
సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే డియర్ కామ్రేడ్ షూటింగ్ పూర్తి చేసిన విజయ్, ప్రస్తుతం క్రాంతి మాధవ్ దర్శకత్వంలో రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే తమిళ దర్శకుడు ఆనంద్ అన్నామలై దర్శకత్వంలో హీరో చిత్రాన్ని ఇటీవల ప్రారంభించాడు.
తాజాగా ఈ యంగ్ హీరో మరో సినిమాను లైన్‌లో పెట్టినట్టుగా తెలుస్తోంది. అందాల రాక్షసి సినిమాతో దర్శకుడిగా పరిచయం అయిన హను రాఘవపూడి తరువాత కృష్ణగాడి వీరప్రేమగాథ సినిమాతో మరో విజయాన్ని అందుకున్నాడు. తరువాత వరుసగా లై, పడి పడి లేచే మనసు సినిమాలతో ఫెయిల్ అయిన హను ఇప్పుడు విజయ్ హీరోగా ఓ సినిమా చేసేందుకు ప్లాన్ చేస్తున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్‌పై త్వరలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.