ఆ ఇద్దరి మధ్య కవచంలా... | Kavacham Teaser Launch | Sakshi
Sakshi News home page

ఆ ఇద్దరి మధ్య కవచంలా...

Published Tue, Nov 13 2018 12:04 AM | Last Updated on Tue, Nov 13 2018 8:41 AM

Kavacham Teaser Launch - Sakshi

‘అనగనగనగా ఓ రాజ్యం ... ఆ రాజ్యానికి రాజు లేడు రాణి మాత్రమే.. ఆ రాణికి కవచంలా ఓ సైనికుడు’... అని విలన్‌ వాయిస్‌లో వినిపిస్తుంటే, భయపెట్టేవాడికి భయపడేవాడికి మధ్య కవచంలా ఒకడుంటాడురా... వాడే పోలీస్‌... అని హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్‌ చెప్పే పవర్‌ఫుల్‌  డైలాగ్‌తో రిలీజైంది ‘కవచం’ టీజర్‌. వంశధార క్రియేషన్స్‌ పతాకంపై శ్రీనివాస్‌ మామిళ్లని దర్శకుడిగా పరిచయం చేస్తూ  నవీన్‌ శొంఠినేని (నాని) నిర్మిస్తున్న రొమాంటిక్‌ థ్రిల్లర్‌ ‘కవచం’. డిసెంబర్‌లో విడుదలవుతున్న ఈ చిత్రం టీజర్‌ను హైదరాబాద్‌లో విడుదల చేశారు.
 

బెల్లంకొండ శ్రీనివాస్‌ మాట్లాడుతూ– ‘‘మంచి కంటెంట్‌ ఉన్న సినిమా కోసం ఎదురు చూస్తూ దాదాపు 50 కథలు విన్నాను. శ్రీనివాస్‌ చెప్పిన స్టోరీ చాలా నచ్చింది. ఎంటర్‌టైన్మ్‌ంట్‌తో పాటు కథ, కథనం ఇంట్రస్టింగ్‌గా ఉండే రొమాంటిక్‌ థ్రిల్లర్‌ మూవీ ఇది. శ్రీనివాస్‌ కొత్త వాడిలా కాకుండా  అనుభవం ఉన్న డైరెక్టర్‌లా తీశాడు. సినిమా రషెస్‌ చూసి సర్‌ప్రైజ్‌ అయ్యాను. చోటాగారితో ఇది నా రెండో సినిమా. ఆయన బెస్ట్‌ విజువల్స్‌ ఇచ్చారు. నిర్మాత నాని నాతో సినిమా చేయటం కోసం ఎప్పటినుంచో వెయిట్‌ చేస్తున్నారు. ఆయనతో ఇంత మంచి సినిమా చేయటం హ్యాపీగా ఉంది.

కాజల్‌ నా ఫేవరెట్‌ యాక్ట్రెస్‌. ఆమెతో మరో రెండు సినిమాలు చేస్తున్నాను. ఈ సినిమాలో మెహరీన్‌ కీ రోల్‌ చేస్తోంది’’ అన్నారు. ‘‘నన్ను నమ్మి నాకు ఈ అవకాశం ఇచ్చిన బెల్లంకొండ సురేశ్‌గారికి, హీరో సాయికి థ్యాంక్స్‌. రెగ్యులర్‌ ఫిల్మ్‌లా కాకుండా ఓ కొత్త జానర్‌లో ఈ సినిమా ఉంటుంది. నా మీద పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని చెప్తున్నాను’’ అన్నారు శ్రీనివాస్‌ మామిళ్ల. నిర్మాత నాని మాట్లాడుతూ– ‘‘సింగిల్‌ సిట్టింగ్‌లో కథ ఓకే అయ్యింది. కాజల్‌ అగర్వాల్, మెహరీన్‌.. ఇద్దరూ కథ విని ఎగై్జట్‌ అయ్యి మా సినిమా చేశారు.

తమన్‌ బెస్ట్‌ సాంగ్స్‌తో పాటు, ఆర్‌.ఆర్‌ ఇచ్చారు. మా దర్శకునితో ఎన్ని సినిమాలు చేయటానికైనా నేను రెడీ. సినిమా విడుదలయ్యాక మా సినిమానే మాట్లాడుతుంది’’ అన్నారు. కాజల్‌ అగర్వాల్‌ మాట్లాడుతూ– ‘‘ఇది చాలా డిఫరెంట్‌ సబ్జెక్ట్‌. నిజంగా వెరీ ఇంటెలిజెంట్‌ మూవీ ఇది. పర్ఫార్మెన్స్‌కి స్కోప్‌ ఉన్న పాత్రలో నటించాను. సాయి అమేజింగ్‌ టాలెంట్‌ ఉన్న హీరో. లవ్లీ వర్కింగ్‌ విత్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్‌’’ అన్నారు. ‘‘టీజర్‌ నాకు చాలా  నచ్చింది. ఈ సినిమా నాకో మంచి ఎక్స్‌పీరియన్స్‌’’ అన్నారు మెహరీన్‌.

(ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement