఆ ప్రయాణంలో ఏ జరిగిందో తెలియాలంటే ‘కవచం’ చిత్రం విడుదల వరకూ ఆగాల్సిందే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్, మెహరీన్ ముఖ్య పాత్రల్లో నూతన దర్శకుడు శ్రీనివాస మామిళ్ల తెరకెక్కిస్తోన్న చిత్రం ‘కవచం’. వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ శొంటినేని నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని శుక్రవారం రిలీజ్ చేశారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సాయి శ్రీనివాస్ తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ విలన్‌గా నటిస్తున్నారు. ‘‘మా సినిమా ప్రస్తుతం టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, డిసెంబర్లో సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: ఛోటా కె.నాయుడు. ∙సాయి శ్రీనివాస్ -
సంక్రాంతికి అల్లుళ్లు వస్తున్నారు
సంక్రాంతి పండగంటే కొత్త అల్లుళ్లు ఇంటికి రావడం సంప్రదాయం. సినీ అల్లుళ్లు ‘వెంకటేశ్, వరుణ్’ కూడా సంక్రాంతికి థియేటర్స్‌లోకి రావడానికి రెడీ అయ్యారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న చిత్రం ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనేది ఉపశీర్షిక. తమన్నా, మెహరీన్ కథానాయికలు. ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. దీపావళి సందర్భంగా ఈ చిత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఇందులో వెంకటేశ్, వరుణ్ తేజ్ తోడల్లుళ్లుగా, తమన్నా, మెహరీన్ అక్కాచెల్లెళ్లుగా నటిస్తున్నారు. చిత్రనిర్మాత ‘దిల్’ రాజు మాట్లాడుతూ– ‘‘కుటుంబ కథా చిత్రాలకు ప్రాధాన్యత ఇచ్చే మా సంస్థలో వస్తోన్న మరో ఫ్యామిలీ ఎంటర్టైనర్. కమర్షియల్ హంగులతో పర్ఫెక్ట్ లాఫ్టర్ రైడ్‌లాంటి చిత్రం. మూడు హిట్ చిత్రాల తర్వాత దర్శకుడు అనిల్ రావిపూడి చేస్తోన్న చిత్రం. ఇప్పటి వరకూ 80శాతం చిత్రీకరణ పూర్తయింది. మూడు పాటలు, క్లైమాక్స్ మాత్రమే బ్యాలెన్స్ ఉన్నాయి. సంక్రాంతికి విడుదలకి ప్లాన్ చేస్తున్నాం’’ అని అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. -
కూలీలుగా..!
సరదాగా ‘ఎఫ్ 2’ సినిమా కోసం కూలీలుగా మారారట వెంకటేశ్, వరుణ్ తేజ్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందుతున్న సినిమా ‘ఎఫ్ 2’. వెంకీ సరసన తమన్నా, వరుణ్‌కి జోడీగా మెహరీన్ నటిస్తున్నారు. ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ థాయ్‌లాండ్‌లో జరుగుతోంది. ఇద్దరు వ్యక్తులు కూలీ బ్యాడ్జ్‌లు కట్టుకున్న ఒక ఫొటోను ట్వీటర్లో పోస్ట్ చేశారు అనిల్ రావిపూడి. ఇన్సెట్లో ఉన్న ఫొటో అదే. ఒక బ్యాడ్జ్‌పై ‘కూలీ నెం 1’ అని, మరో బ్యాడ్జ్ పై ‘కూలీ 786’ అని ఉంది. దీంతో ‘కూలీ నెం.1’ వెంకటేశ్ సినిమా కాబట్టి ఆ బ్యాడ్జ్ ఉన్న హ్యాండ్ వెంకీది అని, ‘ఖైదీ నంబర్ 786’ చిరంజీవి సినిమా కాబట్టి ఆ హ్యాండ్ వరుణ్ తేజ్‌ది అని ఊహలు మొదలయ్యాయి. ఏ సీన్ కోసం వెంకీ, వరుణ్ కూలీలుగా మారారు? అన్నదే సస్పెన్స్. ఇందులో ఈ ఇద్దరూ ఫుల్ లెంగ్త్ కూలీలు కాదని విశ్వసనీయ వర్గాల సమాచారం. -
సందడే సందడి
‘ఎఫ్ 2’ బ్యాచ్ ప్రస్తుతం బ్యాంకాక్‌లో హంగామా చేస్తున్నారు. మొన్నామధ్యే కదా బ్యాంకాక్ నుంచి తిరిగొచ్చారు అంటే.. అవును.. కానీ, తాజా షెడ్యూల్ షూటింగ్ కోసం మళ్లీ అక్కడికే వెళ్లారు. ‘ఎఫ్ 2’ బ్యాచ్ బ్యాంకాక్‌లో చేసిన సందడి ఏ స్థాయిలో ప్రేక్షకులను అలరిస్తుందో చూడాలి. వెంకటేష్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అన్నది ఉప శీర్షిక. వెంకటేష్ సరసన తమన్నా, వరుణ్ తేజ్‌కు జోడీగా మెహరీన్ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ బ్యాంకాక్‌లో జరుగుతోంది. ఇటీవల మొదలైన ఈ షెడ్యూల్ నవంబర్ 5 వరకు జరగనుందని సమాచారం. ఆ తర్వాత హైదరాబాద్‌లో జరగబోయే 15 రోజుల చివరి షెడ్యూల్‌తో ఈ సినిమా చిత్రీకరణ ముగుస్తుందని సమాచారం. ఇందులో వెంకీ, వరుణ్ తోడల్లుళ్లుగా, తమన్నా, మెహరీన్ అక్కాచెల్లెళ్లుగా కనిపిస్తారని టాక్. ఈ సినిమా మేజర్ షూటింగ్ విదేశాల్లో జరుగుతున్నట్లు తెలుస్తోంది. ‘దిల్’ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ స్వరకర్త. ఈ చిత్రాన్ని వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చేయాలనుకుంటున్నారు. -
మరో టూర్‌కి సిద్ధం
ప్రాగ్ వెళ్లి వచ్చిన తోడల్లుళ్లు తర్వాత ఎక్కడికి వెళ్లాలో డిసైడ్ అయ్యారు. మరి ఈసారి డ్యూయెట్ పాడతారో ఏదైనా ముఖ్యమైన సన్నివేశాల కోసమో అన్నది తెలియాల్సి ఉంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఎఫ్ 2’. ఫన్ అండ్ ఫ్రస్టేషన్ అనేది ఉపశీర్షిక. తమన్నా, మెహరీన్ కథానాయికలు. ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ఈ చిత్రం తాజా షెడ్యూల్ బ్యాంకాక్‌లో జరగనుందన్న సంగతి తెలిసిందే. ఈ నెల 15న ఈ షెడ్యూల్ స్టార్ట్ కానుందని సమాచారం. ఈ షెడ్యూల్‌తో సినిమా చిత్రీకరణ 50 శాతానికి పైగా పూర్తవుతుందని టాక్. ఆ తర్వాత లాస్ట్ షెడ్యూల్‌ను హైదరాబాద్‌లో ప్లాన్ చేశారట. మొత్తం షూటింగ్‌ను నవంబర్ నెలలో పూర్తి చేయాలని చిత్రబృందం భావిస్తోంది. ఇందులో వెంకీ, వరుణ్ తోడల్లుళ్లుగా, తమన్నా, మెహరీన్ అక్కా చెల్లెళ్లుగా కనిపించనున్నారు. సంక్రాంతికి విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. -
నన్ను వదిలేయండి ప్లీజ్
‘‘మొన్ననే ‘గీత గోవిందం’ సినిమా ప్రమోషన్స్.. ఇప్పుడు ‘నోటా’ ప్రమోషన్స్. ఇటు తెలుగు అటు తమిళ్ ప్రమోషన్స్‌తో చాలా అలసిపోయాను. శుక్రవారంతో ఈ ప్రమోషన్స్‌కి స్వస్తి చెబుతా. సినిమాలు చేయాలనుకున్నాను. కానీ మరీ నిద్ర లేని రాత్రులు గడిపేంత బిజీ అవ్వాలనుకోలేదు. అయినా ఇది చాలా మంచి అనుభూతినిస్తోంది’’ అని విజయ్ దేవరకొండ అన్నారు. ఆయన హీరోగా, మెహరీన్ కథానాయికగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నోటా’. కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతోంది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ చెప్పిన విశేషాలు... ► రాజకీయాలంటే ఇష్టం లేని ఒక సాధారణ వ్యక్తిని తీసుకెళ్లి ఎన్నికల్లో పోటీ చేయాలని దింపుతారు. అప్పుడు రాజకీయంగా ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నాడన్నదే ‘నోటా’ కథ. రియలిస్టిక్‌గా ఉంటుంది. వాస్తవానికి దగ్గరగా ఉండే నటనంటే నాకూ ఇష్టమే. ఇందులో కొన్ని సొసైటీలో జరిగిన సంఘటనలున్నాయి. ‘నోటా’ని ఎంకరేజ్ చేయాలన్నది మా సినిమా ఉద్దేశం కాదు. టైటిల్‌కి యాప్ట్‌గా ఉంటుందని పెట్టాం. ► ‘నోటా’ కథ విన్నప్పుడు తమిళ రాజకీయాల గురించి తెలియదు. కథ వినగానే కనెక్ట్ అయ్యా. ప్రస్తుత రాజకీయాలు ఎలా ఉన్నాయని మా సినిమా చూశాక ప్రేక్షకులు తెలుసుకుంటారు. ఈ సినిమా తెలంగాణలోని ఓ పార్టీకి సపోర్ట్‌గా ఉంటుందని చేస్తున్న విమర్శల్లో వాస్తవం లేదు. వివాదం చేసేకొద్దీ మా చిత్రానికి కలెక్షన్లు ఇంకా పెరుగుతాయి (నవ్వుతూ). అయినా వివాదాల్లోకి నన్ను ఎందుకు లాగుతున్నారో తెలియడం లేదు. నన్ను వదిలేయండి ప్లీజ్. ► నటుడిగా బిజీ కాకపోతే రచయితగా, అసిస్టెంట్ డైరెక్టర్‌గా వెళదామని గతంలోనే బ్యాకప్ ఆప్షన్ పెట్టుకున్నా. జనరల్‌గా సినిమా రిలీజయ్యాక పైరసీ చేయడం కామన్. అయితే ‘గీత గోవిందం’ 2.30 గంటలు లీక్ అయింది. ప్రేక్షక్షులు థియేటర్‌కి రారేమో? అనుకున్నా. ‘ట్యాక్సీవాలా’ కూడా లీక్ అయింది. ఈ రెండు సినిమాల కోసం ఏడాదిన్నర్ర పనిచేశా. ఇలా లీక్ చేస్తే సినిమా చేసి ఏం లాభం? అనిపించింది. ► తమిళ్లో మంచి సినిమాలు చేస్తున్నారని మనవాళ్లు అంటున్నారు. కానీ, తెలుగులో ‘అర్జున్‌రెడ్డి, రంగస్థలం, మహానటి..’ వంటి ఎన్నో మంచి సినిమాలొస్తున్నాయి. మంచి నటీనటులు, రైటర్లు, డైరెక్టర్లు ఉన్నారు. పెద్ద బడ్జెట్‌తో సినిమాలు గ్రాండ్‌గా ఉంటున్నాయి. చక్కటి సంప్రదాయాలను ప్రోత్సహిస్తున్నారు అని తమిళ ప్రేక్షకులు అంటుంటే చాలా ఆనందంగా ఉంది. ► ప్రతిభ ఉన్నవారిని ప్రోత్సహించాలనే ప్రొడక్షన్ స్టార్ట్ చేశా. ‘పెళ్ళిచూపులు’ సినిమా హిట్ అవుతుందని నేను, డైరెక్టర్ తరుణ్ భాస్కర్ నమ్మకంగా ఉన్నాం. మా నమ్మకం నిజమైంది. మా అంత బలమైన నమ్మకంగా ఉన్నవారు దొరికితే సినిమా స్టార్ట్ చేస్తా. ► ప్రస్తుతం క్రాంతి దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్నా. ఇంకో ద్విభాషా చిత్రం చేయాల్సి ఉంది. ‘నోటా’ విడుదల తర్వాత నిర్ణయం తీసుకుంటా. ఇటీవల వైరల్ అవుతున్న ఫొటోల్లో మీతో కలిసి ఉన్న ఫారిన్ అమ్మాయి ఎవరు? అనే ప్రశ్నకు.. ‘ఆ ఫొటోల్లో ఉన్నది నేనే. వేరే ఎవరో అని చెప్పను. తను ఓ మంచి అమ్మాయి’ అని నవ్వేశారు. -
స్క్రీన్ టెస్ట్
1. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ’ ద్వారా సిల్వర్ స్క్రీన్‌కి పరిచయమైన కథానాయిక ఎవరు? ఎ) నివేథా థామస్ బి) అనూ ఇమ్మాన్యుయేల్ సి) మెహరీన్ డి) నభా నటేశ్ 2.చిరంజీవి 151వ చిత్రంలో ఓ ముఖ్య పాత్రలో నటిస్తున్న తమిళ నటుడెవరో తెలుసా? ఎ) విజయ్ బి) విజయ్ సేతుపతి సి) ధనుశ్ డి) అజిత్ 3. జగపతిబాబు విలన్‌గా టాప్ గేర్‌లో ఉన్నారు. ఆయన విలన్‌గా నటించిన మొదటి సినిమాకు దర్శకుడెవరో తెలుసా? ఎ) బోయపాటి శ్రీను బి) శ్రీను వైట్ల సి) వంశీ పైడిపల్లి డి) సుకుమార్ 4. ‘ఎఫ్ 2’ మల్టీస్టారర్ చిత్రంలో ఓ హీరోగా ప్రముఖ హీరో వెంకటేశ్ నటిస్తున్నారు. మరో హీరో ఎవరో కనుక్కోండి? ఎ) అఖిల్ బి) వరుణ్ తేజ్ సి) నాగచైతన్య డి) నాగశౌర్య 5 1938లో వచ్చిన ‘మాలపిల్ల’ చిత్రానికి దర్శకుడెవరో కనుక్కోండి? ఎ) కె.వి. రెడ్డి బి) చిత్రపు నారాయణరావు సి) చిత్తూరు వి.నాగయ్య డి) గూడవల్లి రామబ్రహ్మం 6. ‘మోసగాళ్లకు మోసగాడు’ 1971లో విడుదలైంది. ఈ చిత్రంలో హీరో కృష్ణ సరసన నటించిన కథానాయిక ఎవరు? ఎ) విజయనిర్మల బి) విజయ లలిత సి) విజయ శాంతి డి) జయలలిత 7. ‘ అహ నా పెళ్లంట’ చిత్రంలో హాస్యానికి పెద్ద పీట వేశారు దర్శకులు జంధ్యాల. ఈ చిత్రంలో పిసినారి పాత్రలో ఒదిగి పోయిన నటుడెవరో లె లుసా? ఎ) బ్రహ్మానందం బి) కోట శ్రీనివాసరావు సి) సుత్తి వీరభద్రరావు డి) సుత్తివేలు 8. నాట్య మయూరి సుధాచంద్రన్ జీవితం ఆధారంగా తెరకెక్కిన చిత్రం పేరేంటి? ఎ) అశ్విని బి) మయూరి సి) శారధ డి) శాంభవి 9 ‘‘పంచదార బొమ్మా బొమ్మా పట్టుకోవద్దనకమ్మా’’ పాట సంగీత దర్శకుడెవరో కనుక్కోండి? ఎ) మణిశర్మ బి) దేవీశ్రీ ప్రసాద్ సి) యం.యం.కీరవాణి డి) యస్.యస్. తమన్ 10. అనుష్క ‘భాగమతి’ చిత్రంలో ఓ ఆఫీసర్‌గా కనిపిస్తారు. ఆమె ఏ ఆఫీసర్‌గా కనిపిస్తారో తెలుసా? ఎ) పోలీస్ బి) డాక్టర్ సి) టీచర్ డి) కలెక్టర్ 11.‘మగాళ్లు ఒట్టి మాయగాళ్లు’ అని హీరో గోపీచంద్‌ను ఉద్దేశించి పాడే హీరోయిన్ ఎవరు? ఎ) కాజల్ అగర్వాల్ బి) భావన సి) ప్రియమణి డి) విమలా రామన్ 12.‘వి.ఐ.పి 2’ చిత్రంలో హీరో ధనుష్‌తో పోటాపోటీగా నటించిన బాలీవుడ్ నటి ఎవరో తెలుసా? ఎ) కాజోల్ బి) ఐశ్వర్వారాయ్ సి) కత్రినా కైఫ్ డి) ఆలియా భట్ 13. ‘అమ్మాయిలను ఇంప్రెస్ చేస్తే పడరు... ఇంప్రెస్ అయితేనే పడతారు’ అనే డైలాగ్ హీరోయిన్ అనుపమా పరమేశ్వరన్ ఏ హీరోతో చెప్తుందో కనుక్కోండి? (క్లూ: ఈ డైలాగ్ రచయిత, దర్శకుడు వేగేశ్న సతీశ్) ఎ) రామ్ బి) శర్వానంద్ సి) అల్లు అర్జున్ డి) సాయిధరమ్ తేజ్ 14. దర్శకరత్న దాసరి నారాయణరావు దర్శకత్వం వహించిన చివరి చిత్రం ఏంటో తెలుసా? ఎ) పరమ వీర చక్ర బి) ఎర్రబస్సు సి) మేస్త్రి డి) యంగ్ ఇండియా 15.తొలి భారతీయ చిత్రనిర్మాతగా ప్రసిద్ధి కెక్కిన నిర్మాత ఎవరు? ఎ) రఘుపతి వెంకయ్యనాయుడు బి)దాదాసాహెబ్ ఫాల్కే సి) హెచ్.యం.రెడ్డి డి) పోతిన శ్రీనివాసరావు 16 . ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ చిత్రంలో సిద్ధార్థ్ సరసన హీరోయిన్గా నటించింది త్రిష. ఆమె స్నేహితురాలిగా నటించిన తెలుగు హీరోయిన్ ఎవరో గుర్తుపట్టండి? ఎ) వేదా బి) మధుశాలిని సి) స్వాతి డి) సోనియా 17.మణిరత్నం దర్శకత్వం వహించిన ‘నవాబ్’ చిత్రంలో నటుడు అరుణ్ విజయ్ భార్యగా ఐశ్వర్యా రాజేశ్ నటించారు. ఆమె ఓ ప్రముఖ తెలుగు నటి మేనకోడలు. ఎవరా నటి? ఎ) హేమ బి) ప్రగతి సి) శ్రీలక్ష్మీ డి) రజిత 18.‘ముద్దబంతి పూవులో మూగబాసలు... మూసి ఉన్న రెప్పలపై ప్రేమలేఖలు..’ పాట పాడిన గాయని ఎవరో తెలుసా? ఎ) చిత్ర బి) పి. సుశీల సి) యస్. జానకి డి) వాణీ జయరాం 19. పై ఫొటోలో ఉన్న చిన్నారి ఒకప్పటి విశ్వ సుందరి.ఎవరు? ఎ) సుస్మితాసేన్ బి) ఐశ్వర్యారాయ్ సి) ప్రియాంకాచోప్రా డి) యుక్తాముఖి 20. ‘ఇంద్రజిత్’ చిత్రంలోని ఈ స్టిల్‌లో యస్వీఆర్తో ఉన్న హీరోయిన్ ఎవరు? ఎ) షావుకారు జానకి బి) కృష్ణకుమారి సి) అంజలీదేవి డి) జమున మీరు 6 సమాధానాల కంటే తక్కువ చెబితే... మీకు సినిమా అంటే ఇష్టం 10 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే ఇంట్రెస్ట్ 15 సమాధానాల వరకూ చెప్పగలిగితే... మీకు సినిమా అంటే పిచ్చి 20 సమాధానాలూ చెప్పగలిగితే... ఇంకోసారి ఈ క్విజ్ చదవకండి! సమాధానాలు: 1) సి 2) బి 3) ఎ 4) బి 5) డి 6) ఎ 7) బి 8) బి 9) సి 10) డి 11) సి 12) ఎ 13) బి 14) బి 15) బి 16) ఎ 17) సి 18) ఎ 19) ఎ 20) సి నిర్వహణ: శివ మల్లాల -
సినిమాలు చూసి ఓటు వేయరు : విజయ్ దేవరకొండ
‘‘నోటా’ లాంటి వైవిధ్యమైన సినిమా తీసినందుకు జ్ఞానవేల్ రాజాగారికి థ్యాంక్స్. ‘పెళ్ళి చూపులు’ సినిమా చూసినప్పుడు విజయ్ కోసం ఓ కథ రాయాలనుకున్నా. ‘అర్జున్ రెడ్డి, గీత గోవిందం’, ఇప్పుడు ‘నోటా’.. ఇవన్నీ చూస్తుంటే మంచి కథతో విజయ్ దగ్గరికి వెళ్లాలని డిసైడ్ అయ్యాను. తప్పకుండా ఒక మంచి స్క్రిప్ట్‌తో వెళతా’’ అని డైరెక్టర్ కొరటాల శివ అన్నారు. విజయ్ దేవరకొండ, మెహరీన్ జంటగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘నోటా’. స్టూడియో గ్రీన్ çపతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నెల 5న విడుదల కానుంది. హైదరాబాద్‌లో నిర్వహించిన ‘నోటా పబ్లిక్ మీట్’లో దర్శకుడు వంశీ పైడిపల్లి మాట్లాడుతూ– ‘‘ఇంత పవర్ఫుల్ సినిమా తీసిన ఆనంద్ శంకర్‌కి ఆల్ ది బెస్ట్. మొదటి సినిమా నుంచి ఆనంద్ చూపిస్తున్న వేరియేషన్స్ బాగున్నాయి. విజయ్‌కి అరుదైన ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కింది’’ అన్నారు. జ్ఞానవేల్ రాజా మాట్లాడుతూ– ‘‘గీత గోవిందం’ సినిమాను తమిళనాడులో రిలీజ్ చేసాం. మంచి రెస్పాన్స్ వచ్చింది. నాన్ ‘బాహుబలి’ రికార్డులను కొల్లగొట్టిన సినిమా ‘గీత గోవిందం’. ఇలాంటి రికార్డులను సాధించడం ఒక్క విజయ్‌కే దక్కింది. ఇక్కడ తనకి హార్డ్ కోర్ ఫాన్స్ ఉన్నట్లే తమిళనాడులోనూ ఉన్నారు’’ అన్నారు. ‘‘నోటా’ సినిమా చాలా బాగుంటుంది. చూసి ఎంజాయ్ చేయండి’’ అన్నారు మెహరీన్. ‘‘ఒక్కో సినిమాలో ఒక్కో రకమైన పాత్రలో కనిపించే విజయ్ బయట చాలా హానెస్ట్‌గా ఉంటాడు’’ అన్నారు దర్శకుడు నాగ్ అశ్విన్. విజయ్ దేవరకొండ మాట్లాడుతూ– ‘‘నోటా’ సినిమా రిలీజ్ ఆపేయాలని అఫిడవిట్లు పెడుతున్నారు. ఎలక్షన్స్ టైమ్‌లో సినిమా వస్తుండటంతో ఈ సినిమా చూసి అందరూ నోటా బటన్ నొక్కేస్తారని, తెలంగాణలో ఒక పార్టీకి ఫేవర్‌గా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు. ఎలాంటి ఇష్యూస్ ఈ సినిమాలో లేవు. అయినా సినిమా చూసి ఓటు వేసే పరిస్థితిలో ప్రజలు లేరు. ఏం చేయాలో వాళ్లకు తెలుసు. కౌంట్ డౌన్ మొదలైంది.. 5న థియేటర్స్‌లో కలుద్దాం’’ అన్నారు. -
పబ్లిక్ మీట్
‘‘అర్జున్ రెడ్డి, గీతగోవిందం’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత విజయ్ దేవరకొండ నటించిన తాజా చిత్రం ‘నోటా’. ఆనంద్ శంకర్ దర్శకత్వంలో స్టూడియో గ్రీన్ పతాకంపై కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మించారు. మెహరీన్ కథానాయిక. అక్టోబర్ 5న ఈ సినిమా విడుదల కానుంది. ఈ సందర్భంగా ప్రమోషన్స్ మొదలుపెట్టారు. అందులో భాగంగా విజయవాడ, హైదరాబాద్‌లలో భారీ పబ్లిక్ మీటింగ్స్ ఏర్పాటు చేస్తున్నారు. సెప్టెంబర్ 30న విజయవాడ, అక్టోబర్ 1న హైదరాబాద్‌లో ఈ మీటింగులకు ‘ది నోటా పబ్లిక్ మీట్’ అని పేరు పెట్టారు. నాజర్, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటించిన పొలిటికల్ డ్రామా ఇది. మెహరీన్ ఇందులో జర్నలిస్ట్ పాత్రలో నటించారు. ‘‘ఇటీవల రిలీజైన ‘నోటా’ ట్రైలర్‌కు అద్భుతమైన స్పందన వచ్చింది. ఈ సినిమాపై భారీ అంచనాలున్నాయి’’ అని చిత్రబృందం పేర్కొంది. -
మాటల తూటా
‘అర్జున్ రెడ్డి, గీత గోవిందం’ సినిమాలతో సూపర్ సక్సెస్‌ఫుల్‌గా ఉన్నారు హీరో విజయ్ దేవరకొండ. తన లేటెస్ట్ మూవీ ‘నోటా’లో యువ రాజకీయ నేతగా కనిపించనున్న సంగతి తెలిసిందే. సినిమాలో పదవీ బాధ్యతలు ఎప్పుడు తీసుకున్నారో థియేటర్లో తెలిసే సమయం ఆసన్నమైంది. విజయ్ దేవరకొండ, మెహరీన్ కౌర్ జంటగా ఆనంద్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన తమిళ, తెలుగు ద్విభాషా పొలిటికల్ థ్రిల్లర్ ‘నోటా’. ఈ సినిమాతో తమిళంలోకి ఎంట్రీ ఇస్తున్నారు విజయ్. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై జ్ఞానవేల్ రాజా నిర్మించారు. ఈ సినిమాను అక్టోబర్ 5న రిలీజ్ చేస్తున్నట్టు చిత్రబృందం ప్రకటించింది. ఇందులో మెహరీన్ జర్నలిస్ట్‌గా కనిపించనున్నారు. ‘గీత గోవిందం’లో కామెడీ టచ్ ఉన్న క్యారెక్టర్లో కనిపించిన విజయ్ దేవరకొండ ‘నోటా’లో అందుకు పూర్తి భిన్నంగా కనిపించనున్నారు. వాడి వేడి డైలాగ్స్‌తో ఈ చిత్రం ఉత్కంఠభరితంగా సాగుతుందట. నాజర్, సత్యరాజ్ కీలక పాత్రల్లో కనిపించనున్న ఈ సినిమాకు సంగీతం: శ్యామ్ సీ.యస్, కెమెరా: శాంతన్ కృష్ణన్. -
ప్రాగ్లో ఫన్ పూర్తి
సరదాగా కాలక్షేపానికి ప్రాగ్ వెళ్లిన తోడల్లుళ్ల వెకేషన్ ముగిసింది. పది రోజుల పాటు వాళ్ల వాళ్ల జోడీలతో పాటలు పాడుకోవడం కోసం వెళ్లిన వీరు ప్రాగ్కి బై బై చెప్పారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనేది క్యాప్షన్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. వెంకటేశ్‌కు జోడీగా తమన్నా, వరుణ్ సరసన మెహరీన్ హీరోయిన్లుగా కనిపిస్తారు.‘ఎఫ్ 2’ చిత్రబృందం కొన్ని సీన్స్, సాంగ్స్ కోసం ప్రాగ్ వెళ్లిన సంగతి తెలిసిందే. పది రోజుల పాటు జరిగిన ఈ షెడ్యూల్ రీసెంట్గా కంప్లీట్ అయింది. ‘‘సక్సెస్‌ఫుల్‌గా ప్రాగ్లో షెడ్యూల్‌ని సూపర్ ఫన్‌తో కంప్లీట్ చేశాం’’ అని అనిల్ రావిపూడి పేర్కొన్నారు. ఈ సినిమాలో వెంకీ, వరుణ్ తోడల్లుళ్లుగా కనిపిస్తారని తెలిసిందే. ఈ సినిమా సంక్రాంతికి రిలీజ్ కానుంది. రాజేంద్రప్రసాద్, ప్రియదర్శి నటిస్తున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. -
ప్రాగ్లో సందడే సందడి
ఇంట్లో ఫ్రస్ట్రేషన్ తట్టుకోలేక ఫన్ కోసం ప్రాగ్ వెళ్లారు వెంకీ, వరుణ్. ఒంటరిగా వెళ్లలేదు తమ జోడీలను తోడుగా తీసుకెళ్లారు. మరి అక్కడ ఏం చేశారంటే.. వాళ్ల జోడీలతో కలసి డ్యూయెట్ పాడుకున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా ‘ఎఫ్ 2’ పేరుతో ఓ మల్టీస్టారర్ తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనేది ఉపశీర్షిక. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేశ్‌కు జోడీగా తమన్నా, వరుణ్ సరసన మెహరీన్ కనిపించనున్నారు. ఈ చిత్రం లేటెస్ట్ షెడ్యూల్ చెక్ రిపబ్లిక్ దేశంలోని ప్రాగ్లో జరుగుతోంది. పది రోజుల పాటు జరిగే ఈ షెడ్యూల్లో ఓ సాంగ్, కొన్ని సీన్స్ చిత్రీకరించనున్నారట. ఈ సినిమాలో తోడల్లుళ్లుగా వెంకీ, వరుణŠ. కనిపిస్తే, వాళ్లను ముప్పుతిప్పలు పెట్టే భార్యలుగా తమన్నా, మెహరీన్ నటిస్తున్నారు. వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానున్న ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. -
రాజకీయాలంటే చిరాకంటోన్న ‘అర్జున్ రెడ్డి’
నాకు రాజకీయాలంటే చిరాకు. కానీ, ఒకవేళ నేనే రాజకీయాలు చేయదలచుకుంటే ఇలానే చేస్తాను అంటున్నారు విజయ్ దేవరకొండ. ‘గీత గోవిందం’ తర్వాత విజయ్ దేవరకొండ నటించిన లేటెస్ట్ సినిమా ‘నోటా’. మెహరీన్ కథానాయిక. తమిళ దర్శకుడు ఆనంద్ శంకర్ తెరకెక్కించిన ఈ చిత్రం తమిళ్, తెలుగు భాషల్లో రూపొందింది. స్టూడియో గ్రీన్ బ్యానర్‌పై జ్ఞానవేల్ రాజా ఈ సినిమా నిర్మించారు. పాలిటిక్స్‌లో తిరుగుబాటు చేసిన ఓ యంగ్ పొలిటీషియన్‌గా ఈ చిత్రం కథ ఉండబోతోందని సమాచారం. ఈ సినిమా ఫస్ట్ లుక్‌ని సోమవారం రిలీజ్ చేశారు. ట్రైలర్‌ను ఈనెల 6న రిలీజ్ చేస్తున్నట్టు చిత్రబృందం పేర్కొంది. నాజర్, సత్యరాజ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం: సామ్.సి. -
జోరుగా...
‘కృష్ణగాడి వీరప్రేమగాథ’ చిత్రంతో తెలుగు చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టారు పంజాబీ బ్యూటీ మెహరీన్. ప్రస్తుతం ఆమె వరుస చిత్రాలతో జోరు మీదున్నారు. విజయ్ దేవరకొండకి జోడీగా ‘నోటా’ చిత్రంలో, వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా తెరకెక్కుతోన్న ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ చిత్రంలో వరుణ్‌తో జతకట్టారు మెహరీన్. మూడు రోజుల కిందట సుధీర్ బాబు హీరోగా ప్రారంభమైన సినిమాలోనూ మెహరీనే కథానాయిక. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్తోనూ ఈ బ్యూటీకి జోడీ కుదిరింది. బెల్లంకొండ శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా శ్రీనివాస్‌ని దర్శకునిగా పరిచయం చేస్తూ ఓ సినిమా తెరకెక్కుతోంది. వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ సొంటినేని నిర్మిస్తున్న ఈ చిత్రంలో మరో హీరోయిన్ చాన్స్ మెహరీన్‌కి దక్కింది. ప్రస్తుతం హైదరాబాద్‌లో జరుగుతోన్న ఈ చిత్రం షూటింగ్లో ఈ బ్యూటీ అడుగుపెట్టారు. సరికొత్త కథతో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో శ్రీనివాస్‌ని పూర్తిగా కొత్త లుక్‌లో చూపిస్తున్నారట దర్శకుడు. నీల్ నితిన్ ముఖేష్, హర్షవర్ధన్ రాణే, పోసాని కృష్ణమురళి, ‘సత్యం’ రాజేష్, అపూర్వ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాత: చాగంటి సంతయ్య, సంగీతం: ఎస్ఎస్ తమన్, కెమెరా: ఛోటా కె.నాయుడు. -
గుమ్మడికాయ కొట్టగానే కొబ్బరికాయ
‘సమ్మోహనం’ హిట్ తర్వాత సుధీర్‌బాబు హీరోగా నటించి, నిర్మించిన ‘నన్ను దోచుకుందువటే’కి ఇటీవలే గుమ్మడికాయ కొట్టారు. ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉండగానే మరో చిత్రానికి కొబ్బరికాయ కొట్టారు. సుధీర్ బాబు, మెహరీన్ జంటగా పులి వాసు దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కనుంది. రిజ్వాన్ ఎంటర్టైన్మెంట్ పతాకంపై రిజ్వాన్ నిర్మిస్తున్న ఈ సినిమా శుక్రవారం హైదరాబాద్‌లో ప్రారంభమైంది. ప్రముఖ రచయిత పరుచూరి గోపాలకృష్ణ కెమెరా స్విచ్చాన్ చేయగా, నిర్మాత ‘దిల్’ రాజు క్లాప్ ఇచ్చారు. దర్శకుడు వీవీ వినాయక్ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. ప్రస్తుతం వస్తున్న చిత్రాలకు భిన్నంగా, వైవిధ్యమైన కథాంశంతో ఈ సినిమా రూపొందనుందని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. రాజేంద్ర ప్రసాద్, నరేష్ వీకే, పోసాని కృష్ణమురళి, ప్రగతి ముఖ్య పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి సహ నిర్మాత: ఖుర్షీద్ (ఖుషి), సంగీతం: ఎస్ఎస్ తమన్, కెమెరా: పి.వి శంకర్. -
ఇంటిలో పోరు.. బ్యాంకాక్‌లో జోరు
బయటికేమో గంభీరంగా కనిపిస్తారు ఈ కో–బ్రదర్స్. కానీ ఇంట్లో మాత్రం భార్యలంటే బెదుర్స్ అంట. మరి ఈ పెళ్లాల టెన్షన్ నుంచి తప్పించుకోవాలంటే ఏం చేయాలా అని ప్లాన్లు మొదలుపెట్టారు. వెంటనే బ్యాంకాక్ బెస్ట్ ఐడియా అనిపించిందట. దాంతో ఛలో బ్యాంకాక్ అనుకున్నారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా దర్శకుడు అనిల్ రావిపూడి తెరకెక్కిస్తున్న మల్టీస్టారర్ చిత్రం ‘ఎఫ్ 2’. ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్ అనేది క్యాప్షన్. ‘దిల్’ రాజు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇందులో వెంకటేశ్ సరసన తమన్నా, వరుణ్‌కు జోడీగా మెహరీన్ నటిస్తున్నారు. ఈ సినిమాలో వెంకటేశ్, వరుణ్‌తేజ్ తోడల్లుళ్లుగా కనిపిస్తారని సమాచారం. భార్యలు పెట్టే టెన్షన్‌తో ఫ్రస్ట్రేట్ అయ్యే భర్తలుగా కామెడీ పంచుతారట. రీసెంట్గా హైదరాబాద్‌లో ఫస్ట్ షెడ్యూల్ కంప్లీట్ చేసుకుంది. నెక్ట్స్ షెడ్యూల్‌ని బ్యాంకాక్‌లో ప్లాన్ చేస్తున్నారు చిత్రబృందం. సుమారు 20 రోజుల పాటు ఈ షెడ్యూల్ బ్యాంకాక్‌లోనే సాగనుందని సమాచారం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ కానుంది. -
కొత్త జంట
