
శర్వానంద్, సాయి పల్లవి
... అంటున్నారు హీరో శర్వానంద్. హను రాఘవపూడి దర్శకత్వంలో శర్వానంద్ హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర సినిమాస్ పతాకంపై సుధాకర్ చెరుకూరి, ప్రసాద్ చుక్కపల్లి నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో శర్వానంద్ సైనికుడి పాత్రలో నటించనున్నారన్న వార్తలు వచ్చాయి. కానీ అందులో నిజం లేదట.
బోర్డర్‌లో యుద్ధం చేసే సైనికుడి పాత్రలో కాదు.. ప్రేమ కోసం పోరాడే కుర్రాడి క్యారెక్టర్‌లో శర్వానంద్ నటిస్తున్నారు. శర్వా లుక్‌ను కొత్తగా డిజైన్ చేశారట హను రాఘవపూడి. ఈ లుక్ కోసం బరువులో ఢిపరెన్స్ చూపించేందు శర్వా కసరత్తులు చేశారు. ఇటీవల ఈ సినిమా షూటింగ్ కోల్‌కతాలో స్టారై్టంది. శర్వానంద్, సాయి పల్లవిలపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ చిత్రానికి ‘పడి పడి లేచే మనసు’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేయాలని చిత్రబృందం ఆలోచిస్తున్నారట. ఈ సినిమాకు సంగీతం: విశాల్ శేఖర్, కెమెరా: జయకృష్ణ.