నితిన్‌ లేటెస్ట్‌ స్టిల్స్‌ సూపర్‌ | new working stills from nithin lie movie | Sakshi
Sakshi News home page

నితిన్‌ లేటెస్ట్‌ స్టిల్స్‌ సూపర్‌

Published Sun, May 28 2017 10:09 PM | Last Updated on Tue, Sep 5 2017 12:13 PM

నితిన్‌ లేటెస్ట్‌ స్టిల్స్‌ సూపర్‌

నితిన్‌ లేటెస్ట్‌ స్టిల్స్‌ సూపర్‌

హైదరాబాద్‌: టాలీవుడ్ యంగ్ హీరోల్లో 'నితిన్' ఒకరు. ‘అ..ఆ' సినిమా విజయవంతం అనంతరం నెక్ట్స్ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.  హనురాఘవపూడి దర్శకత్వంలో 'లై' పేరుతో చిత్రం తెరకెక్కుతోంది. 14 రీల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ పతాకంపై రామ్‌ ఆచంట, గోపీచంద్‌ ఆచంట, అనీల్‌ సుంకర ప్రొడక్షన్‌ నెం.9గా నిర్మిస్తున్నారు. గతంలో హను రాఘవపూడి 'కృష్ణ గాడి వీర ప్రేమ గాథ' చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో 'నితిన్' సరసన 'మేఘ ఆకాష్' హీరోయిన్ గా నటిస్తోంది.

నితిన్ కు ఇది 24వ సినిమా. చిత్రంలోని ముఖ్యమైన సన్నివేశాలను ఎయిర్‌పోర్టులో యాక్షన్‌ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. దానికి సంబంధించిన వర్కింగ్‌ స్టిల్స్‌ సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. ఇందులో విమానాల మధ్యలో నితిన్‌ చేతికి కట్టుతో రక్తం కారుతున్నట్లు ఉంది. 'నితిన్' ఇమేజ్‌కి సరిపోయేలా తన స్టైల్లో హను రాఘవపూడి రొమాంటిక్ కామెడీగా ఈ సినిమాను తెరకెక్కించనున్నట్లు సమాచారం.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement