పవర్‌ఫుల్‌ వారియర్‌ | Prabhas and Hanu Raghavapudi new film launched in Hyderabad | Sakshi
Sakshi News home page

పవర్‌ఫుల్‌ వారియర్‌

Published Sun, Aug 18 2024 12:22 AM | Last Updated on Sun, Aug 18 2024 12:22 AM

Prabhas and Hanu Raghavapudi new film launched in Hyderabad

ప్రభాస్‌ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో హిస్టారికల్‌ వార్‌ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కనున్న చిత్రం శనివారం ప్రారంభమైంది. ఈ చిత్రంలో ఇమాన్వి హీరోయిన్‌గా నటించనున్నారు. గుల్షన్‌ కుమార్, భూషణ్‌కుమార్, టీ సిరీస్‌ ఫిల్మ్స్‌ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్‌పై నవీన్‌ ఎర్నేని, వై. రవిశంకర్‌ ఈ సినిమాను నిర్మించనున్నారు.

‘‘ఆధిపత్యం కోసం యుద్ధాలు జరుగుతున్నప్పుడు ఓ వారియర్‌ మాత్రం వారి పోరాటం దేని కోసమో నిర్వచించగలిగాడు’’ అంటూ ఈ సినిమాని ఉద్దేశించి ‘ఎక్స్‌’లో పేర్కొన్నారు హను రాఘవపూడి. ‘‘1940 నేపథ్యంలో సాగే ఈ సినిమాకు హను పవర్‌ఫుల్‌ వారియర్‌ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారు. త్వరలోనే చిత్రీకరణ ప్రారంభిస్తాం’’ అని చిత్రబృందం పేర్కొంది. మిధున్‌ చక్రవర్తి, జయప్రద కీలక పాత్రల్లో నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: విశాల్‌ చంద్రశేఖర్, కెమెరా: సుదీప్‌ ఛటర్జీ ఐఎస్‌సీ.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement