ఇమేజ్‌ కోసం ఆలోచించను | Kalyan Ram Speech At Entha Manchi Vadavura Movie | Sakshi
Sakshi News home page

ఇమేజ్‌ కోసం ఆలోచించను

Published Tue, Jan 14 2020 1:50 AM | Last Updated on Tue, Jan 14 2020 3:50 AM

Kalyan Ram Speech At Entha Manchi Vadavura Movie - Sakshi

‘‘సంక్రాంతి పండగంటే రైతుల పండగే కాదు.. మా సినిమావాళ్లకు కూడా పండగే. పెద్ద బడ్జెట్‌ సినిమాలతో పాటు మీడియం బడ్జెట్‌ సినిమాలు కూడా విడుదలవుతాయి. ఫ్యామిలీ అంతా కలిసి సినిమాలు చూస్తారు. అందుకే సంక్రాంతికి వస్తున్నాం’’ అని కల్యాణ్‌ రామ్‌ అన్నారు. ‘శతమానం భవతి’ ఫేమ్‌ వేగేశ్న సతీష్‌ దర్శకత్వంలో కల్యాణ్‌ రామ్, మెహరీన్‌ జంటగా నటించిన చిత్రం ‘ఎంత మంచివాడవురా’. శ్రీదేవి మూవీస్‌ అధినేత శివలెంక కృష్ణప్రసాద్‌ సమర్పణలో ఆదిత్యా మ్యూజిక్‌ పతాకంపై ఉమేష్‌ గుప్త, సుభాష్‌ గుప్త నిర్మించిన ఈ సినిమా ఈ నెల 15న విడుదలవుతోంది. ఈ సందర్భంగా కల్యాణ్‌ రామ్‌ పంచుకున్న విశేషాలు...

► ‘ఎంత మంచివాడవురా..’ అనే పాట తాతయ్య (ఎన్టీఆర్‌) ‘నమ్మినబంటు’ చిత్రంలోనిది. డైరెక్టర్‌గారు ఈ సినిమాకి తొలుత ‘ఆల్‌ ఈజ్‌ వెల్‌’ అనే టైటిల్‌ అనుకున్నారు.. కానీ, ఆయన సినిమాల టైటిల్‌ తెలుగుదనంతో ఉండటమే కరెక్ట్‌ అనిపించి, కథను బట్టే ఈ టైటిల్‌ని పెట్టాం.

► వేర్వేరు మనస్తత్వాలు, ఆలోచనలు ఉన్న వ్యక్తుల జీవితాల్లోకి హీరో ఎలా ఎంట్రీ ఇచ్చాడు?  వారిని ఎలా మార్చాడు? అనేది కథ. ఇతరులకు ఇవ్వటం అనే పాయింట్‌ను చూపించాం. మనుషులంతా మంచోళ్లే.. వారు చేసే తప్పును తెలియచెప్పాలన్నదే మా సినిమా.

► నేనెప్పుడూ ఇమేజ్‌ కోసం ఆలోచించలేదు. కథ నచ్చితే సినిమాలు చేస్తూ వచ్చాను. రిపీట్‌ కథ, క్యారెక్టర్‌ లేకుండా చూసుకుంటాను. ప్రేక్ష కులకు ఏదైనా కొత్తగా చూపించాలనుకుంటాను. క్యారెక్టర్, కథ కొత్తగా ఉంటే మనం కూడా కొత్తగా ఆలోచిస్తాం. సతీష్‌గారి ‘శతమానం భవతి’ సినిమా చూసిన నా భార్య.. ‘మంచి ఫీల్‌ గుడ్‌ మూవీ చూశాను.. మీరెందుకు కమర్షియల్‌ సినిమాలు చేస్తారు? ఇలాంటి సినిమాలు చేయొచ్చు కదా?’’ అన్నారు.. అలాంటి కథ వచ్చినప్పుడు తప్పకుండా చేస్తాను అన్నాను.. ‘ఎంత మంచివాడవురా’ తో కుదిరింది.  

► మేం ఉమ్మడి కుటుంబం నుండి వచ్చాం. ఇంటికి చుట్టాలు వచ్చి వెళ్లిపోతుంటే చిన్నప్పుడు బాధగా అనిపించేది. ఇప్పుడు మా ఇంట్లో తొమ్మిది మంది ఉంటున్నాం. మా ఇంట్లో ఎలా ఉంటానో ఈ పాత్రని కూడా అలా చేశాను. నా రియల్‌ లైఫ్‌గా దగ్గరగా ఉంటుంది. తారక్‌కి నాకు మధ్య మా సినిమాల గురించి చిన్న చర్చ జరుగుతుంటుంది. ఈ సినిమా చేస్తున్నానని చెప్పగానే తను సంతోషపడ్డాడు.
     పూరి జగన్నాథ్‌గారు, అనిల్‌ రావిపూడితో పనిచేసినప్పుడు ఎంత కంఫర్ట్‌ ఫీలయ్యానో సతీష్‌గారితో పని చేసేటప్పుడు కూడా అలాగే ఫీలయ్యాను.  

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement