Adavallu Meeku Joharlu Pre Release Event: Sai Pallavi Keerthy Suresh Sukumar Are Guests - Sakshi
Sakshi News home page

Adavallu Meeku Joharlu: ఈ ప్రిరిలీజ్​ ఈవెంట్​కు స్టార్​ హీరోయిన్లతోపాటు సూపర్​ గెస్ట్

Published Sat, Feb 26 2022 2:16 PM | Last Updated on Sat, Feb 26 2022 3:08 PM

Adavallu Meeku Joharlu: Sai Pallavi Keerthy Suresh Sukumar Are Guests - Sakshi

Adavallu Meeku Joharlu Movie Prerelease Event: నేషనల్​ క్రష్​ రష్మిక మందన్నా, శర్వానంద్ జంటగా కిశోర్ తిరుమల దర్శకత్వంలో తెరకెక్కిన మూవీ ‘ఆడవాళ్లు మీకు జోహార్లు’. సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ సినిమాను మొదటగా ఫిబ్రవరి 25న విడుదల చేస్తామని ప్రకటించి తర్వాత మార్చి 4కు వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సినిమా ప్రమోషన్స్​లో భాగంగా ఈ నెల 27న హైదరాబాద్​లోని శిల్పాకళా వేదికలో ప్రిరిలీజ్​ వేడుకను నిర్వహించనున్నారు. 

అయితే ఈ కార్యక్రమానికి క్రియేటివ్​ డైరెక్టర్​ సుకుమార్, హీరోయిన్లు కీర్తి సురేష్​, సాయి పల్లవి ముఖ్య అతిథిలుగా హాజరు కానున్నారు. ఈ విషయాన్ని సోషల్​ మీడియా వేదికగా చిత్రబృందం శుక్రవారం (ఫిబ్రవరి 25) ప్రకటించింది. అయితే టైటిల్​కు తగినట్లు మహిళల గొప్పతనాన్ని చాటేందుకే ఇద్దరు ప్రముఖ హీరోయిన్లను ఆహ్వానించినట్లు తెలుస్తోంది. ఆద్యంతో వినోదాత్మకంగా, కుటుంబంతో కలిసి చూడగలిగే సినిమా అని చెబుతున్నారు మేకర్స్​. ఈ సినిమాలో సీనియర్‌ నటి ఖుష్బూ, రాధికా శరత్‌ కుమార్, ఊర్వశి తదితరులు ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement