kavacham
-
ఒడిశా, బీహార్ గుణపాఠాల తర్వాత రైల్వేశాఖ ఏం చేస్తున్నదంటే..
ఒడిశా, బీహార్ రైలు ప్రమాదాల తరువాత భారతీయ రైల్వే.. వ్యవస్థాగతంగా భద్రతను మరింత పటిష్టం చేసే పనిలో నిమగ్నమైంది. ఈ క్రమంలో దేశీయంగా అభివృద్ధి చేసిన ఆటోమేటిక్ ట్రైన్ ప్రొటెక్షన్ సిస్టమ్ (ఏటీపీ) ‘కవచ్’ను ఇప్పటి వరకు 139 లోకోమోటివ్‌లపై (ఎలక్ట్రిక్ మల్టిపుల్ యూనిట్ రేక్) 1465 కిలోమీటర్ల పొడవున ఏర్పాటు చేసింది. ఈ వ్యవస్థను దక్షిణ మధ్య రైల్వే విభాగాల్లో అమర్చింది. లింగంపల్లి- వికారాబాద్- వాడికి చెందిన 265 కిలోమీటర్లు, వికాబాద్- బీదర్ సెక్షన్, మన్మాడ్- ముద్ఖేడ్ ధోనే- గుంతకల్ సెక్షన్‌కు చెందిన 959 కిలోమీటర్లు, బీదర్-బర్బణీ సెక్షన్‌కు చెందిన 241 కిలోమీటర్ల పొడవునా కవచ్ ఏర్పాటుకు సంబంధించిన అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. అలాగే ఢిల్లీ-ముంబై, ఢిల్లీ-హౌరా కారిడార్‌కు చెందిన సుమారు మూడు వేల కిలోమీటర్ల మార్గం కోసం టెండర్లు జారీ చేయగా, ఈ మార్గాల్లో పనులు పురోగతిలో ఉన్నాయి. భారతీయ రైల్వే ఆరు వేల కిలోమీటర్ల రైలు మార్గంలో సర్వే, డిటైల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ (డీపీఆర్), పకడ్బందీ అంచనాలతో సహా అనేక సన్నాహక పనులను కూడా ప్రారంభించింది. ‘కవచ్’ అనేది నడుస్తున్న రైళ్ల భద్రతను పెంచడానికి ఉపయోగించే ఆటోమేటెడ్ రైలు రక్షణ వ్యవస్థ. దీనిని మూడు భారతీయ కంపెనీల సహకారంతో రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్ఓ)దేశీయంగా అభివృద్ధి చేసింది. ‘కవచ్’ అనేది రైలు డ్రైవర్‌కు సిగ్నల్స్ పాస్ చేయడంలో, ప్రమాదాలను నివారించడంలో సహాయపడటమే కాకుండా ప్రతికూల వాతావరణంలోనూ రైలును నడపడంలో సహాయపడుతుంది. ‘కవచ్’ కారణంగా రైలు కార్యకలాపాల భద్రత, సామర్థ్యం మరింతగా పెరుగుతుంది. రీసెర్చ్ డిజైన్, స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ సహాయంతో భారతీయ రైల్వే ఈ ‘కవచ్’ వ్యవస్థను సిద్ధం చేసింది. 2012లో ఈ పకడ్బందీ వ్యవస్థను ఉపయోగంలోకి తీసుకువచ్చింది. మొదట్లో ఈ ప్రాజెక్ట్ పేరు ‘ట్రైన్ కొలిజన్ అవాయిడెన్స్ సిస్టమ్’. రైళ్లలో జీరో యాక్సిడెంట్ లక్ష్యాన్ని సాధించేందుకు రైల్వేశాఖ ఈ పకడ్బందీ వ్యవస్థను సిద్ధం చేసింది. పాసింజర్ రైళ్లలో మొదటి ఫీల్డ్ ట్రయల్స్ 2016 ఫిబ్రవరిలో ప్రారంభమయ్యాయి. ఇది కూడా చదవండి: రాబోయే రోజుల్లో... దేశంలోని వాతావరణం ఇలా.. -
కవచ్ ఏమైంది..?
-
రెల్వేకు రక్షణ కవచం
సాక్షి, హైదరాబాద్: ఎదురెదురుగా వస్తున్న రైళ్లు ఢీకొనకుండా స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన ఆటోమెటిక్ ట్రెయిన్ ప్రొటెక్షన్ సిస్టం ‘కవచ్’ విస్తరణలో దక్షిణ మధ్య రైల్వే రికార్డు సృష్టించింది. ఇప్పటి వరకు 1,445 రూటు కిలోమీటర్లను కవచ్ సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తరించారు.‘ఆత్మనిర్భర్ భారత్’లో భాగంగా రైల్వేశాఖ ఈ కవచ్ ప్రాజెక్టును చేపట్టింది. గతేడాది దక్షిణమధ్య రైల్వే పరిధిలో 859 కిలోమీటర్లను కవచ్ పరిధిలోకి తెచ్చారు. తాజాగా ఈ పరిధిని 1,445 కిలోమీటర్లకు విస్తరించారు. రీసెర్చ్ డిజైన్ అండ్ స్టాండర్డ్స్ ఆర్గనైజేషన్ (ఆర్డీఎస్ఓ) ఆధ్వర్యంలో ‘కవచ్’ వ్యవస్థను అభివృద్ధి చేశారు. ప్రమాదకరమైన రెడ్ సిగ్నల్ దాటడం, రైళ్లు ఎదురెదురుగా ఢీకొనకుండా నియంత్రించడం, ఒకవేళ రైలు పరిమితిని మించి వేగంగా ప్రయాణించినప్పుడు వేగాన్ని డ్రైవర్ అదుపు చేయలేకపోయినా బ్రేకింగ్ వ్యవస్థ ఆటోమెటిక్‌గా పని చేయడం కవచ్ సాంకేతికతలోని ప్రత్యేతలు. దశలవారీగా అభివృద్ధి.. దక్షిణమధ్య రైల్వే కవచ్ వ్యవస్థను దశలవారీగా అభివృద్ధి చేసింది. మొదట ‘వాడి’ నుంచి వికారాబాద్ వరకు, సనత్‌నగర్– వికారాబాద్ – బీదర్ సెక్షన్లలో 25 స్టేషన్ల పరిధిలో 264 కిలోమీటర్ల వరకు ప్రయోగాత్మకంగా అమలు చేశారు. అనంతరం అదనంగా 32 స్టేషన్లకు, 322 కిలోమీటర్లకు విస్తరించారు. గత ఏడాది కవచ్‌ను మరో 77 స్టేషన్లలో 859 కిలోమీటర్లకు పొడిగించారు. ప్రస్తుతం కవచ్ వ్యవస్థ 133 రైల్వేస్టేషన్లు, 29 ఎల్సీ గేట్లను, 74 లోకోమోటివ్లను కవర్ చేస్తూ 1,445 కిలోమీటర్లకు విస్తరించినట్లయింది. ప్రత్యేకతలివీ.. రైళ్లు, లోకోమోటివ్‌లు ప్రమాదకరమైన రెడ్ సిగ్నల్ దాటడాన్ని కవచ్ నివారిస్తుంది. సిగ్నలింగ్ తాజా స్థితిగతులను నిరంతరం డ్రైవర్ మెషిన్ ఇంటర్ఫేస్ (డీఎంఐ), లోకో పైలట్ ఆపరేషన్ కమ్ ఇండికేషన్ ప్యానెల్ (ఎల్‌పీఓసీఐపీ)లో– అధిక వేగ నియంత్రణకు ఆటోమెటిక్ బ్రేకింగ్ వ్యవస్థగా కవచ్ పని చేస్తుంది. రైళ్లు లెవల్ క్రాసింగ్ దాటే సమయంలో గేట్ల వద్ద ఆటో విజువలింగ్ వ్యవస్థగా ఇది అప్రమత్తం చేస్తుంది. నెట్వర్క్ మానిటర్ సిస్టం ద్వారా రైలు నడిచే మార్గాలపై ప్రత్యేక కేంద్రీకృత పర్యవేక్షణ ఉంటుంది. (చదవండి: ఈ ఊరికి చేరాలంటే.. 8 కి.మీ. నడవాలి) -
24 గంటల్లో కోటీ 60లక్షల మంది చూశారు!
యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా కాజల్, మెహరీన్ హీరోయిన్లుగా తెరకెక్కిన థ్రిల్లర్ మూవీ కవచం. సాయి శ్రీనివాస్ పోలీస్ ఆఫీసర్‌గా నటించిన ఈ సినిమాకు శ్రీనివాస్ మామిల్ల దర్శకుడు. తెలుగు ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేకపోయిన ఆ సినిమా ఆన్లైన్ మాత్రం సత్తా చాటుతోంది. సోమవారం ఈ సినిమా హిందీ డబ్బింగ్ వర్షన్ యూట్యూబ్‌లో రిలీజ్ అయ్యింది. ఇన్స్పెక్టర్ విజయ్ పేరుతో రిలీజ్ అయిన ఈ సినిమాను 24 గంటల్లోనే కోటీ 60 లక్షల మందికిపైగా వీక్షించారు. మాస్ యాక్షన్ సినిమా కావటంతో పాటు బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ విలన్‌గా నటించటంతో బాలీవుడ్ ప్రేక్షకులు కవచం డబ్బింగ్ వర్షన్‌పై ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. -
రక్షణ కవచం
-
నేను ఆటో ఇమ్యూన్ డిజాస్టర్‌కి గురయ్యాను..
సినిమా: అందుకు నేనింకా సిద్ధమవలేదు అంటోంది నటి కాజల్ అగర్వాల్. తెలుగు, తమిళం భాషల్లో వరుసగా నటిస్తూ బిజీగా ఉన్న ఈ అమ్మడు త్వరలో విశ్వనటుడు కమలహాసన్‌తో జత కట్టడానికి ఆసక్తిగా ఎదురుచూస్తోంది. ఇక తెలుగులో నటించిన కవచం చిత్ర రిజల్ట్ కోసం ఆతృతగా చూస్తోంది. ఈ ఏడాది తన కెరీర్ గురించి క్లుప్తంగా చెప్పుకొచ్చింది. ఇంతకుముందు సీనియర్ హీరోలతో నటించిన నేను ఇప్పుడు యువ హీరోలతో జత కట్టడం యాదృశ్చికమే. నేను మాత్రం కథ పాత్రలకే ప్రాముఖ్యత నిస్తున్నాను. అయితే ఒకే మాదిరి పాత్రల్లో నటించి బోర్ కొడుతోంది. అందుకే ఇకపై అలా నటించాలనుకోవడం లేదు. అయితే తెలుగు చిత్రం కవచం కమర్శియల్ అంశాలతో కూడిన చిత్రం కావడంతో నేనూ ఆ తరహాలోనే నటించాల్సి వచ్చింది. వెబ్ సిరీస్‌లో చాన్స్: వెబ్ సిరీస్‌లో నటించే అవకాశం వచ్చింది. అయితే అందులో నటించడానికి నేను తయారవలేదు. కారణం కొత్త కొత్త ప్రయోగాలు చేయడానికి నేను మానసికంగా సిద్ధం అవలేదు. ఇంకా చెప్పాలంటే అలాంటి సీరీస్‌లో నటించడానికి భయపడ్డాను. అయితే ఇప్పుడు నాలో తెగింపు వచ్చింది. కొత్తగా చేయాలని ఆశిస్తున్నాను. సవాళ్లను ఎదుర్కోవడానికి సిద్ధం అయ్యాను. ఈ ఏడాది నా కెరీర్ గురించి చెప్పాలంటే చాలా బాగుంది. అయితే వ్యక్తిగతంగానే అలా లేదు. ఈ ఏడాది ప్రారంభంలో అనారోగ్యానికి గురయ్యాను. మూడు నెలలు బెడ్‌కే పరిమితం అయ్యానంటే మీరు ఆశ్చర్యపోతారు. నటనకు బ్రేక్ తీసుకుందామనిపించింది. అంగీకరించిన చిత్రాలను పూర్తి చేసి విశ్రాంతి తీసుకుందామని భావించాను. నేను ఆటో ఇమ్యూన్ డిజాస్టర్ అనే వ్యాధికి గురైనట్లు వైద్యులు గుర్తించారు. చాలా నీరసించిపోయాను. దీంతో నటనకు విరామం తీసుకోవాలని తలచినా కుదరలేదు. వరుసగా చిత్రాలను కమిట్ అవడమే అందుకు కారణం. ఇప్పుడు నేను పూర్తిగా కోలుకున్నానని నటి కాజల్ అగర్వాల్ చెప్పుకొచ్చింది -
‘కవచం’ మూవీ రివ్యూ
టైటిల్ : కవచం జానర్ : యాక్షన్ థ్రిల్లర్ తారాగణం : బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్, మెహరీన్, నీల్ నితిన్ ముఖేష్ సంగీతం : తమన్ ఎస్ఎస్ దర్శకత్వం : శ్రీనివాస్ మామిళ్ల నిర్మాత : నవీన్ శొంఠినేని కెరీర్ స్టార్టింగ్ నుంచి భారీ బడ్జెట్ చిత్రాలు చేస్తూ వస్తున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ సారి రూట్ మార్చి ఓ మీడియం రేంజ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇప్పటి వరకు చేసిన సినిమాలకు పాజిటివ్ టాక్ వచ్చినా కమర్షియల్‌గా హిట్ అనిపించుకోలేకపోవటంతో ఈ సారి ఎలాగైనా ఓ భారీ హిట్ కొట్టాలన్న కసితో కవచం సినిమా చేశాడు. కొత్త దర్శకుడు శ్రీనివాస్ మామిళ్లను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా సాయి శ్రీనివాస్‌కు సక్సెస్ అందించిందా..? కథ ; విజయ్ (బెల్లంకొండ సాయి శ్రీనివాస్) విశాఖపట్నం 3 టౌన్ పోలీస్ స్టేషన్లో సబ్ ఇన్స్పెక్టర్. నిజాయితీగా పని చేసే విజయ్ ఎన్కౌంటర్ స్పెలిస్ట్‌గా పేరు తెచ్చుకోవాలని కలలు కంటుంటాడు. ఓ కాఫీ షాప్‌లో పనిచేసే అమ్మాయి(కాజల్)తో ప్రేమలో పడతాడు. కానీ ఆ విషయం ఆ అమ్మాయికి చెప్పే లోపే ఆ అమ్మాయికి పెళ్లి కుదరటంతో విజయ్‌కి దూరమవుతుంది. తరువాత ఓ ప్రమాదం నుంచి సంయుక్త(మెహరీన్) అనే అమ్మాయిని కాపాడతాడు విజయ్. ఆ తరువాతి రోజు విజయ్ తల్లికి యాక్సిడెంట్ కావటంతో సంయుక్త డబ్బు కోసం కిడ్నాప్ నాటకం ఆడదామని సలహా ఇస్తుంది. తప్పనిసరి పరిస్థితుల్లో ఒప్పుకున్న విజయ్ కిడ్నాప్ చేసినట్టుగా సంయుక్త మామయ్యకు ఫోన్ చేసి యాబై లక్షలు తీసుకుంటాడు. కానీ ఆ మరుసటి రోజు సంయుక్త నిజంగానే కిడ్నాప్ అయ్యిందని, ఎస్ఐ విజయ్ కిడ్నాప్ చేశాడని న్యూస్‌లో వస్తుంది. అదే సమయంలో అసలు సంయుక్త విజయ్‌కి కాఫీ షాప్‌లో పరిచయం అయిన అమ్మాయని తెలుస్తుంది. మరి విజయ్‌కి సంయుక్తగా పరిచయం అయిన మరో అమ్మాయి ఎవరు..? అసలు సంయుక్త ఏమైంది..? ఈ కిడ్నాప్‌ల వెనుక ఉన్న వ్యక్తి ఎవరు..?ఈ ప్రశ్నలకు విజయ్ ఎలా సమాధానం కనుకున్నాడు..? అన్నదే మిగతా కథ. నటీనటులు ; బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మరోసారి మాస్ యాక్షన్ హీరోగా ప్రూవ్ చేసుకునే ప్రయత్నం చేశాడు. నటనపరంగా పెద్దగా కొత్తదనం ఏమీ కనిపించకపోయినా పోలీస్ లుక్‌తో ఆకట్టుకున్నాడు. యాక్షన్, డ్యాన్స్‌లతో మెప్పించాడు. హీరోయిన్స్‌గా కనిపించిన కాజల్, మెహరీన్‌లు తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. గ్లామర్‌తోనూ ఆకట్టుకున్నారు. ప్రతినాయకుడిగా పరిచయం అయిన బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ స్టైలిష్ లుక్‌లో మెప్పించాడు. రెండు షేడ్స్‌ను చాలా బాగా చూపించాడు. అయితే అతని పాత్ర తెర మీద కనిపించేది కొద్ది సేపే కావటంతో పెద్దగా ప్రూవ్ చేసుకునే చాన్స్ దక్కలేదు. పోలీస్ అధికారిగా హరీష్ ఉత్తమన్ పర్ఫెక్ట్గా సరిపోయాడు. ఇతర పాత్రల్లో ముఖేష్ రుషి, పోసాని కృష్ణమురళి, సత్యం రాజేష్ తమ పరిధి మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ ; యాక్షన్ థ్రిల్లర్ అన్న జానర్‌కు తగ్గట్టుగా మంచి ట్విస్ట్‌లతో కథను తయారు చేసుకున్నాడు దర్శకుడు. అయితే కొన్ని సీన్స్‌లో ప్రేక్షకులను థ్రిల్ చేసినా చాలా చోట్ల స్లోగా కథను నడిపించి నిరాశపరిచాడు. ముఖ్యంగా ఫస్ట్ హాఫ్‌లో కిడ్నాప్ సీన్, ఇంటర్వెల్ బ్యాంగ్ తప్ప మిగతా కథనమంతా నెమ్మదిగా నడుస్తూ సహనాన్ని పరీక్షిస్తుంది. సెకండ్ హాఫ్‌లో కథనం స్పీడందుకుంటుంది. క్లైమాక్స్ యాక్షన్ బాగున్నా ఫైట్ సీన్ కోసమే సాగదీసినట్టుగా అనిపిస్తుంది. సినిమాకు మరో మేజర్ మైనస్ పాయింట్ సంగీతం. తమన్ అందించిన పాటల్లో ఒక్కటి కూడా గుర్తుండిపోయేలా లేదు. నేపథ్యం సంగీతం బాగున్నా కొన్ని సన్నివేశాలను డామినేట్ చేసినట్టుగా అనిపిస్తుంది. సినిమాటోగ్రఫి బాగుంది. వైజాగ్ అందాలు, ఏరియల్ షాట్స్, యాక్షన్ సీన్స్‌లో కెమెరా పనితనం బాగుంది. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్ ; కథలో మలుపులు యాక్షన్ సీన్స్ మైనస్ పాయింట్స్ ; సంగీతం ఫస్ట్ హాఫ్‌లో కొన్ని సీన్స్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
ముచ్చటగా మూడోసారి..!
యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, సీనియర్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ హీరో హీరోయిన్లుగా తెరకెక్కుతున్న కవచం. ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న ఈసినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఈ సినిమా తరువాత సాయి శ్రీనివాస్ హీరోగా తేజ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో కూడా ఈ జంటే కనువిందు చేయనుంది. అయితే తాజాగా మరో ఇంట్రస్టింగ్ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్‌లో హల్చల్ చేస్తోంది. ఈ రెండు మాత్రమే కాదు మరో సినిమాలో కూడా ఈ జంట కలిసి నటించేందుకు ఓకె చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతానికి డిటెయిల్స్ బయటకు రాకపోయినా.. ముచ్చటగా మూడోసారి స్క్రీన్ షేర్ చేసుకునేందుకు శ్రీనివాస్, కాజల్‌లు రెడీ అవుతున్నట్టుగా వార్తలు హల్చల్ చేస్తున్నాయి. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. -
ఎవరి టాలెంట్‌నూ ఆపలేం
‘‘నేను టీమ్ వర్క్‌ని నమ్ముతాను. పదిమంది దగ్గర పది ఆలోచనలు ఉంటాయి. మనమే కరెక్ట్ అనుకుంటే తప్పు. నాన్నగారికి (బెల్లంకొండ సురేశ్) చాలా అనుభవం ఉంది. అందుకే నా సినిమాల స్క్రిప్ట్స్ సెలక్షన్లో ఆయన సహకారం ఉంటుంది. ఎడిటింగ్ రూమ్‌లో కూడా అభిప్రాయాలను చెప్పమని అడుగుతాను’’ అన్నారు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. శ్రీనివాస్ దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నటించిన చిత్రం ‘కవచం’. కాజల్, మెహరీన్ కథానాయికలుగా నటించారు. నవీన్ శొంటినేని నిర్మించిన ఈ సినిమా రేపు విడుదల కానుంది. ఈ సందర్భంగా బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చెప్పిన విశేషాలు. ► చిన్నప్పటి నుంచి యాక్షన్ సినిమాలంటే ఇష్టం. ప్రేమకథా చిత్రాల కన్నా యాక్షన్ సినిమాలకు పెద్ద రీచ్ ఉంటుందని నా వ్యక్తిగత అభిప్రాయం. యాక్షన్ నేపథ్యంలోని కథల్లో డిఫరెంట్ వేరియేషన్స్ ఉంటాయి. ‘కవచం’ యాక్షన్‌తో కూడిన థ్రిల్లర్ మూవీ. ఇందులో పోలీసాఫీసర్ పాత్ర చేశాను. ఈ పాత్ర కోసం ముఖ్యంగా అమితాబ్బచ్చన్గారి సినిమాలు చూశాను. ఆయన విజయ్ పేరుతో చేసిన సినిమాలు సూపర్ హిట్టయ్యాయి. అందుకే ఈ సినిమాలో నా పాత్రకు విజయ్ అని పెట్టాం (నవ్వుతూ). విజయ్‌పై వచ్చిన ఆరోపణలు తప్పని ఒక్క రోజులో ఎలా నిరూపించగలిగాడు? అనేదే సినిమా కథ. స్క్రీన్‌ప్లే రేసీగా ఉంటుంది. ఇంట్రవెల్ తర్వాత నుంచి 24 గంటల్లో జరిగే కథతో సినిమా ఉంటుంది. ► సినిమాలో ఉన్న ట్విస్ట్‌లను ఆడియన్స్ ఎంజాయ్ చేస్తారు. సినిమాలో నాకు, అజయ్, నీల్‌నితిన్ ముఖేష్ క్యారెక్టర్స్ మధ్య మంచి గేమ్ ప్లే ఉంటుంది. ఈ సినిమాతో నవీన్ శొంటినేని కొత్త ప్రొడక్షన్ స్టార్ట్ చేశారు. దర్శకుడు శ్రీనివాస్‌కు చాలా అనుభవం ఉంది. ‘దృశ్యం, గోపాల గోపాల’ సినిమాలకు కో డైరెక్టర్‌గా వర్క్ చేశారు. అసలు కొత్త దర్శకుడు తెరకెక్కించిన చిత్రంలా ఉండదు. మా అందరిలో దాగి ఉన్న ప్రతిభను సినిమాకు తగ్గట్లు వినియోగించుకున్నారు. ► ‘జయజానకి నాయక’ సినిమాకు 27 కోట్ల షేర్ వచ్చింది. 15 కోట్లు శాటిలైట్ రైట్స్ వచ్చాయి. మూడో సినిమాకు ఆడియన్స్ నుంచి ఒక హీరోగా ఇంకా ఏం కోరుకుంటాం. అత్యాశ మంచిది కాదు. ‘కవచం’ సినిమా రిలీజ్‌కు ముందే సేఫ్ జోన్లోకి వెళ్లాం. మంచి శాటిలైట్ రైట్స్ వచ్చాయి. ఈ సినిమా 10 కోట్లు చేసినా ప్రాఫిట్లోకి వెళ్లిపోతాం. సక్సెస్ అవుతుందన్న నమ్మకం ఉంది. ► ‘జయజానకి నాయక’ సినిమా లుక్, మా ప్రిపరేషన్‌కి చాలా టైమ్ పట్టింది. ‘సాక్ష్యం’ చిత్రానికి. దాదాపు 165 రోజులు వర్క్ చేశాం. దాదాపు 220 కాల్షీట్లు. ఒక 5 సినిమాలు తీయొచ్చు ఆ టైమ్‌లో. ‘సాక్ష్యం’ సినిమా రిజల్ట్ నిరుత్సాహపరిచిన మాట వాస్తవమే. నాలుగైదు రోజులు బయటకు రాలేదు. లక్కీగా నా చేతిలో వర్క్ ఉంది కాబట్టి షూటింగ్‌కు వెళ్లిపోయాను. లేకపోతే నెక్ట్స్ సినిమా చేయడానికి 6 నెలల టైమ్ పెట్టేది. ► కష్టపడుతుంటే ఫ్యాన్ బేస్ కూడా వస్తుంది. స్టార్ నిర్మాత కొడుకు లాంచ్ అంటే ఈజీగానే ఉంటుంది. కానీ ప్రేక్షకుల నమ్మకాన్ని, ప్రేమను పొందటం కష్టం. ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. ఎవరి ప్రతిభనూ ఆపలేం. ఓ ప్రతిభావంతుడు ఓ వీడియోను తీసి సోషల్ మీడియాలో పెడితే వైరల్ అవుతోంది. ఒకప్పుడు నెపోటిజమ్ (బంధుప్రీతి) ఉండేదేమో. ఇప్పుడు మంచి ప్లాట్‌ఫామ్స్ ఉన్నాయి. అందరి ఫ్యాన్స్ నన్ను ఇష్టపడాలని నేను కోరుకుంటాను. ► తేజగారి దర్శకత్వంలో నేను హీరోగా నటిస్తున్న సినిమా తుది దశకు చేరుకుంది. సమ్మర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నాం. ఈ సినిమాలాగానే నా క్యారెక్టర్ కూడా ఫుల్ ఎంటర్టైనింగ్గా ఉంటుంది. ఫస్ట్‌హాఫ్ రొమాంటిక్‌గా, సెకండాఫ్ యాక్షన్‌గా ఉంటుంది. తేజగారితో నాకు మంచి వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంది. కష్టపడేవారికి, బాగా చేసేవారికి ఆయన అంత మంచి వ్యక్తి అసలు ఉండరు. ఆయనతో మూడు, నాలుగు సినిమాలైనా చేస్తాను. అవుట్‌పుట్ బాగా రావడానికి ఆయన ఎందాకైనా వెళతారు. ► నిన్న మొన్నటి వరకు కాస్త కూల్‌గా సినిమాలు చేశాను. ఇప్పుడు మరింత కష్టపడాలని డిసైడ్ అయ్యాను. అక్షయ్ కుమార్గారిలా ఏడాదికి మూడు, నాలుగు సినిమాలను రెడీ చేయాలని అనుకుంటున్నాను. నా తర్వాతి చిత్రాలను నా బర్త్ డే జనవరి 3న వెల్లడిస్తాను. -
ఆ భయాన్ని పోగొట్టేశాను!
2017లో అన్నీ పెద్ద హీరోల సినిమాలే చేశారు. 2018లో యంగ్ హీరోస్తో చేశారు. ఇది కాజల్ 2.0నా? అని అడగ్గా– ‘‘ ఇది ప్లాన్ కాదు. కానీ కొత్త సినిమాల్లో కనిపించాలనుకోవడంలో భాగమే. యంగ్ టాలెంట్, కొత్త ఐడియాలతో వర్క్ చేయాలనుకుంటున్నాను. కమర్షియల్ సినిమాల్లో కూడా కనిపించాలి. కొత్త తరహా సినిమాలూ చేయాలి. ఈ రెండింటినీ బ్యాలెన్స్ చేయాలనుకుంటున్నాను. ఆ బ్యాలెన్స్‌ని ఎంజాయ్ చేస్తున్నాను’’ అన్నారు (నవ్వుతూ). ‘‘ప్రతి సినిమాలో మన పాత్రలో ఏదో ఓ స్పెషాలిటీ ఉంటుందని సినిమాను ఎంచుకోము. కొన్ని సార్లు మన పాత్ర కంటే కూడా సినిమా మొత్తంగానే డిఫరెంట్‌గా ఉంటుంది. అలాంటి సినిమానే ‘కవచం’. అందుకే ఈ సినిమా చేశాను’’ అని కాజల్ అగర్వాల్ అన్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా శ్రీనివాస్ మామిళ్ల తెరకెక్కించిన చిత్రం ‘కవచం’. కాజల్ అగర్వాల్, మెహరీన్ హీరోయిన్లుగా నటించారు. నవీన్ శొంటినేని నిర్మించిన ఈ చిత్రం ఈ శుక్రవారం రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా కాజల్ చెప్పిన విశేషాలు... ►నా ఇన్నేళ్ల కెరీర్ (పదకొండేళ్లు) లో నేను డిఫరెంట్ జానర్ సినిమాలు చేసింది చాలా తక్కువ. అయితే ఇప్పుడు కేవలం నేను పోషించే పాత్రలే కాదు సినిమా కూడా సరికొత్తగా ఉండాలనుకుంటున్నాను. ప్రస్తుతం అలాంటి ఫేజ్‌లో ఉన్నాను. ఎంత కమిటెడ్‌గా ఉన్నాం అన్న దాన్నిబట్టే కెరీర్లో ఎక్కువ సంవత్సరాలు కొనసాగుతాం అనుకుంటున్నా. ►‘కవచం’ పూర్తి స్థాయి థ్రిల్లర్. లవ్‌స్టోరీ ఉన్నా కూడా సినిమాలోని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, సినిమా నడిచే స్పీడ్ అన్నీ కొత్తగా ఉంటాయి. అది నన్ను ఎగై్జట్ చేసింది. తర్వాతేం జరుగుతుంది? అని ఆడియన్స్ కచ్చితంగా ఎగై్జట్ అవుతారనే నమ్మకం ఉంది. ►ఇంతకు ముందు కూడా డిఫరెంట్ సినిమాలకు ఆఫర్స్ వచ్చాయి. కానీ అప్పుడు నేను నా కంఫర్ట్ జోన్లో ఉండిపోయాను. కొత్తవి చేయాలంటే కొంచెం భయపడ్డాను. కానీ ఆ భయాన్ని పోగొట్టేశాను. దర్శకులు కొత్త పాత్రలు ఇస్తూనే ఉన్నారు. ఇప్పుడు యాక్టర్‌గా వచ్చిన గ్రోత్ వల్లే కొత్త క్యారెక్టర్స్ ఒప్పుకోవడానికి వెనకాడటంలేదు. సెక్యూరిటీ, సేఫ్టీ వస్తేనే ప్రయోగాలు చేయడానికి సంకోచించం. నమ్మకం వచ్చే వరకూ పాత దారిలో నడవాల్సిందే. ►సాయి శ్రీనివాస్ స్వీట్ పర్సన్. తనని ‘ఎంతూ (ఉత్సాహపూరిత) కట్లెట్’ అని పిలుస్తుంటా. చాలా ఉత్సాహపరుడు. విపరీతంగా కష్టపడతాడు. ఏదో ఒకటి నేర్చుకోవాలని తపన పడుతుంటాడు. తనని చూస్తుంటే నన్ను నేను చూస్తున్నట్టు అనిపిస్తుంది. ►ఈ ఏడాది మొదలైనప్పుడు ఈ సంవత్సరం స్లో అయిపోతానేమో అనుకున్నాను. ఎందుకంటే ఆరోగ్య సమస్యలతో (ఆటో ఇమ్యూన్ డిజార్డర్) మూడు నెలలు బెడ్ రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి. చేతిలో ఉన్న సినిమాలు పూర్తి చేసి రిలాక్స్ అవుదాం అనుకున్నాను. విచిత్రం ఏంటంటే నేను బిజీగా పనిచేసింది ఈ సంవత్సరమే. బ్రేక్ కూడా తీసుకోవడానికి కుదర్లేదు. ►మోస్ట్ పవర్ఫుల్ చేంజ్ మేకర్ కాజల్ అని ఓ ఆంగ్ల పత్రిక రాసింది. విచిత్రమేంటంటే పవర్ కావాలని అందరూ కోరుకుంటారు. ఉన్నవాళ్లకు ఎలా ఉపయోగించాలో తెలియదు. నాకున్న పవర్‌తో సొసైటీకి ఏదైనా ఉపయోగపడేవి, ప్రభావితం చేసే పనులు చేయాలనుకుంటా. మనకి వచ్చిన పవర్‌తో సమాజానికి తిరిగవ్వడమే అని నా నమ్మకం. ►‘క్వీన్’ రీమేక్ ‘పారిస్ పారిస్’ చేస్తున్నాను. ఫిబ్రవరిలో రిలీజ్ ప్లాన్ చేస్తున్నాం. ‘ఇండియన్ 2’ గురించి సూపర్ ఎగై్జటెడ్‌గా ఉన్నాను. తమిళ చిత్రం ‘కోమలి’లో ఫుల్ కామెడీ రోల్ చేస్తున్నాను. తేజగారితో చేసే సినిమాలో ‘ఇంటెన్స్’ ఉన్న పాత్ర చేస్తున్నాను. అందులో కూడా సాయి శ్రీనివాసే హీరో. కెరీర్లో ఇలాంటి సినిమా చేయలేదు. ఓ సంస్థ ద్వారా అరకులో ఆదివాసి పిల్లల్ని చదివిస్తున్నా. కొన్నేళ్ల క్రితం ఓ స్కూల్ కూడా కట్టించాం. అప్పుడప్పుడు వాళ్లు ‘కాజల్ అక్కా..’ అంటూ కొన్ని వీడియోలు పంపుతుంటారు. అవి చూసినప్పుడు మంచి పని చేస్తున్నామనే సంతృప్తి కలుగుతుంది. సొసైటీలో చాలా మంచి దాగి ఉంది. దాన్ని కరెక్ట్‌గా టచ్ చేస్తే అదే బయటకు వస్తుంది. ఈ ఏడాది పెళ్లిళ్ల సంవత్సరం అయిపోయింది. మనం కూడా పెళ్లి చేసేసుకుందామా? అనిపించింది. (నవ్వుతూ). -
మీ కోసం ఇంకా కష్టపడతా
‘‘కవచం’ ఫంక్షన్‌కి వచ్చిన భీమవరం ప్రజలకు చాలా థ్యాంక్స్. నాతో ఇంత మంచి సినిమా చేసిన శ్రీనివాస్‌గారికి, ఇంత మంచి కథను నెక్ట్స్ లెవల్‌కి తీసుకెళ్లిన చోటాగారికి, మిగతా టెక్నీషియన్స్‌కి ధన్యవాదాలు’’ అని బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అన్నారు. శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వంలో బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్ అగర్వాల్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘కవచం’. మెహరీన్, బాలీవుడ్ నటులు నీల్ నితిన్ ముఖేష్, హర్షవర్థన్ రానే ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. నవీన్ సొంటినేని (నాని) నిర్మించిన ఈ సినిమా ఈ నెల 7న విడుదలకానుంది. తమన్ స్వరపరచిన ఈ చిత్రం పాటలను భీమవరంలో విడుదల చేశారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘కవచం’ అవుట్‌పుట్ బాగా రావడానికి కారణమైన నవీన్‌గారికి చాలా థ్యాంక్స్. నన్ను నమ్మి భారీ బడ్జెట్‌తో సినిమా చేసిన మీతో ఎన్ని సినిమాలైనా చేస్తాను. ప్రేక్షకుల ప్రేమ, నమ్మకం కోసం ఇంకా కష్టపడతాను’’ అన్నారు. ‘‘కవచం’ మంచి హిట్ అవుతుందనే నమ్మకం ఉంది’’ అన్నారు నవీన్ సొంటినేని. ‘‘సాయితో పనిచేయాలని చాలా రోజుల నుంచి అనుకుంటుంటే ఈ సినిమాకి కుదిరింది. బెల్లంకొండ సురేశ్‌గారితో ఆరు సినిమాలు చేశాను.. అన్నీ హిట్. ఈ సినిమా వాటికన్నా పెద్ద హిట్ కావాలి’’ అని తమన్ అన్నారు. ‘‘ఈ సినిమాకి సాయి శ్రీనివాస్‌గారు ఇచ్చిన సహకారం గొప్పది. కాజల్ బాగా నటించారు’’ అన్నారు శ్రీనివాస్ మామిళ్ళ. ‘‘ప్రేక్షకుల సపోర్ట్ వల్లే నేను ఈ స్థాయిలో ఉన్నా’’ అని కాజల్ అగర్వాల్ అన్నారు. ‘‘శ్రీనివాస్ మామిళ్ళగారితో నా కెరీర్ మొదలైంది. ఆయన కో డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి కలిసి పని చేస్తున్నాను. కాజల్ ఈ రేంజ్లో ఉండటానికి కారణం తన పనే. సింగిల్ టేక్ ఆర్టిస్ట్స్లో ఎన్టీఆర్ తర్వాత సాయి శ్రీనివాస్‌ని చూశా’’ అన్నారు కెమెరామెన్ చోటా కె. నాయుడు. -
