Hanu Raghavapudi
-
ప్రభాస్ చిత్రంలో ది కశ్మీర్ ఫైల్స్ నటుడు.. డైరెక్టర్ ఎవరంటే?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ఈ ఏడాది ది రాజాసాబ్తో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. గతేడాది కల్కి 2898తో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన ప్రభాస్ మారుతి డైరెక్షన్లో లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ షూటింగ్ దాదాపు పూర్తి కావొస్తోంది. ఈ చిత్రంలో మాళవిక మోహనన్, నిధి అగర్వాల్, రిద్ధి కుమార్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. గతేడాది ప్రభాస్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా నుంచి వీడియోతో కూడిన స్పెషల్ మోషన్ పోస్టర్ని విడుదల చేశారు.ది రాజాసాబ్‌లో ప్రభాస్ ఇప్పటి వరకు చేయని రొమాంటిక్ హారర్ జానర్లో ఈ సినిమాను తెరకెక్కుతోంది. ఈ చిత్రాన్ని పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై నిర్మాత టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది ఏప్రిల్ 10న తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ, హిందీలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ మూవీ తర్వాత రెబల్ స్టార్ ప్రభాస్ హను రాఘవపూడి దర్శకత్వంలో పని చేయనున్నారు. వీరి కాంబోలో వస్తోన్న చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్నారు. (ఇది చదవండి: ‘ది రాజాసాబ్’ అప్డేట్ .. ప్రభాస్ కొత్త లుక్ అదిరింది!)అయితే ఈ క్రేజీ ప్రాజెక్ట్‌లో ది కశ్మీర్ ఫైల్స్ నటుడు అనుపమ్ ఖేర్ కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. బాహుబలి ప్రభాస్‌తో నా 544వ చిత్రం చేయడం ఆనందంగా ఉందని అనుపమ్ ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా ప్రభాస్, డైరెక్టర్‌తో హను రాఘవపూడితో దిగిన ఫోటోలను పంచుకున్నారు. ఈ సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే ప్రకటించనున్నారు. కాగా.. అనుపమ్ ఖేర్ బాలీవుడ్లో తన నటనతో గుర్తింపు తెచ్చుకున్నారు. ది కశ్మీర్ ఫైల్స్ మూవీతో మరింత ఫేమస్ అయ్యారు. ANNOUNCEMENT: Delighted to announce my 544th untitled film with the #Bahubali of #IndianCinema, the one and only #Prabhas ! The film is directed by the very talented @hanurpudi ! And produced by wonderful team of producers of @MythriOfficial ! My very dear friend and brilliant… pic.twitter.com/sBIXCS98t6— Anupam Kher (@AnupamPKher) February 13, 2025 -
డార్లింగ్ కు జోడీగా సాయి పల్లవి..?
-
చలో కారైకుడి
హీరో ప్రభాస్ తమిళనాడుకు వెళ్లారట. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ‘ఫౌజి’ అనే పీరియాడికల్ యాక్షన్ డ్రామా చిత్రం రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఇమాన్వీ ఎస్మాయిల్ హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఈ వారంలో తమిళనాడులో ప్రారంభం కానుందని తెలిసింది. కారైకుడి, మధురై లొకేషన్స్‌లో ప్రభాస్‌తో పాటు ప్రధాన తారాగణం పాల్గొనగా కీలక సన్నివేశాల చిత్రీకరణను ప్లాన్ చేశారట. ఇక ఈ సినిమాలో ఓ బ్రాహ్మణ యువకుడి పాత్రలో ప్రభాస్ కనిపిస్తారని, సినిమాలో దేవీపురం అనే బ్యాక్‌డ్రాప్ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. -
ఫీల్ గుడ్ షురూ
రామ్ పోతినేని హీరోగా పి. మహేశ్‌బాబు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ప్రారంభోత్సవం గురువారం హైదరాబాద్‌లో జరిగింది. ఈ ఫీల్ గుడ్ ఎంటర్టైనర్ మూవీలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. తొలి సన్నివేశానికి దర్శకుడు గోపీచంద్ మలినేని కెమెరా స్విచ్చాన్ చేయగా, దర్శకుడు హను రాఘవపూడి క్లాప్ ఇచ్చారు. దర్శకుడు వెంకీ కుడుముల గౌరవ దర్శకత్వం వహించారు. నవీన్ ఎర్నేని, రవిశంకర్ యలమంచిలి, సీఈవో చెర్రీ, దర్శకులు గోపీచంద్ మలినేని, హను రాఘవపూడి, వెంకీ కుడుముల, శివ నిర్వాణ, పవన్ సాధినేనిలు దర్శకుడు మహేశ్‌కు స్క్రిప్ట్ అందజేశారు. ‘‘యూత్‌ను ఆకట్టుకునే అంశాలతో తెరకెక్కనున్న సినిమా ఇది’’ అన్నారు దర్శక–నిర్మాతలు. -
షూటింగ్లో ప్రభాస్.. రూ.150 కోట్లకు ఓటీటీ డీల్!
డార్లింగ్ ప్రభాస్ చకచకా ఒక్కో సినిమా పూర్తి చేస్తున్నాడు. ప్రస్తుతం 'రాజాసాబ్' చివరి దశ షూటింగ్లో ఉంది. డిసెంబరు కల్లా పూర్తి చేస్తారని తెలుస్తోంది. మరోవైపు హను రాఘవపూడితో చేస్తున్న మూవీ సెట్లోకి ప్రభాస్.. శుక్రవారం అడుగుపెట్టేశాడట. కానీ అంతకు ముందే ఓటీటీ డీల్ పూర్తయినట్లు అదిరిపోయే న్యూస్ ఒకటి బయటకొచ్చింది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ 8 ఎలిమినేషన్ ఓటింగ్.. డేంజర్ జోన్లో ఇద్దరు!)ప్రభాస్.. పాన్ ఇండియా హీరో అవడం మాటేమో గానీ రిజల్ట్‌తో సంబంధం లేకుండా తన గ్రాఫ్ పెంచుకుంటూ పోతున్నాడు. 'సలార్', 'కల్కి 2898' చిత్రాలతో ఇండియన్ బాక్సాఫీస్ కింగ్ అనిపించుకున్నాడు. ప్రస్తుతం 'రాజాసాబ్'తో పాటు ఫౌజీ (రూమర్ టైటిల్) చేస్తున్నాడు. మైత్రీ నిర్మాణంలో హను రాఘవపూడి తీస్తున్న ఈ సినిమాని రూ.150 కోట్లు ఇచ్చి ప్రముఖ ఓటీటీ సంస్థ డిజిటల్ హక్కుల్ని దక్కించుకుందట.రిలీజ్ వరకు అంటే రేటు కాస్త పెరగొచ్చు. అందుకే ముందు జాగ్రత్తగా రూ.150 కోట్లు ఇచ్చేసి ప్రభాస్ మూవీని ఓటీటీ సంస్థ కొనేసినట్లు తెలుస్తోంది. ఈ ప్రాజెక్ట్‌లో ఇమాన్వి హీరోయిన్ అని ఇదివరకే ప్రకటించారు. బహుశా 2026లో ఇది థియేటర్లలో రిలీజ్ కావొచ్చు.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 23 సినిమాలు) -
దసరాకి ఖుషీ
దసరా పండగకి ఫ్యాన్స్‌ని ఖుషీ చేయనున్నారట ప్రభాస్. అది కూడా గ్లింప్స్ రూపంలో. ప్రస్తుతం ప్రభాస్ ‘రాజా సాబా’లో హీరోగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇంకా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ సినిమా అంగీకరించారు. ‘స్పిరిట్’ చిత్రీకరణ వచ్చే ఏడాది ఆరంభం అవుతుందట.ఘను రాఘవపూడి దర్శకత్వంలోని సినిమా షూట్ ఆరంభమైంది. మధురైలో ఫస్ట్ షెడ్యూల్ జరుగుతోంది. అయితే ఈ షెడ్యూల్లో ప్రభాస్ పాల్గొనడంలేదు. రెండో షెడ్యూల్ నుంచి పాల్గొంటారట. ఈ సినిమా వీడియో గ్లింప్స్‌ని దసరాకి విడుదల చేయాలనుకుంటున్నారట. 1940ల నేపథ్యంలో సాగే ఈ చిత్రానికి ‘ఫౌజీ’ అనే టైటిల్ అనుకుంటున్నారట. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం షూటింగ్ వచ్చే మార్చికి పూర్తవుతుందని సమాచారం. -
ఎక్కడ్నుండి పట్టుకొస్తాడ్రా బాబు.. ఈ అందాలన్నీ
-
ప్రభాస్ కొత్త మూవీలో పాకిస్థాన్ నటి కూడా!
'కల్కి'తో హిట్ కొట్టిన ప్రభాస్.. కొత్త సినిమా కూడా మొదలుపెట్టేశాడు. 'సీతారామం' ఫేమ్ హను రాఘవపూడి దర్శకుడు. మొన్ననే పూజ జరగ్గా.. ఈ నెలలోనే షూటింగ్ ఉండొచ్చు. ఇక ఈ మూవీతో ఇమాన్వీ అనే కొత్తమ్మాయి టాలీవుడ్‌కి పరిచయం కానుంది. ఇందులోనే మరో హీరోయిన్‌కి కూడా ఛాన్స్ ఉందని, అందుకోసం పాక్ బ్యూటీని తీసుకుంటారని తెలుస్తోంది. ఇది రూమర్ కాదు, నిజమేనని సమాచారం.(ఇదీ చదవండి: ప్రధాని మోదీనే మించిపోయిన ప్రభాస్ హీరోయిన్)ప్రభాస్-హను మూవీ లాంచ్‌కి ముందు కొన్ని గాసిప్స్ వచ్చాయి. 'ఫౌజీ' అనే టైటిల్ పరిశీలిస్తున్నారని, ఇందులో పాన్ నటి సాజల్ అలే హీరోయిన్ అని అన్నారు. కట్ చేస్తే దిల్లీలో పుట్టి అమెరికాలో ఉంటున్న ఇమాన్వీ అనే అమ్మాయి.. ప్రభాస్‌తో కలిసి సినిమా లాంచింగ్ రోజు కనిపించింది. దీంతో పాక్ నటిది గాసిప్ అనుకున్నారు. కానీ ఈమె రోల్ కూడా ఉందని తెలుస్తోంది. కాకపోతే అనౌన్స్ చేసేవరకు అది గోప్యమేనట.2017లో వచ్చిన 'మామ్' సినిమాలో సాజల్.. శ్రీదేవి కూతురిగా నటించింది. అంతకుముందు కుచ్ అంఖహి, యాఖిన్ క సఫర్, హే దిల్ మేరా తదితర పాక్ సినిమాలు, టీవీ సీరియల్స్‌తో గుర్తింపు తెచ్చుకుంది. ఇదిలా ఉంటే 1940 బ్యాక్ డ్రాప్ స్టోరీతో ప్రభాస్ సినిమా తీస్తున్నారని, ఇందులో సుభాష్ చంద్రబోస్ పాత్ర కూడా ఉంటుందని మాట్లాడుకుంటున్నారు. మరి వీటన్నింటిపై క్లారిటీ ఇస్తే ఫ్యాన్స్ హ్యాపీ అయిపోతారు!(ఇదీ చదవండి: హీరో కిరణ్ అబ్బవరం పెళ్లి సందడి మొదలు) -
ప్రభాస్- హను సినిమా కార్యక్రమంలో పాల్గొన్న స్టార్స్.. వీడియో వైరల్
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న చిత్రం తాజాగా ప్రారంభమైంది. ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్గా నటించనున్నారు. ఈ పాన్ ఇండియా సినిమాని గుల్షన్ కుమార్, భూషణ్‌కుమార్, టీ సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమా ప్రారంభ పూజా కార్యక్రమంలో నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, ప్రశాంత్ నీల్, బుచ్చిబాబుతో పాటు చాలామంది ప్రముఖులు పాల్గొన్నారు. తాజాగా పూజా కార్యక్రమానికి సంబంధించిన వీడియోను మేకర్స్ షేర్ చేశారు.‘‘ఆధిపత్యం కోసం యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఓ వారియర్ మాత్రం వారి పోరాటం దేని కోసమో నిర్వచించగలిగాడు’’ అంటూ ఈ సినిమాని ఉద్దేశించి ‘ఎక్స్’లో పేర్కొన్నారు హను రాఘవపూడి. చారిత్రక అంశాలతో ముడిపడి ఉన్న ఫిక్షనల్ కథాంశంగా ఈ సినిమా ఉంటుంది. ‘‘1940 నేపథ్యంలో సాగే ఈ సినిమాకు హను పవర్ఫుల్ వారియర్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఫౌజీ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నట్లు సమాచారం. మిధున్ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రల్లో నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: సుదీప్ ఛటర్జీ ఐఎస్సీ. -
పవర్ఫుల్ వారియర్
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో హిస్టారికల్ వార్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న చిత్రం శనివారం ప్రారంభమైంది. ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్గా నటించనున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్‌కుమార్, టీ సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మించనున్నారు.‘‘ఆధిపత్యం కోసం యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఓ వారియర్ మాత్రం వారి పోరాటం దేని కోసమో నిర్వచించగలిగాడు’’ అంటూ ఈ సినిమాని ఉద్దేశించి ‘ఎక్స్’లో పేర్కొన్నారు హను రాఘవపూడి. ‘‘1940 నేపథ్యంలో సాగే ఈ సినిమాకు హను పవర్ఫుల్ వారియర్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. మిధున్ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రల్లో నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: విశాల్ చంద్రశేఖర్, కెమెరా: సుదీప్ ఛటర్జీ ఐఎస్సీ. -
ప్రభాస్ కొత్త సినిమా పోస్టర్ విడుదల
పాన్ ఇండియా రేంజ్లో వరుస సినిమాలతో ప్రభాస్ హిట్లు అందుకుంటూనే ఉన్నాడు. రీసెంట్గా కల్కి సినిమాతో బాక్సాఫీస్ వద్ద రూ. 1200 కోట్లు సాధించి రికార్డ్ క్రియేట్ చేసిన ప్రభాస్.. తాజాగా మరో సినిమాను ప్రకటించాడు. డైరెక్టర్ హను రాఘవపూడితో మూవీ లాంఛింగ్ కార్యక్రం తాజాగా జరిగింది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తుంది.ప్రభాస్, హను రాఘవపూడి కాంబినేషన్లో వస్తున్న ఈ సినిమాకు 'ఫౌజీ' అనే టైటిల్ ఫిక్స్ చేసినట్లు సమాచారం. పూర్తిస్థాయి పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ చిత్రం తెరకెక్కనుంది. ఈ మూవీలో సోషల్ మీడియా సెన్సేషన్ ఇమాన్వీ హీరోయిన్గా నటిస్తుంది. సినిమా పూజా కార్యక్రమంలో పాల్గొన్న ఆమె ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. సీతారామం ఫేమ్ విశాల్ చంద్రశేఖర్ ఈ మూవీకి మ్యూజిక్ అందిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుంచి ఒక పోస్టర్‌ను మైత్రీ మూవీ మేకర్స్ షేర్ చేసింది. 1940 దశకంలో జరిగే కథ అని పోస్టర్లో తెలిపింది. పీరియాడికల్ యాక్షన్ చిత్రంగా తెరకెక్కనుందని మేకర్స్ తెలిపారు. మాతృభూమి ప్రజల కోసం ఒక యోధుడు చేసే పోరాటంగా మూవీ ఉండనుంది. ‘పరిత్రాణాయ సాధూనాం’ అంటూ భగవద్గీతలోని ఒక శ్లోకాన్ని పోస్టర్లో చూపించారు. ఇప్పటికే ఈ ప్రాజెక్ట్ కోసం విశాల్ చంద్రశేఖర్ మూడు పాటలు కూడా కంపోజ్ చేసినట్లు డైరెక్టర్ ఓ సందర్భంలో చెప్పారు. ఈ సినిమాలో బాలీవుడ్ సీనియర్ నటుడు మిథున్ చక్రవర్తి, సీనియర్ హీరోయిన్ జయప్రద కీలక పాత్రల్లో నటిస్తోన్నారు. View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) -
ప్రభాస్‌కు జోడీగా ఈ ముద్దుగుమ్మ! ఇమాన్వీ ఎవరంటే..?
-
ప్రభాస్ - హను రాఘవపూడి సినిమా..ఓపెనింగ్ ఫోటోలు వైరల్
-
ప్రభాస్ మరో కొత్త సినిమా మొదలు
ప్రభాస్ మరో కొత్త సినిమా మొదలుపెట్టేశాడు. రీసెంట్గా 'కల్కి'తో వచ్చి రూ.1000 కోట్ల కొట్టేశాడు. ప్రస్తుతం 'రాజా సాబ్' చేస్తున్నాడు. ఇది కాకుండా సలార్ 2, కల్కి 2, స్పిరిట్ చేయాలి. ఇవి ఉండగానే 'సీతారామం' దర్శకుడు హను రాఘవపూడితో కొత్త ప్రాజెక్ట్ షురూ చేశాడు. హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ఈ మూవీ ప్రారంభమైంది.(ఇదీ చదవండి: డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మారాల్సిన టైమ్ వచ్చిందేమో?)శనివారం జరిగిన ఈ వేడుకకు 'సలార్' డైరెక్టర్ ప్రశాంత్ నీల్‌తో పాటు పలువురు సెలబ్రిటీలు హాజరయ్యారు. వచ్చే వారం అంటే ఆగస్టు 24 నుంచి షూటింగ్ కూడా మొదలు కానుందని అంటున్నారు. అలానే ఈ సాయంత్రం 4 గంటలకు పోస్టర్ కూడా రిలీజ్ చేయబోతున్నారు.మరోవైపు ప్రభాస్-హను రాఘవపూడి కాంబోలో తీస్తున్న సినిమాకు 'ఫౌజీ' అనే టైటిల్ ఫిక్స్ చేశారని, రెండో ప్రపంచ యుద్ధ నేపథ్యంలో సాగే చక్కటి ప్రేమకథని అంటున్నారు. వీటిన్నంటిపై క్లారిటీ రావాలంటే కొన్నిరోజులు ఆగితే సరిపోతుంది. అలానే హీరోయిన్, మ్యూజిక్ డైరెక్టర్ ఎవరనేది కూడా తెలియాల్సి ఉంది.(ఇదీ చదవండి: ప్రభాస్ 'కల్కి' ఓటీటీ రిలీజ్‌పై అధికారిక ప్రకటన) -
ఇక షురూ
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా రూపొందనున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించనుంది. ‘ఫౌజి’ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుందని, ఈ చిత్రంలోని హీరోయిన్‌పాత్రకు మృణాల్ ఠాగూర్,పాకిస్తాన్ నటి సజల్ అలీని అనుకుంటున్నారనీ ప్రచారం జరుగుతోంది.ఈ నెల మూడో వారంలో ఈ సినిమా ప్రారంభోత్సవం జరగనుందని, ఆ వెంటనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుందని తెలిసింది. విశాల్ చంద్రశేఖర్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారని, మూడుపాటల పని కూడా పూర్తయిందని ఆ మధ్య హను రాఘవపూడి చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. -
ప్రభాస్, హను రాఘవపూడి మూవీ... అదిరిపోయే అప్డేట్
-
ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్.. మూడు సినిమాలు ఒకేసారి!
టాలీవుడ్ ఇప్పుడు పాన్ ఇండియా సినిమాలకు కేరాఫ్‌గా మారింది. స్టార్ హీరోలంతా ఇప్పుడు తమ సినిమాని అన్ని భాషల్లో రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే బాక్సాఫీస్ బరిలో మాత్రం ఇతర పెద్ద సినిమాలు లేకుండా ప్లాన్ చేసుకొని సినిమాను విడుదల చేస్తున్నారు. కల్కి 2898 మూవీ కూడా ఇక్కడ సోలోగానే విడుదలై హిట్ కొట్టింది. అల్లు అర్జున్ పుష్ప 2, ఎన్టీఆర్ దేవర, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ చిత్రాలు కూడా దాదాపు సోలోగానే రిలీజ్ కాబోతున్నాయి. కానీ వీటి తర్వాత ఈ స్టార్ హీరోలు నటించే సినిమాలు బాక్సాఫీస్ వద్ద పోటీ పడే అవకాశం ఉంది. ముఖ్యంగా ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్ మధ్య 2026లో బక్సాఫీస్ వార్ జరిగే అవకాశం మెండుగా ఉంది.(చదవండి: మహేష్ – రాజమౌళి మూవీ: విలన్‌గా స్టార్ హీరో!)కల్కి 2898 తర్వాత ప్రభాస్ ‘రాజా సాబ్’గా రాబోతున్నాడు. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఈ మూవీ తర్వాత హను రాఘవపూడి దర్శకత్వంలో ప్రభాస్ ఓ లవ్ స్టోరీ చేయబోతున్నాడు. ఈ చిత్రం షూటింగ్ సెప్టెంబర్‌లో మొదలయ్యే అవకాశం ఉంది. 2025 చివరల్లో లేదా 2026 సంకాంత్రికి విడుదలయ్యే అవకాశం ఉంది. (చదవండి: నా బిడ్డను పైకి పంపించేయాలనుకున్నా.. ఏడుస్తూ భర్తకు చెప్పా: పాక్ నటి)మరోవైపు గేమ్ ఛేంజర్ తర్వాత రామ్ చరణ్..బుచ్చిబాబు దర్శకత్వంలో సినిమా చేస్తున్నాడు. వాస్తవానికి ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో ప్రారంభం కావాలి. కానీ గేమ్ ఛేంజర్ షూటింగ్ ఆలస్యం కావడంతో బుచ్చిబాబు మూవీ పట్టాలెక్కలేదు. సెప్టెంబర్‌లో ఈ మూవీ షూటింగ్ ప్రారంభం కానుంది. ఇప్పటికే ఈ మూవీ కోసం రెహమాన్ కొన్ని ట్యూన్స్ కూడా రెడీ చేశాడు. అన్ని కుదిరితే వచ్చే ఏడాది చివరిలో ఈ చిత్రం రీలీజ్ అయ్యే అవకాశం ఉంది. దేవర తర్వాత ఎన్టీఆర్..ప్రశాంత్ నీల్‌తో ఓ సినిమా చేయబోతున్నాడు. ఈ మూవీ షూటింగ్ కూడా సెప్టెంబర్ చివరి వారంలో ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. 2026 ప్రారంభంలో పాన్ వరల్డ్ స్థాయిలో ఈ చిత్రం రిలీజ్ కానుంది. దాదాపు ఈ ముగ్గురు హీరోల సినిమాలు ఒకేసారి ప్రారంభం అవుతున్నాయి. పెద్ద సినిమాలు కాబట్టి ఏడాది వరకు నిర్మాణంలో ఉండడం సర్వసాధారణం. ఈ లెక్కన చూస్తే..మూడు సినిమాలు వారం అటు ఇటుగా ఒకేసారి విడుదలయ్యే అవకాశం ఉంది. మరి ఈ ముగ్గురు బాక్సాఫీస్ వార్‌లో ఉంటారా లేదా సోలోగానే వచ్చి హిట్ కొడతారా అనేది తెలియాలంటే కొన్నాళ్ల పాటు ఆగాల్సిందే. -
అక్టోబరులో ఆరంభం
ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుంది. మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్ ఈ మూవీ నిర్మించనున్నారు. ఈ సినిమాలో హీరోయిన్లుగా మృణాల్ ఠాకూర్, రష్మికా మందన్న పేర్లు వినిపిస్తున్నాయి. వివేక్ సాగర్ ఈ మూవీకి సంగీతం అందించనున్నారు. వార్ బ్యాక్‌డ్రాప్‌తో సాగే ఈ లవ్‌స్టోరీ మూవీ ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ చివరి దశకు చేరుకున్నాయి.దీంతో ఈ ఏడాది అక్టోబరులో ఈ సినిమా చిత్రీకరణప్రారంభించేలా సన్నాహాలు చేస్తున్నారట హను రాఘవపూడి. ప్రస్తుతం వెకేషన్ లో భాగంగా ప్రభాస్ విదేశాల్లో ఉన్నారు. ఆయన తిరిగొచ్చిన తర్వాత ‘రాజాసాబ్’ సినిమా చిత్రీకరణలో పాల్గొంటారు. ఆ సినిమా పూర్తయిన తర్వాత హను రాఘవపూడి దర్శకత్వం వహించే సినిమా షూటింగ్లో ప్రభాస్ పాల్గొంటారనే టాక్ వినిపిస్తోంది.అయితే సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో ‘స్పిరిట్’ అనే సినిమాకి కమిట్ అయ్యారు ప్రభాస్. ఈ సినిమా చిత్రీకరణ కూడా ఈ ఏడాది చివర్లోనే ప్రారంభం కానుందట. మరి.. హను రాఘవపూడి, సందీప్ రెడ్డి వంగా దర్శకత్వాల్లోని సినిమాల చిత్రీకరణలో ప్రభాస్ ఏకకాలంలో పాల్గొంటారా? లేదా? అనే అంశంపై స్పష్టత రావాల్సి ఉంది. -
Sreeleela : రెట్రో షేడ్స్ లుక్స్‌తో శ్రీలీల.. మరో సావిత్రి అంటూ కామెంట్స్! (ఫొటోలు)
-
అందమైన ప్రేమకథతో రానున్న ప్రభాస్..!
-
హనుకి గ్రీన్ సిగ్నల్?
ప్రస్తుతం ‘సలార్’, ప్రా జెక్ట్ కె’, ‘రాజా డీలక్స్’ (వర్కింగ్ టైటిల్) సినిమాలతో బిజీగా ఉన్నారు ప్రభాస్. ఆ సినిమా చిత్రీకరణలు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో కొత్త సినిమాల కోసం కథలు వింటున్నారట ప్రభాస్. ఇందులో భాగంగా దర్శకుడు హను రాఘవపూడి చెప్పిన ఓ కథ ప్రభాస్‌కు నచ్చిందని, ఈ కథకు ప్రభాస్ ఆల్మోస్ట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, దీంతో ఈ స్క్రిప్ట్‌కు హను రాఘవపూడి తుది మెరుగులు దిద్దే పనిలో ఉన్నారని ఫిల్మ్‌నగర్ భోగట్టా. అంతేకాదు.. ఈ సినిమాను మైత్రీ మూవీమేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తారనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు ప్రస్తుతం ‘రాజా డీలక్స్’ షూటింగ్లో పాల్గొంటున్నారు ప్రభాస్. అలాగే ప్రభాస్ నటించిన ‘ఆదిపురుష్’ చిత్రం జూన్ 16న థియేటర్స్‌లో రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. -
సీక్వెల్ పై క్లారిటీ ఇచ్చిన హీరోయిన్...
-
ఆల్జీబ్రాకు బదులు ‘హంతకుడు’ స్టోరీ రాశా.. ‘సీతారామం’ డైరెక్టర్
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ‘సీతారామం’తో పాన్ ఇండియా దర్శకుడిగా గుర్తింపు తెచ్చుకున్న హను రాఘవపూడి మన బిడ్డే. కొత్తగూడెం గణేష్ టెంపుల్ గల్లీలో పుట్టి పెరిగి సినిమా ఇండస్ట్రీలో అందాల రాక్షసితో ప్రయాణం మొదలెట్టి ఇప్పుడు టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ దర్శకుల లిస్టులో చోటు సాధించారు. తాను చదివిన కాలేజీలో ఏర్పాటు చేసిన ఫంక్షన్లో పాల్గొనేందుకు చాన్నాళ్ల తర్వాత ఆయన కొత్తగూడెం వచ్చారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో ఆయన ముచ్చటించారు. కొత్తగూడెంతో తనకున్న అనుబంధం నెమరు వేసుకున్నారు, ఆ జ్ఞాపకాలు ఆయన మాటల్లోనే.. అసలు సినిమా ఆలోచనే లేదు.. నాన్న సన్యాసిరావు సింగరేణిలో ఉద్యోగం చేసేవారు. అమ్మ సూర్యకుమారి కోర్టులో ఎంప్లాయిగా ఉండేవారు. మా ఫ్యామిలీ గణేష్ టెంపుల్ వెనుక గల్లీలో ప్రస్తుతం హెచ్డీఎఫ్సీ బ్యాంకు ఏరియాలో ఉండేది. టెన్త్ వరకు రామవరం సింగరేణి స్కూల్లో, ఇంటర్మీడియట్ కృష్ణవేణి కాలేజీలో, డిగ్రీ వివేకవర్థిని కళాశాలలో చదివాను. చిన్నప్పుడు అసలు సినిమాల్లోకి వెళ్లాలనే ఆలోచనే లేదు. అమ్మ చెప్పినట్టు బుద్ధిగా చదువుకోవడం మంచి మార్కులు తెచ్చుకోవడం మీదనే ధ్యాస ఉండేది. సినిమాలు చూడటం కూడా తక్కువే. స్వాతికిరణం చూశాక.. చిన్నతనంలో ఓసారి మా అమ్మ దుర్గా టాకీస్‌లో స్వాతికిరణం సినిమాకు తీసుకెళ్లింది. ఆ వయసులో ఆ సినిమా నాకు విపరీతంగా నచ్చేసింది. అప్పటి వరకు సినిమాల మీద ఇంట్రెస్ట్ లేని నాకు ఆ సినిమాతో ఒక్కసారిగా సినిమాకి దర్శకుడు అనే వ్యక్తి ఎవరు ? అతను ఎలా ఆలోచిస్తాడు అనే అంశాలపై ఆసక్తి పెరిగింది. వెంటనే స్వాతికిరణం దర్శకుడు కే.విశ్వనాథ్ గురించి తెలుసుకోవడం ప్రారంభించాను. ఎంజీ రోడ్లో సంతోష్ వీడియో లైబ్రరీ నుంచి విశ్వనాథ్ గారి సినిమా క్యాసెట్లు అద్దెకు తీసుకెళ్లి సినిమాలో ఇంకో కోణంలో చూడటం మొదలెట్టాను. శంకరాభరణం సినిమా లెక్కలేనన్ని సార్లు చూశాను. అలా సినిమాలపై ఇష్టం పెరుగుతూ పోయింది. అయినప్పటికీ బుద్ధిగా చదువుతూనే ఎంసీఏలో ఉండగా సినిమాల్లోకి షిఫ్ట్ అయ్యాను. ఆల్జీబ్రాకు బదులు స్క్రిప్ట్ రైటింగ్.. శంకరాభరణం తర్వాత కథకుడు, దర్శకుడు కావాలనే ఆలోచనకు బీజం పడింది. ఓ వైపు క్లాసులో టీచర్లు పాఠాలు చెబుతుంటే మరోవైపు నా మనసులో కథలు అందులోని పాత్రలు మెదిలేవి. ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఓ పత్రికలో కథల కాంపిటీషన్ అంటూ ప్రకటన వచ్చింది. దీంతో ఓ స్టోరీ రాసేసి ప్రైజ్ కొట్టేద్దామనుకున్నా. కాలేజీలో కోటేశ్వరరావు సార్ మ్యాథ్స్ క్లాస్ చెబుతున్నారు. నేను పైకి ఊ కొడుతూనే ‘హంతకుడు’ పేరుతో మంచి క్రైం స్టోరీ రాసేస్తున్నా. కాసేపటికి సార్‌కి డౌట్ వచ్చి నా నోట్స్ చెక్ చేశారు. అక్కడ ఆల్జీబ్రా బదులు ‘హంతకుడు’ కనిపించింది. అంతే అక్కడే సార్ వాయించేశారు. ఆ తర్వాత క్లాస్ బయట నిల్చోబెట్టారు. ఇప్పుడదొక స్వీట్ మెమరీగా మిగిలిపోయింది. ఆ తర్వాత వీపు వాయించేశారు.. ఇంటర్లోకి వచ్చాక సినిమాలపై ఇష్టం బాగా పెరిగిపోయింది. పైగా కొత్తగూడెంలో సినిమా థియేటర్లు అన్నీ కృష్ణవేణి కాలేజీకి దగ్గర్లోనే ఉండేవి. ఉదయం కాలేజీకి వెళ్లినట్టే వెళ్లి మధ్యలో క్లాసులు ఎగ్గొట్టి మా గ్యాంగ్ అంతా సినిమాలకు వెళ్లే వాళ్లం. క్లాసులో స్టూడెంట్స్ సంఖ్య తగ్గినట్టు కనిపిస్తే, కోటేశ్వరరావు సార్ సీడీ 100 బైక్ వేసుకుని థియేటర్లకు వచ్చేవారు. ప్రొజెక్టర్ రూమ్‌లో నిల్చుని స్టూడెంట్స్ ఎవరెవరు ఉన్నారు ? ఎక్కడ ఉన్నారో గమనించేవారు. అలా ఓసారి మేం గులాబీ సినిమా చూసేందుకు పరమేశ్వరి థియేటర్లో ఉండగా సార్ మమ్మల్ని పట్టేసుకున్నారు. ఆ తర్వాత అందరి వీపులు వాయించేశారు. దీంతో ఎప్పుడైనా కాలేజ్ టైంలో సినిమాలకు వెళితే ‘సీడీ హండ్రెడ్ బైక్ ’ వచ్చిందా అంటూ మధ్యమధ్యలో చెక్ చేసుకునే వాళ్లం. నెక్ట్స్ సినిమాలో కొత్తగూడెం.. నేను ప్రేమకథలు బాగా తీస్తానని, నాకో బ్యూటీఫుల్ లవ్‌స్టోరీ ఉందనే భావన చాలా మందిలో ఉంది. వాస్తవం కంటే ఊహలు ఎప్పుడూ అందంగా ఉంటాయి. టీనేజ్‌లో కానీ కాలేజ్ డేస్‌లో కానీ నాకు లవ్‌స్టోరీస్ ఏమీ లేవు. స్టడీస్, కథలు రాయడం మీదనే ఫోకస్ ఉండేది. కాకపోతే లవ్ చేస్తే ఎలా ఉండాలనే భావనలతోనే కథలు రాసుకున్న. వాటితోనే అందాల రాక్షసి, కృష్ణగాడి వీర ప్రేమగాథ, పడి పడి లేచే మనసు, సీతారామం వంటి సినిమాలు తీశాను. ఇప్పటి వరకు చేసినవన్నీ ఊహల్లోంచి పుట్టుకొచ్చిన కథలే. అందాల రాక్షసిలో పాత కారు, పగిలిన అద్దంలోని హీరోయిన్ కనిపించే దృశ్యం మాత్రం కొత్తగూడెం నుంచి తీసుకున్నా. నా చిన్నతనంలో గణేష్ టెంపుల్ గల్లీలో ఓ పాత కారు పార్క్ చేసి ఉండేది. కాలేజీకి, స్కూల్‌కు వెళ్లేప్పుడు ప్రతీ రోజు దాన్ని దాటుకుంటూ వెళ్లేవాణ్ని. ఆ ఒక్క సీన్‌ని సినిమాలో చూపించాను. త్వరలో మైత్రీ మూవీస్‌కి చేయబోయే సినిమాలో రియల్ లైఫ్‌లో కొత్తగూడెంలో చూసిన సంఘటనలు, ఎదురైన అనుభవాల్లో కొన్నింటిని సెల్యూలాయిడ్ తెర మీద చూపించబోతున్నాను. బ్యాడ్ బాయ్‌ని కాదండోయ్... సినిమాలపై ఇంట్రెస్ట్ ఉన్నా చదువును ఏ రోజూ నిర్లక్ష్యం చేయలేదు. టెన్త్, ఇంటర్, డిగ్రీలో మంచి మార్కులే వచ్చాయి. డిగ్రీ ఫైనలియర్లో కొత్తగూడెం నుంచి ఖమ్మం షిఫ్ట్ అయ్యాను. అక్కడ బ్యాంక్ కాలనీలో ఉంటూ కవిత డిగ్రీ కాలేజీలో చదివాను. ఆ సమయంలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్‌కి లెక్కల ట్యూషన్ చెప్పేవాన్ని. ఇంటర్లో పడిన పునాది గట్టిగా ఉండటంతో అది సాధ్యమైంది. స్టూడెంట్‌గా ఇంగ్లిష్తో నాకు ఎప్పుడు తిప్పలే ఉండేవి. చాతకొండ మూర్తి సార్ అయితే ‘ఇంగి్లష్లో తక్కువ మార్కులు వచ్చాయంటూ , సమాధానం సరిగా చెప్పలేదంటూ’ ఎన్నిసార్లు కొట్టారో. అప్పుడు చెప్పిన పాఠాలు, తిన్న దెబ్బలు, సినిమాలపై నాకున్న ఇంట్రెస్ట్ అన్ని కలిపి నన్ను ఈ రోజు ఈ స్థాయికి తీసుకొచ్చాయి. -
ధనుష్ 'సార్' మూవీపై రివ్యూ ఇచ్చిన సీతారామం డైరెక్టర్
తమిళ స్టార్ హీరో ధనుష్ నటించిన తొలి తెలుగు చిత్రం సార్. మలయాళ ముద్దుగుమ్మ సంయుక్తా మీనన్ ఇందులో హీరోయిన్గా నటించింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వచ్చిన ఈ సినిమా ఇటీవలె విడుదలై సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. విమర్శకుల ప్రశంసలతో పాటు అదిరిపోయే కలెక్షన్లను కూడా వసూలు చేస్తోందీ చిత్రం. ఇప్పటి వరకు డబ్బింగ్ సినిమాలతో ఆకట్టుకున్న ధనుష్ తెలుగులో తొలి సినిమాతోనే సాలిడ్ హిట్ అందుకున్నాడు.తాజాగా సినిమా సక్సెస్‌పై సీతారామం దర్శకుడు హనురాఘవపూడి ట్వీట్ చేశారు. సార్ సినిమా చూశాను. చాలా అద్భుతంగా ఉంది. ప్రతి ఒక్కరు ఈ చిత్రాన్ని చూడాల్సిందే. ఎప్పటిలాగే ధనుష్ మరోసారి తన నటనతో కట్టిపడేశారు. మూవీ టీం అందరికి కంగ్రాట్స్ అంటూ ప్రశంసలు కురిపించారు. Watched #SIRMovie and must say, I'm mind-blown! Definitely, a must watch. And as always, @dhanushkraja garu steals the show. Very honest writing and screenplay by #VenkyAtluri. Congratulations @SitharaEnts on delivering a blockbuster. And @dopyuvraj terrific 👌🏻 pic.twitter.com/9mkTqHJC6s — Hanu Raghavapudi (@hanurpudi) February 24, 2023 -
అందుకే సీతారామంకు తెలుగు వారిని తీసుకోలేదు: హను రాఘవపూడి
సీతారామం.. ఎన్నేళ్లు గడిచిన ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయే చిత్రం ఇది. అందమైన ప్రేమకావ్యంగా ప్రేక్షకుల మనసులను హత్తుకుంది ఈ చిత్రం. చిన్న సినిమాగా వచ్చిన చిత్రం అంచనాలను మించి రెట్టింపు రెస్పాన్స్ అందుకుంది. మలయాళ హీరో దుల్కర్ సల్మాన్, మరాఠి భామ మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమాకు టాలీవుడ్ డైరెక్టర్ హను రాఘవపూడి దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. దాదాపు రూ. 100 కోట్లకు పైగా వసూళు చేసింది సీతారామం. చదవండి: ‘డబ్బు కోసం ఆరాటపడే వ్యక్తిని కాదు.. నాకు అదే ముఖ్యం’ యుద్ధంలో నుంచి పుట్టిన ప్రేమకథ అంటూ వెండితెరపై ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది ఈ చిత్రం. అంతగా ప్రతి ప్రేక్షకుడి మనసును గెలిచిన ఈ చిత్రం కథ ఎక్కడిది, ఎలా వచ్చిందో తాజాగా తెలిపాడు డైరెక్టర్ హనురాఘవపూడి. ఇటీవల ఓ టాక్ షోలో పాల్గొన్న ఆయన సీతారామంకు తెలుగు యాక్టర్స్‌ను తీసుకోకపోవడంపై క్లారిటీ ఇచ్చాడు. ఈ సందర్భంగా హనురాఘవపూడి సీతారామం విశేషాలను పంచుకున్నాడు. ఆయన మాట్లాడుతూ.. ‘నాకు పుస్తకాలు చదడం అలవాటు. అలా నేను ఓ రోజు కోఠిలో సెకండ్ హ్యాండ్ పుస్తకం కొన్నాను. అందులో ఓ లెటర్ ఉంది. అది ఒపెన్ చేసి కూడా లేదు. హాస్టల్లో ఉంటున్న అబ్బాయికి వాళ్ల అమ్మ రాసిన లెటర్ అది. సెలవులకు ఇంటికి రమ్మని ఆమె రాశారు. కానీ అది చదివాక నాకు ఓ ఆలోచన వచ్చింది. ఒకవేళ ఆ లెటర్లో ఏదైనా ముఖ్యమైన సమాచారం ఉంటే? అని అనుకున్నా. ఆ ఆలోచనే ‘సీతారామం’ సినిమా రావడానికి మూలకారణం. కథ రాసుకున్న తర్వాత నిర్మాత స్వప్న గారికి చెప్పాను. ఆమె వెంటనే చేద్దాం అన్నారు. ఆ తర్వాత హీరోగా ఈ కథకు దుల్కర్ సరిగ్గా సరిపోతాడని అనిపించింది. అందుకే తనని సెలెక్ట్ చేశాం’ అని చెప్పాడు. చదవండి: హీరోయిన్ల రెమ్యునరేషన్‌పై మృణాల్ షాకింగ్ కామెంట్స్ అలాగే ‘సీత పాత్ర కోసం మృణాల్‌ను ఎంపిక చేశాం. కొత్తగా ఉండాలని అనుకుంటుంటే స్వప్న.. మృణాల్ గురించి చెప్పింది. ఆమెను చూడగానే సీతపాత్రకు సరిపోతుందని అనిపించింది. ఇక తెలుగు అమ్మాయిని ఎందుకు తీసుకోలేదంటే.. తెలుగు వాళ్ల ప్రొఫైల్స్ ఎక్కడా కనిపించలేదు. ఫలానా అమ్మాయి ఉందని తెలిస్తే తను పాత్రకు సరిపోతుందా లేదా అని చూడొచ్చు. కానీ, ఎక్కడా తెలుగు అమ్మాయిల ప్రొఫైల్స్ కనిపించలేదు. తెలుగు వాళ్లు దొరికితే ఇంకా మాకే హాయి.. ఎందుకంటే వాళ్లకు భాష వచ్చి ఉంటుంది’ అని చెప్పుకొచ్చాడు. -
'వెయ్యి ఆడాలి.. కానీ మనం ఆడింది వందే'.. ఆసక్తిగా టీజర్
కరోనా తరువాత ఆడియెన్స్ మైండ్‌సెంట్ పూర్తిగా మారిపోయింది. సినిమాలను చూసే అభిప్రాయంలో చాలా మార్పులు వచ్చాయి. చిన్నా, పెద్ద సినిమా అన్న తేడా లేకుండా కంటెంట్ కొత్తగా ఉంటే జనాలు థియేటర్లకు వస్తున్నారు. చిన్న సినిమాలైనా ఆదరిస్తున్నారు. అదే తరహాలో 'రెబల్స్ ఆఫ్ తుపాకుల గూడెం' అనే చిత్రం రాబోతోంది. వారధి క్రియేషన్స్ బ్యానర్‌పై జైదీప్ విష్ణు దర్శకుడిగా తెరకెక్కిస్తున్నారు. ప్రవీణ్ కండెలా, శ్రీకాంత్ రాథోడ్, జయేత్రి మకానా, శివరామ్ రెడ్డి ఇలా నలభై మంది కొత్త నటీనటులతో రాబోతున్న ఈ చిత్రానికి సంతోష్ మురారికర్ కథ అందించారు. తాజాగా ఈ మూవీకి సంబంధించిన అప్డేట్ వచ్చింది. ఈ సినిమా టీజర్‌ను సక్సెస్ ఫుల్ డైరెక్టర్ హను రాఘవపూడి రిలీజ్ చేశారు. టీజర్ చాలా బాగుందని.. చిత్రయూనిట్‌కు ఆల్ ది బెస్ట్ తెలిపారు. రెండు నిమిషాలు 29 సెకన్ల నిడివి ఉన్న ఈ టీజర్ సినిమా మీద ఆసక్తిని పెంచేసింది. 'నా పేరు కుమార్.. ఇది నా ఊరు.. వెయ్యి అబద్దాలు ఆడైనా ఒక పెళ్లి చేయమన్నారు.. కానీ మనం ఆడింది వందే' అంటూ ప్రారంభమైన టీజర్ అందరిలోనూ ఆసక్తిని క్రియేట్ పెంచుతోంది. 'వంద మంది.. బరా బర్ వంద మందిని చూపించాలి'.. 'అన్నా ఇదంతా నిజంగా అయితదా?.. అయితది.. ఏం కావాల్నో అదే అయితది'.. 'ఈ పని ఒక్కడే చేయగలడు సర్.. అయితే ఇదంతా మీకు తెలిసే జరుగుతోందా?' అనే ఈ డైలాగ్స్‌తో సినిమా కథ ఏంటో చెప్పకనే చెప్పేశారు. అసలు ఏం జరుగుతోంది.. ఆ వంద అబద్దాలు ఏంటి? ఆ వంద మంది కలిసి చేసిన పని ఏంటి?.. తుపాకుల గూడెంలో ఏం జరుగుతోంది? అనే ఆసక్తికరమైన ప్రశ్నలు తలెత్తేలా సినిమా టీజర్ ఉంది. ప్రస్తుతం ఈ మూవీ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు చివరి దశలో ఉన్నాయి. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుని ఈ చిత్రం గణతంత్ర దినోత్సవం సందర్భంగా వచ్చే ఏడాది జనవరి 26న థియేటర్లోకి రానుంది. -
మరో ప్రేమకథతో రాబోతున్న ‘సీతారామం’ టీం!, ఆ నిర్మాత క్లారిటీ..
ఎలాంటి అంచనాలు లేకుండ వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రం ‘సీతారామం’. యుద్దం భూమిలో పుట్టిన అందమైన ప్రేమకావ్యంగా తెరకెక్కిన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందింది. ఈ మూవీ విడుదలైన నెల దాటిన ఇప్పటికీ థియేటర్లో సందడి చేస్తోంది. అంతేకాదు ఓటీటీలో సైతం ఈమూవీ దూసుకుపోతోంది. అమెజాన్ ప్రైంలో ప్రస్తుతం సీతారామం స్ట్రీమింగ్ అవుతున్న సంగతి తెలిసిందే. ఇందులో లీడ్‌రోల్స్ పోషించిన హీరో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ల నటనకు ప్రతి ఒక్కరు ఫిదా అవుతున్నారు. వీరిద్దరి ఆన్‌స్క్రీన్ కెమిస్ట్రీ ఆడియన్స్‌ని బాగా ఆకట్టుకుంది. చదవండి: లారెన్స్ షాకింగ్ ప్రకటన.. ‘ఇకపై నేనే నమస్కరిస్తా’ ఇదిలా ఉంటే దుల్కర్, మృణాల్ హీరోహీరోయిన్లుగా మరో చిత్రం ప్రేమకథా చిత్రం రాబోతుందంటూ కొద్ది రోజులుగా వార్తలు వినిపిస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వైజయంతి మూవీస్ బ్యానర్ అధినేత అశ్వినిదత్ చేసిన వ్యాఖ్యలు ఈ వార్తలకు బలం చెకూరుస్తున్నాయి. ఈ మూవీ బ్లాక్‌బస్టర్ హిట్ అయిన సందర్భంగా ఇటీవల ఓ చానల్‌తో ముచ్చటించారు అశ్విని దత్. ఈ సందర్భంగా సీతారామం చిత్ర విశేషాలను పంచుకున్న ఆయన వైజయంతి బ్యానర్లో మరో ప్రేమ కథ చిత్రం రాబోతుందన్నారు. అదే సీతారామం కాంబినేషన్ మళ్లీ రిపీట్ కానుందన్నారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకుర్ హీరోహీరోయిన్లుగా హనురాఘవపూడి దర్శకత్వంలో మరో లవ్‌స్టోరీని రూపొందించనున్నట్లు ఈ సందర్భంగా ఆయన చెప్పుకొచ్చారు. చదవండి: ఈ చిత్రంలో రజనీ నటిస్తానంటే వారి మధ్య చిక్కుకునేవారు: మణిరత్నం ఇక ఇది తెలిసి ఆడియన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఓ చక్కటి ఫీల్‌గుడ్ లవ్‌స్టోరీ చూశామని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలో మళ్లీ అదే టీంతో సీతారామం లాంటి చిత్రం వస్తుందని చెప్పడంతో ప్రేక్షకుల్లో అంచానాలు పెరిగిపోయాయి. మరి హనురాఘవపూడి ఈసారి ఎలాంటి ప్రేమకథతో వస్తారనేతి ఆసక్తిని సంతరించుకుంది. కాగా దుల్కర్ తాజాగా నటించిన బాలీవుడ్ చిత్రం చుప్ సెప్టెంబర్ 23 ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. ఇక సీతారామం మూవీతో తెలుగులో అడుగుపెట్టిన మృణాల్ వైజయంతి బ్యానర్లోనే ఓ సినిమాకు సంతకం చేసిందని ఇటీవల వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. -
'నీతో' థియేట్రికల్ ట్రైలర్.. విడుదల చేసిన సీతారామం డైరెక్టర్
అభిరామ్ వర్మ, సాత్వికా రాజ్ హీరో, హీరోయిన్లుగా నటించిన చిత్రం 'నీతో'. ఈ సినిమాకు బాలు శర్మ దర్శకత్వం వహించగా.. పృథ్వి క్రియేషన్స్, మిలియన్ డ్రీమ్స్ క్రియేషన్స్ బ్యానర్లపై సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి ఏవీఆర్ స్వామి, కీర్తన, స్నేహల్ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. అయితే తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్ రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఇటీవల సక్సెస్ అయిన సీతారామం డైరెక్టర్ హను రాఘవపూడి చేతులమీదుగా విడుదల చేశారు. ఈ ట్రైలర్ యువతకు బాగా కనెక్ట్ అయ్యేలా ఉంది. 'మనకు రిలేషన్ షిప్ ఎలా ఎండ్ అయిందో గుర్తుంటుంది కానీ.. ఎలా స్టార్ట్ అవుతుందో గుర్తు రాదు" లాంటి డైలాగ్స్ యూత్‌ను బాగా ఆకట్టుకుంటాయి. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా ట్రైలర్‌ను ఆసక్తికరంగా రూపొందించింది చిత్ర బృందం. ఈ సినిమాకు వివేక్ సాగర్ స్వరాలు సమకూర్చగా.. సుందర్ రామ కృష్ణ సినిమాటోగ్రఫీ, మార్తాండ్ కె.వెంకటేశ్ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహించారు. అయితే ఈ చిత్రం సెప్టెంబర్ 30వ థియేటర్లలో సందడి చేయనుంది. -
సీతారామం మ్యాజిక్.. ఇప్పటికాదా ఎంత వచ్చిందంటే?
అందమైన ప్రేమకావ్యంగా ప్రేక్షకుల మనసులను హత్తుకుంది సీతారామం. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన ఈ సినిమాను హను రాఘవపూడి డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా సక్సెస్ కావడంతో బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌కు తెలుగులో మంచి అరంగేట్రం లభించినట్లైంది. రష్మిక మందన్నా, సుమంత్ పాత్రలకు మంచి మార్కులు పడ్డాయి. సి.అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 5న విడుదలై ఇప్పటికీ పలు థియేటర్లలో విజయవంతంగా ఆడుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా ఇప్పటివరకు బాక్సాఫీస్‌పై రూ.75 కోట్ల కలెక్షన్ల వర్షం కురిపించింది. ఒక్క అమెరికాలోనే ఇప్పటివరకు 1.3 మిలియన్ డాలర్స్ వసూళ్లు సాధించింది. ఈ సందర్భంగా సీతారామంపై ఇంత ప్రేమాభిమానం చూపించిన ప్రేక్షకలోకానికి ధన్యవాదాలు తెలిపింది చిత్రయూనిట్. Thank you for all the love pouring in for #SitaRamam 🦋💖@dulQuer @mrunal0801 @iamRashmika @iSumanth @hanurpudi @AshwiniDuttCh @TharunBhasckerD @vennelakishore @Composer_Vishal @VyjayanthiFilms @SwapnaCinema @SonyMusicSouth @penmovies @DQsWayfarerFilm @LycaProductions pic.twitter.com/jI2BoTO15k — Vyjayanthi Movies (@VyjayanthiFilms) August 27, 2022 చదవండి: జూ.ఎన్టీఆర్-కొరటాల ప్రాజెక్ట్‌కు నో చెప్పిన సమంత! ఎందుకో తెలుసా? ఓటీటీలో రామారావు ఆన్ డ్యూటీ, అప్పటినుంచే స్ట్రీమింగ్ -
జోడీ రిపీట్?
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో వచ్చిన ‘సీతారామం’కి ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ లభించిన సంగతి తెలిసిందే. అలా ఈ చిత్రంతో బాలీవుడ్ హీరోయిన్ మృణాల్ ఠాకూర్‌కు తెలుగులో మంచి అరంగేట్రం లభించింది. ‘సీతారామం’ను నిర్మించిన వైజయంతీ మూవీస్‌లోనే మృణాల్ మరో సినిమా సైన్ చేశారట. ఈ సినిమాను తెరకెక్కించే దర్శకుల్లో హను రాఘవపూడి, నందినీ రెడ్డి పేర్లు తెరపైకి వచ్చాయి. అలాగే హీరో పాత్రకు దుల్కర్ సల్మాన్ పేరు పరిశీలనలో ఉందట. ఒకవేళ ఈ సినిమాలో హీరోగా దుల్కర్ సల్మాన్ ఫిక్స్ అయితే ‘సీతారామం’ జోడీ రిపీటైనట్లే. మరి.. దుల్కర్, మృణాల్ మళ్లీ జోడీ కడతారా? వేచి చూడాల్సిందే. -
సీతారామం కలెక్షన్స్: ఐదు రోజుల్లో ఎంత రాబట్టిందంటే?
సీతారామం.. సినిమా అంత ఈజీగా మెదళ్లను వదిలి వెళ్లడం లేదంటున్నారు ప్రేక్షకులు. ఒకసారి మూవీ చూశాక దాని జ్ఞాపకాలు వెంటాడుతున్నాయంటున్నారు. అంతలా జనాలకు కనెక్ట్ అయిందీ చిత్రం. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా.. ఇలా అందరూ అద్భుతంగా నటించిన సీతారామం సినిమాను డైరెక్టర్ హను రాఘవపూడి ఓ అద్భుత కావ్యంగా మలిచారు. వీరి కష్టం వృథా కాలేదు. సినిమా సూపర్ హిట్టయింది. మూడు రోజుల్లోనే రూ.25 కోట్లు రాబట్టిన ఈ సినిమా మొత్తంగా ఐదు రోజులు పూర్తయ్యే సరికి రూ.33 కోట్లు వసూలు చేసింది. ఓవర్సీస్లోనూ సినిమా దుమ్మురేపుతోంది. ఇప్పటివరకు అక్కడ 750 వేల డాలర్లు రాబట్టింది. చూస్తుంటే త్వరలోనే వన్ మిలియన్ డాలర్ క్లబ్బులో చేరేట్లు కనిపిస్తోంది. చదవండి: హీరోయిన్ లయను బాలయ్య చెల్లెలి పాత్రకు అడిగితే ఏడ్చేసింది బెడ్ షేర్ చేసుకోవాలనుందని అడిగిందంటే ఆమె ఆడదే కాదు: నటుడు -
డైరెక్టర్‌ను పట్టుకొని ఏడ్చేసిన హీరోయిన్.. వీడియో వైరల్
దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం 'సీతారామం'. హనురాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రం నేడు(శుక్రవారం)విడుదలై హిట్‌టాక్‌ను సొంతం చేసుకుంది.క్లాసిక్ లవ్‌స్టోరీగా ఈ సినిమాను తెరకెక్కించారంటూ నెటిజన్లు ప్రశంసలు కురిపిస్తున్నారు. విజువల్స్, కథ, స్క్రీన్ ప్లే, మ్యూజిక్ సహా హీరో,హీరోయిన్ల కెమిస్ట్రీకి కూడా మంచి మార్కులు పడ్డాయి. ఆడియెన్స్ నుంచి ఈ సినిమాకు అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో హీరోయిన్ మృణాల్ ఠాకూర్ డైరెక్టర్‌ను గట్టిగా పట్టుకొని ఏడ్చేసింది. తనకు ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు దర్శకుడికి మృణాల్ కృతజ్ఞతలు తెలిపింది. ఇక హీరో దుల్కర్ సైతం సినిమాకు వస్తున్న రెస్పాన్స్‌ను చూసి ఒకింత ఎమోషనల్ అయ్యారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. That moment 🥹 @dulQuer @mrunal0801 @hanurpudi got emotional after watching movie with fans in Hyderabad 🥺😭❤#SitaRamamFDFS#SitaRamam @VyjayanthiFilms #dulqersalman #dulquersalmaan #MrunalThakur#BlockBusterSitaRamam pic.twitter.com/rNAyuY0flZ — 🦋Sita Ramam Day💃❣️ (@Nikki_Keerthy) August 5, 2022 -
Sita Ramam Movie HD Images : ‘సీతారామం’ మూవీ స్టిల్స్
-
గ్రాండ్‌గా 'సీతారామం' ప్రీరిలీజ్ ఈవెంట్.. చీఫ్ గెస్ట్‌గా ప్రభాస్
Prabhas Grand Entry In Sita Ramam Pre Release Event: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సీతారామం'. సుమంత్, డైరెక్టర్ గౌతమ్ మీనన్, తరుణ్ భాస్కర్, మురళి శర్మ, వెన్నెల కిశోర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు వైజయంతీ సమర్పణలో అశ్వినీదత్ నిర్మించారు. ఈ సినిమా నుంచి ఇప్పటికే విడుదలైన ట్రైలర్, టీజర్, క్యారెక్టర్ల లుక్స్, పోస్టర్లు విశేషంగా ఆకట్టుకున్నాయి. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా బుధవారం (ఆగస్టు 3) ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించారు. ఘనంగా నిర్వహిస్తోన్న ఈ కార్యక్రమానికి పాన్ ఇండియా స్టార్, డార్లింగ్ ప్రభాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యాడు. ఈ కార్యక్రమంలో స్టేజ్‌పైకి ప్రభాస్ ఇచ్చిన ఎంట్రీ గ్రాండ్‌గా ఆకట్టుకునేలా ఉంది. డార్లింగ్ ఎంట్రీతో విజిల్స్, అరుపులతో స్టేడియం హోరెత్తింది. అలాగే ప్రముఖ యాంకర్ సుమ కనకాల హోస్ట్ చేస్తున్న ఈ ఈవెంట్లో డైరెక్టర్ అనుధీప్, తరుణ్ భాస్కర్, నాగ్ అశ్విన్, హను రాఘవపూడి, సుమంత్, అశ్వినీదత్, దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ పాల్గొన్నారు. -
అందుకే నాకు బాయ్‌ఫ్రెండ్ ఉండరట!
‘‘వైవిధ్యమైన పాత్రల్లో ఆడియన్స్ నన్ను చూడాలని కోరుకుంటున్నాను. అందుకే నా పాత్రల ఎంపిక ప్రేక్షకులను సర్ప్రైజ్ చేసేలా ఉండాలనుకుంటాను’’ అని అన్నారు మృణాళ్ ఠాకూర్. దుల్కర్ సల్మాన్, మృణాళ్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘సీతారామం’. వైజయంతీ మూవీస్ సమర్ప ణలో స్వప్న సినిమాపై అశ్వనీదత్ నిర్మించిన ఈ చిత్రం ఆగస్టు 5న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా మృణాళ్ ఠాకూర్ చెప్పిన విశేషాలు. ► ‘సీతారామం’ స్క్రిప్ట్ విన్న వెంటనే ఇందులోని సీతామహాలక్ష్మి పాత్ర చేయడానికి అంగీకరించాను. వైజయంతీ బేనర్ నిర్మించిన ‘మహానటి’ సినిమా నాకు చాలా ఇష్టం. ఈ చిత్రదర్శకుడు నాగ్ అశ్విన్‌తో నాకు ముందే పరిచయం ఉంది. ‘మహానటి’ మెల్బోర్న్ ఫిల్మ్ ఫెస్టివల్ స్క్రీనింగ్ అప్పుడు ఆయన్ను నేను కలిశాను. నేను హిందీలో యాక్ట్ చేసిన ‘లవ్ సోనియా’ చిత్రం అదే ఫిల్మ్ ఫెస్టివల్ స్క్రీనింగ్‌కు ఎంపిక కావడంతో వెళ్లాను. ‘మహానటి’లో కీర్తీ సురేశ్ అద్భుతంగా నటించారు. ఇలాంటి పాత్రను నేను ఎందుకు చేయలేకపోయానా అని అసూయపడ్డాను. ►‘సీతారామం’లాంటి మంచి సినిమా ద్వారా తెలుగు చిత్రపరిశ్రమకు పరిచయం అవుతున్నందుకు సంతోషంగా ఉంది. హిందీలో నా తొలి చిత్రం ‘లవ్ సోనియా’ విడుదలైన తర్వాత నాకు పెద్దగా ఆఫర్స్ రాలేదు. కానీ ‘సీతారామం’ ట్రైలర్ విడుదల తర్వాత నాకు తెలుగు, హిందీలో కొత్త ఆఫర్స్ వస్తుండటం సంతోషంగా ఉంది. హిందీలో ‘కుంకుమ భాగ్య’ అనే సీరియల్ చేశాను. ఇది తెలుగులో కూడా డబ్ అయింది. ఇందులో నా క్యారెక్టర్‌కు కాస్త రొమాంటిక్ టచ్ ఉంటుంది. మళ్లీ కొంత గ్యాప్ తర్వాత ఇప్పుడు ‘సీతారామం’ అనే రొమాంటిక్ ఫిల్మ్ చేశాను. ‘కుంకుమ భాగ్య’ సీరియల్లో నా అక్క పాత్రలో నటీమణి మధురాజా నటించారు. సీతామహాలక్ష్మి పాత్రకు ఆమెను కాస్త స్ఫూర్తిగా తీసుకున్నాను. ‘సీతారామం’ రిలీజ్ తర్వాత ఆడియన్స్ నన్ను మృణాళ్గా కన్నా కూడా సీతగానే గుర్తు పెట్టుకుంటారనుకుంటున్నాను. ఈ సినిమా కోసం నేను బరువు కూడా పెరిగాను. ►ఓ సినిమాకు నాలుగో అసిస్టెంట్ డైరెక్టర్‌గా నా జర్నీ ఇండస్ట్రీలో మొదలైంది. ఆ సినిమాకు నాకు పారితోషికం కూడా అందలేదు. నేను యాక్టర్ అవుతానని అప్పట్లో ఊహించలేదు. పైగా తెలుగు హీరోయిన్ అవుతానని నేను అనుకోలేదు. రేపు నా బర్త్ డే. ‘సీతారామం’ రిలీజ్‌కు రెడీ అయ్యింది. అందుకే ఈ సినిమానే నా బెస్ట్ బర్త్ డే గిఫ్ట్‌గా భావిస్తున్నాను. ►నాకు కొన్ని లవ్ లెటర్స్ వచ్చాయి (నవ్వుతూ..). కానీ ప్రజెంట్ నా ఫోకస్ అంతా ‘సీతారామం’ పైనే. ప్రమోషన్స్, షూటింగ్స్ కోసం ఇవాళ ముంబైలో ఉంటావు. రేపు హైదరాబాద్ వెళ్తావు. ఇలా ఉంటే నీకు బాయ్‌ఫ్రెండ్ ఉండరు.. ఎవరు ఉంటారు?’ అని నా స్నేహితులు సరదాగా ఆటపట్టిస్తుంటారు. ►హిందీలో నేను చేసిన ‘ఫిపా’, ‘పూజా మేరీ జాన్’ సినిమాల చిత్రీకరణలు పూర్తయ్యాయి. ఆదిత్యా రాయ్ కపూర్‌తో ఓ ప్రాజెక్ట్ చేస్తున్నాను. -
దుల్కర్‌తో ప్రతి ఏడాది ఒక మూవీ తీద్దామని చెప్పా: అశ్వినీదత్
మహానటిలో జెమినీ గణేషన్ పాత్ర చేసినప్పటి నుండి దుల్కర్ సల్మాన్ అంటే నాకు చాలా గౌరవం. అలాగే మమ్ముట్టి గారికి నేను పెద్ద అభిమానిని. జెమినీ గణేషన్ పాత్ర దుల్కర్ ఒప్పుకోవడం నాకే సర్ప్రైజ్ అనిపించింది. ఆ పాత్రని చాలా కన్వెన్సింగా చేశాడు. 'ప్రతి ఏడాది ఒక సినిమా దుల్కర్ తో తీద్దాం'అని స్వప్నతో అప్పుడే చెప్పాను’అని ప్రముఖ నిర్మాత అశ్వినీదత్ అన్నారు. దుల్కర్ సల్మాన్ - మృణాల్ ఠాకూర్ జంటగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న చిత్రం 'సీతారామం'. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ నేపథ్యంలో నిర్మాత అశ్వినీదత్ విలేఖరుల సమావేశంలో ముచ్చటించారు. ఆ విశేషాలు.. ►ఎప్పటినుండో మంచి ప్రేమకథ తీయాలని అనుకుంటున్నాను. సీతారామంతో ఆ కోరిక తీరింది. బాలచందర్ గారి మరో చరిత్ర, మణిరత్నం గారి గీతాంజలి చరిత్రలో నిలిచిపోయాయి. సీతారామం కూడా ఒక ల్యాండ్ మార్క్ సినిమాగా నిలుస్తుందనే నమ్మకం వుంది. ►ప్రేక్షకులు థియేటర్‌కి రాకపోవడానికి కరోనా ఒక కారణమని భావిస్తున్నాను. అలాగే టికెట్ రేట్లు ఒక క్రమ పద్దతి లేకుండా పెంచడం, తగ్గించడం కూడా ఒక కారణం కావొచ్చు. అలాగే చాలా థియేటర్లని చేతిలోకి తీసుకొని స్నాక్స్, కూల్ డ్రింక్స్ ధరలు ఇష్టారాజ్యంగా పెంచి ఫ్యామిలీ ఆడియన్స్ థియేటర్ కి రావాలంటే భయపడే స్థాయికి తీసుకెళ్ళారు. ఇదే సమయంలో ఓటీటీలు వచ్చాయి. ఇలా అనేక కారణాలు ఉన్నాయి. ► ఎన్టీఆర్, రాఘవేంద్రరావు, చిరంజీవితో సినిమాలు చేసినప్పుడు వారి రూపంలో నాకు కనిపించని బలం ఉండేది. ఇద్దరు పిల్లలు చదువుపూర్తి చేసుకొని వచ్చి సినిమా నిర్మాణ రంగంలోకి వస్తామని చెప్పారు. ఇద్దరూ చాలా ప్రతిభావంతులు. స్వప్న ఆలోచనలు అద్భుతంగా ఉంటాయి. ఒంటి చేత్తో నడిపిస్తుంది. నిర్మాణం దాదాపు గా వాళ్లకి అప్పగించినట్లే. అయితే సంగీతం, సాహిత్యం నేను చూస్తాను. అలాగే స్క్రిప్ట్ కూడా. మహానటి లాంటి సినిమా తీసినప్పుడు సెట్స్ విషయంలో ప్రత్యేక శ్రద్ద తీసుకున్నాను. హను రాఘవపూడి ఈ సినిమాని దాదాపు అవుట్ డోర్ లో తీశారు. నేను షూటింగ్ కి వెళ్ళలేదు. సీతారామం మొత్తం స్వప్న చూసుకుంది. ఈ సినిమా క్రెడిట్ స్వప్నకి దక్కుతుంది. ► సీతారామంకు విశాల్ చంద్రశేఖర్ అద్భుతమైన సంగీతం ఇచ్చారు. విశాల్ ని తీసుకోవాలనేది హను చాయిస్. నేనూ విశాల్ మ్యూజిక్ విన్నాను. విశాల్ గారి భార్య కూడా సంప్రాదాయ సంగీత గాయిని. ఆమె సహకారం కూడా ఎక్కువ వుంటుందనిపించింది. వారిద్దరూ చాలా కష్టపడ్డారు. నేపధ్య సంగీతం కూడా చాలా గ్రాండ్ గా చేశారు. ► హను రాఘవపూడి చాలా మంచి టెక్నిక్ తెలిసిన దర్శకుడు. చాలా గొప్ప కథ చెప్పాడు. అతనికి కెమారా పై అద్భుతమైన పట్టు ఉంది. సినిమాని ఒక విజువల్ వండర్ లా తీశారు. కాశ్మీర్ తో పాటు మిగతా చాలా అందమైన లొకేషన్ ఇందులో విజువల్ ఫీస్ట్ గా ఉంటాయి. ► మహానటిలో జెమినీ గణేషన్ పాత్ర చేసినప్పటి నుండి దుల్కర్ అంటే నాకు చాలా గౌరవం. అలాగే మమ్ముట్టి గారికి నేను పెద్ద అభిమానిని. జెమినీ గణేషన్ పాత్ర దుల్కర్ ఒప్పుకోవడం నాకే సర్ప్రైజ్ అనిపించింది. ఆ పాత్రని చాలా కన్వెన్సింగా చేశాడు. 'ప్రతి ఏడాది ఒక సినిమా దుల్కర్ తో తీద్దాం'అని స్వప్నతో అప్పుడే చెప్పాను. హను ఈ కథ చెప్పిన వెంటనే మరో ఆలోచన లేకుండా నేరుగా దుల్కర్ కి చెప్పమని చెప్పాను. ఎందుకంటే నేషనల్ వైడ్ గా రీచ్ ఉండే ఈ ప్రేమ కథకు దుల్కర్ అయితే సరైన న్యాయం చేయగలడు. సుమంత్ పాత్ర కూడా అద్భుతంగా ఉంటుంది. ఈ పాత్రతో ఆయన అన్ని భాషలకు పరిచయం అవుతారు. చాలా మంచి పేరు తీసుకొస్తుంది. ► ఈ సినిమా సినిమా నిడివి 2 గంటల 37 నిమిషాలు ఉంటుంది. సినిమా ఫాస్ట్‌గా ఉంటుంది. తమిళ్, మలయాళం వెర్షన్ సెన్సార్ దుబాయ్ లో జరిగింది. అద్భుతమైన రిపోర్ట్స్ వచ్చాయి. తెలుగు, తమిళ, మలయాళంలో సినిమా ఏకకాలంలో విడుదలవుతుంది. ► ప్రాజెక్ట్ కె షూటింగ్ జనవరికి పూర్తవుతుంది. తర్వాత గ్రాఫిక్స్ వర్క్ ఉంటుంది. నాగచైనత్య సినిమా, శ్రీకాంత్ అబ్బాయి రోషన్ తో ఒక సినిమా చర్చల్లో ఉన్నాయి. అన్నీ మంచి శకునములే అక్టోబర్ 5న విడుదలవుతుంది. -
అలా అయితే మంచి పాట వస్తుంది : విశాల్ చంద్రశేఖర్
‘‘నేను ఏ సినిమా చేసినా ఆ కథ వినను.. స్క్రిప్ట్ పూర్తిగా చదువుతాను. అప్పుడే ఎలాంటి మ్యూజిక్ ఇవ్వాలో ఓ అవగాహన వస్తుంది. మంచి సంగీతం కుదరాలంటే కథ మ్యూజిక్‌ని డిమాండ్ చేయాలి. అప్పుడే మంచి పాట వస్తుంది. అలా మ్యూజిక్‌ని డిమాండ్ చేసిన కథ ‘సీతారామం’. ఈ చిత్రకథ ఇచ్చిన స్ఫూర్తితో అద్భుతమైన సంగీతం ఇచ్చాను’’ అని సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్ అన్నారు. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సీతారామం’. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వినీదత్ నిర్మించిన ఈ సినిమా ఆగస్ట్ 5న విడుదలవుతోంది. ఈ సందర్భంగా చిత్ర సంగీతదర్శకుడు విశాల్ చంద్రశేఖర్ మాట్లాడుతూ– ‘‘రంజిత్ బారోట్ అనే సంగీత దర్శకుడు నాకు స్ఫూర్తి. తమిళ్లో ప్రభుదేవా హీరోగా ‘వీఐపీ’ అనే సినిమాతో పాటు మరో చిత్రానికి సంగీతం అందించారాయన. ప్రస్తుతం ఏఆర్ రెహమాన్‌గారి ట్రూప్‌లో మెయిన్ డ్రమ్మర్. హను రాఘవపూడిగారితో ‘పడిపడి లేచే మనసు’ సినిమా చేశాను. ఆయన కథ రాసుకునే విధానం బాగుంటుంది. ‘సీతారామం’ వంటి చాలా గొప్ప కథ రాశారు. ఈ చిత్రంలో 9 పాటలు ఉన్నాయి. జర్మనీ, యుఎస్, ఫ్రాన్స్... ఇలా విదేశీ వాయిద్యకారులతో పాటు దాదాపు 140మంది మ్యుజీయన్స్ కలిసి నేపథ్య సంగీతం కోసం పని చేశారు. ఈ సినిమాలోని ‘కానున్న కల్యాణం..’ పాటని ‘సిరివెన్నెల’ సీతారామ శాస్త్రిగారు రాశారు. ఈ పాట కంపోజ్ చేసినప్పుడు స్టూడియోకి వచ్చిన ఆయన తెలుగు, తమిళ్.. ఇలా అన్ని భాషల్లోని అలంకారాల గురించి నాకు వివరించారు. పాటల రచయితలు కేకేగారు, అనంత్ శ్రీరామ్‌లతో కూడా మంచి అనుబంధం ఉంది. ఈ సినిమాలోని పాటలని డబ్బింగ్‌లా కాకుండా తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆ నేటివిటీకి తగ్గట్టు ఒరిజినల్‌గా చేశాం. మెలోడీ పాటలు నా బలం. నా తర్వాతి సినిమా మాధవన్‌గారితో ఉంటుంది.. ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి’’ అన్నారు. -
ఉత్తరం రాస్తే కశ్మీర్‌ను మంచుకు వదిలేస్తారా ?
మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా మృణాల్ ఠాకూర్, రష్మిక మందన్నా హీరోయిన్లుగా నటించిన చిత్రం 'సీతా రామం'. సుమంత్, డైరెక్టర్ గౌతమ్ మీనన్, తరుణ్ భాస్కర్, మురళి శర్మ, వెన్నెల కిశోర్ తదితరులు కీలకపాత్రలు పోషించారు. హను రాఘవపూడి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు వైజయంతీ సమర్పణలో అశ్వినీదత్ నిర్మించారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో తెరకెక్కిన ఈ మూవీ ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ క్రమంలో సినిమా ట్రైలర్‌ను విడుదల చేసింది చిత్రబృందం. 20 ఏళ్ల క్రితం లెఫ్టినెంట్ రామ్ నాకొక బాధ్యతను అప్పగించాడు. ఈ ఉత్తరం సీతామహాలక్ష్మికి నువ్వే చేర్చాలి అంటూ ప్రారంభమైన ట్రైలర్ ఆద్యంతం ఆసక్తిగా సాగింది. రామ్ రాసిన ప్రేమ లేఖను సీతామహాలక్ష్మికి చేర్చేందుకు రష్మిక మందన్నా ప్రయత్నిస్తుంటుంది. ఆ లెటర్‌ను రామ్‌కు చేర్చే క్రమంలో అతనికి ఏమైందో తెలుసుకోవడమే సినిమా కథగా తెలుస్తోంది. పాత్రల నటన, డైలాగ్స్ చాలా ఆకట్టుకున్నాయి. 'నాలుగు మాటలు పోగేసి ఉత్తరం రాస్తే కశ్మీర్‌ను మంచుకు వదిలేసి వస్తారా?', 'నా పాటికి నేను అనాథలా బతికేస్తుంటే ఉత్తరాలు రాసి ఇబ్బంది పెట్టింది కాకుండా దారి ఖర్చులు ఇస్తాననడం న్యాయమా' అంటూ చెప్పే సంభాషణలు బాగున్నాయి. 1965 నాటి కాలంలో సాగే కథతో తెరకెక్కిన ఈ మూవీకి విశాల్ చంద్రశేఖర్ అందించిన సంగీతం ఆకట్టుుకునేలా ఉంది. చదవండి: లెక్క తప్పిన జాన్వీ కపూర్.. ఆడేసుకుంటున్న నెటిజన్లు ఆ విషయంలో తెలుగు దర్శకులకు చిరు చురకలు.. కన్నీరు పెట్టుకున్న మంచు లక్ష్మి.. ఏదో తెలియని బాధ అంటూ వీడియో -
ఆ ఆలోచనతోనే ‘సీతారామం’ కథ రాశా : హను రాఘవపూడి
‘నాకు పాత పుస్తకాలు కొనుక్కోనే అలవాటు ఉంది. అలా ఒక్కసారి కోఠిలో కొనుక్కున్న పుస్తకంలో ఒక లెటర్ కనిపించింది. ఒక అబ్బాయికి వాళ్ల అమ్మ రాసిన లెటర్ అది. అతను దాన్ని కనీసం ఓపెన్ కూడా చేయలేదు. ఇది నాకు చాలా . ఇది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఒకవేళ అందులో చాలా ముఖ్యమైన విషయం ఉండి ఓపెన్ చేయకపోతే జర్నీ ఎలా ఉండేది? మనిషి జీవితాన్ని నిర్దేశించే విషయం కదా అనిపించింది. ఆ ఆలోచనతోనే ‘సీతారామం’ కథ రాశా’ అని దర్శకుడు హను రాఘవపూడి అన్నారు. స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై స్టార్ ప్రొడ్యూసర్ అశ్వినీదత్ నిర్మాణంలో హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందిన చిత్రం 'సీతా రామం'. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో రష్మిక మందన కీలక పాత్రలో కనిపిస్తున్నారు. భారీ తారాగణం, అత్యున్నత సాంకేతిక విలువలతో తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏకకాలంలో రూపొందిన ఈ చిత్రం ఆగస్ట్ 5న ప్రేక్షకుల ముందుకు వస్తున్న నేపధ్యంలో దర్శకుడు లో హను రాఘవపూడి మీడియాతో ముచ్చటించారు. ఆయన పంచుకున్న 'సీతా రామం' చిత్ర విశేషాలివి. ఇండస్ట్రీకి వచ్చి పదేళ్లు అవుతోంది. ఈ పదేళ్లలో కేవలం నాలుగు సినిమాలే చేయడానికి కారణం? మొదటి సినిమా అందాల రాక్షసి చేసినప్పుడు ఇప్పుడున్నంత వనరులు లేవు. ఆ సినిమాకి మొదట్లో సక్సెస్ అని రాలేదు. తర్వాత రోజుల్లో కల్ట్ స్టేటస్ వచ్చింది. తర్వాత కృష్ణగాడి వీర ప్రేమ గాధ చేశాను. అయితే ఈ గ్యాప్ లో కొంత కష్ట సమయం ఎదురైయింది. రానాతో అనుకున్న ఒక సినిమా బడ్జెట్ కారణాల వలన కుదరలేదు. లై, పడి పడి లేచే మనసు ఏడాది గ్యాప్ లోనే వచ్చాయి. తర్వాత అందరిలానే కరోనా గ్యాప్ వచ్చింది. అయితే నా జర్నీలో సక్సెస్ గురించి ఎప్పుడూ దిగులు లేదు. ఈ ప్రయాణంలో నిరాశ చెందలేదు. పని దొరుకుతుందా లేదా? అని ఎప్పుడూ అలోచించలేదు. సీతారామంపై మంచి అంచనాలు ఉన్నాయి. సినిమా ఈ అంచనాలని అధిగమిస్తుందా ? ఖచ్చితంగా అధిగమిస్తుంది. సీతారామం చాలా ప్రత్యేకమైన చిత్రం. సినిమా చూడటానికి మొదట కావలసింది క్యురీయాసిటీ. సీతారామం థియేటర్ లోనే చూడాలనే ఎక్సయిట్ మెంట్ , క్యురియాసిటీ ప్రతి ప్రమోషనల్ ఎలిమెంట్ లో కనిపిస్తుంది. థియేటర్ లోకి వచ్చిన తర్వాత సీతారామం అద్భుతమని ప్రేక్షకులు ఖచ్చితంగా అంటారు. సీతారామం కథకు ప్రేరణ? నాకు కోఠీ వెళ్లి పాత పుస్తకాలు కొనుక్కునే అలవాటు ఉంది. అలా కొనుక్కున్న పుస్తకంలో ఒక లెటర్ కనిపించింది. ఓపెన్ చేయని లెటర్ అది. అది ఓపెన్ చేస్తే పెద్ద మేటర్ ఏమీ లేదు. ఒక అబ్బాయి కి వాళ్ళ అమ్మ రాసిన ఉత్తరం అది. అతను కనీసం దాన్ని ఓపెన్ కూడా చేయలేదు. ఇది నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఒకవేళ అందులో చాలా ముఖ్యమైన విషయం ఉండి ఓపెన్ చేయకపోతే జర్నీ ఎలా ఉండేది? మనిషి జీవితాన్ని నిర్దేశించే విషయం కదా అనిపింగదచింది. ఆ అలోచని కథగా రాశా. సీతారామం పూర్తిగా ఫిక్షన్. తెలుగులో ఇంత మంది ఉండగ దుల్కర్ సల్మాన్ ని తీసుకోవడానికి కారణం ? కథ రాసినప్పుడు మైండ్ లో నటులు ఎవరూ లేరు. ఒక డిమాండింగ్ ఫేస్ కావాలి. తెలుగులో ఉన్నవాళ్ళంతా ఆ సమయంలో బిజీగా వున్నారు. నేను, స్వప్న గారు కలసి దుల్కర్ ని అనుకున్నాం. మార్కెట్ ని విస్తరించాలనే ఆలోచన మాత్రం లేదు. సీతారామం లార్జన్ దెన్ లైఫ్ స్టొరీ. సంగీత దర్శకుడిగా విశాల్ చంద్ర శేఖర్ ని తీసుకోవడానికి కారణం ? విశాల్ నాకు మంచి స్నేహితుడు. ఆతనితో పని చేయడం చాలా సౌకర్యంగా ఉంటుంది. మా ఇద్దరికి మ్యూజిక్ పట్ల ఒకే అభిరుచి ఉంది.ఇందులో మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. సీతారామం పాటలకు వృధ్యాప్యం రానేరాదు. పదేళ్ళ సినిమా ప్రయాణంలో దర్శకుడిగా ఏం నేర్చుకున్నారు ? పదేళ్ళుగా నేర్చుకున్నది రేపటికి మారిపోవచ్చు. ప్రతి రోజు నేర్చుకోవాల్సిందే. 'సీతారామం' 1964 నేపధ్యంలోనే సినిమా నడుస్తుందా ? ఇందులో రెండు టైం పీరియడ్స్ వున్నాయి. 1964 కథ టేకాఫ్ పిరియడ్. స్క్రీన్ ప్లే వర్తమానానికి గతానికి నడుస్తూ ఉంటుంది. రష్మిక మందన పాత్రకు ఎంత ప్రాధాన్యత ఉంటుంది ? రష్మికది చాలా కీలకమైన పాత్ర. కథని మలుపు తిప్పే పాత్ర. ఆ పాత్ర జర్నీలో ఏం జరుగుతుందో అనేది ఒకరకంగా ఈ కథ. అదే కాదు.. ఇందులో పాత్రలన్నీ కథని ఎదో ఒక మలపుతిప్పుతాయి. సుమంత్, భూమిక, ప్రియదర్శి.. అన్నీ ముఖ్యమైన పాత్రలే. 'యుద్ధంతో రాసిన ప్రేమ' కథ ఏమిటి ? బేసిగ్గా యుద్ధ నేపధ్యంలో జరిగే కథ అంటే యుద్ధం మనకి కనిపిస్తుంది. 'యుద్ధంతో రాసిన ప్రేమ' ఎందుకంటే ఇది ఫిజికల్ వార్ కాదు. ఈ యుద్ధం ఇన్ విజిబుల్. కథలోని ప్రతి పాత్రకు ఒక యుద్ధం వుంటుంది. ఒక ఉదారణగా చెప్పాలంటే.. రాముడు.. రావణుడిని చంపడం అసలు యుద్ధమే కాదు. ఎందుకంటే రాముడి వీరత్వం ముందు ఎవరూ సరిపోరు. రాముడు విష్ణుమూర్తి అవతారం. రాముడు లాంటి లక్షణాలతో మరొకరు పుట్టలేదు. అందుకే రాముడు దేవుడయ్యాడు. అయితే రావణసంహారం చేయడానికి రాముడు చేసిన ప్రయాణంలో గొప్ప యుద్ధం.,సంఘర్షణ ఉంది. అలాంటి సంఘర్షణ, యుద్ధం సీతారామంలో ఉంటుంది. వైజయంతి మూవీస్ లో పని చేయడం ఎలా అనిపించింది ? వైజయంతి మూవీస్ లో చేయడం వండర్ ఫుల్ ఎక్స్ పీరియన్స్. కాగితం మీద ఉన్నది స్క్రీన్ మీదకి రావాలంటే విజన్ ఒక్కటే సరిపోదు. దీనిని బలంగా నమ్మే నిర్మాత ఉండాలి. వైజయంతి మూవీస్, స్వప్న దత్ సినిమా పట్ల గొప్ప సంకల్పం వున్న నిర్మాతలు. సీతారామం షూటింగ్ ప్రాసస్ లో ఎలాంటి సవాల్ ఎదురయ్యాయి ? ప్రకృతి ప్రాధాన సవాల్. కాశ్మీర్ లాంటి ప్రదేశాల్లో మైనస్ డిగ్రీలలో షూట్ చేశాం. ఇది కొంచెం టఫ్ జాబ్. మిగతావి పెద్ద కష్టపడింది లేదు. మీ సినిమాల్లో మీ మనసుకు బాగా నచ్చిన సినిమాలు ఏవి ? సీతారామం, అందాల రాక్షసి. ఈ రెండు నా మనసు దగ్గరగా వున్న చిత్రాలు. మీ లైఫ్ లో ప్రేమ కథ ఉందా ? లేదండీ. మన జీవితంలో ఏది ఉండదో అదే కోరుకుంటాం. అందుకే లవ్ స్టోరీస్ చేస్తున్నా (నవ్వుతూ) కొత్తగా చేయబోతున్న సినిమాలు ? బాలీవుడ్ లో సన్నీ డియోల్, నవాజ్ తో ఒక యాక్షన్ ఫిల్మ్ చేయబోతున్నా. అలాగే అమోజన్ తో ఒక వెబ్ సిరిస్ ప్లాన్ వుంది. -
మల్లారెడ్డి ఉమెన్స్ కాలేజీలో ‘సీతారామం’ టీం సందడి (ఫొటోలు)
-
'మేజర్ సెల్వన్'గా ప్రముఖ డైరెక్టర్..
Gautham Menon As Major Selvan First Look Out: మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాళినీ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా, రష్మికా మందన్నా, సుమంత్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సీతారామం’. ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వనీదత్ నిర్మించిన చిత్రం ఇది. ఈ చిత్రంలో లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్, సీతగా మృణాళినీ ఠాకూర్, అఫ్రిన్ పాత్రలో రష్మికా మందన్నా కనిపించనున్నారు. ఈ సినిమా నుంచి ఇదివరకు విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇటీవల 'బ్రిగేడియర్ విష్ణు శర్మ' పాత్రలో నటిస్తున్న సుమంత్ లుక్ ఆకట్టుకుంది. తాజాగా ప్రముఖ డైరెక్టర్ గౌతమ్ వాసుదేవ్ మీనన్ పాత్రను రివీల్ చేసింది చిత్రబృందం. ఈ సినిమాలో గౌతమ్ 'మేజర్ సెల్వన్'గా నటిస్తున్నారు. దీనికి సంబంధించిన లుక్ విడుదల కాగా, సోషల్ మీడియాలో మంచి స్పందన లభిస్తోంది. చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. చదవండి: అన్నదమ్ములతో డేటింగ్ చేసిన హీరోయిన్లు.. ఫొటోలు వైరల్ మొన్న ఆర్జీవీ.. ఇప్పుడు సుశాంత్.. యాంకర్‌పై ఆగ్రహం Attention Everyone! 𝐌𝐚𝐣𝐨𝐫 𝐒𝐞𝐥𝐯𝐚𝐧 is here! Here's the first look of @menongautham from #SitaRamam.https://t.co/HNfYz5h9Yy@dulQuer @mrunal0801 @hanurpudi @iamRashmika @iSumanth @Composer_Vishal @VyjayanthiFilms @SwapnaCinema @SonyMusicSouth#SitaRamamOnAug5 pic.twitter.com/oUkrUIf6EE — Vyjayanthi Movies (@VyjayanthiFilms) July 15, 2022 -
ముగింపు మన చేతుల్లో ఉండదు.. ఆసక్తిగా సుమంత్ ఫస్ట్ లుక్..
Sumanth First Look Poster From Sita Ramam Movie: మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్, మృణాళినీ ఠాకూర్ హీరో హీరోయిన్లుగా, రష్మికా మందన్నా, సుమంత్ కీలక పాత్రల్లో నటిస్తున్న చిత్రం ‘సీతారామం’. ఈ చిత్రానికి హను రాఘవపూడి దర్శకత్వం వహించారు. వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వనీదత్ నిర్మించిన చిత్రం ఇది. ఈ చిత్రంలో లెఫ్టినెంట్ రామ్ పాత్రలో దుల్కర్ సల్మాన్, సీతగా మృణాళినీ ఠాకూర్, అఫ్రిన్ పాత్రలో రష్మికా మందన్నా కనిపించనున్నారు. ఇదివరకు ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, ఫస్ట్ లుక్ పోస్టర్లు ఆకట్టుకున్నాయి. తాజాగా ఇందులో సుమంత్ క్యారెక్టర్‌ను పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వీడియో ద్వారా రిలీజ్ చేశారు. ఈ మూవీలో బ్రిగేడియర్ విష్ణు శర్మ పాత్రలో సుమంత్ నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఆర్మీ అధికారిగా కొత్త లుక్‌లో సుమంత్ అట్రాక్ట్ చేస్తున్నాడు. 'కొన్ని యుద్ధాలు మొదలు పెట్టడం మాత్రమే మన చేతుల్లో ఉంటుంది. ముగింపు కాదు' అని సుమంత్ చెప్పే డైలాగ్ ఎఫెక్టివ్‌గా ఉంది. ఈ చిత్రం తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆగస్టు 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందిస్తున్నారు. Unveiling the first look of yours truly as 𝐁𝐫𝐢𝐠𝐚𝐝𝐢𝐞𝐫 𝐕𝐢𝐬𝐡𝐧𝐮 𝐒𝐡𝐚𝐫𝐦𝐚 from #SitaRamam! 🔗https://t.co/Zu0USKQfq6@dulQuer @mrunal0801 @hanurpudi @iamRashmika @Composer_Vishal @VyjayanthiFilms @SwapnaCinema @SonyMusicSouth #SitaRamamOnAug5 pic.twitter.com/kqXbcfflM9 — Sumanth (@iSumanth) July 9, 2022 -
Sita Ramam: ఇంతందం దారి మళ్లిందా.. మెలోడీ అదిరింది
‘‘ఇంతందం దారి మళ్లిందా.. భూమిపైకే చేరుకున్నాదా’ అంటూ పాడేస్తున్నారు దుల్కర్ సల్మాన్. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ హీరోగా, మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటించిన చిత్రం ‘సీతారామం’. రష్మికా మందన్న కీలక పాత్ర చేశారు. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాపై అశ్వినీదత్ నిర్మించిన ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం అందించారు. ఈ చిత్రంలోని ‘ఇంతందం దారి మళ్లిందా..’ అంటూ సాగే లిరికల్ వీడియోను సోమవారం విడుదల చేశారు. కృష్ణకాంత్, మృణాల్, హను, విశాల్ హను రాఘవపూడి మాట్లాడుతూ– ‘‘1965 యుద్ధం నేపథ్యంలో ప్రేమకావ్యంగా తెరకెక్కిన చిత్రమిది. ‘ఇంతందం దారి మళ్లిందా..’ పాటని కృష్ణకాంత్ అద్భుతంగా రాశారు. ఆ పాట వినగానే నాకు వేటూరిగారు గుర్తుకొచ్చారు. ఎస్పీ చరణ్ చక్కగా పాడారు’’ అన్నారు. ‘‘ఈ చిత్రంలో ప్రతి పాట మనసుని హత్తుకునేలా ఉంటుంది’’ అన్నారు విశాల్ చంద్రశేఖర్. ‘‘ఇంతందం దారి..’ పాట విన్న ప్రతిసారీ మనసు హాయిగా ఉంటుంది’’ అన్నారు మృణాల్ ఠాకూర్. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రం ఆగస్ట్ 5న రిలీజ్ కానుంది. ‘‘1965లో ఉండేలా స్వచ్ఛమైన తెలుగు పాట రాయమని హను ‘ఇంతందం దారి..’ పాట సందర్భం చెప్పి నప్పుడు ఆనందంగా అనిపించింది. ఈ పాట అత్యద్భుతంగా ఉంటుంది’’ అన్నారు కృష్ణకాంత్. -
‘‘సీతారామం’ కోసం వందల మంది రెండేళ్లు కష్టపడ్డాం’
‘‘సీతారామం’ కథ గొప్పగా ఉంటుంది. నటుడిగా నేను ఎంత స్కోర్ చేస్తానో తెలీదు కానీ సినిమా స్కోర్ చేస్తే నేను హ్యాపీ. ఇది ఎప్పటికీ గుర్తుండిపోయే సినిమా’’ అన్నారు దుల్కర్ సల్మాన్. లెఫ్టినెంట్ రామ్‌గా దుల్కర్ సల్మాన్, సీతగా మృణాళినీ ఠాకూర్ నటిస్తున్న చిత్రం ‘సీతారామం’. హను రాఘవపూడి దర్శకత్వంలో వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై అశ్వీనీదత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. యుద్ధ నేపథ్యంలో సాగే ప్రేమకథగా రూపొందుతున్న ఈ చిత్రం టీజర్ ఆవిష్కరణ హైదరాబాద్‌లో జరిగింది. (చదవండి: ఆమె లీనమైపోయింది, అలా ఆ రొమాంటిక్ సీన్ ఈజీ అయింది) ఈ సందర్భంగా హను రాఘవపూడి మాట్లాడుతూ– ‘‘సీతారామం’ ఒక మ్యాజికల్ లవ్‌స్టోరీ. ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతి ఇవ్వడానికి వందల మంది రెండేళ్లుగా కష్టపడ్డాం. వైవిధ్యమైన ప్రదేశాల్లో మైనస్ 24 డిగ్రీల్లో కూడా షూట్ చేశాం’’ అన్నారు. ‘‘ఈ సినిమాకి మంచి పాటలు కుదిరాయి’’ అన్నారు సంగీత దర్శకుడు విశాల్ చంద్రశేఖర్. ‘‘మా బేనర్లో ‘మహానటి’లో కాస్త నెగిటివ్ షేడ్స్ ఉన్న జెమినీ గణేశన్‌గారి పాత్రని దుల్కర్ బాగా చేశారు. తనకు మా మీద నమ్మకం ఎక్కువ. అందుకే దుల్కర్‌కి కథ పంపించే ముందు ఒకటికి రెండుసార్లు చెక్ చేసుకుంటాం. ఈ కథకి దుల్కర్ వెంటనే ఓకే చెప్పారు’’ అన్నారు స్వప్నాదత్. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఆగస్ట్ 5న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు ప్లాన్ చేస్తున్నారు. రష్మికా మందన్న, సుమంత్, గౌతమ్ మీనన్, ప్రకాష్ రాజ్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పీఎస్ వినోద్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: -
దుల్కర్ సల్మాన్-రష్మిక మందన్నా 'సీతా రామం' నుంచి కొత్త అప్డేట్..
Sita Ramam: First Single Oh Sita Hey Rama Promo Released: హను రాఘవపూడి డైరెక్షన్లో మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా 'సీతా రామం'. 'యుద్ధంతో రాసిన ప్రేమకథ' అనేది ట్యాగ్‌లైన్. వైజయంతీ మూవీస్ సమర్పణలో రూపొందిన ఈ చిత్రంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్నా, మృణాళిని ఠాకూర్, సుమంత కీలక పాత్రల్లో అలరించనున్నారు. బ్యూటిఫుల్ లవ్ స్టోరీగా వస్తున్న ఈ చిత్రాన్ని అశ్వినీదత్, ప్రియాంక దత్ నిర్మిస్తున్నారు. తాజాగా ఈ మూవీకి సంబధించిన అప్డేట్ను ఇచ్చారు. ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ 'ఓ సీత.. హే రామ'ని మే 9న రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు. తాజాగా ఈ పాటకు సంబంధించిన ప్రొమోను ఆదివారం (మే 8) విడుదల చేశారు. ఈ పాటకు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా ఎస్పీ చరణ్, రమ్య బెహరా ఆలపించారు. విశాల్ చంద్రశేఖర్ మెలోడీయస్ సంగీతం బాగుంది. ఈ సాంగ్ ప్రొమో చివర్లో 'వెళ్లి సీత దగ్గర డ్యాన్స్ నేర్చుకోండి' అని దుల్కర్ సల్మాన్ సీతాకోక చిలుకలతో చెప్పడం చాలా ఆకట్టుకుంది. ప్రస్తుతం ఈ ప్రొమో నెట్టింట వైరల్ అవుతోంది. చివరి దశ చిత్రీకరణలో ఉన్న ఈ సినిమా తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో విడుదల కానుంది. అలాగే ఇటీవల విడుదలైన టైటిల్ గ్లింప్స్‌కు మంచి స్పందన లభించింది. చదవండి: నేను బ్యాడ్ బాయ్‌లానే కనిపిస్తాను: దుల్కర్ సల్మాన్ Can’t wait to show you guys the full song! #OhSitaHeyRama (Telugu): https://t.co/Ii8whgyQui #SitaRamam @dulQuer @mrunal0801 @iamRashmika @iSumanth @Composer_Vishal #PSVinod @MrSheetalsharma @IananthaSriram @VyjayanthiFilms @SwapnaCinema @SonyMusicSouth @kshreyaas @sidsriram pic.twitter.com/1T1kUwTU0V — Hanu Raghavapudi (@hanurpudi) May 8, 2022 -
రష్మిక అసలు హీరోయినే కాదు : డైరెక్టర్ కామెంట్స్
నేషనల్ క్రష్ రష్మిక మందన్నా ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇటీవలె ఈ ముద్దుగుమ్మ 'సీతారామం' అనే ప్రాజెక్టుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను జయంతి మూవీస్ బ్యానర్ లో స్వప్న దత్ నిర్మిస్తుంది. ఈ సినిమాలో రష్మిక అఫ్రీన్ అనే కశ్మీరీ ముస్లీం అమ్మాయి పాత్రలో నటిస్తుండటంతో ఇక హీరోయిన్ రష్మికే అన్న కథనాలు వెలువడ్డాయి. తాజాగా ఇదే అంశంపై డైరెక్టర్ హను క్లారిటీ ఇచ్చారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన ఆయన.. ఈ సినిమాలో రష్మిక హీరోయిన్ కాదు.. హీరో అనే చెప్పాలి అంటూ కామెంట్స్ చేశారు. పాత్రకు తగ్గట్లు రష్మిక ఎంతో కష్టపడిందని, ఆమె నటన చూసి ఆశ్చర్యపోయానని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ కామెంట్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. -
దుల్కర్ సల్మాన్‌తో ‘తూఫాన్’ భామ రొమాన్స్
‘సూపర్ 30’, ‘బాట్లా హౌస్’, ‘తూఫాన్’ వంటి హిందీ చిత్రాల్లో హీరోయిన్గా ప్రేక్షకులను మెప్పించిన మృణాల్ ఠాకూర్ తెలుగు చిత్రపరిశ్రమకు ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. ‘మహానటి’ ఫేమ్ దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమాలో హీరోయిన్గా నటిస్తున్నారు మృణాల్. వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్నా సినిమా బ్యానర్‌పై అశ్వినీ దత్, ప్రియాంక దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఆదివారం మృణాల్ ఠాకూర్ పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రంలో ఆమె చేస్తున్న సీత పాత్ర లుక్‌ని విడుదల చేశారు. ‘‘హను రాఘవపూడి ఈ సినిమాలో మరో ఆసక్తికరమైన ప్రేమ కోణాన్ని చూపించబోతున్నారు. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో రూపొందుతోన్న ఈ సినిమా ఇటీవల కాశ్మీర్ షెడ్యూల్ పూర్తి చేసుకుంది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: పి.ఎస్.వినోద్, సంగీతం: విశాల్ చంద్రశేఖర్. Proud to Introduce @mrunal0801 as Sita ❤️ Happy birthday Sita.. u will conquer hearts... Here's the Glimpse: https://t.co/BHCX1vF3p1#declassifiessoon @dulQuer @hanurpudi @Composer_Vishal@AshwiniDuttCh @SwapnaCinema @VyjayanthiFilms pic.twitter.com/mENkXh0aKS — Vyjayanthi Movies (@VyjayanthiFilms) August 1, 2021 -
ఇదే బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్: దుల్కర్ సల్మాన్
దుల్కర్ సల్మాన్ హీరోగా వైజయంతి మూవీస్ సమర్పణలో స్వప్న సినిమా పతాకంపై ఓ పీరియాడికల్ లవ్‌స్టోరీ చిత్రం రూపొందుతోన్న విషయం తెలిసిందే. హను రాఘవపూడి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ సంగీతం సమకూరుస్తుండగా దివాకర్ మణి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. నేడు (జూలై 28) దుల్కర్ బర్త్‌డే సందర్భంగా ఆయనను లెఫ్టినెంట్ రామ్‌గా పరిచయం చేస్తూ గ్లింప్స్ రిలీజ్ చేశారు. ఇందులో మంచు కొండల్లోనూ తన విధులు నిర్వర్తిస్తూ చిరునవ్వులు చిందిస్తున్నాడు హీరో. ఈ వీడియో ఆయన అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక ఇదే తన బెస్ట్ బర్త్‌డే గిఫ్ట్ అని దుల్కర్ ట్విటర్లో పేర్కొన్నాడు. Thank you for the lovely surprise you guys. Here’s a poster of my next Telugu project with Hanu Raghavapudi. It has been a great learning experience shooting for this one across India and can’t wait for you guys to watch it on screen. @SwapnaDuttCh @SwapnaCinema @hanurpudi pic.twitter.com/Ht272CUMZc — dulquer salmaan (@dulQuer) July 28, 2021 -
మలయాళంలో తొలిసారిగా...
‘మహానటి’తో తెలుగు ప్రేక్షకులను మెప్పించారు మలయాళ యంగ్ హీరో దుల్కర్ సల్మాన్. ఇప్పుడు మరో స్ట్రయిట్ తెలుగు సినిమా చేయనున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ సల్మాన్ హీరోగా ఓ సినిమా తెరకెక్కనున్న విషయం తెలిసిందే. మిలటరీ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ఈ సినిమాలో దుల్కర్ మిలటరీ వ్యక్తిగా కనిపిస్తారు. స్వప్న సినిమాస్ బ్యానర్‌పై ఈ సినిమాను స్వప్నా దత్ నిర్మించనున్నారు. ఇందులో దుల్కర్‌కు జోడీగా పూజా హెగ్డే నటించనున్నారని సమాచారం. ఈ సినిమాను తెలుగు, మలయాళంలో తెరకెక్కించనున్నారు. ఒకవేళ పూజా హెగ్డే ఈ సినిమా కమిట్ అయితే ఆమె మాలీవుడ్ ప్రేక్షకులను పలకరించనున్న తొలి చిత్రం ఇదే అవుతుంది. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభం కానున్న ఈ సినిమాకు విశాల్ చంద్రశేఖర్ సంగీత దర్శకుడు. -
లెఫ్టినెంట్ రామ్‌గా వస్తోన్న దుల్కర్
‘మహానటి’ సినిమాతో తెలుగులో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు మలయాళ నటుడు దుల్కర్ సల్మాన్. ఈ చిత్రంలో దుల్కర్ జెమినీ గణేషన్ పాత్రలో నటించి.. ప్రేక్షకుల అభిమానం సంపాదించుకున్నారు. ఈ క్రమంలో మరో సినిమాతో తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు దుల్కర్ సల్మాన్. ‘పడి పడి లేచే మనసు’ సినిమా దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో దుల్కర్ ఓ చిత్రంలో నటించనున్నారు. ఈ రోజు దుల్కర్ సల్మాన్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాకు సంబంధించిన ప్రీ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ సినిమాలో దుల్కర్ లెఫ్టినెంట్ రామ్ పాత్రలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి ‘యుద్ధంతో రాసిన ప్రేమ కథ’ అనే క్యాప్షన్ ఇచ్చారు. (ప్రేక్షకుల్ని ఆశ్చర్యపరచడానికి ఇష్టపడతాను) ‘మహానటి’ సినిమాను నిర్మించిన స్వప్న సినిమా, వైజయంతి మూవీస్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నది. ఈ సినిమాను తెలుగుతో పాటు మలయాళ, తమిళ భాషల్లో కూడా విడుదల చేయనున్నారు. Wishing our 'Lieutenant' RAM, @dulQuer a very Happy Birthday :)#declassifiessoon A film by @hanurpudi Music by @Composer_Vishal Produced by @SwapnaCinema Presented by @VyjayanthiFilms pic.twitter.com/tpL4nuNrun — Swapna Cinema (@SwapnaCinema) July 28, 2020 -
డైరీ ఫుల్
హీరోయిన్ పూజా హెగ్డే ఫుల్‌ఫామ్‌లో ఉన్నారు. టాలీవుడ్లో ప్రభాస్‌తో ఓ సినిమా (ఓ మై డియర్), అఖిల్‌తో ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ సినిమాలో పూజ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ బ్యూటీ మరో మంచి ఆఫర్ కొట్టేశారని సమాచారం. దుల్కర్ సల్మాన్ హీరోగా నటించబోతున్న సినిమాలో హీరోయిన్గా నటించనున్నారట పూజా హెగ్డే. ఆల్రెడీ ఆన్లైన్ ద్వారా కథ కూడా విన్న పూజ హీరోయిన్గా నటించేందుకు ఓకే అన్నారట. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ ఫేమ్ హను రాఘవపూడి తెరకెక్కించనున్న సినిమాలోనే దుల్కర్, పూజ జంటగా నటించనున్నారని సమాచారం. స్వప్నా దత్, ప్రియాంకా దత్ ఈ సినిమాను నిర్మించబోతున్నారనే టాక్ వినిపిస్తోంది. మరోవైపు బాలీవుడ్లో సల్మాన్ ఖాన్ హీరోగా నటించనున్న ‘కబీ ఈద్ కబీ దీవాలి’ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా కన్ఫార్మ్ అయిన సంగతి తెలిసిందే. అక్షయ్ కుమార్ నటించనున్న ‘బచ్చన్ పాండే’ చిత్రంలోనూ పూజయే హీరోయిన్ అట. సో.. పూజ డైరీ ప్రస్తుతానికి ఫుల్ అన్నమాట. -
దర్శకుడు దొరికాడోచ్
ధనుష్ హీరోగా తెరకెక్కిన ‘అసురన్’ చిత్రం తమిళంలో మంచి విజయం సొంతం చేసుకుంది. ఈ సినిమా తెలుగు రీమేక్‌లో వెంకటేశ్ నటించనున్నారు. తమిళ చిత్రాన్ని నిర్మించిన కలైపులి యస్. థానుతో కలసి డి. సురేశ్ బాబు తెలుగులో ఈ చిత్రం నిర్మించనున్నారు. ఇప్పటి వరకూ ఈ చిత్ర దర్శకుడు ఎవరనే విషయం ప్రకటించలేదు చిత్రబృందం. తాజాగా ఈ చిత్రానికి దర్శకుడు దొరికాడని తెలిసింది. ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ, పడి పడి లేచె మనసు’ సినిమాలను తెరకెక్కించిన హను రాఘవపూడి ‘అసురన్’ రీమేక్‌ను డైరెక్ట్ చేయనున్నారని తెలిసింది. ఈ చిత్రంలో శ్రియ హీరోయిన్గా నటించనున్నారట. జనవరి నుంచి రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానున్న ఈ సినిమాలో వెంకటేశ్ రైతు పాత్రలో కనిపించనున్నారు. -
మరో సినిమా లైన్లో పెట్టిన విజయ్
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే డియర్ కామ్రేడ్ షూటింగ్ పూర్తి చేసిన విజయ్, ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్టైనర్లో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో హీరో చిత్రాన్ని ఇటీవల ప్రారంభించాడు. తాజాగా ఈ యంగ్ హీరో మరో సినిమాను లైన్లో పెట్టినట్టుగా తెలుస్తోంది. అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన హను రాఘవపూడి తరువాత కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాతో మరో విజయాన్ని అందుకున్నాడు. తరువాత వరుసగా లై, పడి పడి లేచే మనసు సినిమాలతో ఫెయిల్ అయిన హను ఇప్పుడు విజయ్ హీరోగా ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
సహజీవనం చేయాలనుకోవడం లేదు!
‘‘స్టార్ హీరోయిన్.. స్టార్డమ్..నటనలో హీరోలని డామినేట్ చేస్తున్నారు...వంటి వాటి గురించి నేను ఆలోచించను. ప్రేక్షకులకు అలా అనిపిస్తుందేమో? నా వరకూ నా పాత్రకి 100శాతం న్యాయం చేయాలని మాత్రమే ఆలోచిస్తా’’ అని సాయిపల్లవి అన్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘పడి పడి లేచె మనసు’. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై చెరుకూరి సుధాకర్ నిర్మించిన ఈ సినిమా శుక్రవారం విడుదలైంది. ఈ సందర్భంగా సాయిపల్లవి పంచుకున్న విశేషాలు... ► ‘ప్రేమమ్, ఫిదా, పడిపడి లేచె మనసు’ చిత్రాల్లో ప్రేమించడం.. విడిపోవడం.. మళ్లీ కలవడం వంటి పాత్రలు చేశారని అడుగుతున్నారు. ఆ విషయం నేను ఆలోచించనే లేదు. నా తర్వాతి సినిమాలో అలాంటి పాత్ర లేకుండా చూసుకుంటా (నవ్వుతూ). అయితే ప్రతి స్టోరీలో ఎంతో కొంత ప్రేమ కథ ఉంటుంది. అది కామన్ కదా. ► నేను నటించిన ‘పడి పడి లేచె మనసు, మారి 2’ సినిమాలు ఒకే రోజు విడుదలవడం సంతోషంగా ఉంది. ‘పడి పడి లేచె మనసు’ లో డాక్టర్‌గా నా పాత్ర కూల్‌గా ఉంటుంది. ‘మారి 2’లో ఆటో డ్రైవర్‌గా రఫ్‌గా, మాస్‌గా ఉంటుంది. ► ‘పడి పడి లేచె మనసు’ సినిమా షూటింగ్ దాదాపు 80 శాతం కోల్‌కత్తాలో జరిగింది. నేను కోల్‌కత్తాకి వెళ్లడం అదే ఫస్ట్ టైమ్. హనుగారు ఈ కథ చెప్పినప్పుడు హార్ట్‌ఫుల్‌గా ఫీలయ్యా. సినిమాను తెరపై చూసుకున్నప్పుడు కూడా నాకు అదే ఫీలింగ్ కలిగింది. ► ఈ సినిమాలో నాకు, శర్వాకి మంచి కెమిస్ట్రీ కుదిరిందని అంటున్నారు. ఆ పాత్రల్లో మేము కాదు.. సూర్య, వైశాలి మాత్రమే కనిపిస్తారు. శర్వా మంచి సహనటుడు. చక్కగా మాట్లాడతాడు. మా మధ్య మంచి స్నేహం కుదిరింది. ఎటువంటి ఈగోలు మాకు లేవు. అందుకే ఆ సన్నివేశాలు అంత బాగా వచ్చాయి. హనుగారు చాలా హార్డ్ వర్కర్. ఆయన ఆలోచనలన్నీ ఎప్పుడూ సినిమా గురించే ఉంటాయి. ► వరుసగా సినిమాలు చేయాలనే ఆలోచన నాకు లేదు. ఓ 20ఏళ్ల తర్వాత కూడా ‘ఆ అమ్మాయి బాగా నటించింది’ అంటే చాలు. డాక్టర్ వృత్తిని వదిలేసి ఇండస్ట్రీకి వచ్చా. నా సినిమాలు, నా పాత్రలు చూసినప్పుడు నా తల్లిదండ్రులు సంతోష పడటంతో పాటు గర్వపడాలి. అందుకే మంచి పాత్రలు ఎంచుకుంటున్నా. చిట్టి పొట్టి డ్రెస్సులు నాకు అంత కంఫర్ట్‌గా ఉండవు. అందుకే వాటికి దూరం. ‘ఫిదా’ సినిమాలో ఓ సన్నివేశంలో అవసరం కాబట్టి వేసుకోక తప్పలేదు (నవ్వుతూ). ► సినిమాల్లో నా పాత్రలో లవ్.. బ్రేకప్స్ ఉన్నాయి. కానీ వ్యక్తిగతంగా అయితే ప్రస్తుతానికి లేవు. స్కూల్ డేస్‌లో అబ్బాయిలు నావైపు చూసేవారు కానీ ధైర్యంగా మాట్లాడేవారు కాదు. నా మొహంపైన అప్పుడు కూడా మొటిమలు ఉండేవి. అయినా అబ్బాయిలు చూస్తున్నారంటే నాకు సంతోషంగా అనిపించేది. కాలేజ్ డేస్‌లో ప్రేమలో పడే టైమ్‌లేదు. పుస్తకాలతో ప్రేమలో పడిపోయా. ఇప్పుడు నా ప్రేమ సినిమాలతోనే. అవును.. సినిమాలతో ప్రేమలో ఉన్నా (నవ్వుతూ). నిజ జీవితంలో సహజీవనం చేయాలనుకోవడం లేదు. పెళ్లి చేసుకుంటా. సహజీవనం గురించి నేను తప్పుగా మాట్లాడటంలేదు. ఎవరిష్టం వారిది. ► నేను బయట ఎక్కడైనా కనిపిస్తే సాయిపల్లవి అనడం లేదు.. భానుమతి అంటున్నారు. అంతలా ప్రేక్షకులు నన్ను ప్రేమిస్తున్నారు. ఇదొక బాధ్యతగా భావించి, ప్రాధాన్యం ఉన్న, వైవిధ్యమైన పాత్రలు ఎంచుకుంటున్నా. నేను ఎక్కువగా మాట్లాడలేను. ఇప్పుడిలా మాట్లాడుతున్నానంటే కారణం డైరెక్టర్ శేఖర్ కమ్ములగారు, భానుమతి పాత్రే కారణం. నేను టైమ్‌కి షూటింగ్ రాననడం కరెక్ట్ కాదు. టైమ్‌కి సెట్లో ఉంటా. హిట్టు, ఫ్లాపు అనేది పెద్దగా మైండ్‌కి ఎక్కించుకోను. మన ప్రయత్న లోపం ఉండకూడదనుకుంటా. ఆ తర్వాత దేవుడి, ప్రేక్షకుల ఆశీర్వాదాలు ఉండాలి. రిజల్ట్ ఏదైనా మన మంచికే అనుకుంటాను. ► నేనెప్పుడూ హీరోయిన్గా ఫీలవ్వను. ఓ సాధారణ అమ్మాయిలానే ఉంటా. ఇంట్లోవాళ్లు, నా ఫ్రెండ్స్, బంధువులు కూడా నన్ను హీరోయిన్గా ట్రీట్ చేయరు. ఇంట్లో నా పనులు నేనే చేసుకుంటా. కమర్షియల్ యాడ్స్ చేయడం ఇష్టం ఉండదు. చారిటీ కార్యక్రమం అయితే డబ్బులు తీసుకోకుండా చేస్తా. ► తెలుగులో వేణు ఊడుగుల దర్శకత్వంలో ఓ సినిమాకి చర్చలు జరిగాయి. ఇంకా సైన్ చేయలేదు. ఇందులో అందరూ అనుకుంటున్నట్లు నాది నక్సలైట్ పాత్ర అయితే కాదు. ప్రస్తుతం మలయాళంలో ఓ సినిమా చేస్తున్నా. తమిళంలో సూర్యతో ‘ఎన్జీకే’ మూవీలో నటిస్తున్నా. -
‘పడి పడి లేచె మనసు’ మూవీ రివ్యూ
టైటిల్ : పడి పడి లేచె మనసు జానర్ : రొమాంటిక్ ఎంటర్టైనర్ తారాగణం : శర్వానంద్, సాయి పల్లవి, మురళీశర్మ, సుహాసిని సంగీతం : విశాల్ చంద్రశేఖర్ దర్శకత్వం : హను రాఘవపూడి నిర్మాత : ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరుకూరి టాలీవుడ్లో మంచి ఫాంలో ఉన్న హీరో శర్వానంద్, అందమైన ప్రేమ కథల దర్శకుడు హను రాఘవపూడి కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా పడి పడి లేచె మనసు. టైటిల్ ఎనౌన్స్మెంట్ దగ్గర నుంచే మంచి హైప్ క్రియేట్ చేసిన ఈ సినిమా టీజర్, ట్రైలర్, సాంగ్స్‌తో ఆడియన్స్‌ను మరింతగా ఆకట్టుకుంది. మరి ఆ అంచనాలను ఈ సినిమా అందుకుందా. శర్వానంద్, సాయి పల్లవిల జంట ఏ మేరకు ఆకట్టుకుంది.? కథ; సినిమా కథ నేపాల్‌లో ప్రారంభమవుతుంది. తను ప్రేమించిన అమ్మాయికి దూరమైన సూర్య(శర్వానంద్) తన ప్రేమకథను చెప్పటం ప్రారంభిస్తాడు. కొల్కతాలో వైశాలి (సాయి పల్లవి) అనే మెడికల్ స్టూడెంట్‌తో ప్రేమలో పడ్డ సూర్య, ఆమె వెంటపడుతుంటాడు. వైశాలి కూడా సూర్యని ఇష్టపడుతుంది. కానీ తన గతం కారణంగా కలిసుందాం గాని పెళ్లి వద్దని సూర్య అంటాడు. దీంతో ఇద్దరు విడిపోతారు సూర్య, వైశాలీలు తిరిగి ఎలా కలిశారు. ఈ ప్రయాణంలో వాళ్లకు ఎదురైన ఇబ్బందులు ఏంటీ అన్నదే మిగతా కథ. నటీనటులు; శర్వానంద్ మరోసారి తనదైన మెచ్యూర్డ్ పర్ఫామెన్స్తో ఆకట్టుకున్నాడు. రొమాంటిక్, లవ్ సీన్స్‌తో పాటు కామెడీ టైమింగ్‌తోనూ ఆకట్టుకున్నాడు. సాయి పల్లవి కూడా తన మీద ఉన్న అంచనాలకు తగ్గ స్థాయిలో పర్ఫామ్ చేసింది. వైశాలి పాత్రలో జీవించింది. శర్వా, సాయి పల్లవిల నటన సినిమా స్థాయిని పెంచింది. ఇద్దరు నేచురల్ యాక్టింగ్‌తో ఆడియన్స్‌ను కట్టిపడేశారు. సినిమా అంతా ఈ రెండు పాత్రల చుట్టూనే తిరగటంతో ఇతర పాత్రల గురించి పెద్దగా చెప్పుకోవడానికి ఏం లేదు. ఉన్నంతలో ప్రియదర్శి, సునీల్, వెన్నెల కిశోర్‌లు నవ్వించే ప్రయత్నం చేశారు. మురళి శర్మ, ప్రియా రామన్ తమ పాత్రల పరిది మేరకు ఆకట్టుకున్నారు. విశ్లేషణ; హను రాఘవపూడి మరోసారి తన మార్క్ పొయటిక్ ప్రేమకథతో ఆకట్టుకునే ప్రయత్నం చేశాడు. కథా కథనాలు కాస్త నెమ్మదిగా సాగిన విజువల్స్, హీరో హీరోయిన్ల కెమిస్ట్రీ, కామెడీ, సాంగ్స్ ఇలా అన్ని తొలి భాగాన్ని ఇంట్రస్టింగ్‌గా మార్చేశాయి. కానీ ఇంటర్వెల్ సీన్ విషయంలో కాస్త తడబడ్డట్టుగా అనిపిస్తుంది. హీరో హీరోయిన్ల విడిపోవడానికి కారణం కన్విన్సింగ్‌గా అనిపించదు. తొలి భాగాన్ని ఎంగేజింగ్‌గా తెరకెక్కించి ద్వితీయార్థంలో మాత్రం దర్శకుడు ఇబ్బంది పడ్డాడు. సినిమా రొటీన్ సీన్స్ తో సాగటంతో కాస్త బోరింగ్‌గా అనిపిస్తుంది. అక్కడక్కడా సునీల్ కామెడీ వర్క్ అవుట్ అయినా ఫస్ట్ హాఫ్ స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు.క్లైమాక్స్ సన్నివేశాలు కూడా హడావిడిగా ముగించేసినట్టుగా అనిపిస్తుంది. విశాల్ చంద్రశేఖర్ తన సంగీతంతో మ్యాజిక్ చేశాడనే చెప్పాలి. పాటలతో పాటు నేపథ్య సంగీతం కూడా కట్టిపడేస్తుంది. సినిమాటోగ్రఫి, ఆర్ట్ సూపర్బ్ అనిపించేలా ఉన్నాయి. కొన్ని ఫ్రేమ్స్ మణిరత్నం సినిమాలను గుర్తు చేస్తాయి. ఎడిటింగ్, నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. ప్లస్ పాయింట్స్; శర్వా, సాయి పల్లవి నటన మ్యూజిక్ మైనస్ పాయింట్స్; స్లో నరేషన్ సెకండ్ హాఫ్‌లో బోరింగ్ సీన్స్ ఇంటర్వెల్ సతీష్ రెడ్డి జడ్డా, ఇంటర్నెట్ డెస్క్. -
అదొక్కటే నా బలం కాదు
‘‘జీవితంలో మనకు దగ్గరగా ఉన్న వాటిని మనం అంతగా పట్టించుకోం. మన దగ్గర లేని దానిపైనే మనకి ఎప్పుడూ ఆసక్తి, ఆలోచన ఉంటాయి. అలా నా జీవితంలో ప్రేమకథలు లేవు. కాకపోతే ఇలా ఉంటే బాగుంటుంది అనే ఆలోచనలు ఉన్నాయి. వాటినే కథలుగా రాస్తున్నా’’ అని హను రాఘవపూడి అన్నారు. ఆయన దర్శకత్వంలో శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘పడి పడి లేచె మనసు’. చెరుకూరి సుధాకర్ నిర్మించిన ఈ సినిమా ఈరోజు విడుదలవుతున్న సందర్భంగా హను రాఘవపూడి చెప్పిన విశేషాలు. ► ‘పడి పడి లేచె మనసు’ ఒక ప్రేమ కథ. ఇలా చెబితే రొటీన్‌గానే ఉంటుంది. కానీ, కొత్త ప్రేమ కథ అంటూ ఏదీ లేదని నమ్ముతాను. కాకపోతే ఒక్కో దర్శకుడి పాయింటాఫ్ వ్యూ వేరుగా ఉంటుంది. వారు పెరిగిన వాతావరణం కావొచ్చు, వారు చూసిన జీవితం కావొచ్చు.. వాటిని బట్టే ప్రేమకథలని తెరకెక్కించే విధానం వేర్వేరుగా ఉంటుంది. నా విజన్‌కి తగ్గట్లు ఈ ప్రేమకథని తీశా. ► నా బలం ప్రేమకథలు అని బయట టాక్ ఉంది. అయితే మన బలం మనకెప్పుడూ తెలియదు. ఎదుటివాళ్లు చెబితేనే తెలుస్తుంది. నా సినిమాలు చూశాక నా బలం లవ్ స్టోరీస్ అని వాళ్లకి అనిపించి ఉండొచ్చు. అయితే ప్రేమకథలు మాత్రమే నా బలం కాదు. మిగతా వాటిలో కూడా నేను బలంగానే ఉన్నాననుకుంటున్నాను. ► శర్వానంద్ నాకెప్పటి నుంచో తెలుసు. ఒకసారి నా కథను రామ్‌చరణ్‌కి కూడా చెప్పించాడు. ఎప్పటి నుంచో శర్వ, నేను సినిమా చేయాలని అనుకుంటున్నాం. తనకోసం రెండు, మూడు లైన్స్ చెప్పాను. తను మాత్రం లవ్ స్టోరీ చేద్దామన్నాడు. అలా శర్వానంద్‌ని దృష్టిలో పెట్టుకునే ఈ లవ్ స్టోరీ రాశా. దర్శకులు మణిరత్నం, సుకుమార్‌గార్లతో నన్ను పోల్చడం ప్రశంసగా భావిస్తా. సంజయ్‌లీలా భన్సాలీ సినిమాలో షాట్స్ అన్నీ రిచ్‌గా ఉంటాయి. నాకు మణిరత్నం, భన్సాలీ, రాజు హిరాణీ, రాజమౌళిగార్ల సినిమాలంటే చాలా ఇష్టం. ► ఒకసారి వెంకట్ సిద్ధారెడ్డి, నేను కూర్చుని ‘పదహారేళ్ల వయసు.. పడి పడి లేచె మనసు’ పాట వింటున్నాం. ఈ పదాల్లోనే ఏదో కథ ఉందనిపించింది. ‘పడి పడి లేచె మనసు’ టైటిల్ అనుకున్నాం. దాని నుంచి పుట్టిన కథే ఇది. కథ రాస్తున్నప్పుడే సాయి పల్లవిని హీరోయిన్గా అనుకున్నాను. శర్వా, సాయిపల్లవి పోటీపడి నటించారు. తెరపై నటీనటులు కాదు.. ప్రేక్షకులకు వారి పాత్రలే కనిపిస్తాయి. ► ఈ సినిమా బడ్జెట్ అనుకున్న దాని కంటే 15 శాతం ఎక్కువ అయింది. కోల్‌కత్తాలో ఎక్కువ లైవ్ లొకేషన్స్‌లో షూట్ చెయ్యటం వల్లే ఆలస్యమైంది. కానీ, సుధాకర్‌గారు ఎక్కడా బడ్జెట్‌కి వెనకాడలేదు. నేను కోల్‌కత్తాలో ఉన్నప్పుడు అక్కడ ఓ సినిమా తీయాలనుకున్నా. ఆ కోరిక ఈ సినిమాతో తీరింది. ► నా వద్ద ఔట్ ఆఫ్ ద బాక్స్ కథలూ ఉన్నాయి. వాటిని తీయడానికి సమయం, సందర్భం కావాలి. నాపై ప్రేక్షకుల్లో నమ్మకం వచ్చినప్పుడే వాటిని తీస్తా. ‘అందాల రాక్షసి’ సినిమా ఫస్ట్ డే ఫ్లాప్ అన్నారు. ఆ తర్వాత ఆ సినిమా నాకు తెచ్చిన గుర్తింపు వేరు. ‘లై’ని అనుకున్నట్టు తీయలేకపో యా. అయితే ఆ సినిమాకి రైటర్‌గా సక్సెస్ అయ్యాను. టేకింగ్‌లోనే పొరపాటు జరిగింది. ► నాని కోసం మిలటరీ బ్యాక్‌డ్రాప్‌లో ఓ కథ రెడీ చేశా. ప్రాజెక్ట్ కూడా ఓకే అయింది. అయితే నాని గెటప్‌ని టోటల్‌గా మార్చాలి. మా ఇద్దరి వీలు చూసుకొని ఆ సినిమా చెయ్యాలి. ‘పడి పడి లేచె మనసు’ తర్వాత మైత్రి మూవీస్‌లో సినిమా ఉంటుంది. హీరో హీరోయిన్లు ఎవరని ఇంకా అనుకోలేదు. వచ్చే ఏడాది వేసవిలో ఆ సినిమా ప్రారంభమవుతుంది. -
ఎవరూ ఎవరికీ పోటీ కాదు
‘‘కేవలం డబ్బు సంపాదించాలనే ఆశ ఉంటే ఓ సినిమా తర్వాత మరో సినిమా వెంటవెంటనే చేసేవాణ్ణి. కానీ, నాకు ఆ ఆశ లేదు. నేను సినిమాని, కథల్ని, డైరెక్టర్స్‌ని నమ్ముతాను. తోటి హీరోలు వరుసగా సినిమాలు చేస్తున్నారు.. నేను చేయకపోతే ఎలా? అనే అభద్రతాభావం నాకు లేదు. బౌండెడ్ స్క్రిప్ట్ ఉంటేనే నేను షూటింగ్‌కి వెళతాను. అందుకే సినిమా సినిమాకీ కొంత గ్యాప్ వస్తుంటుంది’’ అని శర్వానంద్ అన్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘పడి పడి లేచె మనసు’. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై చెరుకూరి సుధాకర్ నిర్మించిన ఈ సినిమా రేపు విడుదలవుతోంది. ఈ సందర్భంగా శర్వానంద్ చెప్పిన విశేషాలు. ► హను 15 ఏళ్లుగా మంచి ఫ్రెండ్. ఎప్పటినుంచో ఓ సినిమా చేయమని అడుగుతున్నా. సుధాకర్‌గారు, నేను సినిమా చేద్దామనుకున్నప్పుడు హనుని అనుకున్నాం. తను మూడు కథలు చెబితే ‘పడి పడి లేచె మనసు’ కథని ఓకే చేశాం. ఈ చిత్రానికి ముందు హను చేసిన ‘లై’ సినిమా సరిగ్గా ఆడలేదు. కానీ, తను ఓ మంచి టెక్నీషియన్. అందరూ జూనియర్ సుకుమార్, తెలుగు మణిరత్నం అని అంటుంటారు. హనూని ఎవరితోనూ పోల్చలేం. తనపై మణిరత్నం ఇన్స్పిరేషన్ ఉందేమో? ► చక్కని ప్రేమకథతో తెరకెక్కిన చిత్రం ‘పడి పడి లేచె మనసు’. ఇందులో ఫుట్‌బాల్ కెప్టెన్ సూర్య పాత్రలో కనిపిస్తా. సినిమా అంతా ఫుట్‌బాల్ బ్యాక్‌డ్రాప్‌లో ఉండదు. కోల్కత్తా నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుంది. గతంలో ఈ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ‘చూడాలని వుంది, ఖుషి, లక్ష్మీ’ సినిమాలు మంచి హిట్ అయ్యాయి. ప్రేమకథలోనూ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి ఇవ్వాలనే కోల్‌కత్తాలో షూటింగ్ చేశాం. ► అందరూ కనెక్ట్ అవుతారనే ‘పడి పడి లేచె మనసు’ టైటిల్ పెట్టాం. నా సినిమా ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ లవ్‌స్టోరీ అయినా ఓల్డర్ సెక్షన్‌కి కనెక్ట్ అయ్యింది. కానీ, ఈ సినిమా మాత్రం యువతతో పాటు కుటుంబ సభ్యులకు కూడా కనెక్ట్ అవుతుంది. ఇందులో నేను సూర్య, సాయిపల్లవి వైశాలి పాత్ర చేశాం. సాయిపల్లవి వెరీ స్వీట్. ఈ సినిమాలో మా ఇద్దరి కెమిస్ట్రీ హైలైట్. ఇప్పటి వరకూ ఏ హీరోయిన్‌తోనూ ఇంత బాగా కెమిస్ట్రీ వర్కవుట్ కాలేదని అందరూ నాతో అంటున్నారు. ► డబ్బులు ఎవరైనా ఖర్చు పెడతారు. కానీ, టేస్ట్ ఉన్న నిర్మాతలు కొందరే ఉంటారు. అలాంటి వారిలో సుధాకర్‌గారు ఒకరు. కథకి అవసరం మేరకు ఖర్చు పెట్టారు. ఇలాంటి నిర్మాతలు ఇండస్ట్రీకి అవసరం. జయకృష్ణ గుమ్మడి చక్కని విజువల్స్ ఇచ్చారు. విశాల్ చంద్రశేఖర్ అద్భుతమైన పాటలిచ్చారు. ► నా కెరీర్లో ఇప్పటి వరకూ ఏదీ ప్లాన్ చేయలేదు. అన్ని జోనర్ కథలు వింటున్నా. వెంట వెంటనే ఒకే జోనర్లో సినిమాలు చేయకూడదనుకుంటున్నా. నా సినిమాలే నా మార్కెట్‌ని పెంచుతున్నాయి. అవార్డులు రావాలని సినిమా చేయను. ఓ సినిమాని నా వరకు 100 శాతం ప్రేమించి చేస్తా. తమిళం నుంచి అవకాశాలొస్తున్నాయి. కానీ ప్రస్తుతానికి తెలుగులో హ్యాపీగా ఉన్నా. ఇప్పుడు సినిమాలు నిర్మించే టైమ్ లేదు. ► బన్నీ (అల్లు అర్జున్), మేము కలిసి చిన్నప్పటి నుంచి సినిమాలు చూసేవాళ్లం.. ఫంక్షన్స్‌కి వెళ్లేవాళ్లం. నేను అడగ్గానే తను మా ఫంక్షన్‌కి వచ్చి యూనిట్‌ని ఆశీర్వదించినందుకు హ్యాపీ. మా సినిమాతో పాటు రిలీజ్ అవుతున్న తమ్ముడు వరుణ్ తేజ్ ‘అంతరిక్షం’ సినిమా కూడా బాగా ఆడాలి. ఇండస్ట్రీలో ఎవరి స్పేస్ వారికి ఉంటుంది. ఎవరూ ఎవరికీ పోటీ కాదు. అందరం బాగుంటాం. అందరి సినిమాలూ ఆడాలి. ► ‘రన్ రాజా రన్’ సినిమాతో సుజిత్ నన్ను పూర్తిగా మార్చేశారు. అప్పటి నుంచి సినిమా సినిమాకి నా లుక్, స్టైల్ మారుతోంది. ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో చేస్తున్న సినిమా 50 శాతం పూర్తయింది. 1980నాటి గ్యాంగ్‌స్టర్ నేపథ్యంలో తెరకెక్కుతోంది. ఇది ‘ప్రస్థానం’ సినిమాలా మాస్‌గా ఉంటుంది. తమిళ ‘96’ మూవీ తెలుగు రీమేక్‌పై చర్చలు జరుగుతున్నాయి. త్వరలో వివరాలు చెబుతా. ► ‘గతంలో మీరు ప్రేమలో ఉన్నానని అన్నారు. ఎవరితో?’ అనే ప్రశ్నకు– ‘‘అప్పుడు ఉన్నానని చెప్పాను. ఇప్పుడు కాదు. టైమ్ వచ్చినప్పుడు చెబుతా’ అన్నారు శర్వానంద్ (నవ్వుతూ). -
‘పడి పడి లేచే మనసు’ ట్రైలర్ లాంచ్
-
పడి పడి లేచే మనసు.. మ్యాజిక్ ఆఫ్ లవ్
విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమా పడి పడి లేచే మనసు. కోల్‌కత బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకొని రిలీజ్‌కు రెడీ అయ్యింది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్నారు. రిలీజ్ డేట్ దగ్గర పడుతుండటంతో ప్రమోషన్ కార్యక్రమాల్లో వేగం పెంచిన చిత్రయూనిట్ టైలర్‌ను రిలీజ్ చేశారు. ట్రైలర్ చూస్తే సినిమా హను రాఘవపూడి మార్క్ అందమైన ప్రేమకథగా తెరకెక్కిన్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాతో మరోసారి సాయి పల్లవి ఫిదా చేసేందుకు రెడీ అవుతోంది. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ 21న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. -
హను మార్క్ ప్రేమకథ ‘పడి పడి లేచే మనసు’
విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో చేస్తున్న సినిమా పడి పడి లేచే మనసు. కోల్‌కత బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్నారు. తాజాగా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ టీజర్ ను రిలీజ్ చేశారు. టీజర్ చూస్తే సినిమా హను రాఘవపూడి మార్క్ అందమైన ప్రేమకథగా తెరకెక్కుతున్నట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాతో మరోసారి సాయి పల్లవి ఫిదా చేసేందుకు రెడీ అవుతోంది. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ 21న రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు చిత్రయూనిట్. -
శర్వా సినిమా వాయిదా పడిందా..?
విభిన్న పాత్రలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. కొల్‌కత బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమా టైటిల్ పడి పడి లేచే మనసు. పీరియాడిక్ రొమాంటిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్నారు. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాను డిసెంబర్ నెలాఖరున రిలీజ్ చేయాలని భావించారు. అయితే తాజా సమాచారం ప్రకారం పడి పడి లేచే మనసు రిలీజ్ వాయిదా పడే అవకాశం ఉందన్న ప్రచారం జరుగుతోంది. కారణాలేంటన్నది బయటకు రాకపోయినా అనుకున్న సమయానికి సినిమా రిలీజ్ కావటం కష్టమే అన్న టాక్ వినిపిస్తోంది. ఒక వేళ వాయిదా పడితే సంక్రాంతి బరిలో రిలీజ్ చేస్తారా లేక ఇంకాస్త ఆలస్యంగా జనవరి నెలాఖరున రిలీజ్ చేసేందుకు ప్లాన్ చేస్తారా చూడాలి. -
రిలీజ్ డేట్ కన్ఫామ్ చేసిన శర్వా టీం
మహానుభావుడు సినిమాతో ఘనవిజయం సాధించిన యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో ‘పడి పడి లేచే మనసు’ నటిస్తున్న సంగతి తెలిసిందే. నితిన్ హీరోగా తెరకెక్కిన లై సినిమాతో నిరాశపరిచిన హను.. శర్వా సినిమాతో హిట్ కొట్టి తిరిగి ఫాంలోకి రావాలని భావిస్తున్నాడు. సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాలో సాయి పల్లవి హీరోయిన్గా నటిస్తున్నారు. కొల్కతా నేపథ్యంలో సాగే ఈ ప్రేమకథ షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. త్వరలో నేపాల్ లో జరగనున్న షెడ్యూల్ లో షూటింగ్ మొత్తం పూర్తవుతుందని వెల్లడించారు. ఈ సందర్భంగా చిత్రయూనిట్ రిలీజ్ డేట్‌ను ప్రకటించారు. అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి డిసెంబర్ 21న సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చేందుకు ప్లాన్ చేస్తున్నారు. విశాల్ సంగీతమందిస్తున్న ఈ సినిమాలో మురళీశర్మ కీలక పాత్రలో నటిస్తుండగా సునీల్ గెస్ట్ రోల్లో అలరించనున్నారు. -
నేపాల్‌కు శర్వానంద్ టీం
శర్వానంద్, సాయి పల్లవి హీరో హీరోయిన్లుగా నటిస్తున్న తాజా చిత్రం ‘పడి పడి లేచే మనసు’ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మేజర్ షెడ్యూల్ షూటింగ్ పూర్తి చేసుకుంది. దాదాపు 70 రోజుల పాటు కోల్‌కతాలోని వివిధ లోకేషన్లలో దాదాపు 70 రోజుల పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. తదుపరి షెడ్యూల్‌ను త్వరలో నేపాల్‌లో తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. కోల్‌కతా షెడ్యూల్ పూర్తి చేసుకున్న సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ...‘ముఖ్య తారాగణంపై కొన్ని కీలక సన్నివేశాలు కోల్‌కతా షెడ్యూల్ లో చిత్రీకరించాము. సినిమా బాగా వస్తోంది. డైరెక్టర్ హను రాఘవపూడి మంచి ప్రేమకథతో మీ ముందుకు వస్తున్నారు. శర్వానంద్, సాయి పల్లవి ఈ సినిమాలో చూడముచ్చటగా కనిపించబోతున్నారు. మురళీ శర్మ, సునీల్, వెన్నెల కిషోర్ ఈ చిత్రంలో ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. విశాల్ చంద్ర శేఖర్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు జయకృష్ణన్ సినిమాటోగ్రాఫర్ గా వర్క్ చేస్తున్నార’ని తెలిపారు. -
రెండోసారి
‘‘భూమ్మీద బతకాలంటే ఆక్సిజన్ ఉండాలి. కానీ, ఇక్కడ బతకాలంటే భయం కూడా ఉండాలి. అది మన దగ్గర కావాల్సినంత ఉంది.. రెండు నిమిషాల్లో చెప్పడానికి ఇది కథ కాదురా.. గాథ’’ డైలాగులు వినగానే టక్కున ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ సినిమా గుర్తుకొస్తోంది కదూ. నాని, మెహరీన్ జంటగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం మాంచి హిట్ అయింది. నాని–హను కాంబినేషన్లో మరో సినిమా ఫైనలైజ్ అయిందనే వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం శర్వానంద్, సాయిపల్లవి జంటగా ‘పడి పడి లేచె మనసు’ సినిమా చేస్తున్నారు హను రాఘవపూడి. ప్రస్తుతం శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో నాగార్జునతో కలిసి మల్టీస్టారర్ మూవీ చేస్తున్నారు నాని. మరోవైపు ‘బిగ్‌బాస్ 2’ కూడా హోస్ట్ చేస్తున్నారాయన. ‘పడి పడి లేచె...’ చిత్రం తర్వాత నాని సినిమాకి కొబ్బరికాయ కొడతారట హను. ‘పడి పడి...’ నిర్మాతలు ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరుకూరి ఈ సినిమాను నిర్మించనుండటం విశేషం. -
మరో ‘గాథ’కు రెడీ
నేచురల్ స్టార్ నాని హీరోగా యువ దర్శకుడు హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా కృష్ణగాడి వీర ప్రేమగాథ. ఈ సినిమా మంచి విజయం సాధించటంతో ఇదే కాంబినేషన్లో మరో సినిమా ఉంటుందని అప్పట్లోనే ప్రకటించారు. హను కూడా నాని సినిమా చేసేందుకు చాలా ప్రయత్నాలు చేశాడు. అయితే నితిన్ హీరోగా హను దర్శకత్వంలో తెరకెక్కిన లై నిరాశపరచటంతో నాని సినిమా వెనక్కి వెళ్లిపోయింది. ప్రస్తుతం హను రాఘవపూడి, శర్వానంద్ హీరోగా పడి పడి లేచే మనసు సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా పూర్తయిన వెంటనే నాని, హనుల సినిమా పట్టాలెక్కనుందని తెలుస్తోంది. పడి పడి లేచే మనసు సినిమాను నిర్మిస్తున్న శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ బ్యానర్లోనే నాని, హనుల సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నారు నిర్మాతలు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ప్రాజెక్ట్ పై త్వరలోనే క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. -
మరో యంగ్ హీరోతో సునీల్
హీరోగా మారిన తరువాత సునీల్ కెరీర్ అంత ఆశాజనకంగా లేదు. మొదట్లో ఒకటి రెండు హిట్స్ వచ్చినా తరువాత వరుస ఫెయిల్యూర్స్ ఇబ్బంది పెట్టాయి. దీంతో తిరిగి కమెడియన్‌గా టర్న్ అవ్వాలని నిర్ణయించుకున్నాడు సునీల్. అదే సమయంలో యంగ్ హీరోలతో కలిసి మల్టీ స్టారర్ సినిమాలు చేసేందుకు ఓకె చెపుతున్నాడు. ఇప్పటికే అల్లరి నరేష్ హీరోగా భీమినేని శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమాలో సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. తాజాగా మరో యంగ్ హీరోతో కలిసి నటించేందుకు అంగీకరించాడు సునీల్. హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న ‘పడి పడి లేచే మనసు’ సినిమాలో సునీల్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాతో పాటు ఎన్టీఆర్, త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా సునీల్ నటించనున్నాడు. -
వారికే అవకాశం అంటున్న యువహీరో
సిని పరిశ్రమలో విజయం సాధించిన వారికే విలువ. ఈ సూత్రం హీరోయిన్లకే కాదు దర్శకులకు వర్తిస్తుంది. ఒక్క సినిమా ఫ్లాప్ అయినా ఇక ఇండస్ట్రీలో వారిని పట్టించుకునే వారు ఉండరు. కానీ యువ హీరో శర్వానంద్ పద్దతి మాత్రం ఇందుకు భిన్నంగా ఉంది. విలక్షణమైన కథలతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న శర్వానంద్ తాజాగా ఒప్పుకున్న రెండు సినిమాల దర్శకులను చూస్తే చాలా సాహసం చేస్తున్నాడనే చెప్పవచ్చు. ప్రస్తుతం ఈ యువ హీరో ఒప్పుకున్న రెండు సినిమాల్లో ఒకటి హను రాఘవపూడి దర్శకత్వంలో పడి పడి లేచే మనసు కాగా, మరో చిత్రం సుధీర్ వర్మ దర్శకత్వంలో చేస్తున్నాడు. అయితే ఈ ఇద్దరు దర్శకుల పాత చిత్రాలు రెండు ఫ్లాప్ చిత్రాలే. నితిన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలోవచ్చిన ‘లై’, నిఖిల్ హీరోగా సుధీర్‌వర్మ దర్శకత్వంలో వచ్చిన ‘కేశవ’ రెండు చిత్రాలు బాక్సాఫీస్ వద్ద ఢీలా పడిన సంగతి తెలిసిందే. ఈ చిత్రాల తర్వాత ఈ దర్శకుల చేతిలో మరో సినిమా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో శర్వానంద్ వీరికి మరో అవకాశం ఇవ్వడమంటే సాహసం చేశాడనే చెప్పవచ్చు. అయితే శర్వానంద్‌కు వీరిద్దరు చెప్పిన కథ నచ్చడం వల్లే అవకాశం ఇచ్చాడని సన్నిహతులు తెలుపుతున్నారు. దర్శకుల గత విజయాలతో సంబంధం లేకుండా కథ నచ్చితే ఎవరికైనా అవకాశం ఇస్తానని మరోసారి నిరూపించాడు శర్వానంద్. అలానే మరో ఫ్లాప్ దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. -
‘పడి పడి లేచె మనసు’ ఫస్ట్ లుక్
సాయి పల్లవి, శర్వానంద్ జంటగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పడి పడి లేచే మనసు’. హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ మూవీ చిత్రీకరణ జరుగుతోంది. ‘అందాల రాక్షసి’ లాంటి మంచి ఫీల్ గుడ్ లవ్‌స్టోరిని తెరకెక్కించిన హను... ఈ సినిమాను కూడా అదే జానర్లో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. ఫిదాతో స్టార్డమ్ సొంతం చేసుకున్న సాయి పల్లవి... ఆ సినిమాతో క్రేజీ హీరోయిన్గా మారింది. నేడు సాయి పల్లవి పుట్టినరోజు కానుకగా పడి పడి లేచె మనసు లుక్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. పలువురు సెలబ్రెటీలు సోషల్‌మీడియా ద్వారా సాయిపల్లవికి విషెస్ తెలుపుతున్నారు. ‘పడి పడి లేచే మనసు’ మూవికి విశాల్ చంద్రశేఖర్ సంగీతమందించగా, ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు. -
శర్వా సినిమా కోసం భారీ సెట్
వరుస విజయాలతో మంచి ఫాంలో ఉన్న యంగ్ హీరో శర్వానంద్ ప్రస్తుతం సుధీర్ వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శర్వానంద్ డాన్‌గా కనిపించనున్నాడట. 1980ల కాలంలో జరిగే కథ కావటంతో అప్పటి పరిస్థితులకు తగ్గట్టుగా చూపించేందుకు చిత్రయూనిట్ శ్రమిస్తున్నారు. తాజాగా కీలక సన్నివేశాల చిత్రీకరణ కోసం ఓ భారీ సెట్‌ను నిర్మించారు. అప్పటి వాతావరణం ప్రతిబింభించేలా ఓ పోర్ట్ సెట్‌ను నిర్మించారు. ప్రొడక్షన్ డిజైనర్ రవీందర్ ఆధ్వర్యంలో రూపొందించిన ఈ సెట్ సినిమాకే హైలెట్ గా నిలుస్తుందన్న టాక్ వినిపిస్తోంది. శర్వానంద్ సరసన హలో ఫేం కల్యాణీ ప్రియదర్శన్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వా హీరోగా తెరకెక్కిన పడి పడి లేచే మనసు త్వరలో రిలీజ్‌కు రెడీ అవుతోంది. -
ఏప్రిల్ 6 నుంచి శర్వా కొత్త సినిమా
యంగ్ హీరో శర్వానంద్ వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. విభిన్న కథలతో ఆకట్టుకుంటున్న శర్వా, అదే సమయంలో ఫ్యామిలీ డ్రామా, కమర్షియల్ ఎంటర్టైనర్లు కూడా చేస్తున్నాడు. ఇటీవల మహానుభావుడుగా ఘనవిజయం అందుకున్న ఈ యంగ్ హీరో ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో పడి పడి లేచే మనసు సినిమా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా షూటింగ్ దాదాపుగా పూర్తి కావచ్చింది. దీంతో ఈ నెల 6 నుంచి కొత్త సినిమా ప్రారంభించనున్నాడు శర్వానంద్. యువ దర్శకుడు సుధీర్ వర్మ దర్శకత్వంలో తన తదుపరి చిత్రాన్ని చేయన్నాడు. స్వామి రారా, కేశల లాంటి విభిన్న చిత్రాలను తెరకెక్కించిన సుధీర్.. శర్వాను మాఫియా డాన్ పాత్రలో చూపించనున్నాడు. -
బర్త్ డేకి ఫస్ట్ లుక్
సాక్షి, సినిమా : టాలీవుడ్లో సక్సెస్ రేటుతో దూసుకుపోతున్న హీరోల్లో శర్వానంద్ కూడా ఉన్నాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో కృష్ణగాడి వీర ప్రేమగాథ ఫేమ్ హను రాఘవపూడి దర్శకత్వంలో ఓ చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్ర ఫస్ట్ లుక్‌ను శర్వా బర్త్ డే సందర్భంగా రిలీజ్ చేయబోతున్నారు. రేపు అంటే మార్చి6 న శర్వానంద్ బర్త్ డేకి ఫస్ట్ లుక్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్లు ఓ పోస్టర్‌ను వదిలాడు. వర్షంలో హీరోయిన్ వెళ్తుంటే.. ఆమె వెనకాలే పరిగెత్తే హీరోను చూపించారు. రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో క్రేజీ బ్యూటీ సాయి పల్లవి శర్వాకి జోడీగా కనిపించబోతోంది. విశాల్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రాన్ని సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లిలు నిర్మిస్తున్నారు. శర్వా ఈ మూవీలో ఆర్మీ ఆఫీసర్ పాత్రలో కనిపించబోతున్నాడన్న టాక్ వినిపిస్తుండగా.. ‘పడి పడి లేచే మనసు’ టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ఆ మధ్య వార్త వినిపించింది. -
నో వార్.. ఓన్లీ లవ్
... అంటున్నారు హీరో శర్వానంద్. హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ సైనికుడి పాత్రలో నటించనున్నారన్న వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదట. బోర్డర్లో యుద్ధం చేసే సైనికుడి పాత్రలో కాదు.. ప్రేమ కోసం పోరాడే కుర్రాడి క్యారెక్టర్లో శర్వానంద్ నటిస్తున్నారు. శర్వా లుక్‌ను కొత్తగా డిజైన్ చేశారట హను రాఘవపూడి. ఈ లుక్ కోసం బరువులో ఢిపరెన్స్ చూపించేందు శర్వా కసరత్తులు చేశారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ కోల్‌కతాలో స్టారై్టంది. శర్వానంద్, సాయి పల్లవిలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి ‘పడి పడి లేచే మనసు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని చిత్రబృందం ఆలోచిస్తున్నారట. ఈ సినిమాకు సంగీతం: విశాల్ శేఖర్, కెమెరా: జయకృష్ణ. -
పడి పడి లేచే వయసు
‘పదహారేళ్ల వయసు.. పడి పడి లేచే మనసు’ అంటూ ‘లంకేశ్వరుడు’ సినిమాలో చిరంజీవి–రాధ చేసిన సందడి అంత సులువుగా మరచిపోలేరు. అది సరే.. ఇప్పుడు ఆ ప్రస్తావన ఎందుకు? అనేగా మీ డౌట్. దానికి కారణం లేకపోలేదు.. శర్వానంద్ హీరోగా తెరకెక్కనున్న ఓ సినిమాకి ‘పడి పడి లేచే వయసు’ అనే టైటిల్ పెట్టనున్నారట. అదీ సంగతి.. ‘మహానుభావుడు’ వంటి హిట్ తర్వాత సుధీర్‌వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న శర్వానంద్ తర్వాతి సినిమానూ లైన్లో పెట్టేశారు. హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కనున్న ఈ చిత్రానికి ‘పడి పడి లేచే వయసు’ అనే టైటిల్ ఫిక్స్ చేయనున్నారని ఫిల్మ్‌నగర్ టాక్. రొమాంటిక్ ఎంటర్టైనర్గా తెరకెక్కనున్న ఈ సినిమాలో శర్వాకి జోడీగా సాయిపల్లవిని ఖరారు చేశారంటూ వార్తలు హల్చల్ చేస్తున్నాయి. -
ఎస్... జోడీ కుదిరింది
సక్సెస్ఫుల్ స్టార్ శర్వానంద్, సక్సెస్ఫుల్ హీరోయిన్ సాయి పల్లవి..ఈ ఎస్ అండ్ ఎస్ జోడీ కుదిరింది. హను రాఘవపూడి ఈ చిత్రానికి దర్శకుడు. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరుకూరి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. నిర్మాతలు మాట్లాడుతూ – ‘‘శర్వానంద్, సాయి పల్లవి, హను రాఘవపూడి వంటి ముగ్గురు ప్రతిభావంతులతో కలిసి సినిమా చేయడం ఆనందంగా ఉంది. హను ఓ హిలేరియస్ రొమాంటిక్ ఎంటర్టైనింగ్ స్టోరీ రెడీ చేశారు. ఈ అందమైన ప్రేమకథలో శర్వానంద్, సాయి పల్లవిల జంట చూడటానికి కన్నుల విందుగా ఉంటుంది. యూత్, ఫ్యామిలీ ఆడియన్స్ అందరికీ నచ్చేలా ఈ సినిమా ఉంటుంది. రెగ్యులర్ షూటింగ్‌ను జనవరి మూడో వారంలో మొదలుపెడతాం. వచ్చే ఏడాది ద్వితీయార్థంలో విడుదల చేస్తాం’’ అని అన్నారు. -
సాయి పల్లవితో ఫెస్టివల్ స్టార్..
టాలీవుడ్లో మరో క్రేజీ ప్రాజెక్టు త్వరలో పట్టాలెక్కనుంది. వరుస హిట్లతో దూసుకుపోతున్న యువ నటీనటులు ఇందుకోసం సన్నద్ధం అవుతున్నారు. ఫిదా బ్లాక్ బస్టర్‌తో టాలీవుడ్లో వరుస అవకాశాలు అందుకున్న బ్యూటీ సాయి పల్లవి. తాజాగా నేచురల్ స్టార్ నాని సరసన నటించిన ఎంసీఏతో మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. ఇక ఈఏడాది శతమానం భవతి సినిమాతో మెదలు పెట్టి మహానుభావుడు వంటి హిట్లతో 2017ను యువ హీరో శర్వానంద్ విజయవంతంగా పూర్తి చేసుకున్నాడు. రెండు సినిమాలు పండుగ సీజన్లో పెద్ద సినిమాలకు పోటీగా వచ్చి మంచి వసూల్లనే సాధించాయి. వరుస విజయాలతో దూసుకుపోతున్న శర్వానంద్, సాయి పల్లవిలు క్రేజీ కాంబినేషన్లో కలిసి నటించనున్నారని సమాచారం. ప్రేమకధా చిత్రాలు తీయడంలో పేరుపొందిన హను రాగపూడి కొత్త చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. ‘మహానుభావుడు’ సినిమా తరువాత శర్వానంద్ నటించబోతున్న సినిమాపై సినీ అభిమానుల్లో ఆసక్తి నెలకొని ఉంది. అందాల రాక్షసి, కృష్ణ గాడి వీర ప్రేమగాధ వంటి ప్రేమకథా చిత్రాలతో అలరించిన రాగపూడి ఈ జోడితో రొమాంటిక్ సీన్స్ ని డైరెక్టర్ ఏ విధంగా చిత్రీకరిస్తాడో చూడాలి.ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కొత్త సంవత్సరంలో మొదలుకానుంది. -
‘దండుపాళ్యం’ దర్శకుడితో శర్వానంద్
విభిన్న చిత్రాలతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ హీరో శర్వానంద్ మరో ప్రయోగానికి రెడీ అవుతున్నాడు. సౌత్ లో సంచలనం సృష్టించిన దండుపాళ్యం సినిమాను తెరకెక్కించిన దర్శకుడు శ్రీనివాస్ రాజుతో శర్వా ఓ సినిమా చేయనున్నాడు. ఈ విషయాన్ని దర్శకుడు శ్రీనివాస్ రాజు స్వయంగా ప్రకటించారు. ఇటీవల దండుపాళ్యం 3 ట్రైలర్ ను రిలీజ్ చేసిన శ్రీనివాస్ రాజు, త్వరలో స్ట్రయిట్ తెలుగు సినిమా చేయబోతున్నానని వెళ్లడించారు. తన తొలి తెలుగు సినిమాను విలక్షణ నటుడు శర్వానంద్ హీరోగా తెరకెక్కించటం ఎంతో ఆనందంగా ఉందన్నారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన శ్రీనివాస్ రాజు ‘ప్రస్తుతం శతమానం భవతి, మహానుభావుడు లాంటి ఫ్యామిలీ సినిమాలు చేస్తున్న శర్వా, దండుపాళ్యం లాంటి క్రైం థ్రిల్లర్ తెరకెక్కించిన నా కాంబినేషన్ లో సినిమా అంటే ప్రేక్షకుల్లో ఆసక్తి కలుగుతుంది. మా కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా ఆ అంచనాలు అందుకుంటుంది. అంతేకాదు ఈసినిమా శర్వానంద్ కెరీర్ లోనే భారీ చిత్రమవుతుంద’ని తెలిపారు. ప్రస్తుతం హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా తెరకెక్కుతున్న సినిమా పూర్తియిన వెంటనే శ్రీనివాస్ రాజు దర్శకత్వంలో సినిమా ప్రారంభకానుంది. -
శర్వానంద్ కొత్త సినిమా ప్రారంభం
-
శర్వా కొత్త సినిమా మొదలవుతోంది..!
కొత్త తరహా కథలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో శర్వానంద్, మరో ఆసక్తికరమైన సినిమా ప్రారంభించనున్నాడు. ఇటీవల మహానుభావుడు సినిమాతో మరో ఘనవిజయాన్ని అందుకున్న శర్వానంద్, తన కొత్త సినిమాను గురువారం ప్రారంభించనున్నాడు. ఈ సినిమాకు హను రాఘవపూడి దర్శకుడు. అందాల రాక్షసి సినిమాలతో దర్శకుడిగా పరిచయం అయిన హను, కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో తొలి విజయాన్ని అందుకున్నాడు. తరువాత నితిన్ హీరోగా తెరకెక్కిన లై సినిమాతో నిరాశపరిచినా.. దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం శర్వానంద్ హీరోగా ఓ క్లీన్ రొమాంటిక్ ఎంటర్ టైనర్ ను రూపొందించేందుకు రెడీ అవుతున్నాడు హను రాఘవపూడి. ఈ సినిమాను సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా శర్వాకు జోడిగా ఫిదా ఫేం సాయి పల్లవి నటించే అవకాశం ఉంది. ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు తెలియాల్సి ఉంది. -
మహానుభావుడితో భానుమతి
‘అమ్మాయిలు కాదు.. అమ్మాయి. భానుమతి.. ఒక్కటే పీస్. రెండు కులాలు, రెండు మతాలు.. హైబ్రిడ్ పిల్ల’ అంటూ ‘ఫిదా’ సినిమాలో సందడి చేసిన సాయిపల్లవిని తెలుగు ప్రేక్షకులు అంత సులభంగా మరచిపోలేరు. అందం, అభినయంతో ఆకట్టుకున్న ఈ బ్యూటీ ప్రస్తుతం నానీతో ‘మిడిల్ క్లాస్ అబ్బాయి’, నాగశౌర్యతో ‘కణం’తో పాటు మరికొన్ని తమిళ సినిమాలు చేస్తున్నారు. తాజాగా సాయిపల్లవికి తెలుగులో మరో క్రేజీ ఆఫర్ వచ్చిందని టాక్. వరుస సక్సెస్‌లతో దూసుకెళుతున్న శర్వానంద్‌తో సాయిపల్లవి జోడీ కట్టనున్నారని ఫిల్మ్‌నగర్‌లో గుసగుసలు వినిపిస్తున్నాయి. రన్ రాజా రన్, ఎక్స్‌ప్రెస్ రాజా విజయాలతో పాటు ఇటీవల ‘మహానుభావుడు’తో మరో హిట్ అందుకున్న శర్వా ప్రస్తుతం ‘స్వామిరారా’ ఫేమ్ సుధీర్‌వర్మ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తోన్న విషయం తెలిసిందే. ఈ చిత్రంతో పాటు ‘కృష్ణగాడి వీర ప్రేమగాథ’ ఫేమ్ హను రాఘవపూడి డైరెక్షన్‌లోనూ మరో సినిమాకి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు శర్వానంద్. ఈ సినిమాలో శర్వాకి జోడీగా సాయిపల్లవిని తీసుకున్నారట. ‘ఎస్’ ఫర్ సక్సెస్. శర్వానంద్–సాయిపల్లవి పేర్లు కూడా ‘ఎస్’తోనే స్టార్ట్ అవుతాయి. ఇద్దరూ మంచి సక్సెస్‌లో ఉన్నారు. సో.. ఇద్దరూ కలసి సక్సెస్ఫుల్ మూవీ చేస్తారని ఊహించవచ్చు. -
ఫ్లాప్ దర్శకులకు ఓకె చెప్తున్నాడు..!
యంగ్ జనరేషన్లో మినిమమ్ గ్యారెంటీ హీరోగా ఎదుగుతున్న స్టార్ శర్వానంద్. ఇప్పటికే వరుస విజయాలతో సత్తా చాటిన శర్వా ఇటీవల మారుతి దర్శకత్వంలో మహానుభావుడు సినిమాతో మరోసారి ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం రాఘవేంద్ర రావు తనయుడు ప్రకాష్ కోవెలమూడి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న శర్వానంద్ తరువాత సుధీర్ వర్మ దర్శకత్వంలో మరో సినిమాకు అంగీకరించాడు. దర్శకుడిగా ప్రకాష్ ఇంతవరకు ఒక్క కమర్షియల్ హిట్ కూడా సాధించలేదు. సుధీర్ వర్మ కూడా తాజా చిత్రం కేశవతో ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయాడు. ఈ ఇద్దరు దర్శకులతో పాటు మరో ఫ్లాప్ డైరెక్టర్‌కు ఓకె చెప్పాడు శర్వానంద్. అందాల రాక్షసి ఫేం హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ ఓ సినిమా చేయనున్నాడు. అందాల రాక్షసి తరువాత కృష్ణగాడి వీర ప్రేమగాథ సినిమాతో సక్సెస్ సాధించిన హను తరువాత లై సినిమాతో మరోసారి నిరాశపరిచాడు. ఇలా వరుసగా ఫ్లాప్ దర్శకులతో సినిమాలు చేస్తున్న శర్వానంద్ ఎంత వరకు ఆకట్టుకుంటాడో చూడాలి.