రూట్ మార్చిన ఎన్టీఆర్..
రూట్ మార్చిన ఎన్టీఆర్..
Published Wed, Apr 6 2016 8:47 AM | Last Updated on Wed, Aug 29 2018 9:26 PM
ఒకప్పుడు మాస్ మూసలో వరుస సినిమాలు చేసిన యంగ్ టైగర్ ఎన్టీఆర్, ఇప్పుడు రూటు మార్చాడు. టెంపర్, నాన్నకు ప్రేమతో లాంటి సినిమాలతో ఆకట్టుకున్న జూనియర్, రాబోయే సినిమాల విషయంలో కూడా కొత్త తరహా పాత్రల మీదే దృష్టి పెడుతున్నాడు. ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో జనతా గ్యారేజ్ సినిమాలో నటిస్తున్న ఎన్టీఆర్, ఈ సినిమాలో ఐఐటి స్టూడెంట్గా కనిపించనున్నాడు. ఈ సినిమా తరువాత పూరి జగన్నాథ్ డైరెక్షన్లో సినిమాకు అంగీకరించిన బుడ్డోడు, ఆ తరువాత పొయటిక్ టచ్ ఉన్న సినిమాలను తెరకెక్కించే హనూ రాఘవపూడి దర్శకత్వంలో సినిమాకు రెడీ అవుతున్నాడు.
అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన హనూ రాఘవపూడి, ఆ సినిమాతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నా.., కమర్షియల్ సక్సెస్ను మాత్రం సాధించలేకపోయాడు. తరువాత లాంగ్ గ్యాప్ తీసుకున్న ఈ క్రియేటివ్ డైరెక్టర్, నాని హీరోగా తెరకెక్కిన కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో మరోసారి ఆకట్టుకున్నాడు. ఎన్టీఆర్ హీరోగా రొమాంటిక్ ఎంటర్టైనర్ను తెరకెక్కించే ప్రయత్నాల్లో ఉన్నాడు హను. ఇప్పటికే బుడ్డోడికి కథ కూడా వినిపించిన ఈ యంగ్ డైరెక్టర్, ప్రస్తుతం పూర్తి స్క్రిప్ట్ను రెడీ చేసే పనిలో ఉన్నాడు.
Advertisement
Advertisement