‘కవచం’ ఆడియో లాంచ్
-
అతనే పోలీస్
భయపెట్టేవాడికి, భయపడేవాడికి మధ్య కవచంలా ఒకడుంటాడురా... వాడే పోలీస్... అని హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చెప్పే పవర్ఫుల్ డైలాగ్‌తో రిలీజైంది ‘కవచం’ టీజర్. ఇటీవలే విడుదలైన ఈ టీజర్ 10 మిలియన్ల వ్యూస్‌ను సొంతం చేసుకుంది. నవీన్ సొంటినేని నిర్మించిన చిత్రం ‘కవచం’. శ్రీనివాస్ మామిళ్ల దర్శకుడు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్, మెహరీన్ హీరో హీరోయిన్లుగా నటించారు. పోస్ట్ ప్రొడక్షన్ పనులు వేగంగా జరుగుతున్న ఈ చిత్రాన్ని ఈ నెల 7న విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఆడియో రిలీజ్ వేడుక ఈ రోజు భీమవరంలో జరగనుంది. ఛోటా కె. నాయుడు సినిమాటోగ్రఫీ అందించిన ఈ చిత్రానికి యస్.యస్. తమన్ స్వరకర్త. -
నీ చేపకళ్లు... చేపకళ్లు గిచ్చుతున్నవే!
‘కాజల్ కళ్లు... బ్యూటీ కావ్యాలు’ అంటారు అభిమానులు. అలా అన్నారు కదా అని అందమైన పాత్రలకే పరిమితమై పోకుండా భిన్నమైన పాత్రలు ఎంచుకుంటుంది కాజల్ అగర్వాల్. అప్పటి ‘లక్ష్మీ కళ్యాణం’ నుంచి ఇప్పటి ‘కవచం’ వరకు జరిగిన ప్రయాణాన్ని చూస్తే కాలంతో పోటీ పడే కిటుకేదో ఆ కళ్లకు తెలిసినట్లే ఉంది. ‘ఒకే మూసలో నటించాలని లేదు’ అంటున్న కాజల్ అంతరంగ తరంగాలు ఇవి... ఆ విధంగా... సినిమా ప్రభావం నిజ జీవితం మీద ఎంత ఉంటుందనే గంభీరమైన చర్చ మాట ఎలా ఉన్నా... సినిమాల పుణ్యమా అని కొత్త విద్యలు నేర్చుకున్నాను. మిస్టర్ పర్ఫెక్ట్, తుపాకి... మొదలైన సినిమాల ద్వారా సైకిలింగ్, స్కూటర్ రైడింగ్ నేర్చుకున్నాను. అంతకుముందు జంతువులంటే భయంగా ఉండేది... సినిమాల్లోకి వచ్చిన తరువాత ఆ భయం హుష్‌కాకి అయిందన్నమాట. షూటింగ్ లేని సమయంలో ఇంట్లో కూర్చొని పుస్తకాలు చదువుతాను. చిత్ర దివకరుని రచనలు అంటే ఇష్టం. పెళ్లంటే ఏమిటంటే... కెరీర్‌కు, పెళ్లికి ముడిపెట్టవద్దు. ప్రతి వ్యక్తి జీవితంలోనూ పెళ్లి అనేది ముఖ్యమైన ఘట్టం. ‘పెళ్లికి రైట్ టైమ్ ఏమిటి?’ అనే ప్రశ్నకు నా సమాధానం: ‘రైట్ పర్సన్’. పెళ్లయితే కెరీర్‌కు çఫుల్స్టాప్ పెట్టాలనే రూల్ ఏమీలేదు. నటులను కార్పొరేట్ ఉద్యోగులతో ఎందుకు పోల్చరు? పెళ్లైనంత మాత్రాన కార్పొరేట్ ఉద్యోగులు తమ ఉద్యోగానికి గుడ్‌బై చెప్పరు కదా! నటుల విషయంలో మాత్రం ‘పెళ్లి’ అనగానే ‘ఇక సినిమాల్లో నటించరన్నమాట’ అనే మాట వినిపిస్తుంది. ఇది తప్పు. పెళ్లైన తరువాత కూడా నటిస్తున్న నటీమణులను చూస్తే చాలా సంతోషంగా ఉంటుంది. గ్లామర్ గ్రామర్ చీరలో కూడా గ్లామరస్‌గా కనిపించవచ్చు. ‘గ్లామరస్’ కోసం బికినీ మాత్రమే ధరించనక్కర్లేదు. గ్లామర్ అనే పదాన్ని వేరే అర్థంలో చూస్తున్నాం. స్కిన్ షోకు ఒక పరిధి ఉంది. డీసెంట్‌గా ఉంటే ఓకే. డీసెన్సీ, వల్గారిటీ మధ్య గీత ఉంది. ఆ గీత దాటితే వల్గారిటీ. ఎన్నో స్టేజీ ప్లేలలో నటించినప్పటికీ సినిమాల్లోకి రావాలని మాత్రం ఎప్పుడూ అనుకోలేదు. ఎంబీయే చేసి మార్కెటింగ్‌లోకి వెళ్లాలనుకున్నాను. కానీ విధి ఇలా డిసైడ్ చేసింది! పాత్రల ఎంపిక విషయానికి వస్తే క్రియేటివ్ శాటిస్ఫేక్షన్ ఇచ్చే పాత్రలు అంటే ఇష్టం. రోల్ మోడల్స్ చిత్రసీమలో నా రోల్‌మోడల్స్ జాబితా కాస్త పెద్దగానే ఉంటుంది. శ్రీదేవి, మాధురీ దీక్షిత్, ప్రియాంకా చోప్రా... ఇలా నా జాబితాలో చాలామందే ఉన్నారు. ఒక్కొక్కరి నుంచి ఒక్కో విషయంలో స్ఫూర్తి పొందుతుంటాను. కొన్ని ప్రశ్నలు చిత్రంగా అనిపిస్తాయి. ఉదాహరణకు... బాలీవుడ్లో చేస్తున్నప్పుడు ‘సౌత్‌లో ఎందుకు చేయడం లేదు?’ అని అడిగేవాళ్లు. సౌత్‌లో బిజీ అయినప్పడు ‘బాలీవుడ్లో ఎందుకు చేయడం లేదు?’ అని అడుగుతుంటారు. -
రావడం పక్కా
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నూతన దర్శకుడు శ్రీనివాస్ మామిళ్ల తెరకెక్కించిన చిత్రం ‘కవచం’. కాజల్ అగర్వాల్, మెహరీన్ కథానాయికలు. వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ సొంటినేని(నాని) నిర్మించిన ఈ సినిమాని డిసెంబర్ 7న విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి. అయితే ‘కవచం’ విడుదల తేదీ వాయిదా పడిందంటూ ఆన్లైన్లో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. దీనిపై స్పందించిన చిత్ర వర్గాలు రిలీజ్ డేట్ విషయంలో క్లారిటీ ఇచ్చారు.‘కవచం’ విడుదల తేదీ విషయంలో ఎలాంటి మార్పు లేదు. ముందుగా చెప్పినట్టు డిసెంబర్ 7వ తేదీనే విడుదల చేస్తున్నాం అంటూ ప్రకటించడంతో అందరి అనుమానాలకు ఫుల్స్టాప్ పడింది. దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రమిది. ఇందులో సాయి శ్రీనివాస్ తొలిసారి పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ‘కవచం’ టీజర్‌కి అద్భుతమైన స్పందన వచ్చింది. ఇప్పటికే 10 మిలియన్ డిజిటల్ వ్యూస్ వచ్చాయి. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించేలా మా సినిమా ఉంటుంది’’ అన్నారు. హర్షవర్ధన్ రానే, బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్, పోసాని కృష్ణ మురళి, ‘సత్యం’ రాజేష్, అపూర్వ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం: ఎస్ఎస్ తమన్, కెమెరా: ఛోటా కె.నాయుడు, సహ నిర్మాత: చాగంటి సంతయ్య. -
‘కవచం’ వాయిదా పడిందా.!
ఇటీవల సాక్ష్యం సినిమాతో ఆకట్టుకున్న బెల్లంకొండ సాయి శ్రీనివాస్ తాజా చిత్రం కవచం. మామిళ్ల శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. ఇటీవల ఫస్ట్ లుక్ పోస్టర్‌నే రిలీజ్ చేసిన చిత్రయూనిట్ సినిమాను డిసెంబర్లో రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. కాజల్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ విలన్‌గా నటిస్తున్నాడు. అయితే అనుకున్నట్టుగా కవచం డిసెంబర్లో విడుదల కావటం లేదన్న టాక్ వినిపిస్తోంది. కారణాలు బయటకు రాకపోయినా సినిమా వాయిదా పడటం మాత్రం కన్ఫామ్ అన్న ప్రచారం జరుగుతోంది. డిసెంబర్ మిస్ అయితే జనవరి నెలాఖరు వరకు పెద్ద సినిమాలు పోటిలో ఉన్నాయి. దీంతో కవచం జనవరి నెలాఖరున లేదా ఫిబ్రవరిలో రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తున్నారట. మరి ఈ ప్రచారంలో నిజం ఎంతవరకు ఉందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే. -
థ్రిల్లర్ కవచం
‘సాక్ష్యం’ వంటి హిట్ సినిమా తర్వాత బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా తెరకెక్కిన చిత్రం ‘కవచం’. కాజల్ అగర్వాల్, మెహరీన్ కథానాయికలు. శ్రీనివాస్ మామిళ్ళను దర్శకునిగా పరిచయం చేస్తూ వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ సొంటినేని(నాని) నిర్మించిన ఈ సినిమాని డిసెంబర్ 7న విడుదల చేయనున్నట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ‘‘థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన చిత్రం ‘కవచం’. ఇందులో సాయి శ్రీనివాస్ తొలిసారి పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఇటీవలే రిలీజ్ అయిన మా చిత్రం టీజర్‌కి 9 మిలియన్ వ్యూస్‌తో అద్భుతమైన స్పందన వచ్చింది. దీంతో సినిమాపై మరిన్ని అంచనాలు పెరిగాయి. అన్నివర్గాల ప్రేక్షకులను అలరించేలా మా సినిమా ఉంటుంది. హర్షవర్ధన్ రాణే, బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ఇతర ముఖ్య పాత్రల్లో నటించారు. తమన్ సంగీతం, ఛోటా కె.నాయుడు సినిమాటోగ్రఫీ హైలైట్’’ అని దర్శక–నిర్మాతలు తెలిపారు. పోసాని కృష్ణ మురళి, ‘సత్యం’ రాజేష్, అపూర్వ తదితరులు నటించిన ఈ చిత్రానికి సహ నిర్మాత: చాగంటి సంతయ్య. -
‘కవచం’ టీజర్ విడుదల వేడుక
-
ఆ ఇద్దరి మధ్య కవచంలా...
‘అనగనగనగా ఓ రాజ్యం ... ఆ రాజ్యానికి రాజు లేడు రాణి మాత్రమే.. ఆ రాణికి కవచంలా ఓ సైనికుడు’... అని విలన్ వాయిస్‌లో వినిపిస్తుంటే, భయపెట్టేవాడికి భయపడేవాడికి మధ్య కవచంలా ఒకడుంటాడురా... వాడే పోలీస్... అని హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ చెప్పే పవర్ఫుల్ డైలాగ్‌తో రిలీజైంది ‘కవచం’ టీజర్. వంశధార క్రియేషన్స్ పతాకంపై శ్రీనివాస్ మామిళ్లని దర్శకుడిగా పరిచయం చేస్తూ నవీన్ శొంఠినేని (నాని) నిర్మిస్తున్న రొమాంటిక్ థ్రిల్లర్ ‘కవచం’. డిసెంబర్లో విడుదలవుతున్న ఈ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు. బెల్లంకొండ శ్రీనివాస్ మాట్లాడుతూ– ‘‘మంచి కంటెంట్ ఉన్న సినిమా కోసం ఎదురు చూస్తూ దాదాపు 50 కథలు విన్నాను. శ్రీనివాస్ చెప్పిన స్టోరీ చాలా నచ్చింది. ఎంటర్టైన్మ్ంట్తో పాటు కథ, కథనం ఇంట్రస్టింగ్‌గా ఉండే రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ ఇది. శ్రీనివాస్ కొత్త వాడిలా కాకుండా అనుభవం ఉన్న డైరెక్టర్లా తీశాడు. సినిమా రషెస్ చూసి సర్ప్రైజ్ అయ్యాను. చోటాగారితో ఇది నా రెండో సినిమా. ఆయన బెస్ట్ విజువల్స్ ఇచ్చారు. నిర్మాత నాని నాతో సినిమా చేయటం కోసం ఎప్పటినుంచో వెయిట్ చేస్తున్నారు. ఆయనతో ఇంత మంచి సినిమా చేయటం హ్యాపీగా ఉంది. కాజల్ నా ఫేవరెట్ యాక్ట్రెస్. ఆమెతో మరో రెండు సినిమాలు చేస్తున్నాను. ఈ సినిమాలో మెహరీన్ కీ రోల్ చేస్తోంది’’ అన్నారు. ‘‘నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన బెల్లంకొండ సురేశ్‌గారికి, హీరో సాయికి థ్యాంక్స్. రెగ్యులర్ ఫిల్మ్‌లా కాకుండా ఓ కొత్త జానర్లో ఈ సినిమా ఉంటుంది. నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్తున్నాను’’ అన్నారు శ్రీనివాస్ మామిళ్ల. నిర్మాత నాని మాట్లాడుతూ– ‘‘సింగిల్ సిట్టింగ్‌లో కథ ఓకే అయ్యింది. కాజల్ అగర్వాల్, మెహరీన్.. ఇద్దరూ కథ విని ఎగై్జట్ అయ్యి మా సినిమా చేశారు. తమన్ బెస్ట్ సాంగ్స్‌తో పాటు, ఆర్.ఆర్ ఇచ్చారు. మా దర్శకునితో ఎన్ని సినిమాలు చేయటానికైనా నేను రెడీ. సినిమా విడుదలయ్యాక మా సినిమానే మాట్లాడుతుంది’’ అన్నారు. కాజల్ అగర్వాల్ మాట్లాడుతూ– ‘‘ఇది చాలా డిఫరెంట్ సబ్జెక్ట్. నిజంగా వెరీ ఇంటెలిజెంట్ మూవీ ఇది. పర్ఫార్మెన్స్కి స్కోప్ ఉన్న పాత్రలో నటించాను. సాయి అమేజింగ్ టాలెంట్ ఉన్న హీరో. లవ్లీ వర్కింగ్ విత్ డైరెక్టర్ శ్రీనివాస్’’ అన్నారు. ‘‘టీజర్ నాకు చాలా నచ్చింది. ఈ సినిమా నాకో మంచి ఎక్స్పీరియన్స్’’ అన్నారు మెహరీన్. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
యాక్షన్ప్యాక్డ్గా ‘కవచం’ టీజర్
బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్, మెహరీన్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కుతున్న సినిమా ‘కవచం’ . ఈ సినిమాతో శ్రీనివాస మామిళ్ల దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ శొంటినేని నిర్మిస్తున్న ఈ సినిమా టీజర్‌ను సోమవారం విడుదల చేశారు. ‘భయపెట్టే వాడికి భయపడే వాడికి మధ్య కవచంలా ఒకడు ఉంటాడురా.. వాడే పోలీస్’ , ‘పోలీసోడితో ఆడాలంటే బుల్లెట్ కంటే బ్రెయిన్ ఫాస్ట్‌గా ఉండాలి’ అంటూ శ్రీనివాస్ చెప్పిన డైలాగ్స్ వింటుంటే కవచం ఫుల్ టూ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. కాగా వరుసగా మాస్ ఎంటర్టెయిన్లతో అలరిస్తున్న శ్రీనివాస్ ఈ సినిమాలో తొలిసారిగా పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నాడు. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ విలన్‌గా నటిస్తున్న ఈ సినిమా డిసెంబరులో ప్రేక్షకుల ముందుకు రానుంది. -
న్యాయాన్ని రక్షించే కవచం
అన్యాయాన్ని ఎదురించడానికి ఖాకీ యూనిఫామ్ వేసుకొని సిద్ధమయ్యారు బెల్లంకొండ శ్రీనివాస్. మరి ఆ ప్రయాణంలో ఏ జరిగిందో తెలియాలంటే ‘కవచం’ చిత్రం విడుదల వరకూ ఆగాల్సిందే. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, కాజల్, మెహరీన్ ముఖ్య పాత్రల్లో నూతన దర్శకుడు శ్రీనివాస మామిళ్ల తెరకెక్కిస్తోన్న చిత్రం ‘కవచం’. వంశధార క్రియేషన్స్ పతాకంపై నవీన్ శొంటినేని నిర్మిస్తున్న ఈ చిత్రం ఫస్ట్‌లుక్‌ని శుక్రవారం రిలీజ్ చేశారు. యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాలో సాయి శ్రీనివాస్ తొలిసారి పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపిస్తున్నారు. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ విలన్‌గా నటిస్తున్నారు. ‘‘మా సినిమా ప్రస్తుతం టాకీ పార్ట్ పూర్తి చేసుకుంది. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి, డిసెంబర్లో సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: ఛోటా కె.నాయుడు. ∙సాయి శ్రీనివాస్ -
బెల్లంకొండ కొత్త సినిమా ‘కవచం’
అల్లుడు శీను సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం అయిన హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్. తొలి సినిమాతోనే హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ హీరో భారీ హిట్ మాత్రం అందుకోలేకపోయాడు. స్టార్ డైరెక్టర్లతో భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్న శ్రీనివాస్ తాజాగా తేజ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో పాటు మరో సినిమాను కూడా పూర్తి చేశాడు శ్రీనివాస్. వంశధార క్రియేషన్స్ బ్యానర్‌పై తొలి ప్రయత్నంగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు శ్రీనివాస్ మామిళ్ల దర్శకత్వం వహిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. కవచం పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో మరోసారి మాస్ యాక్షన్ హీరోగా కనిపించనున్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. బాలీవుడ్ నటుడు నీల్ నితిన్ ముఖేష్ ప్రతినాయక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాలో శ్రీనివాస్ పోలీస్ గెటప్‌లో కనిపించనున్నాడు. ఫస్ట్ లుక్ పోస్టర్లోనే ఈ విషయాన్ని రివీల్ చేశారు చిత్రయూనిట్. -
రానా హీరోగా కవచం
అందాల రాక్షసి సినిమాతో టేస్ట్ ఉన్న దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న హను రాఘవపూడి. కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో కమర్షియల్గానూ ఆకట్టుకున్నాడు. దీంతో ఇప్పుడు యంగ్ హీరోల దృష్టి హను రాఘవపూడి మీద పడింది. గతంలో ఇతని కాంబినేషన్లో సినిమా అనుకొని ఆగిపోయిన హీరోలు కూడా ఇప్పుడు ఆ ప్రాజెక్ట్స్‌ను బయటకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు. అందాల రాక్షసి తరువాత రానా హీరోగా కవచం పేరుతో సినిమా చేయాలనుకున్నాడు హను రాఘవపూడి. ఈ సినిమాను సురేష్ బాబు, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తారన్న టాక్ వినిపించింది. హను కూడా పక్కా ప్లానింగ్‌తో దాదాపు ఏడాదిన్నర పాటు కవచం స్క్రీప్ట్ మీద వర్క్ చేశాడు. కానీ అదే సమయంలో రానా బాహుబలితో బిజీ కావటంతో కవచం సినిమా ఆగిపోయింది. తాజాగా కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న కథను కూడా డీల్ చేయగలడని ప్రూవ్ చేసుకున్న హనుతో కవచం సినిమాను తిరిగి ప్రారంభించడానికి రానా ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. అయితే ఈ సారి కూడా బాహుబలి-2 సినిమాతో బిజీగా ఉన్న రానా, ఈ గ్యాప్ లోనే డేట్స్ అడ్జస్ట్ చేస్తాడా..? లేక బాహుబలి-2 పూర్తయ్యాక హను రాఘవపూడితో సినిమా చేస్తాడా చూడాలి.