‘సమ్మోహనం’ సినిమాతో నటనలో మరో మెట్టు పైకి ఎక్కారు సుధీర్‌బాబు. వచ్చే నెల ‘నన్ను దోచుకుందువటే’ సినిమాతో ఈ ఏడాది మళ్లీ థియేటర్లోకి రానున్నారాయన. మరి.. ఇప్పుడేం చేస్తున్నారు అంటే కొత్త సినిమాకు రేపు కొబ్బరికాయ కొట్టడానికి సిద్ధమయ్యారు. ఇందులో మెహారీన్ కథానాయికగా నటిస్తారు. రిజ్వాన్ నిర్మించనున్నారు. పులి వాసు దర్శకత్వం వహించనున్న ఈ సినిమా ప్రారంభోత్సవం శుక్రవారం జరగనుంది. నిర్మాత ‘దిల్’రాజు, దర్శకుడు వీవీ వినాయక్, రచయిత పరుచూరి గోపాలకృష్ణ ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరు కానున్నారని చిత్రబృందం పేర్కొంది. ఈ సినిమాకు ఖుర్షీద్ సహ నిర్మాత. ఇలా మొత్తానికి బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తూ మస్త్ బిజీగా ఉంటున్నారు హీరో సుధీర్‌బాబు. -
ఆనందం.. వినోదం
ఆడుతూ పాడుతూ షూటింగ్ కంప్లీట్ చేస్తున్నారు ‘ఎఫ్ 2 ఫ్యామిలీ’. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు నిర్మిస్తున్న సినిమా ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనేది ఉప శీర్షిక. ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తయింది. రాజేంద్రప్రసాద్ ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు. ‘‘తొలి షెడ్యూల్ కంప్లీట్ చేశాం. వెంకటేశ్‌గారు అమేజింగ్. బ్రదర్ వరుణ్ తేజ్ లాస్ట్డే మిస్ అయ్యాడు కానీ సెట్లో రాకింగ్ పెర్ఫార్మెన్స్. తమన్నా మీ ఆన్‌స్క్రీన్ సిస్టర్ మోహరీన్ను జాగ్రత్తగా చూసుకోండి. మళ్లీ మీరు ఇద్దరు కలుస్తారని అనుకుంటున్నాను’’ అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ‘‘ఫస్ట్ షెడ్యూల్లో లాస్ట్ డే మిస్సయ్యాను. వెంకటేశ్‌గారు, అందరితో నటించడం ఆనందంగా ఉంది. సెకండ్ షెడ్యూల్ కోసం వెయిట్ చేస్తున్నాను’’ అన్నారు వరుణ్ తేజ్. ‘‘ఎఫ్ 2’ షూటింగ్లో ఫన్ అన్లిమిటెడ్. అనిల్ సర్ దర్శకత్వంలో వర్క్ చేయడం ఆనందంగా ఉంది. మెహరీన్‌ని నేను కలిసినప్పుడు తప్పకుండా మీకు ఆ ఫొటోలు పంపిస్తాను’’ అని తమన్నా పేర్కొన్నారు. ఈ సినిమాలో వెంకటేశ్, వరుణ్ తేజ్ తోడు అల్లుళ్ల పాత్రలో నటిస్తున్నారని ప్రచారంలో ఉంది. ఇప్పుడు తమన్నా, మెహరీన్ అక్కాచెల్లెళ్లుగా నటిస్తున్నారని హింట్ ఇచ్చారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేయాలని చిత్రబృందం ప్లాన్ చేస్తోంది. వెంకటేశ్, వరుణ్ తేజ్ -
ఫిదా అయ్యారు
గోపీచంద్, మెహరీన్ జంటగా కె.చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పంతం’. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ బ్యానర్‌పై కేకే రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలైంది. ‘‘గ్రాండ్ సక్సెస్ సాధించి రెండో వారంలోకి అడుగు పెట్టింది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ సందర్భంగా కేకే రాధామోహన్ మాట్లాడుతూ– ‘‘గోపీచంద్‌గారి కెరీర్లో 25వ చిత్రం ‘పంతం’ మాబ్యానర్లో నిర్మించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉంది. ఈ సినిమా ఆయనకి ఎంత ముఖ్యమో నాకు అవగాహన ఉండటంతో మేకింగ్‌లో రాజీ పడలేదు. మెసేజ్ ఓరియంటెడ్ కమర్షియల్ చిత్రాలతో ప్రేక్షకులను మెప్పించడం చాలా కష్టం. చక్రవర్తి కొత్తవాడైనా క్లారిటీతో అద్భుతంగా తెరకెక్కించాడు. సినిమాలోని గ్రాండ్‌నెస్ ఆడియన్స్‌ని మెప్పించింది. కోర్టు సన్నివేశంలో గోపీచంద్‌గారు ఎమోషనల్‌గా చెప్పిన డైలాగ్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. ‘పంతం’ గోపీచంద్‌గారి కెరీర్లోనే హయ్యస్ట్ గ్రాసర్‌గా నిలిచింది. అన్ని ఏరియాల్లో సూపర్ కలెక్షన్స్‌తో రెండోవారంలోకి అడుగుపెట్టింది. ఇంతటి సక్సెస్‌కి కారణమైన నటీనటులు, సాంకేతిక నిపుణులు, తిరుగులేని విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు. -
కామెడీ డోస్ డబుల్
ఇక నుంచి ఫన్ డబులవ్వనుంది. కామెడీ డోస్ రెండింతలు కానుంది. ఎందుకంటే వెంకటేశ్ సెట్లోకి ఎంట్రీ ఇచ్చారు కాబట్టి. ఈ ఫన్ రైడ్‌లో ఎలా ఉంటుందో తెలియాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే అంటున్నారు అనిల్ రావిపూడి. వెంకటేశ్, వరుణ్‌తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో ‘ఎఫ్ 2’ అనే మల్టీస్టారర్ రూపొందుతోంది. వెంకటేశ్‌కు జోడీగా తమన్నా, వరుణ్ తేజ్ సరసన మెహరీన్ యాక్ట్ చేస్తున్న ఈ చిత్రాన్ని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’రాజు నిర్మిస్తున్నారు. ఇటీవల స్టార్ట్ అయిన ఈ షూటింగ్లో ఆల్రెడీ వరుణ్, మెహరీన్ జాయిన్ అయ్యారు. లేటెస్ట్గా వెంకటేశ్ కూడా ఎంట్రీ ఇచ్చి డబుల్ ఫన్ సృష్టించనున్నారు. ‘‘ఈరోజు చాలా ఎగై్జటింగ్‌గా ఉంది. ఇవాళ (సోమవారం) వెంకటేశ్‌గారు షూటింగ్లో జాయిన్ అయ్యారు. ఫస్ట్ టైమ్ వెంకటేశ్‌గారితో వర్క్ చేయడం హానర్‌గా ఫీల్ అవుతున్నాను’’ అన్నారు దర్శకుడు అనిల్ రావిపూడి. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీ ప్రసాద్. -
నా కెరీర్లో పంతం బెస్ట్
‘‘పంతం’ వంటి మంచి సినిమా చేశానని అందరూ అభినందిస్తున్నారు. అందరూ చూడాల్సిన సినిమా ఇది. సమాజానికి ఇలాంటి సందేశాలు కావాలి. ఇలాంటి సినిమా చేసినందుకు అభినందనలు అని చాలా మంది ఫోన్ చేశారు’’ అని గోపీచంద్ అన్నారు. గోపీచంద్, మెహరీన్ జంటగా కె.చక్రవర్తి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘పంతం’. ‘ఫర్ ఎ కాస్’ అన్నది ఉప శీర్షిక. శ్రీ సత్యసాయి ఆర్ట్స్ పతాకంపై కె.కె. రాధామోహన్ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 5న విడుదలైంది. ఈ సందర్భంగా సోమవారం నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో హీరో గోపీచంద్ మాట్లాడుతూ– ‘‘దర్శకుడు చక్రి చెప్పింది చెప్పినట్లుగా ఈ సినిమా తెరకెక్కించారు. నా కెరీర్లో ఇది బెస్ట్ చిత్రంగా నిలుస్తుంది. రాధామోహన్‌గారు మంచి అవుట్‌పుట్ రావాలని మేకింగ్‌లో ఎక్కడా కాంప్రమైజ్ కాలేదు. ఇలాంటి సినిమాలను ఎంకరేజ్ చేస్తే మరిన్ని సందేశాత్మక చిత్రాలు వస్తాయి’’ అన్నారు. ‘‘కథ వినగానే గోపీచంద్‌గారైతే సరిపోతారని ఆయనకు కథ చెప్పాం. ఆయన కోసమే ఈ సినిమాను ఇంత గ్రాండ్‌గా నిర్మించాం. చక్రి కొత్తవాడైనా ఎలాంటి కన్ఫ్యూజన్ లేకుండా సినిమా తెరకెక్కించారు. మా బ్యానర్ విలువను పెంచే చిత్రమిది. మంచి కలెక్షన్స్ వస్తున్నాయి’’ అన్నారు కె.కె.రాధామోహన్. ‘‘ఇంత మంచి సినిమాలో భాగమైనందుకు ఆనందంగా ఉంది. సక్సెస్‌ను బాగా ఎంజాయ్ చేస్తున్నాను. గోపీచంద్‌గారితో పనిచేయడం ఎగ్జయిటింగ్‌గా అనిపించింది’’ అన్నారు మెహరీన్. ‘‘కొత్తవాడినైన నన్ను నమ్మి ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు రాధామోహన్‌గారికి థాంక్స్. అన్ని ఏరియాల నుంచి మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంతటి విజయాన్ని అందించిన ప్రేక్షకులకు థ్యాంక్స్’’ అన్నారు కె.చక్రవర్తి. ఈ కార్యక్రమంలో కెమెరామెన్ ప్రసాద్ మూరెళ్ల, పాటల రచయిత భాస్కరభట్ల, రైటర్ రమేశ్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వెంకీ ఎంట్రీ
ఫన్ రైడ్‌ని వెంకటేశ్ లేకుండా స్టార్ట్ చేశారు వరుణ్ తేజ్. ఇప్పుడు ఈ ప్రయాణంలోకి వెంకీ కూడా ఎంటర్ అవుతారట. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా రూపొందుతోన్న మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనేది క్యాప్షన్. ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. నేటి నుంచి ఈ చిత్రం షూటింగ్లో వెంకటేశ్ పాల్గొననున్నారని సమాచారం. ఆల్రెడీ వరుణ్ తేజ్, మెహరీన్‌లు ఈ చిత్రం షూటింగ్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇందులో వెంకీ సరసన తమన్నా యాక్ట్ చేయనున్నారు. -
ఫన్లోకి ఎంట్రీ
ఫన్ను డబుల్ నుంచి ట్రిపుల్ చేయడానికి ఫన్ రైడ్‌లో జాయిన్ అయ్యారు కథానాయిక మెహరీన్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో వెంకటేశ్, వరుణ్ తేజ్ ముఖ్య తారలుగా రూపొందుతోన్న మల్టీస్టారర్ మూవీ ‘ఎఫ్ 2’. ‘ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్’ అనేది ఉపశీర్షిక. ‘దిల్’ రాజు నిర్మిస్తున్నారు. ఈ సినిమా రెగ్యులర్ షూట్‌లోకి రీసెంట్గా వరుణ్ తేజ్ జాయిన్ అయిన విషయం తెలిసిందే. ఇప్పుడు తాజాగా సెట్లోకి మెహరీన్ ఎంట్రీ ఇచ్చారు. వరుణ్‌తేజ్, మెహరీన్‌లపై కీలక సన్నివేశాలను చిత్రీకరించారని సమాచారం. హాస్యనటుడు ప్రియదర్శి కూడా పాల్గొంటున్నారు. ఈ సినిమాలో వెంకీ సరసన తమన్నా నటించనున్నారన్న విషయం తెలిసిందే.