
సాయి పల్లవి, శర్వానంద్ జంటగా తెరకెక్కుతున్న తాజా చిత్రం ‘పడి పడి లేచే మనసు’. హను రాఘవపూడి దర్శకత్వంలో ఈ మూవీ చిత్రీకరణ జరుగుతోంది. ‘అందాల రాక్షసి’ లాంటి మంచి ఫీల్ గుడ్ లవ్‌స్టోరిని తెరకెక్కించిన హను... ఈ సినిమాను కూడా అదే జానర్‌లో తెరకెక్కిస్తున్నట్లు సమాచారం.
ఫిదాతో స్టార్‌డమ్ సొంతం చేసుకున్న సాయి పల్లవి... ఆ సినిమాతో క్రేజీ హీరోయిన్‌గా మారింది. నేడు సాయి పల్లవి పుట్టినరోజు కానుకగా పడి పడి లేచె మనసు లుక్‌ను రిలీజ్ చేశారు చిత్రయూనిట్. పలువురు సెలబ్రెటీలు సోషల్‌మీడియా ద్వారా సాయిపల్లవికి విషెస్ తెలుపుతున్నారు. ‘పడి పడి లేచే మనసు’ మూవికి విశాల్ చంద్రశేఖర్ సంగీతమందించగా, ప్రసాద్ చుక్కపల్లి, సుధాకర్ చెరుకూరి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.