కాజల్ అగర్వాల్, సాయి శ్రీనివాస్
‘సాక్ష్యం’ వంటి హిట్ సినిమా తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘కవచం’. కాజల్ అగర్వాల్, మెహరీన్ కథానాయికలు. శ్రీనివాస్ మామిళ్ళను దర్శకునిగా పరిచయం చేస్తూ వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ సొంటినేని(నాని) నిర్మించిన ఈ సినిమాని డిసెంబర్ 7న విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ‘‘థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘కవచం’. ఇందులో సాయి శ్రీనివాస్ తొలిసారి పోలీస్ పాత్రలో కనిపించనున్నారు.
ఇటీవలే రిలీజ్ అయిన మా చిత్రం టీజర్‌కి 9 మిలియన్ వ్యూస్‌తో అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించేలా మా సినిమా ఉంటుంది. హర్షవర్ధన్ రాణే, బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. తమన్ సంగీతం, ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ హైలైట్’’ అని దర్శక–నిర్మాతలు తెలిపారు. పోసాని కృష్ణ మురళి, ‘సత్యం’ రాజేష్, అపూర్వ తదితరులు నటించిన ఈ చిత్రానికి సహ నిర్మాత: చాగంటి సంతయ్య.
Comments
Please login to add a commentAdd a comment