రానా హీరోగా కవచం
అందాల రాక్షసి సినిమాతో టేస్ట్ ఉన్న దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న హను రాఘవపూడి. కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో కమర్షియల్గానూ ఆకట్టుకున్నాడు. దీంతో ఇప్పుడు యంగ్ హీరోల దృష్టి హను రాఘవపూడి మీద పడింది. గతంలో ఇతని కాంబినేషన్లో సినిమా అనుకొని ఆగిపోయిన హీరోలు కూడా ఇప్పుడు ఆ ప్రాజెక్ట్స్ను బయటకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నారు.
అందాల రాక్షసి తరువాత రానా హీరోగా కవచం పేరుతో సినిమా చేయాలనుకున్నాడు హను రాఘవపూడి. ఈ సినిమాను సురేష్ బాబు, సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై నిర్మిస్తారన్న టాక్ వినిపించింది. హను కూడా పక్కా ప్లానింగ్తో దాదాపు ఏడాదిన్నర పాటు కవచం స్క్రీప్ట్ మీద వర్క్ చేశాడు. కానీ అదే సమయంలో రానా బాహుబలితో బిజీ కావటంతో కవచం సినిమా ఆగిపోయింది.
తాజాగా కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న కథను కూడా డీల్ చేయగలడని ప్రూవ్ చేసుకున్న హనుతో కవచం సినిమాను తిరిగి ప్రారంభించడానికి రానా ఇంట్రస్ట్ చూపిస్తున్నాడట. అయితే ఈ సారి కూడా బాహుబలి-2 సినిమాతో బిజీగా ఉన్న రానా, ఈ గ్యాప్ లోనే డేట్స్ అడ్జస్ట్ చేస్తాడా..? లేక బాహుబలి-2 పూర్తయ్యాక హను రాఘవపూడితో సినిమా చేస్తాడా చూడాలి.